గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2691 సమస్య:: *అర్చనఁ జేసె రాత్రిసమయమ్మున భక్తుడు భానుబింబమున్.* రాత్రి వేళ సూర్యబింబానికి అర్చన చేశాడు ఒక భక్తుడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: ‘’స్వదేశంలో ఉన్న మీరు విదేశాలలో ఉన్న మీ అబ్బాయి ఒకేసారి సూర్య భగవానుని పూజించండి శుభం భూయాత్’’ అని అర్చకస్వామి చెప్పడంతో నేను ఇక్కడ పగటివేళ సూర్యుని పూజిస్తూ లైవ్ టెలికాస్ట్ అన్నట్లు వీడియోకాల్ ద్వారా పూజా కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయగా అదే సమయంలో ఆ వీడియో చూస్తూ అక్కడ విదేశాలలో రాత్రివేళ ఐనాసరే సూర్యుని అర్చించాడు భక్తితో మా అబ్బాయి అని జరిగిన విషయాన్ని వివరించే సందర్భం.
అర్చకు డన్నయట్లు కమలాప్తుని గూర్చి స్వదేశ వాసినై యర్చనఁ జేయ నా సుతుడు నత్తఱి నిత్య ప్రసార మందు నే గూర్చిన వీడియో గనుచుఁ గొల్చెను బ్రధ్ను విదేశవాసియై; *యర్చనఁ జేసె రాత్రి సమయమ్మున భక్తుడు భానుబింబమున్.* *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (29-5-2018)
డా.పిట్టాసత్యనారాయణ అర్చన సాయం సంధ్యల జర్చించిరి కర్దమాఖ్యు సందేశములన్(కర్దముడు తన తల్లికి భక్తి యోగమును ఉపదేశిస్తాడు) పర్చా వంశపు స్పర్ధన అర్చించెను రాత్రి భక్తుడాదిత్యునొగిన్
సందర్భము: మనకు రాత్రి యైనప్పుడు అమెరికాలో పగలు. ఆ విధంగా కూర్చినాడు దేవుడు. భక్తుడైన మనవా డొకడు అమెరికాలో వున్నాడు. రాత్రి పూట సూర్యు నర్చించినాడు. ( వాళ్ళ కప్పుడు పగటి పూట కదా!) ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~ కూర్చె విధి మనకు రాత్రిని.. తీర్చెను దానినె పగ లను తీరు నమెరికన్ గూర్చొని మన వా డచ్చట నర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్
చర్చిని క్రిస్మస్ రాత్రిని
రిప్లయితొలగించండిమార్చుచు మతవాదుల నట మాటల తోడన్
చర్చను "ఆదిత్య హృదయ
మ"ర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిచర్చిని క్రైస్తవ భక్తుం
డర్చించెను రాత్రి, భక్తుఁ డాదిత్యు నొగిన్
వర్చస్సును కోరుచు తా
తర్చుచు వేడె తెలవార తరుణి జిలేబీ !
జిలేబి
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికూర్చెను పూతకూర్చ , సమకూర్చె జలమ్ము కమండలమ్మునన్
మార్చెను వస్త్రధారణము మానసికమ్ముగ సిద్ధమౌచు దా
దీర్చెను ఫాలభాగమున దివ్య మనోజ్ఞ విభూతి , స్వప్నమం
దర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుఁడు భానుబింబమున్"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిసోమరి భక్తుడు కాడీ భక్తుడు అహర్నిశలు కొలిచెను !
నేర్చెను వీలు గానతడు నెమ్మిని దేలుచు భక్తి మార్గమున్,
తర్చుచు నిత్యమా విభుని, తామరవిందుని నాతడే గదా !
చర్చన మైన భక్తి గల జామియు కాడయ! ప్రొద్దుటన్, భళా
యర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుఁడు భానుబింబమున్!
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివర్చస్సు తాళ లేకను
రిప్లయితొలగించండినర్చించెను రాత్రి , భక్తుఁ డాదిత్యు నొగిన్
కర్చేమి లేదను కొనుచు
చర్చికి పోవంగ నతడు సంతస మొందన్
కం.
