5, సెప్టెంబర్ 2016, సోమవారం

సమస్య - 2135 (...భాద్రపదమ్మున శుక్లపక్షపుం...)

కవిమిత్రులారా,
వినాయక చతుర్థి, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"........................................ భాద్రపదమ్మున శుక్లపక్షపుం
జవితినిఁ జంద్రదర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా"

లేదా...
"........................ భాద్రపద శుక్లపక్షమందు
చవితి చంద్రుఁడు శుభముల సర్వ మొసఁగు"

42 కామెంట్‌లు:

 1. భవమున తేరిజూడ నిజ భాద్రపదమ్మున శుక్లపక్షపుం
  జవితినిఁ జంద్రదర్శనము సంకటముల్ కలిగించకుండునే!
  పవలు నిశీధిలో నధిక భాద్రపదమ్మున శుక్లపక్షపుం
  జవితినిఁ జంద్రదర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా!!

  రిప్లయితొలగించు
 2. పార్వతీ దేవి శాపమున్ బరహరించె
  గణపతివ్రత కల్పపు కథను వినెడు
  పర్వమౌ భాద్రపదశుక్ల పక్షమందు
  చవితి చంద్రుడు శుభముల సర్వమొసగు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పరిహరించె అన్నదానిలో typo. కథవిన్న వారికి శుభమే అన్న ఆలోచన ప్రశస్తం.

   తొలగించు
 3. రవికి నమస్కరించి బలు రమ్యపు బూవులు బత్రి దెచ్చి యో
  ప్రవిమల మృత్తికా ప్రతిమ ప్రాభవమొప్ప గణేశు నిల్పి యా
  భవుని కుమారకున్ గొలువ భాద్రపదమ్మున శుక్లపక్షపుం
  జవితిని జంద్ర దర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా!

  రిప్లయితొలగించు
 4. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వాస్తవమె భాద్రపద శుక్లపక్ష మందు
  చవితి చంద్రుడు శుభముల సర్వ మొసగు
  ననుట అక్కరో! నేడిట ననువుదోడ
  గణపతికి బూజ చలుపగ గరిక దెమ్మొ!

  రిప్లయితొలగించు

 5. అందరికి చతుర్థి శుభాకాంక్షల తో

  పర్వ దిన భాద్ర పద శుక్లపక్షమందు
  చవితి చంద్రుఁడు, శుభముల సర్వ మొసఁగు
  బొజ్జ గణపతయ్య కలసి బుద్ధి నొసగి
  మనల చల్లగ చూడ నమనము లివియె !

  జిలేబి

  రిప్లయితొలగించు
 6. క్రొవ్విడి వెంకట రాజారావు:

  గరికదెచ్చి గణపతికి కైపుదోడ
  పూజలెంచి సేసలుదాల్చి వెలయుఁజుండు
  భక్తులకు భాద్రపద శుక్లపక్షమందు
  చవితి చంద్రుడు శుభముల సర్వ మొసగు.

  (సేసలు = అక్షతలు )

  రిప్లయితొలగించు
 7. ధ్రువమగు భక్తి బూనుచును తోరపు శ్రద్ధ గణాధినాయకున్
  శివసుతు గొల్చి యాపయిని శ్రీప్రదమైన శ్యమంత సత్కథన్
  భవ హర గావుమంచు విన భాద్రపదమ్మున శుక్లపక్షపుం
  జవితిని జంద్రదర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించు
 8. గురువులకు ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు :

  తల్లి దండ్రుల తరువాయి ధర్మ మెరిగి
  విద్య నొసగును గురువులు ప్రేమతోడ
  మనల గమనించి నడిపించి మంచి జూపి
  బరగు నొజ్జల కిడుదును వందనములు!

  రిప్లయితొలగించు
 9. భువిఁ దిరుగాడగా నెపుడు బొజ్జ వినాయక మూర్తి వచ్చునో?
  ఎవనిది నాటి దర్శనమ దెంతటి నిందల పాలు జేయునో?
  భవుసుతుడేమి యిచ్చునని? భాద్రపదమ్మున శుక్లపక్షపుం
  జవితినిఁ; జంద్రదర్శనము; సర్వశుభమ్ము లొసంగు మానవా!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శారదనిశి పున్నమి వేళ చందమామ
   కనగపాల,సకలమిచ్చి కాచు; చూపు
   పడనిచో,భాద్రపద శుక్లపక్షమందు
   చవితి చంద్రుఁడు శుభముల సర్వ మొసఁగు"

   తొలగించు
 10. పరగభాద్రపదపుశుక్లపక్షమందు
  భక్తిశ్రధ్ధలతోడనపత్రిపూజ
  నేకదంతునకిలజేయనీశుడైన
  చవితిచంద్రుడుశుభములసర్వమొసగు

  రిప్లయితొలగించు
 11. విఘ్ననాధుని బూజించి వేడ్కతోడ
  కుడములుండ్రాళ్లు నటుకులు కొబ్బరి చిటి
  బెల్లముచెరకు రసములన్ విందు జేసి
  వక్రతుండుని వ్రతకధన్ సక్రమముగ
  వినుచు జదువుచు జెప్పుచు వినయమొప్ప
  నక్షతలు తల నిడుకొని రక్ష గోరి
  ప్రణతులిడ భాద్రపద శుక్ల పక్షమందు
  చవితి జంద్రుడు శుభముల సర్వ మొసగు!!!

