11, సెప్టెంబర్ 2016, ఆదివారం

సమస్య - 2140 (మత్తేభమ్మును దోమ కూల్చ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్"
లేదా...
"సామజమునుఁ గూల్చె దోమ యొకటి"
ఈ సమస్యలను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

105 కామెంట్‌లు:

  1. కొండ వోలె మేను నిండుగా పెరిగిన
    దంతి తొండ మందు దారు ణముగ
    కక్ష గట్టి దొలిచె కసిదీర మెండుగ
    సామజమునుఁ గూల్చె దోమయొకటి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమ్మా! మూడోపాదం

      "కక్ష గట్టిఁ జేరి కసిదీరఁ దొలుచుచు"
      బాగుంటుందేమో!

      తొలగించండి
    2. రాజేశ్వరి అక్క గారి భావన, పూరణ బాగున్నాయి. శంకరయ్య గారన్నట్లు " దొలుచుచు" అని సవరిస్తే సమ్మగ్రత చేకూరుతుంది. అక్క గారికి అభినందనలు !-Janardhana Rao

      తొలగించండి
    3. ధన్యవాదాలు janardhana Rao jii!
      శంకరయ్యగారి ప్రేరణతో ఆ మాట నేనన్నాను.

      తొలగించండి


  2. హోరనుచు చెవిగని జోరని వేగపు
    పోటుగ నటునిటును పోరి పోరి
    జుయ్యనుచును గూడి హుయ్యని బొయ్యని
    సామజమునుఁ గూల్చె దోమయొకటి !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. సత్తా జూపిన ధీయుతుండు విధికిన్ సాష్టాంగ దండంబిడున్
    విత్తాల్బల్గము లున్న నేమి కడకో వీరుండనన్నన్ వృథా
    చిత్తై పోడె నయీము రక్షక భటున్ ఛేదింపనల్ప క్రియన్
    మత్తేభమ్మును దోమ కూల్చనదియే మండ్రాడె దైన్యమ్మునన్

    రిప్లయితొలగించండి
  4. ప్రాక్పశ్చిమాలేలు ప్రభుత ధూర్తత్వము
    న్నంగ బలములుండి భంగ పడియె
    సత్యాగ్రహమునిట సల్పె గాంధీ నల్సు
    సామజమును గూల్చె దోమ యొకటి

    రిప్లయితొలగించండి
  5. ఆర్యా , నామొధటి పూరణంలో ఛేదించు యల్ప క్రియన్ అంటే బాగుంటుందేమో

    రిప్లయితొలగించండి
  6. చిత్తంబందున దుష్టభావయుతయై చేరెంగదా బాలునిన్
    క్షుత్తుం దీర్తునటంచు పూతన మహాక్రూరాత్మ, తత్ప్రాణముల్
    మొత్తంబున్ హరియించె నాత డవురా! మున్నా ప్రదేశంబునన్
    మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తిగారు నమస్కారములు. మీ యుపమానము హర్షింప దగినది కాదు. ఆ బాలుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. సామాన్య బాలుడు కాదు గద. అన్యోపమానమునఁ బూరిస్తే బాగుంటుందని నా విన్నపము.

      తొలగించండి
    2. ఆర్యా!
      నమస్కారములు మరియు మీ మార్గదర్శనకు ధన్యవాదములు. మీరన్న మాట వాస్తవమే. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. సామాన్య బాలుడు కాదు. కాని అచట సామాన్య బాలునిగానే వ్యవహరించి యున్నాడను ఉద్దేశ్యముతో ఆవిధముగా వ్రాయుట జరిగినది. దోషమును తెలియ బరచినందులకు ధన్యవాదములు.
      దానికి బదులుగా మరొక పూరణ

      విత్తంబున్ బహుమూల్య వస్తుతతులన్ విస్తారరూపంబుగా
      నుత్తేజంబున బంచి యెన్నికలలో నుద్దండు డాతండు తా
      జిత్తైపోవగ నూతనాగతునకున్ జిజ్ఞాసు లిట్లాడి రా
      మత్తేభంబును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్.
      హ.వేం.స.నా.మూర్తి.

      తొలగించండి
    3. మూర్తి గారు ధన్యవాదములండి నా యభిప్రాయమును మన్నించి నందులకు. ఆ పసిబాలుడు మానవ మాత్రులకు సాధ్యము గాని రీతిలోనే ప్రవర్తించినాడు కదా.
      మీ యీ పూరణ మనోహరముగా నున్నది. నాపూరణ ను సమీక్షించ గోర్తాను.

