కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్"
(ఆకాశవాణి వారి సమస్య)
లేదా...
"కానఁగ వడ్డి ము ద్దసలు కంటెను లోకపు రీతి యిద్దియే"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్"
(ఆకాశవాణి వారి సమస్య)
లేదా...
"కానఁగ వడ్డి ము ద్దసలు కంటెను లోకపు రీతి యిద్దియే"
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిసడ్డను గూడుచు దండ్రియె
బిడ్డడి పాపను వలచుచు పేర్మిన్ బెంచన్
బిడ్డకు తాతయె దండ్రగు
వడ్డీ యసలు కంటె ముద్దు పరికింపంగన్.
(సడ్డ = వేడుక )
క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఆడవారు ఆభరణాలూ :)
బిడ్డను జిలేబి చూపగ
గడ్డము విడుచుచు మగండు గడుసరి గానన్
వడ్డాణంబు గొనివ్వన్
వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్ :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దుడ్డునిడుచు వడ్డీలకు
రిప్లయితొలగించండివడ్డించుచునుంద్రు చక్ర వడ్డీల రహిన్
గడ్డిఁతిను షావుకారుకు
వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
పూనిన భాగ్యరేఖ సరి బుట్టగ కాసులు లెక్క బెట్టుచున్
రిప్లయితొలగించండిఆనిన దింత చాలునని యాశ నియంత్రణ జేయబోరు చే
నూనిన సాయమున్నొసగ నూటికి మూటికి మించు వడ్డిపై
దానము మాని సంగ్రహ విధానము యేశ్రమ లేని వృద్ధిగా
మానముదీయు వడ్డియన మాయమయెన్ యసలీ యుగాన పో
కానగ వడ్డి ముద్దసలు కంటెను లోకపు రీతి యిద్దియే
నడ్డియె విరుగును వడ్డిన
రిప్లయితొలగించండిజడ్డుదనంబిదియె సుమ్మి జనులితరులకున్
ఒడ్డిన యప్పులె మునిగిన
వడ్డియసలుకంటె ముద్దు పరికింపంగన్
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'విధానము నేశ్రమ...మాయమునౌ నసలీ యుగాన' అనండి. (అయెన్+అసలు అన్నపుడు యడాగమం రాదు).
రెండవ పూరణలో 'వడ్డిని' అనండి. ఇకారాంత పదాలకు న రాదు.
కవిమిత్రులకు. బ్లాగు వీక్షకులకు 'బుజ్జాయి ' విన్నపం....
రిప్లయితొలగించండిఏ వాడనున్నా...తెలుగు వాడి, తెలుగు వాడిపోకుండా...తెలుగు 'వాడను' అనుకోకుండా, 'తెలుగువాడను' అనుకుంటూ...తెలుగు 'వాడిని' పెంచాలనుకుని,'తెలుగువాడిని' పెంచాలనుకునే...
తెలుగువాడి కోసం, ఈ బుజ్జాయి.....
మీ పిల్లలకు పరిచయంచేయండి....వెంటనే golibujji.blogspot.com బ్లాగులోకి వెళ్ళండి....లేదా బుజ్జాయి fb గ్రూప్ లోకి వెళ్ళండి.బుజ్జాయి కోసం పాటలు, పద్యాలు, కథలు పిల్లలతో చెప్పించి పంపించండి.
సుకవి మిత్రులు గోలి హనుమచ్ఛాస్త్రి గారికి శుభాభినందనలు!
తొలగించండిబుజ్జాయి బ్లాగునకు పోవలెనన్నచో...
బుజ్జాయి పై క్లిక్ చేయవలెను.
సులభమైన మీటను చూపిన కవిమిత్రులు మధుసూదన్ గారికి ధన్యవాదములు.
తొలగించండివడ్డీకి ధనము నిచ్చిన
రిప్లయితొలగించండిరెడ్డియె పరమాప్తుడౌౌచు రేయింంబవలున్
గ్రుడ్డిగ గోరున్ వడ్డినె
వడ్డి యసలుకంంటె ముద్దు పరికింంపన్ .
చెడ్డతనంంబుంం జూపిన
బిడ్డడి సంంతానమన్న బ్రీతింంజూపు
న్నడ్డము జెప్పడుదేనికి
వడ్డియసలుకంంటె ముద్దు పరికింంపన్ .
