కంది వారు ఎలాగూ మెచ్చుకుంటారనే ధీమా.. ఇప్పటికి శ్రీ చిటితోటి వారు.. శాస్త్రి గారు మెచ్చుకొనుటవలన ఈ పద్యం వచ్చింది... ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు 🙏🙏
మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. **** ஜிலேபீ காரூ, மீரு டமிளஂலோ வ்ராசினடி அர்த்ஂ காலேடு. **** ప్రభాకర శాస్త్రి గారు... "నేనెరుగ నేనెరుగ మన సారు నడుగు" నేను ... "ఇంకెవరు ఇంకెవరు మన ప్రభాకరులె"
ఈరోజు ఇప్పటి వరకు పూరణలు పంపినవారి పట్టిక. పేరు ప్రక్కన కుండలీకరణంలో ఉన్న సంఖ్య వారి పూరణలను తెలియజేస్తుంది. ౧. చక్రవర్తి భద్రాచలం (౨) ౨. జి. ప్రభాకర శాస్త్రి (౨) ౩. కె.యల్. నారాయణ ౪. విరించి (౩) ౫. ఆచార్య లక్ష్మణ ౬. మైలవరపు మురళీకృష్ణ ౭. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి ౮. పింగళి పూర్ణచంద్ర రావు ౯. విట్టుబాబు ౨ ౧౦. మునిగోటి సుందరరామ శర్మ ౧౧. అంబటి భానుప్రకాశ్ ౧౨. సింహాద్రి జ్యోతిర్మయి (౩) ౧౩. కోడూరి శేషఫణి శర్మ ౧౪. గంగుల ధర్మరాజు ౧౫. యం.వి. ప్రసాద రావు ౧౬. కోట రాజశేఖర్ ౧౭. చేపూరి శ్రీరామారావు (౨) ౧౮. ఊర ఈశ్వర రెడ్డి (౨) ౧౯. గుండా వేంకట సుబ్బ సహదేవుడు (౩) ౨౦. గుండు మధుసూదన్ ౨౧. ఆర్. రాజా ౨౨. గుఱ్ఱం జనార్దన రావు ౨౩. మహేంద్రాడ సింహాచలాచార్య ౨౪. బొగ్గరం ఉమాకాంత ప్రసాద్ (౨) ౨౫. గౌరీభట్ల బాలముకుంద శర్మ (౨) ౨౬. బండకాడి అంజయ్య గౌడ్ ౨౭. దరిశి బాలసుబ్రహ్మణ్యం ౨౮. యం.వి.యస్. శాస్త్రి (౨) ౨౯. సంగు గురుచరణ్ ౩౦. దాలి నాయుడు ౩౧. డా. విమలరాజు (౨) ౩౨. తురిమెళ్ళ రాధాకృష్ణ మూర్తి (౨) ౩౩. సూర్యారావు ౩౪. శ్యామల (౨) ౩౫. బిట్రా నాగమల్లేశ్వర రావు ౩౬. మల్లెల నాగరాజు ౩౭. డా. వెలుదండ సత్యనారాయణ ౩౮. తిరుక్కోవళ్ళూరు శ్రిహర్ష ౩౯. గంగాపురం శ్రీనివాస్ ౪౦. క్రొవ్విడి వేంకట రాజారావు
మొత్తం నలభై మంది కవులు 57 పూరణలను పంపించారు. రేపు ఉదయం వరకు ఇంకెన్ని వస్తాయో?
*******************************
ప్రభాకర శాస్త్రి:
ఇవి కాకుండా బ్లాగులో:
1. రాజేశ్వరి గారు (1) 2. జిలేబి గారు (8) 3. కృష్ణ సూర్య కుమార్ గారు (1) 4. బొగ్గరం ప్రసాద్ గారు (1) 5. డా. పిట్టా సత్యనారాయణ గారు (2) 6. కే. ఆర్. రాజేశ్వర రావు గారు (1) 7. డా. వరలక్ష్మి గారు (1) 8. పోచిరాజు సుబ్బారావు గారు (2) 9. పోచిరాజు కామేశ్వర రావు గారు (2) 10. సొలాస సీతారామయ్య గారు (1) 11. భాగవతుల కృష్ణారావు గారు (1) 12. డా. సీతా దేవి గారు (3) 13. కే. ఆర్. కే. ఆర్. (1) 14. కే. ఈశ్వరప్ప గారు (1) 15.మిస్సన్న గారు (1) 16. గురుమూర్తి ఆచారి గారు (1) 17. మాచవోలు శ్రీధర్ గారు (౧)
రాజులు పోయి కోటలు కూలె ప్రజాస్వామ్యం పరిఢవిల్లె ఎనిమిదొందల తిక్కన వెయ్యేండ్ల నన్నయల కాలము చెల్లె అతిశయోక్తులుగ గాసట బీసట కవి బీరములల్లగన్ నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2685 సమస్య :: *నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్.* నా కవిత్వాన్ని నన్నయ తిక్కన మొదలైనవారు మెచ్చుకొన్నారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం. సందర్భం :: స్వర్గలోకంలో ఉండే *సుధర్మ* అనే పేరుగల దేవసభలో ఒకనాడు వ్యాసమహర్షి తన సంస్కృత భారతాన్ని గుఱించి మాట్లాడుతూ *‘’ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్* నా భారతంలో ఉన్న విషయమే లోకంలో ఉంటుంది. ఇందులో లేనిది మరెక్కడా ఉండదు. వేదసార సంపన్నమైన ఈ భారతం పంచమ వేదమని పిలువబడుతూ ఉన్నది. దీన్ని తెలుగులోనికి అనువదించిన నన్నయ తిక్కన ఎఱ్ఱన నా భారతాన్ని నా కవిత్వాన్ని ఎంతో గొప్పగా ఉందని మెచ్చుకొన్నారు’’ అని విశదీకరించే సందర్భం.
మీరు శంకరార్యులు అనగానే ఆది శంకరులు అనుకున్నాను. అదేమిటి ? బుద్ధుణ్ని పొగుడుతూ కవిత్వం వ్రాసి ఆది శంకరుడికి చూపించట మేమిటి ? వారు తాత్వికంగా ప్రత్యర్థులు కదా ! అని. ఆ తరవాత అర్థమైంది . శంకరయ్యగారని.
