9, సెప్టెంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2138 (పాలం జూడంగ పిల్లి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
లేదా...
"పాలం జూచిన పిల్లి పాఱె భయసంభ్రాంతుల్ మదిన్ గ్రమ్మఁగన్"
నా పూరణలు.....

బాలయ్య పెట్టె మరిగెడు
పాలను; జవిచూచె నుడుకు బాధించఁగఁ దా
గోల యొనర్చెను బిట్టుగ;
పాలను జూడంగ పిల్లి భయపడి పారెన్.

కాలాతీతము గాక యుండుటకు సంకల్పించి యొక్కం డొగిన్
దాలిన్ పాలను వేఁడి చేయఁగనె చెంతన్ బెట్టఁగా వెంటనే
క్రోలం బోవఁగ మూతి కాల నపు డారోగ్యంబు జింతించుచున్
పాలం జూచిన పిల్లి పారె భయసంభ్రాంతుల్ మదిన్ గ్రమ్మఁగన్.
( దాలిన్ = పిడకల పొయ్యి మీద)

95 కామెంట్‌లు:

  1. కాలిన మూతిని తలచుకు
    నాలుకతో తడుము కొనుచు నడయా డంగన్
    వాలము భీతిగ ద్రిప్పుచు
    పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్

    రిప్లయితొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పాలను వెదుకుచు గదిలో
    వ్రాలిన పిల్లి నలికిడికి పర్విడి గదిలో
    పాలార్చినట్టి వగు దీ
    పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్.

    (వ్రాలిన = దుమికిన; పాలార్చు = వెలిగించు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పిల్లి యలికిడికి' అనండి.

      తొలగించండి
  3. మూలన దాచినపాలను
    గోలనుసేయకను పిల్లి గుడువగ రాగా
    కేలన బెత్తము తో'గో
    పాల'ను జూడంగఁ పిల్లి భయపడి పారెన్

    గోపాల వ్యక్తి పేరు

    రిప్లయితొలగించండి
  4. మేలున్ గూర్తుమటంచు బాలికను తామే సాకగానొప్పుకోన్
    కాలంబొక్కట నొక్కరీతి గనకన్ గాసిల్లె నాతల్లిదే
    జాలిన్ జూపియు వేశ్యగా మనుపునీ సౌజన్యముల్ వెచ్చనౌ
    పాలంజూసియు పిల్లి పారె భయసంభ్రాంతుల్ మదిన్ గ్రమ్మగన్

    రిప్లయితొలగించండి
  5. బాలలు మేలుల గూర్తురు
    పాలన్ మరిగించి ఉష్ణ పాత్రం గొని స
    ల్లీలన్ బిల్లికి నిడిరా
    పాలన్ జూడంగ పిల్లి భయపడి పారెన్

    రిప్లయితొలగించండి
  6. ల్లీలను బిల్లికినిడిరా పాలను జూడంగ పిల్లి భయపడి పారెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పాలందీరున దెల్లగా వెలయు పీపాలో కషాయమ్మునన్
    పాలన్నట్టి యపోహతో దిరిగి పీపా నొ0చి దాఁబీల్చి ఛీ
    పాలేగావని గుర్తెరింగి వెడతో వాలమ్ము డిగ్గించి పీ
    పాలంజూచిన పిల్లి పారె భయ సంభ్రా0తుల్ మదిన్ గ్రమ్మనన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ యీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పాలం బోలుచు దెల్లగా...' అనండి.

      తొలగించండి

  8. గ్రోలెను జిలేబి కవితల
    బోలిన సుమధు కలబోత బోసిన పాలన్!
    చాలీ బాధా యనుచున్
    పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      'క్రోలెను' అనండి. 'సుమధు కలబోత' అనడం దుష్టసమాసం. '...బోలిన తీపి కలబోత' అనండి. అలాగే 'బాధ యటంచున్' అనండి.

      తొలగించండి
  9. పాలు న్నేతులు భోజ్యవస్తుతతులం బల్మారు దండించినన్
    నేలం ద్రోతువు, పాడుచేసెదవిట న్నీకంత్యకాలం బిదే
    లే లెమ్మంచును వేత్రహస్తులయి మళ్ళించంగ నవ్వారి కో
    పాలం జూచిన పిల్లి పాఱె భయసంభ్రాంతుల్ మదిన్ గ్రమ్మగన్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  10. తలపై చిందరవందర
    బలమై కుడిచేతి కఱ్ఱ బాగుగనుండన్
    పిలవానిభీకరపుజుల
    పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్.

