కలలో వలె రష్యాపై చెలరేగియు భళి ! జపాను సేనయె గెలిచెన్! తలపగ విధి బహు చిత్రము! "ఎలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్" ****)()(**** (1905 లో రష్యా-జపాను యుద్ధంలో రష్యా దిగ్గజముపై చిన్న దేశము జపాను విజయము ప్రస్థావించ బడినది.అప్పట్లో అది సంచలనము)
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2689 సమస్య :: *ఎలుక వధించె నేనుఁగు మహీనబలంబున విక్రమించుచున్.* ఎలుక ఏనుగును చంపింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: ఛత్రపతి శివాజీ అని ప్రసిద్ధి వహించిన శివాజీ మహారాష్ట్రలో జన్మించి మన భారతమాతకు వీరపుత్రుడుగా వీరశివాజీగా కీర్తింపబడుతున్నాడు. జిజియా షాహాజీ పుణ్యదంపతుల సుపుత్రుడైన శివాజీ మొఘల్ రాజులను వ్యతిరేకించి మరాఠా సామ్రాజ్య స్థాపనకు అంకురార్పణ చేశాడు. దేశభక్తితో ధైర్యసాహసాలతో శక్తియుక్తులతో అనేక కోటలను జయించాడు. ఉక్కు కవచాన్ని ధరించి తన పిడి పులి గోళ్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను (నరసింహస్వామి వలె) చీల్చి చంపినాడు. ఆ సమయంలో అక్కడ ఉండిన శత్రుపక్షం వాళ్లు ‘’ ఈ శివాజీని చిట్టెలుక అని అనుకొన్నాము. ఐతే ఈ ఎలుక ఏనుగు లాంటి మన నాయకుని వధించింది’’ అని మాట్లాడుకొన్న సందర్భం.
సందర్భము: వృద్ధాప్యం పైబడే కొద్దీ శరీరపటుత్వం తగ్గిపోతుంది. యౌవనంలో వున్నట్టుగా వుండదు. "అయ్యో! ఒకప్పు డేనుగులా వుండేవా డిప్పు డెలుకలా తయారయ్యాడే!" అంటారు. "శ్రీ వేంకటాచల నివాస శతకం"లో శ్రీ జనువాడ రామ స్వామి అనే ఒక (భక్త) కవి మిత్రుడు ఇలా పేర్కొన్నాడు. "ఇంద్రజాలము చేయు నింద్రియములు జూడ భోగముల్ రోగముల్ జోల బాడు.. బలమున్న మొనగాడు భంగపడకపోడు వయసు పశ్చిమ దిశ వాలుచుండ.. కాళ్ళు చేతులు కూడ కదలనే కదలవు ఆసరా లేనిదే అడుగు లేదు.." అని చెబుతూ చివరకు "ఏనుగని పిల్చి రొకనాడు ఎలుక నేడు.." అంటాడు. వీధిలో వెళుతున్న ఒక పెద్దాయనను చూచి "ఏనుగులాగా వున్నవా డ దేమిటి? ఎలుకలా తయారయా" డని నే నంటే పక్కనే వున్న నా మిత్రుడేమో " కాదు కాదు. ఎలుకే విక్రమించి యేనుగును చంపిందిలే!" అన్నాడు కవితాత్మకంగా... ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~ "పలు వరుస లూడె; నెరిసెను తల వెంట్రుక; లేనుగు వలెఁ దనరె; నెలుకయై నిలిచె నత" డంటి ; సఖు డనె "నెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్"
రిప్లయితొలగించండిఎలుకలగుచుండు నపుడపు
డులావుగా నసురుల వలె డుండుకలగుచున్
బలముగొనుచు నొకమారొక
యెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్!
జిలేబి
రిప్లయితొలగించండిమా కన్నడ రాష్ట్ర కథ
గెలిచెన్ తాకొన్నియెనట
బలమివ్వన్ కాంగిరేసు పట్టెన్ పదవిన్
బిలబిల గుంపును జేరుచు
యెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅలికిడితో బోనును పడె
తొలగించండినెలుకయె; కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్
బలహీనుడైన భటుడట
చలచల్లగ ప్రాకుచుండి చదరంగములో
తొలగించండిఅదురహో ' మౌసు ' :)
బలహీనుడైన భటుడే,
చలచల్లగ ప్రాకుచుండి చదరంగములో
నల నంకోపరిని, జరుప
నెలుకయె, కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్
జిలేబి
🙏
తొలగించండిచక్రవర్తి BCM ఉవాచ:
తొలగించండిబలే బలే జిలేబి
జిలేబి గారూ:
తొలగించండివ్హాట్సప్లో మీ పాపులారిటీ పెరుగుతోంది..
గుఱ్ఱం జనార్దన రావ్ ఉవాచ: (జిలేబి):
తొలగించండిభేష్!🌹⛄🙏👍👌🖐👏⛄🌹
తొలగించండిజీపీయెస్ వారికి
నమో నమః మీరే మా జీపీయెస్ !/ చక్రవర్తి వారికి నెనరుల్స్
శ్రీ జి. ప్రభాకర ! జిలేబి చిరుకానుకగా
యీ జిలుగు తెలుగు కందము
పాజము జేర్చంగ వాట్సపార్యుడ మీకై!
జిలేబి
తొలగించండిమా "జీపీయెస్" మీరే!
శ్రీ జి. ప్రభాకర ! జిలేబి చిరుకానుకగా
యీ జిలుగు తెలుగు కందము
పాజము జేర్చంగ వాట్సపార్యుడ మీకై!
అదరహో జిలేబి మౌసు! అలరించెనులే! 👌💐👍👏
తొలగించండి🙏🙏🙏
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగుర్రం జనార్ధన రావుగారికి
నెనరులు !
పల్లవుల యేరు తళుకుల
నుల్లము పొంగెడు పదముల నుత్సాహముతో
మల్లారమ్ముల పద్యము
లల్లు పలమనేరు సుకవుల కివే జోతల్ !
జిలేబి
తొలగించండిసీతాదేవి గారికి
నమో నమః !అన్నయ్య గారి మౌజూ కందానికి, మా మౌసు సాయంబంతే :)
నెనరులు
జిలేబి
తలుపులు బిగించి కొట్టిన
రిప్లయితొలగించండిబలహీన పుపిల్లి కూన బరుకును జనులన్
కలికాలము వింతలు గన
నెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్
G P Sastry (gps1943@yahoo.com)మే 26, 2018 8:21 PM
తొలగించండికంది వారు ఉవాచ:
"ఈనాటి ఆకాశవాణి వారి సమస్య...
*వాణీ ప్రేమజలమ్ము గాదె యిహమున్ భవ్యమ్ముగా దాటగన్*'
మీ పూరణలు గురువారంలోగా padyamairhyd@gmail.com కు పంపండి."
శంకరయ్య కందిమే 26, 2018 9:19 PM
నేను రేడియో వినలేదు. ఒక మిత్రులు చెప్పినదానిని చెప్పాను. అది వాణియో పాణియో తెలియదు.
G P Sastry (gps1943@yahoo.com)మే 26, 2018 11:32 PM
శ్రీహర్ష uvaacha:
గురువర్యా.. పాణీ🙏
తొలగించండిఅది పానీపూరి జలము జిలేబి ఉవాచ :)
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిగలగల లాడు కొండికలు గప్పము కొట్టుచు చూచి రచ్చటన్
జిలజిల చిత్ర మై వెలుగు, జేగురు రంగుల వన్నె తోడుగా
తలతల లాడు చిత్ర మది ! తానము డిస్నివరల్డు లో భళా
యెలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్!
జిలేబి
☺️👏🏻..
తొలగించండినేను కార్టూన్ నెటువర్కంటే ... మీరు డిస్నీవరల్డ్ అన్నారా!... నేను వాట్సాపులో సమస్య చూసి సరదాగా ఎలుకందము వ్రాసా...ఇక్కడ చూస్తే....మీరు కూడా...
😃
తొలగించండిబామ్మల కు "విట్టు" బాబుల
కమ్మమ్మో "వేవులెంతు" కలువన్నొకటై
ఝుమ్మను డిస్నీ కార్టూ
న్లమ్మమ్మో శంకరునికి నట్టుగు లాయెన్ :)
జిలేబి
బామ్మ మాట బంగారు బాట
తొలగించండి🤣
జిలేబీ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ, దాని ననుసరించిన పద్యం బాగున్నవి. అభినందనలు.
మీ వాట్సాప్ గ్రూపులో నేను కూడా సభ్యుడిని అవ్వాలని నా కోరిక...
తొలగించండిదయచేసి గ్రూప్ యొక్క లింక్ పంపగలరు...
లేదా నా నెంబర్ ని అందులో add చెయ్యండి.
తొలగించండి9553219978
పద్య రచనలో ఆసక్తి ఉన్న నావంటి విద్యార్థులకు మెలకువలు నేర్పండి
తెలుగు సాహిత్య పరమైన గ్రూప్ లు ఉంటే తెల్పగలరు.
తొలగించండిఫేస్ బుక్ అయినా , వాట్సాప్ అయినా...
యూదుల దేశము ఇజ్రాయేలు చూడ జనము
రిప్లయితొలగించండిఎనభై లక్షలు
ఎనభై కోట్లతో శత్రు దేశములు చుట్టూ
పరచె నక్షలు
సింహ స్వప్నమై పగవాడికి తాను
పరాక్రమించగన్
ఎలుక వధించె నేనుగు నహీన బలంబున
విక్రమించుచున్
రిప్లయితొలగించండితెలుపుము పిల్లికి కబళము?
వలపున నెటులు విజయమ్ము వచ్చు జిలేబీ ?
* అల మావటి వాడినకట !
ఎలుకయె; కడు విక్రమించి; యేనుఁగుఁ జంపెన్!
*తిరుచ్చి సమయపురంలో ఏనుగు మావటి వాడిని (వాడి పేరు గజేంద్రుడు :)) చంపిందని హిందూ వారి వార్త.
జిలేబి
మీ తాజా క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :-
రిప్లయితొలగించండి"ఎలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్"
*కందం**
ఖలునివలె యెదురుగ వచ్చె
ఎలుకయె కడు విక్రమించి; యేనుఁగుఁ జంపెన్
కలవర పాటు నెలుకయే
కలుగున దూరక కరి కడకాలున పడగా
..................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వలె నెదురుగ వచ్చె। నెలుకయె... పాటున నెలుకయె" అనండి.
తలపడి యెన్నికలందున
రిప్లయితొలగించండిసులభముగా గెలువ నొకడు శూరుని పైనన్
ఫలితముఁ గని ప్రజ పల్కిరి
యెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందం
రిప్లయితొలగించండిబలమున్న వానిఁ గనునని
బలహీనుని నక్కలిమిడి బలమౌదుమనన్
భళిరా! కర్ణాటకమున
నెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్!
(కర్ణాటక రాజ్య రాజకీయ నేపథ్యం)
సహదేవుడు గారూ,
తొలగించండిసమకాలీనాంశంతో మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిసులువుగ జయించె కాంగ్రెస్
రిప్లయితొలగించండినల హస్తిన కేజ్ర్రివాలు నాప్ పార్టీ తోన్
కలగాదు గదా నిచటన్
ఎలుకయె కడు విక్రమించి యేనుగు జంపెన్
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"గదా యిచ్చట। నెలుకయె..." అనండి.
మెలికల పార్టిని తెలుగులు
రిప్లయితొలగించండికలలో నెరుగని విధముగ ఘనముగ నెటకో
మలుపుల ద్రిప్పుచు బంపిరి;
ఎలుకయె కడు విక్రమించి యేనుగు జంపెన్.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సరైన పూరణ కోసం ఆలోచించే లోపు ఈ సరదా పూరణ..
రిప్లయితొలగించండిటాము, జెర్రీ మధ్యలో ఏనుగు
అల కార్టూ న్నెటువర్కున
కలుగున గల జెర్రి టాము గడబిడ లోనన్
బలగజ మొకటటు రాగా
"ఎలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్"
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండినలుగురు చూచుచుండిరిట నర్తనశాలకు రమ్ము , పండు నీ
వలపనఁ గృష్ణ , కీచకుడు వచ్చెను , భీముడు చంపెనాతనిన్ !
వలలుని కీచకున్ గనుచు పల్కిరి పౌరులు "వంటయింటిదౌ
యెలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
శ్రీ విట్టుబాబు గారి స్పందన..
తొలగించండివలలుడు కీచకుడిని రహస్యంగా చంపాడు కదా! అందరూ గంధర్వులు చంపారనుకున్నారు కదా అని...
అవునండీ..కానీ కొంతమందికయినా తెలియకపోతుందా.. కొంతకాలం తర్వాతనైనా.. అని సమర్థించుకొంటూనే వ్రాశా 🙏
అని బదులిస్తూ...
పూరణలో చిరుసవరణ... మన్నించండి 🙏🙏
నలుగురు చూచుచుండిరిట నర్తనశాలకు రమ్ము , పండు నీ
వలపనఁ గృష్ణ , కీచకుడు వచ్చెను , భీముడు చంపెనాతనిన్ !
వలలుని కీచకున్ దలుపఁ బద్యము దోచెను "వంటయింటిదౌ
యెలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
🙏🏻👌🏻👏🏻💐
తొలగించండిమైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిబలవంతు డైన వానిని
రిప్లయితొలగించండికలతలనెడు చీడపురుగు కలవర పెట్టన్
విలవిల లాడుచు చచ్చిన
నెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలలో వలె రష్యాపై
రిప్లయితొలగించండిచెలరేగియు భళి ! జపాను సేనయె గెలిచెన్!
తలపగ విధి బహు చిత్రము!
"ఎలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్"
****)()(****
(1905 లో రష్యా-జపాను యుద్ధంలో రష్యా దిగ్గజముపై చిన్న దేశము జపాను విజయము ప్రస్థావించ బడినది.అప్పట్లో అది సంచలనము)
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చిత్ర। మ్మెలుకయె...' అనండి.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2689
సమస్య :: *ఎలుక వధించె నేనుఁగు మహీనబలంబున విక్రమించుచున్.*
ఎలుక ఏనుగును చంపింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: ఛత్రపతి శివాజీ అని ప్రసిద్ధి వహించిన శివాజీ మహారాష్ట్రలో జన్మించి మన భారతమాతకు వీరపుత్రుడుగా వీరశివాజీగా కీర్తింపబడుతున్నాడు. జిజియా షాహాజీ పుణ్యదంపతుల సుపుత్రుడైన శివాజీ మొఘల్ రాజులను వ్యతిరేకించి మరాఠా సామ్రాజ్య స్థాపనకు అంకురార్పణ చేశాడు. దేశభక్తితో ధైర్యసాహసాలతో శక్తియుక్తులతో అనేక కోటలను జయించాడు. ఉక్కు కవచాన్ని ధరించి తన పిడి పులి గోళ్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను (నరసింహస్వామి వలె) చీల్చి చంపినాడు. ఆ సమయంలో అక్కడ ఉండిన శత్రుపక్షం వాళ్లు ‘’ ఈ శివాజీని చిట్టెలుక అని అనుకొన్నాము. ఐతే ఈ ఎలుక ఏనుగు లాంటి మన నాయకుని వధించింది’’ అని మాట్లాడుకొన్న సందర్భం.
పిలిచెద రెల్ల హిందువులు వీరశివాజి యటంచు భక్తులై
యిలను శివాజి వ్యక్తి యని యెంచితి మీతడు శక్తి యౌచు తా
నలయక కోటలన్ గెలిచె, నఫ్జలుఖానును జంపె గోళ్లఁ జి
*ట్టెలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (27-5-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికలనొక దట్టమౌనడవిఁ గంటిని యందొక కేసరమ్ము తా
రిప్లయితొలగించండిబలిమినినొక్క కుంజరముఁ బట్టుటకైపరుగెత్తిఁ దానితో
కలఁబడె రౌద్రరూపమున ఘర్జనఁజేయుచు, చూచుచుండనో
ఎలుక - వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.
తలచుచు తనసుతు మరణము
రిప్లయితొలగించండికలతను చెందిన గురువని కన్నరికాగా
తలద్రుంచి ద్రుపద సుతుడను
యెలుకయె కడు విక్రమించి యేనుగు జంపెన్!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సుతుడను నెలుకయె...' అనండి.
ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను! 🙏🙏🙏🙏
తొలగించండినా పూరణలో తప్పులను సవరణలను చూపిన శ్రీ BCM చక్రవర్తి గారికి కృతజ్ఞతలతో..
రిప్లయితొలగించండిమెలగక తాను నీచమని మెండగు దిగ్గజ రూపు గాంచుచున్
తొలగక దారి నుండి యది తొండము లోనికి దూరి యంతటన్
"యెలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్"
కలుగున నున్నదే యనుచు గ్రక్కున నెంచగ
రాదు చూడగన్
గురువుగారి సూచనతో రెండవ పాదము:
తొలగించండి"తొలగక దారి నండి యది తొండము లోనికి దూరి యంత నా"
విట్టుబాబు గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వలలో చిక్కిన సింహము;
రిప్లయితొలగించండికలుగును వీడియు బటువుగ కడు నేరుపుతో
వల కొఱికియు విడిపించగ
"యెలుకయె ; కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విడిపించగ। నెలుకయె...' అనండి.
మరియొక పూరణ:
రిప్లయితొలగించండిజై పాతాళ భైరవీ!!
కలలను దక్కునా యనెడి కాంచన కోటల రాకుమారియే
యిల గని తోటరామునిక నింపునఁ బ్రేమనుఁ బంచ గోరగా
చెలువము గోరు మాంత్రికుని చిత్తుగ దృంచెను దుర్బలుండటన్
"ఎలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్"
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పలు రీతుల హింసిం చు చు
రిప్లయితొలగించండిచలమున మెలగు చు వెలి గెడి సంకుచితాఖ్యు న్
కల కల ము రేపు నట్లు గ
నె లు క యె కడు విక్రమించి యేను గు జంపె న్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉలిలో సగమును గొఱికెను
రిప్లయితొలగించండినెలుకయెకడువిక్రమించి,యేనుగుజంపె
న్జలపతి పాపను గరమున
నలవోకగనెత్తిపైకి యవనింద్రోసిన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పైకి నవనిం..' అనండి.
ఎలుకను చిన్నజీవి యని యెన్నకు డేమరుపాటునందు, న
రిప్లయితొలగించండియ్యెలుకయె బొజ్జదేవరకు నింపొనగూర్చెడు నెక్కిరింతయౌ,
యెలుకయె కాచె నొక్కెడ మృగేంద్రునిఁ గానలఁ, దూరి తొండమం
దెలుక వధించె నేనుగు నహీనబలమ్మున విక్రమించుచున్.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నెక్కిరింతయౌ। నెలుకయె...' ఆనండి.
ఇల ఘన కీర్తినందుచు మహీతల మందున మేటి స్థానమున్
రిప్లయితొలగించండినిలిచిన వారిపై గెలువనేరదు నిక్కమనంచు దల్చినన్
దలపడి గెల్చె బంగ్ల యది ద్రావిడు సేనను విశ్వక్రీడలో
నెలుక వధించెనేనుగు నహీన బలంబున విక్రమించుచున్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అలనాటి యాంగ్ల పాలన
రిప్లయితొలగించండివలదనుచున్ గాంధి తాత వారల తఱుమ
న్నిలలో ఖ్యాతిని బడసెన్!
ఎలుకయె కడు విక్రమించి యేనుగు జంపెన్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅతిశయోక్తుల గైడు సందర్శకులు మెచ్చేట్టుగా చెప్పుచున్నాడు.😊
తొలగించండిఇలలో నిచ్చట జూడుడు
"యెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్"
తలకోన యడవి గొప్పిది
విలుకానికి యెదురు జింక వేడుక నిలిచెన్!
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జూడుం। డెలుకయె..' అనండి.
కలిగిన కొద్ది సైన్యమును క్రన్నన దింపి శివాజి, యుక్తితో
రిప్లయితొలగించండితలపడి యుద్ధరంగమున తద్దయు సత్త్వము తోనెదుర్చుచున్
మెలుకువతో చరించి కొనమేలుఫలమ్మును పల్కి రందరు
న్నెలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఖలుఁ డా సైంధవుఁడే వర
రిప్లయితొలగించండిబల సత్త్వమ్మున హరించెఁ బాండు సుతులలో
నలుగురి విక్రమ మకటా
యెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్ !
బల మది యెంత యున్న మఱి భద్రమె వేగ మొకింత లేనిచో
నలమటఁ జెంది యాఁకలికి నాగ్రహ మేసర సింహ రాజమే,
కలుఁగునఁ దూఱ సత్వరము గాంచి మృగేంద్రుని భీతి జెంది యా
యెలుక, వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.
తొలగించండిఅలుకను బూని పిలిచె హరి
రిప్లయితొలగించండినెలుకయె, కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్
చెలికాడే కోరగ బహు
బలమే దీర్చె నతనిచిరు పంతము నపుడున్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చులకన జేసి పోవుదురు చూపుచు దర్పము నాధిపత్యమున్
రిప్లయితొలగించండిబలముగ త్రోసి నోర్పరిని బంధనమై చెలగాటమాడి, ధీ
బలుడు నెదుర్చు కీలెఱిఁగి వాతను పెట్టును, కాలమేర్పడన్
ఎలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్౹౹
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హిరణ్యకశిప ప్రహ్లాద సంవాదము...
రిప్లయితొలగించండిచంపకమాల
పలుకులఁ జిక్క వోయి! హరి వాసము సర్వమటంచు నిక్కు చి
ట్టెలుకవు, కంభమందు కనిపించునొ? నీహరి యన్నఁ, బిల్వగన్
యెలుక, వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్
వెలువడి తా నృసింహముగ విష్ణువు! దైత్య విరోధి! క్రుద్ధుడై!!
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(దండకారణ్య గణేశ నిమజ్జనము)
కలవరమొంది కుంజరము కానన మందొకనాడు కాచుచున్
నలుబదిమంది లాగెడు వినాయక విగ్రహ యాత్ర జూడగా
ములుగుచు చచ్చె పుష్కరిని మూషిక రాజము మోయుచుండగా...
నెలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్
ములుగు = మూలుగు
పుష్కరి = ఏనుగు
(శబ్దరత్నాకరము)
పలు పరకాయ ప్రవేశము
రిప్లయితొలగించండిలలరించగ విఠ్ఠలార్య!లాశ్చర్యములే
నిలిపిన సినిమాలందున
ఎలుకయెకడువిక్రమించి యేనుగుజంపెన్!
చెలగగ శత్రుల జంపగ
రిప్లయితొలగించండినిలనే గావగ గణపతి నిక్కము జూడన్
కలుగున నాతని వాహన
యెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[ఏకచక్రపురాన సాధారణ బ్రాహ్మణుని వేషముననున్న భీముఁడు, భయంకరాకృతుఁడైన బకునిఁ జంపఁగా, జను లెట్లు నుతించిరో తెలుపు సందర్భము]
పలుక వశమ్ముగాని ఘన వర్ష్మముతోడ భయంకరాకృతిన్
జెలఁగుచు, నేకచక్రపుర జీవులఁ జంపి, భుజించు నా బకున్,
గలఁబడి చంప భీముఁడు, దగన్ మనుజుల్ నుతియించి రిట్టు "లా
యెలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్!"
అల ప్రహలాదుడెంతయు నహమ్మున వర్తిలు తండ్రి నవ్విధిన్
రిప్లయితొలగించండినెలకొను విష్ణు భక్తియను నిర్మలమై చను నాయుధమ్మునన్
గెలిచెను ధారుణిన్ విజయ కేతన.మెంతయు కాంతులీనగా
"ఎలుకవధించెనేనుఁగునహీనబలంబున విక్రమించుచున్"
ఎలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచు
రిప్లయితొలగించండిన్నెలుకవధించుటాగజ మునెక్కడనైననుజూచితేరిలన్
కలనునగంటివేయదియెకాకినినేనుగునేగురించియా
కలవరపాటుజెందుటకుకారణమేదిలచెప్పుమాయికన్
అల హస్తినా పురమ్మున
రిప్లయితొలగించండిబలమగు మోదీని గెలిచి పరిపాలించెన్
లలితమ్ముగ నరవిందుడు
"ఎలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్"
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండివెలసెను నాటకరమ్యత
ఇల కవి దిగ్గజము రచన నీడ్చిన కథలన్
ఎలమిని కుందా1 ధామపు
టెలుకయె కడు విక్రమించి యేనుగు జంపెన్
(1.శ్రీ కుందా సత్యనారాయణ రూపొందించిన శిల్పకళాధామము)
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిపలుకదు మౌజు వీడదదె పట్టు గజంబును డెస్కుటాపునన్
గిలికిన చాలు నా గురికి గిట్టును యేనుగు ముక్కలై చనన్
బలమన దేహభారమదె ,భ్రాంతి; గజానను మోయ గల్గదే?
ఎలుక వధించె నేనుగు నహీన బలంబున విక్రమించుచున్!(mouse ,desktop)
ఇల వింటిమి శివ మహిమను
రిప్లయితొలగించండికలుగగ మోక్షము సులువుగ కరికాళములే
యలుగుచు పెనగొన, నెచ్చట
నెలుకయె కడు విక్రమించి యేనుగు జంపెన్?
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,
బలిసిన పిల్లి యొక్కటి దబాలున పైబడి - రక్కి నా
యెలుక(న్) వధించె | నేనుగును + అహీనబలంబున విక్రమించుచున్
తల పయి కొట్టి క్రొవ్వును ముదంబున మెక్కి రహించె సింహ | మీ
యిల గల పెద్దజీవి సమయించి భుజించును చిన్న జీవి | న
ట్టులె నశియింప జేయు నరుడున్ నరునిన్ విచిత్ర సృష్టిలో !
* క్రొ వ్వు = మె ద డు *
తెలియక వెదకుచు నటునిటు
రిప్లయితొలగించండికలుగని తొండమున దూరి గానక దారిన్
గలగల దిరుగుచు కొఱుకుచు
ఎలుకయె కడు విక్రయించి యేనుగు జంపెన్!!!
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
"ఎలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ
జంపెన్"
సందర్భము: వృద్ధాప్యం పైబడే కొద్దీ శరీరపటుత్వం తగ్గిపోతుంది. యౌవనంలో వున్నట్టుగా వుండదు. "అయ్యో! ఒకప్పు డేనుగులా వుండేవా డిప్పు డెలుకలా తయారయ్యాడే!" అంటారు.
"శ్రీ వేంకటాచల నివాస శతకం"లో శ్రీ జనువాడ రామ స్వామి అనే ఒక (భక్త) కవి మిత్రుడు ఇలా పేర్కొన్నాడు.
"ఇంద్రజాలము చేయు నింద్రియములు జూడ భోగముల్ రోగముల్ జోల బాడు..
బలమున్న మొనగాడు భంగపడకపోడు వయసు పశ్చిమ దిశ వాలుచుండ..
కాళ్ళు చేతులు కూడ కదలనే కదలవు ఆసరా లేనిదే అడుగు లేదు.."
అని చెబుతూ చివరకు "ఏనుగని పిల్చి రొకనాడు ఎలుక నేడు.." అంటాడు.
వీధిలో వెళుతున్న ఒక పెద్దాయనను చూచి "ఏనుగులాగా వున్నవా డ దేమిటి? ఎలుకలా తయారయా" డని నే నంటే పక్కనే వున్న నా మిత్రుడేమో
" కాదు కాదు. ఎలుకే విక్రమించి యేనుగును చంపిందిలే!" అన్నాడు కవితాత్మకంగా...
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
"పలు వరుస లూడె; నెరిసెను
తల వెంట్రుక; లేనుగు వలెఁ దనరె; నెలుకయై
నిలిచె నత" డంటి ; సఖు డనె
"నెలుకయె కడు విక్రమించి
యేనుఁగుఁ జంపెన్"
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
పలుకులు నేర్చి కాంగ్రెసున పన్నుగ చేరుచు తెల్గుదేశమున్
రిప్లయితొలగించండినలుగురిలోన మెప్పుగొని నాయకు పుత్రిని పెండ్లియాడుచున్
వలపున నేత కూలబడ బాకును తీయుచు వెన్ను గ్రుచ్చెనే...
ఎలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్!