19, మే 2018, శనివారం

సమస్య - 2682 (దూరమున నుంచ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"దూరమున నుంచగఁ దగదు  ధూర్తజనుల"
(లేదా...)
"దూరముగాఁ జరింపకుఁడు ధూర్తుల కుత్తములం ద్యజింపుఁడీ" 

113 కామెంట్‌లు:

  1. రిప్లయిలు

    1. ప్రొద్దుటి కంద రసమయ కావ్యపు ప్రాక్టీసు ఎఫెక్టయి వుంటుంది :)

      జిలేబి

      తొలగించండి
    2. పోనిద్దురూ...ముసలాడిని...

      🙏🙏🙏

      తొలగించండి


    3. :)

      ఏమండీ జీపీయెస్ వారు ఆకాశవాణి విశేషంబులేమిటి ?

      తొలగించండి
    4. తొందర పడకండి...కొద్ది సేపటిలో సారే చెబుతారు మీకు నచ్చినట్లుగా... :)

      తొలగించండి


  2. మరో ప్రభంజనం వస్తోందా ?


    భారమును నెత్తి కెత్తితి వయ్య! మోడి!
    శిష్టులను నీదు సభలోన చిరు వడియును
    దూరమున నుంచగఁ దగదు ; ధూర్తజనుల
    కెడవు నన్బెట్టవలయును కీడు బోవ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      సమకాలీనాంశంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. కపట బుద్ధిని గలిగిన చపల మైత్రి
    హాని కలిగించు ననియెంచి లేని పోని
    దూరమున నుంచగఁ , దగదు ధూర్త జనుల
    బరువు బాధ్యత లనుపంచి బాధ పడక

    రిప్లయితొలగించండి
  4. కర్ణాటకం...

    " బేరములాడుడీ ! పదవి, విత్తమునిచ్చెదమంచు , చాలునై..
    దారుగురైన , వీరు మనకందెడి వారె స్వతంత్రులిర్వురున్ !
    దారి యిదే " యటంచు తనదైన విధానము దెల్పె యెడ్డిటుల్
    దూరముగాఁ జరింపకుఁడు ధూర్తులకు ., త్తములం ద్యజింపుమా !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిమైలవరపు వారి పూరణ

    రిప్లయితొలగించండి
  5. సజ్జనుల,గురువరులను శాంతియుతుల,
    దూరముగ నుంచగఁదగదు; ధూర్త జనుల
    ముష్కరుల,తస్కరుల,పలు మోసగాండ్ర,
    నమ్మి చేరంగ రాదు!ప్రాణాంతకులను!!

    రిప్లయితొలగించండి


  6. వీరుడ వయ్య మోడి! భళి వీడకు సాహసమున్! జనాళికిన్
    దూరముగాఁ జరింపకుఁడు ;ధూర్తుల కుత్తములం ద్యజింపు,మా
    నా,రవణంబు గాదయ వినాశము కాగల దయ్య ప్రోదియున్!
    చోరుల చేత నివ్వకయ చూకురు తప్పదు కీర్తి బోవునే!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధూర్తుల కుత్తములం ద్యజింపు'...?

      తొలగించండి

    2. ధూర్తుల కుత్తములం ద్యజింపు మానా రవణంబు గాదయ !

      ధూర్తుల కొరకై ఉత్తముల త్యజింపు మానా (విధము, నమూనా ) శోభిల్లదు.

      సరియేనాండీ కందివారు ?


      జిలేబి

      తొలగించండి
  7. మంచి వాడినొదిలిన తండ్రి చెడు వానికై తానుగ
    యోచించు
    సూక్ష్మగ్రాహినదె చూడక గురువు మందమతికై
    ఆలోచించు
    కొలుచు భక్తుడిని కాదని తులనాడు దుష్టుడిని
    తానై బ్రోచెడి
    దూరముగా జరింపకుడు ధూర్తుల కుత్తములం
    ద్యజింపుడీ

    రిప్లయితొలగించండి
  8. (సమర్థ రామదాసస్వామి శివాజీతో )
    ఛత్ర పతివైన శిష్యుండ ! సజ్జనులను
    దూరమున నుంచగ దగదు ; ధూర్తజనుల
    బారదరుముము ; పాలన పరిమళించు ;
    జిజియ సాక్షిగ నీకింక విజయమయ్య!

