కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జుట్టును లేనివాఁడు తన జుట్టును దువ్వెను మాటిమాటికిన్"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జుట్టును లేనివాఁడు తన జుట్టును దువ్వెను మాటిమాటికిన్"
(గరికిపాటి వారు ఒక అవధానంలో పూరించిన సమస్య)
లేదా...
"జుట్టు లేనివాఁడు జుట్టు దువ్వె"
లేదా...
"జుట్టు లేనివాఁడు జుట్టు దువ్వె"
పట్టు లేని విద్య పాండిత్య మెటులౌను?
రిప్లయితొలగించండిపలుకుబడుల మాట పద్య మగున?
శాస్త్ర మెరుగ లేక సంగీత మిటులుండు
జుట్టు లేని వాడు జుట్టు దువ్వె!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆ.వె. జుట్టు గల్గు వార లెట్టులున్నను చాలు
రిప్లయితొలగించండిదువ్విన మరి లేక దువ్వ కున్న
నున్న జుట్టు యెంతొ యూడగ ; సగమైన
జుట్టు లేని వాడు జుట్టు దువ్వె.
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండి'జుట్టు+ఎంతొ' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. 'ఉన్న కొలది జుట్టె యూడగ...' అందామా?
సవరణకు, సూచనకు ధన్యవాదాలు. ' ఉన్న కొలది జుట్టె యూడగ ' అన్నపుడు భావం దెబ్బ తింటుందేమో ! ' ఉన్న జుట్టు చాల యూడగ 'అనవచ్చనుకుంటాను. ఏమంటారు ?
తొలగించండిఉ. ఎట్టుల నైననుండ గల రెంతయొ జుట్టును గల్గు వారలే
రిప్లయితొలగించండిమట్టగ దువ్వకుండినను మాటికి దువ్విన మాటిమాటికిన్
రట్టగు నట్లు కేశములు రాలగ నెత్తిన నర్ధనైననున్
జుట్టును లేనివాడు తన జుట్టును దువ్వెను మటిమాటికిన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమట్టుగ = కుదురుగ; సవ్యముగ ; మితముగ (శబ్ద రత్నాకరము)
తొలగించండిజనార్దన రావు గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆలి లేని యింట యారిపో యినవంట
రిప్లయితొలగించండిప్రేమ నిండు కున్న క్షేమ మేది
కలహ మందు భార్య గయ్యాళి కాకున్న
జుట్టు లేనివాఁడు జుట్టు దువ్వె
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...యింట నారిపోయిన...' అనండి.
ఆలి లేని యింట నారిపోయిన వంట
తొలగించండిప్రేమ నిండు కున్న క్షేమ మేది
కలహ మందు భార్య గయ్యాళి కాకున్న
జుట్టు లేనివాడు జుట్టు దువ్వె
మూడు వెండ్రుకలతొ ముందున్న, మంగలి
రిప్లయితొలగించండిఎంచుట? మరి కత్తి రించుట? ననె!
రంగు వెయ్యుటకని రంజుగా దెలిపుతూ
జుట్టు లేనివాఁడు జుట్టు దువ్వె!
ఎంచుట = లెక్కించు
పొలిమేర మల్లేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
వెండ్రుకలతొ అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'కత్తిరించుట+అనె' అన్నపుడు యడాగమం వస్తుంది. 'వెయ్యుట' సాధువు కాదు. ..దెలిపుతూ/దెలుపుచు.. మీ పూరణకు నా సవరణ.....
మూడు వెండ్రుకలవి ముందున్న, మంగలి
యెంచుట? మరి కత్తిరించుట? యనె
రంగు వేయు మనుచు రంజుగా దెలుపుచు
జుట్టు లేనివాఁడు జుట్టు దువ్వె!
ధన్యవాదములు, మీరు తెలిపినవి తరువాత గమనించానండి, బయట ఉండుట వలన మార్చుటకు కుదరలేదు. తెలిపి సరిచేసినందుకు ధన్యవాదములు గురువు గారు.
