కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పడఁతికి నాతితోడనె వివాహము గావలె శాస్త్రపద్ధతిన్"
లేదా...
"పడఁతి నాతినే పెండ్లాడవలెను వలచి"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పడఁతికి నాతితోడనె వివాహము గావలె శాస్త్రపద్ధతిన్"
లేదా...
"పడఁతి నాతినే పెండ్లాడవలెను వలచి"
రిప్లయితొలగించండిపడఁతి, నాతినే పెండ్లాడవలెను వలచి
పురుషుడు! అదియే సరియగు పూర్వ విధము!
వినవలెను సుమీ ! వినకోయి వింత గాను
నేటి కాలపు కథలను నియతి బోవు !
జిలేబి
అక్కయ్యా,
తొలగించండిపడతి శబ్దాన్ని సంబోధనగా చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
'పురుషుడు+అదియే' అన్నపుడు సంధి నిత్యం. 'పురుషు డద్దియే...' అనండి.
Gay వివాహం చేసుకుంటానన్న కొడుకుతో తండ్రి
రిప్లయితొలగించండినడువవు "గే" వివాహములు నా సుత భారత దేశమందునన్
మిడిమిడి జ్ఞానమున్ గలిగి మిక్కిలి యాధునికమ్ము జూపుచున్
పుడమిని సృష్టినీమములు బొత్తుగ వీడకు - తాళి కట్టుమీ
పడఁతికి -నాతితోడనె వివాహము గావలె శాస్త్రపద్ధతిన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పునరాగమనం సంతోషదాయకం.
గే వివాహా ప్రస్తావనతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
సూర్యనారాయనగారూ! చక్కని పూరణతో మీ పునరాగమనము సంతోషము గలిగించినది.
తొలగించండిసుధను పంచగ విష్ణువు చోద్యము గను
రిప్లయితొలగించండిసుంద రాంగిగ మారెను సోయ గమున
బ్రమసె శంకరు డంతట పరవ శించ
పడఁతి , నాతినే పెండ్లాడ వలెను వలచి
అక్కయ్యా,
తొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు :
రిప్లయితొలగించండిగురువుగారూ! నమస్కారములు. నిన్నటి సమస్యా పూరణ పద్యాన్ని సవరించాను. దయతో పరిశీలించ గలరు.
కాముకుడైన రావణుడు గౌరున సీతను తస్కరించగా
నేమము జేసియున్ వెదకి నెమ్మిని జూపక రావణాదులన్
నామమడించగా నదవలైన పలాశుల గేస్తురాళ్ళకున్
రాముడు రాక్షసుండుగను రాక్షస కాంతగ సీత యయ్యెడిన్.
(అదవులు = ఆనాధలు; పలాశులు = రాక్షసులు; గేస్తురాళ్లు = భార్యలు)
రాజారావు గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నామ మడిం(డం)చగా..' అన్నచోట టైపాటు అనుకుంటాను.
పుడమికి భారమౌ విధిని పుత్రుల పుత్రికలన్ గనంగనే
రిప్లయితొలగించండిఇడుములు సుమ్మి రత్నముల నిమ్ముగ మల్చగ లేని జంటలై
మిడుకగనేల సమ్మతిని మ్లేచ్ఛులు శాసన మంద జేసిరో
పడతికి నాతి తోడనె వివాహము గావలె శాస్త్ర పద్ధతిన్..p.Satyanarayana
నేటి సన్యాసినులకున్న నిండుదనము
జూడ జంజాటములు లేని జోక హెచ్చె
మహిళ జంటల శాసనాల్ మనెను హూణ
పడతి నాతినే పెండ్లాడ వలెను వలచి...P.Satyanarayana
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పురుష. పుంగవ ప్రేమను పొంద వలయు
రిప్లయితొలగించండిపడతి, నాతినే పెండ్లాడవలెను వలచి,
మమత తోడుత ప్రేయసి మనసు గెలిచి,
యిరవు నందగ వలయు రహించి మించి!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుస్తె ముడివేయ వలెనంట పురుషు డొకడు
రిప్లయితొలగించండిమమత పంచగ తల్లిగా మదిని దోచి
పడఁతి , నాతినే పెండ్లాడ వలెను వలచి
భరత దేశాన వనితకు భాగ్య మిదియె
అక్కయ్యా,
తొలగించండిబాగుంది మీ తాజా పూరణ. అభినందనలు.
