కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కోతికి జాబు వచ్చెనని గొల్లున నేడ్చుట యుక్తియుక్తమా?
(మొన్నటి రాజమండ్రి అవధానంలోని సమస్య...)
లేదా...
"కోతి కొక జాబు వచ్చిన గొల్లుమనెను"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కోతికి జాబు వచ్చెనని గొల్లున నేడ్చుట యుక్తియుక్తమా?
(మొన్నటి రాజమండ్రి అవధానంలోని సమస్య...)
లేదా...
"కోతి కొక జాబు వచ్చిన గొల్లుమనెను"
P.Satyanarayana
రిప్లయితొలగించండిమోడి మన్కి బాతుల పైన మోజు గొన్న
వ్రాతగాడు సమస్యల వల్లెవేసి
లేఖలను బంపె నుత్తర్వు లెన్న లేక
కోతి కొక జాబు వచ్చిన గొల్లుమనెను
వ్రాతలు బ్రహ్మ రాతలని వంతల సొంతము జేసికొంచు వే
భ్రాతలు వెళ్ళబోసి రవి బాయవు నోచిన యంత నో గురూ!
చేతలకందునే ? పనులు చేయనివానికి వచ్చు లాటరీ
కోతికి జాబు వచ్చెనని గొల్లున నేడ్చుట యుక్తి యుక్తమా!
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదాలు.
తొలగించండిP.Satyanarayana
రిప్లయితొలగించండిబ్లాగులను బెట్టి పద్యపు బాగు గోరి
సేవ జేసిన చెన్నప్ప జేసె వినతి
వచన కవితను గొన్న స వాలు కవిక
పద్మ శ్రీరాగ చదువరి భగ్గుమనెను
కోతికొక జాబు వచ్చిన గొల్లుమనెను!
Psn
రిప్లయితొలగించండిసవాలు కవికి 3వ చరణంలో సరి జేసి చదువ గలరు
పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్మశ్రీ అన్నపుడు ద్మ గురువై గణదోషం.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికోతివంటి పనులవల్ల కోతిబిరుదు
పొంది తీరుతెన్నులులేక పొదలువాని
నుఱుముచు చదువొద్దని దండ్రినుండి యట్టి
కోతికొక జాబు వచ్చిన గొల్లుమనెను.
క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చదువు వద్దని... అనాల్సింది.. ఒద్దని అన్నారు. '...నుఱుమి చదువు వద్దని తండ్రినుండి యట్టి' అనండి.
ఆతడు నాహితైషి నను హాస్యము బంచుచు మర్కటంబనున్
రిప్లయితొలగించండిచేతము సంతసించు పని చేయును బంధువు లేని నాకు తా
నూతము సత్య మొక్కదిన ముత్తర మొక్కటి యందుకొన్న నీ
కోతికి జాబు వచ్చెనని గొల్లున యేడ్చుట యుక్తి యుక్తమా
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండివేతము లేకబోయెనని వేరొక యూరికి బోవగాను ఆ
కోతికి "జాబు" వచ్చెనని గొల్లున నేడ్చుట యుక్తియుక్తమా!
కోతలు పోవగాను పని కోతలు వచ్చిన మేలులేక తా
నే తల రాత గా తలవ నేల ? మనుష్యుని కేది మేలు బో ?
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వేతము' అన్న పదం లేదు. 'వేతన మేది లేదనుచు...' అందామా?
చేతల జూపు నీ పటిమ చిత్తము నుంచుము చేయు వృత్తి పై
రిప్లయితొలగించండిప్రీతిని నీకిడు న్నిజము పెద్ద పదోన్నతి యంతెకాని నీ
వాతని లేఖ జూచి యెద నక్కసుతో చికిలించి కన్నులన్
కోతికి జాబు వచ్చెనని గొల్లున నేడ్చుట యుక్తి యుక్తమా?
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొన్న రాజమండ్రి ప్రయాణం గురించి.. అంతకు ముందు రోజు ప్రయాణం రద్దు చేసుకున్నానని ప్రకటించాను. కాని మొన్న ఉదయం అప్పటికప్పుడు నిర్ణయించుకొని బయలు దేరాను. బయలుదేరే ముందు బ్లాగులో ప్రకటించాను కూడా. ఆ కళాశాల విద్యార్థినులు, సిబ్బంది నా పట్ల చూపిన గౌరవాన్ని మరచిపోలేను. ఆ అనుభవం నా జీవితంలోని మధురస్మృతులలో ఒకటిగా మిగిలిపోతుంది. మీ ఫోన్ నెం. ఉంటే మిమ్మల్ని సంప్రదించేవాణ్ణి.
సుతుని లేఖకెదురు జూచి స్రుక్కి తండ్రి
రిప్లయితొలగించండిమఱచి నాడన్న దిగులుతో మదిని క్రుంగ!