    రిప్లయితొలగించండి
  9. మంచి జరుగదు లోకాన మాన్యులౌచు
    హితము గోరె డు వారల సతము మరచి
    దూరము న నుంచగ ;ద గ దు ధూర్త జనుల
    మైత్రి సల్పు ట దె న్న డీ ధాత్రి యందు

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టాసత్యనారాయణ
    కుక్కతోబొక్క దోడించు కొనెడు నీతి
    నందుకొనలేదె భూముల నట్టి వెట్ట?
    ఆ నయీం జచ్చె నాస్తుల హాయి గూర్చి
    దూరమున నుంచగ దగదు ధూర్త జనుల

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టాసత్యనారాయణ
    కూరను నుప్పులేని గతి గూరి తటస్థులు గారె యుత్తముల్
    నేరము దుష్ట చర్యలను నిన్ గను వారు గదయ్య దుర్జనుల్
    భారత (మహాభారతం)మంత నా ఖలులప్రక్కనె యుత్తములుండ "గారె"యై
    చేరదె స్వచ్ఛపుం శనగ చేదగు బియ్యపు బిండి లేనిదే
    దూరముగా జరింపకుడు ధూర్తుల,కుత్తములన్ ద్యజింపుడీ!

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2682
    *దూరముగాఁ జరింపకుఁడు ధూర్తుల కుత్తములం ద్యజింపుడీ.*
    చెడ్డవారికి దూరంగా ఉండొద్దు. మంచివాళ్లతో సహవాసం చెయ్యొద్దు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం ::
    త్యజ దుర్జన సంసర్గం
    భజ సాధుసమాగమమ్ ।
    కురు పుణ్య మహోరాత్రం
    స్మర నిత్య మనిత్యతామ్ ।। అని శాస్త్రములు చెబుతున్నాయి కాబట్టి అందరూ విష్ణువును ఆశ్రయించాలి అని ప్రహ్లాదుడు తండ్రికి బోధ చేయడం మొదలుపెట్టినాడు. అప్పుడు రాక్షసరాజైన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడు మొదలైన కుమారులను జూచి సదుపదేశం చేయకుండా (సురలం ద్రోలుటయో సురాధిపతులం స్రుక్కించుటో .....అని అంటూ) ధూర్తులతో సహవాసం చేయండి, ఉత్తములతో సహవాసమును వదలివేయండి అని తనదైన శైలిలో దురుపదేశం చేసే సందర్భం.

    ‘’దూరముగా చరింపు డిల దుర్జన సంగతికిన్, భజింపగన్
    చేరుడు సాధుసంతతిని, చేయుడు పుణ్యములన్, స్మరింపుడీ
    మీర లనిత్యనిత్యముల మేలగు’’ నంచు వచింపకుండ, దే
    వారి హిరణ్యకశ్యప దురాత్ముడు బోధ నొనర్చె నిట్టులన్
    *’’దూరముగాఁ జరింపకుఁడు ధూర్తుల కుత్తములం ద్యజింపుడీ.’’*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (19-5-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేటి సమస్యకు రెండవ పూరణ

      చేరుచు నుందు రుత్తములు శీఘ్రముగా మిము ధర్మవర్తులై,
      దూరముగా చరించెదరు ధూర్తు లధర్మ పథానువర్తులై,
      కూరిమి దుష్టులన్ గనగ గోరుచు దేవతలార! సర్వదా
      దూరముగా జరింపకుడు ధూర్తుల కుత్తములం ద్యజింపుడీ.
      కోట రాజశేఖర్

      తొలగించండి
    2. రాజశేఖర్ గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      హిరణ్యకశిపుని దృష్టిలో విష్ణుభక్తులు ధూర్తులు, రాక్షసులు ఉత్తములు కదా! మొదటి పూరణలో అన్వయం?

