జిలేబీ గారూ, బాగుంది. 'తెమిలి యిచట... జాలరైరి। యాంధ్రభాషయు...' అనండి. 'మేలుగ నంగ నిచట, యవగణితము'...? ********** క్రొవ్విడి వెంకట రాజారావు గారూ, శాస్త్ర జ్ఞానం కలిగి, సమాజహిత రచనలు చేసే కవులు సమస్యాపూరణల పట్లా ఆసక్తి చూపరు అన్న భావంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** పిట్టా సత్యనారాయణ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మెత్కులు, బత్కులు... రూపాంతరాలను ఏ నిఘంటువూ చెప్పలేదు. ********** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, ప్రస్తుత యథార్థ స్థితిని వివరిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. నిజమే! నాతోను కొందరు పద్యకవులు, తెలుగు పండితులు చెప్పారు. "పూరణలు చేసి బ్లాగుకు పంపాలనే ఉంది.. కాని కంప్యూటరు వినియోగం తెలియక పంపడం లేదు" అన్నారు. 'ప్రతిభల' తరువాత అరసున్నా అవసరం లేదు. ఎందుకంటే తరువాతి పదాద్యక్షరం ఆదేశ సరళం కాదు కదా! ********* అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉ.మత్కుణ రాశి పైన మరి మత్త గజమ్ముల పైన కైత వి ద్వత్కవు లైన వారు నుడువంగ సమర్థులు గారె చూడగన్ సత్కృతు లెన్న జెప్పినను చక్కగ లేని సమస్య లీయగన్ సత్కవు లెల్ల మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్. తే.గీ.కష్టమైన వైన మరి సంశ్లష్టమైన. పద్యములనెన్నొ సులువుగ వ్రాయగలిగి. సృష్టత కరువైన సమస్య సృజన జేయ. సత్వులు పూరణములకు జాలరైరి
రాత్రి పూరించాను.పోస్ట్ చేయాలంటే డెస్క్ టాప్ ఇంటర్నెట్ మొరాయించింది.ఇప్పటివరకు రాలేదు.విధిలేక మొబైల్ ఉపయోగించి ప్రచురిస్తున్నాను.ఇది భలే చికాకు కల్గిస్తుంది.
ఉ.మత్కణ రాశి పైన మరి మత్త గజమ్ముల పైన కైత వి ద్వత్కవులైన వారు నుడువంగ సమర్థులు కారె చూడగన్ సత్కృతు లెన్ని జెప్పినను చక్కగ లేని సమస్యలీయగన్ సత్కవు లెల్ల మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్. ******++++++****** తే.గీ. కష్టమైన వైన మరి సంశ్లిష్టమైన పద్యములనెన్నొ సులువుగ జెప్ప గలిగి సృష్టత కరువైన సమస్య సృజన జేయ సత్కవులు పూరణములకు జాలరైరి. ****++++++**** ఆర్యా ! నిన్న రాత్రి పూరణలను పంపటానికి ప్రయత్నించినపుడె ఇంటర్నెట్ మొరాయించటంతో ఉదయం మొబైల్ ద్వారా పంపినాను. మొబైల్ లో టైపింగ్ అంటే భలే చీకాకు కల్గిస్తుంది. అందుకని పరల పంపుతున్నాని, చిత్తగించవలెను.
జిలేబీ గారూ, మీ ప్రయత్నం ప్రశంసనీయం. చివరి పాదం అర్థం కాలేదు. వివరిస్తారా? ********** హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** చేపూరి శ్రీరామారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** శిష్ట్లా శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** గుఱ్ఱం జనార్దన రావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. టైపు దోషాలవల్ల కొంత సందిగ్ధత ఉంది. (ఇప్పుడే టైప్ దోషాలను సవరించి పంపిన పూరణలను చూశాను. బాగున్నవి). ********** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ********** పిన్నక నాగేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** పోచిరాజు కామేశ్వర రావు గారూ, సత్కవులను అసత్కవులుగా జేసిన మీ పూరణ అద్భుతంగా ఉంది. రెండవ పూరణ కూడ బాగున్నది. అభినందనలు. ********** ఫణికుమార్ తాతా గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** శ్రీనివాస్ చారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** పిట్టా వారూ, సంప్రదాయాన్ని వదలి వచన కవిత్వం వ్రాసే వాళ్ళు శబ్దాలను ఎట్లా ప్రయోగించినా అడిగేవాళ్ళు లేరు. కాని సంప్రదాయ ఛందో బద్ధంగా పద్యాలను వ్రాస్తున్నపుడు భాషా సంప్రదాయాలను కూడా అనుసరించాల్సిందే కదా! జన వ్యవహారంలో ఉన్నంత మాత్రాన అది సాధువు కాదు.