సందర్భము: " నిన్న కలలో కనిపించి నన్నయాది పూర్వ కవీంద్రులు నా వెన్నుతట్టి నా కవితను విని మెచ్చుకున్నారు. అంతే కాదు. నే నడుగక ముందే రేపో ఎల్లుండో ఇలలోకి కూడ దిగివచ్చి అందరిముందూ చెబుతాం లే! అనీ అన్నారు. ఇప్పటి కవు లే మంటారో మరి! అసూయ పడుతారో యేమో!" అంటున్నాడు నా శిష్యు డొకడు. (నేను కాదు బాబోయ్!) ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~ నిన్న కలలోనఁ గనిపించి, వెన్నుఁ దట్టి నన్నయాదులు మెచ్చిరి నా కవితను వచ్చెదము రేపొ యెల్లుండొ వసుధపైకి సైత మనిరి; నేటి కవులు సైపగలరొ!
ఎన్నొ పురాణముల్ వసుధ కిచ్చిన వ్యాసుడు సత్యలోకమం దెన్నెను తెన్ గు సత్కవుల తీరుల నీవిధి "యెన్ని భాషలం దెన్నియు లేవు భారతము ! లే కవి సాటి కవిత్రయమ్ముకున్ నన్నయ తిక్కనాదులె ఘనంబని యెంచిరి నా కవిత్వమున్ ! ! (ఎన్ని భారతాలు ఉన్నా తెలుగు కవిత్రయం వారి భారతమంత మనోహరం గా ఉండవని ప్రతీతి. సత్యలోకం లో ఉన్న వేదవ్యాసుడు ఇలా కవిత్రయం వారి భారతాన్ని మెచ్చినట్లు , తన కవిత్వాన్ని నిజం గా గ్రహించి మెచ్చింది నన్నయాదులే అనుకున్నట్లు కల్పన )
అన్న తన కవితల మెచ్చ వ్యాకరణము నేర్వనట్టి కవియొకండు నిబ్బరమున తెలుగు సంస్కృతమ్ముల కల్పి పలికె నిటుల నన్నయాదులు మెచ్చిరి నా కవితను (వ్యాకరణం తెలియని కవి అన్నయ+ఆదులు = అన్నయాదులు అని సవర్ణదీర్ఘసంధి చేశాడు. నన్నయ అనేది పేరు కనుక సవర్ణదీర్ఘసంధి చెయ్యవచ్చు, కానీ అన్నయ కి కుదరదు)
కామేశ్వర రావు గారూ, మొదటి పూరణ ప్రశస్తం! రెండవ పూరణను బాగుందని చెప్పాలా? వదా? సందిగ్ధంలో పడ్డాను. అది మీ వినయాన్ని తెలుపుతున్నా వాణీదేవికి అలంకారాలైన మీ పద్యాలను గురించి న్యూనంగా ఊహించలేము.
నన్నయాదులు మెచ్చిరి నా కవితను నలువ నంబానివలె మార్చె నా భవితను నాకమున నుండి పంపిరి నాకు వనిత ననుచు నూహమాత్రము జేయ నదిరి పోయె ......................✍చక్రి
అన్నయ తిక్కవా డనుచు నాతని గొంచెము జేయ బోకు మా అన్నయ మెచ్చు నా కవిత లద్భుత మంచును దాని విన్న నా కన్నను లేరులే కవులు కాంచగ నం చనిపించు నిక్కమౌ నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్.
అన్నన! యేమి చిత్రమిది యా కల లోపల నేను గన్నదే పున్నమి నాటి వేళ నిటు భూతల మందున వచ్చి నిల్చిరే "నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్" చిన్నగ తట్టి నా భుజము చిన్మయ హాసము లొల్కగా మదిన్!
కలవరము నొందె ఘనుడైన కాళిదాసు
రిప్లయితొలగించండినన్నయాదులు మెచ్చెరి నా కవితను
రామ లింగడు పొగడెను రమ్యగతిని
స్వప్న మందుకాంచితి నేను సంతసముగ
👏👏👏
తొలగించండికృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రాస గీతి :)
రిప్లయితొలగించండి(శ్రీ శ్రీ స్వర్గమునుంచి)
"అన్నమునులేని దీనుల చిన్న తనము
మిన్నునకు నెత్తి చూపుచు మేలు గాను
పున్నెమును కట్టు కొంటిని పుడమి పైన
నన్నయాదులు మెచ్చిరి నా కవితను"
👏👏👏💐💐💐
తొలగించండి
తొలగించండికాదా మరి మరో ప్రపంచం మహాప్రస్థానం !
సెబాసో
జిలేబి
🙏🙏🙏
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ ప్రాసగీతి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిపొద్దనక రాత్రనక రాసి పూరణలను
నలత బడిన కండ్ల నులిమి నాను నిదుర
ముంచు కొచ్చె! 'అయినకల' ! ముద్దు గాను
నన్నయాదులు మెచ్చిరి నా కవితను :)
జిలేబి
👏👏👏
తొలగించండి"కల నిజమాయెగా కోరిక తీరెగా సాటిలేని రీతిగా మదినెంతొ హాయిగా..."
తొలగించండి
తొలగించండి"అయినకల " :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వన్నె లొలికించు కావ్యమ్ము మిన్న యనుచు
రిప్లయితొలగించండినన్న యాదులు మెచ్చిరి , నా కవితను
మెచ్చ వలెనన్న మనమున నిచ్చ లేక
పేల వంబైన రచనలు హేల యనగ
👏👏👏
తొలగించండిఅక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వన్నె లొలుకు భారతమును...' అనండి. 'హేల యనగ'...?
వన్నె లొలుకు భారతమును మిన్న యనుచు
తొలగించండినన్న యాదులు మెచ్చిరి , నా కవితను
మెచ్చ వలెనన్న మనమున నిచ్చ లేక
పేల వంబైన రచనలు హేల యనుచు
రిప్లయితొలగించండికన్నులు బాయె ! పద్యముల కాచిన చారుగ చేసి చేసి ! హా !
మిన్నగ వచ్చె నో,మరియు మీగడకట్టుగ పద్య మాయెనో
దున్నున చిత్తగించి మజ తూగగ గాంచితి నయ్య స్వప్నమున్,
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్!
జిలేబి
తొలగించండికన్నులు బాయె ! పద్యముల కాచిన చారుగ చేసి చేసి ! హా !
మిన్నగ వచ్చె నో,మరియు మీగడకట్టుగ పద్య మాయెనో
దున్నున? చిత్తగించి, మది తూగగ, గాంచితి నయ్య స్వప్నమున్,
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికన్నులు మూయ , స్వప్నమున గన్పడి వ్యాసుడు పల్కె "శబ్దసం...
పన్నత గోరుదేని సురభాషను నేర్వుము ! కల్పభూజమై
నిన్నిల నగ్రగణ్యునిగ నిల్పి యశంబొనగూర్చు ! నమ్మురా !
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్ !!"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
కంది వారు ఎలాగూ మెచ్చుకుంటారనే ధీమా..