      తొలగించండి
    3. కోటవారి పూరణ మద్భుతము! అభినందనలు!

      నామ సాధుత్వము...హిరణ్యకశ్యపుడా...హిరణ్యకశిపుడా...[కోట వారి మొదటి పూరణమందు]

      తొలగించండి
    4. గురువర్యులగు శ్రీ కంది శంకరయ్య గారూ! ప్రణామాలండీ. మీకు వచ్చిన సందేహం సరియైనదేనండీ. మీరన్నది నిజమేనండీ. హిరణ్యకశ్యపుని దృష్టిలో రాక్షసులు ధూర్తులు కారు. విష్ణుద్వేషులు ఉత్తములు. అందువలన నా పద్యంలో అన్వయం సరిగా లేదని తెలిసికొన్నానండీ. నా పొరపాటును తెలియజెప్పి సద్విమర్శ చేసినందులకు తమరికి భక్తిపూర్వక ప్రణామాలు.
      అన్వయం సరిగా ఉండేటట్లు ఈరోజు రెండవ పూరణను ఉదయం 9.20 కి పంపినానండీ. మీ ఆశీస్సులు కోరుతూ
      భవదీయుడు కోట రాజశేఖర్.

      తొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సభను నవమానముల..' అనండి. దుర్యోదన చెలిమి... దుష్టసమాసం. "కర్ణ దుర్యోధనుల మైత్రి" అనండి.

      తొలగించండి
  14. తే.గీ.
    బలము లేకున్న నధికార బాధ్యతలను
    కోరుచుందురేలనొకద ! కుర్చినిపుడు
    ప్రజల పాలన యందున ప్రస్తుతంబు
    దూరమున నుంచగ దగదు ధూర్తజనుల

    రిప్లయితొలగించండి
  15. పాపులకు జూడ తగుశిక్ష పడిన గాని
    మార్పు రాదుగా నేటి సమాజమందు
    పాలకులగు వారలు చెఱసాలలకును
    దూరమున నుంచగ దగదు ధూర్త జనుల

    రిప్లయితొలగించండి


  16. ఏమండీ జీపీయెస్ వారు ఆకాశవాణి విశేషంబులేమిటి ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తొందర పడకండి...కొద్ది సేపటిలో సారే చెబుతారు మీకు నచ్చినట్లుగా... :)

      తొలగించండి
  17. మాయ మాటల చేతను మభ్యపెట్టి
    మంచి వారిని నెన్నడు మనకు కాక
    దూరమున నుంచగ దగదు,ధూర్త జనుల
    తోడి నెయ్యముగలిగించు గీడు మనకు

    రిప్లయితొలగించండి
  18. నేటి సమస్యకు రెండవ పూరణ

    చేరుచు నుందు రుత్తములు శీఘ్రముగా మిము ధర్మవర్తులై,
    దూరముగా చరించెదరు ధూర్తు లధర్మ పథానువర్తులై,
    కూరిమి దుష్టులన్ గనగ గోరుచు దేవతలార! సర్వదా
    దూరముగా జరింపకుడు ధూర్తుల కుత్తములం ద్యజింపుడీ.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.

    రిప్లయితొలగించండి


  19. దూరమున నుంచగ దగదు ధూర్తజనుల
    నెప్పు డైనను! మనపక్కనే నిడుకొన
    వలెను నొకకన్ను వేసి గవనము సల్ప
    వలె జిలేబి, వారిని దొక్కు పాగెమదియె:)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. తేటగీతి
    అవసరార్థము వారల యండవలయు
    మిత్రుడగువాడు రేపటి మేడిపండు
    దూరముగ నుంచగఁ దగదు ధూర్తజనుల
    పనస పండంటి వారలు పదవి నంద!

