15, సెప్టెంబర్ 2016, గురువారం

సమస్య - 2144 (బీరును గని త్రాగుబోతు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"బీరును గని త్రాగుబోతు భీతిం జెందెన్"
లేదా... 
"బీరుం గాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుం డయెన్ జూడుమా"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

93 కామెంట్‌లు:

 1. చారును త్రాగిన మంచిది
  బీరును గని త్రాగుబోతు భీతిం జెందె
  న్నూరక మధ్యము చేకొన
  కారణ మేమియును లేక కలహము కంటెన్

  రిప్లయితొలగించండి
 2. నేరంబేమియు జేయకున్న సరియౌ నిక్కమ్ము గాజూచినన్
  బీరుం గాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుండయెన్ జూడుమా
  సారంబంతయు గుంజివేయు గదరా సౌఖ్యమ్మిలన్ సూన్యమౌ
  చారుంద్రా గుట మేలటంచు బలికెన్ సంతోష ముప్పొంగ గన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ రెండు పూరణలలో అన్వయలోపం ఉంది. బీరును చూచి ఎందుకు భయపడ్డాడో స్పష్టంగా చెప్పలేదు. అవసరమైన సవరణలు చేయండి.

   తొలగించండి
  2. నేరంబేమియు జేయకున్న సరియౌ నిక్కమ్ము గాజూచినన్
   సారంబంతయు గుంజివేయు గదరా సౌఖ్యమ్మిలన్ సూన్యమౌ
   చారుంద్రా గుట మేలటంచు బలికెన్ సంతోష ముప్పొంగ గన్
   బీరుం గాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుండయెన్ జూడుమా

   తొలగించండి
  3. ఊరక మధ్యము ద్రాగిన
   కారణ మేమియును లేని కలహము కంటెన్
   చారును త్రాగిన మంచిది
   బీరును గని త్రాగుబోతు భీతిం జెందెన్

   తొలగించండి
 3. కం.కోరిన ఋణముల నిచ్చుచు
  దారుణ రీతిని వసూలు దాటిగ జేయన్
  దారిన వచ్చుచు నున్న క
  బీరుని గని త్రాగుబోతు భీతింజెందెన్.
  *****++++++*****
  శా. సారాభూతము చేత జిక్కె నొకడున్ సామాన్యుడైనన్ భళా !
  ధారాళమ్ముగ నప్పు జేయ దొడగెన్ త్రాగంగ ముప్పొద్దులన్
  క్రూరుండై తన యప్పు గట్టమని కోరంగ నేతెంచు ష
  బ్బీరుంగాంచిన త్రాగు బోతు మిగులన్ భీతుండయెన్ జూడుమా
  (తన యప్పు దీర్చమని?)

  రిప్లయితొలగించండి
 4. రిప్లయిలు
  1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   అప్పులవాళ్ళైన కబీరు, షబ్బీరులతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'సామాన్యుడైనన్ భళా' అన్నది అక్కడ సరిగా అతకడం లేదనిపిస్తున్నది. దానికి బదులు "సంసారమే పట్టకన్" అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
  2. శంకరయ్య గారూ ! ధన్య వాదాలు ! రెండు విధాలుగను బాగున్నదనియే నా అభిప్రాయము. భళా ! అనుటలో తాను సామాన్యుడైనా తాహతుకు మింఛి వృథా వ్యయం చేస్తున్నాడని సూచించాననుకొంటున్నాను. సవరణ : "యప్పు గట్టమనుచున్ కోరంగ" మరొక్క మారు ధన్యవాదాలు.

   తొలగించండి
  3. జనార్దన రావు గారూ,
   'భళా' గురించి ఇబ్బంది లేదు. కాని 'సామాన్యుడైనన్' అన్నదే అక్కడ అన్వయదూరంగా ఉందని నా అభిప్రాయం. అందుకే సవరణ సూచించాను.

