26, సెప్టెంబర్ 2016, సోమవారం

చమత్కార పద్యాలు – 216/5


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

ఐదవ అర్థము - ఇంద్ర స్మరణ          

భూరి జఠర గురుఁడు = బ్రహ్మకు పెదతండ్రి యైనవాడును,
నీరజ = పద్మముల వంటి
అంబక భూతి = నేత్ర సంపద గలవాఁడును,
మహిత కరుఁడు = గొప్ప కప్పములు గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = అధికమైన రత్నాలంకారుఁడైన వాఁడును,
అలఘు సద్గణేశుఁడు = ఘనమైన సుమనస్సముదాయమునకు అధిపుడైనవాఁడును,
అగ్ర గోపుఁడు = మొదటి (తూర్పు) దిక్కున కధిపతి యైనవాఁడును,
మహామర్త్యసింహుఁడు = గొప్ప దేవతాశ్రేష్ఠు డైనవాఁడును (అగు దేవేంద్రుఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

5 కామెంట్‌లు:

  1. బ్రహ్మకు పెదతండ్రి బహుపద్మ నేత్రుండు
    మహితకరుడధికపు మణివిభూషి
    సద్గుణగణపతియు సరి ప్రాగ్దిశాపతి
    వేలుపుపతి నిత్యమేలు మనల.

    రిప్లయితొలగించండి
  2. దేవ గణముల కధిపతి చేవ యుతుడు
    రత్న మణిమయ దేహుడు రమ్యు డార్య !
    బ్రహ్మ పెదతండ్రి సహస్ర యం బకము లుగల
    యింద్రు నకు వంద నంబులనిత్తు నిపుడు

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *********
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. 'బ్రహ్మ పెదతండ్రి వేయి యంబకములు గల' అనవచ్చు.

    రిప్లయితొలగించండి
  4. స్మరణీయమ్ముర! కౌగిలి
    మరులన్ప్రభవిల్లు తీపి మావిళ్లివిగో
    చొరవేది కత్తిరించగ
    కురువర! నేనూర్వశిఁగద? కూడగ రాదా?

    రిప్లయితొలగించండి
  5. స్మరణీయమ్ముర! కౌగిలి
    మరులన్ప్రభవిల్లు తీపి మావిళ్లివిగో
    చొరవేది కత్తిరించగ
    కురువర! నేనూర్వశిఁగద? కూడగ రాదా?

    రిప్లయితొలగించండి