8, సెప్టెంబర్ 2016, గురువారం

సమస్య - 2137 (గరళముఁ గ్రోలఁ జూచెదవు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"గరళముఁ గ్రోలఁ జూచెదవు కమ్మని పాలను నేలఁ ద్రోచియున్"
లేదా...
"గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్"

100 కామెంట్‌లు:

 1. (కృష్ణుడు దుర్యోధనునితో...)
  సురమునిసంఘ సంస్తుత యశోవిభవోన్నత పాండుపుత్రు లె
  ల్లరను దృణీకరించియుఁ జలంబున వారలతోడ మూర్ఖతన్
  దుర మొనరింపఁ జూతువె; యథోచిత మైత్రియె మేలు చూడఁగన్
  గరళముఁ గ్రోలఁ జూచెదవు కమ్మని పాలను నేలఁ ద్రోచియున్.

  అరవిందానన, సతి, సుం
  దరి, సద్గుణరాశి విడిచి తగిలితివా క
  ల్లరికత్తెలైన వేశ్యల;
  గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ప్రశస్తమైన పూరణల నిచ్చారు. అప్రయత్నముగా నఖండ యతి వాడితిరి గమనించారా! సహజసిద్ధమీయతి యని నాయభిప్రాయము.

   తొలగించండి
  2. కామేశ్వరరావు గారూ,
   ధన్యవాదాలు.
   మీరు చెప్పేవరకు నేను గమనించలేదు. గమనించి ఆశ్చర్యపడ్డాను.

   తొలగించండి
  3. సుకవి మిత్రులు శంకరయ్య గారికి నమస్సులు! మీ రెండు పూరణములు చాలా బాగున్నాయి. అఖండ యతి మీ పద్యానికి చక్కగా అతికింది. అభినందనలు!

   తొలగించండి
  4. గుండు మధుసూదన్ గారూ,
   ధన్యవాదాలు!
   అఖండయతి విషయంలో మడి కట్టుకున్న నాకు శృంగభంగం అయింది. 'యద్య దాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః'. అఖండయతిని ప్రయోగించిన పూర్వకవు లందరికీ ప్రణామాలు!

   తొలగించండి
  5. "దుర మొనరింపఁ జూచెదవు, దుష్టత మానుము, సంధి మే లిడున్" అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి

  6. అఖండ యతి అంటే ఏమిటండీ ?

   జిలేబి

   తొలగించండి
  7. సవరణ పాదంతో సమస్య పాదానికి గల లంకె చెడుతుంది. మీరు మొదట రాసినదే బాగున్నది.

   తొలగించండి
  8. జిలేబీ గారూ,
   క్రింది లింకు క్లిక్ చేయండి....
   అఖండ యతి

   తొలగించండి
 2. పరువపు చిన్నది సరసన
  పరవశ మున పలుక రించ భావము వీడన్
  నిరసన జూపుచు చెలిపై
  గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్

  రిప్లయితొలగించండి

 3. కషాయము త్రాగనని మారాము జేయు పతిని సతి దారిలోకి తేవడానికి -

  సరసపు తరుణియు కోరగ
  గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్
  నిరసన తెలుపగ సతి, న
  య్యరో కషాయంబుగొనిరి యాహూ యనుచున్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. భరమని రాజ్య భోగముల బాసియు కానలనన్ వసింపగా
  బరువడి నిర్ణయించుకొని భార్యను బుత్రుని నర్ధ రాత్రిలోన్
  బరిహరమూని గౌతముడు బారగ లోకులుగాంచి బల్కరే
  గరళము గ్రోల జూచెదవు కమ్మని పాలను నేల ద్రోచియున్

  రిప్లయితొలగించండి
 5. సరళమె భవ బంధనముల
  పరిపాటిగ వీడి పరమ పదమును బొందన్
  హరుడవె సాగరమథనపు
  గరళము గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'కానలన్' అనవలసిన చోట 'కానలనన్' అన్నారు. అక్కడ 'కానలలో వసింపగా' అనండి.

   తొలగించండి
 6. క్రొవ్విడి వెంకట రాజారావు:

  నురగలు గ్రక్కెడి కోకా
  సరమును బీల్చుచు సొగసున సాగెడి దారన్
  పురుషుడడిగెనిటు యేలా
  గరళము గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్.

