13, మే 2018, ఆదివారం

సమస్య - 2677 (అమవస దినమందు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అమవస దినమందు చంద్రుఁ డగుపడె నింగిన్"
(లేదా...)
"అమవస నాడు పూర్ణశశి యబ్బురమై కనుపించె నింగిపై"

66 కామెంట్‌లు:

 1. గమనము జేయుచు నభమున
  సమరము జేయుచు చకచక షా, మోదిలతో
  నమరావతి నగరమ్మున
  నమవస దినమందు చంద్రుఁ డగుపడె నింగిన్ :)

  రిప్లయితొలగించండి
 2. మైలవరపు వారి పూరణ

  మమతకు మారురూపమగు మన్మడు బుట్టిన సంతసమ్మునన్
  ప్రముదితమానసమ్ము తిథి వాసరముల్ గమనింపకుండె ! నా
  భ్రమలను వీడి లెక్కిడితి , పక్షము దాటెను జూడ నేటికా
  యమవస రోజు , పూర్ణశశి యబ్బురమై కనుపించె నింగిపై !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి


 3. గమనింపగాన్ప డడుగా
  యమవస దినమందు; చంద్రుఁ డగుపడె నింగిన్
  తమకపడుచు నా మర్నా
  డు మహిని వెల్గన సుమా కడుంగడు క్షయుడై !

  జిలేబి

  రిప్లయితొలగించండి

 4. బ్రమియించిన తారాశశి
  మమతను పంచగ నుకోరి మరిమరి తరలెన్
  కమలము వికసించె ననుచు
  అమవస దినమందు చంద్రుఁ డగుపడె నింగిన్

  రిప్లయితొలగించండి
 5. (భావుకుడైన సైనికాధికారి అంతరంగం)
  సుమధురభాషిణీ!సలుపుచుంటిమి యుద్ధము రేబవళ్లును;
  న్నమలినచంద్రబింబమటు లంచితమైనది నీముఖంబె;య
  భ్రముగద నాదుమానసము;రాగిణి!యీరజనీతమస్సున
  న్నమవసరొజు పూర్ణశశి యబ్బురమై కనుపించె నింగిపై.

  రిప్లయితొలగించండి
 6. తమకముతో గంధర్వుడు
  ప్రమదను తా గూడనెంచి ప్రవరుని వోలెన్
  సుమబాలఁ జేర, దలచెను
  అమవస దినమందు చంద్రు డగుపడె నింగిన్.

  రిప్లయితొలగించండి
 7. తిమిరంబాయెను, నా సుత
  తమి దీర్చగ చూపినాడ తారాశాలన్
  భ్రమపడ నందున నేడీ
  యమవస దినమందు చంద్రుఁడగుపడె నింగిన్

  రిప్లయితొలగించండి
 8. కుముదేశు బోలు శ్రీమతి
  సమరమునకు సిద్ధపడగ శయన గృహమునన్
  తమి నశియించ పతి పలికి
  నమవస దినమందు చంద్రుఁ డగుపడె నింగిన్

  రిప్లయితొలగించండి
 9. గమనించిరి జనులందఱు
  విమానమున ముఖ్యమంత్రి విచ్చేయంగన్
  తమ పురమున దిగునప్పుడు
  యమవస దినమందు చంద్రుఁడగుపడె నింగిన్

  రిప్లయితొలగించండి
 10. రమ తోడుత శ్రీరాముడు
  విమానమున నొక్కనాడు విహరింపంగన్
  తమ భాగ్యముగ జనులు గన
  నమవస దినమందు చంద్రుఁడగుపడె నింగిన్

  రిప్లయితొలగించండి
 11. సమరమునందు నచ్యుతుడు చక్రము నడ్డగ నెండ రేనికిన్
  తిమిరముగప్పె, శీఘ్రముగ తేరుమరల్చివచించె శల్యు డీ
  యమవస రోజు పూర్ణశశి యబ్బురమై కనుపించె నింగిపై
  సమయము దాటె నంచు చనె సైంధవు డర్జును చేత చావగన్

  రిప్లయితొలగించండి
 12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2677
  సమస్య :: *అమవస రోజు పూర్ణశశి యబ్బురమై కనుపించె నింగిపై.*
  సందర్భం :: లౌకిక విషయములకు ప్రాధాన్యతనిచ్చే సాధువుల యొక్క వాక్కులు అర్థమును అనుసరించి ఉంటాయి. సనాతన ఋషుల యొక్క వాక్కులను అనుసరించి అర్థం ఉంటుంది.

