కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కవియేగా మఱి చేటు దెచ్చు నిలలోఁ గాఠిన్యమే చిందుచున్"
లేదా...
"కవియే మఱి పతనమునకు కారణ మగురా!"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కవియేగా మఱి చేటు దెచ్చు నిలలోఁ గాఠిన్యమే చిందుచున్"
లేదా...
"కవియే మఱి పతనమునకు కారణ మగురా!"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
కవియే భవితకు మూలము
రిప్లయితొలగించండికవనములను వ్రాసి నంత కలతలు రేపున్
పవనముల తేలియాడిన
కవియే మఱి పతనమునకు కారణ మగురా
అక్కయ్యా,
తొలగించండిపూరణ కొంత సందిగ్ధర్థాన్నిస్తున్నా బాగుంది. అభినందనలు.
P.Satyanarayana
రిప్లయితొలగించండిరవిగాంచున్ ఛవి గాంచునో కవియు నీ రాద్ధాంతమట్లుండగా
భవితవ్యంబును గూర్చ మార్క్సు విధినిన్ భావించి సిద్ధాంతమున్
చెవినిన్ జార్చి యువాళి మానసములన్ చత్రంబుగా మార్చు నా
కవియేగా మరి చేటు దెచ్చు నిల లో గాఠిన్యమే చిందుచున్
P.Satyanarayana
భువి సంస్కృతి వెలుగొందగ
నవిరళ కృషి జేయ మరచి నవ్య విధుల లో
భవితను దీర్చగ మరిగిన
కవియే మరి పతనమునకు కారణమగురా! P.Satyanarayana
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపవిదిని నీతిని జెప్పెడు
కవియే మనుజుల పెనుపుకు కారణమగుచో
అవినీతిని బోధించెడు
కవియే మఱి పతనమునకు కారణమగురా.
క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిరవి గాంచనిదియు గాంచును
కవియే! మఱి, పతనమునకు కారణ మగురా,
భువిలో నతండు పెంచగ
నవివేకంబును నిజమిది నమ్ముము సుమ్మీ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవినీతిం గొని సంచరించుటయు హేయంబైన మద్యంబు నా
రిప్లయితొలగించండినవనాడుల్ మునుగంగ ద్రాగుటయు మానంబెంచ కేనిత్యమున్
భువిలో బల్కుచు నుండుటల్ యశములం బోకార్చునో మర్త్య! నీ
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలో గాఠిన్యమే చిందుచున్.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భవవారాశిఁ దరింపఁ జేసెడి కవిత్వద్రష్టయై పోతరా
రిప్లయితొలగించండిజవనీనాథుల కంకితం బిడక స్వచ్ఛంబైన కీర్తిం గనెన్
స్తవనీయంబగు సంప్రదాయమును విధ్వంసంబు గావించు భా
వ విలాసమ్ముల నీచ సంస్కృతిని పర్వం జేయు దుష్టాత్ముఁడౌ
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలోఁ గాఠిన్యమే చిందుచున్.
స్తవనీయ వ్యాకరణము
నవహేళన సేసి ఛంద మనుసరణీయం
బ? వలదని చెప్పు కుహనా
కవియే మఱి పతనమునకు కారణ మగురా!
గురుదేవుల పద్యములు సుస్వరమ్ములు.
తొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
సువిశాల భారతమ్మున
రిప్లయితొలగించండిప్రవచింపక నైతికతను పండితుడైనన్
భువి నుగ్రవాద మెంచెడు
కవియే మఱి పతనమునకు కారణమగురా
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవినీతియు కావరమ
రిప్లయితొలగించండిన్నవలక్షణముల ధరించి నతిశయమొప్పన్
కవనము చెప్ప్చుచు నీలుగు
కవియే మఱి పతనమునకు కారణమగురా!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కావరమను। నవలక్షణముల..' అనండి.
కవి తిట్టు సుత్తిపెట్టుగ
కవి బొబ్బ ఫిరంగి దెబ్బగా ,రాజ కళిం
గవిభుడు బిచ్చ మెత్తగ
కవియే మరి పతనమునకు కారణ మగురా
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవినీతి బంధుప్రీతియు
రిప్లయితొలగించండికవిసెడి ధూర్తుల పథమ్ము కార్పణ్యంబున్
ప్రవహించెడి దారుల నిం
కవియే మఱి పతనమునకు కారణమగుగా!
