20, మే 2018, ఆదివారం

సమస్య - 2683 (మండూకము గర్భమందు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"మండూకము గర్భమందు మనుజుఁడు పుట్టెన్"
(లేదా...)
"మండూకోదరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్"
ఈ సమస్యను పంపిన బూసారపు నర్సయ్య గారికి ధన్యవాదాలు.

139 కామెంట్‌లు:


  1. పిండా కూడు చదువుల
    న్నిండా చదివితివకో? పనియు పాటాలే
    కుండా తిరిగితివే? యే
    మండూకము గర్భమందు మనుజుఁడు పుట్టెన్ ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చదువులన్ +నిండా
      చదువులన్ +(న్ +ఇ)ండా
      చదువుల(న్ +న్ )+ఇండా
      చదువుల(న్న్ )+ఇండా
      చదువులన్నిండా...

      (నాకు తెలిసినంత వరకు)

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. మండూకమె పుట్టునుగద
    మండూకము గర్భమందు; మనుజుఁడు పుట్టెన్
    దండుగ క్రియలను జేయగ
    దుండగులకు దుష్టులకును దోపిడి పనికిన్ :)

    రిప్లయితొలగించండి
  3. మండూకపు గర్భమందు......అనిఉండాలేమో

    రిప్లయితొలగించండి
  4. భండారు కొడుకు పేరని
    చండాంశువు పిలిచె నంత చక్కగ నెపుడున్
    పుండా కోరనగ నతడు
    మండూకము గర్భమందు మనుజుఁడు పుట్టెన్

    చండాంశువు = సూర్యుడు

    రిప్లయితొలగించండి


  5. మండెను నెండలు లవిసెను
    గుండెలు! బడెను వడగళ్ళు గూటిన్ చేరెన్
    దండిగ జనాళి, కలయిక
    మండూకము, గర్భమందు మనుజుఁడు పుట్టెన్ !

    మండు - జ్వలించు ; ఉకము - ఆహ్లాదము మండూకము - జ్వలించు ఆహ్లాదము :)

    నారాయణ :)
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. మండెను నెండలు లవిసెను
      గుండెలు! బడెను వడగళ్ళు గూటిన్ చేరెన్
      దండిగ జనాళి, కలువన్
      మండూకము, గర్భమందు మనుజుఁడు పుట్టెన్ !

      తొలగించండి
    2. సవరణ దీర్ఘమున సంధి సరదానిచ్చెన్ :)

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  6. పిండాకూడయె విద్యలన్ని భళిరా పింజారు లైరే జనుల్ !
    నిండెన్పాతిక యేండ్లు బుద్ధి విరియన్నెక్కొల్ప లేరయ్యిరే !
    భాండాగారపు పొత్త ముల్ చదివిరే !పాగెంబు లేమాయె ? యే
    మండూకోదరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్?

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. మైలవరపు వారి పూరణ

    మాండూక్యోపనిషత్తు పుట్టెను కదా మండూకమున్యాస్యమం ,
    దండాండాదుల సారమున్ దెలిపి , నిత్యానందమున్ గూర్చగా !
    పండున్ జీవుడు గ్రోలి మానవునిగా భాస్వంతుడౌ, నెన్నగన్
    మండూకోదరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. రెండు పదములిచట గలవు
      మండూకము , గర్భమందు మనుజుడు పుట్టెన్
      రెండవదగు గర్భమ్మున !
      మండూకము తొలుతనున్న మనుజుని గనునే ?!

      (గర్భము., +అందు.... అని)

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  8. అమరశిల్పి జక్కన గాథనుండి

    బండను తొలచిన వెడలెను
    మండూకము గర్భమందు, మనుజుడు పుట్టెన్
    తండిరి నోడింప గలుగు
    దండిగ జ్ఞానము గలిగిన తనయుండతడై.

    రిప్లయితొలగించండి
  9. మాండూక్యోపనిషత్తున
    నుండిన తత్వమ్ము దెలుప నొక గురు వడుగన్
    బండ యగు శిష్యుడిట్లనె
    మండూకపు గర్భమందు మనుజుడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
  10. మండోదరి గత జన్మన
    మండూకమె, యింద్రజిత్తు మాతగ బడసెన్,
    కొండకచో పలుకు జనము
    మండూకము గర్బమందు మనుజుడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జన్మను' అనండి.

