సందర్భము: అంద మే నందము.. అనగా మేను అందము.. అందగా.. అని. మేను అందము.. అంటే శారీరకమైన సౌందర్యం అని. అది అందుకోగలిగిన వాడు ఎప్పుడో ఒకసారి "ఇంతేనా!" అనుకొని తీరుతాడు. అనగా నిర్లక్ష్యం చేస్తాడు. ఎందుకంటే ఇంద్రియాలకు తృప్తి చెందే లక్షణం ఎప్పుడూ లేదు కదా! శరీర సౌందర్యం ఒకసారి అందినట్టే వుండి అందకుండా పోతూ వుంటే దీని తీ రింతే అని తెలుసుకోగలిగి ఆత్మ సౌందర్యం వైపు క్రమంగా ఆకర్షింపబడుతాడు. అదే క్రమ పరిణామంలో మానవు డెదుగవలసిన విధానం. అందుకే గోపికలకు కృష్ణుడు వియోగాన్ని కల్పిస్తాడు. అందుతున్న ఆత్మ సౌందర్యమే జీవునికి నిజమైన విందు చేస్తుంది. అదే ఆత్మానందం. ఒకసారి ఆ విందులో రుచి మరిగితే తక్కిన రుచు లన్నీ ఇక ఆనవు. క్రిందకు వెళిపోతాయి. భౌతిక సౌందర్యాలు బంధించలేకపోతాయి. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~ అంద మే నంద "మింతెనా!" యందు; రంది
["ప్రేయసీ! నీవు నాకు అందినను, నీదు తండ్రిమాత్రము నిన్ను నాకు అందనీయుట లేదు! నేను నిన్నెట్టుల నందుకొనఁగలను సఖీ?" యనిన ప్రియునితోఁ బ్రియురాలు "ప్రియా! యందినట్టి యీ నా చేయి నందుకొని, పెండ్లాడినచో, నీ యందియు నందరానిదగు నందమె యందఱకుఁ గనువిందొనర్చును గదా సఖా! కావున, నా పెద్దలఁగూర్చి యాలోచింపక, రుక్మిణినిం గృష్ణుఁడు చేపట్టినట్టుల నన్నుఁ జేపట్టుము! హాయిగ నానందముగ జీవించునట్టి మననుం జూచి, యందఱును నానందమందఁగలరు!" అని ప్రేయసి, ప్రియునకు సలహా నొసఁగిన సందర్భము]
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2686 సమస్య :: అందియు నందరాని దగు నందమె విందొసగున్ గదా సఖా! సందర్భము :: ధ్వన్యాలోకము అనే గ్రంధంలో కవిత్వం ఎలా ఉండాలి? అనే విషయం గుఱించి చెబుతూ ‘’ నో ఘూర్జరీ స్తన ఇవాతితరాం నిగూఢః నాంధ్రీ పయోధర ఇవాతితరాం ప్రకాశః। అర్థం గిరా మపిహితః పిహితశ్చ కశ్చిత్ సౌభాగ్యమేతి మరహట్ట వధూ కుచాభః।। అని వర్ణించియున్నారు. పై శ్లోకానికి అనువాద పద్య మన్నట్లు
అని అంటూ కవిత్వం ఎలా ఉండాలి అనే విషయాన్ని పూర్వ కవి ఒకరు విశదీకరించి యున్నారు. కాబట్టి అందీ అందని అందమే (కావ్యార్థమే)విందును చేకూరుస్తుంది అని వివరించే సందర్భం.
సహృదయులు జిలేబి గారూ! హృదయపూర్వక ప్రణామాలండీ. నాపై మీకు గల అభిమానమునకు ధన్యవాదాలండీ. ప్రతిరోజూ వాట్స్ యాప్ లో నా పద్యానికి గళమును అందజేస్తున్నానండీ. బ్లాగులో ఆడియో పెట్టడం నాకు తెలియదండీ. కోట రాజశేఖర్
మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. శంకరాభరణం గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని విష్ణునందన్ గారి శ్లోకాన్ని quote చేశాను. అంతకు మించి మరేమీ దురుద్దేశం లేదు.