కారణమగురా....అని చదువగలరు. టైపాటు.
తొలగించండిశిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భువిలో నెవ్వడును పరుల
రిప్లయితొలగించండియువిదల సంపత్తుగోరు టొప్పనితనమే
చెవినివి బెట్టనిచో మన
కవియే మఱి పతనమునకు కారణమగురా.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూరణ : (క్రమాలంకార పూరణ)
రిప్లయితొలగించండిమ.అవలోకింపగ నాత్మ బంధువెవరో యాహ్లాదమే పంచగన్?
యువశక్తిన్ మది రెచ్చగొట్టి కుదుపన్ యోచింప నేమౌనొకో?
అవివేకిన్ బ్రజ లెన్నుకున్న నతడున్నారాజ్య మెట్లేలునో?
కవియేగా మరి చేటు దెచ్చు నిలలో కాఠిన్యమే జిందుచున"
రిప్లయితొలగించండికం.అవినీతియు నయవంచన
భవితవ్యము బాడు జేయు పాపపు కృత్యా
లవలోకింపగ మనుజుల
కవియే మరి పతనమునకు గారణ మగురా !
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నవనీతంబునుబోలుమానసమునన్ నారీజనుల్ బల్కిన
రిప్లయితొలగించండిట్లవలీలన్ యుపదేశమిచ్చి జనులన్ లాలించు సత్కావ్యమే
అవి జేగూర్చనశక్తుడై విరసుడై వ్యంగ్యార్థతన్ శూన్యుడౌ
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలోఁ గాఠిన్యమే చిందుచున్ ||
నవనీతమానసంబున
నవలీలగ సూక్తిబల్కు యబలలమాడ్కిన్
కవనంబుజెప్పజాలని
కవియే మఱి పతనమునకు కారణ మగురా!
డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవిజ్. అభినందనలు.
'అవలీలన్+ఉపదేశ' మన్నపుడు యడాగమం రాదు కదా! పోతన్న గారి లాగా 'అవలీల న్నుపదేశమిచ్చి' అనవచ్చు. లేదా 'అవలీలన్ హితబోధఁ జేసి..' అనవచ్చు.
తొలగించండిఆర్య! అనేక నమస్కారములు. దోషసవరణగావించినందులకు శతధా ధన్యవాదములు. పద్యాన్ని సవరించి పంపుచున్నాను.
నవనీతంబునుబోలుమానసమునన్ నారీజనుల్ బల్కిన
ట్లవలీలన్ హితబోధజేసి జనులన్ లాలించు సత్కావ్యమే
అవి జేగూర్చనశక్తుడై విరసుడై వ్యంగ్యార్థతన్ శూన్యుడౌ
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలోఁ గాఠిన్యమే చిందుచున్ ||
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పోతన గారే కాదు గంగనార్యుడు కూడ ద్రుతానికి నచ్చు పరమైన నకారమునకు ద్విత్వము చేసిరి.
తొలగించండిప్లక్షద్వీపము ద్విగుణిత
లక్షేక్షు రసాబ్ధి సుట్టిరా విలసిల్లు
న్నిక్షు రసోదద్విగుణం
బక్షయముగ శాల్మలీ మహాద్వీప మిలన్ భాగ. 5.2.61 గంగనార్యుడు
సింగయ గారు కూడ నట్లు చేసిరి.
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు!
మ.యువకుల్లార!హితోక్తులన్మరువకన్ యోజించి పాటించుడీ!
రిప్లయితొలగించండిఅవినీతిన్ మరి బంధుబ్రీతి మొదలౌ యన్యాయ మూలమ్ములున్
భవితవ్యానికి ముప్పు దెచ్చు పనులున్ పాపమ్ము, ద్రోహమ్ము;మీ
కవియేగా మరి చేటు దెచ్చు నిలలో గాఠిన్యమే జిందుచున్
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
యువకుల దేశికు డరయఁగ
రిప్లయితొలగించండిగ వియేమఱి ,పతనమునకు కారణ మగురా
కవి చెప్పిన వినకుండిన
కవికింగల గొప్పదనము గాంచుము నరుడా !
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'యువకులకు దేశికు డరయగ..' అనండి అన్వయం కుదురుతుంది.