తొలగించండిఇప్పటికి శ్రీ చిటితోటి వారు.. శాస్త్రి గారు మెచ్చుకొనుటవలన ఈ పద్యం వచ్చింది... ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు 🙏🙏
సన్నుత శంకరాభరణ సారధి నన్నయ శంకరయ్య , వ్యు....
త్పన్న సుధీవిశాల రసభావుకులౌ చిటితోటి తిక్కనౌ
నెన్నగ , శాస్త్రి పోతనయె యింపు కవిత్వమునన్ , నవీనులౌ
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిமைலவரபு முரளி அவர்களுக்கு
ரொம்ப நல்லா இருக்கு
ஜிலேபி
మైలవరపువారూ! మీరందుకు అర్హులే! నమోనమః! 🙏🙏🙏🙏
తొలగించండి
తొలగించండివ్యాసుడట చెప్పెను జిలేబి భళి భళి భళి
నన్నయాదులు మెచ్చిరి నా కవితను.
మైల వరపయ్య చెప్పగ మన సదనపు
శంకరాదులు మెచ్చిరి చక్క గాను :)
ఈ పోతన శాస్త్రులెవరండీ ?
మన జీపీయెస్ వారే ???? :)
వామ్మో వామ్మో వామ్మో !
జిలేబి
"నేనెరుగ నేనెరుగ..."
తొలగించండిమైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి****
ஜிலேபீ காரூ,
மீரு டமிளஂலோ வ்ராசினடி அர்த்ஂ காலேடு.
****
ప్రభాకర శాస్త్రి గారు... "నేనెరుగ నేనెరుగ మన సారు నడుగు"
నేను ... "ఇంకెవరు ఇంకెవరు మన ప్రభాకరులె"
తొలగించండిఏమండీ మైలవరపు వారు
ఎన్ని మార్లు మేమంతా పొగడ లేదు మిమ్మల్ని కొంత గూడా పొసగ లేదే :)
జిలేబి
🙏🙏🙏
తొలగించండిజిలేబి గారూ:
తొలగించండిమైలవరపు వారి పొగడ్తలు కావాలనుకుంటే వ్హాట్సప్ శంకరాభరణం లో చేరండి. క్రింద చూడండి మీ పూరణలపై ఆశ్చర్య చకితులైన రాజా గారి పొగడ్త 👇
అదంతా వాట్సప్ గ్రూపు మహిమండీ జిలేబిగారూ! మీరూ జాయినైపోండి! పొగడ్తలే పొగడ్తలు! 😀😀😀
తొలగించండిరాజా:
తొలగించండిఈ సంఖ్యలను, పైన శంకరయ్య గారి కూర్పు చూస్తే చాలా ఆనందంగా వుందండి. ఇంత మంచి వాత్సాపు గ్రూపు తెలియక పోయిందే ఇన్నాళ్లు.
ఎనిమిది పద్యాలు ఒకే సమస్యకు రాసిన వాళ్లున్నారంటే ముచ్చట వేస్తున్నది.
ధన్యవాదములు
****************************
ప్రభాకర శాస్త్రి:
జిలేబి గారి ఎనిమిది పద్యములలో ఐదు కందములు, మూడు చంపకములు
🙏
తొలగించండిఅర్థం కాలేదండీ జీపీయెస్ వారు
ఏమిటీ సంఖ్యలు కూర్పు ఎనిమిది పద్యాల లెక్కల్?
జిలేబి
కంది శంకరయ్య (నిన్న రాత్రి):
తొలగించండిఈరోజు ఇప్పటి వరకు పూరణలు పంపినవారి పట్టిక. పేరు ప్రక్కన కుండలీకరణంలో ఉన్న సంఖ్య వారి పూరణలను తెలియజేస్తుంది.
౧. చక్రవర్తి భద్రాచలం (౨)
౨. జి. ప్రభాకర శాస్త్రి (౨)
౩. కె.యల్. నారాయణ
౪. విరించి (౩)
౫. ఆచార్య లక్ష్మణ
౬. మైలవరపు మురళీకృష్ణ
౭. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి
౮. పింగళి పూర్ణచంద్ర రావు
౯. విట్టుబాబు ౨
౧౦. మునిగోటి సుందరరామ శర్మ
౧౧. అంబటి భానుప్రకాశ్
౧౨. సింహాద్రి జ్యోతిర్మయి (౩)
౧౩. కోడూరి శేషఫణి శర్మ
౧౪. గంగుల ధర్మరాజు
౧౫. యం.వి. ప్రసాద రావు
౧౬. కోట రాజశేఖర్
౧౭. చేపూరి శ్రీరామారావు (౨)
౧౮. ఊర ఈశ్వర రెడ్డి (౨)
౧౯. గుండా వేంకట సుబ్బ సహదేవుడు (౩)
౨౦. గుండు మధుసూదన్
౨౧. ఆర్. రాజా
౨౨. గుఱ్ఱం జనార్దన రావు
౨౩. మహేంద్రాడ సింహాచలాచార్య
౨౪. బొగ్గరం ఉమాకాంత ప్రసాద్ (౨)
౨౫. గౌరీభట్ల బాలముకుంద శర్మ (౨)
౨౬. బండకాడి అంజయ్య గౌడ్
౨౭. దరిశి బాలసుబ్రహ్మణ్యం
౨౮. యం.వి.యస్. శాస్త్రి (౨)
౨౯. సంగు గురుచరణ్
౩౦. దాలి నాయుడు
౩౧. డా. విమలరాజు (౨)
౩౨. తురిమెళ్ళ రాధాకృష్ణ మూర్తి (౨)
౩౩. సూర్యారావు
౩౪. శ్యామల (౨)
౩౫. బిట్రా నాగమల్లేశ్వర రావు
౩౬. మల్లెల నాగరాజు
౩౭. డా. వెలుదండ సత్యనారాయణ
౩౮. తిరుక్కోవళ్ళూరు శ్రిహర్ష
౩౯. గంగాపురం శ్రీనివాస్
౪౦. క్రొవ్విడి వేంకట రాజారావు
మొత్తం నలభై మంది కవులు 57 పూరణలను పంపించారు. రేపు ఉదయం వరకు ఇంకెన్ని వస్తాయో?