   తొలగించండి
 5. బీరుంద్రాగుచు నొక్కడు
  బారున సీసా యడుగున బల్లిని గాంచెన్
  దారుణమైగన్పడు,యా
  బీరును గని త్రాగుబోతు భీతిం జెందెన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
   బల్లి పడిన బీరును చూస్తే ఎవడు భయపడడు? చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
   '..గన్పడు నా। బీరును..' అనండి.

   తొలగించండి
  2. బీరుంద్రాగుచు నొక్కడు
   బారున సీసా యడుగున బల్లిని గాంచెన్
   దారుణమైగన్పడు,నా
   బీరును గని త్రాగుబోతు భీతిం జెందెన్"
   సవరించాను గురువుగారు, కృతజ్ఞతలు

   తొలగించండి


 6. వారుణి వాహిని వలదోయ్
  మీ రమ్ములకన్న మేలు మీరా భజనల్
  సారా విడువండన్న క
  బీరును గని త్రాగుబోతు భీతిం జెందెన్

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   త్రాగుడు మానమనే వానిని చూచి త్రాగుబోతులు భయపడటం సహజమే! చక్కని పూరణ. అభినందనలు.

   తొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తీరును గాని విధంబున
  వారుణి బీల్చి రుజనొంద వైద్యులురుముచున్
  సారాయము వలదను వడి
  బీరును గని త్రాగుబోతు భీతిం జెందెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగుంది. కాని కొంత అన్వయలోపం ఉంది. 'సారాయము గొను నుసురన' అంటే బాగుంటుందేమో!
   'వారుణి బీల్చి'..?

   తొలగించండి


 8. హోరాహోరిగ జూదమందు మరి ఓహో మేలటంచాడి తా
  భారీగా సరి నష్టబోయెనుగదా ! బాబాయ‌టంచాత డే
  సారావద్దనె బో ! బికారి వలె కాషాయంబులన్నాడుచూ
  బీరుం గాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుం డయెన్ జూడుమా :)


  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   పద్యం లక్షణంగా ఉంది. కాని భావం, అన్వయం ఇబ్బంది పెడుతున్నాయి.

   తొలగించండి
 9. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఆరాటమ్మును గూడి మత్తునిడు పానమ్మున్విశేషమ్ముగా
  నోరంబట్టి చెలంగగా దవముతో నుత్సేథమెల్లన్ చెడెన్
  ఆరోగ్యమ్మును వీటిబుచ్చు హల మానంగన్ నొట్టుబెట్టున్వడిన్
  బీరుంగాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుండయెన్ జూడుమా!

  (దవము = రోగము; ఉత్సేథము = శరీరము/దేహము; వీటిబుచ్చు = చెఱచు ;
  హల = మద్యము )

  రిప్లయితొలగించండి
 10. సారా త్రాగుట హానికారకమురా సర్వంబు గోల్పోదు వా
  దారా పుత్రులు వైరులయ్యెదరికన్ తథ్యంబు నామాట నీ
  వీరీతిన్ జరియింప జత్తువని తానిట్లాడు చున్నట్టి స
  త్బీరుం గాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుం డయెన్ జూడుమా.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   బీరుడు వికృతి కదా! దానిని సత్ తో ఎలా జత చేస్తారు?

   తొలగించండి
  2. ఆర్యా
   ఉత్తర భారతంలో సత్బీరనేది వ్యక్తి నామము

   తొలగించండి
  3. సరి..సరి! నేను మరోలా భావించాను. బాగుంది. సంతోషం!

