26, మే 2018, శనివారం

సమస్య - 2688 (వీరుఁ డెవఁడన్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు" 
(లేదా...) 
"ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁడన్నపు డుత్తరు నేఁ దలంచెదన్"

145 కామెంట్‌లు:

 1. ఆతతభాషణమ్ములను నంబరభూముల గల్పుచుండెడున్;
  వీతమొనర్చి పౌరుషము ప్రీతిగ దేశము సంచరించెడున్;
  చేతలు లేని వర్తనల సిగ్గిసుమంతయు జూపకుండగా;
  ఖ్యాతిని గన్న వీరుడెవడన్నపు డుత్తరునే దలంచెదన్.

  రిప్లయితొలగించండి
 2. గుండె ధైర్యము లేనట్టి పిండి ముద్ద
  దళము గాంచిన చాలును దడుసు కొనగ
  డాబు కబురులు జెప్పుచు డాంబ రమున
  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు

  డాంబరము = యుద్ధము  రిప్లయితొలగించండి

 3. భారతము నాకు తెలుసు! సుభగత!, పూవు
  బోడి, చెప్పవమ్మ జవాబు బుద్ధి మంతు
  డైన శూరుడెవవడోయి, డంక తనపు
  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వీరు డెవవడోయి'?

   తొలగించండి
 4. మాటలు పెక్కు పల్కగవచ్చున్ చేతలవి
  శూన్యమైనన్
  తనవారలు చుట్టు నిలువన్ మీసములను
  మెలిపెట్టవచ్చున్
  ఒక్కడుండె నన ద్వాపరంబునన్ మిక్కిలిగ
  నేడు చెలగన్
  ఖ్యాతిని గన్న వీరుడెవడన్నపు డుత్తరు నే
  దదలంచెదన్

  రిప్లయితొలగించండి


 5. జోతల తోడు చెప్పెదను చొప్పడు రీతిని భారతమ్మునన్
  నే తలతున్ కి రీటి నయ నెప్పటి కైనను శూరు డెవ్వడో,
  ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁడన్నపు,డుత్తరు నేఁ దలంచెదన్,
  చేతల డాంబికమ్ము లకు చెప్పు నుదాహరణమ్మనన్ సుమా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నయ నెప్పటికైనను'?

   తొలగించండి
 6. తేటగీతి
  కౌరవుల మట్టి కరిపించు శూరుడనని
  వారిఁ జూచినంతనె జావకారి పోవ
  నుత్తరుని దింపి క్రీడి సంవిత్తు గెల్చె
  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు.

  రిప్లయితొలగించండి
 7. బలిమి లేదట మాట కోటలను దాటు
  తెలివి లేదట'నోబెలు'దెత్తు ననును
  పలుకు తెలియదు పద్యము వ్రాసెదనను
  వీరుడెవడన్న నుత్తరు పేరుఁదలతు

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కుస్తి' అని హ్రస్వాంతంగా వ్రాయండి. లేకుంటే గణదోషం. 'అంబువు' అనడం సాధువు.

   తొలగించండి
 9. డా.పిట్టాసత్యనారాయణ
  గాలిలో గత్తి ద్రిప్పి సవాలు జేయు
  డాను క్విక్జోటు; నితిహాస డాననంగ
  హాస్యమునకు వయస్యుడు నైన రాచ
  వీరుడెవడన్న నుత్తరు పేరు దలతు

  రిప్లయితొలగించండి
 10. మైలవరపు వారి పూరణ

  ఇదియును గతంలో ఇవ్వబడినదే.. అప్పటి నా పూరణ 👇

  ఫిబ్రవరి 08, 2017

  🙏🌺విజయాయ నమః🌺🙏

  భూతపతిప్రదత్త వర పుణ్య మహాస్త్ర ధనుండు తచ్ఛరా.. 
  ఘాత నిపాత శత్రుచయ కార్ముకుడై రణమందు నిల్వగా 
  భీతి దవాగ్ని రేగె నరివీర చమూ వనమందు, పార్థవి.. 
  ఖ్యాతినిఁ గన్న వీరుడెవడన్నపు
  డుత్తరునే దలంచెదన్ !! 

