కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నకులునిఁ జంపె రామ నరనాథుఁడు జానకి సంతసింపఁగన్"
(గరికిపాటి వారు ఒక అవధానంలో పూరించిన సమస్య)
లేదా...
"నకులుఁ జంపె రామ నరవిభుండు"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నకులునిఁ జంపె రామ నరనాథుఁడు జానకి సంతసింపఁగన్"
(గరికిపాటి వారు ఒక అవధానంలో పూరించిన సమస్య)
లేదా...
"నకులుఁ జంపె రామ నరవిభుండు"
రిప్లయితొలగించండియక్ష కొలను నీరు యడవిలో నచ్చట
నకులుఁ జంపె, రామ నరవిభుండు
సరయు నదిని బోవ సలిలము నచ్చట
తనను కలుపు కొనెను, తాత రాత !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిబాగుంది మీ పూరణ.
'యక్షకొలను' అనడం దుష్టసమాసం. 'నీరు+అడవి' అన్నపుడు యడాగమం రాదు. ఆ పాదాన్ని 'యక్షసరసి నీర మడవిలో నచ్చట' అనండి.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిచెన్ను కాని రీతి సీత నపహరించి
లంక లోన కట్టి రచ్చ తోడ
నొవ్వ జేయు రావణుడగు యా కైకసి
నకులుఁజంపె రామ నరవిభుండు.
(నకులుడు = కుమారుడు)
క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
'చతుర్వద నకులుడు'...? 'నాథుండు+అలిగి' అన్నపుడు యడాగమం రాదు. 'దానవ జన నాథు। డలిగి...' అందామా?
దానవాధముండు దనసతిఁ గొనిపోవ
తొలగించండినలిగి కపులదండు నండగ గొని
వనధి దాటి యాహవమున చతుర్వద
నకులుఁ జంపె రామనరవిభుండు
చతుర్ వదనుడు: బ్రహ్మ అని నాఅభిప్రాయం
మొదటిపాదము మార్చాను.చిత్తగించమనవి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమూర్తి గారూ,
తొలగించండిమన్నించండి. 'చతుర్వదన కులుడు' నా బుద్ధికి తట్టలేదు. దానిని చతుర్వద నకులుడు అన్న విభాగంతో చదవడం వల్ల జరిగిన పొరపాటు.
పద్యాన్ని సవరించినందుకు సంతోషం!
రిప్లయితొలగించండిఅకట! యుధిష్టరుండు గొని నాడట దప్పిక జింక కారణం
బు గన, సరస్సునందు గొన పుక్కిటి నీరది జంపె చట్టునా
నకులుని, జంపె రామ నరనాథుఁడు జానకి సంతసింపఁగన్
నికటపు జింక చెంగునట నిక్కి గభిల్లని పారి బోవగన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిపూరణ బాగుంది. కాని రెండవ పాదంలో ప్రాస తప్పింది. 'కారణం। బొకట.. (ఒకట=ఒకానొకసారి)' అనవచ్చు.
హరియె నవత రించె నరపాల కుండుగా
రిప్లయితొలగించండిశాంతి నిలుప నెంచి పంత మూని
ధర్మ నిరతి కొఱకు దయవీడి తండ్రిగా
నకులుఁ జంపె రామ నర విభుండు
నకులు = కుమారుడు
అక్కయ్యా,
తొలగించండిహరి రాజై జన్మించి కుమారుణ్ణి చంపిన కథ ఏదైనా ఉందా?
వరాహావ తారంలో కొడుకైన నరకాసురుణ్ణి , కృష్ణావతారంలో చంపాడుకదా ! అదన్నమాట .అసల్ సంగతి.తప్పైతె ఏముంది ? మన్నించడమే మరి.
తొలగించండిఅక్కయ్యా, ఓ.కే!
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిరకమదిలేని రీతిని తలమ్మున కేగి మహీజ నాహరిం
చి కలతబెట్టు రావణుని చెండు దలంపున కోతి దండుతో
ఝకట మొనర్చి రాక్షసుల జంపుచు నక్కసు గూడి కైకసీ
నకులుని జంపె రామ నరనాధుడు జానకి సంతసింపగన్.