   తొలగించండి
 11. దారా సుతులను సాకెడు
  భారము దైవమ్ము కొసఁగు భ్రష్టుడవంచున్
  దూఱెడు నిరంతరఁపు సతి
  బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్

  బీరు=వదరు, అఱచు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారు,
   బీరున కున్న అర్థభేదంతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
   'దైవమున కొసఁగు' అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:

   దారా సుతులను సాకెడు
   భారము దైవమున కొసఁగు భ్రష్టుడవంచున్
   దూఱెడు నిరంతరఁపు సతి
   బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్

   బీరు=వదరు, అఱచు

   తొలగించండి
  3. సహదేవుడు గారు నిన్నటి మీపూరణకు సవరణ సూచించితిని చూడండి

   తొలగించండి
 12. ఊరక దొరికినదని వి
  స్తారముగా కల్లుఁ ద్రావి తడబడుచుండన్
  మోరటముఁ దెచ్చు కర జం
  బీరుం గని త్రాగుబోతు భీతిం జెందెన్.
  (మోరటము = మజ్జిగ; కరజంబీరుఁడు= చేత నిమ్మకాయ గలవాఁడు)

  "వారెవ్వా తమిదీరఁ ద్రాగెద ననున్ వారించు వారెవ్వ" రం
  చారాటంబున హద్దు మీరుచును మద్యం బెంతొ సేవించి యౌ
  రా రహ్మా నటఁ దూలుచున్ జనియె; దర్గా పురోవీథిలోఁ
  బీరుం గాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుం డయెన్ జూడుమా"
  (దర్గా = ముస్లిం భక్తుని గోరీ; పీరు = తురకలు ఊరేగించే సిద్ధుని ప్రతిమ)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మాస్టరుగారూ! మజ్జిగలో నిమ్మకాయలు కలిపిద్దామనా...బాగుందండీ.

   తొలగించండి
  2. ప్రణామములు గురువుగారు..సమస్యకు అద్భుతమగు పూరణలనందించారు..

   తొలగించండి
  3. ఆర్యా
   కరజంబీర, పీరులతో మీ పూరణలు మనోహరములుగా నున్నవి.

   తొలగించండి
 13. రిప్లయిలు
  1. నాగరాజు గారూ,
   కేవలం ఛందోబద్ధమైన పద్యాలే వ్రాయాలి. పద్యాలు వ్రాసేవారికి, వ్రాయలని ప్రయత్నించేవారికి ఇదొక అభ్యాస వేదిక. తప్పులో... ఒప్పులో... పద్యాన్ని వ్రాసి పంపండి. సవరించడానికి, సలహాలిచ్చి మార్గదర్శనం చేయడానికి నేను, కవిమిత్రులు ఉన్నాము కదా!

   తొలగించండి
 14. బారుకు రావద్దంటే
  తీరుబడిగనింటియందు తెరిచెదననుచున్
  చేరిన సతికడ బాటలు
  బీరునుగని తాగుబోతు భీతినిజెందెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 'కిబశ్రీ' గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వద్దంటే' అన్నది వ్యావహారికం. 'రావద్దనగా' అనండి. మూడవపాదంలో బాటిలును బాటలు అని టైప్ చేసినట్టున్నారు.

   తొలగించండి
 15. దారుణము వారుణి యనుచు
  వారించుచు వారివారి వ్యక్తిత్వములన్
  తీరుగ మార్చు ఫకీరు క
  బీరునుకని త్రాగుబోతు భీతిం జెందెన్

  రిప్లయితొలగించండి
 16. కోరి యలవాటుమానగ
  చేరెన్ వైద్యాలయమ్ము శీఘ్రఫలముచే
  కూరె, పరీక్షింపనతని
  బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్ ||

  వైరుధ్యంబగు వైద్యముల్ సలుపుచున్ ప్రావీణ్యముంజూపియున్
  దారింతప్పిన త్రాగుబోతుకు చికిత్సన్ జేసి సాఫల్యతన్
  భూరిన్ బొంది భిషగ్వరుండతనిదౌ బుద్ధిన్ పరీక్షింపగా
  బీరుంగాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుం డయెన్ జూడుమా ||

  రిప్లయితొలగించండి
 17. తీరగు "స్ట్రిక్టాఫీసర్"
  'కారు'ను తనప్రక్కనాపి కన్నెర్రలతో
  చేరుచు 'లాఠీ'నెత్తు క
  బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   కబీరు అన్న ఆఫీసరుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. ఊరూరు తిరిగి మద్యము
  దూరంబుం జేయబూను దోహలమందున్
  పోరును సల్పెడి యా "సా
  బీరు"ను కని త్రాగుబోతు భీతింజెందెన్!