      తొలగించండి
  11. గ్రామ ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు
    అటు చెఱువులో కప్ప దర్శనమిచ్చింది ఇక తప్పక వానలు కురుస్తాయి.ఇటు మహారాణివారు పండంటి మగబిడ్డను ప్రసవించారు.రెండూ శుభ సూచకాలే!

    ఇదీ సందర్భం

    నిండైన చెఱువులో నొక
    మండూకము;గర్భమందు మనుజుడు పుట్టెన్
    పండంటి బిడ్డ రాణికి,
    రెండును శుభ సూచకముల రిష్టముఁబాపన్

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టాసత్యనారాయణ
    అడము, పిండంబులలో
    నండజములు ప్రాకునవియ "పిండజుడనగన్"
    న్నండము పగులక గుండ్రని
    "మండూకము గర్భ"మందు"1మనుజుడు "పుట్టెన్"
    (1.కప్పకు దిగజారిన పొత్తి కడుపు గర్భిణి స్త్రీ గర్భమును బోలి యుండును.ఇది పుట్టుక.మనుజుడుఅలా పుట్టాడురా అని శిష్యులకు గురువు, సామాన్యశాస్త్ర పాఠము జెప్పునది సందర్భము.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనగన్ న్నండము...'?

      తొలగించండి
    2. పడా.పిట్టానుండి
      ఆర్యా,అదిటైపాటు"అనగన్నం

      తొలగించండి
  13. చండాలం బనిచే యగూడని పనుల్ చక్కంగ చేయన్ జనుల్
    మండేరో జులకా లమిద్ద నుచునే మార్చంగ హింసించు చున్
    భండారాది గరక్కసుల్ ధరణిపై బాధించు నేరీతిగన్
    మండూకో దరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మండే' అన్నది వ్యావహారికం. "కాలమిద్ది యనుచున్" అనండి.

      తొలగించండి
  14. డా.పిట్టా సత్యనారాయణ
    ఉండీ యుండక శాస్త్ర శోధకులదో!యున్మాదులట్లూరకన్
    బండం గాంచియు ప్రాణమున్నదనరే, బ్రహ్మాండబాండంపు ను
    ద్దండుల్ జీవ కణాల గూర్చి యొకచో దౌష్ట్యంపు"క్లోనింగు"లన్
    మండూకోదరమందు మానవుడు జన్మంబందె జిత్రమ్ముగన్

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా నుండి
    3వపాదంలో"గూర్చ"గా చదువ గలరు,ఆర్యా,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఉండీ' అన్నది వ్యావహారికం.

      తొలగించండి
  16. (ఐంద్రజాలికుని ప్రదర్శన )
    మెండగు జాలపు విద్యన్
    నిండగు కప్ప నరునకు జనించెను;నటుపై
    పండించుచు నద్భుతమును
    మండూకము గర్భమందు మనుజుడు పుట్టెన్.

    రిప్లయితొలగించండి


  17. నిండెన్నలుబది యేండ్లున్
    గుండమ్మకు పిల్ల లింక గూడక‌ బోవన్
    మెండుగ కాచిన చారవ
    మండూకము గర్భమందు, మనుజుఁడు పుట్టెన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2683
    సమస్య :: *మండూకోదరమందు మానవుడు జన్మం బందె చిత్రమ్ముగన్.*
    కప్ప కడుపున చిత్రంగా మానవుడు పుట్టినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
    సందర్భం :: గారడివాడు రండి రండి ఇంద్రజాలం చేస్తాను, చూడండి మీరు సంతోషపడి నా విద్యను మెచ్చుకొని మీకు తోచినంత ధనమిస్తేనే మా జీవితం సుఖంగా గడుస్తుంది అని చెబుతూ అబ్రకదబ్ర అని అంటూ ఉండగా చిత్రంగా మండూకం (కప్ప) కడుపులోనుండి మానవుడు జన్నించాడు అని గారడీవిద్యను గుఱించి విశదీకరించే సందర్భం.

