14, మే 2018, సోమవారం

సమస్య - 2678 (కోబ్రా తెమ్మనెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కోబ్రా తెమ్మనెను భార్య కోరిక లెసగన్"
(లేదా...)
"కోబ్రా తెమ్మని కోరె భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపఁగన్"

82 కామెంట్‌లు:

  1. అబ్రాశి దాటి త్వరలో
    సుబ్రావే వచ్చునంచు సుదతికి తెలియన్
    నబ్రముతో జెప్పెను తన
    కో బ్రా తెమ్మనెను భార్య కోరిక లెసగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు!

      తొలగించండి
    2. అబ్రాశి (అప్+రాశి) పదమే అబ్రాడ్ అని అయ్యిందేమోనని మీ పద్యంలోని మొదటి పదం చూడగానే అనిపించిందండీ. నమోనమః పద్య విరించి గారూ!

      తొలగించండి
    3. నమస్కారములు అవధాని గారికి ధన్యోస్మి

      తొలగించండి
  2. 1955:. నెల్లూరు:

    ఆ బ్రాహ్మణి పతితోననె:
    "నా బ్రతుకిక భారమాయె నవ్వుల పాలై";...
    అబ్రముగా నున్నది తన
    కో "బ్రా"తెమ్మనెను భార్య కోరిక లెసగన్ :)

    అబ్రము = అబ్బురము
    (శబ్దరత్నాకరము)

    రిప్లయితొలగించండి
  3. అబ్రంబేమిది ? నాల్గుకూడలుల నాటాడించు సర్పమ్ములన్
    సుబ్రహ్మణ్యుడు ., "పాతపాములనగన్ జూడంగ రారైరి , వీ
    రేబ్రంబందిరి చూచి చూచి , యిక తీరెన్ మోజు ! నూత్నమ్మునౌ
    కోబ్రా తెమ్మని" కోరె భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపఁగన్ !!

    కోర్కెల్ పిసాళింపఁగన్... ( ప్రేక్షకులకు )

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిమైలవరపు వారి పూరణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొత్త కోబ్రాను తెమ్మని కోరిన భార్య మాటలుగా మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు!

      తొలగించండి

  4. శేష శైలం వెళ్లి వస్తే కోబ్రా ఎఫ్ఫెక్ట్ ఇంత ఉంటుందా :)


    అబ్రక దబ్రా యనెడా
    సుబ్రహ్మణ్యుడు మగడు, వెసులుబాటుగనన్
    జబ్రవముకాబలయనెడు
    కోబ్రా, తెమ్మనెను భార్య కోరిక లెసగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జబ్రవము కాబల! నమోనమః! ఏమి పదవిన్యాసం!! 🙏🙏🙏
      ఆంధ్రభారతికి మీరు బ్రాండ్ అంబాసిడర్!
      👏👏👏👏👏

      తొలగించండి

    2. :) జబ్రవముకాబల :) యెందుకు తెమ్మనట్టు ఆ సతి ? :)


      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ!
      జబ్రవ ముకాబలా అనే కోబ్రాను తెమ్మన్న భార్య మాటలుగా మీ పూరణ బాగున్నది. అభినందనలు!

      తొలగించండి
    4. ఆల్జీబ్రా కూడ ఒక బ్రాండు బ్రా యేమో! 😆😆😆

      తొలగించండి
  5. ఏబ్రా సిగనింట తిరుగక
    జీబ్రా వలెబయటి కేగి జీడిలు తేవన్
    బబ్రాజ మానం బనకను
    కోబ్రా తెమ్మనెను భార్య కోరిక లెసగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్య గారూ!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు!
      మూడో పాదంలో గణభంగం. బభ్రాజమానమనకను...అనండి.