అవనిన్ పేదల నాదరించ కరవై నన్యాయముల్ మెచ్చుచు
రిప్లయితొలగించండిన్నవమానించుచు నాడు బుట్టువుల మ్లేచ్చాధిక్యతన్ జాటుచున్
కవనమ్మండు ప్రజా ప్రభుత్వమును ఛీత్కారమ్ము గావించు నా
కవియేగా మరి చేటు దెచ్చు నిలలో గాఠిన్యమున్ జెందుచున్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కరవై నన్యాయముల్' ఇక్కడ పదవిభాగం? కరవైన అన్యాయ మనలేము. అక్కడ 'కరవౌ నన్యాయముల్' అని ఉండాలనుకుంటాను. 'కవనమ్మండు'.. 'కవనమ్మందు'కు టైపాటు కావచ్చు.
గురుదేవులకు నంస్సులు ఆదరించ కరవైనది కాని అన్యాయములు కరవైనవి కావు తమరు సూచించినటుల
తొలగించండిసవరించిన పద్యము
అవనిన్ పేదల నాదరించ కరవౌ నన్యాయముల్ మెచ్చుచు
న్నవమానించుచు నాడు బుట్టువుల మ్లేచ్చాధిక్యతన్ జాటుచున్
కవనమ్మందు ప్రజా ప్రభుత్వమును ఛీత్కారమ్ము గావించు నా
కవియేగా మరి చేటు దెచ్చు నిలలో గాఠిన్యమున్ జెందుచున్
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కవియేగా మరి చేటు దెచ్చు నిలలో
…………… గాఠిన్యమే చి౦దుచున్ |
అవనిన్ మానవు లెల్ల చల్లనగు
…………… సౌహార్దమ్ము వర్షి౦చు , చా
ర్ప వలెన్ స్వా౦తము ల౦దు ప్రజ్వలితమౌ
…………… వైరుధ్య విద్వేష వ
హ్ని | వహి౦ప౦ దగు నీవు శా౦తి | నదియే
……………… నిన్ జేర్చు నత్యున్నతిన్ ! !
_______________________________________
{ కవియుట = ఎదురి౦చి పైబడుట ;
కవి = దే . వి . = కవియుట ;
కవియేగా = ఎదురి౦చి పైబడుట యే కదా }
్
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవిధేయత, నహము, కినుక
రిప్లయితొలగించండినవినీతియు, కడుపుమంట,నజ్ఞానంబు
న్నవలల హింసించుట మన
కవియే మరి పతనమునకు కారణమగురా!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అవిధేయత, యహము...కినుక, యవినీతియు... మంట యజ్ఞానంబున్' అనండి.
అవిధేయత, యహము లేదా అవిధేయ, నహము ఈ రెంటిలో ఏది రాయాలో ఎలా నిర్ణయించాలి . గురువుగారూ దయచేసి వివరింప మనవి.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఫణి కుమార్ గారు అవిధేయత పదము నే యర్థములో వాడదల్చుకున్నామో దానిని బట్టి ఉంటుంది. అవిధేయతన్ (అవిధేయతతో)అన్న యర్థములో అవిధేయతనతడు. అవిధేయత విశేష్యము( నామవాచకము)గా వాడినట్లయితే యడాగమము. ఇక్కడ అవిధేయత , అహము, కినుక, అవినీతి కడుపుమంట, అజ్ఞానంబు పదములన్నీ విశేష్యములు, కళలు. కాబట్టి సంధి లేమి యడాగమము.
తొలగించండిలేదా అవిధేతయున్+అహము = అవిధేయత నహము.
కడుపుమంటయున్ + అజ్ఞానంబు = కడుపుమంటయు నజ్ఞానంబు. సాధువులు.
పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు. సోదాహరణమైన మీ వివరణకి కృతజ్ఞతలు.
తొలగించండిఅవనీ జాతుల కెల్ల సంతత నిరాహార్యంబు లాజన్మ సం
రిప్లయితొలగించండిభవ విద్వేషులు లోభ మోహ మద కామక్రోధ మాత్సర్య ఘో
ర వితానమ్ములు మానవోపచితి నిర్ఘాతంబు లెన్నంగ నీ
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలోఁ గాఠిన్యమే చిందుచున్
[నీకు+అవియేగా= నీకవియేగా]
జవ సత్వ రహిత మగు వా
రువము జయమ్మును చెఱచిన రూపమ్మున స
త్కవన జగమ్మునఁ దలుపఁ గు
కవియే మఱి పతనమునకు కారణ మగురా!
