16, మే 2018, బుధవారం

సమస్య - 2680 (నాగుల ముద్దాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్"
(లేదా...)
"నాగుల ముద్దులాడె లలనామణి యాత్మవినోదకేళికై"
(బొగ్గరం V.V.H.B. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

111 కామెంట్‌లు:

 1. క్రొత్త పెండ్లము:

  బాగుగ జేసెను చవితిని
  నాగుల; ...ముద్దాడెను లలనామణి కేళిన్
  దాగుడు మూతల, మగడిని
  వాగుడు కాయవని నీవు, పలుకుచు హేలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి సవరణ:


   పద్యం బాగుందండీ...

   బాగుగ గొలిచెను చవితిని..

   అంటే మరింత సొగసు.. 🙏మురళీకృష్ణ

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 2. నోట్లో సుపారి; ఒంటి పై మిన్నాగు; చూస్తే సర్కసు పొన్నారి :)


  బాగముల నములుచు, జిలే
  బీ, గబగబ వేదిక పయి పిరియమ్ముగ తా
  నే గళమున వేసుకొనుచు
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

  2. షకీరా షకీరా

   Shakira, Shakira
   I never really knew that she could dance like this
   She makes a man wants to speak Spanish
   Como se llama (si)
   Bonita (si)
   Mi casa (Shakira Shakira), su casa

   :)

   నెనరులు
   జిలేబి

   తొలగించండి
 3. రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ:

   భోగుల బుత్రులన్ బడసె బూర్వము కశ్యపపత్ని , వారలన్
   రాగమనస్కయై బిలిచి రండని కద్రువ ప్రేమమీరగన్ ,
   మూగిన యాదిశేషువును , ముచ్చట వాసుకినిన్ దదాదులన్
   నాగుల ముద్దులాడె లలనామణి యాత్మవినోదకేళికై !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. మురళీకృష్ణ గారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  3. యోగిజనాదివందిత , మహోజ్జ్వల వాగ్రమణీయభూష , ని...
   త్యాగమశబ్దవేష , ధవళాంబుజసుస్థిర పీఠ , సాధుహృ..
   ద్ధీగత భావనాకృతి ., సుధీకృత హృద్య రసార్ద్ర పద్యపు..
   న్నాగుల ముద్దులాడె లలనామణి యాత్మవినోదకేళికై !!

   పున్నాగము... తెల్ల కలువ

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి

 4. సర్కసు డేరా - ఊరూరా - జీవన మిదే ఆత్మ వినోద మిదే


  బాగలు కోట చంద్రముఖి, బమ్భర యై తిరుగాడుచున్ భళా
  రే! గజగామినీ యనగ రెక్కల చాపుచు నాట్య మాడుచున్,
  నాగుల ముద్దులాడె లలనామణి యాత్మ వినోద కేళికై,
  సాగెను రంగ భూమి సయి సార్థక జీవన యాత్ర కూటికై !

  జిలేబి


  రిప్లయితొలగించండి
 5. బాగరి పడతియె కూటికి
  భోగపు వాడల దిరిగెడు మూర్ఖులు జేరన్
  భోగింపగ తానా విష
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  రిప్లయితొలగించండి
 6. రాగిణి బొమ్మల కొలువున
  వేగము గాపేర్చె నంట వెలుచల మెలికల్
  భోగిని వలెచిందు లనుగాంచి
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. రాగిణి బొమ్మల కొలువున
   వేగము గాపేర్చె నంట వెలుచల మెలికల్
   భోగిని చిందులు వేయగ
   నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

   తొలగించండి
 7. నాగమణియె మనువాడెను
  నాగులనెడి వానిని చిననాటి సఖుడినే
  వేగిర మడిగిన దిచ్చెడి
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 8. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  సందర్భము: పాముల నాడించడమే వృత్తిగా గలిగిన వా డొకడు అల్లరి చేసే తన కూతురికి ఆడుకోవడానికి విషం తొలగించబడిన నాగుల నిచ్చా డట!
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  నాగుల నాడించెడి వా
  డాగడములఁ జేయు బిడ్డ కాటకు నొసగెన్
  నాగుల.. విష రహితమ్ముల..
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. వెలుదండ వారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 9. మూగ మను వాడె వలచిన
  సోగ కనుల వాని వారి సుందర ఫల మౌ
  రాగా ల సుతను గను చా
  నాగులు ముద్దాడె ను లల నా మణి కే ళిన్

