25, మే 2018, శుక్రవారం

సమస్య - 2687 (పాపి యగు సుతుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"పాపి యగు సుతుఁడు పితృవాక్పాలనమున" 
(లేదా...)
"పితృ వాక్పాలన మొక్కటే సుతునిఁ బాపిన్ జేయు నెల్లప్పుడున్"

67 కామెంట్‌లు:


 1. సతతము జిలేబి మేలగు
  పితృవాక్పాలనమె! సుతుని వృషలున్ జేయున్
  పతితుండగుచున్ పెద్దల
  సతతము కాల్చుకొని తినెడు సర్గము సుమ్మీ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. సతతము శ్రీహరి పదముల
  నితరము నేమియు నెరుగక నిర్మల భక్తిన్
  రతుడౌ ప్రహ్లాదునికిన్
  పితృవాక్పాలనమె సుతుని వృషలున్ జేయున్

  రిప్లయితొలగించండి
 3. మైలవరపువారి పూరణ

  ఈ సమస్య ఇంతకు ముందు ఇచ్చినట్లు గుర్తు... అప్పడు కూడా ఇలాంటి భావమునందే పూరించినట్లు గుర్తు..


  పిచ్చితండ్రి...

  బ్రతుకున్ నీకయి ధారపోసితిని , నన్ భారమ్ముగా నెంచి జే
  ర్చితి వృద్ధాశ్రమమందు , మన్మలను దర్శింపంగ నే నేరనా ?
  వెతలున్ జాలు ! విసమ్ము సుంత గొని వే వే తెమ్మనన్ ., దెచ్చుచో
  పితృ వాక్పాలన మొక్కటే సుతునిఁ బాపిన్ జేయు నెల్లప్పుడున్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా.పిట్టాసత్యనారాయణ
   పితృ గురు దైవంబులలో
   పితృ నాదేశంబు కుటిల ప్రేరిత మగుచో
   భ్రాతృవ్యుడు1 పాలిపగన్
   పితృ వాక్పాలనమె సుతుని వృషలున్ జేయున్
   (1.పగవాడు,శ.ర)

   తొలగించండి

  2. ఇంత కష్ట పెట్టేక (రెండున్నర పాదాల కష్టం ) ఆ ఒక్క విషమే సుతునికి పాపమన్నారు :) ముందు చేసిన పాపాలకు ఇదీ జమవేసుకుంటే సరి

   బాగుంది మీ పూరణ

   జిలేబి

   తొలగించండి


 4. యతికిన్, రేడునకున్,జనాళికిని గాయత్రీవలెన్ మంత్ర మౌ
  పితృ వాక్పాలన మొక్కటే! సుతునిఁ బాపిన్ జేయు నెల్లప్పుడున్,
  పతితుండై నిల బెట్టు నాతడి నిలన్ , వంచింప చూడంగన
  య్య! తరంబైనది కాదు మీర నతడయ్యావారి యాజ్ఞాపనల్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. స్తుతమతులెప్పుడుఁజేతురు
  పితృ వాక్పాలనమె-సుతుల వృషలుంజేయున్
  వితరణఁజూపక కడు నా
  తృతతో స్వార్దంబునొంద తేకువ లేకన్

  రిప్లయితొలగించండి
 6. పుత్రుని గాచును మహిలో
  పితృ వాక్పాలన మొక్కటే, సుతునిఁ బాపిన్ జేయు
  మాతృ పితరులకు సతము న
  వితృము తోడ నిడకున్న వేలను ధరణిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. విరుపుతో పూసపాటి గారు మీపూరణ చాలా బాగున్నది

   తొలగించండి
  2. పుత్రుని గాచును మహిలో
   పితృవాక్పాలనమె,సుతుని వృషలుం జేయున్
   మాతృ పితరులకు సతము న
   వితృము తోడ నిడకున్న వేలన్ ధరణిన్

   తొలగించండి
 7. హతమును జేసి హరి జపము
  సతతముగ హిరణ్యకశిపు సంకీర్తనమే
  పితరుని యాన తయినచో
  పితృవాక్పాలనమె సుతుని వృషలున్ జేయున్ ౹౹

  రిప్లయితొలగించండి
 8. వయసది మాత్రమే కాదు చూడ అనుభవమది
  తానుగా పెద్దది
  మంచినే కోరు పెద్దల మాటలు వినని బుద్ది
  తానది మొద్దుది
  సద్గతులు కలిగించి శాంతి గూర్చి పితృవాక్పాలన
  మొక్కటే
  సుతుని బాపిన్ జేయు నెల్లప్పుడున్ పితరుని
  హితోక్తి దాటుటే