  (కోకాసరము = కోకు పానీయము )

  సరవిని గూడు ప్రేయసిని సాకక వేశ్యలవెంట నుండుచున్
  పరగెడి యాత్మభూతుని యపద్యగుణమ్మును వీడి భార్యపై
  మురిపెము జూపూజుండుమని యాతనిదల్లి హితమ్ము నిట్లనెన్
  గరళము గ్రోలఁజూచెదవు కమ్మని పాలని నేలద్రోచియున్.

  (అపద్యగుణము = నీచ గుణము; ఆత్మభూతుడు = కుమారుడు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'భూతుని నపథ్య...' అనండి.

   తొలగించండి
 7. (శ్రీకృష్ణుడు శిశుపాలునితో)

  వరమివ్వగ మేనత్తకు
  వరుసగ తప్పిదములన్ని పరికించితి నే
  నురుమెదనిక నీ శిరమును
  గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్.

  రిప్లయితొలగించండి
 8. (శ్రీకృష్ణుడు దుర్యోధనునితో)

  పరివార సహితముగ నీ
  మరణము నిశ్చయము, పెంపు మాని విచారిం
  చు, రణమునేల వలచెదవు,
  గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పియెస్సార్ మూర్తి గారూ,
   మీ రెండు విధాల పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 9. సరియగు నాయకులున్నను
  ఎరుగక యెవడో యొకడిని ఎన్నికలందున్
  వరియించితివా ఓటర్
  గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కవి కాళిదాసు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఉన్నను+ఎరుగక' అని విసంధిగా వ్రాసారు. అక్కడ 'ఉన్న నెరుగక' అవుతుంది కదా! 'నాయకు లుండిన। నెరుగక యెవడో యొకడిని నెన్నికలందున్' అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదాలు సార్. నా అసలు పేరు శ్రీనివాస్ ఈడూరి

   తొలగించండి
 10. రిప్లయిలు
  1. చాలా బాగున్నది. అభినందనలు ! మొదటి పాదం లో మూడక్షరము లదనముగా నున్నవి.

   తొలగించండి
  2. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సుస్వర శోభ ముత్తెపున్' అనండి.

   తొలగించండి
 11. మరి చూడ కూలుడ్రింకులు
  సరి పురుగుల జంపుననుచు చక్కగజూపన్
  మురిపెమ్మున వదలక నా
  గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్.

  రిప్లయితొలగించండి
 12. పరువము సరసము నరుసము
  పరికించగ మానవునకు వరమై యుండన్
  విరసించుచు నెగులు గొనుచు
  గరళము గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్!


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శిష్ట్లా శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'విరసించు'..? అది 'నిరసించు' అనుకుంటాను.

   తొలగించండి
  2. గురువు గారూ నమస్సులు. విరసించు=ద్వేషించు(శబ్దరత్నాకరము). ధన్యవాదములు.

   తొలగించండి
 13. (1979 లో ఆకాశవాణి విజయవాడ వారు ఇచ్చినప్పుడు నేను పంపిన పూరణము)

  సరళము,సౌమ్యమున్,సకల సద్గుణ సంపదలందచందముల్

  పరగిన పెండ్లమున్ వదలి; వాడని వీడని భేదమెంచకన్

  తిరిగెడు వేశ్యలన్ గలియు దిమ్మరితో హితుడిట్లు పల్కెడిన్

  గరళము గ్రోల జూచెదవు కమ్మని పాలను నేల ద్రోచియున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఇది ఆకాశవాణి వారి సమస్య... అని పేర్కొనడం మరిచిపోయాను. నా పూరణను రాత్రే పెట్టడం మంచిదయింది. లేకుంటే మీ భావాన్ని కాపీ కొట్టినట్టయ్యేది!

   తొలగించండి
  2. ధన్యవాదాలు శంకరయ్య గారూ !
   మీరు పెద్దలు. మీరు అలా అనకూడదు.

   తొలగించండి
  3. ధన్యవాదాలు శంకరయ్య గారూ !
   మీరు పెద్దలు. మీరు అలా అనకూడదు.

