21, సెప్టెంబర్ 2016, బుధవారం

సమస్య - 2150 (వడ్డీ కట్టఁగ డబ్బు లేని యతఁడే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"వడ్డీ కట్టఁగ డబ్బు లేని యతఁడే వర్షించు నైశ్వర్యముల్"
లేదా...
"వడ్డీ చెల్లింపలేఁడు వర్షించు సిరుల్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

91 కామెంట్‌లు:

 1. వడ్డీలకు వడ్డీ లనుచును
  నడ్డముగా యప్పుదెచ్చి నడమంత్ర మటన్
  దుడ్డేమొ నటునిటు ద్రిప్పుచు
  వడ్డీ చెల్లింపలేఁడు వర్షించు సిరుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరీ గారు,
   మొదటి పాదములో రెండు లఘువులు, మూడవ పాదములో ఒక లఘువు ఎక్కువ అయ్యాయి

   తొలగించండి
  2. అక్కయ్యా,
   మీ పూరణ బాగుంది.
   'వడ్డీకి వడ్డి యనుచును... దుడ్డును ద్రిప్పుచు నటునిటు...' అనండి.

   తొలగించండి
 2. వడ్డీ కాసుల వాడు శ్రీధరుఁడు గోపాలుండు శేషాద్రినన్
  లడ్డూలందలి తీపి పంచి ధరలో లాలింపడే భక్తులన్
  విడ్డూరంబది యేమి లేదు మరి గోవిందుండు మోదంబునన్
  వడ్డీ కట్టఁగ డబ్బు లేని యతఁడే వర్షించు నైశ్వర్యముల్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిగురు సత్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   మొదటి పాదం చివర 'శేషాద్రినిన్/శేషాద్రిపై' అనండి.

   తొలగించండి


 3. బొడ్డో డప్పును తీర్చడు,
  వడ్డీ చెల్లింపలేఁడు, వర్షించు సిరుల్
  గట్టి పసందగు పలుకులు,
  పెట్టును యెగనామములను భేషుగ వినుమా

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   బాగుంది మీ పూరణ.
   'పెట్టును+ఎగనామము' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. 'పెట్టుర యెగనామములను...' అనండి.

   తొలగించండి
 4. శా. అడ్డేలేదని విఱ్ఱవీగు ప్రభులన్నాగర్భ శ్రీమంతులన్
  చెడ్డిన్ బొందగ నోచనట్టి జనులన్ సేవింప దీవించుగా !
  వడ్డించున్ ఘనమైనయట్టి వరముల్ వందింప వెంకన్నయే
  వడ్డీ కట్టగ డబ్బు లేని యతడే వర్షించు నైశ్వర్యముల్.

  రిప్లయితొలగించండి
 5. వడ్డీకి వడ్డి యనుచును
  నడ్డముగా యప్పుదెచ్చి నడమంత్ర మటన్
  దుడ్డును నటునిటు ద్రిప్పుచు
  వడ్డీ చెల్లింపలేఁడు వర్షించు సిరుల్
  --------------------------------
  "జిగురు వారూ ? ఇప్పుడు ????????????????"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ సవరణ బాగుంది. అభినందనలు.
   ఇది మొదట వ్రాసిన పూరణకు సంబంధించే కనుక అక్కడే క్రింద ఉన్న 'ప్రత్యుత్తరం' అన్నదానిని క్లిక్ చేసి అక్కడే వ్యాఖ్య పెట్టాలి.

   తొలగించండి
 6. కం.వడ్డాణమ్ములు బంగరు
  కడ్డీ లాభరణములను కడు భక్తినిడన్
  అడ్డెరుగక భక్తులు, తను
  వడ్డీ చెల్లింప లేడు వర్షించు సిరుల్.

  రిప్లయితొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  దుడ్డును గూడిన హరియే
  దొడ్డగ ప్రజలన్నరయెడి దొరగా నున్నా
  విడ్డూరమ్ముగ దానే
  వడ్డీ చెల్లింపలేడు వర్షించు సిరుల్.