    రిప్లయితొలగించండి
  11. సుకవి మిత్రులు శంకరయ్య గారికి నమస్సులు! మీ రెండు పూరణములు ప్రశస్తముగా ఉన్నవి. అభినందనలు!

    మొదటి పూరణలో...ఒనర్చెను...నకు బదులుగా...ఒనర్చుచు...అనిన మరింత బాగుండు ననిపించుచున్నది.

    రిప్లయితొలగించండి
  12. పాలను గ్రోలగ పిల్లియు
    బేలగ నొక నిల్లు జేరి భీతిగ వెతకన్
    మ్రోలన శునకాలాలా
    పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      శునకాల ఆలాపాలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బేలగ నొక యిల్లు...' అనండి.

      తొలగించండి
  13. గోలంజేయుచువంటశాల విడకన్ గుప్తంబుగా దిర్గుచున్
    బాలన్నేతుల నిర్భయత్వముననా పంతంబు దీపింపగా నేలంగూల్చుచునుండ కోపమనమున్నిల్చున్న రాజేశునిన్
    బాలంజూచిన బిల్లిపాఱె భయసంభ్రాంతుల్ మదింగ్రమ్మగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగుంది. కాని ద్రుత సరళాదేశాలతో పాలు బాలు కావచ్చు. కాని మీరు 'బాల' అన్న పదాన్ని ప్రయోగించారు. అలా చేయరాదు.

      తొలగించండి
  14. మాలిమితో వచ్చెనచట
    పాలను జూడంగ పిల్లి; బయపడి పాఱెన్
    త్రోలగ నచ్చటి నుండియు
    మూలన నక్కెను బిరబిర
    మోమునుదాచెన్!

    రిప్లయితొలగించండి
  15. లీలగ సవ్వడి వినఁబడ
    వాలము నూపుచు నెలుకలఁ బట్టగ నుండన్
    గ్రాలుచుఁ గలుగున్ విడు స
    ర్పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. బాలాకుమారి 'క్యాట్వాక్'
    మేలుగ నేర్వంగదలచి మేడను గదిలో
    వాలుగ నడవగ పలులో
    పాలను జూడంగ 'పిల్లి' భయపడి పాఱెన్.

    రిప్లయితొలగించండి
  17. లీలంబిల్లుల బెంపకంబు జరిగెన్ లెక్కించి తూకంబుగా
    గోలంజేసెడుమూషికాల కొఱకై కోపించి రాజేంద్రుడా
    పాలంపంచుటకానతీయ కవిగా పన్నన్సదాలోచనన్
    పాలంజూచిన బిల్లిపాఱె భయసంభ్రాంతుల్ మదింగ్రమ్మగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      పాలను చూచి పిల్లి పారిపోయిందనగానే తెనాలి రామకృష్ణునికి రాయలు పెంచమని ఇచ్చిన పిల్లి కథ వెంటనే గుర్తుకు వస్తుంది. నేను ఆ సందర్భంతో పూరణకు యత్నించాను కాని సపలత పొందలేదు.
      మీ రాకార్యం సాధించారు. బాగుంది మీ పూరణ. కథ పద్యంలో చక్కగా ఒదిగిపోయింది. అభినందనలు.

      తొలగించండి
  18. సలసలగాగుచునుబికిన
    పాలనుజూడంగపిల్లిభయపడిపారెన్
    బాలా!చూచితెనీవును
    వాలమునున్ముడుచుకొనుచువడివడితోడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. కాని మొదటి పాదంలో ప్రాస తప్పింది. సవరించండి.

      తొలగించండి
  19. మాన్యులు శంంకరయ్య గారికి కృృతజ్ఞతలు. నా పైై వృృత్తంంలో ...పాలన్ అనే పదము.ద్రుతము ముంందున్నదని "బాలంం" అన్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను బాల (అమ్మాయి) అనే అర్థంలో ప్రయోగించారనుకున్నాను. మన్నించండి.

      తొలగించండి
  20. గ్రోలన్ వచ్చెను పరుగిడి
    పాలన్ జూడంగ పిల్లి , భయపడి పాఱెన్
    మూలన పడియున్న ముతక
    చేలమ్ముల గొరికెడెలుక శీఘ్రము తోడన్

    రిప్లయితొలగించండి
  21. శా.క్రోలన్ వచ్చెను పిల్లి యొక్కటది తా గోపాలురింటన్ వడిన్
    ఆలించెన్నది చుట్టు ప్రక్క రవముల్ ఆపైన తాజూడగా
    మూలన్ గాగల పొయ్యిమీద పొగలన్ మ్రోతెక్కు చుండంగ నా
    పాలంజూచిన పిల్లి పాఱె భయ సంభ్రాంతుల్ మదిన్ గ్రమ్మరన్.
    దోషములున్నచో సరి చేయ గలరని మనవి. దీనిలో పాల్గొనటం వల్ల మాకు తెలుగు వ్యాకరణం లోని తెలియని మారుమూల విషయాలు నేర్చుకొన గల్గుతున్నాము. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రవముల్ ఆపైన' అని పద్యంలో విసంధిగా వ్రాయకూడదు (నిజానికి పద్యం మధ్య ఎక్కడా అచ్చులు రాకూడదు. అవసరమైన యడాగమ, నుగాగమ సంధులు చేసికోవాలి). 'చుట్టు ప్రక్కల రవ మ్మాపైన..' అనండి.

