మీ క్రిస్మస్, దోమల రెండు పద్యములు బాగున్నవి. వైవిధ్యమైన అంశాలు. దోమల లో ఆడ దోమలు మాత్రమే రక్తము తాగుతాయి. మగ దోమలు రక్తపు జోలికి వెళ్ళవు. కవి సమయం కాబట్టి మంచి ఆలోచన.
"The female mosquito is the one that bites (males feed on flower nectar). She requires blood to produce eggs. Her mouthparts are constructed so that they pierce the skin, literally sucking the blood out. Her saliva lubricates the opening. It’s the saliva plus the injury to the skin that creates the stinging and irritation we associate with mosquito bites."
ప్రభాకర శాస్త్రి గారూ, క్రీస్తురక్తంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ముందు నాకు చేతకాదంటూనే ఏదో ఒక సమయంలో ఠక్కున పూరణ పెట్టేస్తారు! ఇలా ఎన్నిసార్లు జరగలేదు?
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2693 సమస్య :: *రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని బిల్చెఁ బ్రియుండు ప్రేమతో.* ‘’రక్తం త్రాగుతాను రా’’ అంటూ ప్రియుడు ప్రేమతో పిలిచినాడు అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: కీచకుని దౌర్జన్యాన్ని తలచుకొని కుమిలిపోతూ ఉన్న ద్రౌపదిని ఓదారుస్తూ భీమసేనుడు ఓ ప్రియా ! వీరాధివీరులైన భర్తలు ఉండగా నీవు ఇలా బాధపడటం తగదు. నీవు యుక్తితో ఆ కీచకుని ఈ రోజు రాత్రికే ఈ నర్తనశాలకు రమ్మని పిలువు. ఈ ఉగ్ర భీమసేనుని శక్తిని చూపించి వాడిని చంపి యమలోకానికి పంపిస్తాను. బాధపడకు దగ్గరకు రా అంటూ పిలిచే సందర్భం.
భక్తుని! నీవియోగమునుఁ బాపు సుహాసిని! పంకజాక్షి! నా శక్తి తఱుంగుచుండె. మనసారగ నా సఖి రూపు గాంచ నా సక్తియు హెచ్చుచుండెను.పసందగు చందురు వంకలందు నీ రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో
రిప్లయితొలగించండిదోమల సందోహం :)
"యుక్తము కుట్టుము మనుజుల
శక్తి కొలదిగా జిలేబి ! సఖి, నా దోమా !
ఫక్తుగ నినువెను కాడుచు,
రక్తముఁ ద్రాగెదను చెలియ" రమ్మనెఁ బ్రియుఁడే :)
జిలేబి
👏👏👏
తొలగించండిమశక రక్తము (అందులో అన్ని గ్రూపులూ ఉంటాయి) 😊🙏👏
తొలగించండి...మైలవరపు మురళీకృష్ణ
మీ క్రిస్మస్, దోమల రెండు పద్యములు బాగున్నవి. వైవిధ్యమైన అంశాలు. దోమల లో ఆడ దోమలు మాత్రమే రక్తము తాగుతాయి. మగ దోమలు రక్తపు జోలికి వెళ్ళవు. కవి సమయం కాబట్టి మంచి ఆలోచన.
తొలగించండితప్పులున్న క్షమాపణలు.
...రాజా
తొలగించండి:) సూపర్ ఫైండింగ్ :)
ఇంత వ్యత్యాసం వుందా ? ఈ మహానుభావుడెవరో మరీ "ఆడ దోమల" బాధితుడై రీసెర్చి చేసారేమో :)
సావేజిత
జిలేబి
😊😊😊
తొలగించండిDon't believe all that you read on the net :)
gps
***************************
"The female mosquito is the one that bites (males feed on flower nectar). She requires blood to produce eggs. Her mouthparts are constructed so that they pierce the skin, literally sucking the blood out. Her saliva lubricates the opening. It’s the saliva plus the injury to the skin that creates the stinging and irritation we associate with mosquito bites."
http://www.loc.gov/rr/scitech/mysteries/mosquitoes.html
తొలగించండినమో నమః కంది వారికివ్వాళ దోమల సందడే సందడి :)
నెనరులు
Interesting.