      తొలగించండి
    2. ఏబ్రా సిగనింట తిరుగక
      జీబ్రా వలెబయటి కేగి జీడిలు తేవన్
      బబ్రాజ మానమన కను
      కోబ్రా తెమ్మనెను భార్య కోరిక లెసగన్

      ధన్య వాదములు మధుర కవిగారు

      తొలగించండి


  6. ఇవ్వాళ సందర్భం రాయాలె :)


    సుబ్రహ్మణ్యుడు ఐటి మానవుడు; మగడు; సదా ఆఫీసే ఇల్లు ఇల్లే ఆఫీసు; చెవిలో ఎప్పడూ బ్లూటూత్ 'జాబ్రా' బ్రాండ్ (ఇది చాలా ఎక్స్ పెన్సివ్ :)) 'ఇన్ ఇయర్' ఫోన్ తో తిరుగు తూంటాడు

    భార్య తో షికారు కు పోయినా ఇన్ యియర్ విడువడు !

    అట్లాంటి మగడి ని ఎట్లా మరి మూడు మార్చేది :)

    నారాయణ ! శేష శైల వాసా !

    నీ దరికి వెళ్లి వస్తే కోబ్రా లు కనబడట మేమి ట యా !

    అంతా విష్ణు మాయ !



    జాబ్రాయిన్నియరై సదా తనకు బేజారున్ ప్రచారించు శ్రీ
    సుబ్రహ్మణ్యుని, పెన్మిటిన్ గనుచు,యుస్సూరంచు,చొప్పించగన్
    తా బ్రాంతిన్ తన పైన, బిల్చి, "మగడా ! తాంతమ్ము గానుండె! నా
    కో బ్రా తెమ్మని" కోరె భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపఁగన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీగారూ!
      తాంతంగా (బడలికగా) ఉన్న భార్య తనకో బ్రా తెమ్మని మగని గోరినట్టుగా చేసిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు!

      తొలగించండి
  7. సుబ్రావ్!మతి పోయినదా?
    యాబ్రాహ్మణుడు పలికె ననుచు నంటివి గాదే?
    యేబ్రాహ్మణు డెప్పుడు నిను
    "కోబ్రా తెమ్మనెను భార్య కోరిక లెసగన్"
    ****)()(****
    (సుబ్బారావు = సుబ్రావ్ ;" దేశ్య పదముల నెటులైనను సంశ్లిష్టము చేయ వచ్చును." -సీ.వీ. సుబ్బన్న శతావధాని -'అవధాన విద్య')

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన్ గారూ!
      సుబ్రావును గూర్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు!

      తొలగించండి
  8. వైకుంఠపాళిగా సంసారమును పెనిమిటి సతితోడ
    వర్ణించగన్
    నేనిదె అనకొండను మరి మీరదె నీటిపామనుచు
    ఫక్కున నవ్వెన్
    నాగబంధమును పోలు వడ్డాణము నడుముకు చుట్ట
    నాకందమనుచున్
    కోబ్రా తెమ్మని కోరే భార్య మగనిన్ కోర్కెల్
    పిసాళింపగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రమేష్ మిత్రమా ఏపద్యమిది మీరు వ్రాసినది

      తొలగించండి
    2. రమేశ్ గారి ఛందస్సు మీ కర్థం కాదండీ! వారు స్వేచ్ఛా వాదులు (కవులు)! :-)

      తొలగించండి


  9. తా బ్రాంతిన్,మరులున్ ఘటిల్ల తనతో తాంబూలమున్దూకొన
    న్నాబ్రాజిష్ణువు సంతసమ్ము గనుచున్నారిన్, మహారాణి! యిం
    కో "బ్రా" తెమ్మని కోరె; భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపఁగన్
    తాబ్రాగబ్బముగామదిన్ తలచి ప్రాతాంబూలమున్దెచ్చెనే‌!

    ప్రా - శ్రేష్టము

    అర సున్న లతో ప్రా బ్రా అవుతుందనుకుంటా ! అర సున్న యెట్లా టైపు చేయడమో తెలియదు


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. “జిలేబి” గారూ, లేఖిని లో అరసున్న వ్రాయు విధము 👇:-
      ——————-
      “ అరసున్న మరియు విసర్గలని ఎలా టైపుచెయ్యాలి?
      అరసున్నకి @M, మరియు విసర్గకి @h ని వాడండి.

      telu@Mgu. gatam gata@h→ తెలుఁగు. గతం గతః “
      ———————-
      (సౌజన్యం :- లేఖిని లో “సహాయము” లింక్)

      తొలగించండి


    2. తా బ్రాంతిన్,మరులున్ ఘటిల్ల తనతో తాంబూలమున్దూకొన
      న్నాబ్రాజిష్ణువు సంతసమ్ము గనుచున్నారిన్, మహారాణి! యిం
      కోఁ "బ్రా" తెమ్మని కోరె; భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపఁగన్
      తాఁబ్రాగబ్బముగా మదిన్ తలచిఁ బ్రాతాంబూలమున్దెచ్చెనే‌!