రిప్లయితొలగించండిమూర్చ వలన పడి పోవగ
మర్చి వెడలె భక్తుడొకడు మందిర పూజన్
కుర్చిన్ ప్రతిమను బెట్టుచు
నర్చించెను రాత్రి భక్తుడాదిత్యునొగిన్
చర్చికి చని క్రీస్తు నొకం
రిప్లయితొలగించండిడర్చించెను రాత్రి, భక్తుఁ డాదిత్యు నొగిన్
చేర్చి కరములను సంధ్యను
వార్చి యుదయ సమయమందు భజియించె లలిన్
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2691
సమస్య:: *అర్చనఁ జేసె రాత్రిసమయమ్మున భక్తుడు భానుబింబమున్.*
రాత్రి వేళ సూర్యబింబానికి అర్చన చేశాడు ఒక భక్తుడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: ‘’స్వదేశంలో ఉన్న మీరు విదేశాలలో ఉన్న మీ అబ్బాయి ఒకేసారి సూర్య భగవానుని పూజించండి శుభం భూయాత్’’ అని అర్చకస్వామి చెప్పడంతో నేను ఇక్కడ పగటివేళ సూర్యుని పూజిస్తూ లైవ్ టెలికాస్ట్ అన్నట్లు వీడియోకాల్ ద్వారా పూజా కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయగా అదే సమయంలో ఆ వీడియో చూస్తూ అక్కడ విదేశాలలో రాత్రివేళ ఐనాసరే సూర్యుని అర్చించాడు భక్తితో మా అబ్బాయి అని జరిగిన విషయాన్ని వివరించే సందర్భం.
అర్చకు డన్నయట్లు కమలాప్తుని గూర్చి స్వదేశ వాసినై
యర్చనఁ జేయ నా సుతుడు నత్తఱి నిత్య ప్రసార మందు నే
గూర్చిన వీడియో గనుచుఁ గొల్చెను బ్రధ్ను విదేశవాసియై;
*యర్చనఁ జేసె రాత్రి సమయమ్మున భక్తుడు భానుబింబమున్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (29-5-2018)
ఇలాంటి సమస్యకు మరొకటి పూరణ
తొలగించండిప్రశ్నోత్రర విధానము
తొలగించండిహనుమ విద్య నేర్వ నలరిన దెవ్వడో?
అలరె నెచట తార లన్ని కలసి?
గాఢ నిద్ర పట్టు కాలమ్ము గన నేది?
అర్కు డలరె చదల నర్ధరాత్రి.
కూర్చుండియు నొక చోటను
రిప్లయితొలగించండివర్చస్సున నప్రమేయ వనజ హితుని దా
చర్చించుచు నెమ్మనమున
"నర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్"
మడితో శివునికి కురిసెడి
రిప్లయితొలగించండిజడి "నర్చన చేసె రాత్రి సమయమ్మున భ
క్తుఁడు, భానుబింబమున్" తాఁ
గడు శ్రద్ధనుఁ బూజ చేసి గత యుదయమునన్
(చిరు ప్రయత్నం)
మార్చుము వాతావరణము
తొలగించండినూర్చెద నాపంట యెండ యుర్వినిఁగాయన్
దీర్చెద నాయప్పులనుచు
నర్చించెను రాత్రి భక్తు డాదిత్యు నొగిన్!
అందముగా కూర్చిరిగద
తొలగించండిసుందరమౌ పూరణమిట స్తుతియింప దగన్
చందర మౌళీ జిగిబిగి
కందము నందుత్పలమును కవివర సూర్యా!
వర్చస్సున భాను సముం
రిప్లయితొలగించండిడర్చకు డొకరుండు నటకు నరిగెను నార్వే
తర్చియు మనమునె భక్తిగ
"నర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్"
***)()(***
(తర్చు =మథించు)
ధృవ ప్రాంతమునకు తా ముచ్చటపడి మంచు ఖండమున
రిప్లయితొలగించండికాలిడి
పగలును చూసి తానదె తడబడి నిడివిని కొలువగ తను
వడివడి
రాతిరి రాదు పగలది పోదు ఎండ వెన్నెలై
చుంభించగన్
అర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుడు
భానుబింబమున్
చర్చించగ నేమి గలదు
రిప్లయితొలగించండిమార్చగనే లేదు గనుడు మాన్యుల భావమ్
దీర్చగ కోరిక వామను,
"నర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్"
వామనుడు = అదితి పుత్రుడు, ఆదిత్యుఁడు
కందం
రిప్లయితొలగించండిమార్చుదురయ మా సభ్యులఁ
బేర్చుచు ధనము! నుదయించి వేగమె నేనా
కుర్చీ నెక్కఁగఁ గనుమని
యర్చించెను రాత్రి భక్తు డాదిత్యు నొగిన్!