చేతఁ బట్టి చదువురీతి చెట్టు నుండ
కోతికొక జాబు వచ్చిన? గొల్లుమనియె!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోట తిరిపాలు తలిదండ్రి కూచి, వీడు
రిప్లయితొలగించండివీడు వీడని వాడను వీడు, దూర
దేశమున కొలువున కవకాశమనుచు
కో.తి. కొక జాబు వచ్చిన గొల్లుమనెను.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోతికొక జాబువఛ్చిన గొల్లు మనెను
రిప్లయితొలగించండిజాబు వచ్చుట కోతికి జరుగు పనియ?
గొల్లు మనునది యెవ్వరు ?గురువ రేణ్య !
తెలియ జేయుడు మీరలు దెలిసి కొందు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేతలఁ జూడ కొంటరియె చిత్తము వచ్చిన రీతి వర్తిలున్
రిప్లయితొలగించండిప్రీతిగ నొక్క లేఖ నొక భీరువు కింపుగ పంపె నంత న
న్నాతియె వ్రాయ పత్రము మనమ్మున నెంతయు సంతసించగం
గోతికి జాబు వచ్చెనని గొల్లున నేడ్చుట యుక్తియుక్తమా?
చదువు సంధ్య లందున నెట్టి శ్రద్ధ లేదు
యల్లరిని జేయు జేష్టల నతడు కోతి
బడికి నిక రావలదనుచు వదరుఁబోతు
కోతి కొక జాబు వచ్చిన గొల్లుమనెను
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఈతర పట్ట భద్రులకు నెక్కడ జాబులు లేకయుండగా
రిప్లయితొలగించండికోతికి జాబువచ్చె నని గొల్లున నేడ్చుట యుక్తి యుక్తమా ?
కోతికి జాబు వచ్చుటనుగూడదు నెక్కడమిత్రమా గన
న్నత్తరి నేడ్వగా మనకు నాయది యెట్లుగ నుండునో గదా
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈతరపు పట్టభద్రులు అనవలసింది.. ఈతర.. అన్నారు. 'కూడదు+ఎక్కడ' అన్నపుడు నుగాగమం రాదు.
చేతలు శూన్యమైన మరి చిత్తము సద్గతి లేకయుండినన్
రిప్లయితొలగించండిఖ్యాతిలభింపకున్న ఘన కంజదళాక్షుకటాక్షమున్నచో
భూతి వరించు కోతినల మోదము గూర్చును సర్వకాలముం
గోతికి జాబు వచ్చెనని గొల్లుననేడ్చుట యుక్తియుక్తమా?
ఖ్యాతి గల్గిన తెలివైన జ్ఞాతులంత
కోతి చేష్టల "కోటికి "కూడులేద
ని యన వాని సుకృతమున నిశ్చయముగ
కోతికొక జాబు వచ్చిన గొల్లుమనియె.
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ.గోతులు త్రవ్వువాడితడు కోసన తిమ్మయ యండ్రు మిత్రులే
తొలగించండిఈతిరకాసులన్ని తమ ఈసున బుట్టిన వట్టి మాటలే
ఆతని సంతకమ్ము మరి యచ్చ తెనుంగున కో.తి. గావుతన్
కోతికి జాబు వచ్చెనని గొల్లున నేడ్చుట యుక్తియుక్తమా ?
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తే.గీ. చీటికిని మాటికినతడు చిలిపి పనుల
తొలగించండికోరి చేయుచుండగ జూచి కోతి యనిరి
ఈసు క్రమ్ము కొనంగ వా రేడ్చి రకట !
కోతి కొక జాబు వచ్చిన గొల్లు మనెను.
కోతి ముఖమును పోలిన కుఱ్ఱడొకడు
రిప్లయితొలగించండిచదువుకొనుచుండ పట్న వసతి గృహాన
తండ్రి దగ్గరనుంచి యుత్తరము రాగ
కోతికొక జాబు వచ్చిన గొల్లుమనెను
యాట పట్టించుచు హితులు హాస్యమాడి.
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోతిబావను పెండ్లాడు కోర్కె తోడ
రిప్లయితొలగించండినిల్లిరకమున కొప్పింప నింపుగాను
శీఘ్రము పరదేశపు సేవ చేరమనుచు
కోతికొక జాబు వచ్చిన గొల్లుమనెను
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇల్లరికాన్ని ఇల్లిరికం అన్నారు.
వ్రాయుదు రెవరేనియు నిట బాడి యవగ
రిప్లయితొలగించండికోతి కొక జాబు? వచ్చిన; గొల్లు మనెను,
యూరి జనములు; నెత్తినో తీరు మొత్తు
చునట తత్తర బిత్తర చూపులలమె!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అనెను+ఊరి...అన్నపుడు యడాగమం రాదు.
గురువుగారూ నమస్సులు.... ధన్యవాదములు.... గొల్లు మనెను/చేరె .....అంటాను.
తొలగించండిపాతిక లక్షలిచ్చినను వాసిగ నౌకరి నిత్తునంచు నా
రిప్లయితొలగించండిఖ్యాతిగడించినట్టి ఘన కార్మిక మంత్రియె చెప్పినంత నో
నీతియె లేనివాడొకడు నేతకు బంధువు లక్షలిచ్చె నా
కోతికి జాబు వచ్చెనని గొల్లున నేడ్చుట యుక్తియుక్తమా?
కోటి గాడను వాడికి కోరు కున్న
నౌకరియె వచ్చె, నచ్చులో నామమందు
వ్రాసియుండెను కోతంచు చూసి యొకడు
కోతి కొక జాబు వచ్చిన గొల్లుమనెను
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కోడలిగ తెచ్చె కులమింటి కోతి నొకతె
రిప్లయితొలగించండిచదువు లేలను మన యింట సాధ్వి చాలు.
కొంత కాలము గడచెను కోడలైన
కోతి కొక జాబు వచ్చిన, గొల్లుమనెను
చిక్కి సోలె నటంచు నీ యక్కరములు
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
టాను వచియించ సాధ్యంబు గాని యొకడు
రిప్లయితొలగించండికోటి తనమిత్రు డన్నింట తోటివాడు
పత్రమును జూచి దు:ఖించ బలికె నిట్లు
కోతి కొక జాబువచ్చిన గొల్లు మనియె.
హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తాను.. టాను అని టైపయింది.
ఆర్యా!
తొలగించండినమస్కారములు. అది టైపు పొరపాటు కాదు. "టాను" అనగా "టకారమును" అనే భావనతో వ్రాయటం జరిగింది.
నీతిని పాతి పెట్టి యవనీతికి పాల్పడు మానవాకృతీ
రిప్లయితొలగించండికోతికి జాబు వచ్చెనని గొల్లున నేడ్చుట యుక్తియుక్తమా
జాతికి లేకపోయినను జ్ఞానము, సంపద కల్గి యున్నఛో
చాతురి తోడ పొందు తగు జాబును నేతల చేతి చల్వచే.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
2.సీత జాడను కనుగొన్న దూత యెవరు?
రిప్లయితొలగించండియేమి వ్రాసె శకుంతల భూమిపతికి?
యెవరు నీవని ప్రశ్నింప నేమి జేసె?
కోతి,కొకజాబు,వచ్చిన గొల్లుమనెను
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ ప్రయత్నం ప్రశంసింపదగినదే. కాని...
ఎవరు అన్న ప్రశ్నకు కోతి అని సమాధానం. కాని కోతికి అని కాదు కదా! ఎవరు+ఏమి అన్నపుడు యడాగమం రాదు, సంధి నిత్యం. పతికి+ఎవరు అన్నపుడు పతికి నెవరు అవుతుంది. ఎవరు నీవని ప్రశ్నిస్తే 'వచ్చిన గొల్లుమనెను' అన్నది సమాధానం ఎలా అవుతుంది. క్రింది పద్యాన్ని చూడండి....
ఎవరి కిచ్చెఁ జూడామణి యవనిజాత?
యేమి వ్రాసె శకుంతల భూమిపతికి?
కరువు కాలాన రోగము మరల మరల...
కోతి; కొకజాబు; వచ్చిన గొల్లుమనియె.
గురువుగారు గురువుగారే వారు సవైంచిన పద్యము అద్భుతము
తొలగించండితిమ్మాజీ రావు
గురువుగారు గురువుగారే వారు సవైంచిన పద్యము అద్భుతము
తొలగించండితిమ్మాజీ రావు
కోతియు,కొండముచ్చనుచుకొంటెగ మిత్రులుపేర్లు బెట్ట?ఆ
రిప్లయితొలగించండికోతికి జాబువచ్చెనని గొల్లున నేడ్చుట యుక్తి యుక్తమా?
నీతిని వీడి లంచ మవినీతికి పట్టముగట్టి జేరగా?
జాతిపురోభి వృద్ధిమనజాలుట కష్టమె|కోతిచేష్టలౌ|
2.చదువు కొన్నట్టి చవటొక పదవికొరకు
తెలిసిదెలియని జ్ఞానమ్ము నిలువలందు
మూర్ఖచిత్తాన లంచాలు ముంచివేయ
కోతికొక జాబు వచ్చిన?గొల్లుమనెను
చదువు నేర్చిన సంస్కార చతురు డచట
“కోటివిద్యలు మనిషికే”| కోతికేల?
వాటి చేష్టలు మాన్పగ పోటి లేదు|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కోతలఁగోయు బావఁగని కోతియటంచు గేలిఁజేయుచు
రిప్లయితొలగించండిన్నాతని భర్తగా మదిని యర్థి తలంచుచు సుందరాంగి తా
జీతము హాయిగా గడుప చిక్కెగృహమ్మున నంచు యెంచగన్
ఖ్యాతిని గొన్న దేశమున కాంచెను యత్నము, సంతసించకన్
కోతికి జాబువచ్చెనని గొల్లున యేడ్చుట యుక్తియుక్తమా!
జీతముః జీవితము, యత్నముః ఉద్యోగము
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నీతియొకింతలేదు గణనీయవిధంబగు ప్రజ్ఞ లేదు దు
రిప్లయితొలగించండిర్నీతికి పట్తుగొమ్మలు పరీక్షలఁజూచిన క్రొత్తపోకడల్
నేతలు లంచగొణ్డులిక నీకెమి నాకును జాబొలొచ్చునే?
కోతికి జాబు వచ్చెనని గొల్లున నేడ్చుట యుక్తియుక్తమా?
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పట్టు-పట్తు, లంచగొండులిక/లంచగొణ్డులిక... టైపాట్లు. నీకు+ఎమి.. ఎమి అన్న పదం లేదు. వచ్చునే.. ఒచ్చునే అన్నారు. 'నీకును నాకును జాబు లబ్బునే' అందామా?
గురువుగారికి వందనములు.
తొలగించండినీకును నాకును అని వ్రాయబోయి టైపాటువల్ల అది "నేకెమి" గా పడింది.
మన్నించాలి.
అబ్బునే పదప్రయోగ సూచనకు ధన్యవాదములు
కోతు లావీధి యందలి కుర్ర వాళ్ళు
రిప్లయితొలగించండివారలనొకండు నుద్యోగ వార్త బొందె
వార్త నందని బృందము వగచి మరొక
కోతి కొక జాబు వచ్చిన గొల్లు మనెను
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాతి వటవట వాగగా మూతి కట్ట
రిప్లయితొలగించండిసాటి యుద్యోగులందున మేటి యొకడు
కోరి బిరుదంపె నొక "జగత్కోతి" యనుచు
కోతి కొక జాబు వచ్చిన గొల్లుమనెను
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జగత్కోతి'...?
తే.గీ. చీటికిని మాటికినతడు చిలిపి పనుల
రిప్లయితొలగించండికోరి చేయుచుండగ జూచి కోతి యనిరి
ఈసు క్రమ్ము కొనంగ వా రేడ్చి రకట !
కోతి కొక జాబు వచ్చిన గొల్లు మనెను.
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వారముల జేసికొని విద్య బడసినట్టి
రిప్లయితొలగించండిబుద్ధిమంతుడే జాబును పొంద లేక
పరమ శుంఠయై క్రీడలే వలసినట్టి
కోతి కొక జాబు వచ్చిన గొల్లు మనెను.
(జాబు= ఉద్యోగము)
"కోతికి జాబు వచ్చె నని గొల్లున నేడ్చుట యుక్తియుక్తమా !
రిప్లయితొలగించండియీతని కీర్ష్య హె"చ్చనుచు నేల వచింతురు ! పాప మెన్నియో
యాతనలొంది నేర్చె కడు నర్థవిహీనత తోడ విద్య మీ
రీతని ప్రజ్ఞలన్ మరచి యెడ్డికి జాబు నొసంగ న్యాయమే !
(ఎడ్డి= తెలివి తక్కువ వాడు, మూర్ఖుడు, మడ్డి వాడు)
ధనికొండ రవిప్రసాద్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పింగళమ్ముకు మరియొక పేరు యేమి?
రిప్లయితొలగించండిఇంతి రుక్మిణి వృష్ణికి యేమిబంపె?
వాగువంకలు పొంగుచు వానజడిగ
కోతి,కొకజాబు,వచ్చిన గొల్లమనియె!!!
శైలజ గారూ,
తొలగించండిక్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
పేరు+ఏమి.. అన్నపుడు సంధి నిత్యం. 'పింగలమునకు' అనండి (పింగళము కోతికి పర్యాయపదంగా ఆచార్య బి.ఎన్.రెడ్డి గారు చెప్పారు కాని మరే నిఘంటువులోను ఆ అర్థం చెప్పలేదు) 'పేరు చెపుమ' అనండి. 'వృష్ణికి నేమి' అనండి.
# She Too
రిప్లయితొలగించండిచేతులు త్రిప్పి విప్పుచును చెన్నుగ బాసుకు కన్నుకొట్టుచున్
బూతుల జోక్లు సైచుచును ముచ్చట మీరగ మీదబడ్చుచున్
నాతుల గౌరవమ్మునిట నంగడి పాలుగ జేయుచుండు నా
కోతికి "జాబు" వచ్చెనని గొల్లున నేడ్చుట యుక్తియుక్తమా?