టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. డు ప్రత్యయం లేకుండా హనుమంతు అన్నారు. అక్కడ మారుతి అనండి. రాక్షస దండు... దుష్ట సమాసం. రక్కసి దండు.. అనండి.
విరించి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో దానవ శబ్దం కనిపించలేదు. రెండవ పూరణలో భవసిగ అనడం దుష్ట సమాసం. భవు సిగ.. అనండి. అలాగే అవనిని అనాలి.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదాన్ని యడాగమంతో ప్రారంభించారు. ఆ పాదానికి నా సవరణ "అసుర వాహిని నెదిరించు నవసరమున".
నిజానికి దోషమే! కాని మరీ అంత కచ్చితంగా ఉంటే ఔత్సాహికులు ఇబ్బంది పడతారు. అందుకని చూసి చూడనట్టు ఉండడమే! అంతే కాదు... మిత్రుల పూరణలను సమగ్రంగా పరిశీలించి దోషాలనన్నిటినీ పేర్కొంటే కొందరు నిరుత్సాహపడి పద్యరచనకు దూరం అయ్యే అవకాశాలున్నవి. అందుకని కొన్నిటిని నేను పట్టించుకోను. కొన్ని దోషాలు నా పరధ్యానం, ఏకాగ్రతా లోపం, నా అజ్ఞానం వల్ల గుర్తింపబడక పోవచ్చు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, ఎందుకో మీ పూరణ నిన్న నా దృష్టిపథంలోనికి రాలేదు. మన్నించండి. మీ పూరణ బాగుంది. అభినందనలు. 'దాటుచున్' అనండి. 'వానర' శబ్దాన్ని స్వార్థంలోనే ప్రయోగించారు.
సాధారణంగా అవధానాల్లో దత్తపది అంశం నిర్వహణలో ఇచ్చిన పదములను అదే క్రమంలో ఉపయోగీస్తారు అవధానులు.అనగా మొదటి పదం మొదటి పాదంలో, రెండవ పదం రెండవ పాదంలో .... అలా ! మనమూ అదే పద్ధతి పాటిస్తే బాగుంటుంది.
జనార్దన రావు గారూ, సాధారణంగా దత్తపదాలను ఇవ్వగానే అవధాని పృచ్ఛకుని అడుగుతాడు "ఆ పదాలను అదే వరుసలో ప్రయోగించాలా?" అని. పృచ్ఛకుడు ఒక్కొక్కసారి అదే వరుస అంటాడు. లేదా మీ యిష్టం అంటాడు. అతడిచ్చే సమాధానాన్ని బట్టి అవధాని ముందుకు పొతాడు. మన బ్లాగులో అడిగి కొనసాగే సంప్రదాయం లేదు కనుక పూరణ చేసేవారికి స్వేచ్ఛ ఉంది.
శా. గుట్కా సేవన మెంత హాని కరమో గుర్తించి మానన్వలెన్ మట్కా జూదము మోసపూరితమెగా మానన్వలెన్ శీఘ్రమున్ చిట్కా వైద్యము మేలు చేయుగదరా చింతించి తర్కించినన్ జట్కా యానము హాయి గొల్పుచు సదా చాల ప్రియమ్మౌనుగా ! పై పద్యంలోని నాలుగు పాదాల్లోని నాలుగంశాలూ దేనికదే.ఒకదానితో మరొక దానికి సంబంధం లేదు. అయితే ఒక్కొక్కటీ ఒక్కొక్క సమస్యగా ఇవ్వ వచ్చని నా భావన. పెద్దలేమంటారో?
ఏపాదానికి ఆ పాదం బాగానే ఉన్నాయి. కాని సమస్య ఏమున్నది. అసంగతమో, అసత్యమో అయిన విషయం సమస్యగా ఇవ్వాలి కదా! ఇలా చెప్పవచ్చు... గుట్కా సేవన మెంత మే లొసగునో గుర్తించుమా మానకే మట్కా జూదము లార్షవిద్య లనగా మన్నించె వేదమ్ములే చిట్కా వైద్యము మేలుసేయు నెటులన్ జింతించి తర్కించినన్ జట్కా యానము చేసి చేరవలెరా జాపాను దేశమ్మునున్.