గు రు మూ ర్తి ఆ చా రి
తొలగించండి........... .......
G. V. S. సహదేవుడు గారికి నమస్కృతులు . మీరు ప్రొద్దటూరు వాస్తవ్యులా !
సంతోషం . ప్రొద్దటూరికి మా చిన్న కూతురు నిచ్చామండి .
మిమ్ము కలవడము నాకు చాలా సులభమన్న మాట !
నమస్కారమండి.మీరు ఈ మారు ప్రొద్దుటూరు వచ్చినపుడు తప్పక కలుద్దాం.
తొలగించండినా సెల్ నెంబరు 99 66 22 56 40
తొలగించండిమరి , దయచేసి మీ సెల్ తెలియజేయ గలరా ?
చర్చించగ వేదములే
రిప్లయితొలగించండితీర్చియు గెల్వగ విబుధుల తీర్పుల నెల్లన్
తీర్చగ కోరిన కోర్కెలు
నర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్
కార్యాలయ వేళలలో మద్యాహ్న సాయం సంధ్యల వార్చడం కుదరక రాత్రి యింటికి వచ్చాక సంధ్యావందనమాచరించే భక్తుడు:
రిప్లయితొలగించండివార్చక తప్పదు సంధ్యను
చర్చించిన గాని యతడు సమ్మతమిడడే
మార్చక తప్పదు సమయమ
"నర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్"
అతడు = కార్యాలయాధికారి
అర్చకుబనుపునగుడిలో
రిప్లయితొలగించండినర్చించెనురాత్రిభక్తుడాదిత్యునొగి
న్నర్చనజేసినభక్తిని
దీర్చునుమనవాంఛలన్నితీరికతోడన్
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిఏర్చఁగఁ గష్టనష్టములు, నెన్నికమై యొక బ్రాహ్మణుండునౌ
నర్చకుఁ జేరి, కోర, నతఁ "డర్కుని శీఘ్రమె పూజసేయఁ బో
కార్చును కష్ట!" మంచు ననఁగాఁ, దగఁ దెచ్చియు సూర్య చిత్రమే,
యర్చనఁ జేసె, రాత్రి సమయమ్మున, భక్తుఁడు భానుబింబమున్!
ఉత్పలమాల
రిప్లయితొలగించండిమార్చెద రంచు సభ్యులను మాయలు జేసి ప్రమాణ పూర్వమే
చేర్చితి ప్రక్కరాష్ట్రమునఁ జీలక నుండగ భద్ర మంచు! నే
గూర్చొన గద్దెపై రయమె కూర్చు దినమ్ములటంచు నార్తితో
నర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుఁడు భానుబింబమున్
సమస్య :-
రిప్లయితొలగించండి"అర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్"
*కందం**
చర్చన పడి చెలికాండ్లును
మర్చివెడలి కాననమున మార్గము దప్పన్
కూర్చోనేడ్చుచు పుట్టుమ
నర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్
..................✍చక్రి
చర్చి oచియు పూజింపగ
రిప్లయితొలగించండిఖర్చు కు వెను కాడ బో క క మ్రపు మతి తో
నర్చకుడొక ప్రతిమ ని డి
య ర్చిoచె ను రాత్రి భక్తుడా ది త్యునొ గి న్
మూడవ పాదం చివర లో ప్రతిమ ని డి యు అని యు చివరి పాదం మొదట నర్చకు డని సవరణ చే య బడింది
తొలగించండిఅర్చకుడానతీయగనునాయతరీతినిభక్తిశ్రధ్ధల
రిప్లయితొలగించండిన్నర్చనజేసెరాత్రిసమయమ్మునభక్తుడు,భానుబింబము
న్నర్చనజేయుచోజలమునంజలిబోయుచుజారవోయగ
న్నేర్చెడుభాస్కరుండిలను,నీయునుసంపదనెల్లవారికిన్
కూర్చి పదమ్ములు స్నాన మొ
