కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మార్తాండుం డుదయాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్"
(ఖమ్మం అవధానంలో రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు పూరించిన సమస్య)
లేదా...
"మార్తాండుఁడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మార్తాండుం డుదయాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్"
(ఖమ్మం అవధానంలో రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు పూరించిన సమస్య)
లేదా...
"మార్తాండుఁడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్"
(ప్రాచీనమైన అజ్ఞాతకవి పూరణము...)
కీర్తింపం దగు రామసాయక మహాగ్నిజ్వాల శుంభన్నిశా
వర్తిన్ రావణుఁ గాంచి నారదుఁడు దేవాధ్యక్షుతోఁ బల్కె "న
ట్లార్తిన్ జెంద మిముం జయించెఁ గద ము న్నత్యుగ్రుఁడై దైత్యరా
ణ్మార్తాండుం డుదయాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్".
కీర్తింపం దగు రామసాయక మహాగ్నిజ్వాల శుంభన్నిశా
వర్తిన్ రావణుఁ గాంచి నారదుఁడు దేవాధ్యక్షుతోఁ బల్కె "న
ట్లార్తిన్ జెంద మిముం జయించెఁ గద ము న్నత్యుగ్రుఁడై దైత్యరా
ణ్మార్తాండుం డుదయాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్".
క్రొవ్విడి వెంకట రాజారావు :
రిప్లయితొలగించండిస్ఫూర్తిగల కృష్ణ మాయకు
మార్తా0డుడు గ్రు0కె నదిగొ మధ్యాహ్నమునన్
కర్తారిపోయె ననియెడి
వార్తకొలయు సై0ధవుఁ దరి పార్థు0డురికెన్
క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కర్త+ఆరిపోయె' అన్నపుడు యడాగమం వస్తుంది. 'వార్త కొలయు'...? "కర్తయె తొలగి చనె ననెడి। వార్తను విని ...' అందామా?
గురువుగారు! నమస్కారములు. మీసూచన ననుసరించి పద్యాన్ని మార్చాను. చూడండి. మీరిచ్ఛే ప్రోత్సాహం ఉత్తేజితుణ్ణి చేస్తోంది. తెలుగు పండితుడుని కాకపోయినప్పటికీ పద్యాలు వ్రాయాలన్న దీక్షతో వ్రాస్తున్నాను. మీరు తెలియజేసే వ్యాకరణ విషయాలు, దోషాల సవరింపు అమూల్యంగా ఉండి ముందుకు పరుగెత్తిస్తున్నాయి. హృదయపూర్వక కృతజ్ఞతలు.
తొలగించండిపద్యం:
స్ఫూర్తిగల కృష్ణ మాయకు
మార్తా0డుడు గృ0కె నదిగొ మధ్యాహ్నమునన్
కర్తయె తొలగి చనె ననెడి
వార్తను విని సై0ధవుఁ దరి పార్ధు0డురికెన్.
రాజారావు గారూ,
తొలగించండిముందుగా 'కర్తారి' అర్థం వెదకి చూశాను. ఆంధ్రభారతిలో 'కత్తెరవంగ చెట్టు' అన్న అర్థం ఒకటే ఉంది. సూర్యుడు అన్న అర్థం లేదు. అందువల్లనే అది కర్త ఆరిపోయె అనే అర్థంలో వ్రాశారనుకొని సవరణ సూచించాను.
కర్తవ్యము నెరవేర్చగ
రిప్లయితొలగించండిమార్తాండుఁడు , గ్రుంకె నదిగొ మధ్యాహ్న మున
న్నార్తిగ పరుగిడె పశ్చిమ
భర్తీ జేయగ తనవిధి భర్తగ తానై
అక్కయ్యా,
తొలగించండిపద్యం బాగుంది. కాని క్రుంకె నన్నదానికి అన్వయం?