  రిప్లయితొలగించు
 12. పూజ్య గురుదేవులకు, కవిమిత్రులందరికీ 'వినాయక చవితి' మరియు 'ఉపాధ్యాయ దినోత్సవ' శుభాకాంక్షలు

  రిప్లయితొలగించు
 13. భక్తిమీర వినాయక వ్రతమొనర్చి
  కుడుములుండ్రాళ్ళనైవేద్యమిడుచు,దాల్చ
  నక్షతలు భాద్రపద శుక్లపక్షమందు
  చవితి జంద్రుడు శుభములు సర్వమొసగు

  రిప్లయితొలగించు
 14. గురువర్యులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
  మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

  ఓం శ్రీ గణేశాయ నమః


  ఆటవెలది:
  ఏను గురుతెరిగితి నేనుగుతల సామి!
  నిన్నుదలతునయ్య నింద దొలుగ
  గుజ్జురూప! తలను గుజ్జుబెంచుమునాకు
  చేటచెవుల దలతు చేటు దులుపు.

  ఆటవెలది:
  బొజ్జపెద్దది మరుగుజ్జు రూపమ్మైన
  గజమువంటి శిరము గలిగియున్న
  బుద్ధియున్న చాలు పూజనీయుండౌను
  విఘ్నరాజు తెలుపు విషయమిదియె.

  రిప్లయితొలగించు
 15. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  కుడుములను వడల నిడగనె

  యిడుముల గిరి పొడుమొనరిచి యెడపక దయతో

  పొడగను నొడయడు గణపతి |

  పుడమి విడిదినిడెను నడుమ ముదముగకొలువన్

  రిప్లయితొలగించు
 16. భవహరుడైననీశునిలభాద్రపదమ్మునశుక్లపక్షపు
  న్జవితినిజంద్రదర్శనముసర్వశుభమ్ములొసంగుమానవా!
  వివరముగాగనీయదివివేకముతోడనుజెప్పితిప్పుడు
  న్నవనితమోముతోడనుగణాధిపుపూజనుజేయుమాదగన్

  రిప్లయితొలగించు
 17. శివసతి శాప భీతిని నశేష జనాళి తపించు చుండగన్
  భువి వసుదేవ నందనుని భూరి కృపారస కారణమ్మునం
  బ్రవిమల బుద్దినిం, గడప భాద్రపదమ్మున శుక్లపక్షపుం
  జవితినిఁ, జంద్రదర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా


  జాంబవతి తోడ నింపుగ సత్యభామ
  కూడ దక్కెను గృష్ణునకు శశిని గనఁ
  బాలలోభాద్రపద శుక్లపక్షమందు,
  చవితి చంద్రుఁడు శుభముల సర్వ మొసఁగు!

  రిప్లయితొలగించు
 18. ఎవరటు లన్న దోయి విను మింపుగ పత్రిని దెచ్చి చక్కగా
  సవివర పూజలన్ సలిపి శంభుసుతున్ స్మరియించి యక్షతల్
  భవహర మంచు దాల్చ విను భాద్రపదమ్మున శుక్లపక్షపుం
  జవితినిఁ జంద్రదర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా.

  రిప్లయితొలగించు
 19. భక్తితో భాద్రపద శుక్ల పక్షమందు
  గణపతిని గొల్చుచున్నమస్కారమునిడి
  వ్రత కథా విధానంబును పఠనమంద
  చవితి చంద్రుడు శుభముల సర్వ మొసగు!

  రిప్లయితొలగించు
 20. భక్తి మీర వివిధ పుష్ప పత్ర ములిడి
  గజపముఖునిఁ ప్రీతి గొలిచి కథను విన్న
  భద్ర మగు భాద్రపద శుక్లపక్షమందు
  చవితి చంద్రుఁడు శుభముల సర్వ మొసఁగు"

  రిప్లయితొలగించు
 21. సన్నుతించ కరము భక్తి శక్తియుతుడు
  భవ్యసుతు భాద్రపద శుక్లపక్ష మందు
  చవితి చంద్రుడు శుభముల సర్వమొసగు
  సరగున కదలిరండయ్య స్వామికడకు

  రిప్లయితొలగించు
 22. చవితి చంద్రుని గాంచినన్ జగతి యందు
  భాగవతకథను విన్నచో ప్రజలకెల్ల
  చవితి చంద్రుడు శుభముల సర్వ మొసగు
  ననుచు పలికెనా గణపతి యాదరమున.

