విరించి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'భీతిని విడుచుచు, నిర్భీతిన్' దాదాపు ఒకే అర్థాన్ని బోధిస్తాయి కదా! అక్కడ "ఖ్యాతి గలుగునట్టుల ని।ర్భీతిని..." అంటే ఎలా ఉంటుంది?
భూతల మందు దక్కుటకు భూరిగ సంపద లెల్ల సోదరా, నీతల రాత మార్చుటకు నీ యతనమ్ము జరూరు చేయరా కోతల గట్టు పల్కు లను కుంచి కుదించుచు, మేలు వీడుచున్ భీతిని, ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!
ఖాతరు జేయకన్ ధృతిని ఖద్దరు బట్టల తాత లెల్లరన్ నీ తలపుల్గొనంగ సయి నీ దగు పోరును సల్పు రాహులా నీతివిధుండ వైన భళి నిక్కము కన్నడ రాజ్యమయ్య! ని ర్భీతిని, ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!
జిలేబీ గారూ, సమకాలీనమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'నీతివిదుడు (నీతి తెలిసినవాడు)' అన్నది సాధురూపం. 'విధుడు' అంటే చంద్రుడు. మీరు "నీతికి చంద్రుని వంటివాడు" అన్న అర్థాన్ని తీసుకోలేదు కదా?
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2671 సమస్య :: *భీతిని ముందుకేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా.* భయపడుతూ ముందుకు వెళ్తే దిగ్విజయం దక్కుతుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: శివాజీ తల్లి జిజియాబాయి తన కుమారునికి బాల్యంలోనే రామాయణ భారత భాగవతములలోని కథలను బోధించింది. దేశభక్తిని గుఱించి తెలియజెప్పింది. ఆమె శివాజీతో ‘’ఓ వీరకుమారా ! *ధైర్యే సాహసే లక్ష్మీః* అని పెద్దలు చెబుతారు. నీవు ధైర్యము సాహసము మొదలైన సుగుణాలతో పురోగమిస్తే నీకు కీర్తి దక్కుతుంది. జయం కలుగుతుంది. నిన్ను లక్ష్మి వరిస్తుంది. నిర్భీతితో (అంటే భయపడకుండా) ముందుకు వెళ్తే నీవు విశ్వ విజేతవు కాగలవు’’ అని ఉపదేశం చేసే సందర్భం.
ఇల్లాలు తను మరెవరో కాదు ఇంటినేలెడి గృహ మంత్రి ఆవిడను కాదని పప్పుడకదు మోగదు ఆనంద తంత్రి విశ్వము తానై తోచు విధేయతగ ప్రసన్నత చిక్కురా భీతిని ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా
సందర్భము: స్థితప్రజ్ఞుని లక్షణాలను గీతాచార్యుడైన కృష్ణు డిలా పేర్కొన్నాడు. దుఃఖే ష్వనుద్విగ్న మనాః సుఖేషు విగత స్పృహః వీత రాగ భయ క్రోధః స్థిత ధీ ర్ముని రుచ్యతే 56 (భగవద్గీత సాంఖ్యయోగం) దుఃఖం సంభవించినప్పుడు కలత చెందరాదు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోరాదు. రాగము (అనవసరమైన మమకారం), భయం, కోపం అనేవి విడిచిపెట్టాలి. అతడే స్థితప్రజ్ఞుడు. అంటే నిలిచిపోయిన ప్రజ్ఞ కలవాడు. నిజానికి దైవానుభూతి పొందాలనుకొనే ప్రతివాడూ ప్రయత్న పూర్వకంగా వీటిని యెంత కష్టమైనా సరే సాధించితీరాలి. యిందులో తనకు తానే ప్రమాణం. మరొకరు చెప్పాల్సింది లేదు. అట్లా సాధించ గలిగిన వాడు మాత్రమే ఆధ్యాత్మిక రంగంలో మునుముందు కేగి విజయాన్ని సొంతం చేసుకోగలుగుతాడు. తక్కినవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ వుంటారు. ఆయుస్సు అంతరించిపోతూ వుంటుంది తప్ప ఏమాత్రం ప్రయోజనం వుండదు. లేదా వేదాంత చర్చ లన్నీ శిష్యులను ఆకట్టుకొని మిథ్యాతృప్తి పొందడానికి ఆత్మ వంచనకు పనికివస్తాయి. ఒక్కొక్కసారి ఏదో ఒక దశలో అభాసు పాలు కావడానికి దారి తీస్తుంటాయి కూడ. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~ ఆతండు స్థితప్రజ్ఞుడు, వీత క్రో ధానురాగ భీతుడు, కరమున్ బ్రీతుడు దైవానికి.. ని ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్
2 వ పూరణము..