    రిప్లయితొలగించండి
  21. జనపదములనందెల్ల ప్రజాప్రభుతను
    తాండవింప జేయుటకయి దండనలకు
    దూరమున నుంచగ దగదు ధూర్తజనుల
    నెన్నికలన నోడించుటయే సొబబగు

    రిప్లయితొలగించండి
  22. ఈరోజు రేడియోలో సమస్యాపూరణ కార్యక్రమాన్ని విన్నాను.
    మొత్తం 15 పద్యాలు చదివారు. అందులో మన మిత్రబృందంలోని బొగ్గరం ఉమాకాంత ప్రసాద్, జిలేబీ, తిరుక్కోవళ్ళూర్ శ్రీహర్ష, ఆత్రేయ ప్రసాద్, బండకాడి అంజయ్య గౌడ్ గారల పద్యాలున్నాయి.
    సమయం చాలక పూరణలు పంపినవారి పేర్లను చదివారు. అందులో కె. ఈశ్వరప్ప, ఆకుల శాంతిభూషణ్, ఐతగోని వెంకటేశ్వర్లు, నేదునూరి రాజేశ్వరి, అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి, కె.వి. రాజేశ్వర రావు, హెచ్. వరలక్ష్మి, యం.వి.వి. శాస్త్రి, పోచిరాజు సుబ్బారావు, మంద పీతాంబర్, లక్ష్మీకాంత రావు, ఫణీంద్ర రావు, గుఱ్ఱం జనార్దన రావు, బి.వి.వి.వి.హెచ్.బి. ప్రసాద రావు, బల్లూరి ఉమాదేవి గారల పేర్లు ఉన్నాయి.
    అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. వావ్ ! ధన్యవాదాలండీ కంది వారు :) మేఘాలాండు లాటరీ కొట్టినట్టుంది :)


      వరముగ వచ్చెనమ్మ మన పాలిట జీవన మిద్ది !సారమున్
      సరళము!మానవాళి సరిసాటి సుమా! యిది వేద మమ్మ!నీ
      వరయుచు నెమ్మి నెక్కొలిపి వారధి యై మది చిల్కి దాని యం
      తరువుల గూల్చినప్పుడె గదా జగమందు సుఖంబు పెంపగున్!

      జిలేబి

      తొలగించండి
    2. అభినందనలు జిలేబిగారూ! లాటరీ తగిలినందుకు! 💐💐💐

      నేనీ మధ్య టికెట్ కొనడం మానేశాను! 😀😀😀

      తొలగించండి
  23. వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య...
    "తగవే తెచ్చును గొప్పకీర్తి వసుధన్ తథ్యంబు ముమ్మాటికిన్"
    మీ పూరణలను గురువారంలోగా padyamairhyd@gmail.com కు పంపండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. పగలే వెన్నెల భార్య చెంతన సదా" పారుండు నమ్మెన్ జిలే
      బి గళంబందున కట్టె తాళి, నరరే పింజారి యాయెన్, సదా
      జగడంబవ్వగ నింటి లోన, విడిచెన్, సన్యాసి యైనెక్కొనెన్!
      తగవే తెచ్చును గొప్పకీర్తి వసుధన్ తథ్యంబు ముమ్మాటికిన్ :)

      ஜிலேபி

      తొలగించండి


    2. భక్తుడవై వేవేల జన్మలో, నా కెదిరి వై కొన్ని జన్మలో జయా విజయా కోరుకొనండి !