కర్తవ్యము నెరవేర్చగ
తొలగించండిమార్తాండుఁడు గ్రుంకె , నదిగొ మధ్యాహ్న మున
న్నార్తిగ పరుగిడె పశ్చిమ
భర్తీ జేయగ తనవిధి భర్తగ తానై
అక్కయ్యా,
తొలగించండిసవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
'పశ్చిమ' అని ప్రత్యయం లేకుండా ప్రయోగించారు. 'పరుగిడె నపరకు' అనండి (అపర=పశ్చిమము)
dhanya vaadamulu
తొలగించండి
రిప్లయితొలగించండివార్తా పత్రిక చదివెను
మార్తాండుఁడు, గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్
ధూర్తుల నాగడముల తా
పూర్తిగ చదువ మతి బోయి పురమును వీడెన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(ఉదయం మీ పూరణ నా దృష్టినుండి ఎందుకో తప్పిపోయింది. మన్నించండి)
వార్తం జూడగ రండు మిత్రు లిచటన్ భారీ ప్రయత్నంబుతో
రిప్లయితొలగించండికీర్తిం బొంద విహాయసంబున సదా క్షేమంకరం బౌచు మా
యార్తిం దీర్చు నటంచు బంపి రకటా! యాకృత్రి మాకారమౌ
మార్తాండుం డుదయాద్రి గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండికృత్రిమ సూర్యుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిగురువుగారూ! చిన్నవిన్నపము. కర్తారి అంటే సూర్యుడు అని అర్ధం కదా! నేను సూర్యుడు పోయే అంటే., అస్తమించాడన్న వార్త విని అన్న భావనతో వ్రాసాను. మీరు కర్తారిపోయె విడదీశారుక్రొవ్విడి వెంకట రాజారావు:
గురువుగారూ! చిన్నవిన్నపము. కర్తారి అంటే సూర్యుడు అని అర్ధం కదా! నేను సూర్యుడు పోయే అంటే., అస్తమించాడన్న వార్త విని అన్న భావనతో వ్రాసాను. మీరు కర్తారిపోయె విడదీశారు
రాజారావు గారూ,
తొలగించండిముందుగా 'కర్తారి' అర్థం వెదకి చూశాను. ఆంధ్రభారతిలో 'కత్తెరవంగ చెట్టు' అన్న అర్థం ఒకటే ఉంది. సూర్యుడు అన్న అర్థం లేదు. అందువల్లనే అది కర్త ఆరిపోయె అనే అర్థంలో వ్రాశారనుకొని సవరణ సూచించాను.
రాజారావు గారు కర్తారుడు పదము సూర్యునకు వర్తించ వచ్చును
తొలగించండిఆంధ్రభారతి నిఘంటుశోధన పేజీలో కర్తారుడు అంటే సూర్యుడు అన్న అర్థాన్ని జి.యన్.రెడ్డి గారి తెలుగు పర్యాయపద నిఘంటువు నుండి పేర్కొనటం కనిపిస్తోంది. కాని కవిప్రయోగాలు ఏమన్నా ఉన్నాయో లేదో తెలియదు. లేకపోయేందుకే అవకాశం హెచ్చు.
తొలగించండినిఘంటువు సహయంతో పద్యాలను వ్రాయటం అభ్యాసం చేయటం అంత సముచితం కాదని నా అభిప్రాయం. గణాలకు పదాలను వెదకటంలో భాగంగా ఇలా చేస్తూ పోతూ ఉంటే పద్యాలు కృతకంగా వస్తాయి తరచుగా. కొంచెం గమనికగా ఉండవలసినదని విన్నపం.
శ్యామలరావు గారు మీరన్నది నిజమే అది చూచే కర్తారుడు కు బదులు కర్తారి వాడారేమోనని నేను సూచించితిని.
తొలగించండినేను భారతము చదువుతున్నప్పుడు కొన్ని పదముల కర్థము ఒక్క జి ఎన్ రెడ్డి గారి నిఘంటువు లోనే గమనించాను కూడ.
నేను మాత్రము దాని మీదే యాధారపడను.
నిన్నటి నా పూరణను కూడా చూడ గోరుతాను. ధన్యవాదములు.
రిప్లయితొలగించండికరమగు స్తిమితము కూడగ
న్నరిషడ్వర్గమ్ము హితము నందించు సదా
స్తిరమగు చిత్తము సడలిన
హరియించును శాంతి సుఖము లను ప్రియ సఖులన్!