      తొలగించండి
  22. గోలను జేయక పిల్లియె
    పాలను ద్రాగంగ రాగ వాసము నందున్
    కౌలేయకముల భయ రూ
    పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్!!!

    కౌలేయకము= శునకము


    లీలయె మరిగిన పాలను
    మూలన బెట్టంగ త్రాగ మూతియె గాలన్
    కాలము గడిచిన మరువక
    పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్!!!

    రిప్లయితొలగించండి
  23. కాలువ గట్టున నేగుచు
    మేలుగ మూషికములఁ గని మ్రింగగ నెంచన్
    మ్రోల బుసలు కొట్టెడు స
    ర్పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్


    కాలుం డేవిధి జీవ రాశులకు సంఘాతమ్ము కల్పించునో!
    మూలం బీవన మంచు యెంచి సనె సంపూర్ణంపు భోజ్యమ్ముకై
    కాలాతీతము గాగ నా యడవినిం గాలుండు శార్దూలముం
    బాలం జూచిన పిల్లి పాఱె భయసంభ్రాంతుల్ మదింగ్రమ్మఁగన్

    [పాలు=సమీపము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
    3. సుకవులు కామేశ్వర రావుగారూ...నమస్సులు! మీ రెండు పూరణములు చాల బాగున్నవి. అభినందనలు!

      రెండవ పూరణం రెండవ పాదంలో..."వనమంచు యెంచి" అన్నారు. ఇక్కడ యడాగమం రాఁగూడదు గదా! దీనిని "వనమంచు నెంచి..." అనఁగలరు.
      అట్లే...తృతీయపాదాంతాన...శార్దూలముం బాలన్...అన్నారు. దీనిలో అన్వయం సరిగాఁ గుదిరినట్లు అనిపించుటలేదు. పరిశీలించఁగలరు.

      తొలగించండి
    4. మధుసూదన్ గారు నమస్కారములు. అవునండి యది ప్రమాద పతితము. తెలియజేసినందులకు కడుంగడు ధన్యవాదములు. సవరించితిని.
      శార్దూలమును తన పాలను( సమీపమున) జూచిన యన్న భావములో వ్రాసితిని. “శార్దూలమున్” అనిన “శార్దూలమును” అని అనుకోవచ్చునా ? తెలుప గోర్తాను. వ్రాసినప్పుడమానముతోనే వ్రాసాను.

      తొలగించండి
    5. యీ సవరణను పరిశీలించండి.

      కాలుం డేవిధి జీవ రాశులకు సంఘాతమ్ము కల్పించునో!
      మూలం బీవన మంచు నెంచి సనె సంపూర్ణంపు భోజ్యమ్ముకై
      కాలాతీతము గాగ నా యడవినిం గాలుండు వ్యాఘ్రంబునుం
      బాలం జూచిన పిల్లి పాఱె భయసంభ్రాంతుల్ మదింగ్రమ్మఁగన్

      తొలగించండి
  24. పాలెమున రైతు పెంచెను
    పాలను బోసి యొకపిల్లి బల్ ప్రేముడితో
    వాలకముఁగని తెగడ కో
    పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  25. పాలను త్రాగుట కొఱకై

    వేళకు ప్రతిరోజు వచ్చు పిల్లిని దరుమన్

    పాలను మరిగించెను నా

    పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెను.

    రిప్లయితొలగించండి
  26. అటునిటు వంటింట నడయాడుచు పిల్లి
    వేత్రహస్తయైన పిల్ల కనులబడకుండ
    పాలనుకని నాపాలపడుటెట్లోయని చింతించుచు
    వేడిపాలనుజూడంగ పిల్లి భయపడిపారెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వామరాజు నాగరాజు గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ భావం బాగున్నది. కాని ఇది ఛందోబద్ధమేనా? అయితే ఏ ఛందస్సు?

      తొలగించండి
  27. అయ్యో శంంకరయ్య గారు. అలా అనద్దు. వివరణ ఇవ్వని పొరబాటు నాది.మీరే క్షమింంచాలి.