   తొలగించండి
 14. మరణముగలుగునుద్రాగిన
  గరళముగ్రోలెదవుత్రోచికమ్మనిపాలన్
  విరివిగనేలకొనీరము?
  గరళమువలెనుండెనేమిగైకొనబాలున్

  రిప్లయితొలగించండి
 15. త్వరపడి బాలుడగ్నిశిఖ తాకు విధంబున నిట్టిరీతినీ
  వెఱుగక మేరుసాటి సరి వీరుడు రాముని ధర్మపత్నినిన్
  పరసతి నక్కసంబు చెఱఁబట్టగ నెంచెద వేలరావణా
  గరళముఁ గ్రోలఁ జూచెదవు కమ్మని పాలను నేలఁ ద్రోచియున్

  మారీచుడు రావణునితో పలుకు సందర్భములో

  రిప్లయితొలగించండి
 16. చ.పరుగులు వెట్టుచున్ తిరిగి పాలను ద్రావుట కంటె నీరమున్
  స్థిరముగ గూరుచుండి మరి చిత్తము రంజిల ద్రావ మేలుగా
  నిరతము నిద్రలేని స్థితి నీకును నీవుగ పొందు టేలయా?
  గరళము ద్రావ జూచెదవు కమ్మని పాలను నేల ద్రోచియున్.

  రిప్లయితొలగించండి
 17. అరయగ సాధుశీల పరమాదరమేదుర సౌమ్యమూర్తియై
  వరమయి వంశవృద్ధికి నివాసినియౌ సతిగాలద్రోచియున్
  పెరమగువన్ వినోదముగ ప్రేమనుజూచుట బిల్వమంగళా?
  గరళముగ్రోలజూచెదవు కమ్మనిపాలను నేలద్రోచియున్.

  వరముగ దొఱకిన సతినల
  కరమొప్పగ కష్ట పెట్టి క్రౌర్యముమీరన్
  పెరనారిపొందుగోరుచు
  గరళముగ్రోలెదవు త్రోచి కమ్మనిపాలన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 18. మహేశా...

  పరమేశ్వర నామమ్మున
  ధరణీ జన క్షేమమెంచు దాంపత్యమునన్
  నురగల పాలకడలిలో
  గరళము గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'జన క్షేమ' మన్నపుడు 'న' గురువై గణదోషం. 'ధరణి జనుల సేమ మెంచు/ ధరణీ జన హితము నెంచు' అందామా?

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:

   మహేశా...

   పరమేశ్వర నామమ్మున
   ధరణీ జన హితమునెంచు దాంపత్యమునన్
   నురగల పాలకడలిలో
   గరళము గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్!

   తొలగించండి
  3. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:

   మహేశా...

   పరమేశ్వర నామమ్మున
   ధరణీ జన హితమునెంచు దాంపత్యమునన్
   నురగల పాలకడలిలో
   గరళము గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్!

   తొలగించండి
 19. అరయగవెర్రియాకమలహాసన!పాలనుద్రాగకుండగన్
  గరళముగ్రోలజూచెదవుకమ్మనిపాలనునేలద్రోచియున్
  గరళమువోలెనుండెనె?నిగారపుపాలవిదెచ్చితిన్గదా
  గరళముద్రాగుచోమరివిఘాతముగల్గునుమేనికిన్సదా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వెర్రివా' అని ఉండాలనుకుంటాను. 'కమలహాసన'...? కొంత అన్వయలోపం కూడా ఉంది.

   తొలగించండి
 20. వరముల నిచ్చి నిత్యమును బన్నుగఁ బ్రోచెడు దైవముండగా
  గిరివర వేంకటాద్రి ఘన కీర్తితు వేడక వేంకటేశ్వరున్
  నరబలు లిచ్చి క్షుద్రసుర నైరృత పూజలు సల్ప నేలయా
  గరళముఁ గ్రోలఁ జూచెదవు కమ్మని పాలను నేలఁ ద్రోచియున్


  అరుదుగ సేవింతు ననకు
  నరనరముల కెక్కి చెఱచు నవ నాడులనే
  యరుజమని యెంచి మద్యము
  గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్

  [గరళము = కొంచెము, పరిమితము]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరిచ్చిన సమస్య నాశతక పద్యకుసుమమునకు స్ఫూర్తి నిచ్చినది. మీ యనుమతి కోరుతూ

   వరముల నిచ్చి నిత్యమును బన్నుగఁ బ్రోచెడు దైవముండగా
   నరబలు లిచ్చి క్షుద్రసుర నైరృత పూజలు సల్పనేర్తురే
   గరళముఁ గ్రోలఁ జూచెదరు కమ్మని పాలను నేలఁ ద్రోచియున్
   గిరివర వేంకటాద్రి ఘన కీర్తితు వేడక వేంకటేశ్వరా!