తొలగించండి
రిప్లయితొలగించండిచూసె సుందరియట చూపరి సొగసరి
బెట్టు జేయుచు తన పెనిమిటినట
కోరెను తల దువ్వ గోముగా, మగవాడు,
జుట్టు లేనివాఁడు, జుట్టు దువ్వె
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పట్టుది పావడా తొడుగి వాలుగ జార్చిన కేశబంధమున్
రిప్లయితొలగించండిజుట్టక కోమలాంగి కడు సొంపుగ దర్శన మిచ్చినవ్వగన్
గట్టిగ కళ్ళునుగ్గి యది కల్పన యైనను పేరియాశతో
జుట్టును లేనివాఁడు తన జుట్టును దువ్వెను మాటిమాటికిన్
పియస్సార్ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తొడుగి/తొడిగి' టైపాటు.
రిప్లయితొలగించండిపట్టెను తా కలంబునట పట్టుగ చూచుచు చందమామటన్
చట్టున యోచనొక్కటియు చందము గాంచగ బోడిగుండునన్
జుట్టును లేనివాఁడు తన జుట్టును దువ్వెను మాటిమాటికిన్
కట్టుచు గట్టిపద్యమును గాంచెను నుత్పలమాల గావగన్ :)
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చందమామ+అటన్' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. 'చందమామనే' అనండి.
పుట్టలు చెట్టుచేమలును పోడిమి నిండిన క్షేత్రరాజి యా
రిప్లయితొలగించండిపట్టున నుండగా నచట పంటను గావగ చేరినట్టివా
డొట్టి వినోదకాంక్షి యొక డూరక మంచెను నన్యులెవ్వరుం
జుట్టును లేనివాడు తన జుట్టును దువ్వెను మాటిమాటికిన్.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిచుట్టూ ఎవ్వరూ లేనివాడు అంటూ వైవిధ్యమైన పూరణ చెప్పారు. అభినందనలు.
వట్టిని ఒట్టి అనరాదు. తెలుగు వ్యుత్పత్తి కోశం ఒట్టిని వట్టికి రూపాంతరంగా చెప్పింది కాని అది వ్యావహారిక, గ్రామ్య, మాండలిక పదాలను కూడా స్వీకరించింది. అందువల్ల దానిని ప్రామాణికంగా తీసుకోరాదు.
'పంటను గావఁ దలంచి చేరియున్। వట్టి వినోదకాంక్షి యగువాఁ డట మంచెను...' అందామా?
తొలగించండిపట్టిన పట్టువీ డకను బాగుగ నల్లని క్రాపుదు వ్వుచున్
రిప్లయితొలగించండిగట్టిగ నూనెరాసు కొని కాంతుడు హేలగ వెక్కిరించగన్
వట్టిది గుండుగీ యగనె వాసిన గట్టిన కుండరీతిగా
జుట్టును లేనివాఁడు తన జుట్టును దువ్వెను మాటిమాటికిన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
తలపు పండె ననుచు తలనీలములనిచ్చి
రిప్లయితొలగించండితిరుమ లేశుని కడ తీర్చి మ్రొక్కు
మఱచి దువ్వెనఁ గొని మరుసటి దినమున
జుట్టు లేని వాడు జుట్టు దువ్వె
సహదేవుడు గారూ,
తొలగించండిమతిమరుపు మనుజుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆర్యా!
రిప్లయితొలగించండిధన్యవాదములు,
మీ సూచన ప్రకారము క్రింది విధముగా సవరించితిని. గమనించ ప్రార్థన.
పుట్టలు చెట్టుచేమలును పోడిమి నిండిన క్షేత్రరాజి యా
పట్టున నుండగా నచట పంటను గావగ చేరినట్టివా
డట్టె వినోదకాంక్షి యొక డంతట మంచెను నన్యులెవ్వరుం
జుట్టును లేనివాడు తన జుట్టును దువ్వెను మాటిమాటికిన్.
హ.వేం.స.నా.మూర్తి.
ఆర్యా!