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆర్యా
రిప్లయితొలగించండిశంకర గురు బోధ చంపెర నాదు బాధ. సంకటమూలు బపె సత్కవి త్రోవ జూపె ..శంకర..
పదముల కూర్పు గూర్చె భద్రత నొంద జేసె.సంధుల బాపి చూపె సరళములెన్నమనిపె..శంకర..
అన్వయమూను బలికె న,పె న న్ నిన్దృతుల గరపె. సంతత క్లిష్ట గరిమ సాధన జేయ నేర్పె ..శంక,..
ఉన్నది కాదనంగ నుక్తిని బూర్తిజేసె.ప్రశ్నల మూలములను భర్తీ జేయ జూపె..శంకర గురు..
This refers to our Guru.
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండి_/\_
తెడ్డని ప్రభుత్వ విధులకు
రిప్లయితొలగించండినడ్డపు దారిన డబ్బున కర్రులు జాచే
చెడ్డ యధికారుల కెపుడు
వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్"
ఆనదు వేతన మ్మెపుడు నయ్యది హక్కని పొంద గోరుచున్
మానరు బాహ్య వృత్తులను మానస మంతయు వాటి ధ్యాసయే
నీ నరులెక్కువైరి నిల నేడు ప్రభుత్వపు కార్యశాలలన్
గానఁగ వడ్డి ము ద్దసలు కంటెను లోకపు రీతి యిద్దియే
మడిపెల్లి రాజ్‍కుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కం.గడ్డిని సహితము వదలక
రిప్లయితొలగించండిదుడ్డునొసంగియు జనులను దోచు ఖలులకున్
నడ్డి విరుచునటు లుండెడి
వడ్డి యసలు కంటె ముద్దు పరికింపంగన్.
గుఱ్ఱం జనార్దన్ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బిడ్డల కన్నను మిన్నగ
రిప్లయితొలగించండిబిడ్డల సంతానమనిన ప్రియమును గూర్చున్
విడ్డూరంబుగ తాతకు
వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బిడ్డడు తిరుగగ నడ్డము
రిప్లయితొలగించండివడ్డీ గడ్డయిన దుడ్డు వారకఁ గొనినన్
బిడ్డడి తాతకు దాతకు
వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్
మానుము చింతలన్ని కొను మా ధన గుప్తిని నప్పు నింపుగం
బూని గృహమ్ము కట్టగ నపూర్వముగా యని పల్కి యిత్తురే
తానిఁ క నప్పుమొత్తమును దత్క్షణ మిచ్చెద నన్న నొప్పరే
కానఁగ వడ్డి ము ద్దసలు కంటెను లోకపు రీతి యిద్దియే
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
వడ్డికి వడ్డిని జేకొన
రిప్లయితొలగించండివడ్డి యసలు కంటె ముద్దు పరికింపంగన్
అడ్డముగ నెదుగ దలపకు
బిడ్డా! శాపములు దాకు పేదల దోచన్!
నిన్నటి నా పూరణను కూడా చూడ గోరుతాను. ధన్యవాదములు.
దానవులు వరము లందుచు
మానవ హింస తలబెట్టి మగువల జెఱుపన్
మానినుల గాచి దనుజుల
ప్రాణములను గొనెడు వాడు పరమాత్ముండౌ!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెడ్డికి ముద్దగు సేద్యము,
రిప్లయితొలగించండిగుడ్డికి ముద్దగు నెరువులు, గొప్పగ పండన్
వడ్డీ వ్యాపారి కెపుడు,
వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్!!
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దుడ్డన్నది గైకొనుచు
రిప్లయితొలగించండిన్నడ్డమ్ములు తొలగినంత నసలుకు తోడన్
వడ్డెననక చెల్లించెడు
వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వడ్డెననక'...? అది 'వడ్డి వెనుక చెల్లించడు' అనుకుంటాను.
ధన్యవాదములు గురువుగారూ! వడ్డెన యనుకోకుండ అనేభావంతో వ్రాశానండీ!
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు. వడ్డెన యనుకోకుండా అంటే బరువనుకోకుండా అసలుతో పాటు నొసఁగే వడ్డీ ముద్దను భావముతో వ్రాయటం జరిందండీ.