   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ ఉత్తమంగా ఉంది. పాదాలను స్థానభ్రశం చేసి మీ శతకానికి అనుకూలంగా మార్చుకున్న మీ నైపుణ్యం ప్రశంసనీయం. అభినందనలు.
   ఈ సమస్య నాది కాదు, ఆకాశవాణి వారికి. ఆ విషయాన్ని ప్రస్తావించడం మరచిపోయాను. కేవలం కందపాదం నాది!

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. శతకములో
   "గరళముఁ గ్రోలఁ జూచెదరు కమ్మని పాలను విస్మరించియున్" అని సవరించితిని.

   తొలగించండి

 21. మురిపెము,ముద్దు,దీర్చగను మోహిని బోలెడి భార్యయుండగన్
  సరసము గోరి పోవగను సానుల యిండ్లకు పాడియా సఖా!
  గరళము గ్రోల జూచెదవు కమ్మని పాలను నేల ద్రోచియున్!!
  చెరుపు నెరుంగ లెరు కద చిత్తవివేచన కోలుపోవగన్

  రిప్లయితొలగించండి
 22. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  పరధన వా౦ఛతో పొగులు " భాస్కర రావును "

  …………………… విశ్వసి౦చితే ?

  అ రె రె !! పరోపకార సుగుణా౦చితు ,

  ………… త్వ ధ్ధి తు , " రామశర్మ " నే


  మరచితి | వాడు ము౦చు నిను ,

  …………… మ౦చిగ చెప్పుచు తీపి మాటలన్ |


  గరళము గ్రోల జూచెదవు - కమ్మని పాలను

  …………… నేల ద్రోచియున్

  { త్వధ్ధిత = త్వత్ + హిత }

  రిప్లయితొలగించండి
 23. పరువపు వంపు సొంపు గని భార్యను గాదని వారకాంతలన్
  మరిగితివోయి హీనుడవయి, మాన్యులు మెచ్చరు, ధర్మ మార్గమున్
  మరచిన నిన్ క్షమింపదు సమాజమెఱంగుము, మానవా గనన్
  గరళము గ్రోలజూచెదవు కమ్మని పాలను నేలద్రోయుచున్

  * కందము

  విభీషణుడు రావణునకు హితవచనములు తెలుపుతున్నట్లుగా నూహించి

  అరివీర భయంకరుడగు
  పురుషోత్తముడతడు గాదె, భూమిజ నాదా
  శరథి కొసగి శరణమ్మను
  గరళము గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   చంపకమాల రెండవపాదంలో 'హీనుడవయి' అన్నచోట గణదోషం. 'హీనుడయి/ హీనుడుగ' అనవచ్చు.

   తొలగించండి
 24. సరళమనోహరంబు వినచక్కని సుస్వరశోభ ముత్తెపున్
  సరులకునీడువచ్చు సొగసైన సదక్షర సంయుతంబునై
  యరుదగు తెన్గు భాషను దలంపక నన్యము బల్కుటన్నచో
  గరళముఁ గ్రోలఁ జూచెదవు కమ్మని పాలను నేలఁ ద్రోచియున్"
  దలంపకను+అన్యము
  పొరపాటు సరిదిద్దినందుకు కృతజ్ఞతలు.
  సవరించినాను.చిత్తగించండి.
  జనార్దనరావు గారు శతధా కృతజ్ఞుణ్ణి

  రిప్లయితొలగించండి
 25. సరసపు తెలుగు దిగవిడిచి
  పరభాష పఠించి సతము పరవశమగుచున్
  కరమగు తృప్తిని గొనెదవు
  గరళము గ్రోలెదవు త్రోచి కమ్మనిపాలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 26. దరిచేరు నుపద్రవముల
  చిఱునవ్వులతో జయించి ఛేదన చేయన్
  నరుని కెఱిగించగ, హరా!
  గరళము గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్!