dhanya vaadamulu
తొలగించండిఅడుగులు వేయుచుండిరిలనంగనలున్ పురుషాధిపత్యమున్
రిప్లయితొలగించండిపుడమినణంగద్రొక్కగనపూర్వవిధానము సాగుచుండెగా
పడఁతికి నాతితోడనె వివాహము, గావలె శాస్త్రపద్ధతిన్
పడతికి విష్ణురూపుడగు భర్తయె, వంశము తీర్చి దిద్దగన్ ||
పుడమిపురుషాధిపత్యమ్మునడగద్రొక్క
నడుసుఁ ద్రొక్కుచు పెండ్లాడనడుగువేసె
పడఁతి నాతినే, పెండ్లాడవలెను వలచి
శాస్త్రపద్ధతి సంతానసౌఖ్యమొంద.
పుడమిపురుషాధిపత్యమ్మునడగద్రొక్క
రిప్లయితొలగించండినడుసుఁ ద్రొక్కుచు పెండ్లాడనడుగువేసె
పడఁతి నాతినే, పెండ్లాడవలెను వలచి
సద్గుణాఢ్యుని సంతానసౌఖ్యమొంద.
డా. మాడ్గుల అనిల్ కుమార్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు మిక్కిలి బాగున్నవి. అభినందనలు.
ఆర్య! ధన్యవాదాలు.
తొలగించండిడా. అనిల్ కుమార్ గారూ నమస్కారములు.
తొలగించండి"..నంగనలున్ పురుషాధిపత్యమున్"
"పురుషాధిపత్యమున్ / పుడమి"
"శాస్త్రపద్ధతిన్ / పడతికి"
మీరు ద్రుత సంధి చేయక పోవుట కేమైనా ప్రత్యేక కారణ మున్నదా? తెలుప గోర్తాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఆర్య! అనేక నమస్కారములు. మీరు చెప్పినది అన్ని విధములుగ సరియైనది. ఇచ్చటనున్న పండితవర్గమునకు అలా సంధి చేయుట ఇంపుగూర్చును.కానీ బయటనున్న పామరవర్గమును దృష్టిలోనుంచుకొని అటువంటివారికి కూడ సులభబోధ్యము కావలయునను తలంపుతో విసంధి చేయుట జరిగినది. ధన్యవాదాలు.
తొలగించండిఅడుగులు వేయుచుండిరిలనంగనలుం బురుషాధిపత్యముం
తొలగించండిబుడమినణంగద్రొక్కగనపూర్వవిధమ్మున సాగుచుండెగా
పడఁతికి నాతితోడనె వివాహము, గావలె శాస్త్రపద్ధతిం
బడతికి విష్ణురూపుడగు భర్తయె, వంశము తీర్చి దిద్దగన్ ||
మాన్యశ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారూ! మీరు తెలియజేసినట్లు సవరించితిని. ధన్యవాదములు.
డా. అనిల్ కుమార్ గారూ సంశయ నివృత్తి చేసినందులకు ధన్యవాదములండి.
తొలగించండిగురువు గారికి నమస్కారములు. నిన్నటి సవరించిన పద్యాన్ని చూడ గోరుతాను. ధన్యవాదములు.
రిప్లయితొలగించండికాముకియౌ శూర్పణఖకు
కామాంధుడు రావణునికి కావర మణచ
న్నీమ మెఱుగని దనుజులకు
రాముడు రాక్షసుడు సీత రక్కసి యయ్యెన్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుడమిని జన్మవృద్ధులును, పోడిమి నింపెడి ప్రేమబంధముల్
రిప్లయితొలగించండికడకిక నత్త రూపమున కట్నముపేరిట నిత్యపీడలున్
పడతికి నాతితోడనె, వివాహము గావలె శాస్త్రపద్ధతిన్
ముడిపడువేళ యింతులకు మోదము గూర్చెడి బాసలందుచున్.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండివిరుపుతో చక్కని పూరణ నందించారు. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిభర్త యనగ దేవుడటంచు పలుకుచుండు
పడతి నాతినే పెండ్లాడవలెను వలచి
ననుచు దిరిగెడి వానికి నాన్న చెల్లి
తనయల నిలువడి మదిలో తలపు దట్టె.