చాలక పోయిరి అన్నదానికి ఓర్వ లేక అన్న అర్థం లో సత్కవుల ప్రయత్నాలకు ముష్కరులైన అనానిమసు ఉగ్రవాదులు సంకెళ్లు (ఆత్కడి) వేయ ప్రయత్నిస్తున్నారన్న అర్థం లో ఆఖరి వాక్యం
జిలేబీ గారూ, అనానిమసు అన్న పదాన్ని నేను సరిగా గమనించలేదు. మన్నించండి. మొన్నటి వ్యాఖ్యలలో ఒక అజ్ఞాత గారి వ్యాఖ్యలను ఒకసారి గమనించండి. నిజమే! అగ్రిగేటర్లలో వ్యాఖ్యల విభాగంలో శంకరాభరణం వ్యాఖ్యలు ఎక్కువై మిగిలిన బ్లాగులకు చెందిన వ్యాఖ్యలు తొందరగా కనుమరుగవుతున్నాయి. ఆ ఉక్రోషంతో ఏదో బెదరింపు కూడా చేశాడు. నేను బ్లాగులో వ్యాఖ్యల నమోదు ఫార్మాటును మార్చాను. కాని ఇది నాకు ఇబ్బందిగా ఉంది. అందుకని అజ్ఞాత వ్యాఖ్యలు రాకుండా నియంత్రించి, పాత పద్ధతినే అనుసరిస్తున్నాను. ఈ విషయంలో మీ సలహా కోరుతున్నాను.
రెండు మీరు మునుపటిలాగనే ఆయా వ్యాఖ్యల క్రింద మీ సవరణ లను తెలుపటము మేలు( మాలిక లో ఒకేసారి ఐదు పైబడి కామింట్లు కనిపించవు ఆ రీత్యా కూడా యీ పూర్వపు పద్దతే మేలు)
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణ రెండవ పాదంలో యతి తప్పింది. "..యనుట పాడిగాదు గాంచు డవనియందు" అనండి. 'వగపుతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. 'వగపున' అనవచ్చు.
భాగవతుల కృష్ణారావు గారూ, పద్యం బాగుంది. తెలియక తప్పు చేసేవాడు మూఢుడనీ, తెలిసి తప్పు చేసేవాడు మూర్ఖుడనీ అంటారు. కనుక వ్యాకరణం తెలియక తప్పులు వ్రాసేవారిని మూఢకవులు అనవచ్చు. కాని పై మూడు పాదాలకు, చివరి పాదానికి సంబంధం?
పిట్టా వారూ, ఇక్కడ 'యాస' ప్రస్తావన ఎందుకు వచ్చింది. నేనూ "బత్కమ్మ పండగ వస్తాంది, బత్కడానికి ఏ పనైతే యేంది?" అని బంధుమిత్రులతో మాట్లాడేవాణ్ణే. మాండలికాలు, యాసలు ఎన్ని ఉన్నా ప్రపంచంలోని తెలుగు వారందరికీ గ్రాంధికం ఒక్కటే! సంప్రదాయ పద్యాన్ని వ్రాయడానికి గ్రాంధికమే యుక్తం.
డా. అనిల్ కుమార్ గారు నమస్కారములు. “సత్కృతి” కి బదులు"సత్కిృ" వ్రాశారనుకుంటాను. "సత్కిృ" ఒకే హల్లుకు రెండచ్చు లుండుట సంభవమేనా? ఈ పద ముద్రణ చాలా కష్టము కూడ. ఎలా వచ్చిందా యని యాశ్చర్యముగా నున్నది.
రిప్లయితొలగించండితెలుగు వెలుగంగ గూడిరి తెమలి నిచట
సత్కవులు, పూరణములకుఁ జాలరైరి,
నాంధ్ర భాషయు మేలుగ నంగ నిచట
తరలి యనగణితము యువతరము రమ్మ !
జిలేబి
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిశాస్త్రములనుండు పరిపూర్ణ సత్త్వ మెరిగి
నిచ్చలు సమాజ హితమెంచు నిష్ఠ గూడి
రచనలు వెలువరించుచు రహిని జెందు
సత్కవులు పూరణములకు జాలరైరి.
గురువు గారికి నమస్కారములు. నిన్నటి పద్యాన్ని చూడ గోరుతాను. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిజనులకు వలసిన దేదో
కన జాలక పోవ పగటి కలలు చెదరి నూ
తనముగ వచ్చిన యొక చే
తన పార్టీ గెల్చినంత దానేడ్చె నయో!
సత్కవులెట్లుమామూఢులరు? జాలక పోయిరె పూరణమ్ములన్?