  రిప్లయితొలగించండి
 10. మాంగళ్యం చల్లగుండగ మంగళహారతులు
  పుట్టకు పట్టిరి
  దీవించగ పడగలెత్తిన కెవ్వను కేకతో
  పరుగులెత్తిరి
  జంతు ప్రేమిక జవ్వనదె సరీసృప రక్షణ
  ప్రహేళికై
  నాగుల ముద్దులాడె లలనామణి
  యాత్మవినోదకేళికై

  రిప్లయితొలగించండి
 11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2680
  సమస్య :: *నాగుల ముద్దులాడె లలనామణి యాత్మ వినోద కేళికై.*
  పాములను ముద్దుబెట్టుకొన్నది ఒక నారీమణి ఆత్మానందం పొందేందుకోసం అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన విషయం.
  సందర్భం :: దక్షుని కుమార్తె యైన కద్రువ కశ్యప ప్రజాపతిని వివాహమాడి వేయిమంది కుమారులను {సర్పములను} ప్రసవించింది. తన సవతియైన వినతను తనకు దాసిగా చేసికొనాలనే దురాలోచనతో *పూర్తిగా తెల్లగా ఉండే ఉచ్ఛైశ్రవమనే గుఱ్ఱం తోక నల్లగా ఉంది అని* ఆమెతో పందెం కాసింది. పందెంలో గెలిచేందుకు తన బిడ్డలైన సర్పాలలో ఒకరిని ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకొని ఉండి నల్లగా కనిపించేటట్లు చేయమని కోరింది. ఆ సమయంలో నాగమాతయైన కద్రువ తన బిడ్డలను బ్రతిమలాడుతూ ముద్దులాడే సందర్భం.

  ఏ గతి నశ్వపుచ్ఛ మగుపించును నల్లగ, నా సపత్నిపై
  సాగును నాదు మాట యనిశ ? మ్మని *కద్రువ నాగమాతయే*
  మూగిన బిడ్డలన్ గనుచు మోసము నేర్పుచు బుజ్జగించుచున్
  *నాగుల ముద్దులాడె లలనామణి యాత్మ వినోద కేళికై.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (16-5-2018)

  రిప్లయితొలగించండి
 12. వాగర్ధములుగ పూర్ణపు
  భాగస్వాములుగ మెలగు పార్వతిశంభుల్
  యోగముతో పెనవేయగ
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్!

  రిప్లయితొలగించండి
 13. ఈవారం ఆకాశవాణి వారి సమస్య తెలుపగలరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. తరువుల గూల్చి నప్పుడె గదా జగమందు సుఖంబు పెంపగున్

   తొలగించండి
 14. సమస్య :-

  "నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్"

  *కందము**

  సోగకనుల సుందర సఖి
  నాగాభరణములు గోర,నచ్చినటులనే
  వేగమె దెచ్చిన స్వర్ణపు
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్
  ................✍చక్రి

  రిప్లయితొలగించండి
 15. (శివకేశవుల సేవకు వెళ్ళుతామంటున్నబిడ్డలనుతల్లి కద్రువ మెచ్చిముద్దాడింది)
  "ఏగెదమమ్మ!మేము పరమేశ్వరు, నాకమలేశు లిర్వురన్
  శ్రీగళమాలికట్లు, మృదుశీతలతల్పమునట్లు నిత్యము
  న్నాగక సేవజేయ"నను నాద్యుల వాసుకిశేషనామ్నుల
  న్నాగుల ,ముద్దులాడె లలనామణి యాత్మవినోదకేళికై.

  రిప్లయితొలగించండి
 16. భోగములిడి గొలిచెదరుగ
  నాగుల,ముద్దాడెను లలనామణి కేళి
  న్నాగడములు జేయు సుతుని
  రాగముతో నెత్తుకొనుచు లాలించంగా!!!

