17, సెప్టెంబర్ 2016, శనివారం

సమస్య - 2146 (రాముఁడు రాక్షసుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రాముడు రాక్షసుఁడు సీత రక్కసి యయ్యెన్"
లేదా...
"రాముఁడు రాక్షసుండుగను రాక్షస కాంతగ సీత యయ్యెడిన్"

108 కామెంట్‌లు:


 1. సామూహిక పరిణయములు
  నీమముగా జేసెనంట నిండు మనంబున్
  క్షేమము కోరుచు మురియగ
  రాముడు రాక్షసుఁడు సీత రక్కసి యయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   పద్యం లక్షణంగా ఉంది. కాని భావమే దురవగాహంగా ఉంది. వివరణ కావాలి!

   తొలగించండి
  2. క్షమించాలి
   ఒకడు మంచిపనులు చేయాలన్న ఉద్దేశ్యముతో సామూహికముగా పెళ్ళిళ్ళు చేసి , అందరుసుఖంగా ఉండాలని కోరుకుంటే , కొందరు భర్తలు రాక్షసులు గాను భార్యలు సాద్వులు గాను ఉండి ఇబ్బందిపడుతున్నారు " అనిభావము. [సుఖముగా లేరు అని భావము ]

   తొలగించండి
  3. అక్కయ్యా,
   ఇప్పుడు మీ భావం బోధపడింది. బాగుంది. ధన్యవాదాలు.

   తొలగించండి
 2. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కాముకుడైన రావణుడు గౌరున సీతను తస్కరించగా
  ధామము దోడుతన్ వెదకి దండును గూడుచు రాముడే గియున్
  గాముల జంపుజుండు వడి కర్వరు లందరి కండ్లకప్పుడున్
  రాముడు రాక్షసుండుగను రాక్షస కాంతగ సీత యయ్యెడిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   పద్యం బాగుంది. కాని పూరణ సమర్థనీయంగా ఉన్నట్టు లేదు. రాక్షసుల కళ్ళకు సీతారాములు రాక్షసులవలె కన్పించడం?

   తొలగించండి
 3. నీమ మొకింత లేక యనునిత్యము దుర్మతులై, మదాంధులై
  ధీమతులైనవారలను దిట్టుచు నాస్తిక భావయుక్తులై
  భూమి జరించునట్టి యెనుబోతుల దృష్టికి సద్గుణాఢ్యుడౌ
  రాముడు రాక్షసుండుగను రాక్షస కాంతగ సీత యయ్యెడిన్.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 4. నామములు వారి కున్నవి
  రాముడు, సీతయుననంగ రంగస్థలిపై
  నీమమున నటన జేయగ
  రాముడు రాక్షసుడు సీత రక్కసి యయ్యెన్.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 5. నీమదొక్కటొక్కటిగ నీరును గార్చగనర్థ వృద్ధికై
  సామముతో విదేశతతి జక్కగ బిల్చియు భూమినిత్తుమే
  మేమొకనాడు పొండనుచు మీ మెడ బట్టియు గెంట సత్యమే
  రాముడు రాక్షసుండుగను రాక్షస కాంతగ సీత యయ్యెడిన్?!
  P.Satyanarayana

  రిప్లయితొలగించండి
 6. రాముని మందిర నేల న
  ధామ మదల్లాదటన్న దరువు బరువవన్
  మేమును రక్కసులము సుమి
  రాముడు రాక్షసుడు సీత రక్కసి య య్యెన్!!!
  P.Satyanarayana

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'మది+ఒక్కటి' అన్నపుడు యడాగమం వస్తుంది, సంధి లేదు. అయినా అక్కడ గణదోషం. "నీ మది యొక్కటొక్కటిగ...' అనండి.
   రెండవ పూరణ అగమ్యంగా ఉంది. 'మందిర నేల' దుష్ట సమాసం. రెండవ పాదం అర్థం కావడం లేదు. వివరణ ఇవ్వండి.