*******************************
ప్రభాకర శాస్త్రి:
ఇవి కాకుండా బ్లాగులో:
1. రాజేశ్వరి గారు (1)
2. జిలేబి గారు (8)
3. కృష్ణ సూర్య కుమార్ గారు (1)
4. బొగ్గరం ప్రసాద్ గారు (1)
5. డా. పిట్టా సత్యనారాయణ గారు (2)
6. కే. ఆర్. రాజేశ్వర రావు గారు (1)
7. డా. వరలక్ష్మి గారు (1)
8. పోచిరాజు సుబ్బారావు గారు (2)
9. పోచిరాజు కామేశ్వర రావు గారు (2)
10. సొలాస సీతారామయ్య గారు (1)
11. భాగవతుల కృష్ణారావు గారు (1)
12. డా. సీతా దేవి గారు (3)
13. కే. ఆర్. కే. ఆర్. (1)
14. కే. ఈశ్వరప్ప గారు (1)
15.మిస్సన్న గారు (1)
16. గురుమూర్తి ఆచారి గారు (1)
17. మాచవోలు శ్రీధర్ గారు (౧)
తప్పులు క్షమించగలరు
🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిஸ்ரீ கந்தி ஷங்கரககாரா நன்றாக சொன்னார்.
తొలగించండి*** *** ***
శ్రీ కంది శంకరయ్య గారు చాలా బాగా చెప్పారు.
తొలగించండివావ్! బ్లాగులో పదిహేడు మంది వాట్సప్ లో నలభై మంది మొత్తం 57 + 29 = 83 పూరణలు ! అందులో పది శాతం తలకాయ నొప్పి కంది వారికి ఒక్క జిలేబి వల్లనా :) జెకె :)
నెనర్లు.
ఆ రాజా వారికి కూడా నెనర్లు. రాజా అంటే కోట రాజశేఖర్ గారేనా ?
జిలేబి
కాదు మరో కొంగ్రొత్త రాజా భోజ
తొలగించండి
తొలగించండిఓ రాజ భోజ నెనరుల్
మీరే రాజ్యమునకోయి మిన్నగ ప్రభువుల్?
పూరణలన్మెచ్చిరి జో
హారులివి జిలేబివారి హారము గొనుడీ :)
జిలేబి
@ jilebi,
తొలగించండిమీరు కూడా వాట్సాపు కి వెళితే తెలుగు బ్లాగులకు దిక్కెవరు ?
నా కోటా రోజుకు రెండే పూరణలు...ఒకటి సక్రమము, ఒకటి విక్రమము...
తొలగించండిపిన్నలకన్న నెన్నిటనొ పిన్నను నేనొక స్వప్నమందునన్
రిప్లయితొలగించండిమిన్నగ గంటినొక్కటగు మేలిమిబంగరుసన్నివేశమున్ ;
అన్నలవంటి యాంధ్రకవులందరుదీవనజల్లుజల్లుచు
న్నన్నయతిక్కనాదులె ఘనంబనిమెచ్చిరినాకవిత్వమున్
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండిరాజులు పోయి కోటలు కూలె ప్రజాస్వామ్యం
రిప్లయితొలగించండిపరిఢవిల్లె
ఎనిమిదొందల తిక్కన వెయ్యేండ్ల నన్నయల
కాలము చెల్లె
అతిశయోక్తులుగ గాసట బీసట కవి
బీరములల్లగన్
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి
నా కవిత్వమున్
తొలగించండినిన్నటి కాలముల్లివియె? నీ కవితల్ భళిరా భళీ యనన్
మిన్నగ మెచ్చు భూపతులు మెండియముల్నెఱి కొల్పు భూభుజుల్
కన్నడ రాజు లేరి? అహ! గాసట బీసట పద్య మైన నేమయా
నన్నయ తిక్కనాదులె, ఘనంబని, మెచ్చిరి నాకవిత్వమున్ :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిరమేశ్ గారి భావానికి మీ పద్యరూపం బాగున్నది. అభినందనలు.
'నిన్నటి కాల మిట్టులనె' అనండి.
మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
భారతీదేవి మెచ్చగ వ్రాసెనెవరు?
రిప్లయితొలగించండికావ్య రీతుల నేరీతి గణనఁజేసె?
కవి కులంబున దేని చక్కగను పొగడె?
నన్నయాదులు-మెచ్చిరి-నా కవితను.
క్రమాలంకార పూరణ
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వ్రాసి రెవరు" అనండి.
ధన్యవాదములు
తొలగించండికన్నియ మానసం బునను గాఢపు కోర్కెలు పొంగిపో వగా
రిప్లయితొలగించండివన్నెలు చిన్నెలే యుచును పాటల గంధిని తాననం గనే
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి , నా కవిత్వము
న్నెన్నగ లేనివా రలట నేరుగ బల్కిరి భేషుభే షనన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండితనిసి యభినవ శ్రీనాథుడనియె నిట్లు
“నా రసాంచిత పద్య గుణమ్ము లెన్ని
సార మతులైన సత్కవీశ్వరులభినవ
నన్నయాదులు మెచ్చిరి నా కవితను”
విజయకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అభినవ నన్నయాదులు మెచ్చిరి మీ కవితను
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2685
సమస్య :: *నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్.*
నా కవిత్వాన్ని నన్నయ తిక్కన మొదలైనవారు మెచ్చుకొన్నారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
సందర్భం :: స్వర్గలోకంలో ఉండే *సుధర్మ* అనే పేరుగల దేవసభలో ఒకనాడు వ్యాసమహర్షి తన సంస్కృత భారతాన్ని గుఱించి మాట్లాడుతూ *‘’ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్* నా భారతంలో ఉన్న విషయమే లోకంలో ఉంటుంది. ఇందులో లేనిది మరెక్కడా ఉండదు. వేదసార సంపన్నమైన ఈ భారతం పంచమ వేదమని పిలువబడుతూ ఉన్నది. దీన్ని తెలుగులోనికి అనువదించిన నన్నయ తిక్కన ఎఱ్ఱన నా భారతాన్ని నా కవిత్వాన్ని ఎంతో గొప్పగా ఉందని మెచ్చుకొన్నారు’’ అని విశదీకరించే సందర్భం.
మున్నిటు బల్కె వ్యాసముని పూజ్య సుధర్మ సభన్ ‘’మహత్వ సం
పన్నతఁ దెల్గులోన ననువాదము జేయుచు వేద సార సం
పన్నము నాదు భారతమె పంచమ వేద మటంచు భక్తితో
*నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్.’’*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (22-5-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండినేటి సమస్యకు రెండవ పూరణ
తొలగించండినన్నుతియించినా రపర నన్నయ కీర్తిని గన్న వారు, ర
క్తి న్నుతి గూర్చినా రపర తిక్కన పేరున వెల్గువార లే
మన్నను శంకరాభరణ మందలి యాధునికుల్ ప్రసిద్ధులౌ
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.