( ఝకటము= యుద్ధము; నకులుడు= కుమారుడు)
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అకట సమీప వస్తుతతి యంతయు కంటికి దల్లక్రిందులై
రిప్లయితొలగించండిప్రకటితమౌవిధిన్ సురను బానము చేసినవాడు ప్రేలుచున్
వికటముగా వచించెనిటు వింటిరె మిత్రులు యుద్ధభూమిలో
నకులుని జంపె రామనరనాథుడు జానకి సంతసింపగన్
హ.వేం.స.నా.మూర్తి.
రాణివాసమందు రాత్రివేళను దూరి
రిప్లయితొలగించండిపరుగు లిడుచు నచట తిరుగుచుండి
పత్ని కెంత యేని భయమును గొల్పెడి
నకులు జంపె రామ! నరవిభుండు.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రామ! అని సంబోధించడం బాగుంది. కాని నకులముఁ జంపె అనవలసింది కదా!
P.Satyanarayana
రిప్లయితొలగించండిపకపక నవ్వె నాగురువు బండగ మారన శిష్యునిన్ గనన్
వికట ఘటంబు వీడనుచు వింత కవిత్వము బూన్చ"స్వేచ్ఛగా
టకటక నొక్క సత్యము తటాలున జెప్పు"మటన్న వాడనెన్
"నకులుని జంపె రామ నరనాథుడు జానకి సంతసింపగన్"!P.Satyanarayana
P.Satyanarayana
కంప్యూటరు యిచ్చిన విడి శబ్దాలతో పద్యాలు కూర్చే ప్రక్రియకు "కంప్యూటర్ కవిత్వం"అని పేరున్నది.
ప్రకట శబ్ద రాశి బన్నినచోవచ్చు
సకల వికలములకు సైరణనగ
నొకట కంప్యూటరు కున్న యోపిక జూడ
"నకులు,జంపె,రామ,నర,విభుండు,"P.Satyanarayana
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో మారన (మారిన) టైప్ దోషమనుకుంటాను.
రెండవ పూరణ మూడవ పాదంలో కంప్యూటరు అన్నచోట గణదోషం. '..నొకట గణనయంత్ర మోపికగా జూడ' అందామా?
సీతను గొనిపోయి చెరనిడగ పలాశి
రిప్లయితొలగించండికపులసేనఁగూర్చి విపినమందు
బండనమున వేగ పౌలస్త్యుడౌ బాప
నకులుఁజంపె రామ నరవిభుండు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిబాగున్నది మీ పూరణ. అభినందనలు.
'బాపన కులము' అనవచ్చు. కాని 'బాపన కులుడు' అనవచ్చునా? సందేహమే!
సకల దిశాధినాథుల నచంచల విక్రముఁడై జయించి, లం
రిప్లయితొలగించండికకుఁ బ్రభువై మహేశ్వరుని గాటపు భక్తుఁడునై, పులస్త్య బ్ర
హ్మకు మనుమండునై నెగడి యంగనఁ బట్టెను గాన నా యహీ
న కులునిఁ జంపె రామ నరనాథుఁడు జానకి సంతసింపఁగన్
సకల శాస్త్రవేత్త శౌర్యవంతుఁడు నష్ట
దిక్పతులను గెలిచెఁ దెంపరి యయి
సీత నపహరించు చెనటి కనుక యహీ
న కులుఁ జంపె రామనరవిభుండు.
మాస్టరుగారూ! నకులుని అహీన కులునిగా మార్చిన మీ పూరణ అద్భుతం.
తొలగించండిఆర్యా!
తొలగించండినమస్కారములు, "అహీనకులుడ"ని పూరించుట బాగున్నది. "పులస్త్యబ్రహ్మ" అనునపుడు"స్త్య" గురువు కావలసిన అవసరము లేదా? సందేహ నివృత్తి చేయ ప్రార్థన.
గోలి వారూ,
తొలగించండిధన్యవాదాలు.