రిప్లయితొలగించండిమెత్కులు లేవు పద్దెముకు మేలగు నో వచనమ్ము సుమ్మి యా
బత్కులు జెల్ల ఖిన్నులయి ప్రాభవ మెన్నిన శాల్తులయ్య! వే
సత్కవు లెల్ల మూడులయి చాలక పోయిరి పూరణమ్ములన్ P.Satyanarayana
స్రోతసుకు సాన బట్టెడు చూడ్కులలరె
ప్రాత పద్ధతి పూరణ పాటవమని
పద్యమును గ్రుంగ దీసెడి భద్ర యశులు
సత్కవులు పూరణములకు జాలరైరి! 😢P.Satyanarayana
కవన సృజనల యందమోఘప్రతిభలఁ
రిప్లయితొలగించండిఘన ఘనాపాఠులైనను కంప్యుటరున
వానిఁ బంపంగ వారికి వలను గాక
సత్కవులు పూరణలకు జాలరైరి
కృతజ్ఞతలు,పొరపాటు చూసుకోలేదు, గురవుగారూ
తొలగించండిసత్కవు లెట్లు మూఢులరు.....అని ఆరంభించ గలరు4వ పాదం లో"సత్కవులెల్ల మూఢులయి" గా చదువ గలరు
రిప్లయితొలగించండిP.Satyanarayana దీనిని వ్రాశారు.
రిప్లయితొలగించండితెలుగు వెలుగులు విరజిమ్ము వెలుగు కతన
రిప్లయితొలగించండినిండు ఛందస్సు జొప్పించి మెండు గాను
సత్కవులు పూరణ ములకుఁ జాలరైరి
మసగ బారిన భాషకు మలిన మంటె
త్వత్కృపచేత నీశ్వర! సుధామయ సూక్తుల బద్యరత్నముల్
రిప్లయితొలగించండిచిత్కమలాన నాటునటు చెప్పుచు నుందురు సర్వకాలమున్
సత్కవులెల్ల, మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్
సత్కృతులందరైరి గద శ్రద్ధయొకింతయులేక మాదృశుల్.
హ.వేం.స.నా.మూర్తి.
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది.
'తెమిలి యిచట... జాలరైరి। యాంధ్రభాషయు...' అనండి. 'మేలుగ నంగ నిచట, యవగణితము'...?
**********
క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
శాస్త్ర జ్ఞానం కలిగి, సమాజహిత రచనలు చేసే కవులు సమస్యాపూరణల పట్లా ఆసక్తి చూపరు అన్న భావంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
పిట్టా సత్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మెత్కులు, బత్కులు... రూపాంతరాలను ఏ నిఘంటువూ చెప్పలేదు.
**********
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
ప్రస్తుత యథార్థ స్థితిని వివరిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
నిజమే! నాతోను కొందరు పద్యకవులు, తెలుగు పండితులు చెప్పారు. "పూరణలు చేసి బ్లాగుకు పంపాలనే ఉంది.. కాని కంప్యూటరు వినియోగం తెలియక పంపడం లేదు" అన్నారు.
'ప్రతిభల' తరువాత అరసున్నా అవసరం లేదు. ఎందుకంటే తరువాతి పదాద్యక్షరం ఆదేశ సరళం కాదు కదా!
*********
అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅత్కములైన కావ్యముల ధారణ గాంచుచు నందు రమ్యతన్
సత్కవితానురాగముల సామ్యము గాంచిరి సారమొప్పగన్
సత్కవు లెల్ల ; మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్
ఆత్కడి జేయు ముష్కరులనానిమసుగ్రపువాదులిచ్చటన్
సావేజిత
జిలేబి
భోజనరపతి సభలోన పురుషు డొకడు
రిప్లయితొలగించండివచ్చి “యప్రశిఖ” యనుచు పలుకు చుండ
నచట కాళిదాసుడు దక్క యన్యులైన
సత్కవులు పూరణములకు జాలరైరి.
హ.వేం.స.నా.మూర్తి.
సత్కథాకూర్పునేర్పుగ సమ్మిళితము
రిప్లయితొలగించండిగాగ సృజియించిరి కమ్ర కావ్యరాశి
సత్కవులు, పూరణములకు జాలరైరి
కవులు కొందరు రససిద్దిగాంచలేక
జంట కవులయి వెలుగొంది సౌరు లెగయ
రిప్లయితొలగించండితెలుగు నందున నవధాన దీప్తి నింపి
కవిసె తిరుపతి వేంకట కవుల జంట,
నట్టి దిట్టల గనలేము, యశముతోడ
వార లట్టుల రంజిల్లు ధారణముల,
సత్కవులు పూరణములకు జాలరైరి!
ఉత్కళ దేశమం దొక మహోత్సవ మల్లన సాగుచుండ శుం
రిప్లయితొలగించండిభత్కవి సంగమమ్మునఁ గృపారహితుండగు పృచ్ఛకుండు "శా
ర్ఙ్గ్యుత్కట" మౌ సమస్య లిడ నుద్ధత దుష్కరమైన ప్రాసతో
సత్కవులెల్ల మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్.
