27, సెప్టెంబర్ 2016, మంగళవారం

దత్తపది - 98 (విల్లు-అమ్ము-కత్తి-గద)

విల్లు - అమ్ము - కత్తి  - గద
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
భారతార్థంలో నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

78 కామెంట్‌లు:

 1. రాయభార ఘట్టంలో దుర్యోధనునితో కృష్ణుని పలుకులు...

  ప్రభ'విల్లు'న్ నవశోభ లిద్ధరణి రారాజా హితం బెంచి యీ
  సభలో పెద్దలు తల్లు 'లమ్ము'దితలున్ సంతోష మందంగ నీ
  వభయం బందగఁ 'గత్తి'రించవలె నన్యాయంపు నీ వైరమున్
  విభవోపేతముగా వెలుంగు 'గద' సంప్రీతిన్ గనన్ రాజ్యమే.

  రిప్లయితొలగించు

 2. యుక్తి పరిఢవిల్లు కొనెడి శక్తి నొప్పి
  రాజకీయమ్ము రంజిలు రాగమొప్పి
  వైరి వర్గాల కత్తిన పోరు నందు
  బరగి నడిచెడి కథ గద భారతమ్ముు!

  అత్తు=కలుగు

  రిప్లయితొలగించు
 3. పరిఢ విల్లును రాజ్యము పాండు సుతుల
  తనరి కలిసుండి సగపాలు దమ్ము లేక
  కపట జూదము నోడించి కత్తి గట్టి
  దోచె గదదుష్ట బుద్ధిని దురిత మనక

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ ప్రయత్నం ప్రశంసనీయం. పద్యం బాగుంది.
   'అమ్ము' పదాన్ని ప్రయోగించలేదు (దమ్ములో అమ్ము లేదు). 'కత్తి' పదాన్ని అన్యార్థంలో ప్రయోగించాలి కదా!

   తొలగించు
 4. తే.గీ.భారతమ్మున గవనము పరిఢవిల్లు
  పొలుపు మీరు వర్ణనలవి పుష్కలమ్ము
  ఇంపు గలిగించు మన కత్తిల్లు వలెనె
  వీనులకు విందగును గద ! వినిన యంత

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసనీయం. పద్యం బాగుంది.
   పుష్కలమ్ములో 'అమ్ము' లేదు.

   తొలగించు
 5. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కలతలవలన ప్రభవిల్లు కష్టములను
  మత్సరమ్ములు చేకూర్చు మఱకువలను
  మోస మాయా కత్తియముల ముఱకములను
  తెలుపునుగద భారతమది తెల్లముగను.

  (మఱకువ = దుఃఖము; కత్తియము = వరుస; ముఱకము = అతిశయము)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసనీయం.
   'మత్సరమ్ము'లో 'అమ్ము' లేదు. 'మాయా కత్తియము' లన్నచోట గణదోషం. అక్కడ దుష్టసమాసం కూడా. 'మోసముల కత్తియమ్ముల ముఱకములను' అనండి. ఇందులో 'అమ్ము'కూడా వస్తుంది.

   తొలగించు

 6. యుద్ధము చేయనసక్తత తెలుపుచు అర్జునుడు శ్రీ కృష్ణుని తో !


  హరివిల్లువలె మనమ్మున
  సరళంబవ్వవలెను గద సఖుడా ! కృష్ణా !
  గరళంబు కత్తికట్టుట!
  శరముల వేయగ మనంబు సరియన లేదే !


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   'హరివిల్లు'లో విల్లు, 'కత్తి' పదాలను స్వార్థంలోనే వినియోగించారు. 'మనమ్మున'లో అమ్ము లేదు.

   తొలగించు
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  విల్లు చేబూని విజయుడు పెచ్చుమీఱి
  అమ్ము లొదులుచు జూపిన యద్రిరూపు
  కత్తితో మాద్రి కొడుకుల కదన వీక
  గదను బట్టిన భీముని గర్జితమ్ము
  ధర్మ మొదలని ధర్మజు తత్త్వ గుణము
  పాపుల నరకించు మురారి పదురు దనము
  కాంచ వచ్చును కురుక్షేత్ర కదనమందు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
   దత్తపదాలను స్వార్థంలోనే వినియోగించారు. 'వదలుచు, వదలని'లను 'ఒదులుచు, ఒదలని' అన్నారు. 'కదన వీక'..? 'కురుక్షేత్ర' అన్నచోట గణభంగం.

