17, మే 2018, గురువారం

దత్తపది - 139 (దేవకి-యశోద-సుభద్ర-రాధ)

దేవకి - యశోద - సుభద్ర - రాధ
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

47 కామెంట్‌లు:

 1. మైలవరపు వారి పూరణ

  యాగరక్షణకు శ్రీరాముని కోరవలదని... నన్ను కోరితే వెంటనే రాగలనని... దీనిని అపరాధముగా దలపవలదని.. దశరథుడు విశ్వామిత్రునితో పలికి ప్రాధేయపడుచున్న సందర్భము...  దేవ ! కిసలయ సమ గాత్రుఁ దెలిసి కోర
  క్షుద్ర దైత్యులఁజంప , యశోదమగునె ?
  అది సుభద్రమ్ము గాదు ! నన్నడుగ వత్తు
  రయమున ! ., దలపవలదపరాధమనుచు !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. (విభీషణుడు రామచంద్రునితో )
   దేవ ! కిమిద మ్మనగరాదు కావవయ్య !
   శరణు !ఘనయశోదత్తుడ ! సత్వమూర్తి !
   రామ! తావకీన చరణారాధకుండ !
   మనసు భద్రము నాకింక మధురవచన !

   తొలగించండి
 3. బ్రహ్మ నా(రాధ)నము జేసి ఫలము నొందె,
  వర (యశోద)కలశము ను దరములోన
  పారెను , కలుగ దంహ(సు, భద్ర) పరచ
  బడిన భాండము శరముతో పగుల గొట్టు,
  (దేవ, కి)నుక నా పై యేల, చావ బోడ
  తడు కలశమున్న పొట్టలో, తప్పు కాదు
  నని విభీషణుడు పలికె నయము తోడ

  రావణాసురునకు పొట్టలో అమృత భాండము గలదు, దానిపై శరము గురి బెట్టుము అని విభీషణుడు రామ చంద్రునకు తెలుపుట

  రిప్లయితొలగించండి
 4. దేవకి సుతుని యశోద సాకెనన కౌసల్యా తనయుని
  కైక పెంచె
  పుత్రోదయంతో మనసు భద్రమై దశరథుడదె తన
  చింత తుంచె
  పెరిగి రాకుమారులు ప్రవర్ధితులైరి నిలుకడ
  గల రాధలై
  మర్యాద పురుషుని లీలలొప్పె మనమున
  పౌరాణికపు గాధలై

  రాధ = మెఱపు
  (శబ్ద రత్నాకరము )

  రిప్లయితొలగించండి

 5. శబరి- రామ !


  రారా! ధరణీజ రమణ!
  నీ రాకకు మనసు, భద్ర, నిమ్మళము గనెన్
  మీరలు యశోదయులయా !
  కీరము లివియేను దేవ ! కింకరిని ప్రభూ!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా సత్యనారాయణ
  నర వర*దేవ కి*న్నరులు నాతిగ సీత *సు భద్ర* కోసలన్
  అరమర లేక రాముని *యశో ద*గ తోడయెనంచు నెంచి రా
  వరణము మారెనే యడవి వార్చిన వెన్నెలగా న*రాధ* మా7
  తరుణియె తిన్న వాసముల దానొక లెక్కను వేయ కైక యై!

  రిప్లయితొలగించండి


 7. రామ! రారా! ధరణిజవర! గుడిసె యిది!
  దేవ!కింకరి సేవ యిదేనయ ఫల
  ముల యశోదయడ గొనుమ! మోదమాయె
  మనసు! భద్ర! శబరినయ మదియు నిండె!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. జనవాక్యమనుచు రాముడు సీతనడవి కంపిన వేళ ఆ తల్లి స్వగతము:
  ***)()(***
  (దేవ!కి)కురింతువీవని తెలియనైతి
  మన కలయిక (యశోద)మె యని తలచితి
  మన(సు భద్ర)మయిన వేళ మంట రగిలె
  తలప నాకు దిక్కెవరు(రా !ధ)రణిలోన?
  ***)()(***
  (యశోదము = అమృతము ;శాశ్వతము)