డా.సీ.వీ.సుబ్బన్న శతావధాని రచించిన "అవధాన విద్య" అనే గ్రంథము లో సమస్య అనే విభాగంలో సమస్యా పూరణకు చెందిన భిన్న చమత్కృతులు చర్చింప బడినవి. అవి. 1)పద సమాస వాక్య చమత్కృతి 2)నూతన కల్పనా చమత్కృతి 3)క్రమాలంకార చమత్కృతి 4)శ్లేష చమత్కృతి 5)ప్రాస చమత్కృతి6)సాంకేతిక చమత్కృతి7)అపహాస్య చమత్కృతి8)అర్థాంతరాన్యాస చమత్కృతి9)కాకుస్వర చమత్కృతి10)శబ్దగతార్థ చమత్కృతి11)లోకోక్తి చమత్కృతి 12)లోకజ్ఞతా చమత్కృతి 13)చారిత్రక చమత్కృతి 14)పౌనరుక్త్య చమత్కృతి 15)ఛందో నిగూఢ చమత్కృతి. మరికొన్ని కూడా ఉండ వచ్చును.ఏ సమస్య ఏ చమత్కారానికి ఒదిగి వస్తుందో ఆచమత్కృతి నెంచుకుని అవధాని పూరిస్తాడు.పృచ్చకుడుద్దేశించిన చమత్కృతిలోనే పూరించాలనేమీ లేదు.ఉదాహరణకు పృచ్చకుడు పద సమాస వాక్య చమత్కృతిలో సమస్య నిస్తే అవధానికి సరియైన పూరణ స్ఫురించక క్రమాలంకార చమత్కృతిని ఆశ్రయించ వచ్చు. నా పద్యములోని ఒక్కొక్క పాదమును ప్రాస చమత్కృతిగా తీసుకొన వచ్చు. కొన్ని ప్రాస పదాలు కవికి దొరికినా వాటికి సరియైన అన్వయం కల్పించుట లోనే అతని ప్రతిభ బయట పడుతుంది కదా ! సమస్య లోని అంశముతప్పని సరిగా అసంగతమో, అసత్యమో అయిఉండాలనే నియమమేదీ లేదు. పై చమత్కృతులలో ఏదో ఒక దానికి సంబంధించినదై ఉండవచ్చు. లేదా ఒక నూతన చమత్కృతిని పృచ్చకుడు ఆవిష్కరించ వచ్చు.
ప్రాస చమత్కృతికి సంబంధించిన సమస్యలకు ఉదాహరణలు.దీనికి మరొక భిన్న చమత్కృతిని కూడా పృచ్చకుడు జోడిస్తే కవి (అవధాని) పని మరింత కష్టతర మౌతుంది. 1)బంగ్లా మీదికి దారి జూపగలవా భామా శిరోరత్నమా ! 2)పండ్రంగిచ్చటి కెంత దవ్వు చెపుమా పంకేజ పత్రేక్షణా ! 3)యోషాక్లీబులు గూడ బుట్టె జగమెల్ల్లన్ దాన్. 4)జగద్వ్యాప్తము లయ్యెనిరులు ఖరకరు దుండన్. 5) మూర్ఖుండొక్కడు రాజుగా నయినచో ముల్లోకముల్ వేగవే ? 6)తుంక్త్వా ప్రత్యయముల్ రసజ్ఞమతి కెందుం దుష్టి జేకూర్చునే పై వాటిలో మూడవ, నాల్గవ సమస్యలకు ఛందో నిగూఢ చమత్కృతి కూడా జోడింప బడటం గమనింప వచ్చు. ఒకటవ ,రెండవ, ఐదవ సమస్యల్లోని అంశాలు సర్వ సాధారణమైన విషయాలే కానీ వాటిలో ఎటువంటి అసంగత్వం,అసత్యం, అనౌచిత్యం లేకపోవటం గమనింప వచ్చు.ఇటువంటి ఉదాహరణలు కొల్లలుగా లభ్యమౌతున్నాయి.స్పందన కొరకు ఎదురు చూస్తున్నాను.(మీ సూచనలు,సలహాలు పాల్గొను వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. అభినందనలు స్వీకరించండి.)
ప్రాస చమత్కృతికి సంబంధించిన సమస్యలకు ఉదాహరణలు.దీనికి మరొక భిన్న చమత్కృతిని కూడా పృచ్చకుడు జోడిస్తే కవి (అవధాని) పని మరింత కష్టతర మౌతుంది. 1)బంగ్లా మీదికి దారి జూపగలవా భామా శిరోరత్నమా ! 2)పండ్రంగిచ్చటి కెంత దవ్వు చెపుమా పంకేజ పత్రేక్షణా ! 3)యోషాక్లీబులు గూడ బుట్టె జగమెల్ల్లన్ దాన్. 4)జగద్వ్యాప్తము లయ్యెనిరులు ఖరకరు దుండన్. 5) మూర్ఖుండొక్కడు రాజుగా నయినచో ముల్లోకముల్ వేగవే ? 6)తుంక్త్వా ప్రత్యయముల్ రసజ్ఞమతి కెందుం దుష్టి జేకూర్చునే పై వాటిలో మూడవ, నాల్గవ సమస్యలకు ఛందో నిగూఢ చమత్కృతి కూడా జోడింప బడటం గమనింప వచ్చు. ఒకటవ ,రెండవ, ఐదవ సమస్యల్లోని అంశాలు సర్వ సాధారణమైన విషయాలే కానీ వాటిలో ఎటువంటి అసంగత్వం,అసత్యం, అనౌచిత్యం లేకపోవటం గమనింప వచ్చు. మరివీటిలోని సమస్యేమిటయ్యా అంటే ప్రాస నిర్వహణమే అసలు సమస్య.ఇటువంటి ఉదాహరణలు కొల్లలుగా లభ్యమౌతున్నాయి.స్పందన కొరకు ఎదురు చూస్తున్నాను.(మీ సూచనలు,సలహాలు పాల్గొను వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. అభినందనలు స్వీకరించండి.)