(సుఖములు + అను)
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
పూర్తికలన కాలంబున
రిప్లయితొలగించండిహర్తను కబళించ నోట నానందముగన్
స్ఫూర్తిగ నేతెంచ నగువు
మార్తాండుఁడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
'నగువు'...?
ధన్యవాదములు గురువుగారు..అగువు = రాహువు
తొలగించండిధూర్తుడు రాహువు మ్రి౦గగ
రిప్లయితొలగించండినార్తిని జెందితిని రావణాసురు డేసెన్
కర్తా సైచగ లేనని
మార్తాండుఁడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కార్తీక్ తో వెడలితినే
రిప్లయితొలగించండిమూర్తిని, నక్షత్రశాల - మూసిన గదిలో
పూర్తిగ పైనను జూడగ
మార్తాండుఁడు గ్రుంకె నదిగొ 'మధ్యాహ్నమునన్'.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిస్ఫూర్తిన్నింప శతావధానములలోఁబూరీలు నిడ్లీలు స..
తొలగించండిత్కీర్తిన్ దత్తపదమ్ములయ్యెనకటా! క్లిష్టార్థసంక్లిష్టమౌ
మార్తాండుండుదయాద్రి గ్రుంకెనదిగో
మధ్యాహ్నకాలంబునన్
పూర్తింజేయ సమస్య యంచునిడిరీ పుణ్యాత్ములెవ్వారలో !!?
మూర్తింగ్రమ్ముచు మేఘమాల విడువన్ పూర్వాపరాహ్ణమ్ములన్
వార్తల్ వ్రాసెను పత్రికావళులిటుల్ స్పర్థాతిరేకమ్ముతో
మార్తాండుండుదయాద్రి గ్రుంకెనదిగోమధ్యాహ్నకాలంబునన్
కీర్తింగోరి , పఠించి పాఠకులు సందేహాత్ములై కుందగన్ !!
మైలవరపు మురళీకృష్ణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
హర్తృత్వమ్ము వహించి రాత్రియెడ నాహా వెల్గులన్ జిమ్మె నా
రిప్లయితొలగించండిమార్తాండుడుదయాద్రి, గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలమ్మునన్
స్ఫూర్తిన్ నింపియు జీవకొటికి నికన్ సోముండు రాజూడగన్
కర్తవ్యమ్మును దీర్చి సృష్టి విధులన్ కాపాడు మార్తాండుడున్
హర్తయగుచు రాత్రికి , నిక
రిప్లయితొలగించండిమార్తాండుడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్
స్ఫూర్తి నిడి జీవకోటికి
కర్తవ్యము చంద్రునకిడి కాల వశమునన్
ధనికొండ రవిప్రసాద్ గారూ,
తొలగించండిపెక్కు దినాలకు బ్లాగులో మీ పూరణలను చూస్తున్నాను. సంతోషం!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కీర్తిన్ గాంచె పరాక్రమోద్ధతిఁ నిజాంఘ్రిన్ వ్రాలగా జేసె నా
రిప్లయితొలగించండిధూర్తారాతి విశేష సంఘముల, సంతోషంబునన్ వేట దా
హార్తిన్ బాపఁగఁ బోయి సింగమున తాఁ హంతుండయెన్ వీర స
న్మార్తాండుం డుదయాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'హంతుం డయెన్'...? 'తా నంతం బయెన్' అనవచ్చు కదా!
మూర్తీ ! చూడుము గగనము
రిప్లయితొలగించండిమార్తాండుడు గ్రుంకె, నదిగొ మధ్యా హ్న మున
న్నా ర్తిని విలవిల లాడగ
మార్తాండుడు రెచ్చి పోయి మాడ్చె ను శిరముల్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధూర్తుండై యటు సైధవుండు రణమున్ దుర్మార్గపుంజేష్టలన్
రిప్లయితొలగించండివర్తించన్నభిమన్యుడీల్గె నరుడే భాసించె గ్రోధాత్ముడై
కర్తవ్యంబుగ గృష్ణుచక్రమటులా ఖద్యోతమున్నింపగా
మార్తాండుండుదయాద్రి గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్.