జిలేబి
మశక మశక పూరణలో..
తొలగించండి👏🏻👌🏻😃
The speed with which u write the poems is amazing! Hats off to Zelebi!! 🙏🙏🙏🙏
తొలగించండి
తొలగించండిసీతాదేవి గారికి నమో నమః
టపటప యనుచున్ టైపా
టి పదములన్ జేయగా పటిష్టత జేకూ
రు,పడతి, జిలేబి నుపయో
గపడునకో దేనికైన గరిమయు లేకన్ :)
జిలేబి
తొలగించండిపదముల నత్తొచ్చించున్
సదనంబున తిరుగుచున్ వెసవెసగ వేయం
గ దరువుల జిలేబులను గ
లదే తరుణి ఫలము? గలగల గులక రాళ్ళే :)
జిలేబి
తొలగించండిమశకమశక పూరణలోన మా జిలేబు
లమ్మి మాగట్టిదయ్య గలగల యనుచు
తిరుగు చీకటీగవలెను తీరుగాను
విశ్వదాభిరామ వినుమ విట్టుబాబు !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ, దాని ననుసరించిన ముచ్చట్లు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
👌🏻🤣🙏🏻
తొలగించండి
తొలగించండిగలగలమని కలదిరుగుచు
కిలకిల నగవుల విరులవి కెఱలగ సభలో
వలపల దాపల చేతుల
జలజల వారెడు కవితలు జల్లు జిలేబీ!
క్రిస్మస్ పండుగ వేడుకలు:
రిప్లయితొలగించండిముక్తికి మార్గమ్మిదియే!
రక్తికి జీససు డొసగిన రమ్యపు దైనన్
భక్తులు తెచ్చిన ప్రేమపు
రక్తముఁ ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే
King James Bible
"He that eateth my flesh, and drinketh my blood, dwelleth in me, and I in him."
http://biblehub.com/john/6-56.htm
తొలగించండిజీపీయెస్ వారు మీకోసం శార్దూల కైపదం :)
పారుండే సిసుడయ్య జీససునకున్ ప్రారబ్ధకర్మంబుగాన్
జిలేబి
పురాణాలకీ నాకూ చాలా దూరము గదా!
తొలగించండి😊
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిక్రీస్తురక్తంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముందు నాకు చేతకాదంటూనే ఏదో ఒక సమయంలో ఠక్కున పూరణ పెట్టేస్తారు! ఇలా ఎన్నిసార్లు జరగలేదు?
🙏🙏🙏
తొలగించండినిద్ర పట్టదు సార్! ఏమిచేయగలను?
తొలగించండినిదుర పట్టదు గురువర నేమి చేతు
నయ్య పూరణలను వేతు నయ్య శక్తి
కొలదియు! పురాణముల కత కొంచె మైన
తెలియదయ చేతు నెట్లవి తేట గీతి :)
జిలేబి
దొందూ దొందే ఇక్కడా నిద్ర పట్టని బామ్మే :)
👏
తొలగించండి
రిప్లయితొలగించండిదోమల సంభాషణ :)
"వక్తుల మంచు తోయదము, పాలు,జిలేబుల, తైరులన్, భళా
శక్తికి ద్రావి కొమ్ముగల సారము లొప్పు జనాళి యీ కవుల్ !
ఫక్తుగ నీ మెయిన్నడతు ! పాముచు కుట్టుము వీరలన్,సఖీ,
రక్తముఁ ద్రాగెదన్ జెలియ", రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో
జిలేబి
తొలగించండి*వక్తల మంచు
జిలేబీ గారూ,
తొలగించండిదోమలకు కవుల రక్తం అంత బాగుంటుందా? బాగుంది మీ పూరణ. అభినందనలు.
భక్తిగ పూజించిన మరి
రిప్లయితొలగించండిశక్తికి మించిన ఫలితము సరిలే దనుచున్
యుక్తిగ ననురా గంబున
రక్తముఁ ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇక్కడ 'రక్తము' అంటే మీ భావం?