("శార్ఙ్గ్యుత్కట చక్రధార శంకరుఁ జంపెన్" అన్న సమస్య నిచ్చా డనుకుందాం)
చాలా బాగుంది సార్
తొలగించండిపండిత పూరణ
ఉ.మత్కుణ రాశి పైన మరి మత్త గజమ్ముల పైన కైత వి ద్వత్కవు లైన వారు నుడువంగ సమర్థులు గారె చూడగన్ సత్కృతు లెన్న జెప్పినను చక్కగ లేని సమస్య లీయగన్ సత్కవు లెల్ల మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్. తే.గీ.కష్టమైన వైన మరి సంశ్లష్టమైన. పద్యములనెన్నొ సులువుగ వ్రాయగలిగి. సృష్టత కరువైన సమస్య సృజన జేయ. సత్వులు పూరణములకు జాలరైరి
రిప్లయితొలగించండిరాత్రి పూరించాను.పోస్ట్ చేయాలంటే డెస్క్ టాప్ ఇంటర్నెట్ మొరాయించింది.ఇప్పటివరకు రాలేదు.విధిలేక మొబైల్ ఉపయోగించి ప్రచురిస్తున్నాను.ఇది భలే చికాకు కల్గిస్తుంది.
రిప్లయితొలగించండిటైపు తప్పులున్నవి.సరి చూడగలరు.
రిప్లయితొలగించండిబుధులు మెచ్చగ రచియింత్రు బోధ నాత్మ
రిప్లయితొలగించండికములు నైనట్టి సురుచిర కావ్యములను
సత్కవులు, పూరణములకు జాలరైరి
భావ సంపద లేనట్టి భవ్య కవులు
పద పదమ్మున భావంపు పదును దెలిసి
రిప్లయితొలగించండిభాషఁ గైమోడ్చి నిలఁబెట్టు పటిమ గలిగి
దేశఁపు సమస్యలెన్నియో తెలియ గలుఁగు
సత్కవులు పూరణములకుఁ జాలరైరి
రాజకీయంపు రంకులు రాజ్యమేల
భాగవతము, రామాయణ, భారతముల
రిప్లయితొలగించండినెన్నొ గ్రంధముల రచించె మున్ను నాటి
సత్కవులు; పూరణములకు జాలరైరి
కొందరవగాహనము లేక కొంచెమైన.
హృత్కమలమ్మునందు యదుకృష్ణుని నిల్పి రచింప గాధలన్
రిప్లయితొలగించండిసత్కృతులై జనాదరణ శాశ్వత రీతిని పొందె గాని వి
ద్వత్కవిగోష్టి నాశువున వర్ణన,చాటువు క్రీడలాడుచో
సత్కవులెల్ల మూఢులయి చాలగ పోతిరి పూరణమ్ములన్
ఉత్కలికా ప్రపూర్ణ కవ నోత్సవ సత్కృత మండ పాంతరా
రిప్లయితొలగించండిత్యుత్కట హర్షణాన్విత ముఖోదజ భాసిత గర్వ సర్వ క
వ్యుత్కర సంస్థి తాంచిత నవోజ్వలమాన సభా విరాజితా
సత్కవు లెల్ల మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్
[విరాజిత+అసత్కవులు = విరాజితాసత్కవులు; ఉత్కలిక = విలాసము; అత్యుత్కటము = అత్యధికము; ఉత్కరము = సమూహము]
వైనతేయున కెదురాడ పాము సరణి
మదగజమును నిలుపగఁ దామర ఛదమన
సింహరాజము నాప మూషికము పగిది
సత్కవులు పూరణములకుఁ జాలరైరి!
[సత్కవులకు తూగు పూరణలు కావని]
చిన్న ముద్రణ దోషమును సవరించితిని.
రిప్లయితొలగించండిఉత్కళ దేశ మందుగల నొక్క గృహంబున వాసముండుచున్
రిప్లయితొలగించండిసత్కవి నంచు దానెపుడు చక్కగ బద్యము నొక్కటి న్మఱిన్
మత్కృత పద్యమేయనుచు మచ్చున కైనను వ్రాయకుండగన్
సత్కవి మాటయే పలుక శ్రావ్యము కాకను నుండుటన్ భువిన్
సత్కవు లెల్లమూడు లయి చాలక పోయిరి పూరణమ్ములన్
సత్కృప నాంధ్ర భాషనిల సాధులు మెచ్చగ సాధికారితన్
రిప్లయితొలగించండిసత్కవు లెల్ల విజ్ఞతను చాటిరి మున్నిడ పూరణంబులన్
మత్కవు లెల్ల నాంధ్రమును మన్నన జేయరదేమి శాపమో
సత్కవు లెల్ల మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్
నేడు జనులంతా పరభాషా వ్యామోహంలో అందులో కవిత్వాలు వ్రాసి తెలుగును విస్మరిస్తున్నారు అనే భావనలో.