  (కన్న = చూచిన) 

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. అవధాని వారి ధారణా శక్తి కి/ జ్ఞాపక శక్తి కి, జీపీ యెస్ వారి సెర్చింజను స్పీడు కు జోతల్ :)


   పాత సమస్యో కందము !
   ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే!
   చేతముయ తేటగీతిగ !
   నేత యొకటె చీర రంగు నెరుపుల్ వేరౌ :)


   జిలేబి

   తొలగించండి
  2. చేతల మీకు మీరె ! తమ చేతికి విల్లన చిన్న పుల్ల , ని..
   ర్భీతికి మీరె చిహ్నము ! భరింపగ లేని పరాక్రమాఢ్యులౌ !
   మా తరమా ప్రశంసనిడ ? మాన్య ! యటంచని పల్కు వందివా..
   క్ఖ్యాతిని గన్న వీరుడెవడన్నపుడుత్తరునే దలంచెదన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  3. జిలేబి గారికి మైలవరపు వారు:

   ఏదయినా మనదేనండీ 👏🙏

   తొలగించండి

  4. మైలవరపు వారికి

   నమో నమః

   అంతే అంతే యేనాటికానాడు సరి కొత్త కొంగే, ఉత్తరీయమే, చీరయే పంచెకట్టే :)


   జిలేబి

   తొలగించండి
  5. రాజా ఉవాచ:

   (జిలేబి గారూ)

   చేతముయ అంటే ఏమిటండి ?
   ధన్యవాదములు

   తొలగించండి


  6. అప్పు తచ్చు :౦ చేతుమయ తేటగీతిగ :)


   పాత సమస్యో కందము !
   ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే!
   చేతుమయ తేటగీతిగ !
   నేత యొకటె చీర రంగు నేర్పుల్ వేరౌ :)


   ఇవ్వాళ రెండు అప్పు తచ్చులా ! హతోస్మి :)


   జిలేబి

   తొలగించండి


  7. ఏమండీ జీపీయెస్ వారు ఆక్రోశవాణి విశేషములేమిటి ?


   జిలేబి

   తొలగించండి
  8. మీ పేరు చదువబడినది (ఊరు?) 👏👏👏

   "వాణీ  ప్రేమ జలమ్ము గాదె ఇహమ్ము భవ్యమ్ము గాదాటగన్ ..."

   "(వచ్చే వారం) ఆకాశవాణి సమస్య.... తప్పులుంటే తెలుపగలరు"

   తొలగించండి
  9. "పాణీ ప్రేమ జలంబు గాదె ఇహమున్ భవ్యంబుగా దాటగన్"

   తొలగించండి


  10. వీణా తంత్రుల నాదమై పలుకులున్ వీకాశమై జొప్పిలన్
   నాణెమ్మై నిలువన్ జనాళి వసుధన్ నాంత్రమ్ము నేర్వన్ భళా
   మాణిక్యంబుగ నిల్తురమ్మ భువిలో మాన్యంబిదే నమ్ము, శ్రీ
   వాణీ, ప్రేమ జలంబు గాదె యిహమున్ భవ్యంబుగా దాటగన్!


   జిలేబి

   తొలగించండి
  11. "పానీ ప్రేమ జలమ్ము గాదె యిహమున్ భవ్యమ్ముగా దాటగన్."

   తొలగించండి


  12. ప్రాణంబై నిలిచేవు సూవె! జలజా! వాల్గంటి!శాతోదరీ!
   జాణా!తొయ్యలియా! జిలేబి మగువా! శంపాంగి!లోలాక్షి!నా
   రాణీ!మంజుల వాణి! భామ ! లలనా !రత్నాంగి ! పూబోడియా
   వాణీప్రేమ జలంబు గాదె యిహమున్ భవ్యంబుగా దాటగన్!

   జిలేబి   "పానీపూరి" జలమ్ము మేలగు మహిన్ భవ్యంబు గా దాటగన్ :)


   జిలేబి

   తొలగించండి
  13. జిలేబి గారి "అప్పు తచ్చు" పద్యానికి

   "ఆహా! ఏమి కవితా తియ్యందనము.🤗🎂🍕🌹🙏💐"


   ...డాక్టర్ మునిగోటి సుందరరామ శర్మ

   తొలగించండి

  14. :) నెనరుల్స్ :)

   మునిగోటిరామ శర్మ క
   వి! నమస్సులు గొనుడయా సవినయముగా! న
   చ్చెననుచు మెచ్చుచు తియ్యం
   దనమనిరి! నెనరులివియె యథాశక్తిగనౌ !

   జిలేబి

   తొలగించండి


  15. ఆహా! తియ్యందనమిది
   బాహాటమ్ముగ జిలేబి బ్రాండిది సుమ్మీ !
   జోహారులు శర్మన్! మా
   యాహూ కందము గొనుడు వయనఫలకమునన్ :)

   జిలేబి

   తొలగించండి
 11. భూతలమందులేరు తనబోటి ఘనంబగు ధీరులంచు తా
  కోతలరాయుడై తనదు గొప్పల కాంతల చెంత చెప్పుచున్
  భీతినిపొందు పోరునని విశ్వమునందు ప్రచారమై యప
  ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁడన్నపు డుత్తరు నేఁ దలంచెదన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారూ,
   అపఖ్యాతితో మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


 12. కౌరవులు వచ్చి పడినను ఖాతరు భళి
  చేయ కుండ ధైర్యము గాను చేతు యుద్ధ
  మనుచు వెడలెనతండు సుమా ! జిలేబి,
  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు.