*******
మూర్తి గారూ,
ధన్యవాదాలు!
ఈ ప్రశ్న నేను ఊహించిందే. సమాసంలో ఉత్తర పదాద్యక్షరం రేఫ సంయుక్తమైనపుడు దాని పూర్వాక్షరం అవసరాన్ని బట్టి లఘువుగాను, గురువుగాను స్వీకరించే సంప్రదాయం ఉంది. గతంలో ఈ విషయమై మన బ్లాగులో వివరంగా చర్చలు జరిగాయి. (నిజానికి పూర్వపదాంతాక్షరం తప్పక గురువు కావాలి అని భావించేవాళ్ళలో నేనూ ఒకణ్ణి. గతంలో ఇలాంటి ప్రయోగం నా పద్యాలలో ఎప్పుడూ చేయలేదు. ఈసారి తప్పలేదు!)
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఉదాహరణ:
తొలగించండిధరణీసుర శాపమునకు
హరిహర బ్రహ్మాదులైన నడ్డము గలరే
నరులనఁ గ నెంత వారలు
గర మరుదుగఁ బూర్వజన్మ కర్మము ద్రోవన్ భాగ. 11. 25 వెలిగందల నారయ
కామేశ్వర రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు!
పాడు బుద్ధితోడ భార్యనపహరించి
రిప్లయితొలగించండిలంక లోన బెట్ట రావణుండు
కపుల తోడ వెడలి కపటి యా కైకసి
నకులు జంపె రామనరవిభుండు!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
అన్నట్టు... ఆకుండి శైలజ, మీరు ఒకరేనా?
అవును గురువుగారు...ధన్యవాదములు..
తొలగించండియుద్దరంగమందు యుక్తిజిత్తులతోడ
రిప్లయితొలగించండినీతితప్పి సాగ నింద్రజిత్తు
యెర్రబడగ కండ్లు యేడ్వగా నతనిజ
నకులు,జంపె రామ నరవిభుండు
చేపూరి శ్రీరామారావు గారూ,
తొలగించండివిలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని ఇంద్రజిత్తును చంపింది లక్ష్మణుడు కదా!
మెకముగ మారి రాక్షసుడు మిక్కిలి సుందర రూపమొంద జా
రిప్లయితొలగించండినకిఁదన భర్తనంప భువనంబున భీరువు రావణుండు గా
యకమున సీత తోడఁజన యాతని తోడను పోరియా దృషా
న కులునిఁ జంపె రామ నరనాథుఁడు జానకి సంతసింపఁగన్
ఫణికుమార్ తాతా గారూ,
తొలగించండిద్రుషాన కులుడు.. అనడం బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
గురువుగారూ ధన్యవాదములు.
తొలగించండిగురువుగారి బాటలోనే....
రిప్లయితొలగించండిబాధబెట్ట సురల భార్యనే చెఱబట్ట
చెప్ప హితమును పెడ చెవిని బెట్ట
బ్రహ్మ హత్య యయ్యు రావణాధిపు డహీ
న కులుఁజంపె రామ నరవిభుండు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సకల మునీ౦ద్ర వ౦దిత లసద్గుణ ధాము ,
…………… డఖ౦డ శైవ కా
ర్ముక పరిఖ౦డను౦డును , సరోజ హితాన్వయ
…………… మ౦డను౦డు , వై
రి కుల భయ౦కరు౦డు కడు లీలగ గూల్చె
………… దశాస్యు | దైత్య హీ
న కులుని జ౦పె రామనరనాధుడు , జానకి
……….... స౦తసి౦పగా ! !
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విశ్వనాథసుతుడు వీరత్వముంజూపి
రిప్లయితొలగించండినకులుజంపె-రామనరవిభుండు,
దశరథాత్మజుండు, దైత్యాగ్రజుండైన
రావణుబరిమార్చె రంగమందు.
(నకులము=ముంగిస)
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిబాగుంది పూరణ. కాని ముంగిస అనే అర్థంలో 'నకులముఁ జంపె..' అవుతుంది.