రిప్లయితొలగించండిమీ సవరణను గమనించక పై విధముగా సవరించాను. మీ సవరణ బాగున్నది. ధన్యవాదములు.
మీ సవరణ కూడ బాగున్నది.
తొలగించండిధర్మపత్ని, తాను కర్మణ్యులైయుంట
రిప్లయితొలగించండిబిడ్డ గావ నొకని బెట్టుకొనిరి.
నీళ్ళు బోసి యతడు నిష్ఠతో శిశువుకు
జుట్టు లేనివాడు జుట్టు దువ్వె.
హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిబట్టనుగట్టలేడు ముఖపంకజమందు పదాబ్జముంచు వా
డెట్టులొ పొత్తిగుడ్డలకునీవలనుండిన దువ్వెన్ గొనెన్
పట్టునుబోలియుండి నునుపై కడు మోదముగూర్చుచంతగా
జుట్టును లేనివాఁడు తన జుట్టును దువ్వెను మాటిమాటికిన్ ||
బట్టఁగట్టలేని పసిబిడ్డకెట్టులో
దువ్వెనొకటి దొరికె తుష్టుడగుచు
పట్టుబోలిక నునుపై కడునొత్తుగా
జుట్టు లేనివాఁడు జుట్టు దువ్వె.
Print mistake adjustment
తొలగించండిదువ్వెన్ , దువ్వెనన్
బట్టనుగట్టలేడు ముఖపంకజమందు పదాబ్జముంచు వా
తొలగించండిడెట్టులొ పొత్తిగుడ్డలకునీవలనుండిన దువ్వెనన్ గొనెన్
పట్టునుబోలియుండి నునుపై కడు మోదముగూర్చుచంతగా
జుట్టును లేనివాఁడు తన జుట్టును దువ్వెను మాటిమాటికిన్ ||
తొలగించండిమాడుగుల వారు,
అద్భుతః !
జిలేబి
డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
తొలగించండిప్రశస్తమైన పూరణల నందించారు. అభినందనలు.
మాన్యులు, శ్రీయుతులు శంకరయ్య గారికి మఱియు జిలేబి గారికి ధన్యవాదాలు.
తొలగించండిఆర్యా క్షమాపణతో నిన్నటి పూరణ
రిప్లయితొలగించండిP.Satyanarayana
మరణంబెంతటి మోసకారియొ జుమీ!మాన్యుండు రామానుజున్
అరణిం గూల్చెను ముప్పదేళ్ళకె మహత్వాకాంక్షలన్ గాల్చె సం
స్కరణల్ వే గణితంబునన్ బొడగనన్ స్వాధ్యాయి బోరంగ నో
ధరణీశా!యభిమన్యుడుద్ధతిని బద్మవ్యూహముం గల్చె బో!!P.Satyanarayanaనేటి పూరణ దిగువ
చుట్టిరి ముందు వెన్కలను జుట్టును యొక్క సమాన రీతినిన్
ముట్టిరివెన్క వెన్కకని మోజుగ వ్రేళ్ళను దువ్వ వీరులై
తట్టిరి వేదరాశి నిల దౌష్ట్యము గాదొకొ జుట్టు బెంచకన్
జుట్టును లేనివాడు తన జుట్టునుదువ్వెనుమాటి మాటికిన్!P.Satyanarayana
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండినిన్నటి పూరణకు మీ సవరణ బాగుంది. సంతోషం!
ఈనాటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జుట్టును+ఒక్క' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. 'జుట్టును తాము/జూడ సమాన రీతినిన్...' అందామా?
ఆర్యా
తొలగించండిమీసవరణకు కృతజ్ఞతలు.ఉదయమే పూరణ పూర్తి జేసి సాయంత్రానికి మళ్ళీ చూడడం జరుగుతుంది.మీ సహనాన్ని ఎందరం పరీక్షిస్తున్నామో!You are really great! P.Satyanarayana
ధన్యవాదాలు.