    రిప్లయితొలగించండి
  28. పాళెంబున్ కొను యిచ్ఛతోడుతను కాపాడెన్ పయస్యమ్ము నో
    పాలెమ్మందున రైతుబిడ్డ యిడుచున్ భక్ష్యమ్ములన్ నిత్యమున్
    సోలంబందున చిక్కితా మసలుచున్ శోద్యమ్ము గా కాపు కో
    పాలంజూచిన పిల్లి పాఱె భయసంభ్రాంతుల్ మదిన్ గ్రమ్మగన్
    పాళెముః కావలి, పయస్యముః పిల్లి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  29. ఏలన్ గాంచెనొ గాని వచ్చెనిటు తానిష్టాను వర్తమ్ముయై
    పాలన్ జూచిన పిల్లి , పాఱె భయసంభ్రాంతుల్ మదిన్ గ్రమ్మగన్
    ప్రాలన్ జేలపు భేదమెంచక సదా భక్ష్యమ్మునే జేసెడిన్
    న్నాలంబోధర వాహనమ్ములవి యాహాకారముల్ జేయుచున్

    రిప్లయితొలగించండి
  30. జాలిం జూపని వేటకుక్కలట నాశ్చర్యాన గన్పించ?రూ
    పాలం జూచిన పిల్లిపాఱె భయ బ్రాంతుల్ మదిన్ గ్రమ్మగన్
    కాలంబుంచినశత్రు తత్వమది|సంకల్పంబు క్షుద్బాదయే
    మూలంబందున ముఖ్య సూత్రమదియే ముంచెత్తు ప్రాణాలనే|
    2.మూలము దెలిసిన దయ్యును
    జాలిగ నౌధార్యముంచ?జాగ్రత్తనుచున్
    వాలిన మనసే దెలుపగ
    పాలను జూడంగ పిల్లిభయపడి పాఱెన్|

    రిప్లయితొలగించండి
  31. కాలము మారగ, కల్తీ
    పాలను సేవించి, నంత బాధల నొందన్
    నీ లోకమునే నమ్మక
    పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్

    రిప్లయితొలగించండి
  32. బాలలు మేలుల గూర్తురు
    పాలను మరిగించి వేడిపాత్రను గొని స
    ల్లీలను బిల్లికి నిడి రా
    పాలను జూడంగ పిల్లి భయపడి పారెన్

    రిప్లయితొలగించండి
  33. ఆర్యా
    ఇవి సమస్యలౌనా చూడండి
    అవయవములె మనికి రిపులు అరవిందాక్షా లేదా
    మనయవయమ్ము లిమ్ముగ నమానుషపుం రిపులౌట నిక్కమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగున్నవి. చిన్న సవరణ...
      అవయవము లమానుష రిపు లరవిందాక్షా!
      వృత్తపాదంలో సవరణ లేదు...

      తొలగించండి
  34. మిత్రులందఱకు తెలంగాణ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు!

    లీలన్ దొంగిలు పాలు వెన్నలు వెసన్ లేఁబ్రాయఁపుం జోర మా
    ర్జాలమ్మున్ దగఁ బట్ట నెంచు గృహపున్ సంసారి నిక్షిప్త స
    చ్ఛైలీ యుక్త విశిష్ట శిల్పి రచిత శ్వానంపు యుగ్మంపు శి

    ల్పాలం జూచిన పిల్లి పాఱె భయసంభ్రాంతుల్ మదిన్ గ్రమ్మఁగన్!

    రిప్లయితొలగించండి
  35. పాలాక్షాత్మజుడైన శ్రీ గణపతిన్ భావోన్నతిన్ దెచ్చియున్
    చాలా గొప్పగ బెట్టి నారు గనినన్ సమ్మోదమౌ, వేల దీ
    పాలం జూచిన పిల్లి పాఱె భయసంభ్రాంతుల్ మదిన్ గ్రమ్మఁగన్
    మేలైనట్టి వృషమ్ము మెక్కగ నటన్ మేకొన్నయానాసి యే .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మేకొన్న యానాసి యే'...?

      తొలగించండి
  36. గురుమూర్తి ఆచారి గారి పూరణ....
    { సృష్టి అ౦దమైనది మరియు భయ౦కరమైనది. భయ౦కరమైన దెటు లనగా... ఒక జీవిని చూచి ఇ౦కొక జీవి భయపడుచునే బ్రతుక వలసి ఉ౦టు౦ది. }

    బాలల్ నాగుల చౌతి, భక్తిమెయి నా వల్మీక శైల౦బు పై
    పాలన్ బోయుచు ను౦డ , ద్రాగు కొరకై ప్రత్యాశతో లేచు స
    ర్పాలన్ జూచిన పిల్లి పారె - భయస౦భ్రా౦తుల్ మదిన్ గ్రమ్మ నా
    భీల౦ బౌ గద సృష్టి ! జీవి యొక జీవిన్ గా౦చి భీతిల్లెడిన్ ! !