  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. శత్రు సేనలు గాంచి యు జ కి తు డ గు చు
  పరుగు పరుగు న వెనుక కు మరలు వాడు
  విక్రమము లేని చవట యౌ పిరికి పం ద
  వీరు డె వ డ న్న నుత్త రు పేరు ద ల తు

  రిప్లయితొలగించండి
 14. డా.పిట్టా సత్యనారాయణ
  భూతలమేలు రాజులకు పూర్ణుడపూర్ణుడు రాకుమారుడే
  చేతల జేయకన్ బ్రతుకు జీవిక కున్నొక సార్థకంబుకై
  ఊతము దక్కు యోగమున నుద్భవ మందిన జాతకుండుగా
  ఖ్యాతిని గన్న వీరుడెవరన్నపు డుత్తరు నే దలంచెదన్

  రిప్లయితొలగించండి
 15. చాలు స్వామి మీదు బడాయి, నేల గాంచి
  నడువు మయ్య, కోతలు కోసి నమ్మకముగ
  పలుక నేల, బంగారము వలదు నాకు ,
  పండుగకు కొన కుంటివి బట్ట లైన,
  భారత సమర మందు నార్భాటము గల
  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు,
  నేడు కంటిని బీరము లాడు దండి
  నిచట యని బలికెను సతి నేత్రు తోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 17. మిత్రులందఱకు నమస్సులు!

  "నేతను నేనటంచు, రణనీతికి మిన్నను నేనటంచుఁ దాఁ
  జేతలు లేక, మాట లిలఁ జెప్పుచుఁ గాంతల మ్రోల ధీరుఁడై,
  కాతరుఁడై రణాంగణముఁ గ్రక్కున వీడఁగఁ జూచి, తా నప
  ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁ?" డన్నపు డుత్తరు నేఁ దలంచెదన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారూ,
   అపఖ్యాతి శబ్దంతో మీ పూరణ వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 18. చేతునెప్పుడు సాయము, ఖ్యాతి గల్గి
  నట్టి దీ యాంధ్ర రాష్ట్రము, వట్టి పలుకు
  లెపుడు బలుకను, మా కేంద్ర మెపుడు రాల్చు
  ధనము రాజధాని కొరకు, ఘనత గల్గు
  పోలవరపు ప్రాజెక్టు ను పూర్తి చేయ
  పంపెదను నిధుల నిపుడె ,బాబు గొప్ప
  ముఖ్యమంత్రి యని పలికి ముదము తోడ,
  జూపితివి రిక్త హస్తము , నాపు మోడి,
  భీరువు పలుకులు గలిగి భేషజముల
  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు
  నాటి భారతమున, మరి నేటి భార
  తమున నీదు పేరు జనులు తలచు చుందు
  రనుచు వాపోయే చంద్రుడు కినుక తోడ

  రిప్లయితొలగించండి
 19. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2688
  సమస్య :: *ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁడన్నపు డుత్తరునేఁ దలంచెదన్.*
  విరాటరాజు యొక్క కుమారుడైన ఉత్తరుడు ఊరక ప్రగల్భాలను పలుకుతూ ఉండేవాడు. చాలా పిఱికివాడు. ఆ ఉత్తరకుమారుడు వీరుడని కీర్తిని పొందినవాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: సంజయుడు గ్రుడ్డివాడైన ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర సంగ్రామ విశేషాలను విశదీకరిస్తూ ఓ రాజా ! శ్రీ కృష్ణుడు గీతాబోధ చేసి పార్థసారథిగా రథంలో ముందుకూర్చొని యున్నాడు. కాబట్టి పూర్వస్థానంలో ఉన్న శ్రీ కృష్ణుడు పూర్వుడు. గాండీవాన్ని ధరించి కృష్ణుని వెనుక నిలబడి ఉన్నాడు కాబట్టి అర్జునుడు ఉత్తరుడు.
  కీర్తిని గన్న దైవ మెవరంటే పూర్వుడైన శ్రీ కృష్ణుడు అని చెప్పవచ్చు.
  కీర్తిని గన్న వీరుడెవడు అంటే ఉత్తరుడైన అర్జునుని పేరు చెప్పవచ్చు అని విశదీకరించే సందర్భం.