తొలగించండిP.Satyanarayanaగట్టు మల్లన్నకు గండాలు దీరంగ
రిప్లయితొలగించండిజుట్టునిచ్చె మ్రొక్కు జొప్పున నట
జిట్టి యెండ నుండ జిట జిట బెట్టంగ
జుట్టు లేని వాడు జుట్టు దువ్వె!!P.Satyanarayana
పిట్టా వారూ,
తొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
'మల్లన్నకు' అన్నచోట గణదోషం. 'గట్టు మల్లన కడ గండాలు దీరంగ' అందామా?
గరికిపాటి వారి పూరణ మీ వద్ద ఉంటే ప్రచురింప మనవి.(జుట్టును....)
రిప్లయితొలగించండిగరికపాటి వారు పూరించిన సమస్య అని ఎవరో మిత్రులు పంపితే సేవ్ చేసుకున్నది. వారి పూరణ అందుబాటులో లేదు.
తొలగించండిగరికిపాటి నరసింహా రావు వారిది
తొలగించండిపొట్టకు లేకగాదు పరిపూర్ణ విలాస సుఖోపలభ్ధికై
కట్టలు కట్టలైన తన కాంక్షలు దీర్పగ జాలవంచున
ప్పట్టున నప్పుజేయగని పట్టగ కాళ్ళను నందుకొంటకే
జుట్టును లేనివాడు తనజుట్టును దువ్వెను మాటిమాటికిన్
(మొదటి శతావధానం - 1994 అక్టోబరు 9,10 తేదీలలో కృష్ణం రాజు కార్పోరేషన్ హాల్, కాకినాడ - సంచాలకులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ; పృచ్చకులు - శ్రీ గరిమెళ్ళ రాధాకృష్ణ కుమారం ).
జిలేబీ గారూ,
తొలగించండిధన్యవాదాలు!
మీ సాహిత్యాభిరుచి ప్రశంసనీయం.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిబట్ట తలను నెప్డు జుట్టు దువ్వఁగ లేక,
పెట్టు జుట్టుఁ దానుఁ బెట్టుకొనియు;
బిట్టుగాను సొగసు లుట్టిపడఁగ, సొంత
జుట్టులేనివాఁడు, జుట్టు దువ్వె!
చిన్న మార్పుతో...
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
బట్ట తలను నెప్డు జుట్టు దువ్వఁగ లేక,
పెట్టు జుట్టుఁ దానుఁ బెట్టుకొనియు;
బిట్టుగాను సొగసు లుట్టిపడెడునట్టి
జుట్టులేనివాఁడు, జుట్టు దువ్వె!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిహాస్యస్ఫోరకంగా మీ పూరణ అద్భుతంగా ఉంది. నాకైతే మొదటిదే బాగుంది. అభినందనలు.
నాకూ మొదటిదే నచ్చింది.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్య గారూ...గుండా వారూ!
తొలగించండిమొదటి పూరణలో సొంతజుట్టు లేనివాఁడు పెట్టుడు జుట్టుదువ్వాడని చమత్కరించాను.
రెండవ పూరణలో...ద్విరుక్త టకారం రావాలనే అలా మార్చాను. బిట్టుగా సొగసు లుట్టిపడే జుట్టు లేనట్టివాఁడు, పెట్టుడు జుట్టు దువ్వాడని చమత్కారము సాధించడాని కిది ఉపయోగపడింది.
మీకు మొదటి పూరణము నచ్చినందులకు ధన్యవాదములు!
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితనదు శిరము పైన తగినంత రీతిలో
జుట్టు లేని వాడు జుట్టు దువ్వె
ఆలి మిత్రురాండ్రు నందమౌ భామలు
తనను జూడ గోరి దలచి నడుగ.
క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వయసు మీద బడిన వాసిగ మంగలి
రిప్లయితొలగించండిజుట్టులేనివాడు, జుట్టు దువ్వె
నొక యువకుని జుట్టు నొత్తుగ తీయగ
చిక్కు,శిరము కర్మ చేయదలచి
చేపూరి శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిన్న పిల్లవాడు చేత దువ్వెన బట్టి
రిప్లయితొలగించండిజుట్టు దువ్వు మనుచు బట్ట తలను
కలిగి యున్న తండ్రి కడకు వచ్చి యడుగ
జుట్టు లేనివాడు జుట్టు దువ్వె.