  రిప్లయితొలగించండి
 17. చక్కని పూరణ బాపూజీగారూ! అభినందనలు! 💐💐💐🙏🙏🙏

  రిప్లయితొలగించండి
 18. డా.ఎన్.వి.ఎన్.చారి
  ఆగని యలకనుదీర్చగ
  వేగముగానగల కొరకు వెడలిన పతియే
  తేగా తానా కర్ణపు
  నాగుల ముద్దులాడెను లలనామణి కేళిన్
  నాగులు చెవికి పెట్టుకునే ఆభరణం

  రిప్లయితొలగించండి
 19. నాగుల చిత్రము నందున
  నాగమ్ముల బూజచేసి నయముగ వాటిన్
  రాగముగ గనుచు కుహనా
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్!!!

  రిప్లయితొలగించండి
 20. నాగుల బంధము నామెకు
  బాగుగనే నుండుకతన భయమది లేక
  న్వేగమెపోవుచు నుండెడు
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'బంధ మ్మామెకు బాగుగనే యుండుకతన...' అనండి.

   తొలగించండి
 21. సోగకనుల సొగసరి ప్రియ
  మాగక చేబట్టి *యానిమల్ ప్లానెటు*లో
  నీగతి తెగువను జూపుచు
  "నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్"

  రిప్లయితొలగించండి
 22. భార్యా, భర్తలు వైకుంఠపాళి ఆడుచుండగా....
  దాదాపు గెలవబోయిన భర్తను
  ఒకరి తర్వాత ఒకరుగా కాటేసిన
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్
  అన్న భావం వచ్చేట్టు దయచేసి ఎవరయినా పూరించగలరు.
  (పాము, నిచ్చెనల ఆటలో పాము చూడటానికి నాగువలెనే ఉంటుంది కదా.)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సాగక కాలమ్మాడగ
   రాగిణి వైకుంఠపాళి ప్రాణేశునితో
   చాగు తన పతినిఁ గఱచిన
   నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్
   చాగు; పోవు

   తొలగించండి
  2. కాగల కార్యము దైవము
   బాగుగ దీర్చినటుల తన భర్తన్ బాము
   ల్లాగగ క్రిందకు ముదమున
   నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్!
   కేళిన్ = ఆటలో

   తొలగించండి
  3. భావానీ ప్రసాద్ గారి భావానికి చక్కని పద్యరూపాన్నిచ్చిన అన్నపరెడ్డి వారికి, సీతాదేవి గారికి ధన్యవాదాలు. మీ యిద్దరి పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. సత్యనారాయణ రెడ్డి గారికి, సీతాదేవి గారికీ ధన్యవాదములు.

   తొలగించండి
  5. ధన్యవాదములు గురుదేవా! 🙏🙏🙏

   తొలగించండి
 23. రాగము జూప మునీశుడు
  బాగరి కద్రువ కనియెను పలువురు సుతులన్
  మూగగ సుతులందరచట
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  రిప్లయితొలగించండి
 24. ఆ గరిడీ కుటుంబముల కక్కట ముప్పొన గూర్చు చేష్టలే
  సాగును జీవితమ్ములను,సారెకు దుష్కరమైన కృత్యముల్
  వేగమె సేయుచుండెదరు,వేడుక నొక్కెడ నాట యాడుచున్
  నాగుల ముద్దులాడె లలనామణి యాత్మవినోదకేళికై

  రిప్లయితొలగించండి
 25. నాగులుజూడనామెకట నమ్మిన బంటులె యౌటచేతనే
  నాగుల ముద్దులాడె లలనామణి యాత్మవినోదకేళికై
  నాగులు దేవతా సములు నమ్మిన వారిని గాచునంచుసూ
  నాగుల బూజసేతురుగద నారిజనంబులుశ్రధ్ధతోనిలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరి పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
 26. ఆ గరుడు తేగ నెదుట
  మూగిన సవతీ పుత్రుల మొదము తోడన్
  కౌగిట చేర్చుచు మరి మరి
  నాగుల ముద్దాడెను
  లలనామణి కేళిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వాట్సప్ లో ఈ పద్యానికి కొన్ని సవరణలు సూచించాను.