   తొలగించండి
 7. P,Satyanarayana
  మొదటి చ,ణములోనితృటి:నీమమ దొక్క.....గాచదువ ప్రార్థన

  రిప్లయితొలగించండి
 8. నీమము దప్ప కుండగను నేరము లెంచక రాక్షసాం గనల్
  గోముగ జెప్పుచుం డిరట కోరిన వన్నియు మోదమం దగా
  ప్రాపుగ సంతసం బునను రావణు చెంతను చేరి నంతనే
  రాముఁడు రాక్షసుండగును రాక్షస కాంతగ సీతయయ్యెడిన్

  రిప్లయితొలగించండి
 9. రాముని రాజ్యము ధర్మా
  రామము,ప్రేమానురాగ రంజితమవగా
  హోమతప విఘ్నులనణచ
  రాముడు రాక్షసుడు సీతరక్కసిఅయ్యెన్

  రిప్లయితొలగించండి
 10. గురువు గారికి నమస్కారములు. మీ సూచన ననుసరించి నిన్నటి పద్యములో అన్వయాన్ని సాధించడానికి ప్రయత్నించి సవరించిన పద్యాన్ని మీ పరిశీలన కోసం ఇక్కడ వుంచాను. చూడ గోరుతాను. ధన్యవాదములు.
  ఉల్లాసంబున బాలుడమ్మను గనన్, ఓ నా పితా రమ్మనెన్
  తల్లీ యంచు సుతుండు పిల్చెనదిగో తండ్రిన్ ముదంబొప్పగ
  న్నుల్లంబుల్ ద్యుతి సోకు పంకజములై యొప్పార, మాతాపితల్
  సల్లాపంబుల దేలి నవ్వుచు మదిన్ సంతృప్తులై రంతటన్!

  రిప్లయితొలగించండి
 11. క్రొవ్విడి వెంకట రాజారావు:

  రాముడు సీత లిరువురున్
  రామాయణ నాటకమున రాణించునటుల్
  గాముల నటనను చేకొని
  రాముడు రాక్షసుడు సీత రక్కసి యయ్యెన్.
  (గాములు= రాక్షసులు )

  రిప్లయితొలగించండి
 12. నేమము నందున జూడగ
  రాముడు రాక్షసుడు; సీత రక్కసి యయ్యెన్
  ప్రేమను గాదని చివరకు
  తా మాతను జేరెనకట! దైన్యము గలుగన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శిష్ట్లా శర్మ గారూ,
   పద్యం బాగుంది. కాని పూరణ భావం అర్థం కాలేదు. వివరణ ఇవ్వండి.

   తొలగించండి
  2. గురువుగారూ నమస్సులు. రాముడు నియమమందున రాక్షసుడి లాంటివాడని, సీత చివరలో రాముని ప్రేమను కాదని, తల్లియొడిని చేరుటలో రక్కసి లాంటిదను భావములతో పూరించినాను. అక్కడ ధర్మమే యున్నను వారి పట్టుదలల పటిమను పూరణలకు స్వీకరిచడం జరిగినది.

   తొలగించండి


 13. భామా జానకి మగడెవ
  డో ? మా రీచుండతడెవడో? నతడెవరి
  న్నేమార్చె? శూర్పణఖయో ?
  రాముడు, రాక్షసుఁడు, సీత, రక్కసి యయ్యెన్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. కం.నీమాలెరుగక తిరిగెడి
  కాముకులకు దుష్ట జనులు ఖలులకు మరియు
  న్నేమెరుగని పాపులకున్
  రాముడు రాక్షసుడు సీత రక్కసి యయ్యెన్.

  రిప్లయితొలగించండి
 15. మిత్రులందఱకు నమస్సులు!

  అంతర్జాలావరోధము వలన నేను నిన్నటి సమస్యకు (శార్దూలమున) పూరణము పెట్టలేకపోయాను. దానిని నేఁడు ఈ దిగువన ఇస్తున్నాను. పరిశీలించగలరు.

  (కళాపూర్ణోదయ కథను అనుసరించి చేసిన పూరణము)

  సల్లాపోక్తుల భార్య భర్తయయె నిష్ఠన్ భర్తయే యప్డుఁ దా
  నిల్లాలై జతఁగూడఁ బుట్టెను వెసన్ దీవ్యద్గుణోత్కృష్టుఁడై
  ఫుల్లాబ్జాక్ష సుచంద్ర సాదృశ కళాపూర్ణుండునై వెల్గి, "యో

  తల్లీ!" యంచు సుతుండు పిల్చె నదిగో తండ్రిన్ ముదంబొప్పఁగన్!