    రండీ! చూడగ నింద్రజాలమును, మీ రాశ్చర్యముం బొంది, మా
    కిండీ తోచిన రీతిగా ధనము, మీ రీయంగ జీవింతు మే
    మండీ! యబ్రకదబ్ర యంచనుచు జేయన్ గారడిన్, చూడగా
    *మండూకోదరమందు మానవుడు జన్మంబందె చిత్రంబుగన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (20-5-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. . నేటి సమస్యకు రెండవ పూరణ
      (ఆంధ్ర మహా భారతంలోని అరణ్యపర్వం ఆధారంగా)
      సందర్భం :: సూర్యవంశపు రాజైన పరీక్షిత్తు *సుశోధన* అనే మండూక రాజకుమారి అందాన్ని చూచి మోహించి వివాహమాడినాడు. వారికి శలుడు, దలుడు, వలుడు అనే కుమారులు జన్మించిన సందర్భం.

      మండూక ప్రభు పుత్రి గన్పడగ ప్రేమన్ శ్రీ పరీక్షిత్తు హే
      మండూకాంగన ! మోహ మందితిననెన్ మన్నించె నా నారియున్,
      పండెన్ పుత్రుల పంట వారలకు దాంపత్యమ్ము వర్ధిల్లగా,
      *మండూకోదరమందు మానవుడు జన్మంబందె చిత్రమ్ముగన్.*
      *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (20-5-2018)

      తొలగించండి
    2. రాజశేఖర్ గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. నేటి సమస్యకు మూడవ పూరణ

      మండూకాఖ్య మహర్షి జెప్పె *నయ మాత్మా బ్రహ్మ* యన్ వాక్యమున్
      మాండూక్యోపనిషత్తు పేర, గణియింపన్ జ్ఞాన పుత్రుండుగా
      నుండెన్ మౌనికి మానవుం డొకడు సద్వ్యుత్పత్తితో, చూడగా
      *మండూకోదరమందు మానవుడు జన్మంబందె చిత్రంబుగన్.*
      *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (20-5-2018)

      తొలగించండి
  19. మానవునికి లేని అనుకూలత కప్పకు చూడు
    సానుకూలత
    నీటి లోన ఈదు దాని ఘనత భూమిపైనను
    లేదుగ కలత
    జలావరణమె రేపుగ నెంచి శాస్త్ర వృద్ది
    చెందించగన్
    మండూకోదరమందు మానవుడు జన్మంబందె
    జిత్రమ్ముగన్

    రిప్లయితొలగించండి
  20. అండ ము నుండి యు పుట్టెను
    మం డూ కము ;గర్భ మందు మను జు డు పుట్టెన్
    మెండగు స ద్భా వం బు ల
    మండి తు డై జగతి మెచ్చు మాన్యుoడగు చు న్

    రిప్లయితొలగించండి
  21. మెండౌ మానవ జన్మము
    నిండుగ పాపములు జేసి నీచత్వమునన్
    పండగ నాతని ఖర్మము
    *"మండూకము గర్భమందు మనుజుఁడు పుట్టెన్"*

    రిప్లయితొలగించండి
  22. అండగ బ్రహ్మాండంబుల
    దండగ జనులెల్ల గూడి దంచగ కథలన్
    కొండొక గాడిద కూసెన్
    మండూకము గర్భమందు మనుజుఁడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
  23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  24. సండే మండే యనకను
    నిండుగ పరిశోధనలను నేర్పుగ జేయన్
    దండుగ మారిన ఫలితము
    మండూకము గర్భమందు మనుజుడు పుట్టెన్!

    మత్స్యకన్య లాగ మండూక మనుజుడు!😊😊

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏🙏

      తొలగించండి
    3. సవరణతో

      ఎండకు వానకు దడవక
      నిండగు పరిశోధనలను నేర్పుగ జేయన్
      దండుగ మారిన ఫలితము
      మండూకము గర్భమందు మనుజుడు పుట్టెన్

      దడవక = భయపడక

      తొలగించండి
  25. కం.
    పుండుయె పుట్టెను చిత్రము
    మండూకము గర్భమందు ; మనుజుడు పుట్టెన్
    మెండుగ జ్ఞానము కల్గియు
    కండను కోయుచు చికిత్స కప్పకు చేసెన్ ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పుండే' అనండి.