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సుందరాంగివి, దరహాస శోభితవిక
రిప్లయితొలగించండిమధురవాక్కులతోడ నా మానసమున
నిలిచి యున్నావు సత్యంబు నిన్నె వినుము
పడతి! నాతి! నే పెండ్లాడవలెను వలచి.
హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిఅద్భుతమైన విరుపుతో మంచి పూరణ చేశారు. అభినందనలు.
సుగుణశీలభావమమరు సుందరునియె
తొలగించండిప్రేమమనమున చిగురించ పెండ్లియాడి
పడతి, నాతినేపెండ్లాడవలయు వలచి
పురుషుడిలను ధర్మనిరతి పెంపుసేయ
చేపూరి శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సుందరునియె'? అక్కడ 'సుందరాంగు' అనండి.
బెడసు మహోగ్ర తాపమున భీష్ముని జంపగ బెట్టు జేసి దా
రిప్లయితొలగించండినిడుముల జంకకుండ కడు నిష్ఠగ సంయతి నాచరించుచున్
విడువక వైరభావనము వేరగు జన్మను పొందినట్టిని
ప్పడఁతికి నాతితోడనె వివాహము గావలె శాస్త్రపద్ధతిన్
ఫణికుమార్ గారూ,
తొలగించండిశిఖండి ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బెడను'...?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినీకుమారుని మాటలు భీకరములు
రిప్లయితొలగించండిపడతి! నాతినే పెండ్లాడ వలెను వలచి
పురుషు డెపుడు పుడమిని తాఁ బొంద ముక్తి
తెలియజేయుము సుతునకు తెల్లముగను
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ప్రణామములు నా కుమారుని సహాయముతో తెలుగులో టైపు చేసినాను పైన చేసిన తప్పులను మన్నింప ప్రార్దన
రిప్లయితొలగించండిమాద్యమము లందు మగువల మాటలు విని
పరుషమున బలికె నిటుల బాలుడొకడు
పడతి నాతి నే పెండ్లాడవలెను ,వలచి.
వచ్చినను వద్దన వలెను కచ్చి తముగ
కందుల వరప్రసాద్ గారూ,
తొలగించండిమీ పునరాగమనం సంతోషదాయకం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జడమతులైన గొందఱు విశాల వివేకశూన్యులై
రిప్లయితొలగించండిపెడసర బుద్ధితోడ మదపిచ్చిగ జేయుచుండిరా
పడతికి నాతితోడనె వివాహము-కావలె శాస్త్ర పద్ధతిం
బుడమిని భారతీయత సపూర్ణవిశిష్ఠ వికాసమందగన్.
పెండ్లియన్నది వంశంబు బెఱుగు కొఱకు
పురుషుడనువాని వాంఛించు పుడమినెపుడు
పడతి,నాతినే పెండ్లాడవలెను వలచి
యనుటనాగరికత్వంబు హానికరము.
పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి.
మొదటి పూరణ మొదటి రెండు పాదాల చివర గణదోషం. సవరించండి.
ముడుపులు పొంది పండితుడు మూర్ఖుడు బల్కగ వచ్చు నీగతిన్
రిప్లయితొలగించండి''పడఁతికి నాతితోడనె వివాహము గావలె శాస్త్రపద్ధతిన్''
కుడుములు ప్రీతిమై గొనుచు కోరికలన్నెర వేర్చు విష్ణు తో
ముడులను మూడు వేయుటకు ముందు వధూవరులట్లు బల్కరే!