      జిలేబి
      విన్నకోట వారికి ధన్యవాదములతో

      తొలగించండి
    3. జిలేబీ గారూ!
      మీ నాల్గో పూరణ బాగున్నది. అభినందనలు!
      మూడో పాదంలో యింకో బ్రా... సరిపోతుంది. అరసున్నా అవసరంలేదు. నాల్గో పాదంలో తలఁచి తర్వాత అరసునా అవసరంలేదు. ప్రాతాంబూలము?

      తొలగించండి
  10. ఓ బ్రాహ్మణి భర్తనిటుల
    నబ్రపరచి పిలిచె నామమాంగ్లమ్మందున్
    "నా బ్రతుకున ముదమును కింగ్
    కోబ్రా! తెమ్మనె"ను భార్య కోరిక లెసగన్(నాగరాజా! అని ఆంగ్లమున సంబోధన)
    (చిరు ప్రయత్నం)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు!
      ముదమిడు కింగ్ కోబ్రా అంటే సరిపోతుంది.

      తొలగించండి
  11. అమెరికాలో కోబ్రా అనే మాట మెడికల్ ఇన్సురన్సు కోసం ప్రత్యెక సందర్భాలలో బాగా వాడతారు :-)

    రిప్లయితొలగించండి
  12. సుబ్రహ్మణ్యుని దయతో
    నబ్రంబుగ సంతుగల్గు నాగ్రహమేలా?
    సుబ్రావూ గొల్వ రజత
    కోబ్రా తెమ్మనెను భార్య కోరిక లెగయన్!

    సంతు కలగాలనే కోర్కె లెగయ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ!
      మీ పూరణ (రజత కోబ్రాతో) బాగున్నది. అభినందనలు!

      తొలగించండి
    2. ధన్యవాదములు మధురకవి గారూ! నమస్సులు! 🙏🙏🙏🙏

      తొలగించండి
  13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-
    సమస్య :: *కోబ్రా తెమ్మని కోరె భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపగన్.*
    కోబ్రాని అంటే నాగుపామును తెమ్మని భార్య భర్తని కోరింది కోరికలు పెరుగుతూ ఉండగా అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన విషయం.
    సందర్భం :: ఇటీవలి కాలంలో పామువిషంతో ఔషధాలు తయారుచేస్తున్నారని వాటిలో కొన్ని కామోద్దీపనకు ఉపయోగపడతాయని వినిన భార్య భర్తతో ఏమండీ! ఇక మనం ఎల్లప్పుడూ యౌవనంతో ఉండవచ్చు. సుఖాలలో మునిగి తేలవచ్చు. ఎలాగైనా సరే గట్టిగా ప్రయత్నించి ఒక కోబ్రాను తీసికొనిరండి అని ప్రేమతో చెప్పే సందర్భం.

    కోబ్రా కోరలలోన నున్న విషమే కొంగ్రొత్త కామౌషధ
    మ్మౌ బ్రాయమ్మును బెంచు నందు, రిక బ్రహ్మానందమున్ పొందగా,
    లేబ్రాయమ్మిది ధన్యతన్ గనగ, సంప్రీతిన్ ప్రయత్నించుచున్
    *కోబ్రా తెమ్మని కోరె భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపఁగన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (14-5-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోట వారూ!
      కోబ్రా తెమ్మని భార్య మగని గోరినట్టుగా చేసిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు!

      తొలగించండి
    2. సహృదయులు శ్రీ మధుసూదన్ గారూ! హృదయపూర్వక ధన్యవాదాలండీ.