      తొలగించండి
  26. క్రొవ్విడి వెంకట రాజారావు:

    బండల దిగువున దూరెను
    మండూకము; గర్భమందు మనుజుడు పుట్టెన్
    దండికపుడని ముదముతో
    మెండుగ బలికెను ముగుదుడు మిత్రునితోడన్
    (దండి=స్త్రీ; ముగుదుడు= అమాయకుడు)

    రిప్లయితొలగించండి
  27. ఎండిన చెఱువున వెతపడు;
    నిండుగ పది నెలలు శిశువు నెలకొను;భువికిన్
    నిండుదనము చేకూర్చగ;
    మండూకము; గర్భమందు ;మనుజుఁడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
  28. ఎండినదో మస్తిష్కము?
    కుండల కొలదిగను కల్లు కుడిచితివేమో?
    మొండిగ వాదింతువె?యే
    మండూకము గర్భమందు మనుజుఁడు పుట్టెన్?

    రిప్లయితొలగించండి
  29. మెండుగ గ్రుడ్లను జూచితి
    మండూకము గర్భమందు, మనుజుడు పుట్టె
    న్నండము నుండియె తొలుతన
    బిండముగా మార్చెపిదప పింగళుడార్యా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తొలుతను' అనండి.

      తొలగించండి
  30. సమస్య :-
    "మండూకము గర్భమందు మనుజుఁడు పుట్టెన్"

    *కందము*"

    నిండగు చెరువుల నుండెడు
    మండూకము గర్భమందు; మనుజుఁడు, పుట్టెన్
    అండమెలాగునటంచును
    మెండగు పరిశోధనమ్ము మిన్నక జేసెన్
    ..................✍చక్రి

    రిప్లయితొలగించండి
  31. మిత్రులందఱకు నమస్సులు!

    [రావణుఁడు మునులను జయింపఁగోరి, స్వ విజయసూచకముగా, వారల రక్త మించుకంతఁ గొని, యొక భాండమందుంచెను. కృష్ణమదచంద్రుఁడను నొక ముని, పుత్రికకై యొక క్రతువుం జేయుచు, నొక భాండమునఁ గొన్ని పాలనుం బోసియుంచఁగా, నా భాండ మపహరించి, యందు మునుల రక్తముం గలిపి, యది విషమని, దానిని దాయుమని తన భార్య మండోదరికి రావణుం డీయఁగా, నామె, తన భర్త పరస్త్రీ వ్యామోహియై, తన కపకార మొనర్చుచున్నాఁ డను భ్రాంతి కలదై, బలవన్మరణ మందుటకై, యా భాండమందలి ద్రవమునుం ద్రావఁగా, నామెకు గర్భమైనది. ఆ విషయమును దన భర్తకుం దెలుప వెఱచి, తీర్థయాత్రలకుం బోవు నెపమున వెడలి, యొక బాలికను ప్రసవించి, యా బాలిక నొక పేటిక నునిచి, సముద్రమునఁ బడవేసెను. ఆ పేటిక కొట్టుకొని వచ్చి జనక మహారాజు భూమినిం గప్పికొనఁబడియుండెను. సంతానేప్సితమున జనకుఁ డా భూమిని దున్నఁగా నా బాలిక పేటికనుండి లభించెను. భగవత్ప్రసాదముగా భావించి జనకుఁ డా బాలికను పెంచి పెద్దచేసెను. ఆ బాలికయే సీత. మండోదరీ గర్భమునుండి యుద్భవించిన మానవి యగుటచే, మండూక (మండోదరీ) గర్భమునుండి మానవుఁడు (మనుజ కన్య) పుట్టెననుట కింతకన్న నిదర్శన మింకేమి కావలయును?]