  రిప్లయితొలగించండి

 9. అంతలోనే కందము మారెనయా తేటగీతిగ :)


  కందము ముతేట గీతిగ
  ఛందస్సులమార్చి జూడ చక్కన గునకో?
  డెందము మారక బోవగ
  నెందెందేదియును మార్చ నేమిఫలితమౌ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. కందంబు తేట గీతిగ
   ఛందస్సులమార్చి జూడ చక్కన గునకో?
   డెందము మారక బోవగ
   నెందెందేదియును మార్చ నేమిఫలితమౌ :)

   తొలగించండి


  2. కంది వారు ఏమి మార్చినా జిలేబి గారు మీ పదపేర్పులకు లోటే లేదు

   ఇలా యెంత కాలం రాస్తూ పోతారు ?

   తొలగించండి
  3. ఊపిరి ఉన్నంతవరకు మీ కోసం! శంకరాభరణం ఉన్నంత వరకు మా కోసం!
   🙏🙏🙏🙏🙏

   తొలగించండి


 10. ధర్మము విడిచి పనులనధర్మముగ చ
  లుప మనగ తండ్రియు పలుకులు విని చేయ
  దుష్టతనముల తప్పక దుండగీడు
  పాపి యగు సుతుఁడు పితృవాక్పాలనమున !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. సతతము పుణ్యమొసంగును
  పితృవాక్పాలనమె, సుతుని వృషలున్ జేయున్
  హితమును మరచుచు మాతా
  పితరుల హింసించి విడువ వీధులయందున్!!!

  ప్రతిపాలించును భువిలో
  పితృవాక్పాలనమె సుతుని, వృషలున్ జేయు
  న్నితరుల హింసించుచు కు
  చ్చితమగు కర్మముల నెల్ల జేయుచు దిరుగన్!!!

  రిప్లయితొలగించండి
 12. దుష్ట స హ వాస మును జేసి దురిత మతి ని
  తల్లి దండ్రుల దూషించు తనయుడ గు ను
  పాపి ;యగుసు తు డుపితృ వాక్పా ల నమున
  దాశరథి వోలె నుతు లంది ధరణి వెలుగు

  రిప్లయితొలగించండి
 13. డా.పిట్టా సత్యనారాయణ
  అతి గారాబము "మందు" సేవనము దా నాపంగ లేకుండుటల్
  ఋతమేదోయని తెల్పకుండుట సదానృతవాదిగా జూచుటల్
  సుతుడొక్కండని యాజ్ఞలీయక మనన్ సూత్రంబు జేపట్ట నా
  పితృవాక్పాలన "మొక్కటే సుతు"ని పాపిన్ జేయు నెల్లప్పుడున్

  రిప్లయితొలగించండి

 14. రమేశు గారి భావమునకు :)

  జతగూడన్ననుభుక్తి వారధిగ మేల్ జాగ్రత్త యంచున్ సదా
  వెతలన్ దీర్చును సద్గతుల్ జతగనున్ వేవేళ శాంతిన్నిడున్
  పితృవాక్పాలన మొక్కటే !సుతుని బాపిన్ జేయు నెల్లప్పుడున్
  పితరున్ పల్కు,హితోక్తులన్ విడుచుచున్ పింజారిగా బోవగన్!

  జిలేబి  రిప్లయితొలగించండి
 15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2687
  సమస్య :: *పితృవాక్పాలన మొక్కటే సుతుని పాపిన్ జేయు నెల్లప్పుడున్.*
  తండ్రి మాట వింటే అది కుమారుని పాపాత్ముని చేస్తుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: తండ్రి మాటను అనుసరించి అడవికి వెళ్లడానికి నిశ్చయించుకొన్న శ్రీరాముడు కౌసల్యామాతకు ఆ విషయాన్ని చెబుతూ అమ్మా! తండ్రి ఆజ్ఞ జవదాటరానిది. పూర్వము పరశురాముడు పితృవాక్పాలనకై తల్లియైన రేణుకాదేవి శిరస్సును ఖండించాడు. కండుడు అనే మహర్షి పితృవాక్పాలనకై ఒక ధేనువును చంపినాడు. సగరులు పితృవాక్పాలనకై భూమిని త్రవ్వుతూ ఎన్నో ప్రాణులను వధించారు. ఐతే వారు తండ్రి మాటను పాటించి పుణ్యాత్ములే ఐనారు. అని (అయోధ్యాకాండ, 21 సర్గ, 30, 31, 32 శ్లోకాల ద్వారా) విశదీకరించాడు. కాబట్టి పితృవాక్పాలన ఏ కుమారుని పాపాత్ముని చేస్తుంది? అని ప్రశ్నించే సందర్భం.