      తొలగించండి
  14. మిత్రులందఱకు నమస్సులు!

    "ఏబ్రాసి మొగమువాఁడా!
    జీబ్రా క్రాసింగు దాఁటి చెచ్చెఱఁ జని, యా
    యబ్రహము షాపుననె నా
    కో బ్రాఁ దె" మ్మనెను భార్య కోరిక లెసఁగన్!

    రిప్లయితొలగించండి
  15. అబ్రమ్ముగ పేరులనిడు
    సుబ్రహ్మణ్యము మిటాయి చోద్యపు బేరున్
    "గోబ్రా " యని పెట్టంగా
    కోబ్రా తెమ్మనెను భార్య కోరిక లెసగన్ .
    (కొత్త స్వీటు కోబ్రా కోసం భార్యామణి తహతహ )

    రిప్లయితొలగించండి
  16. కోబ్రా చిహ్నము గలిగిన
    నా బ్రాండ్ మిష్టములె జనుల కమృత సమమ్మో
    యేబ్రాండో మన కేలయ?
    "కోబ్రా తెమ్మనెను భార్య కోరిక లెసగన్"
    ***)()(***
    (మిష్టములు = Sweets)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన్ గారూ!
      కోబ్రా బ్రాండ్ మిష్టములు తెమ్మన్నట్టుగా చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు!

      తొలగించండి


  17. ఖోప్రా - కొబ్బరి తెమ్మని రాయమంటే పరమానందయ్య శిష్యపరమాణువు కోబ్రా అని రాయటం తో వచ్చిన చిక్కు :)


    "కోబ్రా తెమ్మని కోరె భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపఁగన్"
    ఏబ్రాసీ! నిను రాయమన్నదిదియే? యేమయ్యెరా బుర్రయున్?
    ప్రా "బ్రా" గయ్యెను "ఖో " యయేనుగద "కో"! ప్రాతఃసభాప్రాంగణం
    బే బ్రోచెన్ గద బ్రాను లాగుచుమరీ బెంబేల కోబ్రానిటన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ!
      శిష్యుల తప్పిదముగా చేసిన మీ మరో పూరణ చాలా బాగున్నది.

      తొలగించండి
  18. ఏ బ్రాయును లేదని నా
    కో బ్రా తెమ్మనె ను భార్య కోరి క లె స గ న్
    సుబ్రా వు కుసైజు తెలియ
    కా బ్రాతేలే క పోయె నాలియు నలిగెన్

    రిప్లయితొలగించండి
  19. అబ్రాజి పురము వెళ్ళిన
    నాబ్రహ్మముఫోనుజేసి యాలిని నడుగ
    న్నబ్రమయనిదలచకదన
    కో,బ్రాతెమ్మనెనుభార్య కోరిక లెసగన్

    రిప్లయితొలగించండి
  20. కుబ్రా లకుతెలుప వలదు
    సెబ్రా పనియని పలుకును,సిగ్గుపడకుమా
    కబ్రా వస్త్రమ్మిది నా
    కో,బ్రా తెమ్మనెను భార్య కోరిక లెసగన్
    కుబ్రా = పెద్దలు, కబ్రా నలుపు తెలుపు వర్ణము గల సెబ్రా = చెడు

    ఉమ్మడి కుటుంబములో వచ్చిన నాగరిక కోడలు భర్త తో బజారు కెళుతున్న భర్తకువ తన రవిక యిచ్చి దాని మాచింగు బ్రా ఒకటి పెద్దలకు తెలియకుండా తెమ్మని అడుగు సందర్భము

    రిప్లయితొలగించండి
  21. అబ్రయన పలుచనిది,అల్
    జీబ్రా మగడా, కలిగెను చీరెకు జాకెట్,
    ఝబ్రా రవికలకున్,నా
    కో బ్రా తెమ్మనెను భార్య కోరిక లెసగన్

    రిప్లయితొలగించండి
  22. ఏబ్రాసి ముఖము వాడా!
    సుబ్రావా! నాదు నాన్నచుట్టమనుచు నీ
    తో బ్రతుకు కలిపె, కని నా
    కో బ్రా తెమ్మనెను భార్య కోరిక లెసగన్

    రిప్లయితొలగించండి
  23. కందం
    తా 'బ్రా' యను 'బార్' నట చా
    కోబ్రాఁ దెమ్మనెను భార్య కోరిక లెసగ
    న్నబ్రపడను 'చాకోబార్' 
    నే, బ్రియమగు నైసు క్రీము నెంచెన్ దినగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వారూ!
      చాకోబార్ కోబ్రా తెమ్మన్నట్టుగా చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు!