    దండోపాయము వీడి రావణుఁడు సద్దండ్యుఁడై, తాపసీ
    ద్రుండ్రౌ మౌనుల నల్లఁ, గృత్స్నమదచంద్రుండన్మునీశాఖ్యు స
    ద్భాండంబందునఁ గల్గు పాలఁ గలిపెన్; దద్భాండమున్ భార్యకున్
    మెండౌ సంతసమొప్ప వేగ నొసఁగెన్, "క్ష్వేళం బిదే" యంచుఁ; ద
    ద్భాండంబందలి క్ష్వేడముం గొనెనయా తత్తన్వి దుర్భ్రాంతితోన్
    దుండింగూడ మగండు పూనెనని! కడ్పుం బుట్టెరా బాలయే!
    వెండిం బుత్రినిఁ బేటియందునునిచెన్వేసెన్బయోధిన్! గనన్
    మండూకోదరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్!!

    సంయుతాసంయుతప్రాసకై ( శంకరాభరణం లింకు):
    http://kandishankaraiah.blogspot.in/2011/11/5.html

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

    2. ఇదేమన్నా అవాల్మీక మైన కథాండి ? అంటే సీత రావణునికి కూతురు వరస అవుతుందా ?

      ఏ పురాణమండీ యిది మధుసూదన్ గారు !!!?

      విషము తాగగా పుట్టిన కన్య సీత - విషకన్య :)




      జిలేబి

      తొలగించండి
    3. ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!

      *** *** ***
      జిలేబీ గారూ...

      ఈ కథ పూర్వగాథాలహరిలో ప్రకటించబడినదండీ. ఇది అద్భుత రామాయణంలోని కథ అని వేమూరి శ్రీనివాసరావు గారు (రచయిత) తెలిపారు. సీత విషకన్య కాదు. అది విషమూ కాదు.

      తొలగించండి
    4. ఇందులో కొన్ని సవరణలు చేయాల్సివున్నది.

      వివరణలో కృత్స్నమద(ముని)చంద్రుడని ఉండాలి. టైపాటు.
      పద్యం మొదటి పాదం చివర సున్నా పడలేదు. తాపసీం/ద్రుండ్రౌ...అని ఉండాలి. అలాగే, అదే పాదంలో "సద్దండ్యుండునై" అని ఉండాలి.
      స్వస్తి

      తొలగించండి


    5. ఇదేదో మరీ జిలేబీయమైన రామాయణమే ! అష్టమ సర్గ లో ఈ కత వుంటే దానికి ముందు సప్తమ సర్గ లో మా నారదుల వారు తుంబుర శ్రీకృష్ణపరమాత్ములు కలిసి కట్టు కావేటి రంగాగా దర్శనం :)


      మరీ జిలేబీయమైన అత్యాద్భుత రామాయణమే :)


      జిలేబి

      తొలగించండి


    6. https://archive.org/details/AdbhutRamayanWithHindiTranslationBhuvanVaniTrust

      తొలగించండి

    7. మీరు కొంత సోఫిస్టికేటడు గా చెప్పేరు - "తీర్థయాత్రలకుం బోవు నెపమున వెడలి, యొక బాలికను ప్రసవించి, యా బాలిక నొక పేటిక నునిచి, సముద్రమునఁ బడవేసెను. ఆ పేటిక కొట్టుకొని వచ్చి జనక మహారాజు భూమినిం గప్పికొనఁబడియుండెను"

      Original లో కురుక్షేత్రే గర్భం వినిష్కృత్య అని వుంది :)

      విమా‌నవరమారుహ్యా కురుక్ష్తేత్రం జగామ సా
      తత్ర గర్భం వినిష్కృత్య నిచఖాన భువస్తలే !

      ఖర్మ ఖర్మ సూపర్ డూపర్ జిలేబీయం

      జిలేబి

      తొలగించండి


    8. ఈ అద్భుత రామాయణం రంగనాయకమ్మ గారి కళ్లబడినట్లు లేదు :)

      జిలేబి

      తొలగించండి


    9. మండోదరి తనయ సీత మహిని జిలేబీ !


      https://varudhini.blogspot.com/2018/05/blog-post_21.html


      జిలేబి

      తొలగించండి
  32. ఖండమ్మున్ వెస దాటినేగెనొకడాకాంతన్ వెంటగైకొంచు తా
    నిండెన్ తొమ్మిది మాసముల్ శిశువు జన్మింపన్ బల్కె నాధుండు చా
    ముండీ ! బాబిటు నిండు జాబిలి వలెన్ మోదమ్మునున్ గొల్పె ఖా
    ట్మండూకోదరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొన్ని సవరణలు వాట్సప్ లో సూచించాను. చూడండి.