  ఈతడు పార్థసారథి మహిన్ ధృతరాష్ట్ర ! సుబోధఁ జేయుచున్
  ఖ్యాతిని గన్న దైవ మగుఁ గాంచ రథమ్మునఁ వెల్గు పూర్వుడౌ
  నాతడు జూడ గాండివము నందిన యర్జును డుత్తరుండగున్,
  *ఖ్యాతిని గన్న వీరుడెవ డన్నపు డుత్తరునే దలంచెదన్.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (26-5-2018)

  రిప్లయితొలగించండి
 20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 21. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


  గురుభ్యో నమః దయచేసి నిన్నటి పూరణ. స్వీకరించ మనవి
  ............. ......... ............. ......... .......... .............. .........  పితరుండే యగు గాక , దుష్ట సలహా ప్రేరేపకుండై , యస

  మ్మతమౌ యనుశాసన మ్మొసగినం బాటించ రా | దయ్యెడన్ =

  పితృవాక్పాలన మొక్కటే సుతుని బాపిన్ జేయు నెల్లప్పుడున్ |


  సతతమ్మున్ భువనత్రయంబు c గరుణన్ సత్పాలనం జేయు శ్రీ

  పతి దూషించెడు > నా హిరణ్యకశి పావస్వన్య వాక్యంబులన్ ,

  సుతుడౌ హ్లాదుడు లక్ష్యపెట్టుచు హరిన్ స్తోత్రించుటన్ మానెనే ?


  { అనుశాసనము = ఆఙ్ఞ ; హ్లాదుడు = ప్రహ్లాదుడు ;

  హిరణ్యకశిప + అవస్వన్య వాక్కుంబులు =

  హిరణ్యకశిప + రా క్ష స వాక్యంబులు ;

  అవస్వన్యుడు = శివుడు , రాక్షసుడు }

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దుష్ట సలహా' దుష్టసమాసం.

   తొలగించండి
  2. గురువర్యులకు వందనములు శబ్దరత్నాకరంలోని దస్సలహా అనే పదముచూచి నేను దుష్టసలహా అని వాడాను .

   దోష మయితే క్షమించాలి .

   తొలగించండి
  3. గు రు మూ ర్తి ఆ చా రి
   ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


   గురుభ్యో నమః దయచేసి నిన్నటి పూరణ. స్వీకరించ మనవి
   ............. ......... ............. ......... .......... .............. .........

   సవరించిన పద్యము   పితరుండే యగు గాక , దుష్ట వచన ప్రేరేపకుండై , యస

   మ్మతమౌ యనుశాసన మ్మొసగినం బాటించ రా | దయ్యెడన్ =

   పితృవాక్పాలన మొక్కటే సుతుని బాపిన్ జేయు నెల్లప్పుడున్ |


   సతతమ్మున్ భువనత్రయంబు c గరుణన్ సత్పాలనం జేయు శ్రీ

   పతి దూషించెడు > నా హిరణ్యకశి పావస్వన్య వాక్యంబులన్ ,

   సుతుడౌ హ్లాదుడు లక్ష్యపెట్టుచు హరిన్ స్తోత్రించుటన్ మానెనే ?


   { అనుశాసనము = ఆఙ్ఞ ; హ్లాదుడు = ప్రహ్లాదుడు ;

   హిరణ్యకశిప + అవస్వన్య వాక్కుంబులు =

   హిరణ్యకశిప + రా క్ష స వాక్యంబులు ;

   అవస్వన్యుడు = శివుడు , రాక్షసుడు }

   తొలగించండి
 22. కత్తులతో కాదురా...కంటి చూపుతో చంపేస్తా!!!

  తానొక సమర వీరుడే తన కెదురుగ
  నిల్చు వాని దృక్కులతోనె గూల్చ గలను
  భయ మదేల యనుచు ప్రగల్భములఁ బలుకు
  "వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఈ మధ్య నెట్టులో మళయాళం సినేమా సీను ఓ కాలేజీ అమ్మాయి కనుగీటు రాహుల్ గాంధి మెచ్చుకోలు కాంబినేషన్ వీడియో గుర్తుకొచ్చె :)


   జిలేబి

   తొలగించండి
  2. హహ్హహ్హ! ధన్యవాదాలు జిలేబీ గారూ..
   🙏🏻🤣

   తొలగించండి
  3. చిన్న సవరణ తో..