  పితృవాక్పాలనఁ గాన కేగి మనియెన్ విఖ్యాతి నా రాముడే,
  పితృవాక్పాలన కీర్తిఁ తల్లి నదె చంపెన్ జామదగ్న్యుండు దా
  పితృవాక్పాలనఁ కండుడన్ మునియె చంపెన్ ధేనువున్ కీర్తులన్,
  *పితృవాక్పాలన మొక్కటే(ఒక్కటి+ఏ) సుతుని పాపిన్ జేయు నెల్లప్పుడున్?*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (25-5-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్కని విరుపుతో బాగుందండీ అవధాని గారూ! అభినందనలు! 💐💐🙏🙏

   తొలగించండి
  2. శ్రీమతి సీతాదేవి గారూ!
   హృదయపూర్వక ప్రణామాలమ్మా.

   తొలగించండి

  3. అద్భుత మని చెప్పక వేరే యేమీ చెప్పలేము !

   ఇప్పుడే మీ రారా పోరా న్యస్తాక్షరి గళము కింది లింకులో విన్నా !

   You have a magical musical and mystic voice కోట వారు!

   http://naidu9962.blogspot.com/2018/05/12.html?m=1


   Cheers
   Zilebi

   తొలగించండి
  4. సహృదయులు జిలేబీ గారూ! ధన్యవాదాలండీ. మొత్తంమీద నా గళమును విని అభినందనలను అందించినందులకు తమరికి హృదయపూర్వక ప్రణామాలండీ.
   https://www.youtube.com/playlist?list=PLsD7N9XMHxWKfDtnnSd-ye-EsnhMK4A7V
   ఈ వీడియోలను కూడా చూడగలరు.

   తొలగించండి
 16. అధిక ధనమును గోరి దానడ్డదిడ్డ
  మైన యాంక్షలు విధియించి మనువు నందు
  నాడు బిడ్డల వేధింప నాజ్ఞ గొనిన
  పాపియగు సుతుడు పితృవాక్పాలనమున!

  రిప్లయితొలగించండి
 17. ధర్మ మార్గము నెపుడును తప్పరాదు
  తండ్రి చెప్పెననుచు మాట దాట రాదు
  తండ్రి పనుపున యనుచును దారితప్ప
  పాపి యగు సుతుడు పితృవాక్పాలనమున

  రిప్లయితొలగించండి
 18. తప్పిదంబులు సేయంగ దండ్రి పిలువ
  పాపియగు సుతుడుపితృవాక్పాలనమున
  దూరముంచగాదగునార్య!దురితుడయిన
  దండ్రి నెల్లవేళలయందు తక్షణంబ

  రిప్లయితొలగించండి
 19. చతురంబోధి పరీత భూవలయ రక్షా దక్షుడేయైననున్
  క్రతువుల్ పూజలు దానధర్మములనేకమ్మైననున్ జేసినన్
  హితుడౌ తండ్రిని లేక్కఁజేయక మదిన్ హీనంబుగానున్నదౌ
  పితృ వాక్పాలన మొక్కటే సుతునిఁ బాపిన్ జేయు నెల్లప్పుడున్
  (చిరుప్రయత్నం)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరణ:-

   చతురంభోధి పరీత భూవలయ రక్షా దక్షుడౌగాక స
   త్క్రతువుల్ పూజలు దానధర్మములసంఖ్యాకమ్ముగా జేసినన్
   హితుడౌ తండ్రిని లేక్కఁజేయక మదిన్ హీనంబుగానున్నదౌ
   పితృ వాక్పాలన మొక్కటే సుతునిఁ బాపిన్ జేయు నెల్లప్పుడున్