      తొలగించండి
  7. మాననీయ! గాంచు మానంద పురమందు
    మశకరాజి యందు భృశము దిరుగ
    కరచి వ్యాధి గూర్చి ఘనుడగు నాతని
    సామజ! మును గూల్చె దోమ యొకటి
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అర్జుని రథమెక్కి నల్పుడగు శిఖండి
    భీష్ము డస్త్రములను బిగిచెడునటు
    చలుప నటుల జేసె తెలుపదాని నకటా!
    సామజమును గూల్చె దోమ యొకటె.

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. స్థాన బలిమి లేక తన బలమ్మును వీడ
      తారుమార గుచును తీరు మారు
      నూరు గాని యూర పేరదేపాటిరా
      సామజమును గూల్చె దోమ యొకటి!

      తొలగించండి
  10. కవిమిత్రులకు నమస్కృతులు...
    ఈరోజు ఉదయం హుస్నాబాదులో, సాయంత్రం హైదరాబాద్ కూకట్‍పల్లిలో జరిగే సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనడానికి వెళ్తున్నాను. హైదరాబాదు నుండి నేరుగా రాజమండ్రి వెళ్ళి రేపు అక్కడ జరిగే అష్టావధానం చూసి, ఎల్లుండి స్వస్థలం చేరుకుంటాను. అప్పటి వరకు దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనండి.
    రాజమండ్రిలో ఎవరైనా బ్లాగు మిత్రులను కలిసే అవకాశం ఉందా?

    రిప్లయితొలగించండి
  11. ఈగ సినిమ జూచి 'ఇన్స్పిరేషను'బొంది
    దోమ సినిమ దీసె దొడ్డ యొకడు
    చివర 'విలను'నేమొ చిత్తుగానదిజంపె
    సామజమును గూల్చె దోమ యొకటి.

    రిప్లయితొలగించండి
  12. ఆర్యా , నామొధటి పూరణంలో ఛేదించు యల్ప క్రియన్ అంటే బాగుంటుందేమో

    రిప్లయితొలగించండి
  13. ప్రాక్పశ్చిమాలేలు ప్రభుత ధూర్తత్వము
    న్నంగ బలములుండి భంగ పడియె
    సత్యాగ్రహమునిట సల్పె గాంధీ నల్సు
    సామజమును గూల్చె దోమ యొకటి

    రిప్లయితొలగించండి
  14. సత్తా జూపిన ధీయుతుండు విధికిన్ సాష్టాంగ దండంబిడున్
    విత్తాల్బల్గము లున్న నేమి కడకో వీరుండనన్నన్ వృథా
    చిత్తై పోడె నయీము రక్షక భటున్ ఛేదింపనల్ప క్రియన్
    మత్తేభమ్మును దోమ కూల్చనదియే మండ్రాడె దైన్యమ్మునన్

    రిప్లయితొలగించండి
  15. ఎలుక యొకటి గూల్చె కలబడి చీలిని
    మక్షికమ్ము గూల్చె మనుజు నకట!
    సామజమును గూల్చె దోమ యెకటి జూడ
    కలుగు విస్మయములు కలియుగాన!!!

    రిప్లయితొలగించండి
  16. హత్తేరీ మరిగంటి నిన్న దినమున్ అత్యద్భుతమ్మే మదిన్
    హత్తెన్ గా యిక నీగచిత్రముననే యాశ్చర్యమౌ రీతిగా
    చిత్తుంజేయుచు గూల్చివేసెనొకనిన్ చేయంగ హానిన్, అహో!
    మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్.

    రిప్లయితొలగించండి
  17. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఆ ట వె ల ది లో పూ ర ణ :-

    ప్రాణి కోటిని హతమార్చ గలుగు , రోగ -

    జీవుల నిడు మ శ ము సి౦ధురమును

    హేల c జ౦పు గద | కవీ౦ద్ర ! సూక్ష్మ౦బుగ

    సామజమును గూల్చు దోమ యొకటి !

    { మశము = మశకము ; మొదటి పాదములో
    నిత్యసమాసయతి ; ప్ర+అని = ప్రాణి }

    తే ట గీ తి లో పూ ర ణ :-

    కోట్ల ప్రాణుల జ౦పెడు ఘోర రోగ --

    జీవుల గలిగిన మ శ ము సి౦ధురమును

    హేల c జ౦పు | సమస్య యి౦దేమి కలదు ?