జనార్దన రావు గారూ, ధన్యవాదాలు. పైన పేర్కొన్న సమస్యలన్నీ నేను సేకరించి వ్రాసి పెట్టుకున్న వాటిలో ఉన్నాయి. మన బ్లాగులో పద్యాలు వ్రాసేవారిలో ఎక్కువమంది ఔత్సాహికులే. అందువల్ల దుష్కర ప్రాసతో కూడిన సమస్యలను ప్రస్తుతం ఇవ్వడం లేదు. కొంతకాలం తర్వాత అప్పుడప్పుడు ఇటువంటి సమస్యలను ఇస్తాను.
భాసుర లీల బాడగ సెబాసను గాథను మూడు మాటలన్
రిప్లయితొలగించండికాసుకొనంగ రమ్ము యవి కట్టెను కొట్టెను తెచ్చెనం చనన్
ఓసి యిదేమి వింత వినవానర లోకపు పుణ్యగాథయౌ
వాసిగ గట్టె వారధిని వచ్చెను దోషిని గొట్టి సీతనున్
దాసిన రక్కసున్ దునిమి దా నవ రీతిని బంచె నీతికిన్
పూసిన పూవుగానరయ పూజ్యము రాముని గాథయే సుమీ
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కోసుకొని, దాసిన' గ్రామ్యాలు. 'రమ్ము+అవి' అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు.
భా'సుర'త ద'నర' మారుతి
రిప్లయితొలగించండియాసుగ్రీ'వానఁ ర'యముఁ నౌదల దాల్ప
న్నాసంద్రంబెగిసెననా
యాసంబుగ'దాఁ నవా'రితావేశముతోన్
భాసురత దనర మారుతి
రిప్లయితొలగించండియాసుగ్రీవాన రయము నౌదల దాల్చ
న్నాసంద్రం బెగిసెననా
యాసంబుగ, దాఁ నవారితావేశము తోన్
భాసురత దనర మారుతి
రిప్లయితొలగించండియాసుగ్రీవానఁ రయము నౌదలదాల్ప
న్నాసంద్రంబెగిసె ననా
యాసంబుగఁ దానవారితావేశముతోన్
తాన్ అవారిత ఆవేశ
తొలగించండిఅశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సుగ్రీవ+ఆన' దుష్ట సమాసం. సంధి కూడ 'సుగ్రీవు నాన' అవుతుంది.
భాసురత దనర మారుతి
తొలగించండివాసిగఁ ప్రభువా నఁ రయము నౌదలదాల్ప
న్నాసంద్రంబెగిసె ననా
యాసంబుగఁ దానవారితావేశముతోన్
గురువుగారు ఈవిధంగా మార్చాను.చిత్తగించ ప్రార్థన
సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రభువాన.. తరువాత అరసున్నా అవసరం లేదు.
దానవ పతి రావణుకే
రిప్లయితొలగించండిమానర!యని హనుమయె తగ మంచిని జెప్పన్
పో!నాకే తెలుసురయని
వానర! యని పరిహసించి వాలము గాల్చెన్.
శాస్త్రి గారు దానవ,వానర పదములు వేరే యర్థములలో ప్రయోగించండి.
తొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కామేశ్వరరావు గారి సూచన పాటించండి.
ధన్యవాదములండీ...నిబంధనను సరిగా చూడలేదు.
తొలగించండిమార్చినాను.
దాన వనితనే పట్టుట
మానర!యని రావణునకు మారుతి చెప్పన్
పో!నాకే తెలుసుర,కల
వా!నరమున శక్తులనుచు పడిపడి తిట్టెన్.
గోలి వారూ,
తొలగించండిసవరించినందుకు సంతోషం! కాని 'దాన'...?
రామ చరితము గనగా సురమ్యమైన
రిప్లయితొలగించండిలలిత గమనాన రవళించు కలిత గాథ
నవ్య భావాన రసమయ కావ్య మగుచు
వెలుగు లందించదా! నవ లీల లెగసి!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అన్యార్థంలో ప్రయోగిస్తూ' అంటే ఏమిటి?
రిప్లయితొలగించండిఇచ్చిన పదాలకున్న అర్థం కాకుండా వేరర్థంలో పూరించాలి....పై పద్యములను పరిశీలించండి..తెలుస్తుంది
రిప్లయితొలగించండిశిష్ట్లా వారూ,
తొలగించండిధన్యవాదాలు.