  దోహలము=ఉత్సాహము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శిష్ట్లా శర్మ గారూ,
   మద్యపాన నిషేధ ప్రచారకుడు సాబీరును గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 19. చోరత్వముతో సిరి గొని
  బారులలో మధువుఁ ద్రాగి పయనంబందున్
  దారిలో రక్షక భటుడు క
  బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   త్రాగి వాహనాన్ని నడిపేవాడు పోలీసుకు చూచి భయపడ వలసిందే... చక్కని పూరణ. అభినందనలు.
   'దారిలో' అని దీర్ఘాంతమైతే గణదోషం. 'దారిలొ' హ్రస్వాంతంగా చెప్పరాదు. అక్కడ 'దారిని...' అనండి (సప్తమ్యర్థంలో ద్వితీయ).

   తొలగించండి
  2. గురువర్యుల సవరణకు ధన్యవాదములు.
   .

   తొలగించండి
 20. ఆరయ ధర మిక్కుటముగ
  వారములో బెరుఁగు కతన వారింపంగ
  న్నేరికి నేర్వక పోవుట
  బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   పద్యం లక్షణంగా ఉంది. కాని మూడవపాదం అన్వయం సందిగ్ధం.

   తొలగించండి
 21. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { ప్రవచన మకర౦దమును వెదజల్లు ఆ కబీర్ దాసుని గనిన త్రాగుబోతు భయపడెను . }
  ………………………………………………………


  సార ప్రవచో మధురస

  ధారా సేచక మొనర్చు ధార్మిక మూర్తిన్

  శ్రీరామ చ౦ద్ర దాసు , క

  బీరును గని త్రాగు బ్రోతు భీతి౦ జె౦దెన్

  రిప్లయితొలగించండి
 22. చోరుండై కొటికన్ సతమ్మరుసమున్ జూదమ్మునన్ బొందుచున్
  ఘోరమ్మౌ పనులెన్నియోస లుపుచున్ కుందించుచున్ పెద్దలన్
  కారుణ్యమ్మును వీడి పేదల సదా కారించు చున్ వీధి ష
  బ్బీరుంగాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుండయెన్ జూడుమా!
  కొటికః గ్రామము

  రిప్లయితొలగించండి
 23. భూరిగ ద్రాగెడువాడిని
  వారుణి మానంగ జేర్ప వైద్యాలయమున్
  తేరుకొను నాటినుండియు
  బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్!!!

  రిప్లయితొలగించండి
 24. దారుణముగ నా రాతిరి
  పార మెరుంగక మదిరను బానము సేయం
  గారము సున్నగ యన్నం
  బీరును గని త్రాగుబోతు భీతిం జెందెన్

  [అన్నంబు+ఈరు =అన్నంబీరు; ఈరు = అల్పము]  వీరావేశులు త్రాగు బోతులు సుమీ వీరాడు వాచ్యంబు లా
  పారావారము దాటు చేత లపసవ్యంబుల్ సమీక్షింపగన్
  కారెవ్వారికి భీత చేతనులు లోకంబందు ఘోరాద్భుతం
  బీరుం గాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుం డయెన్ జూడుమా

  [ఈరు = మీరు, ఈవు నకు బహువచనము]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ వైవిధ్యమైన విరుపులతో మీ పూరణలు అద్భుతంగా ఉన్నవి. అందరూ బీరుకు ముందు అక్షరాలను కలిపితే మీరు అందులోని మొదటి హల్లును తొలగించి మీ ప్రత్యేకతను చాటుకున్నారు. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 25. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  ఊరేగి౦పుల వేడ్కతో జనుల హర్షోత్సాహముల్

