వేంకటగిరిని దర్శించి వేడె మేరి బైబిలు చదివి; తురకల పక్క నొగ్గు చున్న మాజుల చేసెను శొంఠి శాస్త్రి చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య సర్వ మత సామరస్యపు సభ్యులు భళి!
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2676 సమస్య :: *చర్చికి సంధ్య వార్చుటకు సాయబు పోయెను సత్వరమ్ముగన్.* సమస్యలోని విరుద్ధార్థం సులభ గ్రాహ్యం. సందర్భం :: మతభేదములను మరచి మాట్లాడుకొంటూ ఉండిన ముగ్గురు వ్యక్తులు దైవ ప్రార్థనకు సమయమైనదని వెంటనే తమతమ ప్రార్థనా మందిరాలకు క్రమంగా వెళ్లే సందర్భం.
చర్చలు మాని భక్తిమెయి సాగిరి వేగమ ఏసుదాసు, తా నర్చన జేయు వేళ యిది యంచును బ్రాహ్మణుడున్ క్రమమ్ముగా చర్చికి, సంధ్య వార్చుటకు ; సాయబు పోయెను సత్వరమ్ముగన్ కూర్చును మేలటంచు సమకూరిన భక్తి మసీదు లోనికిన్.
చర్చలు సేయ నేల ధర సచ్ఛరి తాత్ములు శుద్ధ చిత్తులై మార్చఁగ నెంతు రెల్లరను మానవ జాతికి దైవ మొక్కఁడే యర్చన సేయ నామముల యంతరమే వల దంచుఁ గ్రైస్తవ స్వర్చన మందిరమ్మునను వార్చఁగ సంధ్యఁ దురుష్కుఁ డేఁగెనే (చర్చికి సంధ్య వార్చుటకు సాయబు పోయెను సత్వరమ్ముగన్)
రిప్లయితొలగించండిజోసెపు ప్రభువునట వేడె జోరునెచట ?
శాస్త్రి సూర్యుని తోడుగ సంజె వేళ ?
తురకల గుడిలోన నమాజు దునియు నెవరు?
చర్చిలో; సంధ్య వార్చెను; సాయబయ్య!
జిలేబి
జిలేబీ గారూ!
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు!
ప్రాస గీతి :)
రిప్లయితొలగించండిమర్చుచు తనదైన మతము మారు మారు
కర్చుచును మోదిని నెపుడు కక్ష గట్టి
చర్చలను నెన్నికల లోన చావ గొట్టి
చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య
సాయెబు = సాహెబ్ ( తెల్ల దొర)
పద్యం బాగుందండీ.. మోదీ రోజూ కలలోకి వస్తున్నట్లున్నారు..
తొలగించండి*నమో* నమః 🙏
మైలవరపు మురళీకృష్ణ
తొలగించండిజీపీయెస్ వారి కల :)
మోడి తలపైన టోపియు,మోమున తిల
కమ్ము చేత బైబిలు కల కళగొనంగ
మాప్రభాకర శాస్త్రియు మదిని నెంచె
చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య!
🙏🙏🙏
తొలగించండిప్రభాకర శాస్త్రిగారూ!
తొలగించండిమోదీని ఎన్నికలలో చావగొట్టి చర్చిలో సంధ్యవార్చిన సాయబయ్యను గూర్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు!
జిలేబీ గారూ!
మీ హాస్యపూర్వక పూరణమును బాగున్నది. అభినందనలు!
🙏🙏🙏
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఅర్చన నేర్చినాడు, మనహైందవసంస్కృతి , దైవముండెడిన్
చర్చి మసీదులన్ గుడుల ., సత్యమతండని తెల్పు మంత్రముల్
నేర్చెను , భారతావనిని నే జనియించితినంచు భక్తితో
చర్చికి సంధ్య వార్చుటకు సాయబు పోయెను సత్వరమ్ముగన్" !!