భారత oబును దె ని గించి వాసి కెక్కి
రిప్లయితొలగించండితెలుగు వారికి మాన్యులై వెలుగలేదె
నన్న యాదు లు ;మెచ్చరి నా కవిత ను
కంది వారలు బ్లాగు లో కాంచి నంత
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండితిన్నదరక్క గట్టితివి తిండియు బట్టయు గూర్చునే యి దే
మన్న ? దుకాణమైన నిడి మజ్జిగ నమ్ముకొ నంగ మేలదే
నన్నయ? తిక్క, నాదులె! ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్,
మిన్నగ నిచ్చటన్ కవులు, మిచ్చెన వేయుచు మీదు బోవగన్!
ஜிலேபி
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నట్టు రెండు మూడు రోజులుగా అజీర్తితో బాధపడుతున్నా సుమా!
తొలగించండిటెలిపతీ అండి టెలిపతీ :) అక్కడ యేమి జరిగినా యిక్కడ తెలిసి పోతా వుంటుంది :) జెకె !
కందివారు
సీరియస్లీ స్పీకింగ్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్
మీ ఆరోగ్యమే మా మహా భాగ్యము :)
చీర్స్
జిలేబి
కన్నులు మూసినంత వెస కమ్మెను కమ్మని నిద్దురందునన్
రిప్లయితొలగించండియెన్నగ వీలుకాని కల లెన్నియొ కంటిని కమ్మనైనవే
చెన్నలరంగ నా దరికి జేరియు నామది సంతసిల్లగన్
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నాకవిత్వమున్.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నిద్ర యందులో । నెన్నగ...' అనండి.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,
ఎన్నగ నాదు పద్యము లికెవ్వరి కర్థము కావు | చచ్చి పై
నున్నటువంటి పూర్వకవు " లుత్తమ మంచు నపూర్వ " మం చహా !
సన్నుతి పైన సన్నతుల సల్పి | రబద్ధము లాడ నెప్పు | డా
నన్నయ తిక్కనాదులె ఘనంబని యెంచిరి నా కవిత్వమున్ ! !
గురుమూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉత్పలమాల
రిప్లయితొలగించండిమొన్ననె శంకరార్యులె యమోఘము పూరణమంచు మెచ్చగన్
గన్నులు మూసి కంటి కల, గారవ మొప్ప సభా సువేదిపై
"నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్! "
దిన్నగ తట్టిలేప సతి తిక్కగ నవ్వితి స్వప్న కాంక్షకున్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తేటగీతి
రిప్లయితొలగించండిబుద్ధ విగ్రహమున్ గాంచి పులకరించి
శంకరార్యుల చెంతను చదివినంత
చెఱువుగట్టుపై నుండంగ శిల్పములుగ
నన్నయాదులు, మెచ్చిరి నా కవితను
మీరు శంకరార్యులు అనగానే ఆది శంకరులు అనుకున్నాను. అదేమిటి ? బుద్ధుణ్ని పొగుడుతూ కవిత్వం వ్రాసి ఆది శంకరుడికి చూపించట మేమిటి ? వారు తాత్వికంగా ప్రత్యర్థులు కదా ! అని. ఆ తరవాత అర్థమైంది . శంకరయ్యగారని.
తొలగించండిఆర్యా!నమస్కారం. ట్యాంక్ బండ్ పైన గురుదేవులకు కవిత వినిపించిన వాతావరణం పద్యంలో తొణికిసలాడిందా లేదా?
తొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅన్నదమ్ముల వైషమ్య మాంధ్రమునను
తొలగించండిమన్ననలు బొంద విబుధుల మదిని దోచి
చెన్ను మీరగ వ్రాసిరి చేవజూపి
నన్నయాదులు; మెచ్చిరి నా కవితను
పిన్నతండ్రియె కరుణను ప్రేమమీర!
మా పినతండ్రి శ్రీ భట్టారం రాధాకృష్ణయ్య గారికి అభివందనములతో!
🙏🙏🙏🙏
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏🙏
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
*"నన్నయాదులు మెచ్చిరి నా కవితను"*
సందర్భము: " నిన్న కలలో కనిపించి నన్నయాది పూర్వ కవీంద్రులు నా వెన్నుతట్టి నా కవితను విని మెచ్చుకున్నారు.
అంతే కాదు. నే నడుగక ముందే రేపో ఎల్లుండో ఇలలోకి కూడ దిగివచ్చి అందరిముందూ చెబుతాం లే! అనీ అన్నారు.
ఇప్పటి కవు లే మంటారో మరి! అసూయ పడుతారో యేమో!"
అంటున్నాడు నా శిష్యు డొకడు.
(నేను కాదు బాబోయ్!)
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
నిన్న కలలోనఁ గనిపించి, వెన్నుఁ దట్టి
నన్నయాదులు మెచ్చిరి నా కవితను
వచ్చెదము రేపొ యెల్లుండొ వసుధపైకి
సైత మనిరి; నేటి కవులు సైపగలరొ!
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్యకవులున్న వేదిక పైన నాదు
రిప్లయితొలగించండికవిత చెల్ల, దా కవులకు కవులనంగ
నన్నయాదులు, మెచ్చిరి నా కవితను
వచనకవిసమూహమ్మున్న ప్రాంగణమున
ధనికొండ వారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్వప్న మందున జదువగ బద్యములను
రిప్లయితొలగించండినన్నయాదులు మెచ్చిరి నాకవితను
బాగు బాగుగ నున్నవి భావములును
ననుచు నాశీర్వదించిరి యార్య! నన్ను
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపద్యపు గరిమన్ పెంచిరి వాసిగాను
నన్నయాదులు,మెచ్చిరి నాకవితను
శంకరాభరణమునందు సత్కవులును
ముదమదియుహెచ్చె మదికిట ముచ్చటగను/ముచ్చటయ్యె
🌹
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎన్నొ పురాణముల్ వసుధ కిచ్చిన వ్యాసుడు సత్యలోకమం
రిప్లయితొలగించండిదెన్నెను తెన్ గు సత్కవుల తీరుల నీవిధి "యెన్ని భాషలం
దెన్నియు లేవు భారతము ! లే కవి సాటి కవిత్రయమ్ముకున్
నన్నయ తిక్కనాదులె ఘనంబని యెంచిరి నా కవిత్వమున్ ! !
(ఎన్ని భారతాలు ఉన్నా తెలుగు కవిత్రయం వారి భారతమంత మనోహరం గా ఉండవని ప్రతీతి. సత్యలోకం లో ఉన్న వేదవ్యాసుడు ఇలా కవిత్రయం వారి భారతాన్ని మెచ్చినట్లు , తన కవిత్వాన్ని నిజం గా గ్రహించి మెచ్చింది నన్నయాదులే అనుకున్నట్లు కల్పన )
ధనికొండ వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కవిత్రయమ్మునకున్' అనడం సాధువు కదా? అక్కడ "కవిత్రయానికిన్" అంటే సరి!