   తొలగించండి
 27. నాగులు పేరున వెలుఁగుచు
  భాగమతి వివాహ మాడి పరఁగుచు నుండన్
  రాగ మతిశయిల్లఁ బతిని
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్


  రాగ మయమ్ము సృష్టియె వరమ్మది జీవన యుక్త శైలి లో
  భాగము సుమ్మి కూరిమి యపార ముదంబిడుఁ బ్రాణి కోటికిన్
  వేగమ చూడు పాములను వింతగ నచ్చట ముచ్చటింపులున్
  నాగుల ముద్దు లాడె లలనామణి! యాత్మవినోద కేళికై

  [ మద్దులు + ఆడ+ఎ = ముద్దు లాడె; ఆడె = అక్కడే; నాగుల ముద్దులు = నాగులయొక్క ముద్దులు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.

   తొలగించండి
 28. ఏ గతి నాథునిం గలియు టీ గతి పాములు చుట్టుముట్టిన
  న్నాగక రేబవళ్లు తన యంగము లంచని పోసి క్షీరమున్
  కాగున రండు త్రావి యిక కమ్మగ బజ్జొను డంచు గౌరి యా
  నాగుల ముద్దులాడె లలనామణి యాత్మవినోదకేళికై.

  రిప్లయితొలగించండి
 29. వాగుల నాడెడు గౌరీ
  ఊగుచు నుయ్యల ప్రియసఖి నూసులు వినుచున్
  బాగుగ నీశుని మాలన
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  రిప్లయితొలగించండి
 30. భోగమె నమోదు నచ్చట
  కాగా గిన్నీసు పుస్తకపు పుటలందున్
  వేగమె వేయికి పైగా
  "నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్"

  రిప్లయితొలగించండి
 31. బాగరి కాంత పేదరిక బాధలు తాళగ లేనివేళ తా
  భోగపు వృత్తిగైకొనగ పుత్తడి బొమ్మకు మారురూపమౌ
  భోగినిఁ బొంద వచ్చు ఖలు ముండరు లైన విషమ్ము గ్రక్కెడిన్
  నాగుల ముద్దులాడె లలనామణి యాత్మవినోద కేళికై.

  రిప్లయితొలగించండి
 32. కౌగిలి జేరిన రాత్రే
  సాగెడి సరసాలయందు సౌఖ్యపు విందై
  ఊగెడి నుయ్యలలోనన్
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  రిప్లయితొలగించండి
 33. రాగాలుపోవగ మగడు
  వేగమె సమకూర్చ మోమువిరిసి చెవులకున్
  తూగాడెడు బంగారపు
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  రిప్లయితొలగించండి
 34. ఆటవిడుపు సరదా పూరణ:
  (నేటి నా కందపద్య పూరణ పొడిగింపు)

  బాగుగ గొల్చగా విధిగ పంచమి నాడున ప్రార్థనమ్ముతో
  నాగుల; ముద్దులాడె లలనామణి యాత్మవినోదకేళికై
  దాగుడు మూతలన్ గెలిచి తాండవ మాడుచు ప్రాణనాథునిన్;
  వాగుడు కాయరా మగడ! పండుగ నేడని కౌగిలించుచున్ :)

  ప్రార్థనము = ప్రార్థన (ఆంధ్ర భారతి నిఘంటు శోధన)

  (గమనిక: ఈ క్రొత్త పెండ్లము ఉత్తర భారత స్త్రీ కనుక నాగపంచమి వ్రతము చేసెను)

  https://en.m.wikipedia.org/wiki/Naga_Panchami

  రిప్లయితొలగించండి
 35. కందం
  స్వాగత మంచును వరుడై
  రాగనె విజయున్ సరసము లాడుచు వగలన్
  దాగుచు నులూచిఁ దోయఁగ
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  రిప్లయితొలగించండి
 36. భోగుల కంఠహారములు బూది ధరించి శివుండు వర్తిలన్
  సాగుచు భర్తదేహమున సంతత మాడ కుమారుతోడుతన్
  నాగుల ముద్దులాడె లలనామణి యాత్మవినోదకేళికై
  భోగులు మిత్రులంచునిట భూజనులందరు కాంచ నెంచుచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. గురువర్యులకు నమస్సులు ధన్యవాదములు అసనారె

   తొలగించండి
 37. శ్రీగోవిందునిగొలువగ
  వేగముగొనివచ్చెగోదవేవేగలువల్,
  రాగము నిండగ ఆ పు
  న్నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 38. మిత్రులందఱకు నమస్సులు!