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఖరువు వరమున బుట్టె శిఖండి స్థ్రీగ
రిప్లయితొలగించండిగాని పెంచెను పురుషుని గా ద్రుపదుడు
పెంద్లి గావించె నామెకు 'విధి లిఖితము'
'పడతి నాతినే పెండ్లాడ వలెను వలచి'
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుడమి సుఖమ్ముకై విభుని పూర్తి సహాయము కావలెన్ సదా
రిప్లయితొలగించండిపడఁతికి -నాతితోడనె వివాహము గావలె శాస్త్రపద్ధతిన్
తడబడకుండ పూరుషులు తద్దయుప్రీతిని సాగ నిత్యమున్
విడువక పాత పద్ధతులు విశ్వసితమ్ముగ నుండ మేలగున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దృపదుడు తన పెద్ద కూతురు (అంబ) వివాహము దశార్ణ దేశాధీశుండగు హేమవర్మ యను రాజు పుత్రికతో జరిపించు సందర్భము:
రిప్లయితొలగించండిఅడరి తపమ్ము సేయ ననలాంబకు డిచ్చిన మాట తప్పునే
పడతి శిఖండి కిత్తరి వివాహ వయస్సరు దెంచెనే భయం
పడ నుచితమ్మె పుంస్త్వము నవారిత మెమ్మెయి దైవ లీలలం
బడఁతికి నాతితోడనె వివాహము గావలె శాస్త్రపద్ధతిన్
రూపము గన సుందరము సులోచనములు
మనసు సూడ వెన్న యట సంశయము వలదు
ముదముగా నను వలచెను సదమల మతిఁ
బడఁతి, నాతినే పెండ్లాడ వలెను వలచి
కామేశ్వరరావు గారికి నమస్సులు. నేనూ ఇదే భావనతో వ్రాయ సంకల్పించి నా భావనని పలికించడం కష్టంగా అనిపించి మార్చి వ్రాశాను. మీ పూరణ అత్యద్భుతంగా ఉన్నది.
తొలగించండికామేశ్వరరావుగారు నమస్సులు. మీ పూరణలనితర సాధ్యము. మనోహరముగానున్నవి.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిసూర్యనారాయణ గారు నమస్కారములు. మీ ప్రోత్సాహానికి ధన్యవాదము లండి.
తొలగించండిఫణి కుమార్ గారు నమస్సులు. మీరు కూడా మీ భావాన్ని సమగ్రముగా వ్యక్తపరచినారు. అభినందనలు. “జన్మను బొందినట్టి యి / ప్పడఁతికి” అనండి.
గురుతుల్యులు కామేశ్వర రావు గారికి నమస్సులు. మీ పూరణలు అద్భుతంగా వున్నాయి. రెండు పద్యంలోని రెండవ పాదంలో యతి యెలా వేశారు....
తొలగించండిశర్మ గారు నమస్సులు. అక్కడ ము వర్ణ యతి మైత్రి చేకూర్చితిని.
తొలగించండిమవర్ణయతి :- బిందుపూర్వకాలైన అంతఃస్థాలు (య,ర,ల,వ లు), ఊష్మాలు (శ,ష,స,హ లు) మకారంతో యతి చెల్లుతుంది.
ఉదా-
*మర్దితదైత్యసం*యమిమనోబ్జాదిత్య
*మహితమేఘాభ సం*రక్షితేశ
*మాయాప్రవర్తి సం*లబ్ధనిర్మలకీర్తి
*మణిహార సురవశం*వదవిహార
*మందరధైర్య వం*శ నినాద చాతుర్య
*మా భూప యువతి పుం*షండరూప
*మంజులస్వాంత కం*స ధరావరకృతాంత
*స్మరహరారాధ్య సిం*హనిభమధ్య.... [అప్పక. ౩.౭౬]
గురువుగారూ ధన్యవాదములు నమస్సులు
తొలగించండివిలువైన సమాచారం యిచ్చినందులకు కృతజ్ఞతలు
తొలగించండిఆర్యా!
తొలగించండిమీ పూరణ మిక్కిలి ప్రశంసనీయముగా నున్నది. అభివాదములు.
ఆర్యా!
తొలగించండిమీ పూరణ మిక్కిలి ప్రశంసనీయముగా నున్నది. అభివాదములు.
మూర్తి గారు ధన్యవాదములండి.
తొలగించండికామేశ్వరరావు గారూ మీ సవరణకి ధన్యవాదములు.
తొలగించండిపోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
***************
పూరణలపై స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు. ఇదే విధంగా రోజూ అందరి పూరణలపై స్పందిస్తే బాగుంటుందని నా మనవి.