తొలగించండిగుడ్డిగ నిచ్చెడు రాయితి
రిప్లయితొలగించండిజిడ్డొద లెడుధర లకన్న చిరుయదనంబున్
దొడ్డగు లంచమె మక్కువ
వడ్డి యసలు కంటె ముద్దు పరికింపంగన్
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వదలును ఒదలు అన్నారు. జిడ్డు వదలు ధరలకన్న... అనండి.
గుడ్డిగ నిచ్చెడు రాయితి
తొలగించండిజిడ్డు వదలు ధర లకన్న చిరుయదనంబున్
దొడ్డగు లంచమె మక్కువ
వడ్డి యసలు కంటె ముద్దు పరికింపంగన్
గురువుగారు సవరించినాను, కృతజ్ఞతలు

వడ్డీ మెండుగ నిడుచో
రిప్లయితొలగించండివడ్డి యసలుకంటె ముద్దు, పరికింపంగన్
చెడ్డ యగు పెట్టుబ డయిన
వడ్డీతో పాటు యసలు స్వాహా స్వ్వాహా!!
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నరున కెల్ల..' అన్నచోట గణదోషం. సవరించండి.
వడ్డాదిరామచంద్రుడ!
రిప్లయితొలగించండివ డ్డీమరియెంతయగునొపట్టుకురారా
వడ్డీయిచ్చినచాలును
వడ్డియసలుకంటెముద్దుపరికింపంగన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వడ్డాదిరామచంద్రుడ!
రిప్లయితొలగించండివ డ్డీమరియెంతయగునొపట్టుకురారా
వడ్డీయిచ్చినచాలును
వడ్డియసలుకంటెముద్దుపరికింపంగన్
ఈ నెల జీతమెంత? యని యెంచడదేమిటొ
రిప్లయితొలగించండియింక్రిమెంటనన్
దానిఁ గుణించు కూడును ప్రధానముగా గణయించుచుండు ,ధ..
ర్మానికి వచ్చు సొమ్ములన మక్కువ యెక్కువ , చిత్రమౌ గదా !
గానగ వడ్డి ముద్దసలు కంటెను లోకపు రీతి యిద్దియే !!
మైలవరపు మురళీకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గడ్డమలా బెంచకు, మీ
రిప్లయితొలగించండివడ్డీ సరసంబునెపుడు వడ్డించకు, నా
కడ్డంబౌ |మీయూహల
వడ్డి యసలుకంటె ముద్దు పరికించంగా|
2.మానిని వేయపూలజడ మంత్రమ?కళ్ళ కుతంత్రమా? నదో
జ్ఞానమ?అంద చందమును జాగృతి జేసెడి మూల సూత్రమా?
కానని దాని మాటవిని కల్పన ప్రేమకు లొంగిపోవుటన్
గానగ ?వడ్డి ముద్దసలుకంటెను లోకపు రీతి యిద్దియే|

ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కానగవడ్డిముద్దసలుకంటెనులోకపురీతియిద్దియే
రిప్లయితొలగించండియౌననిజెప్పగాదగునునూర్మిళ!యిప్పటిరోజులింతియే
మానుముశంకలన్నిటిని,మానసమందునసంతసంబును
న్బూనుచువడ్డికాకసలుబూర్ణముజేయుముపూర్తిగానికన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. 'యౌనని జెప్పగా దగు సుహాసిని! యిప్పటి...' అనండి.