    సామజమ్మును గూల్చెను దోమ యొకటి !

    { మశము = మశకము }

    రిప్లయితొలగించండి
  18. మత్తుండైన జయద్ర థాధముని దంభంబంతయుం ద్రుంచి కిం
    చిత్తుంచన్ శిఖి నంత ఖండనము వే చేయంగ సౌవీరుడా
    జిత్తోన్మాది తపోబలమ్మునను నిశ్చేష్టుండయెన్ భీముడే
    మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్


    అల్ప జీవి యని యనాదరణ వలదు
    కాల వశమ జీవ కాయ మెల్ల
    నేత్ర మందు దూరి చిత్రముగను దొడ్డ
    సామజమునుఁ గూల్చె దోమ యొకటి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర్యా!
      మీ పూరణలు బాగున్నవి.అభివాదములు. మొదటి పూరణలో "శిఖినంత ఖండనము వేచేయంగ", "జిత్తోన్మాది" దయచేసి వివరించ ప్రార్థన.

      తొలగించండి
    2. కొంచెముంచి మిగిలిన శిఖిన్ అంత వేగముగా ఖండన చేయగా అని నా భావము. "చిత్తోన్మాది" జి పొరపాటుగా ఉండి పోయింది. అంతకు పూర్వము "సౌవీరుడున్" అని వ్రాసి మార్చాను. తెలిపినందులకు ధన్యవాదములు. ఉన్మాదము తో నిండిన చిత్తము కలవాడు గా ప్రయోగించితిని.

      తొలగించండి
    3. ఆర్యా!
      వివరణకు ధన్యవాదములు, బాగున్నదండి. నమస్కారములు

      తొలగించండి
  19. కత్తైపోయెను దోమతొండ మదియే కాలాగ్ని కీలమ్ముగా
    చిత్తైపోయెను లోకమంత యిపుడున్ చిందాడ కాలుష్యమే
    సత్తాయిప్పుడు రోగ కారకులదే సాధించె చూడుండదే!
    మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్!

    రిప్లయితొలగించండి
  20. రిప్లయిలు
    1. బాలకుడని నవ్వి బలి చక్రవర్తియే
      అధమ లోక మంటె నడుగు పడగ
      పెరుగ రోగ మేది విరుగు నేదైననూ
      సామజమునుఁ గూల్చె దోమ యొకట

      తొలగించండి
  21. ఎత్తు పైననెత్తు లెన్నెన్నొ వేయుచున్
    "కాస్పరస్కి"ప్రబలె గజమురీతి
    చిన్ని" విశ్వనాథ"ఛేదించ నవ్వాని
    సామజమునుగూల్చె దోమయొకటి.

    రష్యా దేశపు ఒకనాటి చదరంగపుసామజము"కాస్పరస్కి" మనదేశపు ఆనాటి చదరంగపు దోమ వంటి వాడు "విశ్వనాథ్ ఆనంద్.మన భారతీయుడైన ఆనంద్ మొదటి సారిగా కాస్పరస్కీని జయించెను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారు నమస్కారములు. ఆనాటి చదరంగపుటాటగాడు "కాస్పరావ్ ( Kasparov)". వానికిముందు "కార్పావ్" వీరికి ముందు "ఫిషర్" , "స్పాస్కీ" లు.

      తొలగించండి
    2. "కస్పారాఫ్" , "కార్పాఫ్" అని పల్కుతారు వాళ్ళిద్దరిని రష్యాలో.

      తొలగించండి
    3. కామేశ్వరరావుగారు.నమస్సులు.నిజమే. కాస్పరోవు...అని వ్రాద్దామనుకున్నాను.కాని సినిమాకు వెళ్ళే హడవుడిలో...కాస్పరస్కి..అని వ్రాశాను. నిజంగా అది ఒక యాంటి వైరస్ సాఫ్ట్ వేర్.పొరపాటే.మీ సూచనకు కృతజ్ఞతలు.

      తొలగించండి
  22. చిత్త రంజ నుండు చిత్తుగా నోడించె
    ఎంటి రామరావు తొంటి యొకట
    కలసిరాని నాడు కాలమహిమచేత
    సామజమును గూల్చెదోమయొకటి

    రిప్లయితొలగించండి
  23. రిప్లయిలు
    1. *గణముల్యుగ్రోద్యమంబెన్న*
      గణముల్+ఉగ్ర+ఉద్యమంబు+ఎన్న=
      గణములుగ్రో...