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిశివ నాట్యంబున వాద్యఘోషములు వర్షింపంగ వర్ణంబులన్
రిప్లయితొలగించండికవితా శక్తిగ మారియక్షరములే కావ్యంబులందించగా
శివుడున్ లేడని వాదనంబు నిల వాసిన్ జేయు మూఢాత్ముడౌ
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలోఁ గాఠిన్యమే చిందుచున్
ఫణికుమార్ తాతా గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారూ ధన్యవాదములు.
తొలగించండినవకవితలనుచు పిలిచి,న
రిప్లయితొలగించండినవసర భావముల నింపి నశ్లీలంబు
న్నవలీలగ కూర్చగలకు
కవియే మఱి పతనమునకు కారణమగురా
చేపూరి శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీరిక వృత్తరచకు కూడా పూనుకొనండి!
తప్పకుండా
తొలగించండికృతజ్ఞతలు
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలో గాఠిన్యమే చిందుచు
రిప్లయితొలగించండిన్గవిగా నిట్లుగ బల్కగా సబబె యేకాలంబు నందున్ మరి
న్గవియే దెచ్చును సౌఖ్యముల్మనకు దా కావ్యంబు మూలంబుగ
న్నవమానంబుగనే దలంతురట పై యామా ట బల్కన్సుమీ
సుబ్బరావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమాజానికి చేటు దెచ్చే కవులూ ఉన్నారు. ప్రాచీన కావ్యాలలో 'కుకవినింద'లను చూశాము కదా!
అవిరళము స్వార్థపరుడై
రిప్లయితొలగించండిభవితను మదితల్చకుండ పాలసుడగుచున్
భువి నాయకులకు తొత్తౌ
కవియేమరి పతనమునకు కారణ మగురా
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
. అవివేకంబొనరించు కార్యములు నాహ్లాదంబు జేకూర్చినా?
రిప్లయితొలగించండిశ్రవణానందము నింపినా?వ్యసన విశ్వాసాన నజ్ఞానమౌ
అవకాశంబగు యాశ దోషముల లక్ష్యంబుంచు దుర్మార్గ మౌ
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలో గాఠిన్యమే చిందుచున్|
2.కవితాసక్తియు లేని న
నవసర మశ్లీల కవిత లాకర్షణతో
భవితకు చెడు గూర్చెడి దౌ
కవియే మఱి పతనమునకు కారణ మగురా|
3.కవితాశక్తియె ధర్మమార్గమును సంకల్పించ? సంతోషమౌ
అవకాశంబగు లోకకంఠకుడు నన్యాయాలు సూచించుచున్
భవితవ్యంబును లెక్కజేయకను లాభం బెంచు లోభత్వుడౌ
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలో గాఠిన్య మే చిందుచున్.
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో '..జేకూర్చినన్.. నింపినన్...' అనండి.
రెండవ పూరణలో 'లేని యనవసర.. చెడు గూర్చెడి యా..' అనండి.
భువి నుగ్ర వాద మూకల
రిప్లయితొలగించండిచెవికెక్కునె సూక్తులెల్ల చీకటిలోనే
పవలెల్ల గడుపు క్రూరుల
కవియే మఱి పతనమునకు కారణ మగురా !!!
మంద పీతాంబర్ గారూ,
తొలగించండిబహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నవకవితలనుచు పిలిచి,న
రిప్లయితొలగించండినవసర భావముల నింపి నశ్లీలంబు
న్నవలీలగ కూర్చగలకు
కవియే మఱి పతనమునకు కారణమగురా
'పిలిచి య।నవసర..' అనండి.
తొలగించండిభవబంధమ్మున జిక్కి భాగ్యమును సంపాదింపగా పండితుల్
రిప్లయితొలగించండికవనమ్మమ్ముచు భూరిసంపదలనే కాంక్షించుచున్నట్టి దు
ష్కవియే మరి చేటుదెచ్చునిలలో, గాఠిన్యమే చిందుచున్
జవసత్త్వమ్ములులేని కైతల తిరస్కారమ్ము నే జేయుమా!
*కందము
జవసత్త్వములిచ్చెడు స
త్కవితలనందించలేని కాలము లోనన్
యవనికి భారము సత్యము
కవులే మఱి పతనమునకు కారణమగురా
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మూడవ పాదం ప్రారంభంలో గణదోషం.
రెండవ పూరణలో 'లోనన్+అవనికి' అన్నపుడు యడాగమం రాదు. 'లోన। న్నవనికి...' అనండి.