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కండ్లు లేని వాడు కాంచిన జగమును
రిప్లయితొలగించండిచేయి లేని వాడు చేయ పనులు
కాలు లేని వాడు గబగబ నడచిన
జుట్టు లేని వాడు జుట్టు దువ్వె
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
'కండ్లు' అన్నదానిని 'కనులు' అనండి.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పట్టున వే౦కటాద్రి పయి స్వామికి వె౦డ్రుక
…………… లిచ్చి , క్రి౦దకున్
గుట్టుగ వచ్చి , విగ్గు తలకున్ ధరియి౦చి ,
………………… చరి౦ప సాగె | నే
జుట్టును లేని వాడు తన జుట్టును దువ్వెను
……………… మాటి మటి | కె
బ్బెట్టగు సోకుచే వెధవ వేషము లీ గతి
…………… వేయ నేటికిన్ ? ?
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
ఎ ట్టుల మాట లాడితివి యిప్పుడు చెప్పుమ యొక్క సారహో
రిప్లయితొలగించండిజుట్టును లేని వాడు తన జుట్టును దువ్వెను మాటిమాటి కిన్
యెట్టు గ నాప నిన్నతడు నేరుగజేయును జెప్పుమా సుధా !
పట్టున నొక్క వెంట్రుకయు బట్టగ లేకను సాధ్యమే యిలన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది.
'మాటికిన్+ఎట్టుల' అన్నపుడు యడాగమం రాదు.
దేశపతి గారి పూరణ....
రిప్లయితొలగించండిబ్రతుకు తెరువు కొరకు బస్టాపు నందున
బోడిగుండువాడు బోర్డు పెట్టె;
మంచి పనితనమున మంగలి వాడైన
జుట్టు లేని వాడు జుట్టు దువ్వె.
దేశపతి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కట్టిన బట్ట కట్టడట కళ్లకు నల్లని కళ్ళజోడునున్
రిప్లయితొలగించండిదట్టపు గంధ చందనము తప్త సువర్ణపు టుంగరమ్ములున్
పట్టిని నీయ పెండ్లికిని బంధువు లెవ్వరు మెచ్చి ప్రేమగం
జుట్టును లేనివాఁడు తన జుట్టును దువ్వెను మాటిమాటికిన్
ఆలు చూలు లేదు మ్రోల పుత్రుండట
దూఱ సందు లేదు తోడు డోలు
డబ్బు లేని వాడు నుబ్బి యెక్కెఁ బడవ
జుట్టు లేనివాఁడు జుట్టు దువ్వె
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో భావం కొంత దురవగాహంగా ఉంది. ముఖ్యంగా మూడవ పాదం!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
తొలగించండి“మెచ్చి ప్రేమగన్ పట్టిని నీయ పెండ్లికిని బంధువు లెవ్వరు చుట్టును లేనివాఁడు” అని నాభావమండి. అందంగా కన్పించాలన్నతపన.
అందంగా కన్పించాలన్నతపన అతని లో ఉందని భావము.
తొలగించండిప్రేమగన్+చుట్టును లేనివాఁడు... ఎంత మూఢుణ్ణి అయిపోయాను? ఇంత సులభమైన ద్రుతసంధిని గుర్తుంచలేదంటే సిగ్గు పడుతున్నాను. నా దృష్టి అంతా జుట్టు మీదే ఉంది. చుట్టు అన్న పదమే తోచలేదు సుమా! కామేశ్వర రావు గారూ, మన్నించాలి!
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఒక్కొక్కసారియలావుతుందండి. సహజమే. బాధపడ నవసరము లేదండి. ధన్యవాదములు.
తొలగించండిబండకాడి అంజయ్య గౌడ్ గారి పూరణ....