      తొలగించండి
    2. మూర్తి గారు నమస్సులు. మీ పూరణ బాగుంది.
      “గణమే యుగ్రోద్యమంబెన్న” అనండి. “గణముల్ యుగ్రోద్య ..” అని వ్రాసినప్పుడు సంయుక్తమైనట్లున్నాయి.
      మూడవ పాదములో గణదోషమున్నది. గమనించండి.
      “చ్చిత్తశ్రీమతి యిందిరన్విజితగా జేసెన్నొకండాఢ్యుడై” అన్న సరి పోవచ్చును.

      స్థైర్యవత్+ చిత్త = స్థైర్యవచ్చిత్త : శ్చుత్వ సంధి.
      సత్ +చిత్ =సచ్చిత్ వలె.
      ఇక్కడ ఛత్వ సంధి కి యాస్కారము లేదు. ఎందుకంటే “శ” కారము పరమవలేదు కాబట్టి.
      "చ్ఛిత్త" ప్రమాదవశమున పడిందనుకుంటాను.

      తొలగించండి

  24. సత్తాజూపగ బాలకుండొకడు విశ్వాసంబుగా ప్రఙ్ఞలో
    చిత్తైరెల్లరు పండితోత్తములు వచ్చెన్మత్సరంబూని యు
    న్మత్తుండైన విపశ్చితుండు సభకున్ సాధించెతానోటమిన్
    మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్ ||

    రిప్లయితొలగించండి
  25. ఒకానొక క్రికెట్ ప్రపంచకప్ పోటీలలో మొట్టమొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోయిన సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకుని....

    కొత్తేమున్నది మానవా! మదిన సంకోచమింకేలనో
    సత్తానిండిన జట్టుగా జగతి యే శ్లాఘించి కీర్తించినన్
    చిత్తున్ జేయగ భారతీయ క్రికెటున్ చిన్నారి బంగ్లా గనన్
    మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్

    రిప్లయితొలగించండి

  26. బాలుడు సభలోన పాండిత్యమున్ జూపఁ
    నోర్వలేని విబుధుడొకడు చేరి
    పాటవంబులేమినోటమిపాలయ్యె
    సామజమునుఁ గూల్చె దోమ యొకటి.

    రిప్లయితొలగించండి
  27. రిప్లయిలు


    1. మా కంది శంకరార్యుల
      దా కామింటాంగ్ల భాష తారస బడెనూ ?
      లేక యిదిమరియెవరి దై
      నా కామింటా ! జిలేబి ఆశ్చర్యంబౌ !

      జిలేబి

      తొలగించండి
  28. అద్భుతమ్ములెన్నొ యాండ్రైడు ఫోనులో
    మంత్రములను మించు తంత్రములును
    మనిషి నొక్క చిన్న మండూకమే మ్రింగె
    సామజమును గూల్చె దోమ యొకటి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములండి రాజ్ కుమార్ గారు....నా మొదటీ శార్దూల పూరణ గురించీ చెప్పనే లేదు దయచేసి .....చూడగలరని విన్నపం

      తొలగించండి
  29. చెత్తన్ జేర్చగబుట్టి|దోమకడుపున్ జేరందు రోగంబుతో
    పొత్తున్బెంచిన సూక్ష్మజీవులట విస్పోటంబు సృష్టించగా?
    మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్
    సత్తా లేనిదటంచు నెంచకుము విశ్వంబందు యేప్రాణికిన్.
    2.అంకుశాననొకడు మంకును మాన్పగ
    సామజమును గూల్చె|”దోమ యొకటె
    కొన్నిరోగములను కూడియు మనకుంచు
    జీవ శక్తి ద్రుంచు|చిత్ర మేగ?”

    రిప్లయితొలగించండి
  30. చాటు నున్న కృష్ణు వేటగా డఱయక
    శరము విడువగ హరి చనియె దివికి!
    సామజమును గూల్చె దోమ యొకటి యట!
    విధిని దాట తరమె విదుల కైన!

    రిప్లయితొలగించండి
  31. చాటు నున్న కృష్ణు వేటగా డఱయక
    శరము విడువగ హరి చనియె దివికి!
    సామజమును గూల్చె దోమ యొకటి కాదె!
    విధిని దాట లేడు విష్ణు వైన!