అ పదము...నకులున్.. అంటే..ముంగిసని..అని భావించాను.మార్పుతో మరొకటి పంపుతున్నాను.
తొలగించండిబ్రహ్మ వంశజుండు బహుగర్వియౌ యహీ
నకులు, జంపె రామనరవిభుండు
ధర్మ రక్షణంబు ధరణిని నిలుపంగ
పరమమునులు గురులు పరవశింప.
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదుష్ట బుధ్ది యుతుడు దూర్జటి భక్తుడు
రిప్లయితొలగించండిరాక్ష సుండును నగు రావణుండు
సీత నపహరించు చెనటి యగుట న హీ
నకులు జంపె రామ నరవి భుండు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నరుడు దక్క వేరెవరి చేత మరణము
రిప్లయితొలగించండిపడయనని దనుజుడు వరము నంద,
గుట్టు తెలిసి నాభి గురిగ యా కైకసి
నకులు జంపె రామ నర విభుండు!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీధరరావు గారూ మన్నించండి . తప్పు పట్టడం నా అభిమతం కాదు. అయినా రాముడు నాభికి గురి పెట్టిన అధర్మపరుడు అంటే అంగీకరించ లేక చెబుతున్నాను. రాముడు నాభికి గురి పెట్టలేదు కదా.
తొలగించండిరాముడు రావణుని చంపలేక ఇబ్బంది పడుతుంటే విభీషణుడు "అతని కడుపులో అమృతభాండం ఉంది. దానిని బ్రద్దలు కొడితే అతడు చస్తాడు" అని చెప్పాడనీ, రాముడు బాణంతో నాభికి గురిపెట్టి కడుపు చీల్చగా అమృతభాండం పగిలి అతడు చచ్చాడని ఒక ఐతిహ్యం ఉంది కదా!
తొలగించండిగురువుగారూ నమస్సులు. ఈ విషయం వాల్మీకి రామాయణంలో చెప్పబడలేదు కదా. అంతే కాక ఆ ఐతిహ్యములో కూడా నేను విన్నంత వరకు రాముడు కంఠానికే గురి పెట్టగా వాయుదేవుని సహకారంతో దేవతలు గతి మార్చి యున్నారు.
తొలగించండికథాపరంగా రావణునికి అమృత భాండం ఎలా వచ్చింది అది ఎప్పుడు కడుపులో దాచుకున్నాడో మనకి ఎక్కడా కనబడదు. ఒకవేళ నిజంగా అమృతం దొరికితేదానిని తాగి మృత్యుంజయుడు కావడం మానివేసి దానిని కడుపులో దాచుకోవడం లోని ఔచిత్యం కూడా ఎక్కడా వివరింపబడదు.
తాత్వికంగా చూస్తే, వాడి యోగ సాధనతో మూలధారాన్ని చేరుకోగలగడం వలన వాడికి సిద్ధులుఉన్నాయని, అందువలన మూలధారాన్నిభేదించమని విభీషణుడి ఉద్దేశ్యం కావచ్చు.
నా ఉద్దేశ్యం తప్పు కూడా కావచ్చు. తప్పులున్నచో మన్నించండి.
ఫణికుమార్ గారూ,
తొలగించండిధన్యవాదాలు! కడుపులో అమృతభాండ మున్న కథ అవాల్మీకమే!
ఫణి కుమార్ గారూ మన్నించండి.. నాకు తెలిసిన పరిఙ్ఞానముతో రాముడు నాభికి గురి పెట్టాడనుకొని అలా వ్రాశాను, అంతే కాని మిత్రులను ఇబ్బంది పెట్టాలని, ఎవ్వరి మనోభావాలను కించపరచాలని కాదు, రాముణ్ణి అధర్మ పరునిగా చూపించాలని అసలే కాదు. రాముడు నాకు కూడా ఆదర్శ ప్రాయుడైన దేవుడే. రాముడలా చేయలేదని నాకు తెలియని విషయాన్ని తెలియ జెప్పారు, కృతఙ్ఞతలు .