  రిప్లయితొలగించండి
 16. [తమ ననాథలుగాఁ జేసిన సీతారాములు, దానవుల తలఁపులలో రాక్షసులుగాఁ జిత్రితమైనారనుట]

  "నేమము తోడుత రాముఁడు
  మా మాన్యుని రావణుఁ బరిమార్చి, యనాథల్
  గా మార్చె" నను దనుజులకు

  రాముఁడు రాక్షసుఁడు; సీత రక్కసి యయ్యెన్!

  రిప్లయితొలగించండి
 17. ఉ. కాముక మంద భాగ్యులకు కర్కశ మూకలు దుర్జనాళికిన్
  నీమమెరుంగనట్టి కడు నీచులు, ద్రోహము సల్పువారికిన్
  పామరులై చరించుచును పాపము నిత్యము జేయు వారికిన్
  రాముడు రాక్షసుండుగను రక్కసి కాంతగ సీత యయ్యెడిన్.

  రిప్లయితొలగించండి
 18. క్రమాలంకార పూరణ:
  కం.జామాతెవరు జనకునికి?
  రామారెవ రవనినిజ యగు రమణియె యెవ్వరు?
  కామించె నెవతె రాముని?
  రాముడు రాక్షసుడు సీత రక్కసి యయ్యెడిన్
  (మొదటి రెండు పాదాలలో యడాగమం తప్పదా? ఇక్కడ రాసినవి దుస్సంధులవుతయా?)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'జామాత+ఎవరు, రామారి+ఎవరు' అన్నపుడు యడాగమం వస్తుంది. రెండవపాదం చివర తప్పక గురువుండాలి. మీ పూరణకు నా సవరణ...
   జామాత జనకున కెవరు?
   రామారి యెవడు? యెవరు ధరాత్మజ యనగా?....

   తొలగించండి
  2. శంకరయ్య గారూ ! ధన్యవాదాలు సవరణలకు. యెవరో ? అని టైప్ చేయ బోయి యెవ్వరు అని టైప్ చేసినట్టున్నాను. ఇక కందములో సరి పాదాలకు తుది గురువన్నది కంద పద్య రూపంలోనే తొమ్మిదవ తరగతిలో చదువు కున్నదే కదా ! ఆ పద్యమిప్పటికీ కంఠస్థమే. మరొక్కమారు ధన్యవాదాలు.(అది టైప్ మిస్టేక్)

   తొలగించండి
 19. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  నామములు మరియు జాతక

  నీమము లన్నియు కలిసె నని మనువు సేయన్

  రామునకు సీత , కయ్యో

  రాముడు రాక్షసుడు - సీత రక్కసి యయ్యెన్

  ……………………………………………………


  భూమిజ ల౦క నున్న తరి , మోహితు రాలి

  ………………… నొనర్ప నావిడన్ ,

  రాముని రూపము౦ బడసి రావణు డేగుచు

  …………...... ను౦డె | నాతనిన్

  గామ పిశాచి - శూర్పనఖ క్ష్మాసుత గా

  ………………… నయి కౌగిలి౦చె | నా

  రాముడు రాక్షసు౦ డగును | రాక్షస కా౦తగ

  ……………… సీత యయ్యెడిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 20. ప్రేముడి తోనచ్చటి యా
  రామములందున చరించు లంక ప్రజలకున్
  భీమముగ పతిని దునిమిన
  రాముఁడు రాక్షసుఁడు; సీత రక్కసి యయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 21. కామము క్రోధమున్ మదవికారము మత్సర లోభమోహముల్
  నీమముదప్పి వర్ధిలెఢు నిత్య కుకర్ములచెంత నీకలిన్
  తాము వసించబూని చను ధార్మికవర్తను లైన మారరే
  రాముడు రాక్షసుండగును రాక్షస కాంతగ సీతయయ్యెడిన్
  హ.వేం. స.నా.మూర్తి  రిప్లయితొలగించండి
 22. క్షేమముగా వసించుచును క్షేత్రము నందు కుటుంబముల్
  ఆమని గొంచు సంతతము నద్భుతమైన పురమ్ములోన నా
  రామములన్ ముదమ్ముగొను రక్కసిమూకకు రాజుఁదున్ము శ్రీ
  రాముడు రాక్షసుండుగను రక్కసి కాంతగ సీత యయ్యెడిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదం చివర గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. క్షేమముగా వసించుచును క్షేత్రమునన్ తమ యాజవమ్ముతో
   నామని గొంచు సంతతము నద్భుతమైన పురమ్ములోన నా
   రామములన్ ముదమ్ముగొను రక్కసిమూకకు రాజుఁదున్మ శ్రీ
   రాముడు రాక్షసుండుగను రక్కసి కాంతగ సీత యయ్యెడిన్
   ఆజవముః సంసారము.