  రిప్లయితొలగించండి
 27. మరణంబిక దప్పదు కురు
  వర,యోచింపుము కలహము వదిలిన మేలౌ
  పరులెవ్వరు?చేజేతుల
  గరళము గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్.

  హరితో జగడంబేలా
  హరియించునతండు జనుల యఘములు తండ్రీ
  హరినామామృతమును విడి
  గరళము గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్.

  పరనారీ యపహరణము
  దురమును దెచ్చెను విడుచుచు దోషము లెల్లన్
  శరణము గోరక రాముని
  గరళము గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్.

  సరసముగా సతి తోననె
  పరసతుల నగలను జూచి పంతము తోడన్
  పొరపడి చేతువు దప్పులు
  గరళము గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మూడవ పూరణలో 'నారీ+అపహరణము' అన్నచోట యడాగమం రాదు, యణాదేశం వస్తుంది. అక్కడ 'పరనారి నపహరించుట' అనండి.

   తొలగించండి
 28. శ్రీకృష్ణపరమాత్ముఁడు కర్ణునితో అంటున్నట్లుగా................

  సుర వర సుప్రకాశక యశోవిభవాంచిత ధీసమేత సం
  భరితులు పాండునందనులవక్రపరాక్రమ ధైర్యశాలులీ
  వరయుచుఁ నాసుయోధనునికై రణరంగముఁ సొచ్చుటేలనో?
  గరళముఁ గ్రోలఁ జూచెదవు కమ్మని పాలను నేలఁ ద్రోచియున్

  రిప్లయితొలగించండి
 29. వరగుణసహితుండగు శం
  కరగురు పాదముల వీడి కఠిన హృదయులౌ
  గురువుల జేరెదవేలా?
  గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణలో 'శంకర గురు' వంటే ఆది శంకరులే కదా!

   తొలగించండి
  2. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా.

   ఇక్కడ ఆది శంశంకరులు అన్నా కంది శంకరులు అన్నా ఇబ్బంది లేదు గురువుగారూ

   తొలగించండి
  3. గురువుగారికి వందనములు.
   శ్రీ ఫణి కుమార్ తాతా గారికి ధన్యవాదములు. మీ భావనతో నేను సంపూర్ణముగా ఏకీభవిస్తున్నాను.

   తొలగించండి
 30. పెరటిన గల్గు చక్కనగు వృక్షము, మందునకున్ సమర్థమే?
  పొరుగు గృహమ్ము నందుగల పుల్లని కూర సతమ్ము శ్రేష్టమౌ
  కరమగు తీపి గల్గు మన కమ్మని భాషను లెక్కచేయకన్
  నిరతము నన్య భాషలనునేర్వ తపించుట యెట్లు మేలగున్?
  గరళముఁగ్రోలఁజూచెదవు కమ్మని పాలను నేలఁద్రోచియున్

  రిప్లయితొలగించండి
 31. ఇరుకు గదుల పట్టణమున్
  కరకు పలుకుల అధికారి కరసేవలేల
  పెరిగిన ఊరు పిలవగన్
  గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తోలేటి రాజేశ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొన్ని దోషాలు.. రెండవ పాదం చివర గణదోషం. 'పలుకుల యధికారి కడ దాస్యమ్మా' అనండి.

   తొలగించండి
  2. ఇరుకు గదుల పట్టణమున్
   కరకు పలుకుల యధికారి కడ దాస్యమ్మా
   పెరిగిన ఊరు పిలవగన్
   గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్

   తొలగించండి
 32. హరినామమె తారకమిలఁ
  హరినామామృతముగాక నన్యము విషమే
  హరినివిడిచి యొరుల గొలువఁ
  గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్"
  ప్రహ్లాదుడు తోటి రాక్షసబాలురతో పలికిన పలుకులు

  రిప్లయితొలగించండి
 33. తరగని యర్థ కాంక్షి వయి తప్పుడు త్రోవల నాశ్రయించి నీ
  వరమగు క్షేత్ర కార్యమును ప్రక్కకు నెట్టియు నేరగానివై
  దొరికిన కష్ట మొందె దవు దోషిగ నుందువు జైలు శిక్షతో
  గరళముఁ గ్రోలఁ జూచెదవు కమ్మని పాలను నేలఁ ద్రోచియున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదం చివర 'నీ' అన్నదానికి అన్వయం లేదు. నీవు అని అనుకుంటే తరువాతి పాదం 'అరమగు' అవుతుంది. కనుక 'త్రోవల బట్టి నీవు నా...' అనండి.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు."...నాశ్రయించి యీ" యని వారి యభిప్రాయమనుకుంటాను.