  రిప్లయితొలగించండి
 9. డా.ఎన్వి ఎన్ చారి దత్తపది
  దేవకి -యశోద -సుభద్ర-రాధ రామాయణార్థంలో
  "దేవ! కి"లకిల నవ్వుచున్ నావ నెక్కి
  నీ"యశోద"ర్ప బలమున నీట మునుగ
  నీకుమ! మన"సు భద్ర"త నిమ్ము నాకు
  యనుచు నా"రాధ"నము జేసె నపుడు గుహుడు

  రిప్లయితొలగించండి

 10. రామా రాధనమాయెరా మనసు ! భద్రా!దేవ! కీరమ్ములి
  వ్వే మీకై ! దయతో యశోదయ గొనన్! వేడెన్పరంధాము, తా
  నే మున్ముందున మంచి పండ్లివియెనో ? నే స్వాదువున్గాంచి నా
  రామున్గై కొన మందు నంచు సయి సౌరస్యంపు పండ్లిచ్చెగా !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  నేటి అంశం :: దత్తపది {దేవకి, యశోద, సుభద్ర, రాధ}
  విషయం :: రామాయణార్థం
  సందర్భం :: అన్నయైన రావణాసురునిచే లంకనుండి బహిష్కరింపబడిన విభీషణుడు శ్రీ రాముని శరణు వేడుట.

  ఆర్తుడ నే విభీషణుడ నర్థిని (దేవ! కి)రీట గర్వియై
  వర్తిలు నాదు సోదరు డపాత్రుడు, క్షేమద! శ్రీ(యశోద!) నా
  యార్తిని బాపు పాత్రుడ వనంత(సుభద్ర)ము లిచ్చు రామ ! స
  ద్వర్తన నేర్పు నీ చరిత దాశరథీ! ప్రవ(రా! ధ)రాపతీ!
  . *మరొక పూరణ*
  శ్రీ రఘురామ! నీ దరికి జేరితి (దేవ!కి)రీటగర్వియౌ
  క్రూరుని సోదరున్ విడిచి, కోరెద నీ కృపనే (యశోద!) యిం
  పార (సుభద్ర)ముల్ గనెద నార్తజనావన! రామ! బ్రోవుమా
  తారకనామ! నన్ గనుమ దాశరథీ! ప్రవ(రా! ధ)రాపతీ!
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (17-5-2018)

  రిప్లయితొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 13. (దేవ !కి)కురు మనపు సవిత్రి వనమునకు
  బంపె , నా(రాధ)నము చేసి భక్తి తోడ
  జనత సేవ జేయును మీకు, జాగు వలదు
  రాఘవ, (యశోద) తుల్యమై రంజనమిడు
  నీదు పాలన, రాకున్న నిమ్ము నీప
  విత్ర నడపా(సు,భద్ర)త వెట్టి చేతు
  పాలనము యనుచు పలికె భరతు డపుడు

  రిప్లయితొలగించండి
 14. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,


  గురుభ్యో నమః నన్నటి పూరణ స్వీకరింప ప్రార్థన
  ...................... ..............................................


  భోగము - భాగ్యమున్ - యశము - పుష్కలభాగ్యము - సుందరాకృతిన్

  రాగము - ఙ్ఞానసంపదయు రాగిల , బోధక వృత్తి నున్న యా

  " నాగులు " c గాంచినంతనె యనంగ సుమాయుధ సంహతాంగ యై

  " రాగిణి " యన్న యా ధనిక , రాగిణి యౌచు వివాహమాడె || నా

  " నాగుల " ముద్దులాడె లలనామణి యాత్మవినోదకేళికై !  { భాగ్యము = అదృష్టము - ధనము ; బోధక వృత్తి =

  teacher`s profession : ధనిక = యౌవనవతి }

  రిప్లయితొలగించండి
 15. విభీషణుడు సోదరుని తో ----
  దేవ !కినుక గ సీత ను దెచ్చి తీవు
  నీ యశోద య కును భంగ మ య్యేగాన
  మనసు భద్ర ము తో వీడు మగువ నిపుడు
  వలదు సోదరా !య ప రాధ పరుడు గాకు

  రిప్లయితొలగించండి
 16. హనుమంతులవారు శ్రీరామచంద్రునితో...
  తేటగీతి
  దేవ కిష్కింధ వీడి సుగ్రీవ ప్రభువు
  జడిసి దుర్యశోదను వాలి శక్తి నెఱిగి 
  ఋష్యమూకమది సుభద్రమిలనటంచు
  దాగె నిరపరాధమ్మున! దయను గనుడు

  రిప్లయితొలగించండి

 17. దేవ! కింకరుండ! దయను నావనెక్కు
  నాదు యపరాధముల సైచి నన్నుబ్రోవు
  గంగ దాటించెద సుభద్ర గతిని మిమ్ము
  గుహునికిదె యశోద మగును కోసలేశ!

  రిప్లయితొలగించండి
 18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. koncham sarijesanu chudandi...

   దేవ! కినుకేల రామా
   పావనము యశోదమే గ తాటకి జంపగ ;
   గావు సుభద్ర మయోధ్య
   బ్రోవగ నపరాధములను బ్రోచగ జూడన్

   తొలగించండి
 19. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂దత్తపది🤷‍♀.. .. .. .. .. .. ..
  *దేవకి - యశోద - సుభద్ర - రాధ*
  అన్యార్థంలో రామాయణార్థంలో
  నచ్చిన ఛందస్సులో

  సందర్భము: విభీషణుని శరణాగతి.
  "హే సూర్య కాంతితో నిండిన రూపం కలవాడా! తలిదండ్రులకు కీర్తి కలిగించే గొప్ప నడవడి కలవాడా! నాకు అభయ మిమ్ము. నీ ప దారాధకుడ ననే విషయం నమ్ము. ఓ భద్రకీర్తీ! నా ఆర్తి బాపుము."
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  సూర్య దేవ కిరణ శుభ కాంతి మయ మూర్తి!
  మాతృ పితృ యశోద మహిత వర్తి!
  అభయ మిమ్ము , నీ ప దారాధకుడ, నమ్ము..
  పాపు మార్తి, వర సుభద్ర కీర్తి!

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 20. రిప్లయిలు
  1. అయ్యా! మీకు గురువుగారు అందుబాటులో ఉండాలనుకుంటే శంకరాభరణం వ్హాట్సప్ సమూహములో చేరండి.

   తెలతెలవారే వారీ ముదుసలిపై చేసిన వ్యాఖ్యలు చూడండి:

   ***************

   రుక్మిణి గారు ఉవాచ: (6.56)

   "ప్రభాకర శాస్త్రి గారు ఇంకా రాలేదివేళ?"

   *********************

   శంకరయ్య గారు చమత్కరించిరి: (7.46)

   "దత్తపదిని ఇచ్చినరోజు బడి ఎగ్గొడతామన్నారు ఇంతకుముం దొకసారి!..."

   **************************

   రుక్మిణి గారు కిలకిలించిరి: (8.42)

   "😁😁"

   తొలగించండి
  2. ఇంతకీ గురువుగారెటు బోయినట్లో? ఆ సమాచారము తెలిపిన బాగుండును! మాకీ నిరీక్షణ ఉత్కంఠ తొలగును గదా!

   తొలగించండి

  3. అయ్యయ్యయ్యయ్యయ్యో
   ఏదేదో జరుగుతావుందే వాత్సపు లో ఎట్లా తెలుసుకోవడం :)


   జిలేబి

   ఇంతకీ రుక్మిణి గారెవరండీ జీపీయెస్ వారు ? :)

   తొలగించండి
  4. రుక్మిణి గారొక మంచి హాస్యప్రియ మిత్రులు. 😊

   తొలగించండి
 21. డాపిట్టానుండిఆర్యా
  రాముని యశోదయ(యశః*ఉదయ) తోడయె....గా చదువ గలరు

  రిప్లయితొలగించండి
 22. అంజనేయుడు రామునితో
  దేవ! కిష్కింధ లో సేద తీరుమయ్య
  ఘన యశోధన ! శేషశయన! మురారి!
  మనసు బద్రముగా నుంచి మనుమిచటను
  భయహరా! ధరణిజకన పయనమైతి

  రిప్లయితొలగించండి
 23. అసుర వర దేవ కిన్నర
  వసు భద్ర న రోరగ గణ పతగ యశో ద
  ర్ప సితాన నాపరాధ కృ
  త సకల ఘన రామవధ్య తనులు మన రిలన్

  రిప్లయితొలగించండి
 24. మిత్రులందఱకు నమస్సులు!

  [రావణునిచే వెడలఁగొట్టఁబడిన విభీషణుఁడు శ్రీరాముని శరణుఁ జొచ్చి, ప్రార్థించు సందర్భము]

  "దేవ! కికురించి రావణుం డీ యనుజునిఁ
  దలఁగ నంపియును స్వయశో దమనుఁ డయ్యె!
  మనసు భద్రమ్ముగాఁ జేసి, మాకు నిడియు
  రక్ష, సైఁపుమా మా యపరాధములను!"

  రిప్లయితొలగించండి
 25. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,


  మధ్యాక్కర

  దీన నుత ! బ్రోవరా ధర్మ హృదయ ! దేవ ! కిల్బిష వన దవ ద

  వానల ప్రతిమాన ! శ్రీ రాఘవా ! నిరత సుభద్ర దాత !

  భాను వంశ యశోదయ రూప ! ప్రార్థించెదను నిన్నె సతము

  దానవాన్వయ శోషణ ! సకల మానవ పోషణ ! రామ ! !


  ( దవ దవానలము = దవానలము = దావానలము )

  రిప్లయితొలగించండి
 26. ఆలముగెలువ కీర్తించిరాధవుడిని
  దేవ కిరువైపు ననుజ వైదేహులకని
  పావనిహృది దానినగాసు భద్రపరిచె
  అరసునుతి యశోదముపోసె హనుమ చెవుల

  యశోదము= అమృతము
  నగాసు=చిత్రము

  రిప్లయితొలగించండి
 27. పుణ్య కౌసల్యకు సుభద్రముగ కలిగెను
  దశరథ తనయుడై యశో దర్పమలర
  దేవ కిన్నెరాదులు తమ దీవెనలిడ,
  ప్రజలు చేయ యారాధన, రాముడిలను ౹౹

  రిప్లయితొలగించండి
 28. దేవ!కిమ్మనగనుజాల జేవలేదు
  లేత వయసులు వారలు ,భద్రగుణులు
  క్షుద్ర మూకను జంపయ శోదమెయిల?
  నేను వత్తును నీతోడ నిహతుజేయ
  ననుగు జూపుమా యపరాధ మనుకొనంగ

  రిప్లయితొలగించండి
 29. ఔరా!ధనువును విరిచెన్
  మారాముడు!సీతగీత,మనసు భద్రతకున్
  ప్రారబ్దము!దేవకిటుకు
  జేర?యశోదమగు!పెళ్లిశీగ్రమె జరుగన్!

  రిప్లయితొలగించండి
 30. దేవ కిన్నర గంధర్వ దివ్య తతుల
  నా యశోదర్ప మడచు వరీయు లిలను
  లేరు నాకు సుభద్రమే ధారుణి నని
  యెంచి ఖచరాధ ముండీల్గె నేపు మాసి.

  రిప్లయితొలగించండి
 31. దత్తపది :-
  *దేవకి - యశోద - సుభద్ర - రాధ*

  పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
  రామాయణార్థంలో
  మీకు నచ్చిన ఛందస్సులో
  పద్యాన్ని వ్రాయండి.

  *తే.గీ**

  రాముడపరాధములు లేక రాజ్యమేల
  కడు యశోదయము కలుగు; కైక కేమి
  ఫలితముండు? దేవ కిటుకు దెలుపు మంటు
  మనసు భద్ర ముండక మంధర నలిగి చెడె
  ..................✍చక్రి

  రిప్లయితొలగించండి
 32. దేవకిన్నెర కాంతలు దీవెన లిడ
  నిరుసుభద్రముగా తేరు పరుగు లిడగ
  గురువు నారాధ నను జేసి కోలబట్టె
  దాశరధి యశోదమకము దలుప బోక

  నిన్నటి సమస్యకు నా పూరణ
  దాగుడు మూతల నాడెడు
  వాగుడుకాయగు పడతికి పతి బహుమతిడెన్
  నాగుల పూసల దండను
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  రిప్లయితొలగించండి
 33. *దశరథునితో విశ్వామిత్రుని మాటలుగా*


  అసురాధముల ద్రుంచి యజ్ఞముగాచెడి
  . యయ్యశోదత్తుడౌ యనఘు డైన

  రామచంద్రుడె సుభద్రత నొసగు ననుచు
  . యెరుగుమో దశరథా యిదియె నిజము

  దేవ కినుక మానుమికను ధీరుడౌ రఘురాము
  . నంపునా వెంటనా యడవులకును

  భువిని బుట్టినయట్టి పురు షోత్తము డెగాద
  . మాట తప్పుట మీకు తగదు సుమ్ము

  అవని నేలు నట్టి యాదివిష్ణువతడు
  మునిజనులకు నిత్య పూజ్యుడతడు
  బంధి సేయ నేల వాత్సల్య మందున
  విశ్వరక్షజేయ వీడుమింక

  రిప్లయితొలగించండి 34. దేవ కినుక వలదిపుడు తీరుబడిగ

  నో యశోదత్త నోర్పుతో నుండుమయ్య

  నెంచకు మపరాధ మిచట నెట్టులైన

  కపులు తాము సుభద్రముగాను మాత

  జాడనరసి వచ్చెదరిక జాగు లేక.

  రిప్లయితొలగించండి
 35. హనుమంతుడు శ్రీరాముని ప్రార్థించుట:

  దేవ! కినుకేలనయ నీకు దివ్యమూర్తి!
  ఘన యశోదయామృతమీవు కరుణ హృదయ!
  మనసు భద్రమౌ నీనామ మహిమ చేత
  ప్రకటి బ్రోవగ రా! ధర్మ పథము! రామ!

  రిప్లయితొలగించండి
 36. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂దత్తపది🤷‍♀.. .. .. .. .. .. ..
  *దేవకి - యశోద - సుభద్ర - రాధ*
  అన్యార్థంలో రామాయణార్థంలో
  నచ్చిన ఛందస్సులో

  సందర్భము: "ఆంజనేయుడు తూర్పు పడమర కొండలపై పాదములు మోపి సూర్యుని వద్ద భద్రమైన విద్యలను నేర్చుకున్నాడు.
  సూర్యుడు తూర్పున నున్నప్పుడు (కిరణాల వెంబడి) తూర్పునకు తిరిగి, పడమర నున్నప్పుడు పడమరకు తిరిగి పవనసుతుడు విద్యాభ్యాసం చేశాడు. తల్లి దండ్రులకు యశస్సు కలిగించే రీతి యది.
  ధరిత్రిపై ఎవరూ చేయలేని సాహసం బిదిరా!"
  అంటూ ఆచార్యుడు శిష్యులకు చెబుతూ వున్నాడు.
  చొప్పు= మాదిరి, మార్గం, వెంబడి
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  తల్లి దండ్రులకును యశోద మగు రీతి
  సూర్య దేవ కిరణముల చొప్పుఁ దిరిగి,
  పవన సుతు డా రవి కడ సుభద్ర విద్య
  లనుఁ గఱచె, సాహసం బిదిరా ధరిత్రి!

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 37. (రాముని సందేహించు సమయంలో,ఆశ్రమమున సీత స్వగతం...)

  మదియశోదమువలె మారెనా శ్రీరామ
  దేవ! కించుకైన తీపి లేదె
  మనసు భధ్రము నిల మరిచెనా స్వామి! నా
  రాధనమ్ము మీకు రాదె గురుతు!!!

  రిప్లయితొలగించండి