   తొలగించండి
 20. కవిమిత్రులారా,
  ఉదయం నుండి కరెంటు లేదు. సాయంత్రం దాకా రాదని చెప్పారు. ఫోన్ బ్యాటరీ తగినంత లేదు. కరెంటు రాగానే మీ పద్యాలను సమీక్షిస్తాను. అంతవరకు పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 21. తెలిసి జనకు కృపయుఁ దపోబలముఁ జంపెఁ
  దల్లిఁ దిరిగి ప్రాణ మొసఁగుఁ దండ్రి యంచుఁ
  బరశు రాముఁడు లేనిచోఁ బాడి కాదు
  పాపి యగు సుతుఁడు పితృవాక్పాలనమున


  పతితుండై యనిఁ దండ్రి సెప్పగను సంభావించె సుగ్రీవు స
  న్మతితో నా కపి యంగదుండు ఘనుఁడై మాత్సర్యమున్ వీడుచున్
  ధృత శాంతమ్మున రాముఁ డేఁగె వని సందేహించ కే మాత్రముం
  బితృ వాక్పాలన మొక్క టే సుతునిఁ బాపిం జేయు నెల్లప్పుడున్ ?

  రిప్లయితొలగించండి
 22. మిత్రులందఱకు నమస్సులు!

  [ప్రహ్లాదుని విష్ణు భక్తిని నిరసించుచు, హిరణ్యకశిపుఁడు విష్ణువుపై ద్వేషముం బూనుమని చెప్పుచున్నాఁడు. ఆ బాలకుఁడు పితృవాక్పాలకుఁడైనచో నవి యాతనిం బాపినిం జేయును గదా! యను సందర్భము]

  "హితుఁడౌ విష్ణువు నెల్లవేళలఁ గనన్ హృత్పద్మమందుం దగన్,
  బిత! నిల్పన్ దరిఁజేర్చునయ్య! హరిపై ద్వేషమ్మదేలా?"యనన్,
  "సుత! విష్ణున్ మదిఁ గొల్వ వీడు! మతఁ డీశుండౌనె? విద్వేషియౌ!
  నుతియింపం దగ!" దంచు నెప్పు డిదె విన్చున్! గాంచ, దైత్యేంద్రుఁడౌ
  పితృ వాక్పాలన మొక్కటే సుతునిఁ బాపిన్ జేయు నెల్లప్పుడున్!

  రిప్లయితొలగించండి

 23. సందర్భము -

  ఎలెక్ట్రిసిటీ డిపార్టుమెంటు లో పనిచేయు కొమరుడు, వాని తండ్రి కలిపి ఫ్యూజు పీకివేసినారు :)

  తండ్రి పల్కుల పాలన తప్పని గురు
  వర్యు లా కందివరులు కైపదము నిచ్చి
  నారు తనయుడ! విద్యుతు నాపి వేయి!
  పాపి యగు సుతుఁడు, పితృవాక్పాలన మునొ
  నర్చె నేమో కరెంటు సన్నబడె నేడు :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 24. పరశు రాముడానాడు తాపాపి యయ్యె
  తండ్రి మాట వినుచు తాను తల్లి దునిమి
  చేయ రాని దెపుడయిన చేసినంత
  "పాపి యగు సుతుఁడు పితృవాక్పాలనమున"

  రిప్లయితొలగించండి
 25. మాతనెదిరించి మాట్లాడుమాత్రముననె
  పాపియగు సుతుడు, పితృవాక్పాల నమున
  తల్లి తలనుఖండించగ తనివినొందు
  తండ్రి నాందిపొదవె జమదగ్ని సుతుడు

  రిప్లయితొలగించండి
 26. https://www.youtube.com/playlist?list=PLsD7N9XMHxWKfDtnnSd-ye-EsnhMK4A7V
  కోట రాజశేఖర్ సమస్యాపూరణ ల పద్యాల చిత్రీకరణ వీడియోలు.

  రిప్లయితొలగించండి
 27. శ్రీరామచంద్రులవారు తమ్ముడు భరతునితో....

  తేటగీతి
  "భరత! దుఃఖింప నిటనీకు పాడిగాదు
  ప్రజలు మెచ్చఁగ జేయుము పాలనమ్ము
  తండ్రి మాటను జవదాటఁ, దప్పె నేని
  పాపి యగు సుతుఁడుపితృవాక్పాలనమున"

  రిప్లయితొలగించండి
 28. ప్రహ్లాదునితో గురువులు!

  హితమౌ వాక్కుల నాలకించు, విడు హేయంబౌ సమాలోచనల్
  పితనీకున్ దగు శిక్షణల్ నిటను
  ప్రేమారంగ నేర్పించగన్
  సతమున్నివ్విధి శ్రీహరిన్ బొగడ సమ్మానంబు గాదు, వినా
  పితృవాక్పాలన మొక్కటే సుతుని పాపిన్ జేయు నెల్లప్పుడున్!