డా.పిట్టా సత్యనారాయణ
తొలగించండిఅన్న,యిదియేమి జ్వాలయు నగ్ని గాదె
అగ్ని జల యని వ్రాసితి వదియ తగునె?...ప్రశ్న
రూపకము నవ్య కవితల రొదనభినవ
నన్నయాదులు మెచ్చిరి నాదు కవిత(వచన గేయకవిత)!ప్రగల్భ పూర్వక సమాధానము)
డా.పిట్టానుండిఆర్యా,"నా కవితను" సమస్యా పాదంలో సాధువు
తొలగించండిదివికి జేరిన ఘనకవి దిగ్గజమ్ము
రిప్లయితొలగించండివిశ్వనాథ సుకవియును విమల మతుడు
నిలగల విమర్శకుల జూచి యిట్టులనియె
"నన్నయాదులు మెచ్చిరి నాకవితను."
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్న తన కవితల మెచ్చ వ్యాకరణము
రిప్లయితొలగించండినేర్వనట్టి కవియొకండు నిబ్బరమున
తెలుగు సంస్కృతమ్ముల కల్పి పలికె నిటుల
నన్నయాదులు మెచ్చిరి నా కవితను
(వ్యాకరణం తెలియని కవి అన్నయ+ఆదులు = అన్నయాదులు అని సవర్ణదీర్ఘసంధి చేశాడు. నన్నయ అనేది పేరు కనుక సవర్ణదీర్ఘసంధి చెయ్యవచ్చు, కానీ అన్నయ కి కుదరదు)
ధనికొండ వారూ,
తొలగించండిమీ తాజా పూరణ వైవిధ్యంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[నన్నయ కన్న మున్నుగఁ దెలుఁగున "జినేంద్ర పురాణము"ను రచించి, కన్నడ దేశమునకుం జని, యెన్నియో కన్నడ గ్రంథములను వెలయించి, వెలుఁగొందిన బోధను వాసియగు పంపకవి, తనను గుఱించి స్వర్గవాసులకుఁ దెలియఁజేయుచున్న సందర్భము]
"నన్నయ కన్న మున్నుగఁ గనంగను జక్కని కావ్యకర్తనై
యెన్నికఁ గన్న పంపఁడను! నిచ్చటె తెన్గునఁ గన్నడంబునన్
దిన్నని కైత వ్రాసితిని! తీరెను స్వప్నము! తెల్గు వారలౌ
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్!"
మధుసూదన్ గారూ,
తొలగించండిపంపకవి ప్రస్తావనతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండి
రిప్లయితొలగించండిరమేశు గారి భావమునకు :(
నిన్నటి కాలముల్లివియె? నీ కవితల్ భళిరా భళీ యనన్
మిన్నగ మెచ్చు భూపతులు మెండియముల్నెఱి కొల్పు భూభుజుల్
కన్నడ రాజు లేరి? అహ! గాసట బీసట పద్య మైన నేమయా
నన్నయ తిక్కనాదులె, ఘనంబని, మెచ్చిరి నాకవిత్వమున్ :)
జిలేబి
తొలగించండినిన్నటి కాలముల్లివియె? నీ కవితల్ భళిరా భళీ యనన్
మిన్నగ మెచ్చు భూపతులు మెండియముల్నెఱి కొల్పు భూభుజుల్
కన్నడ రాజు లేరి? అహ! గాసట బీసట యైన నేమయా
నన్నయ తిక్కనాదులె, ఘనంబని, మెచ్చిరి నాకవిత్వము
న్నెన్నుచు కబ్బమేదియు మనీషులు గానక నో కవీశ్వరా :)
జిలేబి
పైన ప్రకటించారు కదా?!
తొలగించండివ్యాసుని విరచితమ్మగు భారతమును
రిప్లయితొలగించండినన్నయాదులు మెచ్చిరి, నా కవితను
చదివి సూచనల గురువు సలుపుచుండు
శంక రాభరణము నందు చక్కగాను
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిన్నగ కవిత నేజెప్ప మిక్కిలేగ
రిప్లయితొలగించండితిన్నగ పదము వ్రాయనే తిక్కనేగ
కన్నుల నగవున ననరే కన్నుగీటి
నన్నయాదులు; మెచ్చిరి నా కవితను !!
వరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మిక్కిలేగ'...?
నన్నయ కంటెముందుగను నాచనసోమునిగారచించగ
రిప్లయితొలగించండిన్నన్నువతోబఠించియవి యాదరమొప్పగ బల్కిరప్పుడీ
నన్నయతిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నాకవిత్వము
న్మిన్నగు పండితుల్బలుక మేదురమందునభాగ్యమేకదా
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భాజన తెలిపిరిగ మహాభారతమున
రిప్లయితొలగించండినన్నయాదులు ; మెచ్చిరి నాకవితను
శంకరాదులు శతకము జతపరచగ
భామలంత మెచ్చిరి జడభారతమును
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాత్రము యశస్కరమ్మని మిత్రు లెల్ల
రిప్లయితొలగించండిసరస రుచిరార్థ గుంభన శబ్ద భావ
వైభవమ్మున జ్ఞప్తికి వచ్చి రంచు
నన్నయాదులు మెచ్చిరి నా కవితను
పన్నుగ భారత మ్మరసి పండితు లెల్లరు హర్ష చిత్తులై
యెన్నఁగ శబ్ద సౌరభము నిద్ధర వ్రాయఁగ నేర్చి రివ్విధిన్
నన్నయ తిక్కనాదులె ఘనం బని మెచ్చిరి, నా కవిత్వముం
గ్రన్ననఁ గాంచి చిత్తమునఁ గందిరి దుర్గతి పట్ట వాణికిన్
పూజ్యులు కామేశ్వరరావుగారూ! మీ మొదటి పద్యమే సరియైనదండీ! 🙏🙏🙏🙏
తొలగించండిడా. సీతా దేవి గారు మీ యభిమానమునకు కృతజ్ఞుఁడను
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిమొదటి పూరణ ప్రశస్తం!
రెండవ పూరణను బాగుందని చెప్పాలా? వదా? సందిగ్ధంలో పడ్డాను. అది మీ వినయాన్ని తెలుపుతున్నా వాణీదేవికి అలంకారాలైన మీ పద్యాలను గురించి న్యూనంగా ఊహించలేము.
నేటి శంకరాభరణం సమస్య
రిప్లయితొలగించండినన్నయతిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నాకవిత్వమున్.
నా పూరణ.
సన్నుతసత్కవీశసరసార్ద్రరసధ్వనిమాధురీప్రభా
వోన్నతభవ్యనవ్యకథనోర్జితనిర్భరకావ్యతత్త్వసం
పన్నత మెత్తురట్లు, వినుమా! యకవిత్వమ నాదృతంబునౌ,
నన్నయతిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నాకవిత్వమున్.