కర్తవ్యంబును దలచుచు
భర్తకు విజయంబుగూర్ప భానుని పగిదిన్
వర్తించె ద్యాగశీలత
మార్తాండుడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్.
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పుర్తైన పిదప భొజ్యము
రిప్లయితొలగించండివార్తగ వినుచున్ సమస్య వావ్ యని జూపన్
మూర్తి చరవాణి తెరపై
మార్తాండుఁడుఁ గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వావ్+అని' అన్నపుడు యడాగమం రాదు.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిమ పూరణ:
తొలగించండిపుర్తైన పిదప భొజ్యము
వార్తగ వినుచున్ సమస్య వావని జూపన్
మూర్తి చరవాణి తెరపై
మార్తాండుఁడుఁ గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్
ఆర్తత్రాణ పరాయణుండు కమలాత్మాధీశు డత్యున్నతిన్
రిప్లయితొలగించండిధూర్తేంద్రారులు రాహుకేతువుల వే త్రుంచంగ దుష్టాత్మసం
హర్తృద్రోహ పరాయణుండు దిన రాహ్వాఖ్యుండు గన్పించి యా
మార్తాండుం డుదయాద్రిఁ, గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్
కర్తవ్యంబును దా ని
ర్వర్తింపఁ జరించుచుండ రాహుక్షుద్భా
ధార్తిం గుంది వివశుడై
మార్తాండుఁడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్
రాహుక్షుద్భాధార్తిం గుంది : రాహువు యొక్క క్షుద్బాధ చేత (మింగుట వలన) దుఃఖమును పొంది శోకించి
తొలగించండిపోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండికర్తవ్యంబును తెలుపుడు
రిప్లయితొలగించండిమార్తాండుడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్”
వార్తనిడ దళము, వెలివడి
ధూర్తుడు సైంధవుడు తాను దురమున చచ్చెన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కర్తవ్యము పూర్తవగను
రిప్లయితొలగించండిమార్తాండుడు గ్రుంకె నదిగొ , మధ్యాహ్నమునన్
కార్తీకదీప మనుచును
మూర్తియె సిద్ధమ్ము జేసె ముట్టించెదమా!?
కర్తవ్యోణ్ముఖుడై ధరీత్రిజననీ గర్భమ్మునన్ బుట్టెనా
మార్తాండుండుదయాద్రి, గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్
బూర్తిన్ బండిన పంటభూములవి సంపూర్ణమ్ముగా నష్టమై
ఆర్తిందెచ్చెను సేద్యగాండ్రకు ప్రవాహమ్మైన వర్షమ్ముయే
ధూర్తుండౌ ఖలు సైంధవుండనిన తా దుర్నీతి పాటించుచున్
వర్తింపన్నభిమన్యుడొడ్డ నరుడే భాసించె గ్రోధాత్ముడై
కర్తవ్వోణ్ముఖుడైన మాధవుడు చక్రంబంత సంధింపగన్
మార్తాండుండు దయాద్రి గ్రుంకెనదిగో మధ్యాహ్న కాలంబునన్
విరించి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'వర్షమ్ము+ఏ=వర్షమ్మే' అవుతుంది, యడాగమం రాదు. 'ప్రవాహమ్మైన దుర్వర్షమే' అంటే ఎలా ఉంటుంది?
గురువు గారికి ధన్యవాదములు మీరు సూచించాక తిరుగుంటుందా గురువుగారు.
తొలగించండిగురువు గారికి ధన్యవాదములు మీరు సూచించాక తిరుగుంటుందా గురువుగారు.
తొలగించండిఆర్తిగ పశ్చిమ దిక్కున
రిప్లయితొలగించండిమార్తాండుడు గ్రుంకెనదిగొ; మధ్యాహ్నమునన్
పూర్తిగ వెలుగు నిడి జగతి
స్ఫూర్తిగ తిరుగుచు నలసట పొందగ తానున్.
ఆర్తిగ...............