   తొలగించు
 8. P.Satyanarayana
  పగల సెగలవెల్ల పరఢవిల్లును (గృ)కృష్ణు
  నమ్ముకొన్న వారి ననుసరించు
  కత్తిమీది సాము గద జీవనమ్మన(న్న)
  బ్రతుకు బాట జూపు భారతమ్ము!
  P.Satyanarayana
  పగకు మారు స్నేహ పరిధి పరిఢవిల్లు
  "పాకు"(Pakistan}నమ్ముకొన్న వగల సెగలె
  భారత కథ గద భద్ర పాలన ‌సూక్తి
  కత్తిగట్ట వలయు ఖలుల దరుమ P.Satyanarayana

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసనీయం.
   'నమ్ముకొన్న'లో అమ్ము లేదు. 'కత్తి'ని స్వార్థంలో వినియోగించారు.

   తొలగించు
  2. ఆర్యా. P.Satyanarayana
   కత్తిమీది సాము..కష్ట సాధ్యమైన పని..జాతీయం..పదాలకు అదే అర్థం ఉండ కూడదుగదా?
   కత్తిగట్టు..పోరాటానికి సిద్ధ పడు......" " " " " " " ?
   Idioms ఫక్కీలో నడిచితిని.సందేహం తీర్చండి
   2వ పూరణ లో 3వ పాదంమొదట"భరత గాథయె గద భద్ర పాలన సూక్తి" గా సరి జే‌సుకున్నాను.ఇక గణ దోషం తొలగింది. P.Satyanarayana

   తొలగించు
  3. పగల సెగలవెల్ల పరఢవిల్లు నీతి
   ‌నమ్ముకొన్న వారి నణగద్రొక్క. అంటే సరి పోతుంది గదండీ.
   P.Satyanarayana

   తొలగించు
 9. కీచకుడు సుధేష్ణను హెచ్చరిస్తున్నట్టూహించి

  అమ్ముదిత నీదు చెలికత్తియ గద నాదు
  మదిని దోచె, నాదరికంపు మరువ బోకు
  సిరులు ప్రభవిల్లు రాజ్యము సింహబలుని
  భిక్ష యనుచునో సోదరీ! వేచి యుందు.

  రిప్లయితొలగించు
 10. ఉద్భవిల్లు దుర్యోధనుడుల్లసిల్ల
  కత్తిరుగులేని వస్త్రాపహరణమెంచె
  గద ద్రుపదజాత మొరఁబెట్టి కర్రిఁ గొలువ
  నమ్మునిజనవంద్యుండు కాపాడెనంత.

  పుట్టుటతోనే ఊరకుండక ద్రౌపదీ వస్త్రాపహరణము చేసి చావు కొని తెచ్చుకున్నాడు. వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్థింపగా శ్రీకృష్ణుడామెను కాపాడినాడు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు. (ఎంతైనా అవధాను లనిపించారు!)

   తొలగించు
 11. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  అ మ్ము కొ నె ద ను సొ౦పుల నన్ని కొ ను మ

  నన్ను కొ ను మ , తాళగ లేను | నిన్ను గా౦చ

  నుద్భవిల్లు గద ప్రణయ మే యువిద కైన |

  వలపు కత్తియ దరిజేర , వా౦ఛ దీర్చు

  వాడె పురుషుడు | లేనిచో వాడు ష౦డు

  డగు నని పలికె నూర్వశి యర్జును గని

  { కొనుమ = కొని వేయుమ , చేకొనుమ :
  ష౦డుడు = నపు౦సకుడు : }
  ి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించు
 12. క్రొవ్విడి వెంరాజారావు:

  మోసముల వల్ల ప్రభవిల్లు మోదులాట
  సోదరుల హృదయమ్ముల సురుగు నీర్ష్య
  కైపునమరని పలుకుల కత్తియమ్ము
  తెలుపునుగద భారతమది తెల్లముగను.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 13. గుఱ్ఱం జనార్దన రావు గారి పూరణ.....