తొలగించండిఅన్యధా భావించకండి. ధన్యవాదములు.
గురువు గారికి నమస్కారములు, ధన్యవాదములు. మాచవోలు శ్రీధర రావు.
సకల గుణైక భూషణుడు సత్య పరాక్రమ ధర్మ మూర్తియుం
రిప్లయితొలగించండిబ్రకటిత సత్య వాక్పరమ పాలన నిశ్చల ధీర చిత్తుడున్
సకల వరాస్త్ర శస్త్ర బల సంయుత ధన్వి ఖరాసు రాతి హీ
న కులునిఁ జంపె రామ నరనాథుఁడు జానకి సంతసింపఁగన్
శూర్పణఖ రావణుని తో చెప్పు మాటలు:
తండ్రి పంపున నిరతమ్ము ధనువు తోడ
లక్ష్మణ జనక సుతల సహితమ్ము,
నన్న చెప్ప నేల, నడవిఁ దిరుగుచు మ
న కులుఁ జంపె రామ నరవిభుండు
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిజనకుని యాజ్ఞతోడ జని సానువు లందున రాక్షసాధముల్
రిప్లయితొలగించండిజనులను సాదు సజ్జనుల చంపెడి వారల , రావణాసురున్
దనుజుని జానకీ సతిని దర్పముతో చెరగొన్న సత్వ హీ
న కులునిఁ, జంపె రామ నరనాథుఁడు జానకి సంతసింపఁగన్
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సకలజగత్తుకాతడె నిజమ్ము పితామహుడై వెలుంగగా
రిప్లయితొలగించండిప్రకటిత తద్యశమ్మునకపార కలంకముదెచ్చె వంశమున్,
వికవికనవ్వి రావణుడు పృథ్విజనెత్తుకు వెళ్ళి, బ్రహ్మదై
నకులునిఁ జంపె రామ నరనాథుఁడు జానకి సంతసింపఁగన్ ||
విష్టపంబులెల్ల సృష్టించునతనిదౌ
కీర్తిఁ గలుషఁబరచె క్షితిజచోరు
రావణాసురుండు, కావగ బ్రహ్మదై
నకులుఁ జంపె రామ నరవిభుండు.
డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'వెళ్ళి' అన్న వ్యావహారికానికి బదులు 'పోయి' అంటే బాగుంటుందేమో?
తొలగించండిఆర్య! అనేక నమస్కారములు. మీ సవరణ ముదావహము.అలాగే సవరించి పంపుతున్నాను. ధన్యవాదములు.
సకలజగత్తుకాతడె నిజమ్ము పితామహుడై వెలుంగగా
ప్రకటిత తద్యశమ్మునకపార కలంకముదెచ్చె వంశమున్,
వికవికనవ్వి రావణుడు పృథ్విజనెత్తుకుపోయి, బ్రహ్మదై
నకులునిఁ జంపె రామ నరనాథుఁడు జానకి సంతసింపఁగన్ ||
డా. అనిల్ కుమార్ గారు నమస్కారములు. "కలంకముదెచ్చె వంశమున్", "రావణుడు పృథ్విజనెత్తుకుపోయి" అన్వయ లోపము కన్పించు చున్నది. ఒకసారి పరిశీలించండి.
తొలగించండిమరియొక సందియము. బ్రహ్మదైన కులము సాధువు.”బ్రహ్మది” స్త్రీ నపుంసక లింగములకు వర్తిస్తుంది కానీ పుంలింగమునకు తగదు కదా! బ్రహ్మదైన కులము వాని అనవచ్చు కానీ బ్రహ్మదై
తొలగించండిన కులుని యన తగదనుకుంటాను. “బ్రహ్మకులుని” యని కూడ నన వచ్చును.
నా యభిప్రాయము తప్పైన క్షంతవ్యుడను.
తొలగించండిఆర్య!అనేక నమస్కారములు. మీకు వచ్చిన సందేహములే నాకును వచ్చినది. ప్రకటించుటకు మునుపే ఒకటికి రెండు మార్లు నేను సమన్వయం చూసుసుకున్నాను.ఇక ఇంకనూ మీ వంటి పెద్దలు సరిచూడగా నేర్చుకొనుటకే నేనిక్కడ ఉన్నందున క్షమాపణలు అనావశ్యకము.