  [1]
  నాగుల మాత కద్రువ, కనంతుఁడు "విష్ణుని పాదసేవకై
  యేఁగెద" నంచుఁ దెల్ప, మనసెంతయుఁ బుల్కరమందె! నాగులున్
  సాఁగఁగనంపు చన్నపయిఁ జక్కని ప్రేమముఁజూపఁ, బ్రేమతో
  నాగుల ముద్దులాడె లలనామణి యాత్మవినోదకేళికై!

  [2]
  నాగవినోదకేళినటనమ్మిడు గారడివానిభార్యయే
  "నాగులఁబట్టి తె" మ్మనియు నాట్యములాడుచు వేడ, గారడీం
  డేఁగియుఁ, బాము లెన్నియొ వనిం గని, పట్టియు, భార్య కీయ, నా
  నాగుల ముద్దులాడె లలనామణి యాత్మవినోదకేళికై!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారూ,
   మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 39. నీ గళముకు కంటె, యివియె
  నాగులు నీకర్ణములకు, నాతీ కనుమీ
  పోగులనుచు మగ డివ్వన్
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  రిప్లయితొలగించండి
 40. డా.పిట్టాసత్యనారాయణ
  సాగిన త్రాచును గనగనె
  బాగెరుగని భయము గాని బంగరు ఛాయన్
  తీగెలె పడగల ప్లాస్టికు
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  రిప్లయితొలగించండి
 41. డా.పిట్టాసత్యనారాయణ
  నాగు యనంగ వడ్డినటు నాణెము లందున బొంద గోర రా
  భాగము నాల్గుకున్నొకటి భద్రము ధాన్యము జెల్లు జేయగన్
  వీగెను రూకలేయికను వీలగు నిట్టులె మోది పాలనన్
  నాగుల వేరుగా నునిచి నమ్మని వృద్ధిని లెక్క వేసి దా
  నాగుల ముద్దులాడె లలనామణి యాత్మవినోద కేళికై

  రిప్లయితొలగించండి
 42. [3]
  [కాత్యాయనీ వ్రత మాచరించడానికి గోపికలు, తాము వ్రతం చేస్తున్నామనే సంగతి మఱచి, నగ్నంగా నదిలో దిగగా, శ్రీకృష్ణుడు వారికి వారి తప్పును తెలుపడానికై, వారి వస్త్రాలను అపహరించి, పున్నాగ వృక్షంపై నుంచి, వారి ప్రార్థనతో మఱల వారి వస్త్రాలను ఇచ్చాడు. కొన్ని దినాల తరువాత అకౄరుడు బలరామకృష్ణులను కంసుని చెంతకు కొనిపోతుండగా, ఒక గోపిక తన ప్రేమను కృష్ణునకు తెలుపడానికి, పొన్న చెట్లను ముద్దాడినదని తెలుపు సందర్భము]

  "ఏఁగియు గోపికల్ నది, మహేశ్వరి పూజలకై, వివస్త్రలై
  బాగుగ స్నానమాడ నట, బాలుఁడు కృష్ణుఁడు తప్పుఁ దెల్పఁ, బు
  న్నాగ కుజమ్ముపై నిడె పినద్ధములన్! గని, మ్రొక్క, నిచ్చె వే
  వేగ మధుద్విషుం" డనుచుఁ బ్రేమనుఁ గృష్ణున కప్డుఁ దెల్పఁ బు
  న్నాగుల ముద్దులాడె లలనామణి యాత్మవినోదకేళికై!

  రిప్లయితొలగించండి
 43. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  సందర్భము: సులభం.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  "నాగులు"ను, "నాగలక్ష్మి"యు
  నాగుల పూజించినారు నాగుల చవితిన్
  వేగమె కోరిక తీరెను..
  "నాగుల" ముద్దాడెను లలనామణి కేళిన్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి

 44. కం:ఆగరుడుడె మోసుకొనుచు
  నాగులముద్దాడెను ..లలనామణి కేళిన్
  తా గెలువగ సోదరిపై
  జాగును చేయక ఖగుడట సాగెను వడిగా.