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కర్తృత్వ౦బున సజ్జను౦ డొకడు సత్కార్య౦బు
……………… చేబూనగా ,
స్ఫూర్తిన్ భగ్నము సేయ నె౦చు గద
……… దుష్టు౦ డెప్డు | శోభి౦చె - నా
మార్తా౦డు౦ డుదయాద్రి | గ్రు౦కె నదిగో
………… మధ్యాహ్న కాల౦బునన్ ,
ధూర్తు౦డౌ " తలగాము " మ్రి౦గ |
……… కనమే దుశ్చి౦తు దుశ్చర్యలన్ ? ?
్
{ త ల గా ము = రా హు వు }
్
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆర్తిన్ జెంద పృథా సుతుండు, తలచెన్ హంసుండు దైత్యారి తా
రిప్లయితొలగించండికర్తవ్యంబు కనంగ దుస్సల పతిన్, కావించ పెన్మాయ, “నా
మార్తాండుండుదయాద్రిఁగ్రుంగె నదిగో మధ్యాహ్నకాలంబునన్”
వార్తల్ చేరగ, సైంధవుండు ముదమున్ ప్రత్యక్ష మై రూపఱెన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆర్తి వలదు!పశ్చిమమున
రిప్లయితొలగించండిమార్తాండుడు గ్రుంకె నదిగొ! మధ్యాహ్నమునన్
వార్తల గాంచగ పొందిన
స్ఫూర్తిన్ మంజుల కవనము పూరింప నగున్!
చిన్న మార్పుతో మరొక పద్యం.
రిప్లయితొలగించండిఆర్తి వలదు! తాపమిడెడు
మార్తాండుడు గ్రుంకె నదిగొ! మధ్యాహ్నమునన్
వార్తల గాంచగ పొందిన
స్ఫూర్తిన్ మంజుల కవనము పూరింప నగున్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూర్తింగ్రమ్ముచు మేఘమాల విడువన్పూర్వాపరాహ్ణమ్ములన్
రిప్లయితొలగించండివార్తల్ వ్రాసెను పత్రికావళులిటుల్ స్పర్థాతిరేకమ్ముతో
మార్తాండుండుదయాద్రి గ్రుంకెనదిగోమధ్యాహ్నకాలంబునన్
కీర్తింగోరి ,పఠించి పాఠకులు సందేహాత్ములై కుందగన్ !!
స్ఫూర్తిన్నింప శతావధానములలోఁబూరీలు నిడ్లీలు స..
త్కీర్తిన్ దత్తపదమ్ములయ్యెనకటా ! క్లిష్టార్థసంక్లిష్టమౌ
మార్తాండుండుదయాద్రి గ్రుంకెనదిగోమధ్యాహ్నకాలంబునన్
పూర్తింజేయ సమస్యయంచునిడిరీ పుణ్యాత్ములెవ్వారలో!!?
కర్తవ్యంబును కాలరాయకను సంకల్పించి విచ్చేయుగా
రిప్లయితొలగించండిమార్తాండుండుదయాద్రి|” గ్రుంకె నదిగోమధ్యాహ్న కాలంబునన్
పూర్తి స్థాయిగ భూమిఛాయబడ?సంభూతమ్మటంచెంచుచున్?
ఆర్తిన్ జెందుచు పక్షిజాతి వెడలెన్ |నర్ధాంత రంగమ్మునన్|
౨ కర్తగ తూర్పున బుట్టెను
మార్తాండుడు” గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్
వర్తుల మౌ మేఘాలలొ”|
వర్తిష్ణువు సూర్యు డిలకు పరమాత్ముండే|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'అర్ధాంతరంమ్ము'...? 'అర్ధాంతరమ్మౌ గతిన్' అందామా?
'మేఘాలలొ' అని లో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. 'వర్తులమౌ మబ్బులలో' అందామా?