  రిప్లయితొలగించండి
 8. క్రొవ్విడి వెంకట రాజారావు:

  దుడ్డుల్దేవత లక్ష్మికిన్ పతియునై తుంగమ్ము పైనుండి దా
  దొడ్డేయౌనగు వేంకటేశ్వరుడు పొందున్ గూడి మౌలేలుచున్
  వడ్డీకాసుల వాడటంచు నను రూపానన్ విభాసిల్లినా
  వడ్డీ కట్టగ డబ్బులేని యతడే వర్షించు నైశ్వర్యముల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువుగారు, మూడవ పాదంలో చివరి పాదం పొరపాటున టైపు అయింది.
   విభాసిల్లినా - తప్పు.
   విభాసిల్లు యా - ఒప్పు

   తొలగించండి
  2. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణ చివర 'దొరగా నున్నన్' అనండి.
   రెండవ పూరణలో 'దొడ్డేయౌన్' అన్న తర్వాత 'అగు' ఎందుకు? 'మౌలేలుచున్'..? 'భాసిల్లు నా..' అనండి.

   తొలగించండి
 9. సడ్డం బూనుచు భక్తిపూర్ణమతులై సద్భావసంయుక్తులై
  వడ్డీకాసులవాని! వేంకటపతిన్! భాగ్యప్రదున్! శ్రీపతిన్!
  గడ్డౌకాలము ద్రోచి సౌఖ్యములతో గావంగ ప్రార్థించినన్
  వడ్డీకట్టగ డబ్బులేని యతడే వర్షించు నైశ్వర్యముల్.

  వడ్డీ కాసులవాడయి
  యడ్డంకులు తొలగద్రోచి యందరికి సదా
  విడ్డూరం బనిపించును
  వడ్డీ చెల్లింపలేడు వర్షించు సిరుల్.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 10. విడ్డూరమిది కుబేరుని
  వడ్డీ చెల్లింప లేడు! వర్షించు సిరుల్!
  దొడ్డగు వేంకటపతి యిట
  వడ్డెన జేయుచు నడిగిన వరముల నొసగున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మన్నించండి.క్రమం ఈ విధంగా వుండాలనుకుంటాను.
   దొడ్డగు వేంకటపతి యిట
   వడ్డెన జేయుచు నడిగిన వరముల నొసగున్!
   విడ్డూరమిది కుబేరుని
   వడ్డీ చెల్లింప లేడు! వర్షించు సిరుల్

   తొలగించండి
  2. శ్రీధర రావు గారూ,
   క్రమం ఎలా ఉన్నా ఒప్పే! బాగుంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించండి
 11. రిప్లయిలు
  1. అడ్డేలేక చరించుచుండురమయే అర్ధాంగియైవెల్గుచున్
   వడ్డించున్ నెరవేర కోర్కెలిలనా పద్మావతీ భర్తయే
   దుడ్డుంబొందె కుబేరమూర్తి కడ చేదోడై, ఋణగ్రస్తుడై
   వడ్డీ కట్టఁగ డబ్బు లేని యతఁడే వర్షించు నైశ్వర్యముల్ ||

   దొడ్డగు కుబేరమూర్తియె
   దుడ్డివ్వగనప్పటంచు దొర పెండ్లాడన్
   దుడ్డుకు మొగుడగు దేవుడె
   వడ్డీ చెల్లింపలేఁడు వర్షించు సిరుల్ ||

   తొలగించండి
  2. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
   మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
   'దుడ్డుకు మొగుడు' ప్రయోగం అద్భుతం!

   తొలగించండి
  3. "మొగుడు" గ్రామ్యం‌ కదా, "దుడ్డుకు మగడు" అంటే బాగుంటుందని నా అభిప్రాయం.

   తొలగించండి
  4. ఆర్య! మగడు అంటే నిఘంటువులో పురుషుడు అనే ప్రాథమికార్థం కలదు. తరువాతనే భర్త అనే అర్థం వస్తుంది. అందువలన అలా స్వీకరించుట జరిగింది. ధన్యవాదాలు.

   తొలగించండి
 12. వడ్డాణంబును దాల్చియుండు నతివన్ పాణౌకృతిన్ కోరియున్
  వడ్డీకై ధనమప్పుఁదెచ్చి తరుణోపాయంబుఁ బెండ్లాడియున్
  వడ్డీ కాసులవాడటంచు ధరణిన్ ప్రఖ్యాతి తా బొందెగా
  వడ్డీ కట్టఁగ డబ్బు లేని యతఁడే వర్షించు నైశ్వర్యముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫణికుమార్ తాతా గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
   'పాణౌకృతి' ప్రయోగం బాగుంది.