" అనురాగమనే రక్తం " అన్నమాట
తొలగించండివ్యక్తులు వేవురుండిరి నివాసమునన్ , మరుగింత చిక్కదే !
రిప్లయితొలగించండిశక్తము గాదులే శయనశాలకు బోవ, రమించుటెట్లొ ? సు...
వ్యక్తము వాంఛ ! కాదనకుమా ! మధురాధర బింబలిప్తమౌ
రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో !!
రక్తము... ఎరుపురంగు
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిమధురాధర బింబలిప్తమౌ రక్తముఁ :)
అవధాను లంటే మజాకాయా !అదురహో !
జిలేబి
జిలేబీ గారికి వందనములు 🙏🙏
తొలగించండి...మైలవరపు మురళీకృష్ణ
మైలవరపు వారి పూరణ మధురంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిశక్తికి, యుక్తికి, రక్తికి
ముక్తికి, భక్తికి శుభాంగి ముప్పొద్దులటన్
భుక్తికి జిలేబి, నీయను
రక్తముఁ ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివృత్త్యనుప్రాసతో మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.
ముక్తిని కోరబోము మరిమూఢుల వోలె సుఖాల తీరముల్
రిప్లయితొలగించండిశక్తిని మించు కోరికలు చల్లని మల్లెల పిల్లవా యువుల్
యుక్తిగ కుట్టు దోమలను నెవ్విధి జంపిన శోణమున్ చవిన్
రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొంత అన్వయదోష మున్నది!
అమరుని జేయగన్ అధరామృతమనె ఉత్తమ
రిప్లయితొలగించండిజాతి ప్రియుడు
కళ్ళవి కార్చె మద్యమనుచు తూలుతు పేలే
మధ్యమ గతుడు
అధముడదె శాడిజోపహతుడు కౌతుకమున
తాననె భామతో
రక్తము ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చె
బ్రియుండు ప్రేమతో
(దుశ్శాసనుని వధించి వేణీసంహారానికై ద్రౌపదిని
రిప్లయితొలగించండిపిలుస్తున్న భీమసేనుడు )
"సక్తతతోడ వీడు కురుసభ్యులముందర కొప్పులాగె ; నీ
దిక్తటముల్ ధ్వనింపగను దీనవు నీదగుచీరనూడ్చె; నా
యుక్తతలేని కావరు మదోద్ధరు జంపితి ; వెచ్చవెచ్చనౌ
రక్తము ద్రాగెదన్ జెలియ! ర"మ్మనిపిల్చె బ్రియుండు ప్రేమతో .
చాలా బాగుంది సర్ 👌👏🙏🙏🙏
తొలగించండిబాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండిధన్యవాదాలు సహదేవుడుగారూ!
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
రక్తిగ బ్రేమ జంట మకరందపు టూహలలో విహార మా
సక్తిగ జేయుచుండు నెడ సర్పము కాటిడె బ్రేయసిన్ || " నినున్
యుక్తి - చికిత్స జేయు చెటులో బ్రతికించెద | బాము కాటుపై
రక్తము ద్రాగెదన్ జెలియ ర " మ్మని పిల్చె బ్రియుండు ప్రేమతో
{ యుక్తి - చికిత్స = చట్కా వైద్యము }
..................................................................
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2693
సమస్య :: *రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని బిల్చెఁ బ్రియుండు ప్రేమతో.*
‘’రక్తం త్రాగుతాను రా’’ అంటూ ప్రియుడు ప్రేమతో పిలిచినాడు అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: కీచకుని దౌర్జన్యాన్ని తలచుకొని కుమిలిపోతూ ఉన్న ద్రౌపదిని ఓదారుస్తూ భీమసేనుడు ఓ ప్రియా ! వీరాధివీరులైన భర్తలు ఉండగా నీవు ఇలా బాధపడటం తగదు. నీవు యుక్తితో ఆ కీచకుని ఈ రోజు రాత్రికే ఈ నర్తనశాలకు రమ్మని పిలువు. ఈ ఉగ్ర భీమసేనుని శక్తిని చూపించి వాడిని చంపి యమలోకానికి పంపిస్తాను. బాధపడకు దగ్గరకు రా అంటూ పిలిచే సందర్భం.