మైలవరపు మురళీకృష్ణ మైలవరపు మురళీకృష్ణ
వాన ముంచెను గ్రామాలఁ బ్రళయమట్లు
తొలగించండిబాధితులనందరిని జేర్చ ప్రభుత గుడుల
బడుల ., నన్నమ్ము వారికి వండుచుండ
చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య !
సంధ్య... సాయంతన కాలమున
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపువారి రెండు పూరణములును అద్భుతముగ ఉన్నవి. అభినందనలు!
తొలగించండిదేవుడొక్కడె యర్చించు తీరు వేరు
రిప్లయితొలగించండిహిందు, ముస్లిము, క్రిస్టియన్సందరొకటె!!
కలసి తత్త్వము నూహింపఁగల్గు సుఖము
చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య
ప్రసాద రావు గారూ!
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు!
రెండో పాదంలో ఆంగ్లానికి బదులు... క్రైస్తవులందరొకటె అనండి.
ధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండితర్చుచు బోయెనెచ్చటికి తండ్రికి వందన మంచు జాకెబూ?
అర్చకు డా సుమాళియు తటాలున వెళ్ళెనదేల నోగదా?
వార్చర వాన లోన సయి పట్టుగ జేయనమాజు కై భళా?
చర్చికి; సంధ్య వార్చుటకు; సాయబు పోయెను సత్వరమ్ముగన్!
జిలేబి
జిలేబీగారూ!
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు!
రెండోపాదం చివర ...దెందుకో గదా...అనండి.
మూడో పాదాన్ని...
వార్చ నమాజుకై యెవడు బాగుగ నెట్టుల బోయెనో గదా! అనండి.
రిప్లయితొలగించండివేంకటగిరిని దర్శించి వేడె మేరి
బైబిలు చదివి; తురకల పక్క నొగ్గు
చున్న మాజుల చేసెను శొంఠి శాస్త్రి
చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య
సర్వ మత సామరస్యపు సభ్యులు భళి!
జిలేబి
జిలేబీ గారూ!
తొలగించండిసర్వమత సామరస్యాన్ని బోధించే మీ మూడో పూరణ బాగున్నది. అభినందనలు!
సబ్ కా మాలిక్ ఏకనె తాను మసీదును
రిప్లయితొలగించండిద్వారకామాయనెను
మనిషిని కానని మహిమలు చూపెను దీవెనకై
చేతులు చాపెను
ధర్మ సంకరము ధర్మమే యగు అధర్మమది
కాదు కాదనుచున్
చర్చికి సంధ్య వార్చుటకు సాయబు పోయెను
సత్వరమ్ముగన్
వైప రీత్యము గాకేమి ,పాపమనగ
రిప్లయితొలగించండివచ్చు,యెవరు ప్రేలెను,వదరు బోతు
లార,యెవడురా మహిలోన లజ్జలేక
చర్చి లోన సంధ్య వార్చెను ,సాయబయ్య
చేయును నమాజు సతము మసీదులోన
సంధ్య వార్చు విప్రుడెపుడు సంధ్య వేళ,
చేయు ప్రార్ధనల్ చర్చిలో శిలువ యెదుట.
పూసపాటివారూ!
తొలగించండివైపరీత్యపు బ్రార్థనలను గూర్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు!
రిప్లయితొలగించండిసర్వ మత సామరస్యము సరి యటంచు
పడిరి పోటీల జనులెల్ల! పరవశించి
యా ఇలాహి జీసెస్ రామ! యని, జిలేబి,
చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య!
జిలేబి
జిలేబీ గారూ!
తొలగించండిమీ నాల్గో పూరణ బాగున్నది. అభినందనలు!
మూడో పాదంలో [యని,] కన్న [యన] అంటే ఇంకా బాగుంటుంది.