   తానొక సమర వీరుడఁ దన కెదురుగ
   నిల్చు వాని దృక్కులతోనె గూల్చ గలను
   భయ మదేల యనెడి ప్రగల్భపు పలుకుల
   "వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు"

   తొలగించండి
  4. విట్టుబాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 23. వెన్ను జూపగ రాదటు వీరు లనగ
  చెన్నుగబలికె బీరముల్ చిత్త మలర
  వెడలి రణమందు భయమున వెన్ను జూపు
  వీరు డెవడన్న నుత్తర పేరు దలతు
  కొరుప్రోలు రాధాకృష్ణారావు


  రిప్లయితొలగించండి
 24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 25. బల్లిదుడ నేనని దఱచు బ్రల్లదముల
  బలుకు చుండియు నొక్కింత పసయె లేక
  వెఱ్ఱి వారని శ్రోతలు విఱ్ఱ వీగు
  "వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు"

  రిప్లయితొలగించండి
 26. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు

  సందర్భము:
  చెట్లమీద విస్తరాకులు కుట్టడం..
  బెల్లం లేకుండా బూరెలు చేయడం..
  అనే లోకోక్తు లున్నాయి ప్రగల్భాలు పలికే వాళ్ళను గురించి.
  అట్లే "పొంకణాలు దొబ్బడం" లేదా "గప్పాలు కొట్టడం" అంటే ప్రగల్భాలు పలుకడం లేదా అనవసరమైన గొప్పలు చెప్పడం అనే అర్థంలో ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలలో వాడుకలో వున్నాయి.
  ఇందులో యే రకమైన నింద్యార్థమూ యీ ప్రాంతాలలో లేదు. పర్యాయ పదాలు వీటిల్లో వుండే జిగి బిగిని సూటిగా వ్యక్తీక రించేందుకు సమర్థములు కావు. అంటే పర్యాయ పదాల నివి సహించవు.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  "కొసరి చెట్లపై విస్తరాకులను గుట్టు"

  "బెల్ల మది లేక బూరెల నెల్ల జేయు"

  ననగ సరిలేని వగు పొంకణాలఁ దొబ్బు

  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 27. పొంకణాల దొబ్బు... మధ్యలో అరసున్న వుండదు.గమనించాలి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. వెలుదండ వారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 28. చేయలేకున్నమఱినేను జేయుదునని
  గొప్పలెన్నియోచెప్పునా గుంటవాని
  గొప్పదనమునుగూరిచి చెప్పునపుడు
  వీరుడెవడన్ననుత్తరుపేరుదలతు

  రిప్లయితొలగించండి
 29. లేరు సాటివీరులనగ లేని డాబు
  పోరు సలఁపగ నింటనే భోరునేడ్చె
  వందిమాగధ భట్రాజ జనము గొలువ
  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు

  రిప్లయితొలగించండి
 30. ఆకాశవాణి హైదరాబాదు వారి
  సమస్యాపూరణము
  సమస్య :

  *తగవే తెచ్చును గొప్ప కీర్తి వసుధన్ దథ్యంబు ముమ్మాటికిన్*

  నేడు ప్రసారమైన
  నా పూరణము :

  మత్తేభవిక్రీడితము

  సిగలో రుక్మిణి పారిజాతము నిడన్ శ్రీవారిపై సత్యదౌ
  తగవే కమ్మని కావ్యమై దొరలె! నిర్దాక్షిణ్యుడై శ్రీహరిన్
  భృగువే తన్నఁగ లక్ష్మి వీడు తగవే వెంకన్న గా జేయఁగన్
  దగవే తెచ్చును గొప్ప కీర్తి వసుధన్ దథ్యంబు ముమ్మాటికిన్!

  రిప్లయితొలగించండి
 31. కర్ణాటకం...

  ఉత్పలమాల

  నేతగ బల్మి లేక మును నిల్చెను యెడ్డియె ముఖ్యమంత్రిగన్
  వాతలుఁ బెట్ట ధర్మసభ వాలుచు వెన్కకు వెన్ను జూపగన్
  రీతికి నుండి తా చివర! ఱేడయె నొక్కఁడు తంత్రమొప్పగన్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. వాతలు బాగు బాగు కవి వర్యుడ కన్నడ రాష్ట్ర శోభకున్ :)

   జిలేబి

   తొలగించండి
  2. చివరి పాదం సమస్యాపాదం. టైపాటుగా తప్పింది

   తొలగించండి
  3. చేతును వందనాలు మిము జేర జిలేబిగ నాదు పద్యమే

   తొలగించండి
  4. నాలుగవ పాదంతో కలిపి...

   కర్ణాటకం..