రిప్లయితొలగించండి"సుర"స నోడించె హనుమంతు శోభలలర;
వాన రణమున కురిసిన వంటి రీతి
"నర" న రమ్ముల శూలాలు నాట కపులు
"దాన వ"డలిన రాక్షస దండు జచ్చె!
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డు ప్రత్యయం లేకుండా హనుమంతు అన్నారు. అక్కడ మారుతి అనండి. రాక్షస దండు... దుష్ట సమాసం. రక్కసి దండు.. అనండి.
ప్రమదానవరత ఘన రత
రిప్లయితొలగించండిరమణి చెలువపు పరువాన రగులుచు నంతన్
సుమనోహర భాసుర ఘన
విమలాంచిత రూపు రాము వేడెను బతిగా
శూర్పణఖ ఘననీల శ్యాముని రాముని చూచిన సందర్భము:
తొలగించండిపోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించండిఅమోఘమైన పూరణ. దత్త పదాలు అద్భుతంగా ఒదగిపోయాయి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండివాసుర,తండ్రి యాన రఘువర్యుడు,దా,నవకోమలాంగియౌ
భూసుత సీత,లక్ష్మణుడు పొత్తుగ దావము కేగి రావణున్
వాసిగ జంప పుష్పముల వాన రయమ్మున రాల్చె వేలుపుల్,
దాసుడు మారుతాత్మజుడు తన్మయమందుచు భక్తి పాడగన్
తిమ్మాజీ రావు గారు నమస్సులు. "వాసుర" ధరణి యన్న యర్థములో వాడినట్లయితే " వాసురఁ దండ్రియాన" అంటే యన్వయము బాగుంటుందనుకుంటాను.
తొలగించండిశ్రీయుతులు కామేస్వర రావు గారికి,
తొలగించండిధన్యవాదములు మీ సూచనమేరకు సవరించిన పద్యము
"అరసున్న"గుర్తు లేని కారణమున అరసున్న చూపలేదు
వాసుర,దండ్రి యాన రఘువర్యుడు,దా,నవకోమలాంగియౌ
భూసుత సీత,లక్ష్మణుడు పొత్తుగ దావము కేగి రావణున్
వాసిగ జంప పుష్పముల వాన రయమ్మున రాల్చె వేలుపుల్,
దాసుడు మారుతాత్మజుడు తన్మయమందుచు భక్తి పాడగన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములండి. అలాగే "భక్తిఁ బాడగన్" అనండి.
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ శూ ర్ప న ఖ రా ము ని తో }
……………………………………………
త్రాసము మాను | కామ సుఖదా !
………… నవయి౦చకు నన్ను | కౌగిలిన్
వాసము జేసి , తేలు మల స్వర్గము లోన |
………… రవ౦త జా గ దే
లా ? సురత క్రియన్ దనియ రా |
…………… మధు వానర | రామ ! వీడుమా
భూసుత ని౦క | శూర్పనఖ పొ౦గులు స్వాగత
………………… మిచ్చు చు౦డెరా !
{ త్రాసము = భయము వలన తాత్సారము ;
నవయి౦చకు = బాధి౦చకుము ;
సురతక్రియ = కామ క్రీడ ; }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
మనసు రమియింపజేసెడు మహిత యశుడ!
రిప్లయితొలగించండినరములుప్పొంగు తేజంపు ధరణిప్రియుడ!
జానకి కి సదా నవరాగ చంద్రమూర్తి!
వరములీయగ కనరావా!నరసఖుండ!
పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదంలో 'కనరావా' అన్నచోట గణదోషం. వరము లీయగ గానవా... అనండి.
సూచన గమనించానండి.కృతజ్ఞతలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమనసు రమణుని గన రమణి
తనువా నరసింహమును జతగన తపించెన్
కనుదో యి సదా నవ మో
హన రాముని నిలుప మోము హాయిని పొందెన్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రక్కసుల నరకము జేర్చి రాముడంత
రిప్లయితొలగించండిభాసురమగు యశము తోడ భార్యను గొన
కురిసె విరుల వాన రహిని గొలుప! పౌరు
లదె కదా నవ శకమున కాది యనిరి!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముసురగ రాక్షసుల్|”హనుమ మూకను తోకనుజుట్టికొట్టగా
రిప్లయితొలగించండిఅసురులబాధలే నరకయాతన|లంకకుచేటువచ్చె|మా
మిసుగును దీర్చవా ?నరకమేగద చూడగ రమ్మురావణా
మసనము గాద పట్టణము మార్చు సదా నవరాత్రు లందునే {మిసుగు=భయము;మసనము=వల్లకాడు}
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తనరెడునసురలదండించగపియు
రిప్లయితొలగించండిదానవంచియుతోకదగ్ధమొనర్చి
వానరప్రముఖుడువాయువేగమున
లంకయంతనుగూడలంకించెనపుడు
లoకిoచె బదులు లoఘిoచె
తొలగించండిపోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ ద్విపద పూరణ బాగున్నది.