   తొలగించండి
 23. భీముడుద్రాగినయప్పుడు
  నేమేమోపలుకునెపుడునిరవగుసద్దు
  న్నీమాటలుబలికెనిటుల
  రాముడురాక్షసుడుసీతరక్కసియయ్యెన్

  రిప్లయితొలగించండి
 24. ఆ మునిదీవనల్గొని మహాద్భుతమౌ హరుకార్ముకంబునున్
  రాముడు రెండుజేయగను రాజుల గుండెలు వ్రయ్యెలయ్యె సూ!
  శ్రీమతియయ్యె సీత- యటచిందులు ద్రొక్కెడివారికక్కటా
  రాముడు రాక్షసుండుగను రాక్షసకాంతగ సీతయయ్యెడిన్.

  రాముడు వింటిని విరువగ
  భూమిజ వరియించి వైచె పూమాలికలన్
  ఆ మణి దక్కని నృపులకు
  రాముడు రాక్షసుడు సీత రక్కసి యయ్యెన్.

  రిప్లయితొలగించండి
 25. కోమలి జానకి భర్తను
  కామించిన శూర్పనఖను గానని కతనన్
  కామిని విరూపి మదిలో
  రాముడు రాక్షసుడు సీత రక్కసి యయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నితీష్ చంద్ర గారు మీ పూరణ మృదు మధురము గా మనోహరముగా నున్నది. అభినందనలు.
   “కరుణించమి యా” యనిన మరింత బాగుంటుందని నా యభిప్రాయము.

   అలాగే “.. భర్తను / గామించిన.. “ అనండి.

   తొలగించండి
  2. నితీశ్ చంద్ర గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  3. పోచిరాజు కామేశ్వరరావు గారు, సూచనలకు ధన్యవాదాలు.
   ౧. 'కరుణించమి' అంటే అర్థం ఏమిటి?
   ౨. అవును. భర్తను + కామించిన దగ్గర సంధి చేయడం మరచిపోయాను.

   తొలగించండి
  4. నితీష్ చంద్ర గారూ “కరుణించమి” కరుణించు నకు వ్యతిరేకము. కరుణించక పోవుట. వ్యతిరేకార్థములో క్రియకు “మి” వస్తుంది. “వండమి”, “పండమి” వలె.
   రాముడు శూర్పణఖ కోరిక తీర్చలేదు కదా అందుకని ఈ పదము సముచితము. కానని అన్న పరవాలేదు. దయచూడనిగా యర్థము చేసుకోవచ్చు. సందర్భోచిత పదములు కవిత్వానికి వన్నె తెస్తాయి.

   తొలగించండి
  5. పోచిరాజు కామేశ్వరరావు గారు, ధన్యవాదాలు.

   దయచేసి "మి" ని వాడుకలో ఎలా వాడాలో కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరు.

   తొలగించండి
  6. పడ్డ శ్రమ ఫలించమి నిరాశఁ జెందెను.
   ఆకలితో నింటికి వచ్చి వంట వండమి కనఁ గోప ముప్పొంగెను. ఇత్యాదులు.