మత్కవు లెల్ల రాంధ్రమును మన్నన జేయరదేమి శాపమో
తొలగించండికవిత రాయంగ వలెనన్నకావలయును
రిప్లయితొలగించండిసత్కవులు, పూరణములకుజాలరైరి
సంధిఛందస్సునియమాలుచదువనట్టి
వారుకవనమువ్రాయుటవసుధవింత
ఆర్యా
రిప్లయితొలగించండిP.Satyanarayanaనుండి
బత్కమ్మ'ఆరాధ్య అయింది.బత్కలేక బడి పంతులయ్యాడు.బత్కుదెరువులేక తెలంగాణ యాస అనుకుంటున్నారా?ఈనాడే అమ్మంగి వే.గో.రా "గోస" యాసను నెత్తికెత్తుకున్నారు.నిఘంటువులు నిద్రలో ఉన్నాయేమో.E nglishవి యైతే అట్టే పట్టేసుకుంటాయి.భాష జీవిస్తుంది.అటు పండితులు పాత పద్ధతులలో పద్యం నడిపించక వచన వ్యాపారం చేస్తుండగా తెనుగు నుడికారాన్ని మన్నించండి..మన జాతీయాలు పద్యం లో పడ నీయరు.అటు బహుమతులు వచన కవితకు వెళ్ళుతున్నాయి.ఇంకా dead languageఔతున్నది సంస్కృతం.పోతనకు మనమేం జవాబు చెపుతాం.ఆయన.అవ్వ.ను అమ్మగా జేసి భార్యను కూడ అమ్మగా పిలుస్తున్నాం.మనం మారాలి.p. Satyanarayzna
ఉ.మత్కణ రాశి పైన మరి మత్త గజమ్ముల పైన కైత వి
రిప్లయితొలగించండిద్వత్కవులైన వారు నుడువంగ సమర్థులు కారె చూడగన్
సత్కృతు లెన్ని జెప్పినను చక్కగ లేని సమస్యలీయగన్
సత్కవు లెల్ల మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్.
******++++++******
తే.గీ. కష్టమైన వైన మరి సంశ్లిష్టమైన
పద్యములనెన్నొ సులువుగ జెప్ప గలిగి
సృష్టత కరువైన సమస్య సృజన జేయ
సత్కవులు పూరణములకు జాలరైరి.
****++++++****
ఆర్యా !
నిన్న రాత్రి పూరణలను పంపటానికి ప్రయత్నించినపుడె ఇంటర్నెట్ మొరాయించటంతో ఉదయం మొబైల్ ద్వారా పంపినాను. మొబైల్ లో టైపింగ్ అంటే భలే చీకాకు కల్గిస్తుంది. అందుకని పరల పంపుతున్నాని, చిత్తగించవలెను.
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం. చివరి పాదం అర్థం కాలేదు. వివరిస్తారా?
**********
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
చేపూరి శ్రీరామారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. టైపు దోషాలవల్ల కొంత సందిగ్ధత ఉంది. (ఇప్పుడే టైప్ దోషాలను సవరించి పంపిన పూరణలను చూశాను. బాగున్నవి).
**********
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
**********
పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
సత్కవులను అసత్కవులుగా జేసిన మీ పూరణ అద్భుతంగా ఉంది. రెండవ పూరణ కూడ బాగున్నది. అభినందనలు.
**********
ఫణికుమార్ తాతా గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
శ్రీనివాస్ చారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
పిట్టా వారూ,
సంప్రదాయాన్ని వదలి వచన కవిత్వం వ్రాసే వాళ్ళు శబ్దాలను ఎట్లా ప్రయోగించినా అడిగేవాళ్ళు లేరు. కాని సంప్రదాయ ఛందో బద్ధంగా పద్యాలను వ్రాస్తున్నపుడు భాషా సంప్రదాయాలను కూడా అనుసరించాల్సిందే కదా! జన వ్యవహారంలో ఉన్నంత మాత్రాన అది సాధువు కాదు.
తొలగించండికందివారు
నెనర్లు
చాలక పోయిరి అన్నదానికి ఓర్వ లేక అన్న అర్థం
లో సత్కవుల ప్రయత్నాలకు ముష్కరులైన అనానిమసు ఉగ్రవాదులు సంకెళ్లు (ఆత్కడి) వేయ ప్రయత్నిస్తున్నారన్న అర్థం లో ఆఖరి వాక్యం
మూఢులయి ఓర్వ లేకపోయిరి పూరణమ్ములన్
ఆత్కడి జేయు ముష్కరు లనానిమసుగ్రపువాదు లిచ్చటన్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిఅనానిమసు అన్న పదాన్ని నేను సరిగా గమనించలేదు. మన్నించండి.