      భగవంతున్ మది నెంచ నేల నిలలో ! భాగ్యమ్ము గా సల్పెదన్
      జగముల్ దిగ్గన పోరు నాతడి సయిన్,స్వచ్ఛందజున్నంపి నా
      పొగరున్ గ్రుక్కును నార సింహుడగుచున్!భో!రాజమార్గంబిదే!
      తగవే తెచ్చును గొప్ప కీర్తి వసుధన్ తథ్యంబు ముమ్మాటికిన్ !


      జిలేబి

      తొలగించండి
  24. ధూర్త నరు లందు నున్నట్టి ధూర్త గుణము
    రూపు మాపంగ యత్నించు ఱేపుమాపు
    చేరి మార్చఁగ నోపును వారి నెలమి
    దూరమున నుంచఁగఁ దగదు ధూర్తజనుల


    దారుణ మైన కష్టములు ధారుణి నిత్తురు దుష్ట మానవుల్
    వీరులు ధర్మ దూరుల కుపేక్ష వహించఁగ రాదు సుమ్మి యిం
    పారఁగ ధైర్య సాహసము లందఱు పోరుఁడు భీత చిత్తులై
    దూరముగాఁ జరింపకుఁడు ధూర్తుల కుత్తములం ద్యజింపుఁడీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  25. పూజ్య గురు దేవులు సాగ్రజ శంకరాభరణ కవి వరులకు ప్రణామములు.
    శ్రీమద్భగవద్గీతను సరళమైన భాషలో శ్లోక క్రమమున తేటగీతులలో ననువదించ సంకల్పించి యారంభించితిని.
    ఈ విద్వన్మండలి యాశీస్సులను కోరుకుంటున్నాను.
    అనువాద సరళిని తిలకించండి.

    శీకృష్ణాయ నమః
    శ్రీకృష్ణ సూక్తి సుధాకరము
    మూలము శ్రీమద్భగవద్గీత

    అధ్యాయ మొకటి –అర్జున విషాద యోగము


    ధృతరాష్ట్రుని పలుకులు:
    చేరి యా కురుక్షేత్రము ధారుణి వర
    ధర్మ భూమి నావారును దమ్ముని సుతు
    లంత నేమి చేసిరి సంజయా రణోత్సు
    కతను వచియింపు మింక సకలము నాకు

    సంజయుని పలుకులు:
    చూచి పాండవ సైన్యము సురుచిరంపు
    వ్యూహమును ద్రోణుఁ గదిసి సుయోధనుండు
    రాజు నాచార్యుని నరసి భాజనముగ
    వచనములు వినయమ్ముతోఁ బల్కె నిట్లు
    .
    పాండు తనయుల వ్యూహంపు ధ్వజిని నచట
    ద్రుపద రాజ సూనుండు మీదు ప్రియ శిష్యుఁ
    డు నతి ధీమంతుఁ డొనరించఁ దనరు దానిఁ
    జూడుఁ డాచార్య పుంగవ సుంత యిపుడు


    అందుఁ గలరు శూరులు మేటి యంపకాండ్రు
    నాజి సములు తలంప భీమార్జునులకు
    సాత్యకియు విరాటుండు రాజన్యుఁడు ద్రుప
    దుఁడు మహారథి దురతిక్రముఁడు దురమున

    ధృష్టకేతుఁడు పురుజిత్తు ధీర వరుఁడు
    చేకితానుఁడు శైబ్యుఁడు శ్రేష్ట నరుఁడు
    కుంతిభోజ కాశీరాజ కువలయేశు
    లు ఘనులు యశో విరాజితులు తనరంగ

    మఱియు విక్రాంతుఁ డా యుధామన్యుఁ డుత్త
    మౌజుఁడు బలవంతుఁడు నభిమన్యుఁ డరయ
    ద్రౌపదేయు లెల్లరు మహా రథులు వారి
    సైన్య మందు గురువరేణ్య సమర రతులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్కారం కామేశ్వరరావు రావు గారు అత్యంత అద్భుతమైన ప్రయోగము సరస్వతి మీ నాలుక పై పలుకులు పలికించవలెనని మాత‌ను కోరుకొంటున్నాను

      తొలగించండి
    2. పూజ్యులు పోచిరాజు వారికి అభినందనలు, శభాకాంక్షలు ! మీ సుందరకాండ పూర్తి పాఠము ప్రచురితమైనదా? 💐💐💐🙏🙏🙏🙏

      తొలగించండి
    3. శుభారంభం కామేశ్వర రావు గారూ. చాలా బాగుంది మీ ప్రయత్నం.