సందర్భము: వాస్తవానికి సుఖం వస్తుం దంటేనే భయపడాలి. కాని లోకంలో కష్టం వస్తే చాలు భయపడుతారు. కాని ఆ కష్టమే దైవాన్ని గుర్తుండేటట్టు చేస్తుంది. దైవానికి చేరువగా తీసుకు వెళుతుంది. గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. ఇంకొకనికి ఆదర్శంగా నిలబెట్టుతుంది. ఇక సుఖం వస్తేనా! నా యంతవాడు లే డనుకుంటాడు. అందరినీ చిన్నచూపు చూడడానికీ వెనుకాడడు. అందరిలో దైవాన్ని చూడడం అనే మాట నచ్చదు. దైవానికి క్రమంగా దూరమౌతాడు. దేవత లందరూ సుఖాని కలవాటుపడి మత్తులో మునిగియున్నప్పుడే రాక్షసులచేత స్వర్గంనుండి తరిమివేయబడుతారు. వాళ్ళ కప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. ఏ విష్ణుమూర్తివద్దకో వెళ్ళి మొరపెట్టుకుంటారు. ఈ విధంగా సుఖం పొందడంద్వారా దైవానికి దూరమై పోవడం సంభవిస్తున్నది. కాబట్టి అదే నిజమైన కష్టం. అందుకే *సుఖం వస్తుం దని భయపడాలి.* ఇక కష్టంలో భగవంతు డెప్పుడూ గురుతే వుంటాడు. కాబట్టి దానినే నిజమైన సుఖంగా భావించాలి. అందుకే కుంతీదేవి తన కెప్పుడూ కష్టాలే రావా లని కోరుకున్న దంటారు. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~ భీతి వలదు కష్టమునకు.. లో తరసినఁ జెంతఁ జేర్చు లోకేశ్వరునే! ఏతెంచు నేమొ సుఖ మని.. భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్
కోతలు మానుము ,విడువుము
రిప్లయితొలగించండిభీతిన్,మున్ముందు కేగ విజయము గల్గున్,
చేత శరముతో సింగము
రీతి రిపుల దునుమనుచు కిరీటి వచించెన్
ఉత్తర కుమారుని తో అర్జునుడు పలికిన మాటలు
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప"
రిప్లయితొలగించండి...భగవద్గీత 2-3
"నీతియె సమరము ప్రభులకు
భ్రాతల జ్ఞాతుల మమతలు భ్రాంతియె ననుచున్
రీతిగ హృదినిన్ వదలుచు
భీతిన్, మున్ముందు కేఁగ విజయము గల్గున్"
మైలవరపు మురళీకృష్ణ గారి సవరణ:
తొలగించండి"క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప"
...భగవద్గీత 2-3
"నీతియె సమరము ప్రభులకు
భ్రాతల జ్ఞాతుల మమతలు భ్రాంతియె యని యీ
రీతిగ మదిలో వదలుచు
భీతిన్, మున్ముందు కేఁగ విజయము గల్గున్"
సమరమే....
తొలగించండి👌🏻👏🏻🙏🏻
మైలవరపు వారి తాలింపుతో సొంపు సరళమైనది 😊
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిభూతలమున మార్చగ తల
రాతల ధైర్యము వలయు, పరమును తలచుచున్
చైతన్యముతో, వీడుచు
భీతిన్, మున్ముందు కేఁగ విజయము గల్గున్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఎస్వీ రంగారావు గారు ఎన్టీఆర్ గారితో... (పాతాళభైరవి)
చేతము నిల్పి సాహసము సేయర ! డింభక ! అమ్మ మెచ్చురా !
మాతఁ గరాళి గొల్వ నసమాన ధనాదులు , రాకుమారియున్
బ్రీతి లభించురా ! మునిగి వేగమె రార సరస్సునందు ! ని...
ర్భీతిని ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కు రా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
👌🏻👏🏻
తొలగించండిసాహసమున్ జేయమనిరి శాంతిని పొందన్!😊
ఆ రకంగా ముందుకు పోదాం.. ✌️
తొలగించండినేతల దూషణమ్ములను నిక్కములంచు దలంపవద్దురా !
పూతచరిత్రఁ గల్గిన ప్రభున్ జనులే గెలిపించుకొండ్రురా !