   తొలగించండి

 13. అడ్డిగొనలేక యప్పులు
  వడ్డీ చెల్లింప లేడు, వర్షించు సిరుల్!
  వడ్డాణపు పసిడింగొను
  దుడ్డుం బదిలముగ దాచ తోషంబందున్!

  అడ్డిగొను=నిరోధించు

  రిప్లయితొలగించండి
 14. వడ్డీకాసులవాడట
  వడ్డించును కామితములు భక్తులకొరకై
  దొడ్డగ కుబేరు ఋణమున
  వడ్డీ చెల్లింప లేడు, వర్షించు సిరుల్.


  రిప్లయితొలగించండి
 15. పరిణయంబు పేరున
  భార్య అను సంపద గెలిచి
  వైభవంబును కానుకనిచ్చిన
  వడ్డీకాసులవాడివి కదయ్యా వెంకయ్యా !!


  మీకందరికీ వచ్చినంత తెలుగు నాకు రాదు
  తోచింది వ్రాశా...తప్పులు ఉంటె దయచేసి మన్నించండి

  రిప్లయితొలగించండి
 16. పరిణయంబు పేరున సతి అను సంపద గెలిచి
  వడ్డీ కట్టఁగ డబ్బు లేని యతఁడే వర్షించు నైశ్వర్యముల్
  భక్తుల మనంబు నెరిగి
  ఔరా నేటికి దశావతారంబులనెత్తితివి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. Panangipalli గారూ,
   మీకు పూరణలు చేయాలన్న ఉత్సాహం కలిగినందుకు సంతోషం! కాని ఈ బ్లాగు కేవలం ఛందోబద్ధమైన పద్యాలకే వేదిక. ముందు ఛందస్సు నేర్చుకోండి. ఆ తర్వాత మీ పదాలు ఎలా ఉన్నా సవరించి, సూచనలు ఇవ్వడానికి నేనున్నాను, మిత్రులున్నారు. స్వస్తి!

   తొలగించండి
 17. దుడ్డిచ్చిన వారలకున్
  వడ్డీ చెల్లించ లేడు,వర్షించు సిరుల్
  బిడ్డలు, పెళ్లామడిగిన!
  విడ్డూరము దొడ్డవారి విలువలుఁ గన్నన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   అప్పు చేసి పప్పుకూడు తినే దొడ్డవారిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. గొడ్డూ గోదయు లేని సేద్యమునకై గుప్పించగా ద్రవ్యమున్
  విడ్డూరంబది యేమి పంటలరయన్ వీలుండు నంచెంచినన్
  గడ్డీ గాదమె రైతు రాజును యదో గాపాడె మాఫీ లహో!
  వడ్డీ కట్టగ డబ్బు లేని యతడే వర్షించు నైశ్వర్యముల్P.Satyanarayna


  దొడ్డపరిశ్రమ కధిపతి
  విడ్డూరపు యప్పు జేసి వెలిగిన "మాల్యా"
  జడ్డు తనంబున వినిమయ
  వడ్ఢీ చెల్లింప లేడు వర్షించు సిరుల్p.Satyanarayana

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'గొడ్డూ గోద, గడ్డీ గాదము'లు వ్యావహారికాలు. వ్యాకరణ రీత్యా 'గొడ్డును గోదయు, గడ్డియు గాదము' అవుతాయి. మూడవ పాదంలో 'యదో' అర్థం కాలేదు.
   రెండవ పూరణలో 'విడ్డూరము+అప్పు' అన్నపుడు పుంప్వాదేశ, టుగాగమాలు వచ్చి 'విడ్డూరపు టప్పు' అవుతుంది. 'వినిమయ వడ్డీ' అనడం దుష్టసమాసం.