ఆర్తిన్ సర్వప్రపంచ మీయెడనొకే యంతర్ప్రసార క్రియన్
రిప్లయితొలగించండివార్తల్ లెక్కల వ్యాపకత్వము గనన్ వచ్చెన్ హఠాత్వైరసుల్
కీర్తిన్ యర్థమునందు చీకటులవే క్రీడించ వ్యాపారపుం
మార్తాండుండుదయాద్రి క్రుంగె నదిగో మధ్యాహ్న కాలంబునన్
కీర్తిన్ గానక బద్మ వ్యూహము నిలన్ గైకొన్న వీరుండు వే
రిప్లయితొలగించండిలార్తిన్ జెంద విజృంభణాతిశయపుం లాస్యంబనిన్ జేసినన్
ధూర్తుల్ యా యభిమన్యు మోసముననే దున్మంగ నీ పోలికన్
మార్తాండుండుదయాద్రిగ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్
ఆర్తిన్ యా దినమున సుము
రిప్లయితొలగించండిహూర్తము తద్దినమహో యది గడిచెన్
పూర్తిగ వడి ఘటికోన్ముఖ
మార్తాండుడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్
తద్దినమననహో యది గడిచెన్ ..గా చదువ ప్రార్థన
తొలగించండిఆర్తిని యాదినమున సుము
హూర్తము తద్దినమనమహో యది గడిచెన్
పూర్తిగ వడి ఘటికోన్ముఖ
మార్తాండుడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్
మళ్ళీ మరో తప్పు దొర్లింది
రిప్లయితొలగించండిహూర్తము తద్దినమననహో యది గడచెన్ గా చదవండి
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
కర్తవ్యంబును వీడకుండ నెపుడున్ గాపాడ తోతెంచుచున్
రిప్లయితొలగించండిమార్తాండుం డుదయాద్రిఁ, గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్
వ్యర్థంబున్నొనరించకుండ వెలుగున్ పంచంతటన్ పృథ్విపై
కర్తవ్యాలకు సాక్షి గ్రుంకె నదిగో కన్పించు నాయబ్ధిలో.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దూర్తుడు సైంధవుని దునుమ
రిప్లయితొలగించండిమార్తాండుడు గ్రుంకునట్లు మాధవుఁడె సగన్
కర్తగు నర్జునుడు బలికె
మార్తాండుఁడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్
దూర్తుని సైంధవుని యనిన్
గుర్తించగజేసి చక్రి "గ్రుంకెరవియనన్"
వర్తించి బలికె కుటిలుడు
మార్తాండుఁడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్
శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
నిన్నటి నా పూరణ పైన మీ స్పందన తెలియజేయ లేదు.
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆర్తిం బాపగ దలచుచు
రిప్లయితొలగించండిమార్తాండుడు గ్రుంకె మధ్యాహ్న వేళన్
పార్థుని కాచుట కై సిరి
భర్తయు మాయనొనరింప ప్రతినయు దీరెన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కార్తీకపుఉషనవెలిగె
రిప్లయితొలగించండిమార్తాండుడు ,గ్రుంకెనదిగొ మధ్యాహ్నమునన్
పూర్తిగ తారలు నింగిన
స్ఫూర్తిని పొందెను సుధాత్రి సూర్యుని కాంతిన్
చేపూరి శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కార్తీకపు టుషను వెలిగెను' అనండి.
ఆర్తిన్ బాసెను పద్మమెవ్వడిలలో నాత్మీయుడై వచ్చుచో?
రిప్లయితొలగించండిపూర్తై పోయె దినమ్ముఁ గొంత తడవై పోయెన్ సుమా!సూర్యుడో?
గుర్తై సూర్యుడు నిల్చు నిప్పుకొలిమై ఘోషింతురే వేళలో?
మార్తాండుం డుదయాద్రిఁ; గ్రుంకెనదిగో; మధ్యాహ్నకాలంబునన్"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధూర్తుండౌచు ప్రభాకరుండు పగలో దుర్మార్గ చిత్తమ్మునన్
రిప్లయితొలగించండికర్తృత్వమ్మును ధానుబాంబు కిడగా గగ్గోలు కాండమ్మునన్
కీర్తిన్వొందుచు చెన్నపట్నమున
రాకేందుండు రాజీవుడౌ
మార్తాండుం డుదయాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్.
ఆర్తుండౌచును భూమిపైన చనుచున్ హ్లాదమ్ము కోల్పోవుచున్
రిప్లయితొలగించండికార్తీకమ్మున యానమున్ సలుపుచున్ కంగారునున్ జెందుచున్
వార్తన్ బొందగ రాహులయ్య మనువున్ బంగాలునన్ దీదితోన్
మార్తాండుం డుదయాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్