రావణుడు పృథ్విజనెత్తుకుపోయి
ప్రకటిత తద్యశమ్మునకపార కలంకముదెచ్చె వంశమున్,
వంశమున్ = వంశమునందు.
రావణుడు పృథ్విజనెత్తుకుపోయి
ప్రకటిత తద్యశమ్మునకు
అపార కలంకముదెచ్చె అని సమన్వయము.
తదుపరి -
బ్రహ్మదైన కులము వాని అనవచ్చు కానీ బ్రహ్మదైన కులుని యన తగదనుకుంటాను. “బ్రహ్మకులుని” యని కూడ నన వచ్చును.
అనే మీ సందేహంలోనే సమాధానం కూడ కలదు.
దీని వ్యాఖ్యానము విస్తారంగా ఉన్నందుననూ, బ్రహ్మదైన కులము వాని అనవచ్చు అని మీరే చెప్పినందున బ్రహ్మదైన కులుని సరిపోయినది. బ్రహ్మదైన కులము వాడు బ్రహ్మదైన కులుడు అవుతాడు.
వక్రత కావ్యసౌందర్యాపాదకము. ఇక్కడ విశేషణం కులునికి కానీ కులానికి కాదు. కులుడు అనే శబ్దం సరియైనదా కాదా పైన సందేహం వ్యక్తం చేసిన తర్వాత కూడ శబ్ద కల్ప ద్రుమం చూశాను. సరియైనదే. కావున లింగ దోషము పరిహారమైనది. లక్షణ గ్రంథాలలో ఇటువంటి వాటికి ఉదాహరణలు కలవు. చూపించుటకు విస్తృతి కాగలదు.
ధన్యవాదములు.
ఈ నా సవరణను పరిశీలించండి.
తొలగించండిసకల జగత్తు కాతడె నిజమ్ము పితామహుడై వెలుంగ గా
ప్రకటిత తద్యశమ్మున కపార కలంకము దెచ్చె దుష్కృతిన్
వికవిక నవ్వి రావణుడు పృథ్విజ నెత్తుకు పోయి, బ్రహ్మమా
న కులునిఁ జంపె రామ నరనాథుఁడు జానకి సంతసింపఁగన్
బ్రహ్మమా
తొలగించండిన ?
ఆర్యా మీ వివరణకు ధన్యవాదములు. వంశమున్ = వంశమునూ, వంశముకూడా యను నర్థములనే యిచ్చునని నా యభిప్రాయము. "వంశమునన్" అన్న వంశము నందను యర్థము రాగలదు.
తొలగించండి“బ్రహ్మకులుని లో వివరణ సంతృప్తికరము.
మానము = గౌరవము; బ్రహ్మ గారి గౌరవ వంశమను భావములో బ్రహ్మమానకులుడు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఔనండి. అదే అర్థం వచ్చేలా వంశానికి, యశస్సుకు కూడ కళంకం తెచ్చినాడనే నేను వ్రాసినది. ధన్యవాదాలు.
తొలగించండి"వంశమున్ తద్యశమ్మునకపార" సరి పోయిందండి అన్వయము. అలా గమనించ లేదు ముందు. బాగుందండి. ధన్యవాదములు.
తొలగించండిమీరిద్ధరి ఇటువంటి సౌహార్ద పూరితమైన చర్చలు ఔత్సాహికులకు మార్గదర్శనం చేస్తాయి. ధన్యవాదాలు!
తొలగించండిప్రకటితమౌచు రావణుదు రాముని పత్నిని మాయతో హరిం
రిప్లయితొలగించండిచె .కవయ, లంకపట్నమున జేర్చగ ,వానర సేన గూర్చుచున్
చక చక వార్ధి దాటుచును సంకుల సంగరమందు యాతుధా
నకులుని జంపె రామ నర నాథుడు జానకి సంతసించగన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'హరించెన్ + కవయ = హరించెఁ గవయ' అవుతుంది కదా!