      తొలగించండి
  33. నిండైన బావిలో, భూ
    ఖండమ్ముననేది వేడ్క గంతులు వేయున్
    నిండగ నెలలటు జననీ
    మండూకము గర్భమందుమనుజుఁడు పుట్టెన్ ? 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జననికి' అనండి.

      తొలగించండి
  34. ఎండన బడి తిరుగాడగ
    దండిగ పైత్యమ్ము ముదిరి తప్పిన మతితో
    మొండిగ వాదించె నిటుల
    మండూకపు గర్భమందు మనుజుడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాదించె నొకడు' అంటే అన్వయం కుదురుతుంది.

      తొలగించండి
  35. మెండుగ నొప్పులు వచ్చిన
    మొండితనమ్మునఁ దడఁబడి ములుగుచు వడిఁ దా
    నండగ మానిని చేరఁగ
    మండూకము, గర్భమందు మనుజుఁడు పుట్టెన్

    [మండూకము = దుండిగపు చెట్టు (మఱ్ఱి)]


    విండీ మాటను దిద్దుకొండుమఱి మీవృత్తమ్ము లిద్ధాత్రి బ్ర
    హ్మాండం బందునఁ బెక్కు జన్మములు నొప్పారుం గృతాత్తమ్ములై
    భాండాగారము నింపి నింపి మఱి పాపమ్ముల్ తమిం జేయ మున్
    మండూకోదరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్

    [కృతాత్తములు = కృతములచేఁ బొందఁ బడినవి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.

      తొలగించండి
  36. నిండగు చెరువున గంటిని
    మండూకము;గర్భమందుమనుజుడుబుట్టెన్
    బండగ కాళ్లూచేతులు
    గుండెయు లేనట్లుగలిగె! కోర్కెలుమాన్పన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాళ్లూ' అనడం సాధువు కాదు. "బండగ కాల్సేతులు మరి" అందామా?

      తొలగించండి
  37. కం:-
    ఎండిన పొట్టలుగొట్టుచు
    నిండుగ కృత్స్నమునునింపు నియమిత పెద్దల్
    కండగ నిలచిన దుండగ
    మండూకము గర్భమందు మనుజుఁడు పుట్టెన్!!

    @ మీ పాండురంగడు*
    ౨౦/౦౫/౨౦౧౮

    రిప్లయితొలగించండి
  38. చండిజనించెను కూపస్థ
    మండూకము గర్భమందు ; మనుజుడు పుట్టెన్
    పండితురాలికడ యెదుగు
    చుండె పురజనులకు బోధచూపుచు భువినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. సవరించండి. 'కడ నెదుగు' అని ఉండాలి. 'భువినిన్/భువిలో' అని ఉండాలి.

      తొలగించండి
    2. ధన్యవాదములు శంకరయ్యగారూ.🙏🏽

      తొలగించండి

  39. జెండర్మార్పిడి :) క్లోనింగు :) సోలారు విద్యుత్తు :) కలువాయి :)

    జెండర్మార్పిడి కాలమందు జనులే జేజేలు పల్కంగ మా
    ర్తాండుండండగ వైద్య విద్యయు మహాత్మ్యంబయ్యె! టెస్ట్యూబులో
    పిండంబుల్కలువాయి చేయ, భళిరా పెట్రేగ మండ్రాటమే
    మండూకోదరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  40. కందం
    మండోదరి నామంబున
    గండము గట్టెక్కి బ్రతుకు గరితయె గన ను
    ద్ధండుని జన వాక్యమ్మిదె
    "మండూకము గర్భమందు మనుజుఁడు పుట్టెన్"

    రిప్లయితొలగించండి
  41. దండిగ కండలు పెంచుచు
    కుండలములనే ధరించి కోవిదుఁ డనియెన్
    మాండూక్యో పనిషత్తన
    మండూకము గర్భమందు మనుజుఁడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
  42. ఆటవిడుపు సరదా పూరణ:
    (అసంభవ "కుమార" సంభవం)

    మండెన్ వేసవి బెంగుళూరున మహా మార్తాండ విన్యాసమై
    మండూకమ్ములు రెండు నొప్ప సరియౌ మంత్రమ్ము సంధింపగా
    రండో! రండిర! రాజకీయ మహిమన్ రాజా! కుమారుండు గా
    మండూకోదరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్ :)

    http://kandishankaraiah.blogspot.in/2014/06/602_27.html?showComment=1403860883681&m=1#c8565068862223036215

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  43. రిప్లయిలు


    1. కప్పలకు పెండ్లి జేసిరి
      యప్పల రేపులకు దోసి యయయో దేశం
      బప్పా వేదములకు వే
      రప్పా ! కర్మఖగవతి బిరాదరి యిదియే !

      జిలేబి

      తొలగించండి
  44. అండము నుండి జనించెను
    మండూకము, గర్భమందు మనుజుఁడు పుట్టె
    న్నండము నుండియె! కూపపు
    మండూకమ యుండబోకుమా, భేదమిదే!

    రిప్లయితొలగించండి
  45. క: దండిగ సురఁ గ్రోలితివా?
    మొండిగ వాదింతువిటుల మూర్ఖతతో, నే
    ఖండించు చుంటి, నెవ్విధి
    మండూకము గర్భమందు మనుజుఁడు పుట్టెన్?

    రిప్లయితొలగించండి
  46. ఖండించున్ విషయమ్ము నొక్కటి తగన్ గద్దించి దానన్ కరా
    ఖండిన్, తద్విషయమ్మె మెచ్చు నట శ్లాఘ్యంబంచు వేనోళ్ళ, నే
    జెండాయైనను మోయు మార్గయుగమున్ చేబూని వైరుధ్యముల్,
    మండూకోదరమందు మానవుడు జన్మం బందెఁ జిత్రమ్ముగన్.







    రిప్లయితొలగించండి
  47. అండం బందున బుట్టినాడు ఘటికుం డన్న న్నిజంబే కదా
    కుండన్ బుట్టె ఋషీశ్వరుండిదియు నీకుం దెల్లమే గొప్పదౌ
    కొండన్ బుట్టెను కోమలాంగి శివునిం గూడం జుమీ కాని యే
    మండూకోదరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్.

    రిప్లయితొలగించండి


  48. ఏమండీ కందివారు

    మండు + ఉకము ఇది దుష్టమా శిష్టమా రెండు పదాలు సంస్కృతమేనా? లేక రెండు తెలుగు పదాలేనా ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  49. నేటి సమస్యకు మూడవ పూరణ

    మండూకాఖ్య మహర్షి జెప్పె *నయ మాత్మా బ్రహ్మ* యన్ వాక్యమున్
    మాండూక్యోపనిషత్తు పేర, గణియింపన్ జ్ఞాన పుత్రుండుగా
    నుండెన్ మౌనికి మానవుం డొకడు సద్వ్యుత్పత్తితో, చూడగా
    *మండూకోదరమందు మానవుడు జన్మంబందె చిత్రంబుగన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (20-5-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ మూడవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


  50. పండారమ్ములు నూతిన్
    మండూ కములై బతికిరి మహిలో సుమతీ!
    మండూకిన్ ప్రేమించగ
    మండూకము గర్భ మందు మనుజుడు బుట్టెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  51. శార్దూలవిక్రీడితము
    దండల్మారుచుకొంచు పెళ్లియని నాదానవ్ ప్రియా నీవనన్
    గుండెల్నిండుగ నమ్మి దగ్గరయినన్ గ్రూరమ్ముగన్ వీడఁగా
    నండన్జేర్చుదురంచు బిల్చె జనులన్నాశించి వాత్సల్యయై
    బిండంబున్గొని బావినందిడుచు సంవేదమ్మునన్ బల్కెనే
    " మండూకోదరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్"

    రిప్లయితొలగించండి
  52. కొద్దిపాటి సవరణతో:

    శార్దూలవిక్రీడితము
    దండల్మారుచుకొంచు పెండ్లియని నాదానా! ప్రియా! నీవనన్
    గుండెల్నిండుగ నమ్మి దగ్గరయినన్ గ్రూరమ్ముగన్ వీడఁగన్
    బిండంబున్గొని బావియందిడుచు సంవేదమ్ముగా నిట్లనెన్
    " మండూకోదరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్
    యండన్గూర్చెడు వారలున్న గొనరే యాధారమై పెంచగన్"

    రిప్లయితొలగించండి
  53. *20.5.18*
    ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    మండూ కోదరమందు మానవుఁడు
    జన్మంబందెఁ జిత్రమ్ముగన్

    సందర్భము: మండూక మహర్షియొక్క జ్ఞాన మనే కుక్షిలోనుండి బ్రహ్మాండ పిండాండా లకు మూలమై వెలిగే ఆత్మ యనే పేరు గలిగిన పుత్రుడు పుట్టెనా యన్నట్లు ఈ ఉపనిషత్తు కనిపిస్తున్నది.
    (అందువల్ల మండూకోదరంలో మానవుడు జన్మించడంలో విప్రతిపత్తి లేదు.)
    అదే *మాండూక్యోపనిషత్తు*.
    12 మంత్రాలే వున్నప్పటికీ అన్ని ఉపనిషత్తుల సారమై యలరారుతోంది. నాలుగు మహా వాక్యాలలో నొకటైన *"అయ మాత్మా బ్రహ్మ"* అనే వాక్యం యిందులోనే వున్నది.
    "ఓం భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః" అనే ప్రసిద్ధమైన మంత్రం యిందులోనిదే!
    ఓంకారమే సర్వస్వ మని యీ యుపని షత్తులో చెప్పబడింది. ఆదిశంకరులు దీనికి విపులమైన వ్యాఖ్య విరచించినారు.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    మండూ కాఖ్య మహర్షి జ్ఞాన మను స
    మ్యక్ కుక్షిలోనుండి బ్ర
    హ్మాండాండాలకు మూలమై తనరు న
    య్యా త్మాఖ్యమౌనట్టి పు
    త్రుండున్ బ్రోద్భవమందె నా నుపనిష
    త్తున్ గందు మట్లౌటచే
    మండూ కోదరమందు మానవుఁడు జ
    న్మంబందెఁ జిత్రమ్ముగన్

    2 వ పూరణము..

    సందర్భము: "కప్ప కడుపులోనుంచి మానవుడు పుట్టాడు. ఆ వింత చూపిస్తాను రండి. అంటూ ఒక్కొక్కరి దగ్గర ఇరువై రూపాయలు లాగినాడు గారడివాడు. చివరకు చూపించనే లేదు"
    అని ప్రేక్షకులు వాపోతున్నారు.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    "రండీ! చూపెద నొక్క వింత నిపుడే
    రారండి వేవేగమే!
    మండూ కోదరమందు మానవుఁడు జ
    న్మంబందెఁ జిత్రమ్ముగన్..
    తెండీ రూప్యము లిర్వ దేసి యని, యెం
    తే నేర్పుగా లాగినా
    డండీ! గారడివాడు చూప డిది యే"
    మన్నారులే ప్రేక్షకుల్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  54. [5/20, 8:36 PM] Dr Umadevi B: డా.బల్లూరి ఉమాదేవి


    ఎండిననుబావి నుండును

    మండూకము ,గర్భమందు మనుజుఁడు పుట్టెన్

    మండోదరి యను నాతికి

    పెండిలి సేయగ  ముదమున వెళ్ళిరి జనముల్.

    రిప్లయితొలగించండి
  55. మండూకమ్మది పుట్టునోయి బుధుడా మామూలుగా పృథ్వినిన్
    మండూకోదరమందు;...మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్
    పిండమ్మే కనరాని కుంతికకటా భీతిల్లి పర్వెత్తతా...
    కుండన్ పుట్టెనుగాదె వేదవిదుడే కొండాడ వైదీకులే

    రిప్లయితొలగించండి