      తొలగించండి
    4. పెద్దలు శాస్త్రి గారికి, కుమార్ గారికి, డా. సీతా దేవి గారికి ధన్యవాదములు. శ్రీమదాంధ్ర సుందర కాండ ప్రచురించితిని. తిలకించ గలరు.

      తొలగించండి
    5. కామేశ్వర రావు గారూ,
      శుభాకాంక్షలు!

      తొలగించండి
    6. శ్రీ కామేశ్వర రావు గారికి శుభాభినందనలు.

      తొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  27. దూరముగా జరింపకుడు ధూర్తులకుత్తములంద్యజింపుడీ
    దూరముగా వసించవలె ధూర్తుల కెప్పుడు లేనిచోధరన్
    దీరని యాపదల్గలుగు దేరుకొనంగను సాధ్యమే యవి
    న్నారయ మేలులేగలిగి హాయిగ జీవనమిత్తురుత్తముల్

    రిప్లయితొలగించండి
  28. తే.గీ.
    ఎన్నుకొనుటకు నుత్తము డెవడు లేడు
    నూరుకున్నను కుదరదునొకరు వలయు
    వేరుమార్గము శూన్యము వారు తప్ప
    దూరమున నుంచగ దగదు ధూర్తజనులు

    రిప్లయితొలగించండి
  29. దానవత్వంబు సాకు ప్రధానగుణము
    నాయకత్వాన నీతియేనలుగుచుండ?
    దూరమున నుంచగదగదు ధూర్తజనుల
    కలియుగంబును సాకెడికర్తలనియు!

    రిప్లయితొలగించండి
  30. ఆటవిడుపు సరదా పూరణ:
    (హైదరాబాదు రాత్రించర పోలీసు నాయకుడు తన కానిస్టేబుల్సుతో :)

    "పోరుచు జెప్పినన్ వినక పోయుచు పోయుచు మగ్గులందు గ్లగ్
    బీరును త్రాగి త్రాగి మన వీధుల కార్లను త్రోలుచుండి వ్రూం
    పారుచు పట్టుబడ్డ పలు బంజర జూబిలి హిల్ల్సువారికిన్
    దూరముగాఁ జరింపకుఁడు ధూర్తుల కుత్తములం ద్యజింపుమా!"


    glug:
    n
    a word representing a gurgling sound, as of liquid being poured from a bottle or swallowed
    https://www.thefreedictionary.com/glug

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగుంది కాని, వ్రూం పారగ? అర్ధం కాలేదు!

      తొలగించండి
    2. vroom (vro͞om, vro͝om) also va·room (və-ro͞om′, -ro͝om′)
      n.
      The loud, roaring noise of an engine operating at high speed.

      https://www.thefreedictionary.com/vroom

      తొలగించండి
    3. ఓహో! మణి ప్రవాళ సాహిత్యం! 👌👌👌

      తొలగించండి
    4. ధ్వన్యనుకరణ పదములు:

      "గ్లగ్", "వ్రూం"

      తొలగించండి
    5. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  31. రాజు సభయందు సజ్జన రాశి నెపుడు
    దూరముగ నుంచదగదు; ధూర్త జనుల
    జేరదీయ రాదు దరికి జేర్చరాదు
    వారలెప్పుడు వంచించు వారు నిజము!