నీతిపథమ్ముఁ దప్పనని నేడె ప్రమాణముఁ జేసి , వీడురా
భీతిని ., ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కు రా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి👌👌👌👌😊😊😊😊
తొలగించండినీతిని వీడక సతతము
రిప్లయితొలగించండిజాతిని జాగృత మొనర్చ సమరము చేయన్
భీతిని విడుచుచు తా ని
ర్భీతిన్ మున్ముందుకెగ విజయము గల్గున్
వీరత్వము జూపమనిరి విజయము నందన్!
తొలగించండి👌🏻👏🏻🌹
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భీతిని విడుచుచు, నిర్భీతిన్' దాదాపు ఒకే అర్థాన్ని బోధిస్తాయి కదా! అక్కడ "ఖ్యాతి గలుగునట్టుల ని।ర్భీతిని..." అంటే ఎలా ఉంటుంది?
రిప్లయితొలగించండిభూతల మందు దక్కుటకు భూరిగ సంపద లెల్ల సోదరా,
నీతల రాత మార్చుటకు నీ యతనమ్ము జరూరు చేయరా
కోతల గట్టు పల్కు లను కుంచి కుదించుచు, మేలు వీడుచున్
భీతిని, ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిభం భం రాహుల్ కీ జై :)
ఖాతరు జేయకన్ ధృతిని ఖద్దరు బట్టల తాత లెల్లరన్
నీ తలపుల్గొనంగ సయి నీ దగు పోరును సల్పు రాహులా
నీతివిధుండ వైన భళి నిక్కము కన్నడ రాజ్యమయ్య! ని
ర్భీతిని, ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!
జిలేబి
👏🏻👏🏻👏🏻
తొలగించండి💐💐💐
మూడు పద్యాలూ మెచ్చదగినవే...
కానీ నేను విక్రమ్ రాథోడ్ ని దించేస్తారనుకున్నా...😃
తొలగించండిఅబ్బే! మనదంతా లేటెష్టు పోలి ' టిక్సే' :) పాత కతల్ నో యూజ్ విట్టు బాబు గారు ! ఇప్పటి హవా రాహుల్ ! రైడ్ ది విండ్ :)
నెనరులు మీ ప్రోత్సాహానికి
చీర్స్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిసమకాలీనమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నీతివిదుడు (నీతి తెలిసినవాడు)' అన్నది సాధురూపం. 'విధుడు' అంటే చంద్రుడు. మీరు "నీతికి చంద్రుని వంటివాడు" అన్న అర్థాన్ని తీసుకోలేదు కదా?
తొలగించండికంది వారికి
ఆంధ్ర భారతి ఉవాచ
నీతివిధుడు -
నీతికుశలుఁడు, నీతివిధుఁడు : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
a man well-versed in politics.
:)
జిలేబి
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిచేతల వెనుకను సాహస
మూతంబగుగాని, శ్రద్ధ మొలిపించునదే
భీతి యనుటయే తథ్యము
భీతిని మునుముందుకేగ విజయము కల్గున్
సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నీతిగ బ్రతుకును గడుపుచు
రిప్లయితొలగించండిభూతలమున నిత్య సత్య పోషణ తోడ
న్నేతావాతా పాపపు
"భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్"
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు గురువుగారూ
తొలగించండి🙏🏻
రాతను మార్చుకొ నంగను
రిప్లయితొలగించండినీతిగ బ్రతుకంగ కోరి నియమము తోడన్
చేతన మందున బిగువు ని
ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. "చేతన మందున బిగి ని।ర్భీతిన్..." ఆనండి.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఖ్యాతికి లక్ష్య సిద్ధికగు కార్యమునే తలపెట్టి ధీరుడై
"చేతల దప్పనే"నను యచేతనమేమరుపాటు మూలమౌ
ఖాతరుజేసి శ్రద్ధ కనుగామిగ జంకున బోవ సత్కృతిన్
భీతిని ముందుకేగిననె ప్రీతి, జగద్విజయమ్ము దక్కురా!
సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కనుగామిగ'...?
(శివాజీ సేనాని తానాజీ మావళే వీరులతో)
రిప్లయితొలగించండిజేతలమై వెలుంగవలె జిక్కులబెట్టుచు మహ్మదీయులన్;
చేతము ఝల్లనంగవలె చివ్వున వేయుడు శూలసంహతిన్;
జోతల నందుకోగలరు శూరులు సింహగడమ్ము గొట్టి,ని
ర్భీతిని ముందుకేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండినేతగ,త్రాతగ,తాతగ,
రిప్లయితొలగించండిజాతికి మేల్గూర్పఁబూని సద్ధర్మముతో
ఖ్యాతిని పాందుము తగ ని
ర్భీతిని మున్మందుకేగ విజయముఁగల్గున్
తాత=జాతిపిత గాంధీజీ
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండివేతును కత్తిపోటులన వెంగలివిత్తువలెన్ సహోదరా
నీతిని వీడుచున్ బతుక నీమము కాదు సుమా! జనాళియున్
కోతుల మూక గా తిరుగ కూడదు; కొంతసయోధ్య,కొంతయున్
భీతిని, ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్వాతంత్రము సాధింపగ
రిప్లయితొలగించండిచైతన్యము తోడ నిండు జ్ఞానము గూడన్
కాతరు డవ్వక దా ని
ర్భీతిన్ మున్ముందుకేగ విజయము గల్గున్
తొలగించండిచేతనమందు నిత్యము విశేషముగన్
హరిగొల్వ నీమమున్
త్రాతగ నాతడే నుదుటి రాతల మార్చుగ నీశ్వరుండునై
యాతన లేవియున్ మనము నంటవు
తోషము తోడ వీడగా
భీతిని ముందుకేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండిచేత మ్మువిశ్వ సిం చు చు
రిప్లయితొలగించండినా త త ధైర్యమ్ము తోడ నరి వర్గ ము ల న్
భీతుల నొ న రించు చు ని
ర్భీ తి ని మున్ముందు కేగ విజయ ము గలు గు న్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోతలె యివెవ్విధంబుగ
రిప్లయితొలగించండిభీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్?
భూతల పతి సతతము ని
ర్భీతిగ మున్ముందు కేఁగ విజయము గల్గున్
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కోతలె యివి యెవ్విధమున' అనండి.
🙏🙏🙏
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2671
సమస్య :: *భీతిని ముందుకేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా.*
భయపడుతూ ముందుకు వెళ్తే దిగ్విజయం దక్కుతుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: శివాజీ తల్లి జిజియాబాయి తన కుమారునికి బాల్యంలోనే రామాయణ భారత భాగవతములలోని కథలను బోధించింది. దేశభక్తిని గుఱించి తెలియజెప్పింది. ఆమె శివాజీతో ‘’ఓ వీరకుమారా ! *ధైర్యే సాహసే లక్ష్మీః* అని పెద్దలు చెబుతారు. నీవు ధైర్యము సాహసము మొదలైన సుగుణాలతో పురోగమిస్తే నీకు కీర్తి దక్కుతుంది. జయం కలుగుతుంది. నిన్ను లక్ష్మి వరిస్తుంది. నిర్భీతితో (అంటే భయపడకుండా) ముందుకు వెళ్తే నీవు విశ్వ విజేతవు కాగలవు’’ అని ఉపదేశం చేసే సందర్భం.
చేతము పొంగగా జిజియ చెప్పె శివాజికి “వీరపుత్రుడా !
ఆతత ధైర్య సాహస గుణాదులతోడ పురోగమింపుమా !
ఖ్యాతియు వచ్చు, నిత్యము జయమ్ము లభించు, వరించు లక్ష్మి, ని
*ర్భీతిని ముందుకేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా.” *
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.*
జయంబు నిశ్చయంబురా! భయమ్ము లేదురా! జంకుగొంకు లేక సాగిపొమ్మురా!
తొలగించండి👌👌👌👌🙏🙏🙏
నిర్భీతితో సాఁగిపోయినచో తప్పక జగద్విజయం దక్కుతుందని జిజియాబాయి శివాజీతో జెప్పినట్టుగా జేసిన మీ పూరణము అద్భుతంగా ఉన్నదండీ కోటవారూ! అభినందనలు!
తొలగించండికోట రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
శ్రీమతి సీతాదేవి గారికి హృదయపూర్వక ప్రణామాలు.
తొలగించండినిర్భీతిని ముందుకేగిన వరించు జగద్విజయమ్ము శ్రీ మధూ !
తొలగించండిగురువరేణ్యులు
తొలగించండిశ్రీ కంది శంకరయ్య గారికి భక్తిపూర్వక ప్రణామాలు.
రిప్లయితొలగించండిఇదెక్కడో చదివినట్టుందే :) అబ్బే పేరడీ కాదండి :)
చేతము పొంగ సోనియ వచించెను రాహులుడా!కొమారుడా!
ఆతత ధైర్య సాహస గుణాదులతోడ పురోగమింపుమా !
ఖ్యాతియు వచ్చు, నిక్కముగ కన్నడ రాష్ట్రము నీకు దక్కు! ని
ర్భీతిని ముందుకేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ సమకాలీన పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికోటావారు కత్తులు నూరకుంటే సరి :)
జిలేబి
సహృదయులు జిలేబి గారూ!
తొలగించండిపలుకుతూ నతులు సన్నుతులు నూరకుంటే సరి.
కోట రాజశేఖర్
తొలగించండికోటావారు
నమో నమః
జిలేబి
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిచేతమునందు ధీరతయు, స్థేమము దేహమునందు నెప్డు స
ద్ద్యోతముగాన్ బహిర్ద్విషులఁ ద్రుంచి, త్వదీయ దృఢాత్మతోడ సా
కూతముఁ గాల్చి షడ్రిపులఁ, గూల్చియుఁ ద్వద్ధృదయస్థమైనయు
ద్భీతిని, ముందు కేఁగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
అద్భుతమైన పూరణ మధుర కవిగారూ! 🙏🙏🙏🙏🙏🙏
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండి🙏🙏🙏
ధన్యవాదాలండీ సీతాదేవిగారూ!
🙏🙏🙏
మధురకవిగారూ! మీ పద్యం మధురం. మీ ఉపదేశం మధురం.
తొలగించండిధన్యవాదాలండీ రాజశేఖర్ గారూ! మీ సహృదయతకు మనఃపూర్వక కృతజ్ఞతలు!
తొలగించండినీతిని నమ్ము విలేఖరి
రిప్లయితొలగించండినేతల యవినీతి ప్రజకు నేరుగ దెల్పున్
ఘాతములకు వెరువక ని
ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా, బాగున్నది. అభినందనలు.
ఖ్యాతిని బొందుట కొఱకై
రిప్లయితొలగించండినీతి పథమ్మును విడువక నిశ్చల మతి దు
ర్నీతిని దునుమంగను ని
ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఖ్యాతిని కోరక, జనుడా
సోతాపన్నుడ వగుచు వసుధలో నీవ
జ్ఞాతుడ వై నెక్కొనుచు న
భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సోతాపన్నుడవు'...?
తొలగించండిసోతాపన్న : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
[బౌద్ధ]
సంసార చక్రానికి కట్టిపడేసి ఉంచే బంధాలలో మూడింటిని తెంచుకొని నిర్వాణాన్ని చేర్చే జ్ఞాన ప్రవాహం (మార్గం)లో ప్రవేశించినవాడు.
ఆంధ్ర భారతి ఉవాచ
జిలేబి
__/\__
తొలగించండివ్రాతలు కలకండలుగా
రిప్లయితొలగించండిపోతలుఁ బోసెడు నొక కవి పుంగవుఁడహమున్
ద్యోతకఁ బరుచక నొదుగుచు
భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్
- శ్రీకాంత్ గడ్డిపాటి
శ్రీకాంత్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆచార్యులకు కృతజ్ఞతలు.
తొలగించండినీతిని ధాత్రిలోన యవి నీతిని ద్రుంచుచు నిల్పుమంచు నా
రిప్లయితొలగించండితాతలు చెప్పినట్టి నుడి తథ్యమదే కద యాచరింపగన్
భీతిల కోయి సోదర వివేచన మన్నది వీడకుండ ని
ర్భీతిని ముందుకేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధాత్రిలోన నవినీతిని' అనండి.
కందం
రిప్లయితొలగించండితాతలు తండ్రులు భ్రాతలు
నే తీరుగ సుతుని జంపి రెరుగవె? పార్థా!
సైతువె? బంధులనక ని
ర్భీతిని మున్ముందు కేఁగ విజయము గల్గున్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండిభీతియె యపజయమునకున్
రిప్లయితొలగించండిహేతువుగా నిలిచియుండి హేడము గూర్చున్
చేతన మొప్పగ వదలియు
భీతిన్;మున్ముందు కేఁగ విజయము గల్గున్.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నీతిని విడిచి చరించెడి
రిప్లయితొలగించండిఘాతకులౌ శత్రువులను కడతేర్చంగన్
జాతిని రక్షించగ ని
ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సూతుని సామర్థ్యమ్మున
రిప్లయితొలగించండినాతత నైపుణముతో మహారథి విలస
త్కేతన వీరుఁడు సమరా
భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్
ఏ తరి నైన బుద్ధి శమియించు సధైర్యము శోక మంద శో
కేతర ముండునే మదిని నీప్సిత నాశక మెంచ ధాత్రినిన్,
వీతము సేసి శోకము వివేకముతో ధృతిఁ దాల్చి యింక, ని
ర్భీతిని ముందు కేఁగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా
శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతమ్.
శోకో నాశయతే సర్వం నాస్తి శోకసమో రిపుః ৷৷ వా. రా. అయోధ్య. .62.15৷৷
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిపాత చలనచిత్రమగుట
చేత తొలుతనె ప్రవేశచీటీ వరుసన్
రీతిగపంచ దొరకదను
భీతిన్ మున్ముందు కేగ విజయము కల్గున్
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండినీతినినిష్టను నిలుపగ
రిప్లయితొలగించండిజాతికి జాగృతిని బెంచి జనులకు జరిపే
రీతిని జేయుటకై ని
ర్భీతిన్ మన్ముందు కేగ?విజయము గల్గున్
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నిష్ఠను' టైపాటు. 'జరిపే' అనడం వ్యావహారికం.
సద్గురుబోధ :
రిప్లయితొలగించండిఉత్పలమాల
చేతల నంతరాయమను చింతల నీచు లుపక్రమించరే
చేతల మధ్య నడ్డముల జిక్కుచు నాపుదురంత మధ్యముల్
జేతల నాపరెప్పటికిఁ జిక్కులుఁ జుట్టిన ధీరులన్న! ని
ర్భీతిని ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!
చక్కని పూరణ జి వి యస్ గారూ!
తొలగించండిఆరంభించరు నీచమానవులు! 👌👌🙏🙏🙏
ధన్యవాదములండీ 🙏🙏🙏
తొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమనోహరమైన పూరణము సహదేవుఁడు గారు. మూడవ పాదములో గూడ చేతల లేక సేతల ననండి. సరళాదేశ ముండ దక్కడ.
తొలగించండిఖ్యాతిన్ బడయగ మనుజులు
రిప్లయితొలగించండిచేతల జూపంగ వలయు క్షేమము, నిరతము
జాతికి జీవంబయి ని
ర్భీతిన్ మున్ముందుకేగ విజయము గల్గున్!
తొలగించండిసవరణతో....
ఖ్యాతిన్ బడయగ మనుజులు
చేతల జూపంగ వలయు క్షేమము, సతమున్
జాతికి జీవంబయి ని
ర్భీతిన్ మున్ముందుకేగ విజయము గల్గున్!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చోదక పండితుండువాచ:
రిప్లయితొలగించండిప్రీతిగ చూపెదన్ కనుము బ్రేకిది క్లచ్చిది థ్రాటిలిద్దిరా
తాతను సంస్మరించుకొని తాళపు చెవ్విని త్రిప్పుమిందులో
మూతి బిగించుటన్ విడిచి ముద్దుగ గేరున బండినుంచి ని
ర్భీతిని ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!
తొలగించండిఈబండి రోడ్డు మీద పోతే ఎవరికేమవుతుందో మరి :)
జిలేబి
👌👏🙏
తొలగించండిమూతిబిగించడమెందుకో?
తొలగించండికారెంత కష్టపడి నేర్చుకుంటున్నా మధ్యలో ప్రాస గోల అడ్దుపడుతోందే అన్న కారణం కావచ్చేమో :)
జిలేబి
అయ్యా! సహదేవుడు గారూ:
తొలగించండిమూతి బిగుంపు tension భరించ లేక. క్రొత్త బండీ, క్రొత్త పెండ్లం...
అమ్మా! జిలేబీ గారూ:
తొలగించండిప్రాసాయాసం పునః పునః
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండిగోతిన దొర్లినన్ వెరవకుండగ గేరులు మార్చినీవు ని
తొలగించండిర్భీతిని అంటే ఎలా ఉంటుంది జిలేబి గారు
అయ్యా! ఇక మీ ఇష్టం...
తొలగించండిఅన్నట్టు ఆఖరు వాక్యంలో ఈ 'ప్రీతి' ఎవరండి?
తొలగించండినీతిని విడనాడకయవి
రిప్లయితొలగించండినీతిని నిల దరుము కొట్టు నియమము గలడో
యాతడు జీవిత మునని
ర్భీతిన్మున్ముందుకేగ విజయము గల్గున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..దరిమికొట్టు' అనండి.
వ్రాతలు బాల్యమందునను బ్రహ్మ లిఖించును, భీతి యేలనో?
రిప్లయితొలగించండిజాతిని గూల్చు దుర్జనుల స్వాంతమునన్ దలపోసి యవ్విధిన్
ఘాతకులైన వైరులను కాతరుచేయక పోరులోన ని
ర్భీతిని ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండినీతిగ బ్రతుకును గడుపుచు
ఖ్యాతిని పెంచెడి పనులను కలవరపడకన్
రీతిగ చేయుచు చనుని
ర్భీతిన్ మున్ముందుకెగ విజయము గల్గున్.
వేతనముహెచ్చు ననుచును
నీతిని విడి సంచరింప నేరంబౌరా
రీతిని మార్చుచు విడుచుచు
భీతిన్ ,మున్ముందుకెగ విజయము గల్గున్.
గీతాపఠనము చేయుచు
సీతాపతినే తలచిన శీఘ్రమె యతడున్
తాతీర్చును తాపము ని
ర్భీతిన్ మున్ముందుకెగ విజయము గల్గున్.
హేతువులను వెదుకక ని
ర్భీతిన్ మున్ముందుకెగ విజయము గల్గున్
ఖ్యాతియు పెరుగును భువిలో
నీతిగ మసలుచుసతతము నెమ్మిని గనుమా.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నీతినివీడకుండగను నేమము తోడను బుణ్యకార్యముల్
రిప్లయితొలగించండికాతర మేమియున్బడక కాంతల కెల్లను జేయుచుండునో
నాతని మేటివానిగను నంచితరీతిని మెచ్చుకోవని
ర్భీతినిముందుకేగిననెప్రీతి జగద్విజయమ్ము దక్కురా
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...చుండునో యాతని... మెచ్చుకొమ్ము...' ఆనండి.
నీ తలకు మించిన పనిని
రిప్లయితొలగించండిసైతమొక ప్రణాళిక గొని చక్కగ నెఱప
న్నీతిని విడనాడక ని
ర్భీతిన్ మున్ముందు కేగ విజయము కల్గున్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆరప పాదంలో గణదోషం. సవరించండి.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,
తాతల సద్గురూత్తముల దండ్రుల భ్రాతల మేనమామలన్
బాతక మంచు నెంచక , రణంబున జంపుచు రక్తసిక్త మౌ
భూతల మెట్లు నేలవలె ? పోదము తేరు మరల్చు స్వామి ! యో
పూతచరిత్ర - యో పరమపూరుష - యంచు కిరీటి వేడగా
గీత వచించె ఫల్గునునికిన్ హరి యిట్టుల :- " వీడుమా యికన్
చేతము లోని శంక , విను , నీవు నిమిత్తుడవే ! ధనుస్సు నీ
చేత ధరించి శాత్రవుల జీల్చుము | మౌని దివౌకసాళి ని
ధ్యాత సువిశ్వరూప మిదె ! యారసి , త్రుంచి మనంబులో సము
ద్భీతిని , ముందుకేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా "
{ నిధ్యాత = ధ్యానింపబడుచున్న }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఖ్యాతిని గలిగిన వీరుల
రిప్లయితొలగించండినేతీరుగ నెదురుకుందు నియ్యని ననుచున్
భీతిలకుత్తరుడా, ని
ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇల్లాలు తను మరెవరో కాదు ఇంటినేలెడి
రిప్లయితొలగించండిగృహ మంత్రి
ఆవిడను కాదని పప్పుడకదు మోగదు
ఆనంద తంత్రి
విశ్వము తానై తోచు విధేయతగ
ప్రసన్నత చిక్కురా
భీతిని ముందు కేగిననె ప్రీతి
జగద్విజయమ్ము దక్కురా
మీ భావానికి పద్యరూపం!
తొలగించండినేతగ శ్రీమతి గృహమున
ప్రీతిని సంసార సుఖము పెంపొనరించున్
ప్రాతగ పతియే నమ్రత
భీతిన్ మున్ముందుకేగ విజయము గల్గున్!
ప్రాత = భృత్యుడు
సీతాదేవి గారూ,
తొలగించండిరమేశ్ గారి భావానికి మీ పద్యం రూపం బాగున్నది. అభినందనలు.
ధన్యోస్మి!🙏🙏🙏🙏
తొలగించండిభూతలమంతయున్ వెదకి భూనిజ జాడను దెల్ప నిష్టుడై
రిప్లయితొలగించండిఆతతముందపించు అనిలాత్మజు గన్గొని జాంబవంతుడా
చేతము తోడ బల్కె నిటు చేకొని యాపదలన్ని సైచి ని
ర్భీతిని ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!
శ్రీకాంత్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భూనిజ/భూమిజ'... టైపాటు.
భీతిని జేరనీవు దరి, భీరువులై సరిహద్దు పౌరులన్
రిప్లయితొలగించండియాతన బెట్టు ముష్కరుల నంతకు బారికి బంపు సైనికా!
నీతగు జోదు లే డరుల, నీ పటు దీక్షను బెంచి వారిలో
భీతిని, ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కం:-
రిప్లయితొలగించండినీతి,నియమమ్ము దప్పిన
ఘాతకులెల్లను వధించి కాయువునిలుపన్
యాతనలువిడి మదిని ని
ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్!!
@ మీ పాండురంగడు*
౦౭/౦౫/౨౦౧౮
పాండురంగడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రీతియు నేర్వగ సంతతి
రిప్లయితొలగించండిచేతిని గలుప తననె కద చేరు ముదమునన్
రీతుల నిల్పగ బంధ, ని
ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్
dr H Varalakshmi
Bangalore
వరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. చివరి గణం రగణం అవుతున్నది.
*7-5-18*
రిప్లయితొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్
సందర్భము: స్థితప్రజ్ఞుని లక్షణాలను గీతాచార్యుడైన కృష్ణు డిలా పేర్కొన్నాడు.
దుఃఖే ష్వనుద్విగ్న మనాః
సుఖేషు విగత స్పృహః
వీత రాగ భయ క్రోధః
స్థిత ధీ ర్ముని రుచ్యతే 56
(భగవద్గీత సాంఖ్యయోగం)
దుఃఖం సంభవించినప్పుడు కలత చెందరాదు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోరాదు. రాగము (అనవసరమైన మమకారం), భయం, కోపం అనేవి విడిచిపెట్టాలి. అతడే స్థితప్రజ్ఞుడు. అంటే నిలిచిపోయిన ప్రజ్ఞ కలవాడు.
నిజానికి దైవానుభూతి పొందాలనుకొనే ప్రతివాడూ ప్రయత్న పూర్వకంగా వీటిని యెంత కష్టమైనా సరే సాధించితీరాలి. యిందులో తనకు తానే ప్రమాణం. మరొకరు చెప్పాల్సింది లేదు. అట్లా సాధించ గలిగిన వాడు మాత్రమే ఆధ్యాత్మిక రంగంలో మునుముందు కేగి విజయాన్ని సొంతం చేసుకోగలుగుతాడు.
తక్కినవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ వుంటారు. ఆయుస్సు అంతరించిపోతూ వుంటుంది తప్ప ఏమాత్రం ప్రయోజనం వుండదు.
లేదా వేదాంత చర్చ లన్నీ శిష్యులను ఆకట్టుకొని మిథ్యాతృప్తి పొందడానికి ఆత్మ వంచనకు పనికివస్తాయి. ఒక్కొక్కసారి ఏదో ఒక దశలో అభాసు పాలు కావడానికి దారి తీస్తుంటాయి కూడ.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
ఆతండు స్థితప్రజ్ఞుడు,
వీత క్రో ధానురాగ భీతుడు, కరమున్
బ్రీతుడు దైవానికి.. ని
ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్
2 వ పూరణము..
సందర్భము: వాస్తవానికి సుఖం వస్తుం దంటేనే భయపడాలి. కాని లోకంలో కష్టం వస్తే చాలు భయపడుతారు. కాని ఆ కష్టమే దైవాన్ని గుర్తుండేటట్టు చేస్తుంది. దైవానికి చేరువగా తీసుకు వెళుతుంది. గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. ఇంకొకనికి ఆదర్శంగా నిలబెట్టుతుంది.
ఇక సుఖం వస్తేనా! నా యంతవాడు లే డనుకుంటాడు. అందరినీ చిన్నచూపు చూడడానికీ వెనుకాడడు. అందరిలో దైవాన్ని చూడడం అనే మాట నచ్చదు. దైవానికి క్రమంగా దూరమౌతాడు.
దేవత లందరూ సుఖాని కలవాటుపడి మత్తులో మునిగియున్నప్పుడే రాక్షసులచేత స్వర్గంనుండి తరిమివేయబడుతారు. వాళ్ళ కప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. ఏ విష్ణుమూర్తివద్దకో వెళ్ళి మొరపెట్టుకుంటారు.
ఈ విధంగా సుఖం పొందడంద్వారా దైవానికి దూరమై పోవడం సంభవిస్తున్నది. కాబట్టి అదే నిజమైన కష్టం. అందుకే *సుఖం వస్తుం దని భయపడాలి.*
ఇక కష్టంలో భగవంతు డెప్పుడూ గురుతే వుంటాడు. కాబట్టి దానినే నిజమైన సుఖంగా భావించాలి.
అందుకే కుంతీదేవి తన కెప్పుడూ కష్టాలే రావా లని కోరుకున్న దంటారు.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
భీతి వలదు కష్టమునకు..
లో తరసినఁ జెంతఁ జేర్చు లోకేశ్వరునే!
ఏతెంచు నేమొ సుఖ మని..
భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్
🖋~డా.వెలుదండ సత్యనారాయణ