  లౌకికానాం హి సాధూనా మర్థం వాగనువర్తతే ।
  ఋషీణాం పున రాద్యానాం వాచ మర్థోనుధావతి ।।
  అనే శ్లోకాన్ని మనం వినియున్నాము.
  కాళిదాస మహాకవి ఒక అమావాస్య రోజున *ఈ రోజు తిథి యేమి* అని అడిగిన వానికి పరధ్యానంలో ఉండి *పౌర్ణమి* అని చెప్పినాడు. ఆ మాటను నిజం చేసేందుకు కాళీమాత తన ముక్కెరను ఆకాశంలోకి విసిరివేసింది. అది నిండు చందమామ వలె ప్రకాశించింది. అమావాస్య రోజున పూర్ణచంద్రుడు కనిపించినట్లయ్యింది అని విశదీకరించే సందర్భం.

  సుమతుల సాధువాక్యములు శోభిలు నర్థము వెంట నంటి, వి
  భ్రమ మిడి దివ్యులౌ ఋషుల వాక్కుల నర్థము వెంబడించెడిన్,
  ప్రవిమల కాళిదాస కవి వాక్కుల సత్యము జేయ, కాళియే
  విమలమనస్కయై విసరి వేసెను ముక్కెర నింగిలోన, నీ
  *యమవస రోజు పూర్ణశశి యబ్బురమై కనిపించు నింగిపై.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (13-5-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరణను దయతో గమనించ ప్రార్థన.
   మూడవ పాదం మొదట *ప్రవిమల* అనే పదానికి బదులు *ప్రముదిత* అని మార్చి చదువవలసినదిగా మనవి.

   తొలగించండి
 13. అద్భుతమైన పూరణ అవధానిగారూ! నమోనమః! 🙏🙏🙏🙏🙏

  రిప్లయితొలగించండి
 14. అమెరిక వాసుడొకడు గగ
  నమునకు రాకెట్టు లోన నవదీధితిపై
  గమనమిడి దిగువ చూడగ
  నమవస దినమందు చంద్రుడగు పడెనింగిన్
  కుజ గ్రహమునకు అమెరికా వాసుడు వెడలి అచ్చట దిగి క్రిందకు చూడగ చంద్రుడు కనిపించెను భూమితిరుగుతున్నప్పుడు మనకు అమావాస్య దినమున చందురుడు కనబడడు. కాని అంతరిక్షములో కనబడునేమి అని భావన

  రిప్లయితొలగించండి
 15. భ్రమలను వీడు యత్నమది భాసుర యజ్ఞము
  విశ్వయానమే
  క్రమమున జేసిరెన్నొ మరి కన్నుల గట్టగ విశ్వరూపమే
  యమరిన యట్టి యానమున నద్భుత రీతిని కన్నువిందుగా
  "నమవస రోజు పూర్ణశశి యబ్బురమై కనుపించె నింగిపై"

  రిప్లయితొలగించండి
 16. తిమిరము పోగొట్టెడి యా
  సమవర్తి పితరుని కడ్డు శశియే రాగా
  నమరిన జీకట్ల నడుమ
  నమవస దినమందు చంద్రుడగుపడె నింగిన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. ఆహా! అద్భుతం. సూర్యగ్రహణ ఛాయలో మనం చూసేది చంద్రుడినేగా...
   👌🏻👏🏻💐🙏🏻

   తొలగించండి
  3. ధన్యవాదములు విట్టుబాబు గారూ! 🙏🙏🙏

   తొలగించండి


 17. లచ్చిందేవి కి తోబుట్టువటగా చంద్రుడు ! సోదరి ఆశపడితే వత్తాసు పల్కిన కల్వల సామి ;)


  సమయము సంజె దాటినది ! సానువు వేదిక! చిమ్మచీకటి
  న్నమరెను నీలి చాయ పస నాథుడు రాముడు కన్నులన్గనం
  గ మురిసె సీత! సోదరుడు కల్వల సామి సహాయమిచ్చెనో
  యమవస రోజు పూర్ణశశి యబ్బురమై కనుపించె నింగిపై

  జిలేబి

  రిప్లయితొలగించండి
 18. శంకరయ్య మాష్టారికి నమస్కారాలతో మనతెలుగు చంద్రశేఖర్ - కీ.శే. పండిత నేమాని వారు "రోజు" అనే పదం వాడవద్దు అనేవారు. అది అన్యభాషా పదం కాబట్టి "దినము" అనే పదం వాడమనేవారు.

  రిప్లయితొలగించండి
 19. తమకపు తరుణ వయస్కుల
  మమతలు నిండిన నగవుల మర్మము జూడన్
  మమకారపు మదిలో నే
  అమవస దినమందు చంద్రుఁ డగుపడె నింగిన్

  రిప్లయితొలగించండి
 20. క్రమమున దీపావళినిన్
  సమమున రాకెటులు గాల్చ స్వాతిశయమునన్
  భ్రమపడి యనవచ్చు నిటుల
  "అమవస దినమందు చంద్రుఁ డగుపడె నింగిన్"

  రిప్లయితొలగించండి
 21. భ్రమము నెరిగియు నెరపనిచొ
  కొమరుని మోమున నమవస కొమ్మకు దోచన్
  సమకూర్చగ వాంఛితమును
  అమవస దినమందు చంద్రుడగుపడె నింగిన్.

  రిప్లయితొలగించండి
 22. తమమది యెక్కువ యుండును
  అమవస దినమందు, చంద్రుఁ డగుపడె నింగి
  న్నమలపు గాంతిని నింపుచు
  విమలాకాశంబునందు వీక్షణ జేయన్

  రిప్లయితొలగించండి
 23. భూమిని పోలు భూమి సృష్టి బయోస్ఫియర్
  రెండను దృష్టి
  దైవకణమును వెతుకగ గోష్ఠి అచ్చెరువొందెగ
  పరమేష్టి
  సూర్యకాంతిని మళ్ళించగ గోళము గ్రహశకలపు
  శృంగిపై
  అమవస రోజున పూర్ణశశి యబ్బురమై కనిపించె
  నింగిపై

  రిప్లయితొలగించండి
 24. కందం
  శ్రమపడియు జయము సంధి
  గ్ధమనన్ గర్ణాటకంపు కదనంబందు
  న్నమరావతిఁ గమలమునకు
  నమవస దినమందు 'చంద్రుఁ' డగుపడె నింగిన్

  రిప్లయితొలగించండి
 25. కమనీయ దృశ్యమ య్యది
  అమెరిక పయనంబు నందు న ద్భు త రీతి న్
  రమణులు విమాన మున గన
  ఆమవ స దిన మందు చంద్రుడ గు పడె నింగి న్

  రిప్లయితొలగించండి
 26. తమమది యెక్కువైధరణి దాగనిపించును జంద్రుఢెప్పుడు
  న్నమవసరోజు,పూర్ణశశియబ్బురమైకనుపించె నింగిపై
  నమలపు గాంతి తోడను వియచ్చరమంతయు నిండునట్లుగా
  విమల మనస్కు లందరును వేగమె జూడుడు వింతయీయదిన్

  రిప్లయితొలగించండి
 27. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  అమవస దినమందు చంద్రుఁ
  డగుపడె నింగిన్

  సందర్భము: ఒక ప్రేయసి తనపై మోహంతో అమావాస్య నాడుకూడ చేరవచ్చిన తన ప్రియునిగురించి ఆతడు చంద్రునిలాంటి వా డని భావించి యిలా అనుకుంటున్నది.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  అమవస గిమవస యనడే!
  తమకముతోఁ జేర వచ్చు
  తన ప్రియుడు తనన్...
  విమల శశి సన్నిభుడు సుమ!
  యమవస దినమందు చంద్రుఁ
  డగుపడె నింగిన్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 28. ఆటవిడుపు సరదా పూరణ
  (తప్పులెన్ను వారు...)

  అమరపు కీర్తి నొందిన మహానటి జోరుగ నాడుచుండగా
  ఢమడమలాడు నాట్యమున ఢామ్మని నాదగు పెళ్ళియంచునో
  సమమిట లేని హాయిని పసందగు మాయబజారు చిత్రమం
  దమవస రోజు పూర్ణశశి యబ్బురమై కనుపించె నింగిపై

  రిప్లయితొలగించండి
 29. కుముదేశుఁడు చరియించును
  సముదమ్ము నభమ్ము నందు సక్రమముగ ధి
  ష్ణ్యముల సమీపించుచు నో
  యమ! వసదిన మందు చంద్రుఁ డగుపడె నింగిన్

  [అమ = అమ్మ; వసత్ + ఇనము = వసదినము; ఇనము = హస్తా నక్షత్రము]


  ఆ నాటి తిథి విషయమై తర్కించుచున్న మిత్రుల భాషణములు:

  భ్రమపడ నేల చంద్రుఁడు నభమ్మున నుండును బూర్ణమాసినిన్
  సమముగ బింబ రూపమున సంతస మిచ్చుచు జీవ రాశికిన్
  విమలతర ప్రభా యుతము వెల్గుచు, పూర్ణిమ సుమ్మి చూడు కా
  దమవస, నాడు పూర్ణశశి యబ్బురమై కనుపించె నింగిపై

  రిప్లయితొలగించండి
 30. కమనీయము చుక్కలుగన
  అమవస దినమందు!"చంద్రుడగుపడె నింగిన్
  ప్రమిదగ వెలుగులు జిమ్మగ?
  సుమసందడి,ప్రేమజంట సఖమయమనుచున్"

  రిప్లయితొలగించండి
 31. అమరులు పోవు మార్గమున నద్భుత దృశ్యము గానుపించగా
  తమతమ యూహమేరకును తారల యుద్ధము నూహ జేయుచున్
  భ్రమసిరి దేశవాసులటు పళ్ళెముబోలెడి కాంతిపుంజము
  న్నమవస రోజు పూర్ణ శశి యబ్బురమై గనిపించె నింగిపై!

  రిప్లయితొలగించండి
 32. సుమధుర భావ వల్లరులు చోద్యముగా హృదయాన నిండగన్
  ప్రమదము మీర పూరణలు బ్లాగున పంపెడి వేళ నింగి పై
  కమల విభుండు కట్టెదుట గ్రాలుచునుండిన మానసమ్మునన్
  యమవస రోజు పూర్ణ శశి యబ్బురమై గనిపించె నింగిపై

  రిప్లయితొలగించండి
 33. ఘుమఘుమ లాడెడు మల్లెలు
  ప్రమదమ్ముగ జడను దాల్చి పడతుక రాగన్
  తమిహెచ్చి కనుల ముందర
  అమవస దినమందు!"చంద్రుడగుపడె నింగిన్

  రిప్లయితొలగించండి
 34. మిత్రులందఱకు నమస్సులు!

  [ఒక యమావాస్యనాఁటి పగఁటిపూఁట యేర్పడిన సూర్యగ్రహణ ప్రభావముచే నాకసమునఁ జీఁకట్లు క్రమ్మినను, తదుపరి, క్రమక్రమముగా సూర్యుఁడు వెలికి వచ్చుచు, మబ్బులు తెరవలెఁ గ్రమ్ముకొనిన కారణముగా, ప్రకాశముం గోలుపోయిన సందర్భము]

  నమ మిడితయ్య సూర్య గ్రహణమ్మునుఁ గాంచుచు నొక్కనాఁడు, నేఁ
  దమిఁగొొని చీఁకటుల్ ముసర దబ్బునఁ జూచితి! భాస్కరుండు రాన్
  దిమిరము వోవుచుండె! నటఁ దెప్పల వోలెఁ బయోధరమ్ములే
  గమనము సేయ; మబ్బు తెర గాన్, రవి యా శశి కాంతి నంద, నా
  యమవసనాఁడు పూర్ణశశి యబ్బురమై కనుపించె నింగిపై!

  రిప్లయితొలగించండి
 35. పోచిరాజు వారు, మధుసూదన్ గారు "అమవసనాఁడు" అన్నారు బాగుంది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆర్యా నేను సమస్యను చూచు నప్పటికే “అమవస నాడు” అనియే యున్నది.

   తొలగించండి
 36. రమణియె ప్రేమతోడ దరి రమ్మని పిల్వగ కోటి యాశతో
  తిమిరము నందు పూరుషుడు తీవ్రత హెచ్చిన కోర్కెతో నటన్
  బ్రమదను జేరబోయెనట రాజుదయించని రేయిలోన నా
  సుమవన మందుగాంచగను సుందరి నేయట నెత్తు మంచెపై
  అమవస నాడు పూర్ణశశి యబ్బురమై కనిపించె నింగిపై

  రిప్లయితొలగించండి


 37. రోజు నాడుగ మారెను రుక్కుమణి ! జి
  లేబి! అన్యభాష పదము లేల యనగ !
  తెలుగున పదసంపదయెంత తీరు గాంచె
  దేని కైన చిక్కును మంచి తేట పల్కు :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 38. అమితపు టెండలలో జల
  మమరక నుండం గమేఘ మగుపడు రీతిన్
  తిమరము నిగుడెడు రేతిరి
  అమవస దినమందు చంద్రు డగుపడె నింగిన్

  రిప్లయితొలగించండి
 39. శ్రమపడ లేదు! నేను జప శాంతులఁ జేయఁగ లేదు! సత్య మే
  కమలవిభున్ దపించనయ ! కాలుని మ్రొక్కను! బ్రహ్మ వేడ నే!
  భ్రమగొని రంగుటద్దములు వాలగ మోమున మండుటెండలో
  యమవస రోజు పూర్ణశశి యబ్బురమై కనుపించె నింగిపై!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుందండీ! యేమాత్రం శ్రమపడకుండా చలువ కళ్ళద్దాలతో సూర్యుణ్ణి చంద్రుడిగా మార్చేశారు! 👌👌👌😊😊😊

   తొలగించండి
  2. భేష్!అభినందనలు సహదేవుడు గారూ.

   తొలగించండి
  3. శ్రీమతి సీతాదేవిగారికి మరియు శ్రీమిస్సన్నగారికి ధన్యవాధములు

   తొలగించండి


 40. తిమిరమెపుడావరించును?
  కమనీయంబైన శ్వేత కౌముది పంచుచున్,
  కొమరొప్పగ పౌర్ణమి తిథి
  అమవస దినమందు ,చంద్రుడగపడె నింగిన్.

  రిప్లయితొలగించండి
 41. రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి

  2. రాజేశ్వరి అక్కయ్య గారి బ్లాగు నుండి :)

   తరువుల గూల్చినప్పుడె గదా జగమందు సుఖంబు పెంపగున్

   జిలేబి

   తొలగించండి
 42. డా.పిట్టాసత్యనారాయణ
  క్షమ గన పితృపిండాదులె
  రమణీయము బ్రాహ్మణునకు రాబడి బెంచున్
  జమజేసిన రూకల గన
  అమవస దినమందు చంద్రు డగుపడె నింగిన్

  రిప్లయితొలగించండి
 43. డా.పిట్టా సత్యనారాయణ
  అమవస యన్న శూన్య తిథి యందదు పొంద దటన్న జోష్యమౌ
  విమల మనస్సుతో బనిని వేడ్కగ జేయ ముహూర్తమై మనున్
  కమలిన పూవు వంటి యొక గడ్డు దరిద్రుని కందె రూకలా
  అమవస నాడు పూర్ణశశి యబ్బురమై కనిపించె నింగిపై

  రిప్లయితొలగించండి
 44. డా.పిట్టా సత్యనారాయణ
  అమవస యన్న శూన్య తిథి యందదు పొంద దటన్న జోష్యమౌ
  విమల మనస్సుతో బనిని వేడ్కగ జేయ ముహూర్తమై మనున్
  కమలిన పూవు వంటి యొక గడ్డు దరిద్రుని కందె రూకలా
  అమవస నాడు పూర్ణశశి యబ్బురమై కనిపించె నింగిపై

  రిప్లయితొలగించండి
 45. కుమిలిన గూడ రాడుగద కుందుచు గొల్లున కేకబెట్టగా
  నమవస నాడు పూర్ణశశి;..యబ్బురమై కనుపించె నింగిపై
  నమవస నాడు మాయమయి హైరన నొందుచు మబ్బులేకయే
  క్రమముగ సూర్యుడాదటన గట్టిగ పట్టగ కేతువాతనిన్

  రిప్లయితొలగించండి