   తొలగించండి
 26. ఏమఱి నిదురించఁ గలను
  గోముగ పురుషద్వయమును కొమ్మ లిరువురన్
  నామదిఁ గంటిని చూడగ
  రాముడు, రాక్షసుఁడు, సీత, రక్కసి యయ్యెన్


  కామ రూపులైన రాక్షసుల చేష్టల నుద్దేశించి పూరణ:


  కామము ప్రజ్వరిల్లగను కర్బురు డాదశ కంఠుడే ఘన
  శ్యాముని వేష మూన మరి జానకి వేషము చుప్పనాక యా
  రామము చేరి చూడగ దురంతము గోచర మయ్యె నచ్చటన్
  రాముఁడు రాక్షసుండుగను రాక్షస కాంతగ సీత యయ్యెడిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 27. భూమిజను వరించె నెవరు?
  భామా! లంకేశుడెవడు, పార్థివి యనగా?
  కాముకి శూర్పణఖ యెవరు?
  రాముడు, రాక్షసుడు, సీత ,రక్కసి యయ్యెన్!!!  నీమమును దప్పువారికి
  పామరులై దిరుగు చుండు పాపాత్ములకున్
  తామస గుణులకు జగదభి
  రాముడు రాక్షసుడు సీత రక్కసి యయ్యెన్!!!

  రిప్లయితొలగించండి
 28. కం.ప్రేమగ పేరిడు చుదురు
  నామ కరణమున పురాణ నామముల గొనిన్
  ఏమని చెప్పుదు నకటా !
  రాముడు రాక్షసుడు సీత రక్కసి యయ్యెన్.

  రిప్లయితొలగించండి

 29. తామటనటులయ్యున్ నట
  భూమిన్ విత్తమ్ము కొఱకు పోరాడంగా
  నేమని వర్ణింపగనౌ
  రాముడు రాక్షసుఁడు, సీత రక్కసి యయ్యెన్ ||  ఏమరుపాటులేకనొకయింతయు రామకథన్ నటింపగన్
  తామట రంగభూమిపయి దాల్చియు వేషమునిర్వురచ్చటన్
  కామితవిత్తసంగతికి కయ్యములాడ పరస్పరంబుగన్
  రాముఁడు రాక్షసుండుగను రాక్షస కాంతగ సీత యయ్యెడిన్ ||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కవి మిత్రులు డా.మాడుగుల అనిల్ కుమార్ గారికి. మీ పద్యాలు హృద్యముగా నున్నవి.

   తొలగించండి
  2. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
   నటీనటుల కలహం విషయంగా మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. మాన్యశ్రీ పొన్నెకంటి సూర్యనారాయణరావు గారికి మఱియు మాన్యశ్రీ కంది శంకరయ్య ఆచార్యుల వారికి ధన్యవాదములు.

   తొలగించండి
 30. నామమ్ములు సాత్వికమని
  సేమమ్మా జాతకమన?చిత్రము గనరే
  నీమమ్ముగ గణములఁ గన
  రాముఁడు ‌‌‌‍రాక్షసుఁడు సీత రక్కసి యయ్యెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 31. శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారి పూరణ చాలా బాగుంది.

  వారి బాటలోనే ఆనందరామాయణం లోని సందర్భంలో నా ప్రయత్నం:

  రాముని జూచి మోహపడి రావణు చెల్లెలు సీత రూపియై
  ప్రేమగ జేర వచ్చె నట పృథ్విసుతన్ హరియింప రావణుం
  డామెను పట్టి దెచ్చె నట యానక పొందగ సాజరూపముల్
  రాముఁడు రాక్షసుండుగను రాక్షస కాంతగ సీత యయ్యెడిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆనందరామాయణం కాదు విచిత్ర రామాయణం అనుకొంటున్నాను.

   తొలగించండి
  2. మిస్సన్న గారూ,
   బాగుంది మీ పూరణ. అభినందనలు.
   ఇది ఏ రామాయణంలోనిదో నాకు తెలియదు కాని 'సీతారామ కళ్యాణం' సినిమాలో ఇలాంటి సన్నివేశం ఉంది.

   తొలగించండి
  3. మిస్సన్న గారు ధన్యవాదములండి. మీ పూరణ కూడా చాలా బాగుంది.
   “మోహపడి” (ధాతు వనుమానము) బదులు “ఆశపడి” (మిశ్రమ పదము); ఆనక (వ్యవహారికము) బదులు అంతట (అనంతరము); “సాజ రూపముల్” (ఈ సమాస మసాధువేమోయని యనుమానము, సాజము వికృతి కదా. ఇక్కడ వృత్తి లో ము వర్ణ లోప మనుమానము) బదులు “స్వీయరూపముల్” అన్న బాగుంటుందేమో పరిశీలించండి. అన్యథా భావించకండి. సాహిత్యాభిలాషతోనే వ్రాస్తున్నాను.