కానగవడ్డిముద్దసలుకంటెనులోకపురీతియిద్దియే
రిప్లయితొలగించండియౌననిజెప్పగాదగునునూర్మిళ!యిప్పటిరోజులింతియే
మానుముశంకలన్నిటిని,మానసమందునసంతసంబును
న్బూనుచువడ్డికాకసలుబూర్ణముజేయుముపూర్తిగానికన్
వీనులవిందగున్ వినగ వేతన మందియు లంచమిచ్చుచోఁ
రిప్లయితొలగించండిదానములిత్తురన్నయెడ తాతయుఁబ్రీతిగ పర్వుదీయడే
ఈనరులెల్లవేళలను యెన్నుదు రూరక వచ్చునేదియున్
కానఁగ వడ్డి ము ద్దసలు కంటెను లోకపు రీతి యిద్దియే"
గురువుగారూ,గణదోషము సవరించినాను, కృతజ్ఞతలు
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిసవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
వడ్డీ యన్నది మురిపెము
రిప్లయితొలగించండిదుడ్డు బెరుగ జేసెడిదగు దొడ్డ గుణమున
న్నడ్డంకు లెన్ని యున్నను
వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గుడ్డిగ నిచ్చెడు రాయితి
రిప్లయితొలగించండిజిడ్డు వదలుధర లకన్న చిరుయదనంబున్
దొడ్డగు లంచమె మక్కువ
వడ్డి యసలు కంటె ముద్దు పరికింపంగన్
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దొడ్డగ ప్రేమింతురు తమ
తొలగించండిబిడ్డల నంతకును మించి ప్రేమింతురుగా
బిడ్డల సుతులను యేలన
వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్
దొడ్డగ ప్రేమింతురు తమ
తొలగించండిబిడ్డల నంతకును మించి ప్రేమింతురుగా
బిడ్డల సుతులను యేలన
వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సుతులను+ఏలన' అన్నపుడు యడాగమం రాదు. 'సుతులనె యేలన' అనండి.
ఆర్యా
రిప్లయితొలగించండిశంకర గురు బోధ చంపెర నాదు బాధ. సంకటమూలు బపె సత్కవి త్రోవ జూపె ..శంకర..
పదముల కూర్పు గూర్చె భద్రత నొంద జేసె.సంధుల బాపి చూపె సరళములెన్నమనిపె..శంకర..
అన్వయమూను బలికె న,పె న న్ నిన్దృతుల గరపె. సంతత క్లిష్ట గరిమ సాధన జేయ నేర్పె ..శంక,..
ఉన్నది కాదనంగ నుక్తిని బూర్తిజేసె.ప్రశ్నల మూలములను భర్తీ జేయ జూపె..శంకర గురు..
This refers to our Guru.
ఏనెల తప్పకుండగ మహీతల మందున మానవుల్ సదా
రిప్లయితొలగించండిహీనులు వేతనమ్మును గ్రహించిననేమిల వేనవేలుగా
దానముగాను లంచమును దండిగ ఫొందుట యేలనో యనన్
కానఁగ వడ్డి ము ద్దసలు కంటెను లోకపు రీతి యిద్దియే
విరించి గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
వడ్డీ కట్టుట నరకము
రిప్లయితొలగించండినడ్డి విరుగుయడ్డము పడి నలుగురునవ్వన్
దుడ్డులుఅప్పిచ్చువాడికి
వడ్డిఅసలుకంటెముద్దుపరికింపంగన్
చేపూరి శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విరుగు నడ్డము పడి' అనండి. మూడవపాదంలో గణదోషం. 'దుడ్డప్పిచ్చెడువానికి' అందామా?
వడ్డీ కిచ్చిన యసలునె
రిప్లయితొలగించండియడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
జిడ్డుగ నెలనెల పొందెడి
వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్
బిడ్డకు బుట్టిన నలుసును
నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
గ్రుడ్డినటంచునె తాతయ
వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్
భాగవతుల కృష్ణారావు గారూ,

రెడ్డి యొసంగిన సొమ్మును
రిప్లయితొలగించండిగుడ్డిగ గైకొన్న జనులు గుబులుపడంగన్
రెడ్డియు ముదమందెనదిగొ
వడ్డియసలు కంటె ముద్దు పరికింపంగన్.
బిడ్డల కన్నను జగతిన
బిడ్డల బిడ్డలె మమతల పాశములందు
న్నడ్డుపడుచు బంధింపన్
వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నేనొక నయ్యటీని కడు నేర్పున జేరగ సైక్లు కొంటినే
రిప్లయితొలగించండిదానికి నల్బదేళ్ళనగ దండిగ పోరుచు కొడ్కు జేరగా
వానికి మారుతిన్నొకటి పండుగ జేయుచు గిఫ్టునిచ్చితిన్
కానఁగ వడ్డి ము ద్దసలు కంటెను లోకపు రీతి యిద్దియే!
(From IIT Kharagpur with Love)