  రిప్లయితొలగించు
 23. పత్రి పుష్పము లుంచి సపత్నిచేత
  వ్రతముగావించ ?ఫలితము వాలిపోవు|
  పండుగౌ భాద్రపద శుక్లపక్షమందు
  చవితి చంద్రుడు శుభములు సర్వమొసగు|
  2.అవిరళ భక్తి తత్వమున నందిన పూలును,పత్రి,గడ్డితో
  సవినయమందుమోదక ప్రసాదములుంచియుపూజజేయగా
  భవితకు బంధమౌ విధము భాద్రపదమ్మున శుక్ల పక్షపుం
  జవితిని జంద్ర దర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా|

  రిప్లయితొలగించు
 24. అవిరళ భక్తి భావమున నాద్యపు వేల్పుకు విఘ్న హర్తకున్
  సవినయ చిత్త శుద్ధులయి స్వామి గజాస్యుని పూజ జేసినన్
  భవములు గల్గు నెల్లపుడు , భాద్రపదమ్మున శుక్లపక్షపుం
  జవితినిఁ జంద్రదర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా

  రిప్లయితొలగించు
 25. విఘ్న నాయకుడు భువిని వెలసె హరుని
  బాలునిగ భాద్రపద శుక్ల పక్షమందు
  చవితి చంద్రుడు శుభముల సర్వమొసగు
  గణపతిని కొలిచి తనను గాంచినంత!

  రిప్లయితొలగించు
 26. అవధులుదాట భక్తిపరమార్థము నంచులుదాటు చూడరే
  నవరస భావనల్ కలియ నాట్యవిలాసత గుజ్జురూపమున్
  భువనమునందు బూజలిడ భాద్రపదమ్మున శుక్ల పక్షపుం
  జవితిని జంద్ర దర్శనము సర్వ శుభమ్ములొసంగు మానవా.

  రిప్లయితొలగించు
 27. భక్తితో వినాయకు గొల్చి పత్రి తోడ

  కధను శ్రవణము జేసి యక్షతలు దాల్చ

  పర్వమగు భాద్రపద శుక్ల పక్ష మందు

  చవితి చంద్రుడు శుభముల సర్వమొసగు.

  రిప్లయితొలగించు
 28. భవుడయినన్గ నన్గలడె భాద్రపదమ్మున శుక్లపక్షపుం
  జవితినిఁ జంద్రదర్శనము? సర్వశుభమ్ము లొసంగు మానవా !
  యవనిని యట్లు గాక వినుమా! శశి నేనెల నైనను గాంచ వచ్చునం
  చవగత మయ్యె మాధవున కందలి నిందను బాపు నప్పటన్

  కవనము సేతు నంచునె 'న ' కారమునే నిరతమ్ము నెంచుచు
  న్నవధియు లేక మద్యము ననంతము గా గొనువాడు, సం
  భవమగుచో గనుండనియె భాద్రపదమ్మున శుక్లపక్షపుం
  జవితినిఁ జంద్రదర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా!

  రిప్లయితొలగించు
 29. అందరికీ గురుపూజోత్సవ మరియు వినాయకచవితి శుభాకాంక్షలు.
  ఆ వినాయకు వ్రతకల్ప మాచరించి
  చల్లనయ్యను జూచిన నల్లనయ్య
  నింద పాలైన గాథ వినిన చదివిన
  వసుధపై భాద్రపద శుక్ల పక్షమందు
  చవితి చంద్రుండు శుభముల సర్వమొసఁగు

  రిప్లయితొలగించు
 30. చవితిని లోకమున్నఖిల సౌఖ్యము లిచ్చు గణాధి పత్యుడౌ
  భవసుత పూజజేసి కథ భక్తిని వేడుక నాలకించియున్
  భవ చరితాక్షతల్ నిలుప భాద్రపదమ్మున శుక్లపక్షపుం
  జవితినిఁ జంద్రదర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా

  నిలుపు = ధరించు

  రిప్లయితొలగించు
 31. కవిమిత్రులారా,
  నమస్కృతులు.
  నా లాప్ టాప్ ఉదయం నుండి ఇబ్బంది పెడుతున్నది. పైగా విపరీతమైన తలనొప్పితో బాధ పడుతున్నాను. ప్రస్తుతం మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి. రేపు రెండు రోజుల పూరణలపై స్పందిస్తాను.

  రిప్లయితొలగించు
 32. వ్యాఖ్యల మాడరేషన్ వలన ఇబ్బంది పడుతున్నాను. రేపు ఉదయం తొలగిస్తాను.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. తప్పక తొలగించండి, లేకపోతే సమీక్షించటమూ ఇబ్బందిగానే ఉంటున్నది.

   తొలగించు
 33. క్రమాలంకార పూరణ :
  తే.గీ.తెలుగు నెలలోన నాల్గవ తిథియదేది ?
  అన్ని యౌషద ములకును నధిప తెవరు ?
  స్వామి పూజించు భక్తుల కేమి యొసగు?
  చవితి, చంద్రుడు, శుభముల సర్వ మొసగు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అధిపతి+ఎవరు' అన్నపుడు 'అధిపతి యెవరు' అని యడాగమం వస్తుంది. అక్కడ 'అధిపు డెవరు' అనండి.

   తొలగించు