  ……………………… రేగగా

  బారుల్ దీరిచి " పీ రు " లా మొహరపున్

  …………… బర్వ౦బునన్ లేచి రా

  గా రాగిల్లెడు " సత్యమున్ " గలిగి

  …………… యూగన్ సాగు నా " గ్రామపున్ "

  బీరున్ గా౦చిన త్రాగుబోతు మిగులన్

  ………… భీతు౦ డయెన్ జూడుమా

  { సత్యము అనగా పీరు లోని మహాత్య్మము . సత్యము గలదే పెద్ద పీరు లేదా గ్రామపు పీరు అ౦దరు . దానిలొ ఎ౦తో మహత్తు గలదని గ్రామస్తుల మూఢ నమ్మకము .దానిని చూచిన త్రాగుబోతే భయపడి నాడని పూరి౦చడ౦ జరిగి౦ది }
  ……………………………………………………

  రిప్లయితొలగించండి
 26. బీరును మానుట కొఱకై

  తీరుగ మందులను వాడ తీరెను కాంక్షన్

  బీరును త్రాగమన హితులు

  బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్.

  రిప్లయితొలగించండి
 27. తీరుగ కాలము చెల్లిన
  వారుణి సేవించి, నంత వైనము తెలియన్
  భోరున వగచుచు మిగిలిన
  బీరును గని త్రాగుబోతు భీతిం జెందెన్!
  (బీరు కూడా ఒక రకమైన వారుణి అని భావించి వ్రాశాను. అయినా క్రింది పద్యం కూడా చూడ గోరుతాను.)

  తీరుగ కాలము చెల్లిన
  బీరును సేవించి, నంత విషయము తెలియన్
  భోరున వగచుచు మిగిలిన
  బీరును గని త్రాగుబోతు భీతిం జెందెన్!

  రిప్లయితొలగించండి
 28. సారా వ్యతిరేకోద్యమ
  పోరాటములో ప్రధాన భూమిక గలవా
  డా రహమాను సుతుండు క
  బీరుంగని త్రాగుబోతు భీతిం జెందెన్

  రిప్లయితొలగించండి
 29. సారాసార విచారమే తనదు విశ్వాసంబు గామార్చగా?
  ధారాళంబుగ మద్యపానమును నత్యాసందు సేవించగా?
  కారాగారము వంటి జీవన విలక్ష్యంబందు గుర్తించియున్
  బీరుంగాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుండయ్యెన్ జూడుమా
  2.సారాకల్తీ చావులు
  ఆరింటికి వార్త రాగ?అదిరిన మనసే
  భీరువుగా మార్చనతడు
  బీరుని గని త్రాగుబోతు భీతింజెందెన్|  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'చావులు+ఆరింటికి' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. అక్కడ 'కల్తీ మరణము। లారింటికి...' అనండి.

   తొలగించండి
 30. దారుణముగ త్రాగియు తా
  మీరిని రోగములచేత మిడుకుచు నుండన్
  కారణము జెప్ప వైద్యుడు
  బీరును గని త్రాగుబోతు భీతిం జెందెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మీరిన రోగముల..' అనండి.

   తొలగించండి
 31. దూరంబగునిల శాంతియు
  బీరును ద్రాగగ నటంచు భిషజుడు పల్కన్
  భీరువు యగుచున్ వెంటనె
  బీరును గని త్రాగుబోతు భీతిం జెందెన్.

  2.భారంబగునిక బ్రతుకుయు
  క్రూరత్వంబెల్ల పెరుగు కూళుడ వౌదువ్
  దారా సుతులు విడుతురన
  బీరును గని త్రాగుబోతు భీతిం జెందెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'భీరువు+అగుచున్' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. 'భీరువుగ నగుచు వెంటనె..' అనండి.
   రెండవ పూరణలో 'బ్రతుకును' అనండి. 'ఔదువ్' అనడం దోషం. 'కూళుడ వయి నీ। దారాసుతులు..' అనండి.