  రిప్లయితొలగించండి
 29. మాత పితరుల విడనాడు మనుజు డెపుడు
  పాపి యగు; సుతుఁడు పితృవాక్పాలనమున
  దైవ సములగు తలిదండ్రి దీవెన లిడ
  దాశరధిగ వెలుంగును ధరణి లోన

  నిన్నటి సమస్యకు నా పూరణ

  అద్దమందున చంద్రుడు ముద్దు గొలుపు
  కాలిడగ జూడ కొండలు కానుపించు
  పండుగా రవి వెల్గు ప్రభాతమందు
  భంగ పాటయె హనుమకు మ్రింగఁజూడ
  అంది యందని యందమే విందొసంగు

  23, మే 2018,న్యస్తాక్షరి - 52 (రా-రా-పో-రా) కి పూరణ
  రాజ్య భాగము నీయగ రాదనుచునె
  రణము జేయగ జూడగ రాదు మీకు
  పొందు సౌఖ్యము ;నష్టము పోరు సలుప
  రక్త మయమౌను హస్తిన రాజరాజ !

  రిప్లయితొలగించండి
 30. ఆలినలుగగ వెలయాలు నాదరించ?
  సంతుగలుగగ వారికి "వింతగాని
  పాపియగుసుతుడు"! పితృవాక్పాలనమున
  యెదుగలేకను చవటగాకుదుటబడుటె!

  రిప్లయితొలగించండి
 31. సతతము మాతా పితలను
  ధృతితో సేవించి నపుడు దేవుడె మెచ్చున్
  మతిచెడి వదరకు మెవ్విధి
  పితృ వాక్పాలనమె సుతుని వృషలున్ జేయున్?

  రిప్లయితొలగించండి
 32. "పితృ వాక్పాలన మొక్కటే సుతునిఁ బాపిన్ జేయు నెల్లప్పుడున్"
  "పితృ వాక్పాలన మొక్కటే సుతునిఁ బాపిన్ జేయదెప్పుడున్సూ
  సతులన్గూడిననప్పుడున్గలుగుబాశంబున్వెలార్చుచున్
  పతులంబట్లనుగాకయాసుతునిపాపంబంతపుణ్యంబెగా

  రిప్లయితొలగించండి
 33. క్రొవ్విడి వెంకట రాజారావు:

  నీతి నియమముల నెడలి నిత్యమంత
  మధువు మత్తులో తూగుచు నధముడైన
  పితర నెఱిలేని మాటలు వినుచు నుండ
  పాపియగు సుతుడు పితృవాక్పాలనమున

  రిప్లయితొలగించండి
 34. మతిలో ప్రేమము నిండియుండ నిల సన్మానించి మాతన్ పితన్
  సతతమ్మున్ హృదయమ్మునందు ఘనమౌ స్థానమ్ము కల్పించుచున్
  హితులన్ కూర్మిని చూచుచున్ కొలువ సర్వేశున్ ధరన్నెవ్విధిన్
  పితృవాక్పాలన మొక్కటే సుతునిఁ బాపిన్ జేయు నెల్లప్పుడున్?

  రిప్లయితొలగించండి
 35. ధర్మబద్ధముగానట్టి కర్మలెపుడు
  చేటొర్చునువాటిని సేయతగదు
  పరహితముగానిపనుల చేపట్టినంత
  పాపియగు సుతుండు పితృవాక్పాలనమున!

  రిప్లయితొలగించండి


 36. పాలసుడగు వృషలుడగు పావియగుచు
  కావలుడగుచు దోషియు కల్కముడగు
  పాపియగు సుతుండు, పితృవాక్పాలనమున
  మారి మంచిపేరును గాంచు, మహిని సుదతి!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 37. ఆటవిడుపు సరదా పూరణ:
  (Bride Burning)

  పతివా నీవుర పాదసేవకుడవా భార్యా మహారాణికిన్
  బ్రతుకేనా యిది కొటికోటి విలువౌ బంగారమున్ గూర్చదే
  సుతుడా వేగమె నగ్గిపెట్టె కొని నా శోకమ్ము దీర్చోయనన్
  పితృ వాక్పాలన మొక్కటే సుతునిఁ బాపిన్ జేయు నెల్లప్పుడున్ :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ సరదా పూరణ ప్రేరణగా మధ్యతరగతి భార్యాభర్తల సంభాషణ..,