గుర్వుగారికి వందనములు 'హరించి కవయ'అనినచో సరిపోతుందా? `
తొలగించండిచక్కగా సరిపోతుంది.
తొలగించండినకులుని జంపె రామనరనాధుడు జానకి సంతసింపగన్
రిప్లయితొలగించండివికటము గాను నుండె నిది బేలగమాటలు బల్కు టొప్పునే
నకులుడు భారతమ్మనగ నాబరఁగంగను రామభూపుడున్
నకులుని జంప నెట్లగు ననా దరణంబులు గా జూడుమా
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒకడికి ప్రాణమిత్తునన యుక్తమనంచు యుధిష్ఠిరుండు చె
రిప్లయితొలగించండిప్పెకొలను లోని యక్షునకు భీకర వాలిని జంపె నెవ్వడో
సకలమేఱంగు రాఘవుడు స్వర్ణమృగమ్మును నమ్మెనేలనో
నకులునిఁ జంపె రామ నరనాథుఁడు జానకి సంతసింపఁగన్
కలికి మాద్రి మొదట కన్నదెవ్వారినో
సీత నపహ రించి శ్రీలంక జేర్చిన
దనుజరాజునెవరు తునుమాడి రనగాను
నకులుఁ జంపె రామ నరవిభుండు
విరించి గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణలు బాగున్నవి.
మొదటి పూరణలో 'చెప్పెన్+కొలను = చెప్పెఁ గొలను' అవుతుంది. 'యుక్త మటంచు' అనాలి. ప్రశ్నలకు సమాధానాలకు అన్వయం సరిగా కుదరడం లేదు.
రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. 'సీతను గొని లంక జేర్చినట్టి' అందామా?
సకలురు జూచుచుండగనె సాగెడియుద్దకుతంత్రమందు|ఓ
రిప్లయితొలగించండినకలుని జంపె రామనర నాథుడు జానకి సంతసింపగన్|
వికల మనస్కులై తిరుగు విజ్ఞత మానిన రాక్షసుల్ సదా
ప్రకటన లేకజేయు పరివర్తన మాన్పగ భీకరమ్మునన్.
2.ఉత్సాహవృత్తం మకురు మాన్పె లంకయందు మాయమర్మ ముంచినా?
నకలు నకులుజంపెరామ నరవిభుండు నుగ్రుడై
సకలు రెంచబోని యూహ సాగ నీక రాక్షసుల్
వికలు రైరి |రాముడెంత విజ్ఞపరుడు జూడగా| {నకలు=ఒకేవిధమైన}
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం.
మొదటి పూరణలో 'ఒక'ను 'ఓ' అన్నారు. నకులుని.. నకలుని అన్నారు.
రెండవ పూరణలో 'నకలు' అన్నది అన్యదేశ్యం. అయినా 'నకలు నకులు జంపె..' ఇది అర్థం కాలేదు.
సకల చమూసమూహమును సంతనకట్టి దురమ్ము నందునన్
రిప్లయితొలగించండివికలమొనర్చిరక్కసుల, వీర్యముతో కడు హేలగా నహీ
నకులుని జంపె రామ నరనాధుడు జానకి సంతసింపగన్
చకచక నాదితేయులట చల్లిరి పువ్వుల తద్ద తుష్టితో
చివర సమ్ముదమ్ముతో - అంటే సరిపోతుంది.
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి వారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
వికలమనస్కుడైన రఘువీరుడు నాహవమందొకింత డీ
రిప్లయితొలగించండిలకుడయి సూర్య డెందమును రావణ సంహరనార్ధమెంచి దే
వకులము సంతసింపగ నుపాసనజేసె దినేశుమధ్యుడౌ
నకులుని, చంపె రామ నరనాధుడు జానకి సంతసింపగన్
నకులుడు = శివుడు, సూర్య మండలాంతర్వర్తి అయిన రుద్రుడు
రిప్లయితొలగించండిరవికుమార్ తాతా గారూ,
తొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
'డీలకుడు' ?