  రిప్లయితొలగించండి
 45. ఒక లలనామణి భర్తతో...
  ఉత్పలమాల
  పోగులు జిమ్మగన్ వెలుగు మోమున జుట్టది యుంగరాలతో
  దాగిన మన్మథుండు నిను దగ్గర జేసెను నాకు భర్తగా
  రాగదె సోయగమ్మునను రంజిల మోజులటంచుఁ గర్ణపు
  న్నాగుల ముద్దులాడె లలనామణి యాత్మవినోదకేళికై

  రిప్లయితొలగించండి
 46. రాగిణి బొమ్మల కొలువున
  వేగము గాపేర్చె నంట వెలుచల మెలికల్
  భోగిని చిందులు వేయగ
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  రిప్లయితొలగించండి
 47. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  నాగుల ముద్దులాడె లలనామణి
  యాత్మ వినోద కేళికై

  సందర్భము: నాగ కన్యా భయ ధ్వంసీ రుక్మ వర్ణః కపాల భృత్.. అని హనుమ త్సహస్రంలో (108 వ శ్లో) పేర్కొనబడుతుంది. ఓం నాగ కన్యా భయ ధ్వంసినే నమః.. (నాగ కన్యయొక్క భయాన్ని పోగొట్టిన వానికి నమస్కారం) అని 780 వ నామం.
  నాగ లోకానికి నాయకురాలైన "ఉత్పలాక్షి" అనే సుందరిపై కన్ను వేసినాడు మదనాతురుడైన "రక్తరోము" డనే లోక కంటకుడైన రాక్ష సాధముడు.
  ఆ సాధ్వి భయంతో పారిపోయి "సుషేణు" డనే యోగి పుంగవుడైన గంధర్వుని శరణు జొచ్చింది. ఆయన గొప్ప హనుమ దుపాసకుడు.
  . తన్మూల మంత్రం శుక్లాఖ్యం
  ప్రపదా మ్యుత్పలాక్షి! తే
  తస్మా త్త వేష్ట కా మార్థ
  సిద్ధి శ్శీఘ్రం భవిష్యతి
  శుక్ల మనే పేరుగల మూలమంత్రమును నీ కుపదేశిస్తాను.దానితో నీ కోరిక వెంటనే తీరుతుంది.
  అని.. ఆమె కుపదేశించాడు.
  "పార్వతీ గర్భ సంభూతః.." నుంచి "సర్వదేవ శిఖామణిః.." అనేంతవరకు వున్న 25 నామములతో కూడినదే "శుక్లము".
  (ఇలాంటివే మృగాళ్ళుగా నేడు పిలువబడుతున్న వారినుండి మహిళలను రక్షించేవి)
  ఆమె ఆ మంత్రోపాసనవల్ల ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై అభయ మొసంగి భయంకరమైన యుద్ధంలో రక్త రోముని సంహరించి ఆ పతివ్రతను రక్షించినాడు.
  ఆమె ఆనందంతో తోటి నాగులను ముద్దాడింది.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  నాగుల లోకమందు గల
  నాతి, పతివ్రత *"యుత్పలాక్షి"* తా
  నేగెను *"రక్త రోమ"* దను
  జేంద్ర భయాన *"సుషేణు"* జేర.. నా
  శ్రీ గుణ దత్త *"శుక్ల"* మను
  చింతనఁ బావని భీతిఁ దీర్చె; మి
  న్నాగుల ముద్దులాడె లల
  నా మణి యాత్మ వినోద కేళికై

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  16.5.18
  శ్రీ గుణ దత్త శుక్ల మను చింతనన్=
  శుభ గుణాలు గల సుషేణునిచేత నీయబడిన
  శుక్ల మనే మంత్ర చింతనచేత..

  రిప్లయితొలగించండి
 48. రాగనె నాగపంచమిట రంగులు జల్లి బిలాసపూరులో
  జాగృతి పాడగా పొడిచి జాప్యము జేయగ నత్తగారు తా
  బాగుగ స్నానమాడుచును బంగరు తోడను చేసినట్టివౌ
  నాగుల ముద్దులాడె లలనామణి యాత్మవినోదకేళికై...

  రిప్లయితొలగించండి