   ఉత్పలమాల

   నేతకు బల్మి లేక మును నిల్పగ నెడ్డిని ముఖ్యమంత్రిగన్
   వాతలుఁ బెట్ట ధర్మసభ వాలుచు వెన్కకు వెన్ను జూపగన్
   రీతికి నుండి తా చివర! ఱేడయె నొక్కఁడు తంత్రమొప్పగన్
   ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁడన్నపు డుత్తరు నేఁ దలంచెదన్

   తొలగించండి
  5. సహదేవుడు గారూ,
   సమకాలీనాంశంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 32. తే.గీ.
  "అప్ప" బలశాలియే గాని గొప్ప కాడు
  "అయ్య" విశ్రాంతి కోరుచు నండ నుండ
  రా"కుమారుడె"రాజ్యపాలనము జూడ
  వీరుడెవడన్న నుత్తరు పేరు దలతు.

  రిప్లయితొలగించండి
 33. అస్త్ర విద్యలోనను ఘను డర్జునుండు
  ధరణి మాటతప్పని వాడు ధర్మరాజు
  స్యందనమ్మును నడుపుట యందు భువిని
  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు

  రిప్లయితొలగించండి
 34. విరటుడు కంకుభట్టు తో పలికిన పలుకులు

  కౌరవుల తోడనొంటిగ కదనమాడి
  గోవుల మరల్చెగాదె నా కొమరుడిపుడు
  కవ్వడిని మరిపించుచున్ కదన మాడు
  వీరు డెవడన్న నుత్తరు పేరు దలతు

  రిప్లయితొలగించండి
 35. పలికె భీష్ముఁ డంతటి వాఁడు పరమ సఖుఁడు
  నక్కిరీటి కిత్తరుఁడు మహారథి యని
  కాన సందియ మ్మది వీడి మానితముగ
  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు


  వీత ధృతిన్ విరాట సుతు పేర్మిని నొంటరి తా జయించె నా
  జ్ఞాతి పితామహాది రణ చండ పరాక్రము లన్నరుం డనిం
  జూతును సాటి లేని ఘన శూరుఁ డితండని సవ్యసాచినే,
  ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁడన్నపు, డుత్తరు నేఁ దలంచెదన్

  [ఉత్తరుఁడు = ఉత్తముఁడు; ఉత్తరుఁడు = తరువాతి వాఁడు, యిక్కడ విరాటసుత నరు లలో నరుఁడు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భీతిల జేతు, శత్రువుల పీకమడంచెద సంగరమ్ము లో
   చేతను విల్లుబట్టి యరి సేనల ద్రుంచెద నంచు తా సదా
   కోతలు మిక్కుటమ్ముగను కూయు ప్రగల్భములాడుటందునన్
   ఖ్యాతిని గన్నవీరుడెవడన్నపుడుత్తరునేదలంచెదన్

   తొలగించండి
  2. 8/2/2017 నాటి పూరణలు:

   ఏతరి నైన మానవుల కిద్ధర ధర్మ చరిత్ర మేలగున్
   పాతక కార్య చిత్త సహవాసము కీర్తి వినాశ కారియౌ
   భూతల మందు నున్న ఘన పూరుషు లర్కజ పార్థు లందునన్
   ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁ డన్నపు డుత్తరు నేఁ దలంచెదన్

   [ఉత్తరుఁడు = అనంతరము చెప్పబడిన వాఁడు]


   జాతక్షత్రియ వీరుఁడు
   వీత భయభ్రాంతుఁడు జన విదితప్రౌఢ్యా
   భూతిని నర సారథ్యపు
   ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారూ,
   మీ పూరణలన్నీ ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'కిరీటి కుత్తరుడు...' టైపాటు!

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు. అవునండి గమనించ లేదు. ధన్యవాదములు.

   తొలగించండి
 36. ఆటవిడుపు సరదా పూరణ:
  (Chinese Whispers)

  మూతులు వీనులన్ కలిపి ముచ్చట మీరగ నంచెలంచెలన్
  వ్రాతలు లేకయే తెలుప వార్తలు మారును నివ్విధంబుగన్:
  "ఖ్యాతిని గన్న బీరుడెవ డన్నపు డుత్తరు నే దలంచెదన్" 👇
  "ఖ్యాతిని గన్న వీరుడెవ డన్నపు డుత్తరు నే దలంచెదన్" :)

  బీరుడు = భీతుడు (తెలుగు పర్యాయపద నిఘంటువు)

  https://en.m.wikipedia.org/wiki/Chinese_whispers

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 37. బాలుడభిమన్యుడరిజంప కోలబట్ట
  ధీర వేంగళ రాయడు పోరు సలుప
  జోరు జోరున పరుగిడ తేరు దిగిన
  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు

  రిప్లయితొలగించండి
 38. తాతల నాటి నేతులను తప్పక చాటుచు డాంబికమ్ముగన్
  చేతుల దిప్పుచున్ జనని చేతను మెప్పును బొందుచున్సఖుల్
  మోత పొగడ్తలన్ బరుస మోదమునొందుచు భీరుడన్న వి
  "ఖ్యాతినిఁగన్నవీరుఁ డెవఁడన్నపు డుత్తరు నేఁ దలంచెదన్"

  రిప్లయితొలగించండి
 39. లేరు ధరణిని ననుబోలు వీరుడనుచు
  మీస మట్టుల మెలివేసి మిఱ్ఱి జూచి
  డాంబికమ్మున స్వొత్కర్ష డప్పు కొట్టు
  "వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు" 

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 40. ఉ: నాతుల ముందు దర్పమున నాటక మాడి దురమ్మునందు నే
  ఘాతకులైన వైరులను క్రన్నన త్రుంచెద నంచు పల్కుచున్
  భీతిలె యుద్ధమందు గని భీకర మూక, నధీరుడన్న ప్ర
  ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁడన్నపు డుత్తరు నేఁ దలంచెదన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.

   తొలగించండి
 41. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 42. కోతలుగోయునాజనుని కోతలరాయుడుగాగనెంచియు
  న్ఖ్యాతినిగన్నవీరుడెవడన్నపుడుత్తరునేదలంచెద
  న్భూతలమందునన్వెదుకబూరుషుడెవ్వడుగానరాడుగా
  తాతలనాటియుండియునుదాబలుకిట్టులువారలుండిరే

  రిప్లయితొలగించండి
 43. కాంతలందు ప్రగల్బాలఘనుడతండు
  యుద్దమందుభయపడి సిద్దబడిన
  వీరుడెవడన్న?నుత్తరు పేరుదలతు
  గోగ్రహణసమయాన సంకోచమేల?

  రిప్లయితొలగించండి
 44. అల్పశక్తుడైనను కుస్తి యాటనందు
  ముప్పు తిప్పలు పెట్టుచు మూడు తొట్ల
  యంబు తాగించెదననుచు డంబుపలుకు
  వీరుడెవడన్న నుత్తరుపేరు తలతు

  రిప్లయితొలగించండి
 45. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అనయము నతిశయపు మాటలనుచు నుండి
  వారి వీరిని తనదైన పౌరుషమున
  తునుముదునని బీరములాడు దుర్బలుడగు
  వీరుడెవడన్న నుత్తరు పేరు దలతు

  రిప్లయితొలగించండి
 46. పార్థునకు సారధిగ తాను భండనమున
  నాయుధముబట్ట కున్నను హరియె గాదె
  వీరుడెవడన్న, నుత్తరు పేరు దలతు
  భువన రక్షకుడైన కేశవుని సతము

  రిప్లయితొలగించండి
 47. జాతినిఁ ధర్మమున్ విడని శాస్తకు పేరు సుయోధనుండనెన్
  ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁడన్నపు డుత్తరు నేఁ దలంచెదన్
  తాతయ భీష్ముడే నుడువు దంపతి భావపు లోతులే యనన్
  జోతలనిచ్చితిన్ దిశను శుంఠకు చూపు దయాళువెవ్వడో!

  రిప్లయితొలగించండి
 48. జి.పి.యస్. వారూ ! ఆకాశవాణి వివరములు తెలుపగలరు
  ఇంతకీ " వాణీ.....యా ..పాణీ...యా....?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కంది వారు ఉవాచ:

   "ఈనాటి ఆకాశవాణి వారి సమస్య...
   *వాణీ ప్రేమజలమ్ము గాదె యిహమున్ భవ్యమ్ముగా దాటగన్*'
   మీ పూరణలు గురువారంలోగా padyamairhyd@gmail.com కు పంపండి."

   తొలగించండి
  2. నేను రేడియో వినలేదు. ఒక మిత్రులు చెప్పినదానిని చెప్పాను. అది వాణియో పాణియో తెలియదు.

   తొలగించండి
  3. శ్రీహర్ష uvaacha:

   గురువర్యా.. పాణీ🙏

   తొలగించండి


 49. నారథమ్మునతివడిగా నడుపు వార

  లెవ్వరిటకాన రారంచు నింపు కలుగు

  నటుల మాటలాడి చరించు నజ్ఞుడయిన

  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు.
  [5/26, 2:57 PM] Dr Umadevi B: రెండనవపూరణ
  గొప్పలెప్పుడు చెప్పుచు కువలయాన

  బవరమున్నచాలు నెపుడు భయము పడుచు

  పైకి డాబుసరిగ పలు పలుకు లాడు

  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు.