  భారతమ్మున గవనము పరిఢవిల్లు
  అమ్మురహరియె నడిపించు నద్భుత కథ
  ఇంపు గలిగించును మనకత్తిల్లువలెనె
  వీనులకు విందగును గద వినిన యంత.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 14. వైరి వర్గాలు కత్తిన బోరు సలుప
  యుక్తి పరిఢ విల్లు విధము ముక్తి కొరకు
  నొకరు మించి న మఱి యొక రుల్లమలర
  రాజ కీయమ్ము జేయుచు రాణకెక్క
  వీర పురుషుల కధగద భారతమ్ము

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కత్తి' స్వార్థంలో ప్రయోగించారు.

   తొలగించు
 15. అమ్ముదిత సుభద్ర కడుఁ బ్రి
  యమ్ముగఁ, గూడి చెలికత్తియల, సేవించన్
  సమ్మతి సంయమి హృదయపు
  రెమ్మల ప్రేమ సుమములు పరిఢవిల్లు గదా!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   ఆంగ్లపదాలను వాడడం నాకంతగా ఇష్టం ఉండదు. కాని మీ పూరణ చూశాక ఈ ఒక్క వాక్యం అనాలనిపిస్తున్నది.
   "Hats off to you!"

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
   ఆంగ్ల భాష నాకు చాలా ఇష్టము. కానీ తెలుగు సాహిత్యములో వాడను.

   తొలగించు
 16. పాండవుల్ తమ యజ్ఞాత వాసమునకు

  వివిధ వేషంబులందుద్భ విల్లుచునట

  చేరిరి గద విరాట్రాజు చెంతనపుడు

  నమ్ముదిత' కృష్ణ'చెలి కత్తియగ జేరె

  భట్టుమూర్తిగ ధర్మరాజిట్టె మారె

  వంట వాడిగ భీముడు వలలుడయ్యె

  నర్జునుండు బృహన్నల యయ్యె తుదకు

  నకుల, ‌సహదేవులశ్వ శాలకును కుదిరె.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గద'?... 'భట్టుమూర్తిగ ధర్మరాజు'లో గధ ఉంది, మనకు కావలసినది గద.
   నాల్గవ పాదం చివర గణదోషం. 'చెలికత్తియగను జేరె' అనండి.

   తొలగించు
  2. శంకరయ్య గురువు గారికి ధన్యవాదములు.
   చెలికత్తియగను...టైపాటువల్ల ను లేదు.
   3వ పాదంలో చేరిరి గద...లో.గద...
   ఉన్నదండీ.

   తొలగించు
  3. శంకరయ్య గురువు గారికి ధన్యవాదములు.
   చెలికత్తియగను...టైపాటువల్ల ను లేదు.
   3వ పాదంలో చేరిరి గద...లో.గద...
   ఉన్నదండీ.

   తొలగించు
 17. గు రు వ ర్యు ల కు ప ద న మ స్కా ర ము లు

  మ రి యు ధ న్య వా ద ము లు

  రిప్లయితొలగించు
 18. వీరులుగా ధరంబరిఢవిల్లుచునుండిరి పాండునందనుల్
  గారవమబ్బెగా సొగసుగత్తియ ద్రోవది పత్నియౌటచేన్
  ఆరయదెబ్బదీయగను నమ్ముదితన్ సభకీడ్వగాదగున్
  కోరిక దీరు నాకపుడు గూర్మిని రాగదవయ్య సోదరా.

  (దుర్యోధనుడు సోదరుడైన దుశ్శాసనునితో బలుకు సందర్భముగా)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. "సొగసుకత్తియ" అనియే వాడవచ్చు. "శబ్దరత్నాకరం"లో చెలికత్తె, చెలికత్తియ, చెలిమికత్తియ, వలపుకత్తియ, సొగసుకత్తియ అనే ఉన్నాయి. చక్కని పూరణ !

   తొలగించు
  2. మీ అభిమానానికి కృతజ్ఞతలు జనార్దనరావుగారు.