మొన్నటి వ్యాఖ్యలలో ఒక అజ్ఞాత గారి వ్యాఖ్యలను ఒకసారి గమనించండి. నిజమే! అగ్రిగేటర్లలో వ్యాఖ్యల విభాగంలో శంకరాభరణం వ్యాఖ్యలు ఎక్కువై మిగిలిన బ్లాగులకు చెందిన వ్యాఖ్యలు తొందరగా కనుమరుగవుతున్నాయి. ఆ ఉక్రోషంతో ఏదో బెదరింపు కూడా చేశాడు. నేను బ్లాగులో వ్యాఖ్యల నమోదు ఫార్మాటును మార్చాను. కాని ఇది నాకు ఇబ్బందిగా ఉంది. అందుకని అజ్ఞాత వ్యాఖ్యలు రాకుండా నియంత్రించి, పాత పద్ధతినే అనుసరిస్తున్నాను. ఈ విషయంలో మీ సలహా కోరుతున్నాను.
తొలగించండికందివారు
అనానిమస్సులు బ్లాగ్లోకం లోని వారే ;
వారి వాక్య నిర్మాణం లోనే ఎవరో అని కూడా తెలుస్తోంది
మీ రిప్పుడు చేసిన పద్ధతి సరియే అనిపిస్తోంది
జిలేబి
రెండు మీరు మునుపటిలాగనే ఆయా వ్యాఖ్యల క్రింద మీ సవరణ లను తెలుపటము మేలు( మాలిక లో ఒకేసారి ఐదు పైబడి కామింట్లు కనిపించవు ఆ రీత్యా కూడా యీ పూర్వపు పద్దతే మేలు)
తొలగించండిజిలేబి
ఆర్యా
రిప్లయితొలగించండిP.satyanarayana నుండి
బావా యెప్పుడు......చుట్టము ల్ తో తి.వేం.కవులు పామర జనాన్ని ఆకట్టుకుంటే చుట్టం సం.యేనా?👍
పిట్టా వారూ,
తొలగించండితి.వేం. కవుల పద్యాలలో వ్యాకరణ విరుద్ధ పదాలు, వ్యావహారికాలు, గ్రామ్యాలు లేవు కదా! చుట్టముల్ అన్నది గ్రాంధికమే కదా!
సత్కళ సాధనాన మనసన్నది ముఖ్యము|” సన్నగిల్లుచో
రిప్లయితొలగించండిఉత్కళ మైన యూహలచె యున్నతపూరణజేయ శక్యమా?
సత్కవు లైనమూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్
సత్కవులెందరున్నను?ప్రశాంతత తగ్గిన సాధ్యమెట్లగున్”?
2.కవులు భవితకు బాధ్యతల్ గలుగజేయు
వనములట్లుగ రక్షకుల్ వసుధయందు|
సత్కవులు పూరణములకు జాలరైరి
ఫలిత మందించు పథకాలపంటలాగ|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఊహలచె అన్నచోట చే ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు.
బ్రతుకు బాటన నడిపించు బావమెఱిగి
రిప్లయితొలగించండితేట తెనుగున కైతకు తీపి నిడిరి
సత్కవులు! పూరణములకు జాలరైరి
కావ్యముల లోతు దెలియని కవులు మహిని!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
సత్కవులంచు వారలను సమ్మతి దేశము గారవించగా
రిప్లయితొలగించండిహృత్కుహరంబునందు వికృతేచ్ఛల శక్తుల గాపుగాయు యే
తత్కవి ధూర్తులే విధిని దారకమార్గములన్ వచింతురో
సత్కవులెల్ల మూఢులయి చాలకపోయిరి పూరణమ్ములన్
బహుమతి గ్రహీతలైనకవులు దేశద్రోహశక్తులకు కొమ్ము కాయు చో, వారి రచనలు దెశసమస్యలకు ఏవిధమైన మార్గాలను చూపగలవని నా భావన. గురువుగారి సమీక్ష కై సమర్పణ
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
'..గాపుగాయు నే।తత్కవి...' అనండి.
సత్కవు లన్న వారిలను శారద మాత కృపార్థ లబ్దులై
రిప్లయితొలగించండిసత్కవితా సుధా రసము జాతికి పంచెడు ప్రాజ్ఞులే గదా
సత్కవు లెల్ల , మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్
సత్కవితాపటుత్వపు విచారము జేయని పండితోత్తముల్ .
సాహితీ సుమ గంధపు సౌరభాల
విస్తరింపగ జేసెడు విజ్ఞులుగద
సత్కవులు , పూరణములకుఁ జాలరైరి
మిడిమిడి ప్రతిభన మిడిసి పడెడు వారు.