   తొలగించండి
  4. కామేశ్వరరావు గారూ మీ సూచనలకు కడుంగడు ధన్యవాదములు.

   తొలగించండి
  5. కామేశ్వరరావు గారూ మీ సూచనలకు కడుంగడు ధన్యవాదములు.

   తొలగించండి
 32. కాముకియౌ శూర్పణఖకు
  కామాంధుడు రావణునికి కావర మణచన్
  యా మూఢ దానవులకిల
  రాముడు రాక్షసుడు సీత రక్కసి యయ్యెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   'అణచన్+ఆ' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 33. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  గు రు వ ర్యు ల కు ధ న్య వా ద ము లు

  రిప్లయితొలగించండి
 34. గాముల నాశకు డెవ్వడు?
  ఆ మారీచుండెవండు?యవనిజ యెవరో?
  యేమయె హతమయి పూతన?
  రాముడు, రాక్షసుడు, సీత, రక్కసి యయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఎవండు+అవనిజ... అన్నపుడు యడాగమం రాదు. "..మారీచుం డెవండో? యవనిజ..' అనండి.

   తొలగించండి
 35. ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
  "రాముడు రాక్షసుఁడు సీత రక్కసి యయ్యెన్"
  లేదా...
  "రాముఁడు రాక్షసుండుగను రాక్షస కాంతగ సీత యయ్యెడిన్"


  నామొర నాలకింపరిల నాస్తికు లెవ్వరు మూర్ఖరాజు లై
  భామను కానకంపెనని వాలిని జంపెను చాటుమాటుగా
  రాముడనంచు వాడికి సరైన సతీమణి యైన నారియున్
  రాముఁడు రాక్షసుండుగను రాక్షస కాంతగ సీత యయ్యెడిన్

  భూమిజగా శూర్పణఖయు
  రాముడుగారావణుండు ప్రణయము కొరకై
  కాముకులై జేరి గనిరి
  రాముడు రాక్షసుఁడు సీత రక్కసి యయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'రాము డటంచు..' అనండి.

   తొలగించండి
 36. రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి.
   'అయ్యెన్+ఏమరుపాటు' అన్నపుడు యడాగమం రాదు.
   ఉత్పాలమాల మొదటి పాదంలో గణదోషం.

   తొలగించండి
 37. రాముడు రాక్షసుండుగను రాక్షస కాంతగ సీత యయ్యెడి
  న్సోము డ ! యేమి యీపలుకు శుద్ధిగ మాటలు రావవా ?యిక
  న్నేమన వచ్చు నిన్నిపుడు నిట్లుగ బల్కుట కేమి త్రాగితే ?
  మామను జూచితే యెటుల మాంద్యము తోడననుండెనో క టా !

  రిప్లయితొలగించండి
 38. రాముని సతి తృణమును గొని
  రాముడె నిను జంపు ననిని రావణ! యన, నా
  కామాంధుని కండ్ల కపుడు
  రాముడు రాక్షసుఁడు సీత రక్కసి యయ్యెన్

  రిప్లయితొలగించండి
 39. నామమ్ములు సాత్వికమని
  సేమమ్మా జాతకమన?చిత్రము గనరే
  నీమమ్ముగ గణములఁ గన
  రాముఁడు ‌‌‌‍రాక్షసుఁడు సీత రక్కసి యయ్యెన్!

  రిప్లయితొలగించండి
 40. శ్రీకందిశంకరయ్య గురువర్యులకు వందనములతోసవరించినపూరణ
  .కాముకుడగు రావణుతో
  రాముడు రాక్షసుడు|”సీతరక్కసియయ్యెన్|
  వేమరుపాటుగగదిపిన?
  సామాన్యమ?సింహ మట్లు చంపగ నెంచున్|
  2.ప్రేమకు నడ్డుగోడగను వేదన రావణుడుంచిపెంచగా?
  క్షేమమునింపి|”రావణుని కీడును గూర్చగ యుద్దభూమిలో
  రాముడు రాక్షసుండుగను|రాక్షస కాంతగసీత యయ్యెడిన్”.
  “నీమము లున్న వారల ననేకుల రక్షగసీత రాములున్”.