యుక్తమె రోదనల్ సలుప యోధులు భర్తలు గాచుచుండ ? నీ
నక్తమె కీచకున్ దునుమ నర్తనశాలకు బిల్వుమా ప్రియా
యుక్తిగ, భీమశక్తిని మహోగ్రతఁ జూపి వధింతు నేనె, త
*ద్రక్తముఁ ద్రాగెదన్ జెలియ! రమ్మని బిల్చెఁ బ్రియుండు ప్రేమతో.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (31-5-2018)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమీపద్యమ్ముల వెంటవచ్చు కథలున్ మీ వ్యాఖ్యలో నేర్పులున్
తొలగించండిమీ పర్యుక్తుల బూర్వ గాథలహరీ మేధః ప్రియాఖ్యానముల్
మీ పేరొందిన శ్రావ్య కంఠమున బ్రాహ్మీస్తన్య దుగ్ధోర్మికల్
దీపించెన్ గద రాజశేఖర సుధీ దీవ్యన్మహా వాఙ్నిధీ!
👏👏
తొలగించండికోటవారికీ, చిటితోటి వారికీ నమోనమః! 👌👌👌💐💐💐🙏🙏🙏
తొలగించండిరాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
******
విజయకుమార్ గారూ,
కోట వారిని ప్రశంసించిన మీ పద్యం మనోహరంగా ఉన్నది. అభినందనలు.
నిజముగ నాదు పద్యముల నిత్యముఁ జూచుచు సంస్కరించుచున్
తొలగించండిభుజమును తట్టుచుండ పరిపూర్ణ ప్రశంసల నందుచుంటి నో
సుజన! వధాని వర్య! గుణశోభిత! హే చిటితోటి వంశజా!
విజయకుమార! మాన్యవర! విజ్ఞుడ! మీకు కృతజ్ఞతాంజలుల్.
కోట రాజశేఖర్ నెల్లూరు (31-5-2018)
సహృదయులు శ్రీ మిస్సన్న గారికి ధన్యవాదాలు.
తొలగించండిశ్రీమతి సీతాదేవి గారికి హృదయపూర్వక ప్రణామాలు.
తొలగించండి
తొలగించండివావ్ ! కోట వారు మీరసాధ్యులు !
వాక్యాలనే ఛందస్సులో చంపకమాలలో నిమిడ్చేరు !!!!
జిలేబి
రక్తిని కోరుచు ముదమున
రిప్లయితొలగించండియుక్తిగ పిలిచెను చెలిమిగ యుద్వే గమునన్
ముక్తికి మార్గము ప్రియమగు
రక్తముఁ ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చెలిమిగ నుద్వేగమునన్' అనండి.
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండియుక్తమయుక్తము గానక
రిక్తపు వాగ్దానపరుని రెక్కలు విరువన్
శక్తుడ సుకవిని దుష్టుల
రక్తము ద్రాగెదను చెలియ రమ్మనె బ్రియుడే
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.ఎన్.వి.ఎన్.చారి
రిప్లయితొలగించండిశక్తిని గోరుచున్ పతికి శారద వైద్యుని సంప్రదించగా
రక్తము లేదు నాతనికి రాసెదమందులు వాడుమన్నచో
యుక్తిని బీటురూటురసముంచగ భర్త యు మేలమాడి"సం
రక్తము, ద్రాగెదన్ జలియ రమ్మని పిల్చె ప్రియుండు ప్రేమతో"
డా. చారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వ్యక్త ము చేసెను భయము ను
రిప్లయితొలగించండిశక్తి యుతు లు నైన శత్రు సైన్య ము లుండ న్
యుక్త మ దె ట్ ల గు న న నరి
రక్త ము త్రాగెదను చెలియ రమ్మనె ప్రియుడే
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిశక్తికి బ్రాకులాటలయె, సర్వమబద్ధము మాతృమూర్తి నా
సక్తిని గొల్వుడంచనుచు చాటుగ నిన్ నిరసించి యశ్రు సం
సిక్తను జేయువారలె యిసీ!తగు న్యాయము జేతు నే కవిన్
ఉక్తుల వారి నడ్డుకొను ఓరిమి(యోరిమి) జచ్చెను, వారి జీల్చి యా
రక్తము ద్రాగెదన్ చెలియ రమ్మని పిల్చె ప్రియుండు ప్రేమతో
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భోక్తగ భుజించి తదుపరి
రిప్లయితొలగించండియుక్తముగా బీటురూటు నూరిన రసమున్
వ్యక్తము కాగా సరసము
"రక్తముఁ ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే"
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈనాటి ఉన్మాద ప్రేమికుడు!