"న + అకవిత్వము = నాకవిత్వము"
"నాకవిత్వ మధర్మాయ
దండనాయ మృతాయచ
కుకవిత్వ మధర్మాయ
దండనాయ మృతాయ చ"
అప్పకవీయము.
అద్భుతంగా ఉందండీ, న అకవిత్వము !🙏🙏🙏🙏
తొలగించండిరామచార్య గారూ,
తొలగించండిమనోహరమైన పూరణ మీది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికన్నులు మూసి తల్పమున గాఢ సుషుప్తిని చెందు వేళలో
రిప్లయితొలగించండినెన్నియొ తీపి కోరికలు యింపుగ నుల్లము నందు భాసిలన్
వన్నెల స్వప్నమందు నను వ్రాసితి నెన్నొ ప్రబంధ రాజముల్
నన్నయ తిక్కనాదులె మనంబున మెచ్చిరి నా కవిత్వమున్
నన్నయాదులు మెచ్చిరి నాదు కవిత
రిప్లయితొలగించండిలిన్నరులు మాత్ర మిట్టుల నెన్ను చుండె
తప్పు యొప్పులనిదియేమిదారుణమ్ము
యనుచు తలపోసె నొక్కండు మనమునందు
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పన్నుగ వ్రాసినా డనుచు పంప కవీంద్రుని కైతలన్ ధృతిన్
రిప్లయితొలగించండినన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి, నా కవిత్వమున్
సన్నుతి చేసె నొజ్జయని సంతసమొందెను విశ్వనాథ తా
నెన్నుచు తప్పులన్ గురువునే శపియించుచు నుండ్రి నేడిలన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య :-
రిప్లయితొలగించండి"నన్నయాదులు మెచ్చిరి నా కవితను"
*తే.గీ**
నన్నయాదులు మెచ్చిరి నా కవితను
నలువ నంబానివలె మార్చె నా భవితను
నాకమున నుండి పంపిరి నాకు వనిత
ననుచు నూహమాత్రము జేయ నదిరి పోయె
......................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉన్నతమైన సత్కవులయూహలకందినభావబంధముల్
రిప్లయితొలగించండినిన్నటివన్న?కాదనిరి నేటికినూటికి ధర్మబద్దమై
నన్నయ తిక్కనాదులెఘనంబని!"మెచ్చిరినాకవిత్వమున్
అన్నయు,తమ్ము,డక్క,చెలియందరుజెప్పగవింటినిన్ననే"
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్వర్గలోకంలో కొలువు దీరిన దేవేంద్ర సభలో కవి సమ్మేళనము జరుగుచుండగా, ఫాల్కురికి వారు సభామర్యాదను పాటిస్తూ తమ పరిచయం చేసుకొనుచున్నారు
రిప్లయితొలగించండితెలుగు భాషను వ్రాసితిఁ దెగువ జూపి
రచన జేసితిఁ దొలుతనె రగడ పల్కి
"నన్నయాదులు మెచ్చిరి నా కవితను"
ఫాల్కురికి సోమనాథుడఁ బరమ పురుష
గ.: రగడ ఛందస్సు సృష్టికర్త ఫాల్కురికి వారే గదా!
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండిపన్నుగ కల్పవృక్షమను భాసురమందెడి రామగాథనే
మన్నన బొందగాజనుల మక్కువ మీరను వ్రాయగా నహో!
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి; నాకవిత్వమున్
చిన్నగ జూచిరే! యిలనిసీ! సమకాలికులేల మెత్తురే!
కవిసామ్రాట్ విశ్వనాధవారి భావమగా నా భావన! 🙏🙏🙏
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యోస్మి గురుదేవా!🙏🙏🙏🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి[స్వర్గమందు కాళిదాసాదులకుం దననుఁ గూర్చి వాల్మీకి తెలుపుచున్న సందర్భము]
రిప్లయితొలగించండి[2]
మున్ను రామాయణమ్మును సన్నుతించి,
నన్ను వాల్మీకినిం బ్రార్థనమ్ము సేసి,
వారి గ్రంథాల నా కథఁ బ్రచురపఱచి,
నన్నయాదులు మెచ్చిరి నా కవితను!
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(నేను సేతును ఫోను కైతను)
తన్నుకొ వ్రాయుచుండురట తాళము గంటము బొగ్గుటింకుతో
పన్నుగ జాలముండగను వైఫయి గూగులు భారతమ్మతో
మిన్నగ ఫోనుమీదనిట మీటి లిఖెంచెడి నన్నుజూడగా
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్
తన్నుకొ = తన్నుకొ (ని)
భారతమ్మ = ఆంధ్రభారతి
అట = స్వర్గము = అంతర్జాలము, ఫోను, లేని చోటు
ఇట = నరకము
👌👌👌🙏🙏🙏💐💐💐
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నేటి సమస్యకు రెండవ పూరణ
రిప్లయితొలగించండినన్నుతియించినా రపర నన్నయ కీర్తిని గన్న వారు, ర
క్తి న్నుతి గూర్చినా రపర తిక్కన పేరున వెల్గువార లే
మన్నను శంకరాభరణ మందలి యాధునికుల్ ప్రసిద్ధులౌ
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండి21వ శతాబ్దములో మళ్లీ పుట్టిన వ్యాస మహర్షి ఉవాచ:
ఎన్న విదేశి సాహితిని నెక్కడలేని కథా వితానముల్
మన్నన జేసి శృంఖలల మార్చియు, మార్చి ప్రబంధ కల్పనల్
తిన్నగ విశ్వపుం గవులు తీరిచి దిద్దిరి శిష్ట శైలినిన్;
నన్నయ తిక్కనాదులె ఘనంబుగ మెచ్చిరి నా కవిత్వమున్!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివ్యాస రచనలు వాచించి వాసి మీఱ
నన్నయాదులు మెచ్చిరి; నా కవితను
విన్న గురు శంకరులనిరి చిన్ని చిన్ని
లలిత పదముల నీకూర్పు రమ్య మనుచు
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపూర్వ కవుల వేషముల పూనుచుండి
నాటకమ్ము నాడెడువేళ నాణ్యమైన
పవిది పద్యములను నేను పలుకు చుండ
నన్నయాదులు మెచ్చిరి నాకవితను
రాజారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రిప్లయితొలగించండి😥😥శాంతి విలాపం...😥😥
(నాకు నిన్న వచ్చిన కల ఏమిటంటే...)
తే.గీ.