  రిప్లయితొలగించండి
 50. అంద గాడు బాబూ మోహననుచు నెంతు
  కీచకుని గుణశీలుని* కేలుమోడ్తు
  నరకుని దలతు యెవరిని నరకడనుచు
  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు"
  ***)()(***
  (* 'గురించి'అనే విభక్తి లోపము."వందే మాతరమ్" లో వలెనే )

  రిప్లయితొలగించండి


 51. నారథమ్మునతివడిగా నడుపు వార

  లెవ్వరిటకాన రారంచు నింపు కలుగు

  నటుల మాటలాడి చరించు నజ్ఞుడయిన

  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు.  గొప్పలెప్పుడు చెప్పుచు కువలయాన

  బవరమున్నచాలు నెపుడు భయము పడుచు

  పైకి డాబుసరిగ పలు పలుకు లాడు

  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు.

  రిప్లయితొలగించండి
 52. కోతలు కోయుచున్ ఘనపు కూతలు పెక్కుగ కూయుచు న్ననిన్
  భీతిలి చాపమున్ వదలి పిమ్మట యోధుడు, ధర్మరాజు కున్
  భ్రాత, కిరీటి సారధిగ వర్తనమున్ తను గృష్ణుఁ పూర్వమున్
  "ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁడన్నపు డుత్తరు నేఁ దలంచెదన్"

  రిప్లయితొలగించండి
 53. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. ..
  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు

  సందర్భము: ఉమ్మడి పాలమూరు జిల్లాలో విరివిగా వ్యవహారంలో వుండే సామెత ఒక టుంది. అదే మంటే
  "గప్పాల పోతురెడ్డికి ముప్పై మూడు దొడ్లు మూడెడ్లు.." అని..
  "గప్పా" లంటే గొప్పలే! మరొక మంచి పదం బడాయీలు; సంస్కృతంలో ప్రగల్భాలు లేదా అతిశయోక్తులు.
  "గప్పాలు" అనే పదానికి మాత్రం "చెప్పడం" అనే దాన్ని జోడించరు. "కొట్టడం" అనే క్రియా పదాన్ని అనుసంధించడం విశేషం. కొందరికి యే ప్రయోజనం లేకపోయినా ఎదుటివారికి తెలిసిపోతూనే వున్నా పట్టించుకోకుండా "గప్పాలు కొడుతూనే" వుండటం అలవాటు.
  అలాంటి వాళ్ళను గురించి చెప్పబడే ఒక మంచి సామెత యిది.
  " కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజ ముఖ్యులు మ త్సముద్యమ స్ఫురణముఁ జూచి పార్థు డను బుద్ధి గలంగగ బెట్టు గిట్టి సంగరమున నోర్చి యేఁ బసులఁ గ్రమ్మఱఁ దేరక యున్న నన్ను భూవరుడు సుహృజ్జనంబుఁ బరివారము చిత్తములందు మెత్తురే!"
  అంటూ కోతలు కోసిన ఉత్తరు డిలాంటి వాడే! అని చెప్పుకోవడాని కీ లోకోక్తి చక్కగా ఉపకరిస్తుంది.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  పుడమి లోకోక్తి " గప్పాల పోతురెడ్డి

  కౌర ముప్పది మూడు దొ డ్లంట! చూడ

  మూడె యె డ్లంట! " యన

  మొనగాడు వీడె,

  వీరుఁ డెవఁ డన్న నుత్తరు పేరుఁ దలఁతు

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. వెలుదండ వారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 54. మాతలి కంటెన్ హరికి మర్కుకనూరిని
  కంటె పార్ధుకున్
  దా తగు సారధై యనిని తాలిమి తోడను విక్రమించగన్
  కోతల రాయడన్ సడిని కోతను బెట్టగ చాకచక్యమున్
  ఖ్యాతిని గన్న వీరు డెవడన్న పుడుత్తరునే దలంచెదన్!

  రిప్లయితొలగించండి
 55. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు

  సందర్భము: సులభము
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  తెలివి " బారెడు రాగముఁ దీసి పిచ్చ
  కుంట్ల పాటఁ బాడినయట్లు" గొప్పఁ జెప్పు...
  ధరణి "మాటలు కోటలు దాటు, కాళ్ళు
  కడప దాట వనినటు" ప్రగల్భములను
  వీరుఁ డెవఁ డన్న నుత్తరు పేరుఁ దలఁతు

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 56. ఆతనికే లభించె నరుడాదటతో తన చెల్లి యొజ్జగా...
  ఆతనికే లభించె నరుడాదటతో తన చోదకుండుగా...
  ఆతనికే లభించె నరుడాదటతో తన చెల్లి మామగా...
  ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁడన్నపు డుత్తరు నేఁ దలంచెదన్

  రిప్లయితొలగించండి