  రిప్లయితొలగించండి
 41. మామనుమరాలు మనుమడు
  యేమాత్రము సైపబోరు యెవరల్లరి, యో
  మామా! విద్యార్థులకట
  రాముడు రాక్షసుఁడు సీత రక్కసి యయ్యెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మనుమడు+ఏమాత్రము' అన్నపుడు యడాగమం రాదు. 'మనుమం। డేమాత్రము..' అనండి.

   తొలగించండి
  2. మాస్టరుగాఊ! ధన్యవాదములు.మీరు చూపిన సవరణతో....

   మామనుమరాలు మనుమం
   డేమాత్రము సైపబోరు యెవరల్లరి, యో
   మామా! విద్యార్థులకట
   రాముడు రాక్షసుఁడు సీత రక్కసి యయ్యెన్.

   తొలగించండి
 42. P.Satyanarayana
  ఆర్యా
  నీమమదొక్కటొక్కటిగ...తో మొదలు పెట్టమని నోట్లో ప్రార్థన చేసాను మీరు చూడనట్టున్నారు.అదే పాదంలో అర్థ వృద్ధికై అని ఉంది.మిగతా చరణాలను అర్థం చేసుకోవడానికి అది మూలం.మనం భారతీయులం ఒకనాడు జంటలుగా(రాముడు ‌సీతలమై)విదేశీయులను గెంటి వేశాము.ఆ దేశభక్తి ఏమైంది?మాభూమి యిస్తాము రండని ఈనాడు పిలుస్తున్నాం.నియమాలను తుంగలోత్రొక్కి మా నియతిని దిగజార్చుకుంటున్నాం.ఆర్థికాభివృద్ధి కోసం చేసే ఈ పని కవికి యిష్టం లేదు.కావున నాటి సీతారాముల్లాంటి వారు రాక్షసులైనారని ఏమైనా వైపరీత్యం జరిగితే మనలను భావితరం రాక్షసులనవచ్చు అన్న ధ్వని మీకు కలగడంలేదా?నిక్కంగా రాక్షసులమయ్యామని కవి హృదయం అంటున్నది
  PSatyanarayana
  నేలన. నేలపై. అనే భావన. దుష్ట సమాసమని యిక ఆ భావాన్నే పరకింపరా?నేను"లోకాలోకనం" అనే పుస్తకం రాసి గరిక పాటి వారికి పంపగా దు.స.ఐనా భావాలు బాగు బాగని ‌మాధానం యిచ్చారు.సంస్కృతం ఒప్పుకోదన్నంత జ్ఞానం వచ్చే వరకు మీలాంటి విజ్ఞులకు మాతో గాయాలవడం ఖాయం అంత వరకు ఓపిక వహించిimaginative readers సంఖ్యను పెంచడానికి మీblog కృషి చేస్తుందనే ఆశతో మీP.Satyanarayana

  రిప్లయితొలగించండి
 43. స్వామీ!!ఇక రెండవపూరణంలోధామమదల్లాదటంచు అన్న వారెవరో రామ జన్మభూమి వివాదం గూర్చి తెలిసినవారుwings of imagination తో అటు తిరిగి అర్థం చేసు కుంటారు.మేము నరరూప రాముడు సీతలమై ఓపిక వహి‌స్తున్నా మనుకోకండి ఇకపై tit for tat చూపడానికి మీరు రాక్షసత్వం చూపారు .మేము మా ‌సీతా రాములు కలిసి రాక్షసత్వాన్ని రాక్షసత్వం తో జయిస్తాము సుమా అన్నధ్వని మీకు చేరలేదా?నా రాముణ్ణి రాక్షసునిగా అన్న పాపం నాకు ఈ సమస్య వల్ల ఏర్పడెనే అని నే నేడ్చాను.ఇంకా ఏడ్పించరని ఆశిస్తూ మీp.Satyanarayana😢