      తొలగించండి
    2. ఆర్యా! ధన్యవాదములు. బార్ అను మాటను బ్రా అని పలకడం వల్ల చాకోబార్ ను చాకోబ్రా అని పలికినట్లు నా భావన.

      తొలగించండి
  24. రిప్లయిలు
    1. ఈ “బ్రా” నెక్కడ విన లే
      దీ బ్రహ్మాండమ్ము నందునె నిఘంటువునే,
      యబ్రమ వర్ణం బేమిటొ
      కో “బ్రా”, తెమ్మనెను భార్య కోరిక లెసఁగన్


      ఈ బ్రహ్మాండము నందుఁ జిత్రములు మెండే చుమ్ము చింతింపగా
      యే బ్రుంగంగ నిజమ్ము నిష్కరుణ నే డీ కామ వహ్నిన్ వెసం
      దా బ్రాఁతిం బరమాప్తు నొక్క నిసి నాథా మల్లియల్ ప్రీతి యా
      కో బ్రా తెమ్మని కోరె భార్య మగనిం గోర్కెల్ పిసాళింపఁగన్

      [యాకోబ్ +రా = యాకోబ్రా; యాకోబ్ : ఆమె భర్త పేరు]

      తొలగించండి
    2. పోచిరాజువారూ!
      మీ రెండు పూరణలూ [యీ కోబ్రా యేమిటో అనీ, యాకోబ్ రా అనీ] అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు!

      తొలగించండి
    3. కవిపుంగవులు మధుసూదన్ గారు సప్రణామ ధన్యవాదములు.

      తొలగించండి
  25. అబ్రంపు సీరియలులో
    నేబ్రాసి సవతిని జంప నేసిన స్కీమున్
    సుబ్రావూ గ్రక్కున నొక
    కోబ్రా దెమ్మనెను భార్య కోరిక లెగయన్!

    రిప్లయితొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  27. శుభ్రతగోరేడు సతియు
    నేబ్రాసి మగనిని జూచి నెయ్యపు మేలన్
    అబ్రకదబ్రను మాటల
    కోబ్రా, తెమ్మనెను భార్య కోరిక లెసగన్!

    రిప్లయితొలగించండి
  28. గుండు మధుసూదన్ గారూ,
    కవిమిత్రుల పూరణలను సమీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు.
    నేను తిరుగు ప్రయాణంలో ఉన్నాను. ఇక్కడే నల్గొండ దాటాను.

    రిప్లయితొలగించండి

  29. అబ్రముగానడిగె గోమున

    .కోబ్రా తెమ్మనెను భార్య కోరిక లెసగన్

    శుబ్రముగా కొలుతునునే

    సుబ్రమ్మణ్యుడని తలచి సుతునిమ్మనుచున్.

    రిప్లయితొలగించండి

  30. అబ్రహముసతికి చవితీ
    రఁబ్రాంగణమందు దాసి లాభించనిచే
    తఁబ్రేమ కురిపించుచు తన
    కో బ్రా తెమ్మనెను భార్య కోరిక లెసగన్

    రిప్లయితొలగించండి
  31. అబ్రకదబ్రా యనగా?
    విబ్రాంతిని గొల్పురీతి వెలువడెధనమే!
    అబ్రహ మానందంచగ
    కోబ్రాతెమ్మనెనుభార్య కోరిక లెసగన్

    రిప్లయితొలగించండి

  32. రమేశు గారి భావనకు :)

    ఓఁబ్రాయంపు సతీ ! జిలేబి వినవమ్మో పాము లాటే సుమా
    యీ బ్రాంతిన్ కలిగించు జీవనము!ఓయీ నీవు కీలాల పా
    మై బ్రాకన్నన కొండ నేను! సఖుడా! మైకమ్ములో త్రోసెద
    న్నీ బ్రాకెట్టు కిలంబు నందు!జడియన్నీవున్కొనాలయ్య నా
    కై,బ్రాంచత్యహిరూప కౌను గతిలన్! కయ్యాటలో నోడగన్
    కోబ్రా తెమ్మని కోరె భార్య మగనింగోర్కెల్ పిసాళింపఁగన్!


    జిలేబి
    హమ్మయ్య కిట్టించా :)

    రిప్లయితొలగించండి
  33. పాకమె జిలేబి కాయువు,
    పాకమె చలిమిడి కిగాలి,పాకమె జామూన్
    సూకము,పలువిధ కవనపు
    పాకము వండెడి జిలేబి భారతి యేగా

    రిప్లయితొలగించండి
  34. అబ్రాడేగితివోయి భూరిధనమ్మార్జింపగన్ దాటుచున్
    న్నబ్రాశిన్, విడి స్వంత దేశమును భార్యా పిల్లలన్ గాదె, నీ
    వా బ్రాంతిన్ విడకుండ వచ్చుతరి నీవా రిక్త హస్తాన రా
    కో ! బ్రాతెమ్మని కోరె భార్య మగనన్ కోర్కెల్ పిసాళింపగన్.

    రిప్లయితొలగించండి
  35. అబ్రాశిని దాటుచు మీ
    కో బ్రదరే వచ్చె తాను కోకయె తెచ్చెన్
    జీబ్రా గీతల వెందుల
    కో, బ్రా తెమ్మనెను భార్య కోరిక లెసగన్.

    రిప్లయితొలగించండి
  36. సుబ్రావన్నయ జెప్పి నాడు మిముఁ దాఁ జూడంగఁ బేకాటలో
    నేబ్రాసీ! మముఁ జూడ రావు తగమే! యిట్లైన సంసారమ
    న్నబ్రాశిన్ బ్రతుకెట్లు? చావుటకునై హాలాహలమ్మున్న వెం
    కోబ్రా! తెమ్మని కోరె భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపఁగన్
    (భర్త పేరు వెంకోబు)

    రిప్లయితొలగించండి
  37. డా.పిట్టాసత్యనారాయణ
    లేబ్రాయమ్మున కుడుకల్
    వే బామిన యెడద పెంపు వీల్గన,నిపుడే
    నీ బ్రాపున 'జక్రస్తన,కో(Co,)(company)
    బ్రా తెమ్మనెను భార్య కోరిక లెసగన్




    రిప్లయితొలగించండి
  38. డా.పిట్టాసత్యనారాయణ
    ఈ బ్రాహ్మణ్యము నొంటి నంటు మడుల న్నిందాక నే గొంటి నా
    సాంబ్రాణీపొగ పస్పు గంధముల సత్ సాంగత్యమే చెల్లె నిం
    కే బ్రాపున్ గన, నవ్య పోకడలవౌ దివ్యాంబరాలెంచి వెం
    కోబ్రా(వ్) తెమ్మని కోరె భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపగా(న్)

    రిప్లయితొలగించండి
  39. డా.పిట్టానుండి
    ఆర్యా,
    నా కంద పద్య 2వ పాదములో,'వే బ్రాతిని యెడద..' గా ‌వరించ గలరు.

    రిప్లయితొలగించండి
  40. డా.పిట్టానుండి
    ఆర్యా,
    నా కంద పద్య 2వ పాదములో,'వే బ్రాతిని యెడద..' గా ‌వరించ గలరు.

    రిప్లయితొలగించండి
  41. నెబ్రాస్కా నగరిన్ జనించి ప్రియమున్ నేపాలులో కూడగా
    చేబ్రోలున్ గల రైతు భర్త నొకనిన్ చెండాడి చీల్చుంచుచున్...
    ఏబ్రాసీ! ఇవి యిడ్లి బాడిలనుచున్ యెర్రోడ! నీవింక నా
    కో బ్రా తెమ్మని కోరె భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపఁగన్

    రిప్లయితొలగించండి