రిప్లయితొలగించండియుక్తము కాదనుచు వ్యతి
రిక్తత జూపితివి ప్రేమ రేగగ నాలో
రక్తిని దరి జేరు వినా
రక్తము ద్రాగెదను చెలియ రమ్మనె ప్రియుడే!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. 'కాదనుచును' అనండి. 'వినారక్తము'?
గురువుగారికి నమస్సులు! సవరిస్తాను!🙏🙏
తొలగించండిఈనాటి ఉన్మాద ప్రేమికుడు!
తొలగించండియుక్తము కాదనుచును వ్యతి
రిక్తత జూపితివి ప్రేమ రేగగ నాలో
రక్తిని దరి జేరనిచో
రక్తము ద్రాగెదను చెలియ రమ్మనె ప్రియుడే!
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
.....................* శ్లే షా లం కా ర ము * ................................
" యుక్త వయస్సులో బరువ మూగిస లాడెడు నిన్ను , నిత్యమున్
భుక్తియు - నిద్ర మాని తలపోసెద | బ్రేమ నిమిత్తమై పరి
త్యక్త మొనర్చెదన్ > దనువు | దావక రాగ మరంద సిక్త హృ
ద్రక్తము ద్రాగెదన్ జెలియ ర " మ్మని పిల్చె బ్రియుండు ప్రేమతో
{ హృత్ + రక్తము = గుండెలోని రక్తము ( లే దా ) మనసు లోని
అనురాగము ; తావక రాగ మరందసిక్త హృద్రక్తము ద్రాగెదన్ =
నీ గుండె లో ఉన్న అనురాగ మధు సిక్త మయిన రక్తము ద్రాగెదను
. . . . . అని ఒక అర్థము . . . . . . . . . . . . . . .
నీ యొక్క మధు సిక్త మయిన హృదయానురాగము ద్రాగెద
. . . . . . . . . . అని యింకొక అర్థము . . . . . . . . . . . . . . . . . }
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
యుక్తమె నీకిది? వలపును
రిప్లయితొలగించండివ్యక్తము జేసితిని నేనె, యధరము నిమ్మా!
రక్తిని,యిక తోడకు నా
"రక్తముఁ ;ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్తుడను నీకు నిజమను
రిప్లయితొలగించండిరక్తి కలిగె మానసమున లలితాంగీ యా
సక్తిని దంతక్షతముల
రక్తముఁ ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
యుక్తిని పాయస మందా
రిప్లయితొలగించండిసక్తిని కుంకుమము పూవు శర్కర జేర్చన్
శక్తి నొసగు క్షీర రసా
రక్తము ద్రాగెదను! చెలియ! రమ్మనె బ్రియుడే!