  రిప్లయితొలగించండి
 44. జాకే ప్రియ్ న రామ్ వైదేహీ
  తజియె తాహి కోటి వైరీ సమ్
  యద్యపి పరమ సనేహీ
  రామునికి సీతకు ప్రేమ చూపని వారిని కూడగూడదని చంద్ దాస్ మీరా బాయి ప్రశ్నకు సమాధానంగా చెప్పి పంపారు.ఇకముందు దైవతాలను చిన్న బుచ్చే సమస్యలను స్వీకరించి దయచేసి ప్రచురించకండి మీP.Satyanarrayana

  రిప్లయితొలగించండి
 45. ఆర్యా
  Imaginative reader కు ఉదాహరణం
  The lovely woods are dark and deep
  I have the promises to keep
  And miles to go before I sleep
  And miles to go beforeI sleep!
  ఈ lines నెహ్రూ గారి టేబల్ పై glass క్రింద తన స్వ హస్త లిపిలో వ్రాసి పెట్టుకొనగా కనుగొన్నారు. తరువాతి మూడు రోజులకే వారు స్వర్గస్థులైనారు.w oods అనేవి ఆకర్షణల.promises అనేవి బాధ్యతలు. sleep అనేది మృత్యువు.నెహ్రూ గారి అవగాహన పాఠకునిగా అది.కొందరు అట్లని అందులో లేదు కదా అన్వయంకుదురలేదంటారు
  వారే imaginative readers కానివారు.

  రిప్లయితొలగించండి
 46. ఇక ధ్వని:
  Amercan poet RobrtFrost వ్రాసిన పద్యమది.ఒక సాయంత్రం ఆయన తన గుర్రం పై యిటికి మరలి వస్తున్నాడు.ఇంకా చన ఊరు దూరంగా ఉన్నది.కాని ఆ సాయం వేళ అడవి శోభాయమానంగాఉన్నది.గుర్రం మెడ ఊపింది.దానికిimagination లేదు.కాని కవి ఉలికిపడి తన duty ని గుర్తు చేసికొని తన ప్రయాణాన్ని సాగిస్తాడు.ఆయన ప్రయోజనం వేరు. కాని imaginative reader తన అర్థం నెహ్రూ లాగా తీసుకుంటాడు. ఇదీ పద్యం లోని ధ్వని మీకు సమయంలేక నా పద్యాల్లోని ధ్వనిని వదలి వేసి వివరణ కోరినారు గాన ఇది వ్రాశాను.అన్యధా భావించకండీ.p. Satyanarayana

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా వారూ,
   మీ ఆవేదనను అర్థం చేసుకున్నాను. సీతారాముల గురించి దోష. నిందా పూరిత వాక్యాలుగా గతంలో గొప్ప గొప్ప అవధానాలలో అడిగిన సమస్యల ముందు ఈనాటి సమస్య ఒక లెక్కలోనికి కాదు. నేను సేకరించిన వానిలో అటువంటివి కొన్ని ఉన్నాయి. (గతంలో కొన్ని ఈ బ్లాగులో ఇచ్చాను కూడా! అప్పుడు కూడా కొందరు మిత్రులు అభ్యంతరం చెప్పారు). వాటిని ఇక్కడ వ్రాసి మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేదు.
   ధామ మదల్లా దటంచు... అన్నచోట సంధిదోషం వల్ల భావం అర్థం కాలేదు. అది+అల్లా అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ మీరు అల్లాను ప్రస్తావించారన్నది బోధ పడక అడిగాను.
   ఈ బ్లాగు పద్యరచనాభ్యాసానికి వేదిక. అందువల్ల మిత్రులు పూరణలో వెలిబుచ్చిన భావాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను. నా దృష్టి ఎక్కువగా ఛందోవ్యాకరణాలమీదే ఉంటుంది. దుష్టసమాసాలు, సంధి దోషాలు నా దృష్టికి వచ్చినపుడు తెలియజేస్తూ ఉంటాను. అప్పటికీ కొన్ని దోషాలను చూసీ చూడనట్లు వదిలేస్తూ ఉంటాను.
   మీకు మనస్తాపం కలిగించి ఉంటే మన్నించండి.

   తొలగించండి