    రిప్లయితొలగించండి
  32. శ్రామికులకు iనేత 'సామవేది'ని ప్రజ
    'సామజ'మని రతని సొరు జూచి
    అతడు 'డెంగు'బారి హతుడవ బల్కిరి
    సామజమును గూల్చె దోమ యొకటి

    రిప్లయితొలగించండి
  33. చెవులపిల్లి చంపె సింహమ్ము నొకదాని
    బుద్ధిబలముచేత బుధులుఁ బొగడ
    సామజమును గూల్చె దోమయొకటటంచు
    ధరణిఁ జెప్పు కొనఁగ చరితలెన్నొ!

    రిప్లయితొలగించండి
  34. బాల కృష్ణు జంప పాలివ్వ పూతన

    పాల తోడ గొనెను ప్రాణములను

    ఘటన నిట్లు పోల్చె కవనాన కవులెల్ల

    సామజమును గూల్చె దోమ యొకటి.

    రిప్లయితొలగించండి
  35. బాల కృష్ణు జంప పాలివ్వ పూతన

    పాల తోడ గొనెను ప్రాణములను

    ఘటన నిట్లు పోల్చె కవనాన కవులెల్ల

    సామజమును గూల్చె దోమ యొకటి.

    రిప్లయితొలగించండి
  36. కవిమిత్రుల పూరణ లన్నియు చాలా బాగున్నవి. బ్లాగులో ప్రచురించిన శ్రీ కంది శంకరయ్య గారికి ధన్యవాదములు.
    నా పూరణ:
    శా. చిత్తైకాగ్రత నిల్పి చూడ నవనిన్ చిత్రమ్ము లేలేవుగా
    క్రొత్తల్ గా కనిపించు వాస్తవములే కోల్పోవ ధీ శక్తియే
    ఉత్తుంగమ్మగు దంతి కూలు మశకోపాత్తమ్మదై వ్యాధిచే
    మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్
    మండ్రాడు = సంతాపించు ;ఉపాత్తము = అపహరింపబడు ; ఆవరింపబడు

    రిప్లయితొలగించండి
  37. ఆ.వె.అంత పేరు లేని అభ్యర్థి చేతిలో
    ఇందిరమ్మ ఓడె నెంత వింత !
    అచ్చెరువు గలుగగ అందరనిరి గాదె?
    సామజమును గూల్చె దోమ యొకటి.

    రిప్లయితొలగించండి
  38. మాకు review చేసేంత శక్తి లేదు.ఎవరైనా విజ్ఞులు చేస్తే సరిదిద్దుకుంటాము.

    రిప్లయితొలగించండి
  39. వేల వీరు లనిని వేంగళ రాయని
    ధాటి కోర్వ లేక దగ్ధ మవగ
    తరుణ వయసు నందె తనరు యోధు ననిరి
    ''సామజమునుఁ గూల్చె దోమ యొకటి''

    చెట్టు నున్న కోతి మట్టు పెట్టగ తోట
    సామజమునుఁ గూల్చె దోమ యొకటి
    యనుచు పరుగు లిడిరి యసురులు లంకలో
    ప్రాణ భీతి తోడ పరుగు లిడుచు

    రిప్లయితొలగించండి
  40. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈరోజు హుస్నాబాదులో సమావేశం మధ్యాహ్నం 2.30 గం.లకు పూర్తయింది. అప్పుడు బయలు దేరితే కూకట్‍పల్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత చేరుకుంటాను. అందువల్ల హైదరాబాదు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాను. ఈలోగా వరంగల్లునుండి ఒక బంధువు చావు కబురు.. వెంటనే తిరిగి వచ్చాను. నా రాజమండ్రి ప్రయాణాన్ని కూడా రద్దు చేసుకున్నాను.
    ఈనాటి పూరణలపై మిత్రుల స్పందన నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఇటువంటి పరస్పర సమీక్షలు సందేహాలను నివృత్తి చేస్తూ పద్యరచనాసక్తిని పెంపొందిస్తాయి. అందరికీ ధన్యవాదాలు.
    మరికొన్ని పూరణలు ఎవరూ స్పందించనివి కొన్ని ఉన్నాయి. అలసి ఉన్న కారణంగా ఇప్పుడు సమీక్షించలేను. వీలైతే రేపు ఉదయం చేస్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ కంది శంకరయ్య గారూ ! నమస్తే ! నా శార్దూల పద్యం మూడవ పాదంలో యతి మైత్రి లేదు. నాకు తోచటం లేదు. దయయుంచి సరి చేస్తారా?
      "ఎత్తుల్లావు ప్రసక్తి లేక మశకాల్లేనుంగునే కుట్టుగా"
      ఆ పాదం తొలగించి ఈ పాదం చేరిస్తే సరిపోతుందా ? సలహా ఇవ్వ గలరు.