   తొలగించండి
 19. గడ్డు దినములందు నతడు
  వడ్డీ చెల్లించ లేడు. వర్షించు సిరుల్
  గుడ్డిని దున్నుచు బ్రతికిన
  నడ్డి విరిగినట్టి రైతు నలుగురు తినగన్

  రిప్లయితొలగించండి
 20. అడ్డాల వారి యింటను
  బిడ్డడు గాబు ట్టినట్టి వీరయ పంతుల్
  లడ్డులన మ్మిన ధనమున
  వడ్డీ చెల్లింప లేడు వర్షించుసిరుల్

  రిప్లయితొలగించండి
 21. దుడ్డునుకొని ధనదునికడ
  గడ్డుపరిస్థితిని దాటి కలియుగమందున్
  వడ్డించుచు కడి జనులకు
  వడ్డీ చెల్లింపలేడు వర్షించు సిరుల్
  కడిః భోజనము

  రిప్లయితొలగించండి
 22. రిప్లయిలు
  1. విడ్డూరంబుగ నప్పుఁ దేగలడు వైవిధ్యంపు మార్గంబుల
   న్నడ్డంబైనను నెల్ల లోకము లుపాయశ్రేణి గట్టెక్కుచున్
   దొడ్డౌ సంస్థలఁ బెక్కు లేర్పరచి తా దోశ్శక్తిఁ జూపించెడిన్
   వడ్డీ కట్టఁగ డబ్బు లేని యతఁడే వర్షించు నైశ్వర్యముల్


   దుడ్డులు లేని నరుండిక
   వడ్డీ చెల్లింపలేఁడు, వర్షించు సిరుల్
   దొడ్డయి యెగఁ గొట్టంగ
   న్నడ్డంబుగ నప్పుఁ గుజను లందరి వోలెన్

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉండి అలరింపజేశాయి. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 23. దుడ్డున్ బొంది కుబేరు నొద్ద కడు సంతోషమ్మునన్ పెండ్లియై
  వడ్డీలన్ సరిచేయనెంచి భువిలో భక్తాళి చెల్లించగా
  లడ్డుల్ బంచుచు సంతతమ్ముగుడిలో లాభమ్ములన్ పెంచమిన్
  వడ్డీ కట్టఁగ డబ్బు లేని యతఁడే వర్షించు నైశ్వర్యముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   గుడి లాభాలు పెంచని దైవాన్ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 24. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  స్తు తి ని ౦ ద


  అడ్డా దిడ్డపు దారులన్ నడచి ,

  ………… సప్తాద్ర్యావళిన్ బ్రాకుచున్

  వడ్డీ కాసుల వాని జేరు కొన

  …………… లాభ౦బేమి లే | దే గతిన్


  వడ్డీ కట్టగ డబ్బులేని యతడే వర్షి౦చు

  ………… నైశ్వర్యముల్ ? ?


  లడ్డూ ముక్కను , ముద్ద బోన మిడి ,

  …………… పోరా య౦చు గె౦టి౦చు | బల్

  విడ్డూర౦బుగ నా ధనాధిపుని (న్)

  ………… " ఐ . పీ ." పెట్టి వ౦చి౦చె గా ! !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   దేవుని చేతనే ఐ.పి పెట్టించే ఉపాయం ఆ ఏడుకొండలవానికి చేరుగాక! మీ పూరణ చమత్కార భరితమై అలరించింది. అభినందనలు.
   'అడ్డదిడ్డము'ను 'అడ్డాదిడ్డము' అన్నారు.

   తొలగించండి
 25. వరాహ పురాణము:
  వేంకటేశాత్పరో దేవో నాస్తన్యః శరణం భువి|
  వేంకటేశ సమో దేవో నాస్తి నాస్తి మహీతలే||

  స్వామి పుష్కరిణీ తీర్థ సమం నాస్తి న చాస్తి హి|
  ద్రవ్యార్జనపరో నిత్యం భవిష్యతి కలౌ యుగే||

  అనుగ్రహాయ లోకానాం కామైః పూర్ణో౽పి సర్వదా|
  ‘ఇదం ద్రవ్యం త్వయా తావత్ దాతవ్యం మమ సమ్ప్రతి||

  తవాభీష్టమహం దాస్యే దాస్య’ ఇత్యేవ చ బ్రువన్|
  ఇతి సర్వజనైః సార్థం క్రీడమాణో భవిష్యతి||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   "ఇదం ద్రవ్యం త్వయా తావత్ దాతవ్యం మమ సమ్ప్రతి"
   శతాధిక వందనాలు!

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి శతసహస్ర వందనములు.