పడతి నాతి నే పెండ్లాడ వలెను వలచి
రిప్లయితొలగించండిబాగు బాగుగ నున్నది వాక్య మదియ
దాని మూలాన తగ్గును ధరణి సంతు
లింగ భేదము లేకుంటయంగనలకు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దుడుకు తనంబు గాంచితిని తొందరఐ మెండట నీదు ప్రేయసిన్
రిప్లయితొలగించండివిడుమని జెప్ప నామెకు నభీష్టము తెల్పితినీవిధంబునన్
గడసరి కాదు సద్గుణ సుగాత్రియె నాప్రియురాలనంచనా
పడతికి, నాతితోడనె వివాహము గావలె శాస్త్ర పద్ధతిన్
వంశ గౌరవమ్మునిలను పది తరాల
వరకు గాపాడు కోడలై వచ్చినట్టి
పడతి, నాతిని పెండ్లాడ వలెను వలచి
యట్టి గుణసంపదయె గల యతివ నెఱగి
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కోట్ల వరకట్న మిచ్చిన గోర నేల
మగువ లక్షణమే లేని మాచకమ్మ -
పడతి (న్) ? నాతినే పె౦డ్లాడ వలయు వలచి |
ధన్యమగు నోయి నీ జీవితమ్ము వినుమ
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈడువచ్చిన యువకుడు వీడులోన
రిప్లయితొలగించండితిరుగకుండగ నాబోతు తీరుగాను
సంప్రదాయమ్ము నిలబెట్టు సఖిని,సుదతి
పడతి, నాతిని పెండ్లాడ వలెను వలచి.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
యిడుములు యున్నలెక్కిడక ,యింతియు చింతను వీడ బోక,యే
రిప్లయితొలగించండిడడుగులు వేయునట్టి మనసందున జేరిన సుందరాంగియౌ
పడతికి నాతితోడనె వివాహము గావలె శాస్త్ర పద్ధతిన్
గడచిన కాలమందు తనకందిన శాపముదీరుమార్పుకై|
2.జాతి జాగృతి జగతికి జతగ జట్టు
సర్వ సౌఖ్యాల సంపద సాకుసతియె|
లక్ష లాభాల లక్ష్యాలలౌక్య లతిక
పడతి|”నాతినే పెండ్లాడ వలెను వలచి
భార్యాభర్తల బంధముభగవ దేచ్చ”.|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'యిడుములు' అని యడాగమంతో పద్యాన్ని ప్రారంభించారు.
'ఇడుములు+ఉన్న' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.
తొలగించండిఅడుగులు యేడు వేసి నడయాడుచు తా, తలలోని నాల్కయై
రిప్లయితొలగించండిగడుపగ మేలు గూర్చు రతి కాంతుని కిన్ సతివోలె నిల్వగా
పడఁతికి;నాతితోడనె వివాహము గావలె శాస్త్రపద్ధతిన్,
ముడివడ తారచంద్ర బలముల్ యిరురాశుల మైత్రి బంధమున్
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవిమిత్రులారా, నమస్కృతులు.
రిప్లయితొలగించండిహైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గురజాడ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న పురస్కార సభకు చేరుకున్నాను. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేయవలసిందిగా మనవి.
గిడుగులయింట బుట్టిన నగేషుడు నీడగుగాదె యిప్పుడీ
రిప్లయితొలగించండిపడతికి ,నాతి తోడనె వివాహము గావలె శాస్త్ర పధ్ధతి
న్నడరినరక్తి తోడన నహాయని లోకము గార వించగన్
విడివడ కుండ బంధము వివేకము తోడన జేయగా వలెన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిన్నటి సమస్యకు పూరణ, క్షమాపణలతో
రిప్లయితొలగించండివామాశయ నాస్తిక భా
వామోదిత రచనల సేయు నాయంగనయే
రామాయణమున్ వ్రాయగ
రాముడు రాక్షసుడు సీత రక్కసి యయ్యెన్
నేటిసమస్యకు పూరణ
లెస్బియనులు'గే'లు మరి స్వలింగ సుఖులు
వింతలీనాటి యువతకు వేనవేలు
పురుషుడు మరియొకని జేరి పొందుగోరు
పడతి నాతిని పెండ్లాడవలెను వలచి
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
ముదిత వేషమ్ము వేసెడు వదనముండ
రిప్లయితొలగించండినాయకీమణి పాత్రలన్ వేయు నతఁడు
వయసు మీరక మునుపె యా పడతి కాని
పడతి, నాతినే పెండ్లాడ వలెను వలచి
గుండా సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రేమ కురిపించి ప్రియురాలి ప్రేమ పొందు
రిప్లయితొలగించండినట్టి పురుషు బెంఢ్లాడ నానందమొందు
పడతి; నాతినే పెండ్లాడ వలెను వలచి
పురుషు లెవరైన సంప్రీతి పొందగాను.