మార్చగ నెంచి నీ జగతి మానవ రూపము నెత్తి *బాబ*తా
రిప్లయితొలగించండిగూర్చెను *సాయి*తత్వమును! కోవెల చర్చి మసీదు లేకమై
పేర్చెను ప్రేమ తత్వమును భేదము లన్నియు మాసిపోవగన్
*చర్చికి సంధ్య వార్చుటకు సాయబు పోయెను సత్వరమ్ముగన్*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
హ్యారి వెడలి నాడిప్పుడె మేరి గొలువ;
రిప్లయితొలగించండిశ్రద్ధ తోడ పెరటి లోన శాస్త్రి గారు;
సాయ మడిగె హజ్ యాత్రకు సాగనెంచి;
చర్చిలో ; సంధ్య వార్చెను ; సాయబయ్య
రిప్లయితొలగించండి(ముగ్గురు పిల్లలను పెంచుకున్న త్రిమూర్తిపంతులు గారు భార్య వసుమతితో)
"మరియ యెటనుండె?మణిశర్మ మహితుడేడి?
ఖాద రెటుబోయె?బిడ్డలు కానబడరు;
భరతభూమికి స్వాతంత్ర్యభవ్యదినము;"
"చర్చిలో;సంధ్యవార్చెను;సాయబయ్య."
రిప్లయితొలగించండిజీపీయెస్ వారి కల :)
మోడి తలపైన టోపియు,మోమున తిల
కమ్ము చేత బైబిలు కల కళగొనంగ
మా ప్రభాకర శాస్త్రియు మదిని నెంచె
చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య!
జిలేబి
సర్వ మతముల సారంబుసాకునట్లు
రిప్లయితొలగించండిఎన్నికలముందు నాయక పన్నుగడగ
మాయమాటల మంత్రాల మనుగడందు
చర్చిలో సంధ్యవార్చెను సాయబయ్య!
అన్ని మతము ల సార మ్ము నె న్న నొకటె
రిప్లయితొలగించండిక్రైస్తవం బును ని స్లాము వాస్తవ ముగ
నొక్క గమ్య మె బోధించు నిక్కము గను
చర్చి లో సంధ్య వా ర్చేను సాయ బ య్య
మితులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిబ్రాహ్మణుండయ్యుఁ దాఁ గ్రైస్తవమ్ముఁ గొనియు
మహ్మదీయుల పిల్లతో మనువునాడి
తన్మతమ్మునుం గొనియునుఁ దప్పి చనక
చర్చిలో సంధ్యవార్చెను సాయబయ్య!
super sir....
తొలగించండిsuper sir....
తొలగించండి
తొలగించండిచాలా బాగుందండి ఉద్యోగం కోసం నవల గుర్తుకొస్తోంది
జిలేబి
తొలగించండి*చివుకుల పురుషోత్తం గారి ఉద్యోగం కోసం నవల
తొలగించండిThankfully available ! Marvellous read ఉద్యోగం కోసం చివుకుల పురుషోత్తం గారి నవల
http://nvgsks.blogspot.com/2015/12/blog-post.html
చీర్స్
జిలేబి
సుకవులు మల్లేశ్వర్, జిలేబీ గార్లకు ధన్యవాదాలు!మీ అభిమానమునకు కృతజ్ఞుఁడను!
తొలగించండి
రిప్లయితొలగించండిఅర్చకుని కూతురు వరించె నబ్రహాము
వచ్చి బెండ్లాడెద ననగ వరుడుదాను
చర్చిలో సంధ్య వార్చెను; సాయబయ్య
ఉచ్ఛ స్వరమున నమాజు నూదువేళ
వార్చు = వేచియుండు, ప్రతీక్షించు
సంధ్య అర్చకుని కూతురు పేరు!