   తొలగించండి
 26. క0॥
  లడ్డూవలెపరధనమును
  అడ్డ0గాతినగలాడు,అడిగినయెడలన్
  గుడ్డిగవితరణచేయును
  వడ్డీచెల్లి0చలేడు,వర్షి0చుసిరుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుడ్లూరి వెంకన్న గారూ,
   'శంకరాభరణం' బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తినగలాడు+అడిగిన' అన్నపుడు సంధి నిత్యం, విసంధిగా వ్రాయరాదు. 'తినగల నరు డడిగిన యెడలన్' అనండి.

   తొలగించండి
 27. గడ్డౌ కాలము లక్ష్మి వీడి హరినే క్ష్మా లోకముంజేరగా
  బొడ్డుంబద్మము దాల్చియున్నయతడే భూమీశ్వరుండై యొగిన్
  దుడ్డందివ్వ కుబేరుడప్పుగ గృహస్థుండై రమానాథుడై
  వడ్డీ కట్టఁగ డబ్బు లేని యతఁడే వర్షించు నైశ్వర్యముల్ ||

  గడ్డుపరిస్థితి కడలికి
  బిడ్డన్ మనువాడుటకు కుబేరుండిచ్చెన్
  దుడ్డున్ వేంకటపతికని
  వడ్డీ చెల్లింపలేఁడు వర్షించు సిరుల్ ||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మాడుగుల వారూ,
   మీ తాజా పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. (ఎంతైనా అవధాని అనిపించుకున్నారు!)

   తొలగించండి
  2. బొడ్డుంబద్మము , దుడ్డందివ్వ కుబేరుడప్పుగ మనోహరమైన పదములతో మహదానందము కల్గించినారు. ధన్యవాదములు. అభినందనలు.

   తొలగించండి
  3. ఆర్య! పోచిరాజు కామేశ్వరరావు గారూ! నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 28. దుడ్డల్ గోరి కుబేరునే యడగ సంతోషమ్ముతో నాతడే
  వడ్డీకిచ్చెను పెండ్లికంచు కథలన్ భక్తావళే జెప్పగన్
  విడ్డూరమ్మన నేలరా? హరియె విశ్వమ్ము తాబ్రోవగా
  వడ్డీకాసులవాడనంచును జగత్ప్రఖ్యాతుడౌ శ్రీహరే
  వడ్డీ కట్టఁగ డబ్బు లేని యతఁడే వర్షించు నైశ్వర్యముల్

  విడ్డూరమ్మన నేటికి
  వడ్డీదీర్చెదననుచును బాకీ పడెనా
  వడ్డీ కాసుల వాడే
  వడ్డీ చెల్లింపలేఁడు వర్షించు సిరుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్షమించాలి టైపాటు .....దుడ్డున్ అని వుండాలి....

   తొలగించండి
  2. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'భక్తావళీ' అని దీర్ఘాంతం చేయరాదు. అక్కడ 'భక్తాళి జెప్పంగనే' అనండి. అలాగే 'వడ్డీకాసులవా డటంచు' అనండి.

   తొలగించండి
 29. పడ్డాడెన్నియొ కష్టనష్టములు సంపాదించలేదింతయున్
  వడ్డీ డబ్బులనే కుబేరు డొసగన్భాగ్యంబుగానెంచియున్
  దుడ్డున్ గైకొని వేంకటేశు డిల సంతోషాన పెండ్లాడి|తా
  వడ్డీ కట్టగ డబ్బు లేని యతడే వర్షించు నైశ్వర్యముల్
  2.గుడ్డిగ నమ్మి కబోదిగ
  వడ్డీ చెల్లింప లేడు|”వర్షించు సిరుల్
  నడ్డాగా వేశ్యకుతను
  చెడ్డగ కష్టించి డబ్బు సింగారి కిడున్”|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'పడ్డాడు' అనడం వ్యావహారికం.

   తొలగించండి
 30. వడ్డీ కట్టుట కాదు ముఖ్యము రఘూ బ్యాంకిచ్చు సాహాయ్యమే
  గడ్డౌ కాలము దాటి తేరుకొని చక్కంజేయ వ్యాపారమున్
  దొడ్డై పల్వుర బాసటై నిలుచు సద్బుద్ధీతనిన్ నమ్ముమా
  వడ్డీ కట్టగ డబ్బు లేని యతడే వర్షించు నైశ్వర్యముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సద్బుద్ధి+ఈతనిన్' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

   తొలగించండి
  2. ధన్యవాదాలు గురువుగారూ. మీ సూచన ననుసరించి యిలా సవరిస్తున్నాను.