రస+ఆరక్తము (ఆరక్తము=ఇంచుక ఎఱ్ఱనిది)
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వ్యక్తముఁజేయుచుంటి హృదయమ్మున నీపయినున్న ప్రేమ ను
రిప్లయితొలగించండిద్రిక్తత చెందుచుంటిని మదిన్ - విను! లేదనిచెప్పబోకుమా
సక్తి , విషమ్ము! ఘోరముగఁ జంపును ముక్కులఁ గారిపించుచున్
రక్తముఁ! , ద్రాగెదన్ జెలియ! రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో"
(చిరు ప్రయత్నం)
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
భక్తుని! నీవియోగమునుఁ బాపు సుహాసిని! పంకజాక్షి! నా
రిప్లయితొలగించండిశక్తి తఱుంగుచుండె. మనసారగ నా సఖి రూపు గాంచ నా
సక్తియు హెచ్చుచుండెను.పసందగు చందురు వంకలందు నీ
రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో
యుక్తమె నీ వలుగుట సం
రిప్లయితొలగించండిరక్త సులోచన మది నను రాగ మరయవే
రిక్త కషాయము గంధ ని
రక్తముఁ ద్రాగెదను జెలియ రమ్మనెఁ బ్రియుఁడే
[నిరక్తము = పోనట్టిది; అక్తము =పోయినది]
భుక్తము లెల్ల భోగములు భూరి తరమ్ముగ భార్యతోమహా
రక్తిని నీవు గూడ మఱి రంజిలి త్రాగఁగ భర్త సన్నిధిన్
యుక్త ఫలాతిరిక్తము మహోత్తమ శీతల పేయరాజ సం
రక్తముఁ ద్రాగెదం జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో
[సంరక్తము = ఎఱ్ఱనిది]
శక్తుడనే?నీకునీయ
రిప్లయితొలగించండిరక్తము,ద్రాగెదనుచెలియరమ్మనెబ్రియుడే
భక్తినిదెచ్చిన పాలను
రక్తినిజేకూర్చినట్టిరమ్యపు రుచులన్
"రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో"
రిప్లయితొలగించండిరక్తముద్రాగునాబళిర రాక్షసజాతిని జన్మనొందెనా?
రక్తముదానుద్రాగునటరమ్మనిపిల్చుటచూడగాజెలిన్
రక్తినివారలొండురులురాలునుదేలిన వారలేసుమా
రావణాసురుడు సీతతో
రిప్లయితొలగించండియుక్తము కాదటంచు నను నోర్పునశించగ దూరముంచుచున్
శక్తిని గోలుపోయిన యశక్తుని రాముని దల్చనేటికిన్
వ్యక్తము జేయవేని యొక వారము లోపల నానుకూల్యతన్
రక్తము ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చె బ్రియుండు ప్రేమతో!
శక్తిగ రాక్షసుడొక్కడు
రిప్లయితొలగించండియుక్తిగ యిద్దరిని జంపి యోచనతోడన్
“భుక్తికి మనకగు గనుమా
రక్తము ద్రాగెదను”చెలియ రమ్మనె ప్రియుడే.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(కూకటపల్లి సంతలో)
శక్తి యొకింత లేదు సఖి సమ్మరు హీటును తాళజాలనే
ముక్తియె కల్గునే మనకు ముచ్చట మీరిన మూడు గ్రుక్కలన్
రక్తిగ మానసమ్మునకు రంజన నిచ్చెడి పుచ్చకాయదౌ
రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో
👏👏👏
తొలగించండిజీపీయస్ వారి ప్రోత్సాహంతో
రిప్లయితొలగించండిభోక్తగ తాఁ భుజించె ఘన భోజన మంతట వెండిప ళ్ళెమున్
(సూక్తుల జెప్పుచు న్నతివ శోభను నెత్తురు బెంచునో సఖా)
సూక్తుల జెప్పుచు న్నతివ క్షుద్రముఁ గాదిది జూడుమో సఖా
యుక్తము బీటురూటనుచు నూరిన నారస మందజేయగా
"రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో"
తొలగించండిబీటురూటును రక్తమంచును భీతిగాంచె జిలేబియే :)
జిలేబి
నెనరులు
రిప్లయితొలగించండిజిలేబి గారూ
🙏🏻
నక్తము లుండ కార్తికము నందున నీ యెద పొంగ గాఢమౌ
రిప్లయితొలగించండిరక్తిని నారికేళపు జలమ్మును నాకిడ కోసి తెస్తివా
యుక్తిగ బొండము న్నిలువవో కట జూపుము లేత చేతిలో
రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో.
యుక్తుల మోహపు ప్రేమలు
రిప్లయితొలగించండిరక్తిగ పెడదారి బట్టి రక్కసి ప్రేమన్
యుక్తిగ ద్రావక దాడుల
రక్తము ద్రాగెదను చెలియ రమ్మనె ప్రియుడే!