      తొలగించండి
    2. జనార్దన రావు గారు నమస్కారములు. మశకాల్ - ఏనుంగు లన్నప్పుడు ద్విత్వము రాదు. ఈ సవరణ ను పరిశీలించండి.

      చిత్తైకాగ్రత నిల్పి చూడ నవనిం జిత్రమ్ము లేలేవుగా
      క్రొత్తై నిత్యము దోచు వాస్తవములే కోల్పోవ ధీ శక్తియే
      యుత్తుంగమ్మగు దంతి కూలు మశకాద్యోద్ఘాత వ్యాధ్యోగ్రతన్
      మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్

      తొలగించండి
    3. గురువు గారు కాదు నేను కామేశ్వర రావు నండి. పద్యములో మొదటి పాదములో తప్ప మిగిలిన పాదముల నచ్చును వాడరాదు. యడాగమ నుగాగమములతో గాని సంధిగతము గాని యుండవలెను. సీస పద్యము తర్వాత వచ్చు తేటగీతి , యాటవెలదుల మొదటి పాదము కూడ అచ్చుతో నుండకూడదు.

      తొలగించండి
  41. పద్యాన్ని మార్చి వ్రాశాను.రాజ్ కుమార్ గారు, కామేశ్వరరావుగారు చిత్తగించ ప్రార్థన.సంక్లిష్టనిర్మాణంవల్ల జరిగే తప్పుల వల్ల
    ఎక్కువగా విషయాలు తెలుసుకోవచ్చని ఆశ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒకటి , మూడు పాదములలో గణ దోషము లట్లే యుంచిరి.

      తొలగించండి
    2. మూర్తి గారు మన సౌలభ్యము కోసమొకటి గుర్తు పెట్టుకోవాలి.
      శార్దూల, మత్తేభ పద్యాలలో వరుసగా మూడు లఘువులు మూడు గురువులూ ఉంటాయి ఆ రెండో గురువుకే యతి మైత్రి చేయాలి.

      తొలగించండి

  42. హస్తి కరమునందు నలవోకగా దూరి
    కొరుకు చుండె సతమువెరపు లేక
    యూపిరాడ లేక యుసురుసురనుచుండ
    సామజమును కూల్చె దోమ యొకటి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా చక్కని పూరణ ! అభినందనలు. ఇంకొంచెము మెరుగులు పెడదామా ? రెండవ పాదంలో " కొరుకు చుండి" అనీ, మూడవ పాదంలో "యుసురుసురనుచున్న" అనీ మారిస్తే ఎలా ఉంటుందో పరిశీలించ గలరు.

      తొలగించండి
  43. శాంతనవుని యచట చంపశిఖండియు
    కృష్ణమాయచేత కిరీటి రథమెక్కి
    అంత గొప్ప వీరు నవనిలో యోడించె
    సామజమును కూల్చె దోమ యొకటి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కని పూరణ మేడంగారూ ! అభినందనలు. అయితే రెండవ పాదమొక మారు సరిజూస్తారా? ఆటవెలది కదా !

      తొలగించండి
  44. ధన్యవాదములండీJanardhanarao garu.
    ముందది మూడవపాదమనుకొని వ్రాశాను.
    "రథము నెక్కి చేసి రణము నచట"
    అంటే సరిపోతుందాండీ

    రిప్లయితొలగించండి
  45. బాగున్నదండీ కామేశ్వర రావు గారూ ! ధన్య వాదాలు. పాదము యడాగమముతో ప్రారంభించారు కదా ! అది సరియేనా ? తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  46. ఉత్తేజంబున సర్వపక్షములునుగ్రోత్సాహమందుండ ప
    శ్చాత్తాపంబును జెందనట్టి తరినాశ్చర్యంబుగా స్థైర్యవ
    చ్చిత్త శ్రీమతి యిందిరన్విజితగా జేయంగ నొక్కండటన్
    మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్"

    రిప్లయితొలగించండి
  47. విత్తంబింతయు ముట్టకుండ చిరు కౌపీనమ్ము నంకించుచున్
    చిత్తంబందున సత్యమూనుచును తా శ్రీరామ భక్తుండుగా
    కత్తుల్ వీడుచు శాంతి తోడ దొరలన్ కంపించి పంపించుచున్
    మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్

    రిప్లయితొలగించండి