గురువు గారికి ధన్యవాదములు
తొలగించండిమత్తేభములోని మూడవపాదము సమస్య దు| ష్కవియేగామ....
విరించిగారు "గా" మర్చి పోయారు
తొలగించండి"దుష్కవియే" తర్వాత ఒక గురు వుండాలి.
తొలగించండియువతకు సహనము ప్రేముడి
రిప్లయితొలగించండియవగతమగు రీతి గాక నసుర గుణములే
చవులూరగ మేధ నునుచు
కవియే మఱి పతనమునకు కారణ మగురా!
శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
నిన్నటి నా దత్తపది పూరణ ప్రశంసదాయకమైనందుకు
సంతోషం . మీకు ధన్యవాదాలు .
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మేధ+అనుచును' అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. 'మేధ యనుచు' అనండి.
కవులే మైనను వ్రాసెనేని జదువన్ కల్లోలమే పొంగ గా
రిప్లయితొలగించండిచవులూరం గను కావ్యముల్ మధుర సౌందర్య మహానం దమున్
భువిలో నన్ గన భూరికావ్యముల భోగమ్ము లెహేలన్ గనన్
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలోఁ గాఠిన్యమే చిందు చున్
అక్కయ్యా,
తొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం.
'వ్రాసిరేని' అనండి. రెండవ పాదం చివర, మూడవ పాదం చివర గణదోషం.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిమివులన్ శాస్త్రము లేవి నేర్వక, "మహామేధావి" నంచుం దగన్
"భువి సత్కావ్యము లెల్ల దూషితములే! పోనాడుఁ" డంచున్ శిరో
ద్భవ సోర్ధ్వస్థ ముఖానఁ బల్కుచు వెసం దర్జించు మూర్ఖంపు దు
ష్కవియేఁగా మఱి చేటుఁ దెచ్చు నిలలోఁ గాఠిన్యమే చిందుచున్!
స్వస్తి
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
భువనమునందున పరులకు
రిప్లయితొలగించండినవమానించుచు సతతము హర్షము తోడన్
నవతయనుచుతిరుగుజనుల
కవియే మరి పతనమునకు కారణమగురా.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిన్నటి దత్తపది:
రిప్లయితొలగించండిస్మరణీయమ్ముర! కౌగిలి
మరులన్ప్రభవిల్లు తీపి మావిళ్లివిగో
చొరవేది కత్తిరించగ
కురువర! నేనూర్వశిఁగద? కూడగ రాదా?
సహదేవుడు గారూ,
తొలగించండిమీ దత్తపది పూరణ బాగున్నది. అభినందనలు.
P.Satyanarayana
రిప్లయితొలగించండిరవిగాంచున్ ఛవి గాంచునో కవియు నీ రాద్ధాంతమట్లుండగా
భవితవ్యంబును గూర్చ మార్క్సు విధినిన్ భావించి సిద్ధాంతమున్
చెవినిన్ జార్చి యువాళి మానసములన్ చత్రంబుగా మార్చు నా
కవియేగా మరి చేటు దెచ్చు నిల లో గాఠిన్యమే చిందుచున్
P.Satyanarayana
భువి సంస్కృతి వెలుగొందగ
నవిరళ కృషి జేయ మరచి నవ్య విధుల లో
భవితను దీర్చగ మరిగిన
కవియే మరి పతనమునకు కారణమగురా! P.Satyanarayana
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిఈ పూరణలను ఉదయమే సమీక్షించాను గదా!
అవినీతిన్ కడుఁ బ్రోత్సహించి యను నిత్యంబున్ ప్రవర్తిల్లు చున్
రిప్లయితొలగించండిభవితన్ గూర్చి తలంచకుండగను దౌర్భాగ్యస్థితిన్ సాగుచున్
కవితల్ వ్రాయుచు దుష్టనాయకులకై కాంచంగ సౌఖ్యమ్ము లా
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలోఁ గాఠిన్యమే చిందుచున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవినీతిన్నిట చాటుచుండు సినిమాహాళ్ళందు గానాలతో
రిప్లయితొలగించండిరవికల్ చాటున నేమి యున్నవనెడిన్ రండీల నాట్యాలతో
చవిలేనట్టివి వ్రాయుచున్ ఘనముగా చప్పట్ల నాశించెడిన్
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలోఁ గాఠిన్యమే చిందుచున్!