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దృఢముగ ప్రేమతో దిరుగు ధీరతతోగల ప్రేమ జంటకున్
రిప్లయితొలగించండితడయక చేయ మేలగును తమ్ముని పెండిలి వేడ్కమీరగన్
కడు ముదమొంది నా మగువ గాంచియు నూతన కన్యకామణిన్
పడఁతికి నాతితోడనె, వివాహము గావలె శాస్త్రపద్ధతిన్
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాలిక వ్యాఖ్యల సెక్షన్ నిండా మీ పద్యాలే. రోజు కి ఎన్ని పద్యాలు రాస్తారు? మీరు రాసేదేమైనా సాహిత్యమా? మీకు తోడు చీప్ క్వాలిటి పద్యాలు రాస్తూ జిలేబి. ప్ద్యాలు రాయటం మీకొక వ్యసనం అయ్యింది. చీట్లు ఆడేవారికి మీకు ఎమి తేడా?
రిప్లయితొలగించండిఇన్ని రోజులు బ్లాగులో ఉన్నారు, ఏ ఇతర సమకాలిన అంశంపై ప్రతిస్పందించరు. పక్క బ్లాగులో ఒక్క కామెంట్ రాయరు. డ్రగ్ ఆడిక్ట్ కి, మీకు తేడాలేదు. వాడు మత్తు మందు తీసుకొని వాడిలోకం లోవాడుంటాడు. మీరు పద్యాలు రాసుకొంట్టు మీలోకం లో మిరున్నారు.
మీరిలా పగలు రాత్రి మాలిక నిండా పద్యాలు రాస్తే చూస్తూ ఊరుకొనేది లేదు. మీ పద్యం కనిపించినపుడ్డల్లా రాసిన వారిని ఎగతాళి మొదలుపెడతాం. జాగ్రత్త.
పద్యాలు రాసిన ప్రతి ఒక్కరి పద్యం కిందా మీరు అభినందనలు తెలపాలా? అందరికి కలిపి ఒక వ్యాఖ్యలో అభినందనలు తెలిపితే పోదా? ఇది కూడా మేము చెప్పాలా?
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారూ,
తొలగించండిమీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. అగ్రిగేటర్లలో వ్యాఖ్యల పేజీల నిండా కేవలం 'శంకరాభరణం' బ్లాగు వ్యాఖ్యలే నిండి ఉంటే ఎవరికైన చిరాకు వేస్తుంది. సహజమే! మీ సూచన ననుసరించి నా బ్లాగులో వ్యాఖ్యల ప్రచురణలో మార్పు చేస్తున్నాను. ఒక్కొక్కరికి ప్రత్యేకంగా వ్యాఖ్య వ్రాయకుండా అందరికీ కలిపి ఒకే వ్యాఖ్యలో సమీక్షిస్తాను.
ఇదంతా ఎందుకు? మాలిక తదితర (అన్ని) అగ్రిగేటర్ల నుండి నా బ్లాగును తొలగించడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. సంతోషంగా తొలగిస్తాను.
అజ్ఞాత గారు,
తొలగించండివ్యాఖ్యల ఫార్మేటు మార్చాను కాని అందరికీ ఒకేచోట సమాధాన మివ్వడం ఇబ్బందిగా ఉంది. అందుకని పాత పద్ధతినే కొనసాగిస్తున్నాను. మాలిక తదితర అగ్రిగేటర్ల నుండి నా బ్లాగును తొలగించడానికి ఉపాయం ఉంటే చెప్పమన్నాను. చెప్తే సంతోషంగా తొలగిస్తాను. ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఇది క్రొత్తగా ప్రారంభించిన బ్లాగు కాదు. దాదాపు ఏడేళ్ళుగా నడుస్తున్నది. కనుక నాకు అగ్రిగేటర్ల ద్వారా పరిచయం, ప్రచారం చేయించుకోవలసిన అవసరం లేదు. ఐనా అజ్ఞాత వ్యాఖ్యలకు నియంత్రణ పెట్టాను కదా! ఎలా చెప్తారు? సర్లెండి... నా తిప్పలేవో నేను పడి అగ్రిగేటర్లనుండి బ్లాగును తప్పిస్తాను. సెలవు!