    రిప్లయితొలగించండి
  32. కూరిమి జూపుచున్ ఖలుని కుచ్చిత బుద్ధిని మార్చనెంచగన్
    దూరము గా జరింపకుడు ధూర్తుల, కుత్తములం ద్యజింపుమా
    వారిని వీడినన్ గలుగు బాధయె లేదనెఱంగి దుర్మతిన్
    భూరిగ నీతి జెప్పుచును పూర్తిగ మార్చుము జాతి మెచ్చగన్.

    రిప్లయితొలగించండి
  33. కుత్సితమతితోడ నెపుడు కుల మతముల
    భేదమెంచుచున్ మనుజు వేరుచేసి
    దూరమున నుంచగ దగదు ధూర్త, జనుల
    నాదరింపగ వలెనోయి యవని యందు

    రిప్లయితొలగించండి
  34. చెలిమి జేయవలయు సదా శిష్టు లైన
    జనుల గుర్తెరుగుచు నట్టి సత్పురుషుల
    దూరమున నుంచగ దగదు, ధూర్త జనుల
    గాంచి వర్జించుటే మేలు గాదె యిలను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పై రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  35. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సంఘ హితమును గోరుచు సంతతమ్ము
    భద్రమగు సేవ లందించు వారి నెల్ల
    దూరమున నుంచగ తగదు; ధూర్త జనుల
    పరిహరించి పూజ్యత తోడ వాసి నొందు

    రిప్లయితొలగించండి
  36. అరయ.రావణాసురుని కాకుటిలాత్ముడు జప్పెనీవిధిన్
    ధీరులు రక్కసుల్ భువిని తేజముగల్గిన వారు ధూర్తులం
    చూరక మండలేక మనసొప్పగ బల్కెదరా సురాధముల్
    దూరముగాఁ జరింపకుఁడు ;ధూర్తుల కుత్తములం ద్యజింపు,మా

    రిప్లయితొలగించండి
  37. సేవచేయుచు బ్రతుకీడ్చు శిష్టజనుల
    దూరమున నుంచగఁ దగదు, ధూర్తజనుల
    నెపుడు నెడమగా నుంచిన నింపు గలుగు
    తెలిసి మెలగ సుఖము కల్గు నిలసతమ్ము

    రిప్లయితొలగించండి
  38. పలికెనొక నాయకుండిటు పదవి నిలువ
    వలెను యన్నను గూండాలవలెనె నిలుచు
    వారి త్యజియింప వలెనన్న వాక్కు వినను
    దూరమున నుంచగ దగదు ; ధూర్తజనుల 

    రిప్లయితొలగించండి
  39. తగిన విధముగ శిక్షింప దగునుగాని
    దూరమున నుంచగఁ దగదు ధూర్తజనుల
    వారి దుష్కృత్యము లెఱింగి చేరబిలిచి
    ధూర్త గణమును పారగ ద్రోల వలయు

    నిన్నటి సమస్యకు నా పూరణ

    భజనలతో నొక డచ్యుతు
    నిజరూపము గాంతు మనుచు నిరతము బలుక
    న్నజుడే లేడనియె సుతుడు
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  40. ఉత్పలమాల
    శ్రీరఘు వీరులన్ గొనుచు శీఘ్రమె ద్రిప్పుచు యజ్ఞ వాటికన్
    వారికి శస్త్రవిద్యలను వాటున నేర్పుచుఁ గౌశికుండనెన్
    " పూరితిఁ జేయ యజ్ఞముల పూనుడు కావఁగ, సంహరించగన్
    దూరముగాఁ జరింపకుఁడు ధూర్తుల కుత్తములం ద్యజింపుఁడీ "

    రిప్లయితొలగించండి
  41. సారము కొరవని బ్రతుకె సాగిలపడ
    తారతమ మెన్నని మనసు, తానె ప్రీతి
    దూరముగ నుంచగఁదగదు; ధూర్త జనుల
    చేరగను రాదుగ నెపుడు నేర్పున విడు

    రిప్లయితొలగించండి
  42. సాధు సజ్జనుల నెపుడు జగతి యందు

    దూరమున నుంచగఁ దగదు, ధూర్తజనుల

    కెంత దూరముగా నున్న నంత మేల

    టంచు బుధులు పలుకుచుందు రనవరతము.