   తొలగించు
  3. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించు
 19. . భారతమ్మున ప్రభవిల్లు పట్టుదలలు
  ఆశ కమ్ముడుబోయిన యాస్తులాయె|
  ఎందు కాయనోగద యని యెంచిచూడ?
  కత్తిపిట్టను దరిమిన కాకులట్లు
  కౌరవుల్ పాండవుల నెట్ట?దారుణంబు| {కత్తిపిట్ట=కోయిల}

  రిప్లయితొలగించు
 20. అందగత్తియ ద్రోవదియాలిగాగ
  వారు నాకమ్ము మించిన వైభవాన
  పరిఢవిల్లుచునుండిరి పాండుసుతులు
  చూడదగదహో నాకిప్డు సోదరుండ!

  (దుర్యోధనుడు దుశ్శాసనునితో)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పొన్నెకంటి వారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. కాని 'నాకమ్ము'లో అమ్ము లేదు.

   తొలగించు
 21. సైంధవుడు దుస్సలపతి .చంపవలదు
  కత్తిరించు మీసల,తల జుత్తు గొరుగు
  [ము+అ ]మ మ్మురారి రుక్మికి జేసి నటుల ,పార్థ !
  పరిఢవిల్లు గదయ్యని పలికె కృష్ణ

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించు
  2. గురువుగారి ప్రశంసకు ధన్యవాదములు

   తొలగించు
 22. ప్రీతిగ యజ్ఞమందు ప్రభవిల్లు యశస్సున లబ్ధదీప్తసం
  ధాతలు నంత్య మందవబృథమ్ము నొనర్చి పునీతులైనన
  జ్ఞాతుల కత్తిగట్టి సమజంబుల వైరముఁబంపినట్టి ని
  ర్భీతులు నాశమైరిగద భేదిక దప్పదు దుష్టకోటికిన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఫణికుమార్ తాతా గారూ,
   బాగుంది మీ పూరణ. కాని కేవలం విల్లు, గద మాత్రమే అన్యార్థంలో ప్రయోగింపబడ్డాయి. అవబృథమ్ములో అమ్ము లేదు. కత్తిని స్వార్థంలో ప్రయోగించారు.

   తొలగించు
  2. గురువుగారూ ధన్యవాదములు. కత్తిగట్టి అంటే పగబట్టి అనే అర్థంలో వాడియున్నాను. అవబృథమ్ములో అమ్ము లేదు. పొరపాటు మన్నించండి.

   తొలగించు
  3. ప్రీతిగ యజ్ఞమందు ప్రభవిల్లు యశస్సున లబ్ధదీప్తులై
   రీతిగ నమ్మురారికి కిరీటము దాల్చియు పూజచేయగన్
   జ్ఞాతుల కత్తిగట్టి సమజంబుల వైరముఁబంపినట్టి ని
   ర్భీతులు నాశమైరిగద భేదిక దప్పదు దుష్టకోటికిన్

   తొలగించు
 23. విజయు కార్ముకమ్మున నుధ్బవిల్లు సెలలు
  కత్తిరించెను కురుసేన కుత్తుకలను
  కదనము గురించి విని గొంతు గద్గద మవ
  కుమిలె తనయులను తలచి గ్రుడ్డిరాజు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   బాగుంది మీ పూరణ. అభినందనలు.
   కాని కార్ముకమ్ములో అమ్ము లేదు.

   తొలగించు
  2. అమ్మురారి నియంతగా నిమ్ముగూర్చ - అని మొదటిపాదం అదనంగా కలిపితే సరిపోతుందా. తెలియ జేయ ప్రార్థన.

   తొలగించు
 24. రాజసూయ యాగానంతరం రారాజు మనస్థితి.

  పాండుపుత్రుల భోగమ్ము పరిఢవిల్లు
  అమ్ముఖమ్ములజూడ కోపమ్మునాకు
  సొగసుగత్తియ ద్రౌపదిన్ క్షోభబెట్ట
  కున్నరారాజు మదిశాంతి నొందదుగద.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   భోగమ్ములో అమ్ము లేదు.

   తొలగించు
 25. రాయబారసమయమున కృష్ణుడు ధుర్యోధనునితో...