తొలగించండిపరుల మేల్గోరి ప్రార్థించు భక్తి తోడ
రిప్లయితొలగించండివిజ్ఞత కలిగి సతము పవిత్రమైన
చర్చిలో సంధ్య, వార్చెను సాయబయ్య
అన్నముడికిన పిదప తానలసటనక
చేరి క్రీస్తుకు ప్రార్ధనల్ చేతు రెచట
రిప్లయితొలగించండిబ్రాహ్మణుండేమి జేసె ప్రభాతమందు
అల్లహోయక్బరని బల్క నరచు నెవడు
చర్చిలో , సంధ్య వార్చెను, సాయబయ్య
12.05.2018
రిప్లయితొలగించండిఈరోజు పద్యపూరణకిచ్చిన సమస్య:
"చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య"
(లేదా...)
"చర్చికి సంధ్య వార్చుటకు సాయబు పోయెను సత్వరమ్ముగన్"
నా పద్యహారం:
గమనిక: తనకోసం పైసా దాచుకోని సాయిని లౌకిక భావముగా యతి కోసం పేద అని సంభోదించా గాని వేరు గాదు. మాన్యులు మన్నించగలరు
🙏🏻
పుట్టె నెక్కడో పెరిగెను ముస్లిమింట
పెండ్లి వారితో వచ్చెను పేద షిరిడి
సాయి యనిఁ బిల్వ దానినె స్వాగతించె
గురుని స్థానమంచు నచట గుర్తు జూపి
వేప వృక్షపు మూలమె వేడుకనుచు
వాస మేర్పరచుకొనియె వాసి గాను
భిక్ష గైకొని జనులకు ప్రేమ పంచె
ద్వారకామాయి యను పేరు తాను బెట్టె
మస్జిదుకు; సిక్కిసాయిలు మాన్యు లేగ
సబ్క మాలికే కనుచును సాయి వెడలె
యిన్ని జూడగ సబబే యిట్టులనుట
"చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య"
😊
అన్నిమతముల సారము మిన్న యనుచు
రిప్లయితొలగించండికులము మతములు వేరను గొనక యెపుడు
దైవమొక్కడే యనుచును దలచి మదిని
చర్చి లోసంధ్యవార్చెనుసాయబయ్య
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2676
సమస్య :: *చర్చికి సంధ్య వార్చుటకు సాయబు పోయెను సత్వరమ్ముగన్.*
సమస్యలోని విరుద్ధార్థం సులభ గ్రాహ్యం.
సందర్భం :: మతభేదములను మరచి మాట్లాడుకొంటూ ఉండిన ముగ్గురు వ్యక్తులు దైవ ప్రార్థనకు సమయమైనదని వెంటనే తమతమ ప్రార్థనా మందిరాలకు క్రమంగా వెళ్లే సందర్భం.
చర్చలు మాని భక్తిమెయి సాగిరి వేగమ ఏసుదాసు, తా
నర్చన జేయు వేళ యిది యంచును బ్రాహ్మణుడున్ క్రమమ్ముగా
చర్చికి, సంధ్య వార్చుటకు ; సాయబు పోయెను సత్వరమ్ముగన్
కూర్చును మేలటంచు సమకూరిన భక్తి మసీదు లోనికిన్.
మరొక పూరణ :: ప్రశ్నోత్తరవిధానం
అర్చనజేయ నెచ్చటకు హాయిగ వెళ్లును క్రైస్తవుండు ? తా
నర్చనవేళ బ్రాహ్మణులు నౌచితి దేనికి సిద్ధమౌదురో ?
అర్చనకై మసీదుకు సమంచితరీతి నెవండు పోయెనో ?
*చర్చికి-సంధ్య వార్చుటకు-సాయబు పోయెను సత్వరమ్ముగన్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (12-5-2018)
మార్చి నివాసమున్ పరుల మైత్రిని గోరుచు నన్యదేశమున్
రిప్లయితొలగించండికూర్చగ ప్రేమతో నచట కూరిమి తోడుత
సంస్ధనొక్కటిన్
చర్చలు లేకయే మిగుల సంఘటితమ్ముగ జేయప్రార్ధనల్
చర్చికి సంధ్యవార్చుటకు సాయబు బోయెను సత్వరమ్ముగన్!