రిప్లయితొలగించండిఅంజయ్య గౌడ్
బోడిగుండు మగడు ముద్దుగా భార్యకు
పడక టింటిలోన పట్టపగలు
చక్కగా కురులను సవరించి జడవేయ
జుట్టు లేని వాడు జుట్టు దువ్వె.
బండికాడి అంజయ్య గౌడ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బట్టతల సతతము బాధించు చుండగా
రిప్లయితొలగించండిపెండ్లి చేసుకొనెడు వేడ్కతోడ
పెట్టుడు కచములను బెట్టుగా ధరియించి
జుట్టు లేని వాడు జుట్టు దువ్వె
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బట్టతలగలట్టి బాబాయి యంచును
రిప్లయితొలగించండిజనులు తనను గేలి సలుపుచుండ
పెట్టుడు కచములను బెట్టుగా ధరియించి
జుట్టు లేని వాడు జుట్టు దువ్వె
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
బట్టతలను గూడ జుట్టు మొలుచు నను
రిప్లయితొలగించండివార్త వినగ బోవ వారి కడకు
బిట్టుగాను రాగ బట్టువంటి కురులు
జుట్టు లేనివాడు జుట్టు దువ్వె!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పట్టుగబెంచి వెంట్రుకలు బాధ్యత చేతను మొక్కుదీర్చ?ఆ
రిప్లయితొలగించండిజుట్టును మెత్తగా దడిపి చూపుల కందక గుండు గీయగా?
తిట్టక వేంకటేశ యనితీరిక చేత నమస్కరించియున్
జుట్టునులేనివాడు తనజుట్టును దువ్వెను మాటిమాటికిన్|{పెంచినజుట్టునుచూచిఇష్టపడివాటినిదువ్వెను అన్నభావన}
2.నిండుగున్న గుండు నిగనిగ లాడగా
జుట్టులేనివాడు|”జుట్టుదువ్వె
చెంత తమ్ముడుండ చెక్కిలి నొక్కుచు
అంతరంగ మందు హాయినింప|
3.కట్టు,బొట్టు,జుట్టు కళ్యాణ కట్టలో
పట్టు,గుట్టుదప్పె|భక్తియందు
రాత్రి కలల యందు రారాజుగా మారి
జుట్టులేని వాడుజుట్టు దువ్వె|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
బట్టతలన్ కనుంగొనుచు వాటములన్ ప్రజ గేలిచేయగన్
రిప్లయితొలగించండిగుట్టుగ స్వప్రయోజనము కోసము కూరిచి తా ధరించి యా
పెట్టుడు జుట్టు, చక్కగను పెండ్లికిఁబోయి ముదమ్ముతో స్వయం
జుట్టును లేనివాడు తన జుట్టును దువ్వెను మటిమాటికిన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వాటముగన్' అన్నదానికి 'వాటములన్' అని టైపయినట్టుంది. 'స్వయం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'ముదమ్ముతోడ నా। జుట్టును లేనివాడు..' అనండి.
వాటములన్ ః త్రోవలలో అనే అర్థంతో వాడాను. స్వయం - అనేది సంస్కృత పదం అనుకున్నాను. తమరి సవరణలకు ధన్యవాదములు.
తొలగించండిధరణి గారి పూరణ...
రిప్లయితొలగించండిసోకు మరిగి యొకడు సొగసుగా కనుపించ
రంగు రాసె తలకు హంగు లిడగ
రంగు వలన కురులు రాలిపోయిన నంత
జుట్టు లేని వాడు జుట్టు దువ్వె.
ధరణీప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంబటి భానుప్రకాశ్ గారి పూరణ...
రిప్లయితొలగించండిసొగసు కత్తెను గని నగుమోముతో జూసి,
జుట్టు లేని వాడు జుట్టు దువ్వె.
బట్టతలను జూసి పదుగురు నవ్వగా,
సిగ్గు తోడ జచ్చె చిత్ర ముగను.