జీపి శాస్త్రి జిలేబీల నైపుణమును
నన్నయాదులు మెచ్చిరి, నాకవితను
గాంచి నన్నయాదులు నీసడించిరి నను;
కంది కవి విశారద కూడ కసురుకొనెను
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘ వనపర్తి ☘
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినెనరుల్స్- శాంతి భూషణ్ గారు జీపి కున్ను నైపు కున్ను యతి కుదురుతుందని తెలియ జెప్పేరు :)
జిలేబి
ఇంతకు కుద్దిరిందా.. కుద్దరలేదంటారా?
తొలగించండిజిలేబీ గారూ...
ఇంతకు కుద్దిరిందా.. కుద్దరలేదంటారా?
తొలగించండిజిలేబీ గారూ...
అన్నయ తిక్కవా డనుచు నాతని గొంచెము జేయ బోకు మా
రిప్లయితొలగించండిఅన్నయ మెచ్చు నా కవిత లద్భుత మంచును దాని విన్న నా
కన్నను లేరులే కవులు కాంచగ నం చనిపించు నిక్కమౌ
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆంధ్ర భారత మాదిగా ననఘమైన
రిప్లయితొలగించండిమేటి కావ్యాలనిచ్చిరే నాటి కవులు
నన్నయాదులు, మెచ్చిరి నా కవితలు
పండితాగ్రగణ్యులిలను వాసిగాను.
కీ.శే. డా. సినారె గారి మాటగా......
రిప్లయితొలగించండితెలుగు నేలయె మురిసెడు తేనె లొలుకు
కైత లెన్నియొ చెప్పితి గాదె నాడు
స్వర్గ మందు నా గజలుల స్వాగతించి
నన్నయాదులు మెచ్చిరి నా కవితను.
కన్నియ యందచందముల గన్నుల కట్టిన రీతి కైతలన్
రిప్లయితొలగించండిమిన్నగ వ్రాసినన్ జనులు మెచ్చని వేళన శోకమూర్తినై
కన్నులు మూసి నిద్రఁ జని గాంచితి కమ్మని స్వప్నమొక్కటిన్
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నాకవిత్వమున్.
విరించి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అన్నన! యేమి చిత్రమిది యా కల లోపల నేను గన్నదే
రిప్లయితొలగించండిపున్నమి నాటి వేళ నిటు భూతల మందున వచ్చి నిల్చిరే
"నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్"
చిన్నగ తట్టి నా భుజము చిన్మయ హాసము లొల్కగా మదిన్!
ఏమిటో!! పగటికలలు తప్ప వేరు మార్గమే కనిపించలేదు
😊
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిరెండవపూరణ
నన్నయాదులు మెచ్చిరి నాకవితల
టంచు సుకవులెల్లరిచట ననుచుండ
మాదు పుణ్యఫలము వల్ల మంచి కవిత
లను చదివెడి భాగ్యము లభ్యమయ్యె.
మూడవ పూరణ
నిన్ననె వింటి నేసభను నెన్న మహోన్నతు లన్నచో భువిన్
నన్నయ తిక్కనాదులె ఘనంబని ,మెచ్చిరి నా కవిత్వమున్
పిన్నలు పెద్దలాదిగను భేషను వాక్కుల తోడనిచ్చట
న్నెన్నగ నాదుమానసము నిక్కముగా నిట పొంగి పోయెగా.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండవ, మూడవ పూరణలు బాగున్నవి. అభినందనలు.
క్రీడి పోరి నాచేతిలో నోడిపోయె
రిప్లయితొలగించండిమేటి మరుని యందమున నే మించి పోతి
నన్నయాదులు మెచ్చిరి నాకవితల
వినుమనెను పిట్టల దొరయె విఱ్ఱవీగి
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎన్నియొ మేటి గ్రంథముల నింపుగ వ్రాసి సభాముఖమ్మునన్
రిప్లయితొలగించండిమన్నన లందుకున్న యసమాన్యులు మేటి కవీంద్రులే కదా
నన్నయ తిక్కనాదులు, ఘనంబని మెచ్చిరి నాకవిత్వమున్
బిన్నలు పెద్దలెల్లరులు ప్రేమను జూపుచు నాదరించిరే.
విరించి గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
నన్నయాదులు మెచ్చిరి నా కవితను
సందర్భము: నన్నయ తిక్కనలు ఒకసారి తమ వారసులను చూచిపోదా మని సశరీరులై భూమిమీదకు దిగివచ్చారు. నేరుగా మా యింటికే వచ్చారు.
అప్పుడు మా నడుమ సంభాషణ మిలా కొనసాగింది.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
నన్నయ్య తిక్కనల్ నా మీది ప్రేమతో
నా యింటికే వచ్చినా రొకపుడు..
"నాయనా!ఎఱుగవే!నన్ను నన్నయ యందు
రీయన తిక్కన్న.. యిల దిగితిమి..
మా కవి వారసు ల్మహనీయు, లెటు లుండి
నారొ! చూడగ వచ్చినార" మనిరి
శాలువల్ జ్ఞాపికల్ సర్టిఫికేటులు
మరియు ఫోటోలు పేపరు కటింగ్సు
పాటించి చూచి సంబరపడిపోయిరి
"మా కాలమున లేవు మచ్చుకైన
మేలైన కవు లహో! మీర లెంతటి వారొ!"
యన "మ రే మనుకొంటి?" రంటి నేను..
"నంతయు నెవిడెన్సె యాధునిక యుగాన..
సుంత మీ యపు డేది సూరులార!
మీ రూపు రేకలే మే మెఱుంగ మయితి,
మిదె నాదు ఫోటో లి వెన్నొ! చూడు"
డంటి.."వాస్తవమే కదండి!ఎదిగినారు
మీర లెంతో "యంచు మెచ్చినారు
"ఆహ! పేపరులలో నన్నింటను బ్రసిద్ధ
కవు లంచు మిము వ్రాయ గంటి" మనిరి
"దిన పత్రికలలోన ధన మిచ్చినను జాలు..
గొప్ప కవు లని పేర్కొందు" రంటి..
"నంత సౌకర్యమా!" యని నోరు తెఱచిరి..
నే "నౌను మరి!" యంటి నిమ్మళముగ..
"భారతమును బఠించితివా!" యనంగ
"బాల్యమున బాఠ్య భాగాలఁ బఠన" మంటి..
లేచెఁ దిక్కన్న, నన్నయ్య లేచె.. నటుల
నన్నయాదులు మెచ్చిరి నా కవితను..
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
కన్నులు నొవ్వగా కనగ కావ్యపు బూజులు నాంధ్రభాషనున్
రిప్లయితొలగించండిపున్నమి రాత్రి నేనిటను పూరణ జేసిన కైపదమ్ములన్
పన్నుగ చూచి చద్వగను భళ్ళున నవ్వుచు స్వర్గవాసులై
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్