   వడ్డీ కట్టుట కాదు ముఖ్యము రఘూ బ్యాంకిచ్చు సాహాయ్యమే
   గడ్డౌ కాలము దాటి తేరుకొని చక్కంజేయ వ్యాపారమున్
   దొడ్డై పల్వుర బాసటై నిలుచు సద్బుద్ధిన్ కటా నమ్మవే
   వడ్డీ కట్టగ డబ్బు లేని యతడే వర్షించు నైశ్వర్యముల్

   తొలగించండి
 31. గుడ్డా గూడుకు దూర మైన జనులున్ గుప్తార్థ నిర్మాతలున్
  వడ్డీ బేరము చేయు వారలును సౌభాగ్యంబు నాశించియున్
  విడ్డూరంబిది పోవుచుందురు గదా వెంకన్నదౌ కొండకున్
  వడ్డీ కట్టఁగ డబ్బు లేని యతఁడే ! వర్షించు నైశ్వర్యముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   'గుడ్డా గూడును' అన్నదాన్ని 'గుడ్డయు గూడును' అనాలి.

   తొలగించండి
 32. వడ్డీల తోడ గొనుతా
  విడ్డూరంబయ్యె నిదియు విశ్వము నందున్
  కడ్డాయముగా గైకొను
  వడ్డీ చెల్లింప లేడు వర్షించు సిరుల్.

  2.దుడ్డును గైకొనె శ్రీహరి
  వడ్డీకా ధనదు చెంత వాలాయముగా
  వడ్డీతో ముడుపులుగొని
  వడ్డీ చెల్లింపలేడు వర్షించు సిరుల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 33. అందరి పూరణలు బహు చక్కగా ఉన్నాయి. అభినందనలు,ధన్యవాదాలు, శుభాకాంక్షలు !

  రిప్లయితొలగించండి
 34. విడ్డూరంబుగ దోచుచుండు నిదె! తా బెండ్లాడ బూనంగటన్
  వడ్డీ తోడుత దీర్చు మాడ్కి ధనమున్ పౌలస్త్యు చెంతన్ గొనన్
  వడ్డీ కాసుల వేంకటేశుడనగన్ ప్రఖ్యాతి నార్జించియున్
  వడ్డీ కట్టగ డబ్బు లేని యతడే వర్షించు నైశ్వర్యముల్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పూనంగ+అటన్=పూనంగ నటన్' అవుతుంది.

   తొలగించండి
 35. దొడ్డ మనసున ఋణముఁగొని
  వడ్డీనే గట్ట లేక బరగెడు వాడే
  వడ్డించు మనకు సిరులట !
  వడ్డీ చెల్లింపలేఁడు వర్షించు సిరుల్

  రిప్లయితొలగించండి
 36. దుడ్డును గైకొని బెండ్లికి
  వడ్డీనే గట్టుచుండె వాలాయముగన్
  విడ్డూరంబుగ సిరిదొర
  వడ్డీ చెల్లింపలేడు వర్షించు సిరుల్!!!

  రిప్లయితొలగించండి
 37. edited as you say
  గుడ్డన్ గూడును నోచుకోని జనులున్ గుప్తార్థ నిర్మాతలున్
  వడ్డీ బేరము చేయు వారలును సౌభాగ్యంబు నాశించియున్
  విడ్డూరంబిది పోవుచుందురు గదా వెంకన్నదౌ కొండకున్
  వడ్డీ కట్టఁగ డబ్బు లేని యతఁడే ! వర్షించు నైశ్వర్యముల్

  రిప్లయితొలగించండి
 38. గుడ్డితనమనుచు భిక్షగ

  దుడ్డును యడుగగ నొకనికి దూకొనె కోట్లున్

  బిడ్డలు చేసిన యప్పుకు

  వడ్డిీ చెల్లింపలేడు వర్షించు సిరుల్.

  రిప్లయితొలగించండి
 39. (ఇటీవల ఒక భిక్షకుని వద్ద కోట్ల రూపాయలు
  ఉన్నాయనే వార్తనుచదివిన సందర్భముగా)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దుడ్డును+అడుగగ' అన్నపుడు యడాగమం రాదు. 'దుడ్డు నడుగగా నొకనికి...' అనండి.

   తొలగించండి