రిప్లయితొలగించండినర్చి ద్విజ వరుం డొకండు నయముగను సహ
స్రార్చి నిను జగత్సాక్షిని
నర్చించెనురా త్రిభక్తుఁ డాదిత్యు నొగిన్
[త్రిభక్తుఁడు = మూటి (ధర్మార్థకామములు) యందు భక్తి కలవాడు]
అర్చన కేల నెంచ సమయమ్మును సూర్యుని నర్యమున్ సహ
స్రార్చినిఁ బూజనీయు నల సన్నుతి సేయరె యెల్ల వేళలం
జర్చకుఁ దావు లే దిట నసంశయమే యది విగ్రహమ్ము దా
నర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుఁడు భానుబింబమున్
అర్చకుడాలయంబున మహామహితుండగు దేవ దేవునిన్
రిప్లయితొలగించండియర్చన చేసె రాత్రి సమయంబున,భక్తుడు భాను బింబమున్
వార్చుచు సంధ్య మంత్రములు నావిరిగా పఠియించి దీక్షతో
నర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుడు భానుబింబమున్
...
మార్చగ పదవులనుదయమె
రిప్లయితొలగించండిచర్చించెను ముఖ్యమంత్రి శాసనసభలో
కుర్చీని కోరి యొకడటు
"లర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్"
..
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,
ఒక శాస్త్రి సూర్యభగవానుని విపరీతంగా కొలిచే భక్తుడు .
సరే ఉదయము సూర్యునికి నమస్కరించి సంధ్యవార్చుతాడు
రాత్రి సూర్యబింబము యొక్క చిత్ర పటమునకు సుమమాలవేసి
పూజించె నట ! }
అర్చకు డైన " శాస్త్రి " తిమిరారి , నహర్మణి , లోకబాంధవు ,
న్నర్చన జేయు చుండు || నుదయంబున వందనమాచరించుచున్
వార్చెను సంధ్య | నెంతయు వినమ్రత ( న్ ) సత్కళన్ ,
జేర్చి లఖింపబడ్డ రవి చిత్రపటంబునకున్ సుమమాల వైచుచు
న్నర్చన జేసె రాత్రి సమయమ్మున భక్తుడు భానుబింబమున్
వర్చెస్సు మ్రింగరాహువు
రిప్లయితొలగించండికార్చిచ్చేలేనిసూర్య కాంతియురాత్రిన్
మార్చగ?గంటకు పైబడ
అర్చించెను రాత్రిభక్తుడాదిత్యు నొగిన్
నేను 500 రూపాయలు గురువుగారి అక్కౌంటులో వేస్తాను. అసనారె
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి("మనసున మల్లెల మాలలూగెనే")
చేర్చుచు బాటసారి చలచిత్రపు తున్కలు వెఱ్ఱిమొఱ్ఱిగన్
కూర్చుచు నత్తగార్కథలు కోడలి తోడుగ నావకాయలున్
నేర్చుచు పాటలున్ రచన నిమ్మళముంగను బ్రోవుమంచు తా
నర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుఁడు భానుబింబమున్
భాను బింబము = భానుమతి ఫోటో
రాత్రి సమయము = దినమంతయు అభ్యాసముతో తీరికలేక
తొలగించండిఈ "చలచిత్ర "మేమిటండీ జీపీయెస్ వారు ?
అప్పుతచ్చా ?
జిలేబి
ఈ మధ్యన వ్హాట్సప్లోని పండితులు కొందరు "చలన చిత్రం" తప్పనీ "చలచిత్రం" ఒప్పనీ తీర్మానం చేసిరి. నాదేం పోయింది...ఏ రాయయితేనేమి నా బోటికి?
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,
ఒక శాస్త్రి సూర్యభగవానుని విపరీతంగా కొలిచే భక్తుడు .