సర్వమత సహనము సూప నుర్వి లోన
రిప్లయితొలగించండినొక్కఁడ ప్రభువు పేరులె పెక్కు గలవు
విశ్వమం దనుచు ఘృతము వేగ పోయు
చర్చిలో సంధ్య వార్చెను సద్యవనుఁడు
(చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య )
[పోయుచు + అర్చి = పోయు చర్చి; అర్చి = మంట]
చర్చలు సేయ నేల ధర సచ్ఛరి తాత్ములు శుద్ధ చిత్తులై
మార్చఁగ నెంతు రెల్లరను మానవ జాతికి దైవ మొక్కఁడే
యర్చన సేయ నామముల యంతరమే వల దంచుఁ గ్రైస్తవ
స్వర్చన మందిరమ్మునను వార్చఁగ సంధ్యఁ దురుష్కుఁ డేఁగెనే
(చర్చికి సంధ్య వార్చుటకు సాయబు పోయెను సత్వరమ్ముగన్)
[సు + అర్చన = స్వర్చన]
ఆటవిడుపు సరదా పూరణ
రిప్లయితొలగించండిమార్చెను మస్తుగా మతము మక్కువ మీరగ మారియమ్మపై
తీర్చెను మ్రొక్కులన్ తనివి తీరగ తిర్మల వేంకటేశువౌ
నేర్చెను నిఫ్తరుల్నిడుట నీదుల రాత్రుల వోట్లకోసమై
చర్చికి సంధ్య వార్చుటకు సాయబు పోయెను సత్వరమ్ముగన్
సాయబు = సాహెబ్ = నేత
క్రైస్తవుం డన్నదానము కలుగ జేసె
రిప్లయితొలగించండిచర్చిలో సంధ్య; వార్చెను సాయబయ్య
గంజిని, శివార్పణమనుచు గతికిరిగద
ఊరియం దన్నార్తులుచేరి యొటిగను
సంధ్య= ప్రతిజ్ఞ (ఆంధ్ర భారతి)
సిద్ధమాయె పెళ్లి కొరకు జేమ్సు తోడ
రిప్లయితొలగించండిచర్చిలో సంధ్య, వార్చెను సాయ బయ్య
వారికై, నేస్తి, పుత్రి జామాతఁ బెద్ద
మనసుతోడ దీవించెద మంచు దెలుప౹౹
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి(2)
రిప్లయితొలగించండిఅర్చన సేయ దేవుఁ డొకఁ డంచు, మతార్చక భేద రాశిఁ బో
కార్చఁగ, బ్రాహ్మణుం డొకఁడు, క్రైస్తవముం గొని, మహ్మదీయపుం
జర్చల వేదిఁ దన్మతజు నందననున్ మనువాడి, సాయబై,
కూర్చెను న్యాయ మన్నిఁటికిఁ, గూర్మినిఁ బంచియు! నొక్కనాఁడు తాఁ
జర్చికి సంధ్య వార్చుటకు సాయబు పోయెను సత్వరమ్ముగన్!
డా}.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిజన్మ పీరీల నిల్పగ జరిగెనేమొ
పేరుబెట్టిన సాంబయ్య సాయెబాయె
ఊరి పొలిమెర, వేసవ, పూరి గుడిసె
చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిచర్చలకేల బోయెదవు స్నాతకమన్నను సంధ్యవార్చుటే
చర్చిలు వంటి గొప్పనగు జన్మకు బ్యాప్టిజ ముండుగాదె యే
అర్చనయైన కావలెను హ్లాదము యెండకు పూరిగడ్డిదౌ
చర్చిని సంధ్యవార్చుటకు సాయెబు పోయెను సత్వరమ్ముగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండివార్చలేదుగ గంజిని వాడు నేడు
బిచ్చమింకను దొరుకక, బియ్యమపుడు
పిలచి పెట్టగ దయతోడ ప్రియముగాను
చర్చిలో సంధ్య, వార్చెను సాయబయ్య
తొలగించండిఅద్భుతః
జిలేబి
చర్చను నట్టహాసముగ సంబర మాయదిసాగుచుండగా
రిప్లయితొలగించండిచర్చకు సంధ్య వార్చుటకుసాయబు పోయెను సత్వరంబుగన్
చర్చను నాలయంబునను శాస్త్రము బట్టి యు దైవప్రార్ధనల్
యర్చనధూపదీపములు హారతు లయ్యెడనిత్తురేసుమా
అర్చన జేయనెంచి సుమహారము గైకొని మందిరమ్ముకున్
రిప్లయితొలగించండినర్చన యేగగాంచి తన యాపద దీర్చమనంచు తా జనెన్
జర్చికి సంధ్య, వార్చుటకు సాయబు పోయెను సత్వరమ్ముగన్
మూర్ఛిల వంటవాడపుడు పొంగుచునుండగ నన్నమున్ వడిన్.
బ్రాహ్మణ ప్రియుని కోరెగ భామ సైర
రిప్లయితొలగించండిపిల్లలను జతగూడి తా పిలువనేర్ప
మూడు మతముల జూపగ ముదము గాను
చర్చి లో సంధ్యవార్చెను సాయబయ్య
ఆకాశవాణి సమస్య తెలుప గలరు
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిసవరణతో
ప్రార్థనమెచట చేసెను పడతి మేరి
విప్రుడేమి చేసె నుదయవేళలందు
మానుగ మసీదునందు నమాజు చేయు
చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య
సందర్భము: సాయబు శర్మ మిత్రులు. తరుచు ముచ్చట్లలో పడేవారు. ఒకనాడు సాయంత్ర మయింది. చర్చిలో ప్రార్థనలు వినపడగా శర్మ ముచ్చట్లు మానివేసినాడు. చక్కగా సంధ్య వార్చినాడు.
సాయబయ్యకూడ నమాజుకు వేళ యతిక్రమించిన దని మసీదుకు హడావుడిగా వెడలిపోయినాడు.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
సంజ యి దని సాయబుతోడ శర్మ మాను
కొనియె ముచ్చట్లు.. ప్రార్థనల్ వినపడంగ
చర్చిలో.. సంధ్య వార్చెను.. సాయబయ్య
వేగిరముగ మసీదుకు వెడలిపోయె
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
తేటగీతి
రిప్లయితొలగించండివిధి వశమ్మున భూకంప మధిగమించి
కులమతమ్ముల మరచుచున్ గూడ! వంట
చర్చిలో సంధ్య వార్చెను! సాయబయ్య
పంక్తి నందున వడ్డించె పరవశించి!
ఉత్పలమాల
చర్చికి సంధ్య వార్చుటకు సాయబు పోయెను సత్వరమ్ముగన్
జర్చిత మయ్యె చందనముఁ జల్లిన రీతిని వాక్యమే వినన్
గూర్చి సమస్య నిచ్చుటకు గుండెల బుట్టిన భాష్యమైన నే
మార్చిన భారతీయుల సమాదరణంబున నిట్లుఁ బండగే!
మార్చగతా మతమ్మునట మానస మొల్లక మహ్మదీయతన్
రిప్లయితొలగించండిచేర్చగ రామభక్తులిట చెన్నుగ మిన్నగు హైందవమ్మునన్
కూర్చొని రోమునందునను కుర్సిని మీదను పిక్కనొప్పితో
చర్చికి సంధ్య వార్చుటకు సాయబు పోయెను సత్వరమ్ముగన్
https://kandishankaraiah.blogspot.com/2018/05/2676.html?showComment=1539308968722#c4126070750373652697
రిప్లయితొలగించండి