   పతివో!నాగతివో!మతిభ్రమల సంపాదించినావోకుటుం
   బతిరోధానపురోగసంగతుల
   సంబంధంబులేగాననీ
   పితృవాక్పాలనమొక్కటే సుతుని పాపిన్ జేయునెల్లప్పుడున్
   సతి! సౌభాగ్య! ముఖారవింద! సురసా! శారీరసౌందర్య సం
   గతులంజేసినఖర్చునోర్చినమహా
   గాంభీర్యమేగాని నే
   నతిగాఁనాకయిగూర్చుకొన్నదొక టైనన్ లేదు సంసారమే
   గతులన్ ద్రిప్పనెఱుంగలేము సుత! జాగ్రత్తా!యనే జెప్పితిన్

   గౌరీభట్ల బాలముకుందశర్మ

   తొలగించండి
 38. వెతలం బెట్టుచు వేడ్క జూచును సదా పీడించు విత్తమ్ముకై
  చితులం బేర్చును జీవ ముండగనె చీచీ యంచు మీకై కటా
  అతిగారాబము చేసి బోధనము జేయంబోమి ముఖ్యమ్ముగా
  పితృ వాక్పాలన మొక్కటే సుతునిఁ బాపిన్ జేయు నెల్లప్పుడున్.

  రిప్లయితొలగించండి
 39. గతులన్ గోరెడు మానవాళికిల సత్కార్యమ్ము గానిల్చి, స
  ద్గతులిచ్చేవ్రతమంచు నన్నడగినన్ గల్పమ్ములో గాంచినన్
  పితృవాక్పాలన మొక్కటే, సుతుని బాపిన్ జేయు నెల్లప్పుడున్
  నతిగా లోభము భోగలాలసయు నత్యాశంచు గుర్తింపుమా.

  రిప్లయితొలగించండి
 40. జనకుని హిరణ్య కశిపుని శాసనమ్ము
  లఁ భయ భక్తితోడ నట ప్రహ్లాదు డపుడు
  విడక తానాచరించినన్ బుడమిని కడు
  పాపియగు సుతుడు పితృవాక్పానమున

  రిప్లయితొలగించండి
 41. మత్తేభవిక్రీడితము

  మతిమంతుండవు శోకమేల? భరతా!మన్నించు నా మాటలన్
  హితమున్ గూర్చెడు పాలనమ్మిడుచు నీవేలంగ రాజ్యప్రజల్
  వెతలన్ జూడరు, తండ్రిఁ గాదనకు మేవేళైన మీరంగఁ ద
  త్పితృవాక్పాలన మొక్కటే సుతునిఁ బాపిన్జేయు నెల్లప్పుడున్!

  రిప్లయితొలగించండి
 42. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. ..
  పాపి యగు సుతుఁడు పితృ వా క్పాలనమున

  సందర్భము: కోడలు అత్త మామల మాట వినదు. దానివల్ల పాప భాజనురా లౌతున్నది. కొడుకేమో తండ్రి మాట వినడంవల్ల క్రమంగా పుణ్యశీలి అవుతున్నాడు.
  ఆలు మగలు తూర్పు పడమరలుగా తయా రౌతున్నారే! వీరి కాపురం మునుముం దెట్లు కానున్నదో అని ఇరుగు పొరుగు వా రనుకుంటున్నా రట!
  విగత పాపి= విడిచిపెట్టబడిన పాపం
  గలవాడు.. అనగా పుణ్యాత్ముడు
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  "వినకు మత్త మామల మాట బిడ్డ!" యనెడు
  తనదు తల్లి మాటే వేద మనెడు కోడ
  లగును పాపి ; కాపుర మెట్టు లగునొ! విగత
  పాపి యగు సుతుఁడు పితృవా క్పాలనమున

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 43. అతిగా నొల్లుచు మేఘనాదు డకటా హైరాణ నొందెన్ గదా
  జతగా రాముడు భార్యనగ్నినట తా జంపింగు జేయించెగా
  పిత వాక్కుల్ విని మన్మథుండు వడిగా వీడెన్ గదా దేహమున్
  పితృ వాక్పాలన మొక్కటే సుతునిఁ బాపిన్ జేయు నెల్లప్పుడున్!

  రిప్లయితొలగించండి