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మూడవ పాదంలోని 'సత్కవులెల్ల' అన్నది పునరుక్తి.
ప్రజల బాగుకై కవితలఁ వ్రాసె నెవరు?
రిప్లయితొలగించండికవితలన్ ప్రాపు దేనికి కలదు చెపుమ?
చదువకన్ పద్య రచనము సలుపగలర?
సత్కవులు, పూరణములకుఁ,జాలరైరి
ప్రజల బాగుకై కవితల వ్రాసిరి గత
సత్కవులు, పూరణములకు జాలరైరి
నేటి కుకవులు కావ్యముల్ నేర్వలేక
చదువు లేకుండ రచనల సలుప తరమె?
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'వ్రాసి రెవరు' అనండి.
సత్కవులు పూరణములకు చాలరైరి
రిప్లయితొలగించండియనుట పాడిగాదు గనుము వసుధ యందు
సత్కవివరేణ్యు లెందరో చక్కనైన
పూరణముల చేతను పరిపుష్టులైరి.
నిన్నటి పద్యాలనొకసారి చూడగలరు.
జనులొసగిరి ఘనవిజయము
తనవారెల్లరును మెచ్చ తాదాత్మ్యముతో
మనమున హర్షంబొదవగ
తనపార్టీ గెలిచినంత తానేడ్చె నయో.
వినయము తోమ్రొక్కె ప్రజకు
తన పార్టీ గెలిచినంత,తానేడ్చెనయో
ఘనుడొక్కరుడిటు వగపుతొ
ధనమును పరువును జగతిన దగ్గెనటంచున్
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ రెండవ పాదంలో యతి తప్పింది. "..యనుట పాడిగాదు గాంచు డవనియందు" అనండి.
'వగపుతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. 'వగపున' అనవచ్చు.
సత్కృినొక్కటైనసరసమ్మగురీతిని జేయనెంచనా
రిప్లయితొలగించండిపత్కరమౌచు దుష్కరపు ప్రాసయదొక్కటి యడ్డునిల్చె, సం
పత్కరభావనాబలగభస్తిఁఘనావృతమైనయత్తరిన్
సత్కవు లెల్ల మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్ ||
దుష్కరప్రాసయైన సంతుష్టినొసగు
సంస్కృతాంధ్ర భాషలయందు సంధిజేయ
గల్గు కవులకు, పాండిత్యగరిమయంద
సత్కవులు, పూరణములకుఁ జాలరైరి.
డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.
గభస్తి తరువాత అర్ధానుస్వారం ఎందుకు?
ఆర్య! నమస్కారములు. మీరు చెప్పినది నిజమే.అర్ధానుస్వారం అనావశ్యకం. పరిహరణీయం. సవరించి పంపుతున్నాను. ధన్యవాదాలు
తొలగించండిసత్కృినొక్కటైనసరసమ్మగురీతిని జేయనెంచనా
పత్కరమౌచు దుష్కరపు ప్రాసయదొక్కటి యడ్డునిల్చె, సం
పత్కరభావనాబలగభస్తి ఘనావృతమైనయత్తరిన్
సత్కవులెల్ల మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్ ||
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమాన్యులు సుకవులు శ్రీ మూర్తి గారికి శ్రీ ఫణి కుమార్ గారికి ధన్యవాదములు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఉత్కళ దేశపు౦ గుకవి యు౦చె విచిత్ర
…………… సమస్య లెన్నొ | దీ
వ్యత్కృతులన్ రచి౦చిన మహా మహు
………………… ల౦దరు , దిగ్గజ౦బు లౌ
సత్కవు లెల్ల మూఢులయి చాలక పోయిరి
……………… పూరణ౦బులన్ |
చీత్కృతి మాని పూరణము చేసె చమత్కృతి
……………… రామకృష్ణ | కి౦
చిత్కరమున్ వివాదమును సేయక వాడిక
……………… పోయె వెన్కకున్
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
పద్యరచనకు ఛాందస పరిధులుండె;
రిప్లయితొలగించండిగన "య" డాగమ, మరసున్న, గ్రాంధిక పద
ములను వాడని కవులెల్ల మూఢులు గద!
సత్కవులు పూరణములకుఁ జాలరైరి
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిపద్యం బాగుంది. తెలియక తప్పు చేసేవాడు మూఢుడనీ, తెలిసి తప్పు చేసేవాడు మూర్ఖుడనీ అంటారు. కనుక వ్యాకరణం తెలియక తప్పులు వ్రాసేవారిని మూఢకవులు అనవచ్చు. కాని పై మూడు పాదాలకు, చివరి పాదానికి సంబంధం?