  భండనమున భీములు గద పాండుసుతులు
  కత్తినూరిన మిమ్ముల చిత్తుచేయు
  సంభవిల్లును విజయము సత్యమునకు
  రాజకీయమ్ములికచాలు రాజరాజ!!!  కీచకుడు ద్రౌపదితో....

  సొగసుకత్తియ! మాలినీ! సుందరాంగి
  నాదు హృదయమ్మునిట్టుల నపహరించి
  కోమ !యెలనాగ! దరిచేర గోపమేల
  రాణివై ప్రభవిల్లు మా రాజ్యమందు!!!


  రిప్లయితొలగించు
 26. కత్తి, విల్లు, అమ్ము,గద పుష్కలమ్ముగ
  పరిఢవిల్లునుగద భండనమున!
  కత్తిరించి రాజ్య కాంక్షల, శాంతికై
  నిరత మమ్మునులటు నెగడ దగును

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   దత్తపదాలను స్వార్థంలోను, అన్యార్థంలోను ఒకే చిన్న పద్యంలో ఇమిడ్చిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. సంతోషం!

   తొలగించు
 27. అమ్ముని పుత్రుడంతట భయమ్మున పామునుగాంచె తంద్రి పై
  పిమ్మట ప్రాణముల్ పరిఢ విల్లుచు లేచునొ? వెబడించునో
  క్రమ్మర కత్తియమ్మున తన గాదిలి మిత్రుల కాటు వేయునో!
  యమ్మనుజేశు డిట్లు సేసె గద!యాతని తీరు శపింతు నిత్తరిన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కత్తియమ్మున తన' అన్నచోట గణదోషం.

   తొలగించు

  2. గురువుగారి సూచన మేరకు సవరించిన పద్యము
   అమ్ముని పుత్రుడంతట భయమ్మున పామును గాంచె తంద్రి పై
   పిమ్మట ప్రాణముల్ పరిఢ విల్లుచు లేచునొ? వెబడించునో
   క్రమ్మర కత్తియమ్మునతి గాదిలి మిత్రుల కాటు వేయునో!
   యమ్మనుజేశు డిట్లు సేసె గద!యాతని తీరు శపింతు నిత్తరిన్

   తొలగించు


 28. మరో ప్రయత్నం !

  ఇవ్వాళ మరీ ఈ 'అమ్ము' చాలా కుదిపేసినట్టుంది :)

  శ్రీ కృష్ణ తులాభారం !

  అమ్ముడు బోయెగద మగడు !
  నమ్మగ నారదు నిమాట,నలుగురి లోనన్,
  నమ్మగ చెలికత్తియలన్ !
  నమ్మెద తులసి ప్రభవిల్లు నారుక్మిణినీ !

  జిలేబి

  రిప్లయితొలగించు
 29. మిత్రులందఱకు నమస్సులు!

  అమ్ముని మంత్రము నిడి పృథ
  కిమ్ముగ జపియింపఁగఁ బ్రభవిల్లు సుతుఁ డనన్
  సమ్ముదమునఁ జెలికత్తి
  యమ్ముదితనుఁ గోరెను గద యది పఠియింపన్!

  స్వస్తి

  రిప్లయితొలగించు
 30. నా పద్యం 2వ పాదపు సవరణ...

  వారు నాకమ్ము గ్రుచ్చిరి వైరులగుచు. అంటే సరిపోతుందనుకుంటాను.

  రిప్లయితొలగించు
 31. స్మరణీయమ్ముర! కౌగిలి
  మరులన్ప్రభవిల్లు తీపి మావిళ్లివిగో
  చొరవేది కత్తిరించగ
  కురువర! నేనూర్వశిఁగద? కూడగ రాదా?

  రిప్లయితొలగించు
 32. మీనాక్షీ రమణీయ మోమున నహో యీ యంగవస్త్రమ్ము లే
  లా నీ సుందర సోయగమ్ము గద బాలా గోరుచుంటిన్ సదా
  సూనాస్త్రుండిటుపొంచియుండి వడిగా యోగించె బూవిల్లు నన్
  నానారూప విలాస కత్తియ మనో నాథుండ గావింపవే

  అమ్ము సరిపోయిందో లేదో అని అనుమానము.

  రిప్లయితొలగించు