    మంచిపనులను చేయుచు మహిని తిరుగు

    వారినిలగౌరవించుట వాసి యౌను

    దూరమున నుంచగఁ దగదు.ధూర్తజనుల

    నెపుడు దరిచేర నీయక నెట్టు మవల.



    ధర్మపరులనుసతతము ధరణియందు

    దూరమున నుంచగఁ దగదు ,ధూర్తజనుల

    చెలిమి చేయబోకు మెపుడు చింతకూర్చు

    నదియు జీవితాంతము నీకటండ్రు జనులు.

    రిప్లయితొలగించండి
  43. డా.పిట్టాసత్యనారాయణ
    కూరను నుప్పులేని గతి గూరి తటస్థులు గారె యుత్తముల్
    నేరము దుష్ట చర్యలను నిన్ గను వారు గదయ్య దుర్జనుల్
    భారత (మహాభారతం)మంత నా ఖలులప్రక్కనె యుత్తములుండ "గారె"యై
    చేరదె స్వచ్ఛపుం శనగ చేదగు బియ్యపు బిండి లేనిదే
    దూరముగా జరింపకుడు ధూర్తుల,కుత్తములన్ ద్యజింపుడీ!

    రిప్లయితొలగించండి
  44. *19.5.18*
    ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    దూరమున నుంచగఁ దగదు ధూర్తజనుల

    సందర్భము: సులభము.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    మంచివారు స్నేహితులైన మహితలాన
    సార్థకము లగు జన్మముల్ ; సజ్జనులను
    దూరమున నుంచగఁ దగదు; ధూర్త జనుల
    దూరమున నుంచగఁ దగును; చేరరాదు..

    2 వ పూరణము..

    సందర్భము: పార్వతి శివుని భర్తగా పొందడానికి ఘోరమైన తపస్సు గావించింది. పరమేశ్వరుడు ఆమెను పరీక్షించడానికై కపట వటువు రూపంలో వచ్చి శివుని తూలనాడుతూ 'అతడు నీకు తగినవాడు
    కా' డన్నాడు.
    అప్పుడు పార్వతి తన చెలికత్తెతో "ఇతణ్ణి పిచ్చి పిచ్చిగా ప్రేలనీయకు. శివు డెలాంటివాడైనా అతడే నా నాథుడు. శివనింద నేను వినలేను. ఇతణ్ణి దగ్గరకు రానీయకు. పంపించివేయి" అన్నది.
    ఆ సందర్భంలో పార్వతి చెలికత్తె పేరు.. *సోమప్రభ*. అప్పు డప్పుడు శశిప్రభ అనీ వాడబడింది. ఆ విషయం చాలా మందికి తెలీదు. కాబట్టి పేర్కొనబడింది.
    (చూ. వామన పురాణం 25 వ అధ్యాయం)
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    "శంకరుని తత్వ మెఱిగిన సజ్జనులను
    దూరమున నుంచగఁ దగదు; ధూర్త జనుల
    దూరమున నుంచవలె; వీని చేరనీకు..
    పిచ్చివాడు.. సోమప్రభా! ప్రేలనీకు.."

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  45. బీరులు త్రాగుచున్ వడిగ వీరుల వోలుచు పబ్బులందునన్...
    నారుల వెంబడించుచును నాలుగు వీధుల జంక్షనందునన్...
    కోరెదరేని చేరగను క్రూరులు కూడెడి రౌరవమ్మునన్...
    దూరముగాఁ జరింపకుఁడు ధూర్తుల కుత్తములం ద్యజింపుఁడీ

    రిప్లయితొలగించండి