సత్కవితావిధానమున సాగుచునున్న వధానమందు దీ
రిప్లయితొలగించండివ్యత్కరభావనాపటిమ వ్యక్తముజేయఁ శెబాసనంగా నా
సత్కవు లెల్ల, మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములం
దుత్కట పద్యపాటవమునోర్వఁగనా కుకవీ గణంబులున్.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
శెబాసనంగా(గ).. టైపాటు.
ఆర్యాప
రిప్లయితొలగించండిP.Satyanarayanaనుండి
బత్కమ్మ'ఆరాధ్య అయింది.బత్కలేక బడి పంతులయ్యాడు.బత్కుదెరువులేక తెలంగాణ యాస అనుకుంటున్నారా?ఈనాడే అమ్మంగి వే.గో.రా "గోస" యాసను నెత్తికెత్తుకున్నారు.నిఘంటువులు నిద్రలో ఉన్నాయేమో.E nglishవి యైతే అట్టే పట్టేసుకుంటాయి.భాష జీవిస్తుంది.అటు పండితులు పాత పద్ధతులలో పద్యం నడిపించక వచన వ్యాపారం చేస్తుండగా తెనుగు నుడికారాన్ని మన్నించండి..మన జాతీయాలు పద్యం లో పడ నీయరు.అటు బహుమతులు వచన కవితకు వెళ్ళుతున్నాయి.ఇంకా dead languageఔతున్నది సంస్కృతం.పోతనకు మనమేం జవాబు చెపుతాం.ఆయన.అవ్వ.ను అమ్మగా జేసి భార్యను కూడ అమ్మగా పిలుస్తున్నాం.మనం మారాలి.p. Satyanarayzna
Dear Tata
garu, take it easy Namaste!
ఉత్కళ లోన నైన తెలుగున్నది యున్నటులైన జూడకన్
సత్కవులాంధ్ర మిద్దెయని చాటుచు నద్గదె చేష్ట జేయగా
"మత్కవు"లన్న తెన్గు నుడి మానిన మానవ మాననీయులా
"మత్కవు"లెల్లరాంధ్రమును మన్నన జేయ రదేమి టంటిరో!
పిట్టా వారూ,
తొలగించండిఇక్కడ 'యాస' ప్రస్తావన ఎందుకు వచ్చింది. నేనూ "బత్కమ్మ పండగ వస్తాంది, బత్కడానికి ఏ పనైతే యేంది?" అని బంధుమిత్రులతో మాట్లాడేవాణ్ణే. మాండలికాలు, యాసలు ఎన్ని ఉన్నా ప్రపంచంలోని తెలుగు వారందరికీ గ్రాంధికం ఒక్కటే! సంప్రదాయ పద్యాన్ని వ్రాయడానికి గ్రాంధికమే యుక్తం.
భీష్మునికె వింతగా యగుపించు నట్టి
రిప్లయితొలగించండికాల మహిమ విసురు సమస్యలకు, విష్ణు
మాయనే నిజమనుకొను మానవులగు
సత్కవులు పూరణములకు జాలరైరి
నితీశ్ చంద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది.
'వింతగా నగుపించు' అనండి. రెండవపాదంలో ప్రాసయతి తప్పింది. ప్రాసకు ముందున్న అక్షరాల గురులఘు సామ్యాన్ని పాటించాలి.
శంకరయ్య గారు, సూచనలకు ధన్యవాదాలు. నాకు ప్రాసకు ముందు గురులఘు సామ్యముండాలని ఇప్పుడే తెలిసింది. తదుపరి పద్యాల్లో ఇది పాఠిస్తాను.
తొలగించండిడా. అనిల్ కుమార్ గారు నమస్కారములు.
రిప్లయితొలగించండి“సత్కృతి” కి బదులు"సత్కిృ" వ్రాశారనుకుంటాను.
"సత్కిృ" ఒకే హల్లుకు రెండచ్చు లుండుట సంభవమేనా? ఈ పద ముద్రణ చాలా కష్టము కూడ. ఎలా వచ్చిందా యని యాశ్చర్యముగా నున్నది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆర్యా ! పోచిరాజు కామేశ్వరరావుగారూ !నమస్కారములు. తొందరపాటుగా టైపు చేయుటలో జరిగన ముద్రణ స్ఖాలిత్యాన్ని గుర్తించి తెలియజేసినందుకు శతధా ధన్యవాదములు. సవరించి పంపుతున్నాను.
తొలగించండిసత్కృతినొక్కటైనసరసమ్మగురీతిని జేయనెంచనా
పత్కరమౌచు దుష్కరపు ప్రాసయదొక్కటి యడ్డునిల్చె, సం
పత్కరభావనాబలగభస్తి ఘనావృతమైనయత్తరిన్
సత్కవు లెల్ల మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్ ||