అసురుల అనడం సాధువు. అసురల... అనరాదు. అన్యార్థంలో వానరలో నర ఉంది. మరి వానర శబ్దం?
కడలి దానవలీలగా దాటగల వాడు
రిప్లయితొలగించండి. ఘనరఘు రాముని కాంతవెదక
పయనించె గగనాన పక్షిరాజును బోలి
. వాయువేగమ్మున పవన సుతుడు
గిరిరాజు గలిసెను సురసనోడించెను
. సింహికను వధించి చేరెలంక
కడుపాటవాన రక్కసి లంఖిని గూల్చె
. గాంచె జానకినశోక వని లోన
శోకమూర్తి గాంచె నాకపి యచ్చోట
రాముగూర్చిదెలిపె రమణి కప్పు
డంగుళీయకమ్మునంగన కిచ్చెను
వనము జెరిచి చేసె భండనమ్ము
నిన్నటి పూరణము
శివసుతుగాంచి నవ్విన శశిన్ గనినంతనె మానవాళికి
న్నవనిన నిందతప్పదని యాగ్రహమందున శాపమిచ్చెనా
భవసతి యంచు మానిరిల భాద్రపదమ్మున శుక్లపక్షపుం
జవితిని జంద్రదర్శనము, సర్యశుభమ్ము లొసంగు మానవా
భవసిగ పువ్వు నాశ్వయుజ పౌర్ణమి రేయిన గాంచినన్నిలన్
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో దానవ శబ్దం కనిపించలేదు.
రెండవ పూరణలో భవసిగ అనడం దుష్ట సమాసం. భవు సిగ.. అనండి. అలాగే అవనిని అనాలి.
గురువు గారికి ధన్యవాదములు
తొలగించండికడలి దానవలీల గా అని మొదటి పాదమందే గలదండి
నిజమే... నేను గమనించలేదు. మన్నించండి.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. మనసు రంజిల్లగ... అనండి.
దాసు రయమున సీతమ్మతల్లి జాడ
రిప్లయితొలగించండిదక్షిణమ్ము నరసి తెలుప దండు కదలి
శస్త్రముల వాన రణమున జాలు వార్చ
జయముఁ దా నవలామణిన్ స్వామి పొందె
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భూరి వేడ్కతో గణపతి పూజ సేసి
రిప్లయితొలగించండికథను వినిన జాలు శమంత కమణి గాథ
భక్తితో, భాద్రపద శుక్లపక్షమందు
చవితి చంద్రుఁడు శుభముల సర్వ మొసఁగు
న్నటి తేటగీతి సమస్యకు నా పూరణము
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
యసుర వాహిని నెదురించు యవసరమున
రిప్లయితొలగించండినరులు సమకూర్చితిరి కదా నవపుసేన
దానవా నరవానర సేనపైన
తగున రణము చేసి పురము తగులబెట్ట
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదాన్ని యడాగమంతో ప్రారంభించారు. ఆ పాదానికి నా సవరణ "అసుర వాహిని నెదిరించు నవసరమున".
క్రిందిపాదాన్ని పైకి మార్చటం వలన అలాజరిగింది.గురువర్యుల సవరణకు ధన్యవాదములు.
తొలగించండి.సీ.
రిప్లయితొలగించండిమన'సురం'జిల్లగ మ'నర'ఘు రాముని
కళ్యాణమట పేర్మి కనగ రండు
రత్నమణుల'వాన ర'మణీయ రీతుల
వర్షింతు రట చూపు పడగ రండు
'దాన వా'యనములు దండిగా నిత్తురు
కోరి పోదము దెచ్చు కొనగ రండు
సురలందు మునులందు చూడామణుల వంటి
వారల జూడంగ వలెను రండు
ఆ.వె
యెంత గనిన నరుల కంత పుణ్యము వచ్చు
జన్మ ధన్య మగును జనిన యంత
జనకసుతకు రామ చంద్రునకు జరుగు
పరిణయంబు పరమ పావనంబు
గణదోషం పరిహరించాను.చిత్తగించప్రార్థన
పద్యము కడు రమ్యముగా నున్నది. అయితే మొదటి పాదంలో "సుర" పదం వాడవలసి యుండగా "సురం" అని వాడినట్లయి నియమ భంగమైన దనుకొంటున్నాను. విజ్ఞులేమంటారో ?
తొలగించండినిజానికి దోషమే! కాని మరీ అంత కచ్చితంగా ఉంటే ఔత్సాహికులు ఇబ్బంది పడతారు. అందుకని చూసి చూడనట్టు ఉండడమే!
తొలగించండిఅంతే కాదు... మిత్రుల పూరణలను సమగ్రంగా పరిశీలించి దోషాలనన్నిటినీ పేర్కొంటే కొందరు నిరుత్సాహపడి పద్యరచనకు దూరం అయ్యే అవకాశాలున్నవి. అందుకని కొన్నిటిని నేను పట్టించుకోను. కొన్ని దోషాలు నా పరధ్యానం, ఏకాగ్రతా లోపం, నా అజ్ఞానం వల్ల గుర్తింపబడక పోవచ్చు.
నరుని రూపాన రాముడు ధరణి పైన
రిప్లయితొలగించండిఅసుర జాతిని హతమార్చె నక్కజముగ
వానరుల సాయమందగ వార్ధి దాటి
దానవాటవి దహియించె దర్ప మణచి.
విద్వాన్, డాక్టర్ మూలె.రామమునిరెడ్డి.విశ్రాంత తెలుగు పండితులు. ప్రొద్దుటూరు కడప జిల్లా.7396564549.
డా. మూలె రామముని రెడ్డి గారూ,
తొలగించండిపద్యం బాగున్నది. కాని దత్త పదాలను అన్యార్థంలో ప్రయోగించాలన్నది మీరు గమనించినట్టు లేదు.
భాసుర మతితోడ పవమాన తనయుండు
రిప్లయితొలగించండివానరపతి మాట పైన సాగి
వానరముల గూడి వారిధి దాటుచూ
దా,నవఫలములను తమిని గాంచె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిఎందుకో మీ పూరణ నిన్న నా దృష్టిపథంలోనికి రాలేదు. మన్నించండి.
మీ పూరణ బాగుంది. అభినందనలు.
'దాటుచున్' అనండి. 'వానర' శబ్దాన్ని స్వార్థంలోనే ప్రయోగించారు.
అసురు డైన రావ ణాసురు డక్కసు
రిప్లయితొలగించండిచేత నరుని పత్ని( జెరను బట్టె;
వానర బలమంత వారధి లంఘించి
దానవులను వేగ దర్ప మణచె.
విద్వాన్,డాక్టర్ మూలె.రామముని రెడ్డి,విశ్రాంత తెలుగు పండితులు,ప్రొద్దుటూరు,కడప జిల్లా 7396564549.
మూలె రామముని రెడ్డి గారూ,
తొలగించండిఈ పూరణలోను దత్తపదాలను స్వార్థంలో వినియోగించారు. అన్యార్థంలో ప్రయోగించాలని కదా నియమం.
ధన్యవాదములండీ...నిబంధనను సరిగా చూడలేదు.
రిప్లయితొలగించండిమార్చినాను.
దాన వనితనే పట్టుట
మానర!యని రావణునకు మారుతి చెప్పన్
పో!నాకే తెలుసుర,కల
వా!నరమున శక్తులనుచు పడిపడి తిట్టెన్.
'దాన'...?
తొలగించండిమాస్టరుగారూ! ధన్యవాదములు. ఆంధ్రభారతి నిఘంటువులో Thereby, hereby. దాన.ఆవిధముగా... అని ఉన్నది.
తొలగించండిదాన (కనుక, కాబట్టి, దాని వలన, దానిచేత) ఎప్పుడు ప్రయుక్తమౌతుంది? అంతకు ముందొక విషయం చెప్పి ... దానిని సమర్థించడానికి కదా!
తొలగించండిమాస్టరుగారూ! నమస్తే..హనుమంతుడు హితబోధ చేస్తూ...మధ్యలో ..మీసూచనతో చిన్న సవరణ చేస్తున్నను.చెప్పినట్లుభావించాను.
తొలగించండిరావణుని అహంకారము.
మానవతిదా నవనిజను
మానర!చెఱబట్టుటనుచు మారుతి చెప్పన్
పో!నాకే తెలుసుర,కల
వా!నరమున శక్తులనుచు పడిపడి తిట్టెన్.
భాసుర సూర్యవంశ మున పావన నాముడు రాముడే కదా
రిప్లయితొలగించండిదాసుల గావగా నరయ దాశరధీ తనయుండుగా నిలన్
వాసులు వానరా దిపులు వాసిగ వారధి కట్టగా నదే
రాసులుగా నుదాటిరిగ రావణుగూల్చగచేరెలంకనే
వడ్డూరి రామకృష్ణ గారూ,
తొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
'దానవ' పదం కనిపించలేదు. 'వానరాదిపులు'...? వావర శబ్దాన్ని అన్యార్థంలో ప్రయోగించాలి కదా!
తే.గీ.మనసు రవళించు పులకించు వినిన యంత
రిప్లయితొలగించండిమాన రహితులె ఆలింప బూను కొనరు
పూల వాన రహి ముదము గ్రోల గలము
రామ కథ విన దా నవ రసమయమగు
రహి = విధము (శబ్ద రత్నాకరము)
గుఱ్ఱం జనారదన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
dhanyavaadamulaaryaa !ధన్యవాదములార్యా !
తొలగించండిసాధారణంగా అవధానాల్లో దత్తపది అంశం నిర్వహణలో ఇచ్చిన పదములను అదే క్రమంలో ఉపయోగీస్తారు అవధానులు.అనగా మొదటి పదం మొదటి పాదంలో, రెండవ పదం రెండవ పాదంలో .... అలా ! మనమూ అదే పద్ధతి పాటిస్తే బాగుంటుంది.
రిప్లయితొలగించండిజనార్దన రావు గారూ,
రిప్లయితొలగించండిసాధారణంగా దత్తపదాలను ఇవ్వగానే అవధాని పృచ్ఛకుని అడుగుతాడు "ఆ పదాలను అదే వరుసలో ప్రయోగించాలా?" అని. పృచ్ఛకుడు ఒక్కొక్కసారి అదే వరుస అంటాడు. లేదా మీ యిష్టం అంటాడు. అతడిచ్చే సమాధానాన్ని బట్టి అవధాని ముందుకు పొతాడు.
మన బ్లాగులో అడిగి కొనసాగే సంప్రదాయం లేదు కనుక పూరణ చేసేవారికి స్వేచ్ఛ ఉంది.
శా. గుట్కా సేవన మెంత హాని కరమో గుర్తించి మానన్వలెన్
రిప్లయితొలగించండిమట్కా జూదము మోసపూరితమెగా మానన్వలెన్ శీఘ్రమున్
చిట్కా వైద్యము మేలు చేయుగదరా చింతించి తర్కించినన్
జట్కా యానము హాయి గొల్పుచు సదా చాల ప్రియమ్మౌనుగా !
పై పద్యంలోని నాలుగు పాదాల్లోని నాలుగంశాలూ దేనికదే.ఒకదానితో మరొక దానికి సంబంధం లేదు. అయితే ఒక్కొక్కటీ ఒక్కొక్క సమస్యగా ఇవ్వ వచ్చని నా భావన. పెద్దలేమంటారో?
ఏపాదానికి ఆ పాదం బాగానే ఉన్నాయి. కాని సమస్య ఏమున్నది. అసంగతమో, అసత్యమో అయిన విషయం సమస్యగా ఇవ్వాలి కదా!
తొలగించండిఇలా చెప్పవచ్చు...
గుట్కా సేవన మెంత మే లొసగునో గుర్తించుమా మానకే
మట్కా జూదము లార్షవిద్య లనగా మన్నించె వేదమ్ములే
చిట్కా వైద్యము మేలుసేయు నెటులన్ జింతించి తర్కించినన్
జట్కా యానము చేసి చేరవలెరా జాపాను దేశమ్మునున్.
డా.సీ.వీ.సుబ్బన్న శతావధాని రచించిన "అవధాన విద్య" అనే గ్రంథము లో సమస్య అనే విభాగంలో సమస్యా పూరణకు చెందిన భిన్న చమత్కృతులు చర్చింప బడినవి.
తొలగించండిఅవి. 1)పద సమాస వాక్య చమత్కృతి 2)నూతన కల్పనా చమత్కృతి 3)క్రమాలంకార చమత్కృతి 4)శ్లేష చమత్కృతి 5)ప్రాస చమత్కృతి6)సాంకేతిక చమత్కృతి7)అపహాస్య చమత్కృతి8)అర్థాంతరాన్యాస చమత్కృతి9)కాకుస్వర చమత్కృతి10)శబ్దగతార్థ చమత్కృతి11)లోకోక్తి చమత్కృతి 12)లోకజ్ఞతా చమత్కృతి 13)చారిత్రక చమత్కృతి 14)పౌనరుక్త్య చమత్కృతి 15)ఛందో నిగూఢ చమత్కృతి.
మరికొన్ని కూడా ఉండ వచ్చును.ఏ సమస్య ఏ చమత్కారానికి ఒదిగి వస్తుందో ఆచమత్కృతి నెంచుకుని అవధాని పూరిస్తాడు.పృచ్చకుడుద్దేశించిన చమత్కృతిలోనే పూరించాలనేమీ లేదు.ఉదాహరణకు పృచ్చకుడు పద సమాస వాక్య చమత్కృతిలో సమస్య నిస్తే అవధానికి సరియైన పూరణ స్ఫురించక క్రమాలంకార చమత్కృతిని ఆశ్రయించ వచ్చు.
నా పద్యములోని ఒక్కొక్క పాదమును ప్రాస చమత్కృతిగా తీసుకొన వచ్చు. కొన్ని ప్రాస పదాలు కవికి దొరికినా వాటికి సరియైన అన్వయం కల్పించుట లోనే అతని ప్రతిభ బయట పడుతుంది కదా ! సమస్య లోని అంశముతప్పని సరిగా అసంగతమో, అసత్యమో అయిఉండాలనే నియమమేదీ లేదు. పై చమత్కృతులలో ఏదో ఒక దానికి సంబంధించినదై ఉండవచ్చు. లేదా ఒక నూతన చమత్కృతిని పృచ్చకుడు ఆవిష్కరించ వచ్చు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅన్నయ్యగారూ నాపద్యం చూసినట్లు లేదనుకొంటానండీ
రిప్లయితొలగించండినిన్న ఎందుకో తప్పిపోయింది. ఇప్పుడు స్పందించాను. పైన చూడండి...
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రాస చమత్కృతికి సంబంధించిన సమస్యలకు ఉదాహరణలు.దీనికి మరొక భిన్న చమత్కృతిని కూడా పృచ్చకుడు జోడిస్తే కవి (అవధాని) పని మరింత కష్టతర మౌతుంది.
రిప్లయితొలగించండి1)బంగ్లా మీదికి దారి జూపగలవా భామా శిరోరత్నమా !
2)పండ్రంగిచ్చటి కెంత దవ్వు చెపుమా పంకేజ పత్రేక్షణా !
3)యోషాక్లీబులు గూడ బుట్టె జగమెల్ల్లన్ దాన్.
4)జగద్వ్యాప్తము లయ్యెనిరులు ఖరకరు దుండన్.
5) మూర్ఖుండొక్కడు రాజుగా నయినచో ముల్లోకముల్ వేగవే ?
6)తుంక్త్వా ప్రత్యయముల్ రసజ్ఞమతి కెందుం దుష్టి జేకూర్చునే
పై వాటిలో మూడవ, నాల్గవ సమస్యలకు ఛందో నిగూఢ చమత్కృతి కూడా జోడింప బడటం గమనింప వచ్చు.
ఒకటవ ,రెండవ, ఐదవ సమస్యల్లోని అంశాలు సర్వ సాధారణమైన విషయాలే కానీ వాటిలో ఎటువంటి అసంగత్వం,అసత్యం, అనౌచిత్యం లేకపోవటం గమనింప వచ్చు.ఇటువంటి ఉదాహరణలు కొల్లలుగా లభ్యమౌతున్నాయి.స్పందన కొరకు ఎదురు చూస్తున్నాను.(మీ సూచనలు,సలహాలు పాల్గొను వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. అభినందనలు స్వీకరించండి.)
ప్రాస చమత్కృతికి సంబంధించిన సమస్యలకు ఉదాహరణలు.దీనికి మరొక భిన్న చమత్కృతిని కూడా పృచ్చకుడు జోడిస్తే కవి (అవధాని) పని మరింత కష్టతర మౌతుంది.
రిప్లయితొలగించండి1)బంగ్లా మీదికి దారి జూపగలవా భామా శిరోరత్నమా !
2)పండ్రంగిచ్చటి కెంత దవ్వు చెపుమా పంకేజ పత్రేక్షణా !
3)యోషాక్లీబులు గూడ బుట్టె జగమెల్ల్లన్ దాన్.
4)జగద్వ్యాప్తము లయ్యెనిరులు ఖరకరు దుండన్.
5) మూర్ఖుండొక్కడు రాజుగా నయినచో ముల్లోకముల్ వేగవే ?
6)తుంక్త్వా ప్రత్యయముల్ రసజ్ఞమతి కెందుం దుష్టి జేకూర్చునే
పై వాటిలో మూడవ, నాల్గవ సమస్యలకు ఛందో నిగూఢ చమత్కృతి కూడా జోడింప బడటం గమనింప వచ్చు.
ఒకటవ ,రెండవ, ఐదవ సమస్యల్లోని అంశాలు సర్వ సాధారణమైన విషయాలే కానీ వాటిలో ఎటువంటి అసంగత్వం,అసత్యం, అనౌచిత్యం లేకపోవటం గమనింప వచ్చు.
మరివీటిలోని సమస్యేమిటయ్యా అంటే ప్రాస నిర్వహణమే అసలు సమస్య.ఇటువంటి ఉదాహరణలు కొల్లలుగా లభ్యమౌతున్నాయి.స్పందన కొరకు ఎదురు చూస్తున్నాను.(మీ సూచనలు,సలహాలు పాల్గొను వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. అభినందనలు స్వీకరించండి.)
జనార్దన రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
పైన పేర్కొన్న సమస్యలన్నీ నేను సేకరించి వ్రాసి పెట్టుకున్న వాటిలో ఉన్నాయి. మన బ్లాగులో పద్యాలు వ్రాసేవారిలో ఎక్కువమంది ఔత్సాహికులే. అందువల్ల దుష్కర ప్రాసతో కూడిన సమస్యలను ప్రస్తుతం ఇవ్వడం లేదు. కొంతకాలం తర్వాత అప్పుడప్పుడు ఇటువంటి సమస్యలను ఇస్తాను.
ధన్య వాదాలు.నేను కూడ ఔత్సాహికుడనే.
రిప్లయితొలగించండి