మొదటి పాదంలో రాక్షసం"బండగమారన" ను బండగ మారిన గా చదువ గలరు
రిప్లయితొలగించండిP.Satyanarayana
చెల్లెమ్మ సుభద్రతో శ్రీకృష్ణ పరమాత్మ...
రిప్లయితొలగించండిఫల్గుణుండులేని వంక పద్మవ్యూహ
మంచు యుద్ధమెంచి రల్ప బుద్ధి
నంగ రాజుఁ బంపి యభిమన్యు నేకైక
నకులుఁ జంపె రామ! నరవిభుండు
రామ! = సుభద్రా!
నరవిభుండు = రారాజు సుయోధనుడు
నకులుఁ = కుమారున
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉంది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు
తొలగించండిదొంగిలించి దాచె ధూర్తుడు వనమున
రిప్లయితొలగించండిజానకినన , తనదు చావు కొఱకె
మనుజ రూప మొంది మందుని దైత్య హీ
నకులుఁ జంపె రామ నరవిభుండు
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రావణుండు సీత లంకలో బంధించ
రిప్లయితొలగించండికపుల సాయమంది రిపుని జేరి
విధిగ రణము జేసి వీరుడై కైకసి
నకులు జంపె రామ నరవిభుండు.
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సకల గుణాభిరాముడును సత్యము దప్పని లోకవంద్యుడౌ
రిప్లయితొలగించండివికసిత మందహాససియగు విశ్వమనోహర మూర్తియైన సూ
ర్యకులవిభూషణుండు, ఖలు రావణు గాముకుడైన హీ
నకులుని జంపె రామనర నాథుడు జానకి సంతసింపగన్
కలికి మాద్రి మొదట కన్నదెవ్వారినో
సీత నేమొ లంక జేర్చినట్టి
దనుజరాజునెవరు తునుమాడి రనగను
నకులుఁ జంపె రామ నరవిభుండు
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'మందహాససి'.. 'మందహాసి'కి టైపాటు.
'దనుజరాజు నేమి యొనరించె నెవ్వడు' అంటే అన్వయం బాగుంటుందేమో? ఎవరు తునుమాడిరి? అన్న ప్రశ్నకు 'రాముడు' అవుతుంది, కాని 'రాముడు చంపె' అని కాదు కదా!
రమణి సీతనుగొని రావణాసురుడట
రిప్లయితొలగించండిలంకలోన దాచె లహరి తోడ
వార్ధి దాటి వెళ్ళి వనితకై రావణు
నులు జంపె రామ నరవిభుండు.
2.పాడు తలపుతోడ పడతి సీతమ్మను
దాచియుంచె నాడు దానవుండు
సీత జాడనరసి శీఘ్రముగా వాని
నకులు జంపె రామ నరవిభుండు
3సమర రంగమందు శౌర్యమున్ జూపుచు
పోరుసల్పుచుండె పుడమి రేడు
అవనిజాత కొరకు నసురుడౌ రావణు
నకులు జంపె రామ నరవిభుండు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణలు బాగున్నవి.
మూడు పూరణలలోను 'రావణు నకులు(పుత్రుని) జంపె రాముడు' అన్నారు. కాని ఇంద్రజిత్తును చంపింది లక్ష్మణుడు కదా!
రాము డచట నుండె రామాయణమ్మున
రిప్లయితొలగించండిబరగ నకులు డుండె భారతమున
గాన నొప్ప బోదు గాదె యిట్టు లనగ
"నకులుఁ జంపె రామ నరవిభుండు!'
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సకల విధంపుటస్త్రములు శస్త్రము లెల్లను చంకనాకగా
రిప్లయితొలగించండివికల మనమ్ము తోడనట వెర్రిగ నేడ్చుచు గుండెబాదగా
పకపక నవ్వె రావణుడు పండుగ జేయుచు నిద్ది విన్గనే :👇
"నకులునిఁ జంపె రామ నరనాథుఁడు జానకి సంతసింపఁగన్"