    { ప్రత్యాశ = అడియాస, దురాశ; ఆభీలము = భయ౦కరము }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చవితిని చౌతి అనడం సాధువు కాదనుకుంటాను.

      తొలగించండి
  37. మూల నొదిగి నిశి రాత్రిని
    పాలను త్రాగంగ కుండ ప్రక్కకు రాగా
    నాలుగు దిక్కుల గల స
    ర్పాలనూ జూడంగ పిల్లి భయపడి పాఱెన్

    పాలను కడవల నుంచగ
    గ్రోలఁగ దరి జేర నచట కుత్తుక కోయ
    న్నాలుగు దిక్కుల గల రం
    పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  38. పాల మరుగ గాచి యును తె
    నాలి కవీశ్వరుడు పెట్ట నాల్కయె కాలెన్
    పాల నితరులే తెచ్చిన
    పాలను జూడంగ పిల్లి భయపడి పారెన్
    (తెనాలి రామకృష్ణుడు పిల్లికి మరగ కాచిన పాలు పట్టగా పిల్లి భయపడి ఆ పైన ఇతరులు చల్లని పాలు తెచ్చినా తాగటం మానేసిన కథ అందరికీ తెలిసే ఉంటుంది . పాలు తాగే పిల్లులు ఎలుకలని పట్టకండా పాలతోనే ఆకలి తీర్చుకున్నాయి. రామకృధ్ణుని పిల్లి పాలు తాగదు కనుక ఎలుకలని పడుతుంది)

    రిప్లయితొలగించండి
  39. చేలో నెల్కల మందు పెట్టగనె చచ్చెన్ మూషికమ్ముల్ క్షుధా
    జ్వాలన్ సైపగ లేని పిల్లి కడు నాశన్ జేరె భక్షింపగా
    నాలోచించుచు వాసనన్ గనగ నా యాహారమన్ దేవొ లో
    పాలన్ జూచిన పిల్లి పారె భయ సంభ్రాంతుల్ మదిన్ గ్రమ్మగన్
    (మందు పెట్టగా చచ్చిన ఎలుకల వాసనని చూచి పిల్లి తినకుండా భయ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధనికొండ రవిప్రసాద్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఆహారమం దేవొ' అన్నచోట టైపాటు...
      dhanikonda లో i లోపించింది.

      తొలగించండి
    2. మీరు సరిచేసినట్లు భావిస్తున్నాను. నాకిక్కడ ఎడిటింగ్ రాదు "దేవొ లోపాలన్" అనేదే నా ఉద్దేశం. ధన్యవాదం.

      తొలగించండి
    3. నేను చెప్పిన టైపాటు `ఆహారమన్ దేవొ'... అనుస్వారానికి బదులు ద్రుతాన్ని టైపు చేశారని!

      తొలగించండి
  40. గురువు గారికి నమస్కారములు
    యానాసి >>>> స్పేస్ దోషం జరిగింది యా నాసి --పిల్లి
    మేకొన్న > పూనుకొన్న భావము .. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  41. గండూరి వారూ,
    సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  42. కం. బాలకుడొక డలికిడి విని
    మేలుకొనియు వేసినట్టి మెరుపుల కాంతిన్
    బోలిన గది విద్యుద్దీ
    పాలంజూడంగ పిల్లి భయపడి పాఱెన్.

    రిప్లయితొలగించండి
  43. ఉత్తేజంబున సర్వపక్షములునుగ్రోత్సాహమందుండ ప
    శ్చాత్తాపంబును జెందనట్టి తరినాశ్చర్యంబుగా స్థైర్యవ
    చ్చిత్త శ్రీమతి యిందిరన్విజితగా జేయంగ నొక్కండటన్
    మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్"

    రిప్లయితొలగించండి
  44. పాలం ప్రీతిగ త్రాగునట్టి ఘనుడా పాలేరు లాలూడటన్
    కాలం మూడగ గేదె మేయు విలువౌ గ్రాసమ్ము కాజేయగా
    జైలే నాతని గేహమౌచు జడిసెన్ జంజాట మీతీరునన్ 👇
    పాలం జూచిన పిల్లి పాఱె భయసంభ్రాంతుల్ మదిన్ గ్రమ్మఁగన్

    రిప్లయితొలగించండి