అంబటి భానుప్రకాశ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పట్టణ మేగ నాయకుడు పట్టుదుకూలములన్ ధరించి తా
రిప్లయితొలగించండిపెట్టెను బూదిరేఖలటు పిమ్మట పిల్చిన రాని సేవకున్
తిట్టిన వెంటనే యతడు తెచ్చెను దంతపు దువ్వెనన్ వడిన్
జుట్టును లేనివాడు తన జుట్టును దువ్వెను మాటి మాటికిన్
కాసులు కురిపించి ఖల్వాటు డొక్కడు
చిత్రరంగ మందు చేరినంత
చలన చిత్రమందు విలను వేశమునివ్వ
జుట్టులేని వాడు జుట్టు దువ్వె.
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఏడుకొండల వేంకన్న కిచ్చికురుల
రిప్లయితొలగించండినడిగె నీవేల నీజుట్టు నిడవటంచు
జుట్టు లేనివాఁడు, జుట్టు దువ్వె
యమ్మ నడిగెను, తెలియక నమ్మ నవ్వె
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిభావం బాగున్నా సమస్య ఆటవెలది అయితే మీరు తేటగీతి వ్రాశారు. మీ పూరణకు నా సవరణ...
ఏడుకొండల దొర కిచ్చి కురుల, నడిగె
నేల నీవు జుట్టు నిడ వటంచు
జుట్టు లేనివాఁడు, జుట్టు దువ్వెడి తన
యమ్మ నడిగె, తెలియ కమ్మ నవ్వె.
(మీ భావాన్ని సంతృప్తికరంగా చెప్పానో? లేదో?)
బట్టపుఱ్ఱె మగడు భద్రయ్య వెంటనే
రిప్లయితొలగించండిబడికిబంప సుతుని పరుగులిడుచు
లాగి యొడనిజేర్చి లాలించి మురిపించి
జుట్టు లేనివాడు జుట్టు దువ్వె.
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లాగి యొడిని'... యొడని అని టైపయింది.
బట్ట తలను తలచి వగచగ నేలని
రిప్లయితొలగించండిజుట్టు లేని వాడు జుట్టు దువ్వె
నాలికి, సిగనిడెను పూలు మురిపముగ!
పతిని కూడి సతియు పరవశించె!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
'వగచ నేల యనుచు' అనండి, బాగుంటుంది.
ఇట్టివిచిత్రమెన్నడును నేనెట గాంచగలేదు నీలిమా!
రిప్లయితొలగించండిపొట్టనుజూచినన్మిగుల ముందుకు వచ్చుచు నెక్కిరించుగా
లొట్టగు కన్నులుంగలిగి లుప్తవివేకత ప్రజ్వలింపగా
జుట్టునులేనివాడు తన జుట్టును దువ్వెను మాటిమాటికిన్.
పొన్నెకంటి వారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
'వచ్చుచు వెక్కిరించుగా' అనండి.
నమస్సులండి.... పదము. వెక్కిరింత...అని గమనించాను.
తొలగించండిఎక్కిరింత, వెక్కిరింత రెండూ ఉన్నాయి. మొదటి పదం నాకు తెలియక మీరు తప్పుగా టైపు చేశారనుకొని సవరణ సూచించాను. మన్నించండి.
తొలగించండిబట్ట తలను గల్గి నట్టిక్షు రకుడొండు
రిప్లయితొలగించండికత్తి బట్టి జుత్తు కత్తి రించి
సిగను సుందరంబు జేసెడి దరిని యా
జుట్టు లేని వాడు జుట్టు దువ్వె
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గుట్టుగ పుట్టముల్ విడచి గొల్లెత లందరు స్నాన మాడ బో,
రిప్లయితొలగించండిదిట్టరి బాల కృష్ణు డటు తెంపరి యౌచును చీర లన్నియున్
చెట్టున వ్రేల గట్టె నిక చిన్మయుడై తనరించె,మూతిపై
జుట్టును లేనివాడు తన జుట్టును దువ్వెను మాటి మాటికిన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉత్తర దేశంలో మూతిపై మీసాలున్న కృష్ణుడి దేవాలయాలున్నాయట!