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిశక్తికి బ్రాకులాటలయె, సర్వమబద్ధము మాతృమూర్తి నా
సక్తిని గొల్వుడంచనుచు చాటుగ నిన్ నిరసించి యశ్రు సం
సిక్తను జేయువారలె యిసీ!తగు న్యాయము జేతు నే కవిన్
ఉక్తుల వారి నడ్డుకొను ఓరిమి(యోరిమి) జచ్చెను, వారి జీల్చి యా
రక్తము ద్రాగెదన్ చెలియ రమ్మని పిల్చె ప్రియుండు ప్రేమతో
ఉత్పలమాల
రిప్లయితొలగించండియుక్తవయస్కులై తలపు లూయల లూగిన జంట పుష్ప సం
యుక్త వనమ్ము కేగి ప్రియుఁడొక్క గులాబిని గోట గిల్లగన్
రక్తముఁ జింద ప్రేమికుని రాగిణి లాలనఁ జేయ నోట యా
రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండుఁ బ్రేమతో
(10-11-2004 నాడు నా పూరణ ఆకాశవాణి కడప కేంద్రము వారిచేత ప్రసారంచేయడం జరిగింది.)
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఉదయం నుండి 'జడ శతకము' పద్యాల సమీకరణంలో వ్యస్తుణ్ణై ఉండి మీ పూరణలపై స్పందించలేక పోయాను. మన్నించండి.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. ..
"రక్తముఁ ద్రాగెదను చెలియ
రమ్మనెఁ బ్రియుఁడే"
సందర్భము: "ఇదేదో పూర్వకర్మం! విచారించకు. ఇటురా! తేలు కఱచిన చోటు (సమీపం) చూపించు. కొరికి ఉమ్మి వేస్తాను. విషం పోతుంది. అంతే!"
అంటున్నాడు భార్యతో ఒక భర్త.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
"ప్రాక్తన కర్మమె! కొరికెద
యుక్తిగఁ దేల్ కఱచిన దరి;
నుమిసెద విష ;మా
సక్తిగఁ జూపవె వేగమె!
రక్తముఁ ద్రాగెదను చెలియ!"
రమ్మనెఁ బ్రియుఁడే..
2 వ పూరణము..
సందర్భము: "ఈ మంత్రిగారు జనాల రక్తం బాగా పీల్చినాడు. వీని రక్తం నేను పీలుస్తాను చూడు."
అంటున్నాడు ఒక జలగ ప్రియుడు భార్యతో..
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
రక్తుడు జలగ ప్రియుడు కద!
"శక్తి కొలది మంత్రిగారు జను లందరిదౌ
రక్తముఁ బీల్చెనె! యీతని
రక్తముఁ ద్రాగెదను చెలియ!
ర " మ్మనెఁ బ్రియుఁడే..
🖋~డా.వెలుదండ సత్య నారాయణ
రక్తం త్రాగే మగ నల్లి/చీమ/జలగ అన్నట్టుగా
రిప్లయితొలగించండి1.శక్తియు వీరికి గలదిక
రక్తము త్రాగెదను ,చెలియ రమ్మనె ప్రియుడే
భుక్తియు తీరును మనకిట
రక్తియు కలుగును జనముల రక్తము ద్రావన్.
భీముడు ద్రౌపదితో
2.శక్తియె నాయుధమవగా
రక్తము త్రాగెదను చెలియ రమ్మనె ప్రియుడే
యుక్తిగ వానినణచి నే
రక్తిని కూర్తును రణమున రమణీ మణిరో.
కందం
రిప్లయితొలగించండిరక్తికి నర్తనశాలకు
యుక్తిగ సింహబలుఁ జేర్చ వ్యూహముఁ బన్నన్
శక్తుడఁ వానిన్ గూల్చఁగ
రక్తముఁ ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే
రక్తిని కట్టుగా నుడుకు రక్తము గ్రోలగ మాధురీమణీ
రిప్లయితొలగించండిశక్తిని నిచ్చుగా పెదవి చక్కగ నొక్కుచు పీల్చుచుండగా
ముక్తిని డెంగితో నిడుదు మూర్ఖుడు పండిత శాస్త్రివర్యుకున్
రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో!