కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కుండపోత వర్షమ్మున గొడుగు లేల"
లేదా...
"వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చినఁ గుండపోతగన్"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కుండపోత వర్షమ్మున గొడుగు లేల"
లేదా...
"వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చినఁ గుండపోతగన్"
(1)
రిప్లయితొలగించండితడిసె వస్త్రముల్ పూర్తిగాఁ తలను దాఁచు
కొనఁగ నాశ్రయం బెయ్యది కనులఁ బడదు
ఘోరముగ నకస్మాతుగాఁ గురియునట్టి
కుండపోత వర్షమ్మున గొడుగు లేల?
(2)
ఒద్దికఁ జేరినారు గృహ మొక్కొకరే, ఘన వర్షపాతమే
కద్దని చెప్పినారు గద, కాలును పెట్టరు వీథిలోన నే
పెద్దలు పిన్న లెల్లరును వేడ్క భుజించియు పాన్పు లెక్కిరే
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చినఁ గుండపోతగన్.
మొదటి పూరణలో 'పూర్తిగాఁ దలను దాఁచు' అని చదవండి.
తొలగించండిశంకరయ్య గారూ...
తొలగించండిమీ రెండు పూరణలూ చాలా బాగున్నాయి.
అభినందనలు!
ఒద్దికనుండినాముగద యూరకవారలురెచ్చగొట్టినా
రిప్లయితొలగించండిముద్దనినవ్వినాముగద మూకలయల్లరిచేష్టలన్నియున్
గుద్దులుగుద్దినారచటగూబలుగుయ్యన(వీరసైనికుల్
సద్దులు(జేయకేజనిరిశత్రువునింటనె చంపివచ్చిరే !!
కద్దనియొప్పినారమెరికాయునుతక్కినపెద్దలందరున్
బద్దలుగొట్టినారుమనపాలకులప్పటిలోహసంకెలన్
హద్దులుతీసివేయుమిక ఆరనిదప్పికతీరుకాలమున్ !
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చినఁ గుండపోతగన్ !!
గూడ రఘురామ్ గారూ,
తొలగించండిమీ అష్టపాది పూరణ బాగున్నది. అభినందనలు.
'రెచ్చగొట్టినన్' అనండి.
పదాల మధ్య వ్యవధాన ముంచండి. అరసున్నా కొరకు బ్రాకెట్టును వాడుతున్నారు. మీరు టైపు చేసే సాఫ్టువేరు ఏమిటో చెప్తే అందులో అరసున్నా ఎలా టైపు చేయాలో చెప్తాను.
గురువురగారికి ధన్యవాదములు!
తొలగించండినేను మామూలుగా "బరాహ" ను టైపు చేయటానికి వాడతాను. అక్కడ అరసున్న చాలా చక్కగా వస్తుంది కూడా.
కానీ ప్రతిసారి ఒక separate softwareని Open చెసి వాడటానికి బద్ధకంవేసి, ఈ మధ్య గూగుల్ ఇన్పుట్ (Google Input Tools: https://www.google.com/inputtools/try/)వాడుతున్నాను. చాలా సులువుగా పనైపోతుంది అని.
ఇక నుండి బరాహనే వాడగలను.
బాగుందండి
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే.గీ. పెద్ద వర్షమును దెలుపు పేరదేది?
తొలగించండికర్షకుండే కతమ్మున హర్షమొందు?
నెండ వానయు నొక్కింత యేది లేక
కుండపోత ; వర్షమున; గొడుగులేల ?
ఉ.పెద్దగ వర్షముల్ పడిన పేర్కొన జాలము వాటి తీవ్రతన్
తొలగించండిమిద్దెలు బంగళాలు మరి మేడలు భేదము లేక కూలుగా !
అద్దిర ! యిండ్ల కప్పులవి యన్నియు సర్వము లేచిపోవగన్
వద్దిక చత్రముల్ గొనుట వర్షము వచ్చిన కుండపోతగన్
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
హోరు గాలికి తరువులు వొరిగె నకట
రిప్లయితొలగించండిమెరుపు వెలుగుల మిరుమిట్లు కరుకు గాను
దారి కానక వరదలై పారు చుండె
కుండపోత వర్షమ్మున గొడుగు లేల
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఒరిగె'ను 'వొరిగె' అనరాదు. 'తరువులే యొరిగె నకట' అనండి.
హోరు గాలికి తరువులే యొరిగె నకట
తొలగించండిమెరుపు వెలుగుల మిరుమిట్లు కరుకు గాను
దారి కానక వరదలై పారు చుండె
కుండపోత వర్షమ్మున గొడుగు లేల ?
పుడమిఁ సంగీత సాహిత్యములును రెండు
రిప్లయితొలగించండినఖిల జనులకు సంతోషమందజేయు
నందుమధురవాఙ్మయకవితామృతమను
కుండపోత వర్షమ్మున గొడుగు లేల.
నిద్దురపోని రీతినవనీజనులెల్లరు రాళ్ళవర్షమున్
హద్దులు మీరుచున్ కురుయునట్లొనరించె సురేంద్రుడాతడే
ముద్దుల బాలకృష్ణుడట భూధరఛత్రమునెత్తి పల్కెగా
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చినఁ గుండపోతగన్ ||
డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.
ఆర్య! అనేక నమస్కారములు. ధన్యవాదాలు.
తొలగించండిమాడుగుల వారూ...
తొలగించండిమీ రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది.
అభినందనలు!
ఆర్య!గుండు మధుసూదన్ గారూ! మీ ప్రోత్సాహమునకు నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిమొదటి పద్యం రెండవ పాదంలో యతి ఎలా కుదిరింది? 'న' కి, 'మ' కి యతిమైత్రి ఉంటుందా?
తొలగించండిసంధి జరిగిన పదములలో రెండవ పదము మొదటి “అచ్చు” కే యతి మైత్రి కూర్చాలి.
తొలగించండిఇక్కడ రెండును+అఖిల లో “అ” కి సంతోషము+ అందజేయు లో “అం” కు యతి. దీనినే “స్వరప్రధాన యతి” అంటారు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికరకములఁ గూడి జోరుగా పెరుగు జుండి
గర్జనమ్ములు పిడువులు గాలి దోడ
కుదురు నీయక హళహళి గూర్చు నిట్టి
కుండపోత వర్షమ్మున గొడుగు లేల?
(కరకములు= వడగళ్ళు ; హళహళి = తడబాటు/తికమక;)
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిసద్దును జేయకున్ కడఁగి సన్నటి తుంపరతో నదాటునన్
పెద్దగ మారియున్ చలల పిడ్గుల దోడ భయమ్ము గూర్చుచున్
హద్దులు మీరగా బడెడి నంబుఘనమ్ముల జూచి వాడనెన్
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చిన కుండపోతగన్.
(కడగు= ప్రారంభించి; చల= మెఱపు; అంబుఘనము= వడగల్లు;)
క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'జోరుగా పెరుగుచుండి' అనడంలో టైపాటు...
రిప్లయితొలగించండివలయును గొడుగు చక్కగావగ జిలేబి
కుండ పోత వర్షమ్మున; గొడుగు లేల
వలయు చిటపట చినుకుల వలపు, సన్న
జాజి మల్లియలు కురియ, సఖుని చెంత !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివలపువానలో గొడుగేల అన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముద్దులు గూర్చు వర్ణముల, మోహనమై వెలుగొందు శైలిలో
రిప్లయితొలగించండికొద్దిధనానికే బయట కోరిన పూర్ణ శరీర త్రాణముల్
పెద్దలు పిన్నలందరకు విస్తృత రీతి లభించుచుండగా
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చిన గుండపోతగన్.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
త్యాగరాయజయంతిని యోగమనగ
రిప్లయితొలగించండికీర్తనలవృష్టికురియగ స్ఫూర్తిదనర
పల్లవింపగ హృదయాన భక్తి,యట్టి
కుండపోతవర్షమ్మున గొడుగులేల?
పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
ప్రోద్దటి పూటవర్షమిది పోవును తొందర లోనె,లేవరా
రిప్లయితొలగించండిబద్దక మేల కుర్ర యిదిపద్దతిగాదని చెప్పి యుంటిగా
వద్దుర మొద్దునిద్ర కలవారలకేగద పెక్కుyఛత్రముల్
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చిన గుండ పోతగన్ !!!
మంద పీతాంబర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒద్దిక చెప్పగా కవిత లొచ్చిరి పండిత పెద్దలంత యే
తొలగించండిహద్దులు లేని భావనల నాశువుగా నవి చెప్పు చుండగా
పెద్దగ శబ్దముల్ వెడలి వేగమె వర్షము ధారలై పడన్
ముద్దుగ పద్దెముల్ వినుచుమోదము నుందుము నారు బైటకున్
వద్దిక,ఛత్రముల్ గొనుట వర్షము వచ్చిన కుండపోతగన్
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిచెట్టుచేమలు, పుట్టలు గుట్టలన్ని
మునిఁగిపోవుచునుండఁగ మూర్ఖుఁ డొకఁడు
గొడుగు చేతఁ బట్టియుఁ గొట్టుకొనియుఁబోయెఁ!
గుండపోత వర్షమ్మున గొడుగులేల?
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముద్దుగ చిన్ని చిన్కుల ప్రమోదముగూర్చుచు చూచుచుండగన్
రిప్లయితొలగించండిహద్దులు మీరె మేఘ నివహంబులు భీకర వాయువేగముల్
తద్దయు వర్షమయ్యెఘన ధాంతరితత్కిటదింధిమంచునున్
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షమువచ్చిన కుండపోతగన్.
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శిష్ట్లా శర్మ గారి పూరణ.....
రిప్లయితొలగించండిఅడుగు వేయని వానికి నాశ లేల?!
ఆశ లుడిగిన వానికి ధ్యాస లేల?!
నెండమావుల నీటికి కుండ లేల?!
కుండ పోత వర్షమ్మున గొడుగు లేల?!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉగ్రవాద యురీ దాడి కాగ్రహించి
రిప్లయితొలగించండిభరత సైన్యమ్ము కురిపించు బాంబు గుండ్ల
కుండపోత వర్షమ్మున గొడుగులేల
నుపకరించును వైరుల యుసురు నిల్వ
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పిట్టా సత్యనారాయణ గారి పూరణలు.....
రిప్లయితొలగించండిఆతపముకొక్క గొడుగుండునాప;వాని
బట్టు విజ్ఞత లున్నను భగవదాజ్ఞ
లేక కడగండ్ల గడచియు లెక్క లేల?
కుండపోత వర్షమ్మున గొడుగులేల?!
అద్దిరబన్న! వర్షమన నారుతడిన్ బడ గానమైతి మీ
కొద్ది దినంబులున్ గడిచె కోరిక మేరకు గొన్ని చిన్కు లి
ప్పొద్దున జూడగంటి మిట బోదము మేనుల దడ్ప హాయిగా
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చిన గుండ పోతగన్.
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'ఆతపమునకు' అనడం సాధువు. 'ఆతపమ్మున గొడుగుండు నాప...' అనండి.
ఆర్యా
తొలగించండి"ఏ యెండ కాగొడుగు"అన్న క్రమం లో రావాలని అలా ఆరంభించాను.అది పలికిందనుకునుకున్నానంతే
విజ్ఞత అందులో ఉంటుంది. కాని భగవదనుగ్రహం తోడు కావాలి అని. ఈ వరుసలో రావాలనుకున్నాను.
దైవోపహతునకు కష్టాలు తప్పవు.నాకు మాదిరిగనే. తప్పు దొరలెను కదా!?p.Satyanarayana
జంధ్యాల వారు పోతన గూర్చి వ్రాసిన పద్యంలో.."కమ్మని.."లో చాకచక్యమ్ముగ..లోకమ్మున..ప్రవాహమ్ముల.వాడాడండీ,నేననుసరించాను.p. Satyanarayana
తొలగించండినా రెండవ పూరణము:
రిప్లయితొలగించండి[జడివానలో ఛత్రముం బట్టుకొని పోవు తన మిత్రుని నాపెడి మఱియొక మిత్రుని మాటలు]
"పెద్దగఁ గుండపోతగను భీకర వర్షము వచ్చుచుండఁగన్
బెద్ద ద్రుమాలు దిబ్బలును బెద్ద కుటీరము లెన్నొ వెల్లువన్
ముద్దుగఁ జూడఁ గొట్టుకొనిపోవఁగ ఛత్రముఁ గొంచుఁ బోయెదో?
వద్దిఁక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చినఁ గుండపోతగన్!"
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
కుండపోతలో అరసున్న పడలేదు. సవరించిన పద్యము...
తొలగించండి"పెద్దగఁ గుండపోఁతగను భీకర వర్షము వచ్చుచుండఁగన్
బెద్ద ద్రుమాలు దిబ్బలును బెద్ద కుటీరము లెన్నొ వెల్లువన్
ముద్దుగఁ జూడఁ గొట్టుకొనిపోవఁగ ఛత్రముఁ గొంచుఁ బోయెదో?
వద్దిఁక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చినఁ గుండపోఁతగన్!"
సన్నపాటి జల్లుకె గదా ఛత్ర మంద్రు
రిప్లయితొలగించండిగాలి తోడ భీకరముగ జాలువాఱు
కుండ పోత వర్షమ్మున గొడుగులేల
నాగునని తలబోతువో నఱయ నైతి!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గొడుగు లేకుండ గనునెట్లు వెడలు డు వుర
రిప్లయితొలగించండికుండ పోతవర్షమ్మున, గొడుగు లేల
వాన వచ్చుట లేదుగా బయట జూడ
పోయి రమ్ముర సుఖముగ భువన గిరికి
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వెడలుదువుర' అన్నచోట టైపాటు...
పెద్దది కొండ, కైనిడితి,పిన్నవయస్కుడనంచు సందియంబుతో
రిప్లయితొలగించండివద్దకు రాకనుండకుమ, భద్రమునిచ్చెద, నింద్రకీర్తనల్
వద్దిక, నా నఖాగ్రమున బర్వతముండగ రక్షణార్థమై
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షమువచ్చిన కుండపోతగన్.
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదం చివర గణదోషం. "చిన్న వయస్కుడ నంచు శంకతో" అనండి
వేగముగ సుడి గాలులు విసురుచుండ
రిప్లయితొలగించండికుండపోత వర్షమ్మున గొడుగులేల
వేడి బజ్జీలఁ తినుచును ప్రీతితోడ
సదన మునసేద తీరిన సౌఖ్యమొదవు
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒద్దిక చెప్పగా కవిత లొచ్చిరి పండిత పెద్దలంత యే
రిప్లయితొలగించండిహద్దులు లేని భావనల నాశువుగా నవి చెప్పు చుండగా
పెద్దగ శబ్దముల్ వెడలి వేగమె వర్షము ధారలై పడన్
ముద్దుగ పద్దెముల్ వినుచుమోదము నుందుము నారు బైటకున్
వద్దిక,ఛత్రముల్ గొనుట వర్షము వచ్చిన కుండపోతగన్
చేపూరి శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఒచ్చిరి' అనడం గ్రామ్యం. 'వచ్చిరి' అంటే యతి తప్పుతుంది. కనుక 'పద్దెము లెన్నొ చెప్పుటకు వచ్చిరి పండిత వృద్ధులంత...' అనండి (పండిత పెద్దలు - దుష్టసమాసం).
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికవి పుంగవులు మధుసూదన్ గారి (ఖండ బిందువు) సవరణ చూచిన తర్వాత సవరించిన పూరణ:
తొలగించండిశంభు భక్తవశంకరు శంకరు శివు
మూరిన సదమల మతినిఁ బూజ లర్థిఁ
జేయఁ గరుణతోడఁ గురుపించిన వరముల
కుండపోఁత వర్షమ్మున గొడుగు లేల
పెద్దల మాట లన్నియును బృధ్విని నింపగు చద్ది మూటలే
గ్రద్దన వచ్చు రెక్కలు ధరప్రకరమ్ములఁ గాల రీతినిన్
ముద్దుగ గ్రీష్మ కాలమునఁ బూని కొనంగ కరమ్ము మేలికన్
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చినఁ గుండపోఁతగన్
[కొనుట= కొనుక్కొనుట]
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండివరాల వర్షంతోను, ఛత్రక్రయంతోను మీ రెండు పూరణలు విశిష్టంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిపెద్దది కొండ, కైనిడితి,పిన్నవయస్కుడనంచు శంకతో
రిప్లయితొలగించండివద్దకు రాకనుండకుమ, భద్రమునిచ్చెద, నింద్రకీర్తనల్
వద్దిక, నా నఖాగ్రమున బర్వతముండగ రక్షణార్థమై
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షమువచ్చిన కుండపోతగన్.
గురువు గారు, మీరు చెప్పినట్లుగా మార్చాను.కృతజ్ఞతలు
సవరించినందుకు సంతోషం!
తొలగించండిప్రొద్దున మేఘముల్ ముసరి బోరన గాలులు వీచుచుండగా
రిప్లయితొలగించండివద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చినఁ గుండపోతగన్
బుద్ధిగ నింటనుండి కడు మోదముతోడ పకోడి లానుచున్
ముద్దుల భార్యతోడుతను ముచ్చటలాడిన కల్గు భోగముల్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చిన గుండపోతగ
రిప్లయితొలగించండిన్నద్దిర చక్క జెప్పితిరి యార్యులుఛత్రము వద్దులే యని
న్ముద్దగ బట్టలన్నియును ముడ్చుకు బోవుట యిష్టమా మరి
న్వద్దను చుంటి రి య్యెడను వర్షము వచ్చిన గుండపోతగన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జల్లుగా మొదలైన వర్షమ్ము పెరిగి
రిప్లయితొలగించండిహోరు గాలిలో గొడుగులు జారిపోయి
జోరు వానలో తడిసిన వారికింక
కుండపోత వర్షమ్మున గొడుగులేల?
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
వధ్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చిన
…………… గు౦డపోతగ |
న్నద్దియు గాక చ౦డ పవనాహతి నయ్యది
………… ఖ౦డమై చనున్ |
ముద్దియ వస్తు వేదయిన పూర్ణసహాయ్య
…………… మొనర్చ దెన్నడున్ |
క ద్దొక హద్దు ; న౦త దనుక౦ బని సేయు
………… నట౦ చెరు౦గుమా !
{ పవనాహతి = గాలి దెబ్బ }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
శ్రీ యుత పోచిరాజు కామేశ్వర రావు గారూ !
నమస్కృతులు ! మీ పూరణలు అన్నీ
చదువు చున్నాను . ఆన౦ది౦చు చున్నాను .
సత్కవులు గు రు మూ ర్తి ఆ చా రి గారు నమస్కారములు. మీ యభిమానమునకు ధన్యవాదములు. నేను గూడ మీ పూరణల నానందించు చున్నాను. మీరు పూర్ణ బిందువునకు నాంగ్ల “o” వాడుతున్నారెందుకు? “kumda” వ్రాసిన “కుండ” అగును కదా!
తొలగించండిఅందరి పూరణలు చదవుటన్న నా కిష్టము.
అండగానుండి గోపబాలుండు గిరిని
రిప్లయితొలగించండివ్రేలి పైనను మోయుచు వ్రేతలకును,
గోవులకు నీడ నీయగా, గోకులమున
కుండపోత వర్షమ్మున గొడుగు లేల?
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంంకరయ్య గారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిధరణిపై దిరుగు జనుల తలల నెల్ల
రిప్లయితొలగించండికుండపోత వర్షమ్మున గొడుగు లేల
సలిల ధారల హస్తముల్ చలికినోడ
పాదములు భయపడుచును పరుగులెత్తె
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈశ్వరప్ప గారూ,
మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
'మేఘాలు+అవనిపై' అని విసంధిగా వ్రాయరాదు. 'మేఘమ్ము లవనిపై' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ యీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో 'సోయగమ్ముల నాశించు...' అనండి.
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చినఁ గుండపోతగన్
రిప్లయితొలగించండిముద్దుగ వర్ష కాలమున మోదము గూర్చుచు రాత్రివేళలన్
నిద్దుర బోవుచున్నపుడు నిత్యము రోజుకు రెండు గంటలు
న్నొద్దికతోడ వచ్చిన నహో! సుభిక్షము గల్గు ధాత్రికిన్.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఊళ్ళ నెల్ల మునుచు చెట్ల వ్రేళ్ళు చీల్చు
రిప్లయితొలగించండికుండపోతవర్షమ్మున గొడుగులేల
చాలుఁ గాంతారమును గాల్చు జ్వాల లోకి
యేగి విహగమాకు వెనుక దాగు పగిది
నితీశ్ చంద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జ్వాలలోని। కేగి...' అనండి.
చద్దిని లేచి వచ్చితిని సాంబశివున్ గన మందిరమ్ముకున్
రిప్లయితొలగించండిముద్దుగ నందు గాంచితిని మోహపు చెప్పులు మూడు ఛత్రముల్
పెద్దల పక్షమందు నిక ప్రీతి నొసంగిరి ఛత్రదానమున్
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చిన గుండ పోతగన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. గొడుగు దానంగా వచ్చింది కనుక కొనవలసిన అవసరం లేదు. చక్కని భావన. అభినందనలు.
ఈ సందర్భంగా ఒక సంఘటన గుర్తుకు వస్తున్నది.2000 సంవత్సరం నవంబరు నెలలో పుంగనూరులో తుఫాను సృష్టించిన భీభత్స దృశ్యాలు బస్ లోనుండి చూచి చేతిలోని బస్ టికెట్ పై దాన్ని వర్ణిస్తూ ఒక పద్యం వ్రాసి పెట్టుకున్నాను. ఆ పద్యమిది.
రిప్లయితొలగించండిమణిగణ నికర వృత్తం:
తళతళ మెరుపులు ధగధగ మెఱయన్
పెళపెళ యురుములు పెటిలున యురమన్
దళముల వలె పెను తరువులు పడగన్
కళవళ పడియిరి కడజను లవనిన్.
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిబాగుంది మీ పద్యం.
'పెటిలున నురుమన్... కళవలము పడిరి...' అనండి.
తొండముగ గుప్పి నీరము, గుండెపగుల
రిప్లయితొలగించండిపిడుగులిడి పరుగిడెడిదౌ పెనుతుఫాను,
గొడుగు చిరుగగ వడగళ్ళు పడగజేయ
కుండపోత వర్షమ్మున గొడుగు లేల?
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హోరుగాలి తోకూడిన జోరు వాన
రిప్లయితొలగించండికుమ్మరించు చున్నప్పుడు గొడుగు వద్దు
గాలికిని మెలితిరుగును గాన గొడుగు
కుండపోత వర్షమ్మున గొడుగు లేల
వడ్డూరి రామకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాట్సప్ పూరణలు.....
రిప్లయితొలగించండిమద్దా సత్యనారాయణ గారి పూరణ.....
బ్రెడ్డు ముక్కలు చెమ్మను పేరు కొనియె!
పోక మొలిచెను చెమ్మతో చీకిపోయె
కుక్క గొడుగులు పెంటల గుట్ట లాయె!
కుండపోత వర్షము నకు గొడుగులేల?-
************************
అంబటి భానుప్రకాశ్ గారి పూరణ.....
వాన రాదని దలచియు వనముకేగ,
గాలి బీభత్స మెనరించి గట్లుగదల,
చినుకు మొదలాయె చూడగ ,చెట్లుగూలె
కుండపోత వర్షమ్మున గొడుగులేల?
***********************
బొడ్డు శంకరయ్య గారి పూరణ....
వానలు కురియు కాలము వచ్చినపుడె
ఛత్రములు గొనవలయును సత్వరమున
వానకాలము ముగిసిన వచ్చునట్టి
కుండపోత వర్షమ్మున గొడుగులేల?
*************************
సందిత బెంగుళూరు గారి పూరణలు.....
పోసె రాశిగ ధాన్యమ్ము పొలమునందు
పరుగుతీసె కుటుంబమే బాధపడుచు
పగిలె రైతుకు గుండెయే పంట చెడగ
కుండపోత వర్షమ్మున గొడుగు లేల?
చెదరి తెగిపోయె పెద్దగా చెరువుగట్టు;
ఊరి ప్రజలెల్ల నఱచుచు నురికి రటకు
పూడ్చగా నెంచి పనిజేయ బూని రపుడు
కుండపోత వర్షమ్మున గొడుగు లేల?
వర్ష మాసించి పూజలన్ వరుస జేయ
కురిసె నాపూట వర్షంబు కరువు దీర
గ్రామ జనమెల్ల ముదమంది గంతులేయ
కుండపోత వర్షమ్మున గొడుగు లేల?
**********************
బద్రిపల్లె.శ్రీనివాసులు గారి పూరణ....
జీవనాధార మైనట్టి చేపకొఱకు
పడవ నెక్కి జాలరులంత కడలి కేగ
వాయువేగము తోడను వచ్చుచున్న
కుండపోతవర్షమ్మున గొడుగులేల?
***********************
మాడుగుల నారాయణ మూర్తి గారి పూరణ....
కుండపోత వర్షమ్మున గొడుగు లేల
కుప్ప తెప్పలై కన్పించె గుళ్ళముందు
పల్లె బతుకమ్మ లాటతో పరిఢవిల్లె
తండ్రు లన్నలు ఎదురౌచుదారి నిలువ
************************
గుళ్ళపల్లి తిరుమల కాంతి కృష్ణ గారి పూరణలు.....
1.
వరద బారియు చేలన్ని చెరువు లాయె
ధాన్యమంతయు నీటిలో దడిసిపోయె
గర్షకుని మది గ్రుంగియు కనులు గురియు
కుండపోత వర్షమ్మున గొడుగు లేల?
2.
గట్లు తెగిపోయె నంతట చెట్లు గూలె
గాల్వ లుప్పొంగె రహదార్లు గాల్వలాయె
తనువు లన్నియు నీటితో తడిసియున్న
గుండపోత వర్షమ్మున గొడుగు లేల?
3.
కవులు బండితు లొకచోట గలసికొనియు
సరస సంగీత సాహిత్య సమ్మిళితము
లైన గవితలు వినిపించునపుడు గురియు
కుండపోత వర్షమ్మున గొడుగు లేల?
మద్దా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అంబటి భానుప్రకాశ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వనమునకు' అనడం సాధువు. అక్కడ 'వనము జేర' అనండి.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
సందిత గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
బద్రిపల్లె శ్రీనివాసులు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మాడుగుల నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
******
గుళ్ళపల్లి కాంతికృష్ణ గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
P.Satyanarayana
రిప్లయితొలగించండిఆతపముకొక్క గొడుగుండునాప;వాని
బట్టు విజ్ఞత లున్నను భగవదాజ్ఞ
లేక కడగండ్ల గడచియు లెక్క లేల?
కుండపోత వర్షమ్మున గొడుగులేల?! P.Satyanarayana
అద్దిరబన్న! వర్షమన నారుతడిన్ బడ గానమైతి మి
ప్పొద్దునజూడ గంటిమిట బోదము మేనుల దడ్ప హాయిగా
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చిన గుండ పోతగన్!p.Satyanarayana
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రిప్లయితొలగించండిహిమవారి శంకరాభర
ణము వాట్సాపుల సువాసనలు వెద జల్లెన్ !
నమనంబు,శంకరార్యుల
గమకము సెహభేషుగాను గాంచె జిలేబీ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిధన్యవాదాలు!
కారు మబ్బులు గగనాన క్రమ్ముకొనగ
రిప్లయితొలగించండిపవన దేవుండు తనప్రతాపమును చూప
నిలువ నీడయు లేక నీల్గు చుండ
కుండపోత వర్షమ్మున గొడుగు లేల.
అన్నదాతయు గాంచుచు నవసరముగ
చేను వైపుకు సాగంగ శీఘ్రముగను
ఛత్రి గొంపోవు మన పల్కె జాయ తోడ
కుండపోత వర్షమ్మున గొడుగు లేల.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఎటులొ కష్టాల వర్షాల నెన్నొ తడిసి
రిప్లయితొలగించండిరాటుఁదేలితి! లేదు వర్షాల భయము!
నేఁటి వర్షమ్ము సహియింతు నిజము! నాకు
కుండపోౕఁత వర్షమ్మున గొడుగులేల?
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండికడగండ్ల వడగండ్ల వాన! కుండపోత వాన ఏం చేస్తుంది? చక్కని పూరణ.. అభినందనలు.
శ్రీగురువుగారైనకంది శంకరయ్యగారికివందనాలతోసవరించినపూరణచూడగలరనిఆశిస్తూ
రిప్లయితొలగించండి. మిద్దెలు మేడలెక్కినను మిక్కిలిగాలి,తుపానురాకచే
హద్దులు మీరిపొద్దులను నాపుచు| చీకటి మేఘగర్జనల్
మద్దెల రావమై చెవుల మర్దనజేసెడి వేళలందిదే|
వద్దిక చత్రముల్ గొనుట వర్షము వచ్చిన గుండపోతగున్|
2.సోయగమ్ముల నాశించు శోభనాన
పట్టువస్త్రాలు నగలన్ని పడతికేల?
ఇంట బైటను నీళ్ళలో నీదుచుండ?
కుండ పోతగవర్షాన గొడుగుయేల?
3.గాలిలో నూగుచు ఘర్జించు మేఘమ్ము
-----లవనిపై నలజడి నల్లువేళ?
మెఱుపుతీగల కాంతి మిరుమిట్లుగొలుపుచు
------జీవనాధారము చిదుము వేళ?
ఈదురుగాలుల ఈర్ష్యలరీతిగా
-----భీతిని నిడు నవినీతివేళ?
నేలపై నీటిలో వాలిన వాహనాల్
-----తేలియాడగ జేయు తీర్పు వేళ?
వర్షమన్నది జీవుల హర్ష మైన?
గాలిపెనుగాలిగా మార్చి తూలజేయ?
బాటసారుల రక్షగా పట్టవశమ?
కుండపోతగ వర్షాన గొడుగుయేల?
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
డా.బల్లూరి ఉమాదేవి.సెప్టెంబర్ 29, 2016 10:19 [PM]నిన్నటి పద్యాలొకసారి చూడండఅన్నయాయగారూ.
రిప్లయితొలగించండిరాము డెవరిని జంపెను రహము తోడ
యతిగ మారెనెవరికై త్రయంబకుండు
నెదురు పడినట్టి పక్షిని యేమి చేసె
వాలిని,భవాని కొరకు రావణుండు చంపె.
ఇనజు డెవ్వాని జంపింప మనసు పడియె
కపట వటుడుగ తానెందుకయ్యె శూలి/శివుడు
నిలువరించిన గృధ్రము నేమి చేసె
వాలిని,భవాని కొరకు రావణుండు జంపె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'రహము' అంటే? 'త్రియంబకు'ని 'త్రయంబకుడు' అన్నారు. 'పక్షిని+ఏమి' అన్నపుడు యడాగమం రాదు. మొదటి పాదాన్ని "దాగి రాము డెవ్వాని నంతమ్ము సేసె" అందామా?
రెండవ పూరణలో మూడవ ప్రశ్నలో 'ఎవరు' అన్నది కూడా ఉండాలి కదా? "ఆ జటాయువు కథ యెటు లంతమయ్యె" అందామా?
ఉమా దేవిగారూ !" పక్కిని" అని వైకృతం వాడుదాము. సరిపోతుందిగదా !
తొలగించండిముద్దుగ రామనామమును ముచ్చట మీర జపమ్ముచేయగా
రిప్లయితొలగించండిహద్దులు త్రున్గగా మురిసి హాయిగ నిచ్చిన హర్షవృష్టినిన్
వద్దని పారిపోవకుర భక్తుడ! రామ కటాక్ష మెన్నడున్;...
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చినఁ గుండపోతగన్!