గురువుగారి సందేహము సహజమే కాని యే దేశములోనైనా బాలకృష్ణుని కి మీసాలుండవు
తొలగించండిబోడి గుండు వాడు బొంబై బజారు లో
రిప్లయితొలగించండిబట్ట తలను జుట్టు పుట్టు ననగ
మనుజు లెవరు రాక మర్కట మును బట్టి
జుట్టు లేనివాఁడు జుట్టు దువ్వె
నిన్నటి నా పూరణము లోని '' పద్ములు '' పదమునకు వివరణ :-
పద్మి = ఏనుగు /గజము , ఆధారం :- శబ్దరత్నాకరము
ఆ పదమునకు బహువచన ముగా '' పద్ములు '' అని వాడితిని
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పద్ములు' గురించి సందేహం తీర్చినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశంకరాభరణం సమస్యాపూరణం
****
ఏమి సేతు ననుచు నేడ్చుచుండె నకట
జుట్టు లేనివాడు ; జుట్టు దువ్వె
నొకడు పలురకాల నొత్తుగా దనకుండ;
ఖేదమొకట జూడ మోదమొకట!
***
గుళ్ళపల్లి తిరుమల కాంతి కృష్ణ
గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మంచి 'క్రాపు ' కొరకు మంగలి నేబిల్చి
రిప్లయితొలగించండికత్తిరించమనుచు కాపు చెప్ప
నీరుజల్లి తలను నిమురుచు దువ్వెనన్
జుట్టు లేనివాడు, జుట్టు దువ్వె.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆర్యా
రిప్లయితొలగించండిజుట్టును జుట్టి జుట్టిన పద్యాలు హాస్య ధోరణిని కనబరచడం ముదావహం.కుతూహలం రేపడానికి ప్రతి రచనా ప్రక్రియ యథోచితంగా ప్రయత్నిస్తుందనడానికిది నిదర్శనము!Good job and greetings! P.Satyanarayana
పిట్టా వారూ,
తొలగించండిధన్యవాదాలు.
తీర్థయాత్రలకని తిరుమల కేగిన
రిప్లయితొలగించండిబాలుడొకడు తాను భక్తి తోడ
నలకలనట యొసగి నలవాటు మేరకు
జుట్టు లేని వాడు జుట్టు దువ్వె.
2.బోడిగుండు వాడు బుద్ధిగా కూర్చొని
తలను పెక్కు సార్లు తడుము కొనుచు
ముదము తోడ తాను ముందు దువ్వెన దీసి
జుట్టు లేని వాడు జుట్టు దువ్వె.
3.బడికి వేళ యయ్యె బామ్మరో యనుచును
మనుమరాలు కోర మడుగు ననగ
జడను వేయమనుచు సత్పుత్రి యడుగంగ
జుట్టు లేని వాడు జుట్టు దువ్వె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'..యొసగి యలవాటు' అనండి.
ఈమధ్య మీరు మరీ ఆలస్యంగా పూరణలు పెడుతున్నారు. అప్పటికే నేను పడుకుంటున్నాను. తెల్లవారి పనులలో పడి ముందురోజు పూరణలను చూడడం మరిచి పోతున్నాను. మీరు 'అన్నయ్యా, నిన్నటి నా పూరణలను పరిశీలించండి' అంటూ ఈరోజు పెడుతున్నారు. ఇబ్బంది ఏమీ లేదు కాని ఆలస్య మెందుకవుతున్నది?
మహాకూటమి (Grand Alliance):
రిప్లయితొలగించండివట్టిగ కమ్యునిస్టిటను బంగలు త్రిప్పుర గుండుగొట్టగా
చెట్టున కెక్కుకోరికలు చెన్నుగ నూరగ లొట్టవేయుచున్
బెట్టును జేయుచున్ షరతు పెట్టెను మైత్రికి ముండమోయుచున్:👇
జుట్టును లేనివాఁడు తన జుట్టును దువ్వెను మాటిమాటికిన్