   తొలగించండి
 32. సారా త్రాగిన తుంటరి
  వీరంగము చేసే రేయి వీధులలోనన్
  పారా గా తిరిగిన బల
  బీరును గని త్రాగుబోతు భీతిని జెందెన్

  రిప్లయితొలగించండి
 33. నీరుంద్రాగిన యట్లుమందు గొనుచున్ నిండౌ ప్రగల్భాలతో
  శూరుండెవ్వడు నన్ను జేరు ననుచున్ శోభన్నయీ మంతగా
  బీరాల్బల్కుచు బీరుబట్ట నచటన్ భేతాళ డీ జీ పి ష
  బ్బీరుం గాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుండయెన్ జూడుమా!

  రిప్లయితొలగించండి
 34. P.Satyanarayana
  పారును ప్రభుత్వ సారా
  నేరుగ నదియెంత గొన్న నిలుపును మతి నా
  దారిన పెచ్చగు ధరగొను
  బీరును గని త్రాగుబోతు భీతుండయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'శోభన్ నయీ మంతగా..' అంటే సందిగ్ధత ఉండదు.

   తొలగించండి
 35. బారున దారును ద్రావెన్
  భారంబున తడబడెన్ చివాలున తూలెన్
  బుర్ర పగిలె, ఘాతముతో
  బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తోలేటి రాజేశ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దారు' హ్రస్వాంతం అయితే మరో అర్థం వస్తుంది. 'దారూ త్రాగెను' అనండి.

   తొలగించండి
  2. గురువు గారు, ధన్యవాదములు.
   ఆంధ్రభారతిలో ఇలా ఇవ్వబడినది
   --------------------------------
   దారు : తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్) 2010
   సారాయి
   --------------------------------------

   తొలగించండి
  3. గురువు గారు, ధన్యవాదములు.
   ఆంధ్రభారతిలో ఇలా ఇవ్వబడినది
   --------------------------------
   దారు : తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్) 2010
   సారాయి
   --------------------------------------

   తొలగించండి
 36. నీరము వలె ననవరతము
  బారులలో మధిర త్రాగి పడియుండంగన్
  బారుల మూయించిన " రణ
  బీరు"ను గని త్రాగుబోతు భీతిం జెందెన్

  సారా విస్కీ బ్రాందియు
  నీరము వలె త్రాగ దొరకు నీ భరతభువిన్;
  బారులు మూయగ నభ్రక
  బీరును గని త్రాగుబోతు భీతిం జెందెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 37. మిత్రులందఱకు నమస్సులు!

  [సారా త్రాగెడివానికి రామనామామృత సార మింపునుఁ గలిగింపదు కావున సారాకు బదులుగా రామనామామృత సారముం గ్రోలుమని వచ్చిన కబీరునుం జూచి భీతిం జెంది పాఱిపోయిన సందర్భము నిట ననుసంధానించుకొనునది]

  నీరేజ పత్ర నేత్రుని
  తారక నామామృతమ్ముఁ దనివిం గ్రోలన్
  వారక పిలిచెడి భక్త క

  బీరును గని త్రాగుఁబోతు భీతిం జెందెన్!

  రిప్లయితొలగించండి
 38. నీరము వోలెనుత్రాగిన
  బీరు హరించునసువులు బిడ్డా యనగన్
  ధారుణిపై బడి పొర్లుచు
  బీరునుగని త్రాగుబోతు భీతి జెందెన్.

  రిప్లయితొలగించండి
 39. రున్ తోడుగ రమ్ము విస్కిలనునా బీహారులోమూయగా
  కారాగారమునుండి వచ్చి వినగన్ గంభీరు వార్తన్నయో
  సారాలమ్మిన షాపులోన నిపుడున్ సంతోషిమా తోడ క
  బ్బీరుం గాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుం డయెన్ జూడుమా!

  రిప్లయితొలగించండి