సరే ఉదయము సూర్యునికి నమస్కరించి సంధ్యవార్చుతాడు
రాత్రి సూర్యబింబము యొక్క చిత్ర పటమునకు సుమమాలవేసి
పూజించె నట ! }
అర్చకు డైన " శాస్త్రి " తిమిరారి , నహర్మణి , లోకబాంధవు ,
న్నర్చన జేయు చుండు || నుదయంబున వందనమాచరించుచున్
వార్చెను సంధ్య | నెంతయు వినమ్రత ( న్ ) , సత్కళన్
జేర్చి లఖింపబడ్డ రవి చిత్రపటంబునకున్ సుమమాల వైచుచు
న్నర్చన జేసె రాత్రి సమయమ్మున భక్తుడు భానుబింబమున్
చర్చించ పగలు రేయిల
రిప్లయితొలగించండిమార్చునది జితముగ నుండు మార్తం డునిగా
నేర్చగ సమయము నెంచక
అర్చించెను రాత్రి భక్తుడాదిత్యునొగిన్
కూర్చుని సాధన జేసిరి
రిప్లయితొలగించండినేర్చిన సంగీత విద్య నీమము తోడన్,
కూర్చిన సుస్వరములచే
నర్చించెను రాత్రి భక్తుడాదిత్యు నొగిన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిఅర్చన సాయం సంధ్యల
జర్చించిరి కర్దమాఖ్యు సందేశములన్(కర్దముడు తన తల్లికి భక్తి యోగమును ఉపదేశిస్తాడు)
పర్చా వంశపు స్పర్ధన
అర్చించెను రాత్రి భక్తుడాదిత్యునొగిన్
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
సవరణతో..
"అర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్"
సందర్భము: మనకు రాత్రి యైనప్పుడు అమెరికాలో పగలు. ఆ విధంగా కూర్చినాడు దేవుడు.
భక్తుడైన మనవా డొకడు అమెరికాలో వున్నాడు. రాత్రి పూట సూర్యు నర్చించినాడు. ( వాళ్ళ కప్పుడు పగటి పూట కదా!)
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
కూర్చె విధి మనకు రాత్రిని..
తీర్చెను దానినె పగ లను తీరు నమెరికన్
గూర్చొని మన వా డచ్చట
నర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండి(అర్చనా విధులు 4.అవి,వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనునవి.)
చర్చల కందజాలనివి చారు తరమ్మగు నాల్గు యర్చనల్
వర్ఛసు జూపు వాడొకడు(సూర్యుడు)వచ్చెనొ లేదొ యటంచు బ్రొద్దునన్
చర్చిని నంటి పశ్చిమము చయ్యన లేచెనమేరికా క్షితిన్
మర్చునొ తత్కుమారకు నమాయకు క్షేమము గోరు తండ్రిగా
నర్చన జేసె రాత్రి సమయమ్మున భక్తుడు భాను బింబమున్
ఏణాంకానల భానుమండల లసత్ శ్రీచక్ర మధ్యస్థితాం బాలార్క ద్యుతి భాసురాం కరతలౌ పాశాంకుశాం బిభ్రతీం .......🙏🙏🙏
రిప్లయితొలగించండిఅర్చించ కోటి సూర్యుల
వర్చస్సును, చంద్ర సూర్య వహ్నుల మధ్యన్
గూర్చిన శ్రీచక్రమ్మున
నర్చించెను రాత్రి భక్తు డాదిత్యు నొగిన్
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిఆర్యా,కర్దముని కుమారుడు కపిలాచార్యుడు తన తల్లికి భక్తి యోగమును బోధిస్తాడు. గా స్వీకరించండి
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిఆర్యా,కర్దముని కుమారుడు కపిలాచార్యుడు తన తల్లికి భక్తి యోగమును బోధిస్తాడు. గా స్వీకరించండి
తర్చుచు లోకమంతయును దారగ భానును మెచ్చి పొందగా
రిప్లయితొలగించండివర్చసు పెల్లి యా పడతి బాలిక నొందను పోవనింటికిన్
పర్చుచు ప్రక్కనున్ పరుపు పర్సును విప్పుచు ముద్దులాడుచు
న్నర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుఁడు భానుబింబమున్