   తొలగించండి
 34. మురియుచు క్షీరోదమ్మున్
  పురుషాదులు సురలు జిలుక బుట్టగ నిదమున్
  పరమేశా! గావగ నిల
  గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్

  పురుషాదులు= దనుజులు
  నిదము = విషము

  ఉరసులు పరోపకారులు
  వరముగ నీసోదరులగు పాండుతనయులన్
  తొఱగించితివే కర్ణా!
  గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్!!!

  ఉరసులు= శూరులు
  తొఱగించు= విడనాడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. విశేష పదప్రయోగం ఆకట్టుకున్నది. అభినందనలు.

   తొలగించండి
 35. మురిపెము గాగ నిన్ను తన ముద్దుల పుత్రుడి వన్న కుంతినిన్
  మరణము గాచు నీ కవచ మయ్యది వీడకు మన్న సూర్యుని
  న్నరయక , స్నేహ భావమున కంకితమౌదువ సేవ చేయుచున్ ?
  గరళముఁ గ్రోలఁ జూచెదవు కమ్మని పాలను నేలఁ ద్రోచియున్

  నిన్నటి నా పూరణ పైన స్పందన కు నా వివరణ
  చింతల్లి అనునది నామధేయం గా వాడినది . సంతానం లో కడపటి
  వారిని చింతల్లి , కంతల్లి , పాల్తల్లి అని పిలుస్తారు కొందరు . బంధుత్వంను
  దృష్టిలో ఉంచుకొని వ్రాయలేదు .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నామధేయంగా అయితే చింతల్లి ప్రయోగం ఆమోదయోగ్యమే.

   తొలగించండి
 36. పరువపు చిన్నది భార్యగ

  మురిపెము చూపించు చుండ మోదంబలరన్

  పర కాంతల మోజేలనొ?

  గరళము గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్.

  రిప్లయితొలగించండి
 37. గరళమనంగ ప్రేయసిగ కమ్మనిపాలనఇంటి భార్యయే
  చరమతియైనజూదరియెచక్కని కమ్మని పాలనే వినా
  గరళము పైన మక్కువ నుగల్గి స్వయంకృతమేగదామరిన్
  సరళముగానుయోచననుసల్పిన పాలెతనార్తి తీర్చునే
  గరళముఁ గ్రోలఁ జూచెదవు కమ్మని పాలను నేలఁ ద్రోచియున్
  (పల్లె -తల్లి లాంటిది ,పట్టణం ప్రేయసి లాంటిది అలాగే గరళం ప్రేయసి లాంటిది,కమ్మని పాలు ఇంటి ఇల్లాలు లాంటవి)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వడ్డూరి మురళీకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. గురువుగారికి నమస్కారములు నా పేరు మురళీ కాదు సర్ Ramakrishna

   తొలగించండి
  3. నిజమే... ఏదో పరధ్యానంలో అలా సంబోధించాను. మన్నించండి.

   తొలగించండి
  4. సర్ మీరు పెద్దవారు గురుతుల్యులు మీరు నన్ను మన్నించమని అనకూడదు పొరబాటు అనేది మనవ సహజం నన్నే మీరు క్షమించాలి

   తొలగించండి
 38. కిరికిరి జేసి పుస్తెను ఠకీమని త్రెంచుట నీకు న్యాయమా?
  హరకిరి యౌను నీకికను హాయిగ నవ్వి జగన్ను డొప్పడే!
  వరములనిచ్చు మోడిని గభాలున తన్నుచు రాహునొల్లగా:👇
  గరళముఁ గ్రోలఁ జూచెదవు కమ్మని పాలను నేలఁ ద్రోచియున్!

  రిప్లయితొలగించండి