సందర్భము: శ్రీ రంగం సమీపంలో ధనుర్దాసు ఒక మల్ల యుద్ధ విశారదు డుండే వాడు. ఆతని ప్రేయసి హేమాంగి. ఆమె కన్ను లెంతో అందమైనవి. కావేరీ తీరాన శ్రీ రంగనాథునికి వైభవంగా తిరుమంజన మహోత్సవం జరుగుతున్నది. సౌంద ర్యారాధకుడైన ధనుర్దాసు హేమాంగి కన్నులు వాడిపోతా యేమో నని ఎవ రే మనుకున్నా లెక్కచేయక ఆమె పక్కనే నడుస్తూ ఆమెకు గొడుగు పట్ట సాగాడు. శిష్యులతో కలిసి వెళుతున్న శ్రీమద్రామానుజుల వారు శిష్యుల నడిగి యతని విషయం తెలుసుకొని తన వద్దకు పిలిపించుకున్నాడు. అడిగినాడు. "ఎవ రే మనుకుంటే నా కేం?" అన్నా డతడు. "ఇంతకన్న అందమైన కండ్లు చూపిస్తాను సాయంత్రం వస్తావా!" అన్నారు స్వామి వారు. "ఇంతకన్న అందమైన కండ్లీ లోకంలోనే వుండవు. ఉంటే నేను వాటికి జీవితాంతం దాసు ణ్ణవుతా" అన్నాడు ధనుర్దాసు. సాయంత్రం రంగనాథుని స్మరించి పవిత్ర కమండ లూదకంతో స్వామివా రాతని కన్నులను తుడిచారు.అతనికి శ్రీ హరి నేత్ర కమలాలు దర్శన మయ్యాయి. ఆనంద బాష్పా లాగలేదు. అతని మోహ మంతా నశించిపోయింది. స్వామివారికి పాదాక్రాంతుడై దాసుడై పరమ భాగవతోత్తము డైనాడు. "నీ కన్నులకంటె కోటి రె ట్లందమైనవి నారాయణుని నయన పద్మము" లన్నాడు దాసు. ఆతని ప్రేయసి "అందీ అందని అందమే విందు గూర్చును సుమా!" అన్నది. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~ "అందముఁ జిందు నీ కనులె యన్నిటి కన్నను మిన్న యంచు నే నెందుకొ భ్రాంతిఁ జెందితిఁ గదే! హరి నేత్ర సరోజ శోభ యే మందును? కోటి రె ట్లధిక మౌ" ననె దాసు; మృగాక్షి పల్కె ని "ట్లందియు నందరాని దగు నందమె విం దొసఁగున్ గదా సఖా!"
అమిత్ షా ఉవాచ:
రిప్లయితొలగించండి"అంధులందరు జూడగ బంధులైరి
నందులును పందులెల్లరు మందు త్రాగి
కంది పోయిన మోముతో చిందు లాడ...
అంది యందని యందమే విందొసంగు" :)
అమితానందకరమ్ము పద్యమిది సత్యంబిద్ది ముమ్మాటికిన్ !
తొలగించండిశాస్త్రి గారూ నమోనమః.. 🙏
...మైలవరపు మురళీకృష్ణ
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికందెనట మోము చెప్పగ కన్నులార
యంది యందని యందమే విందొసంగు!
పందె ములనొడ్డి చూసిరి భామ లనట
యంది నన్ మేలగున యని యవ్వనులట !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కన్నులార। నంది యందని...' అనండి.
విరిసి విరియని మమతలు వేన వేలు
రిప్లయితొలగించండితెలిసి తెలియని ప్రేమకే విలువ మిన్న
కనులు కన్నులు కలసిన కలత పడగ
అంది యందని యందమే విందొ సంగు
అతి మధురం
తొలగించండి🙏
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపందియముల్ జిలేబులన, భామల జూచుచు చేసి రంటనే
నందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా? సఖా
సందియ మేల నందినను నందక పోయిన నా లలామలే
డెందపు సేద దీర్చు దురు, డెప్పకు డెప్పకు నన్ను మిత్రమా !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సందియమేల యందినను...' అనండి.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండి"అంది యందని యందమే విందొసంగు"
ననుచు ముందున్న యందము నరయకుంద్రు
తప్పటడుగది యా "దేవదాసు"దారి
నెన్న నందవు తృప్తియె సున్న యగును
👏👏👏
తొలగించండిసత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు మురళీకృష్ణ
రిప్లయితొలగించండిఅందమనంగ వస్తువులనన్నిట దోచుచునున్న బ్రహ్మమే
యందము ! శాశ్వతమ్మది ! మహాత్ములు గాంచిరి ! ద్వైతదృష్టితో
పొంద లభింపబోదు , పరిపూర్ణత గల్గిన దక్కు , నట్టిదౌ
యందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిడా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిబందివి నీవు ప్రస్తుతపు బాటను జూడుము కష్ట పుంజముల్
ముందర నెన్నొ యుండు నట మూర్ఛయె మేలనిపించు నాగతం
బందదు, పొందు యందమునె పాడిగ నమ్ముము గాని తప్పిదే
"అందియు నందరానిదగు నందమె విదొసగున్"గదా, సఖా!
(నేటి యువత "నేను నిన్ను ప్రేమించడం లే"దన్నా ఆ యువతిని వెంబడించి యాసిడ్ దాడులకు పాల్పడుచున్న నేపథ్యంలో విజ్ఞులు వారికివ్వ వలసిన సలహా నూహించి;)
సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పొందు మందమునె' అనండి.
రాధ తలపు
రిప్లయితొలగించండినందనందన!గోపాల!నళిన నేత్ర!
లీలగానిట్లు దోబూచు లేలనోయి?
జాలిఁజూపుము బేలను జాలమేల
నంది యందని యందమే విందొసంగు
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండితే: చెలి తనంత తానె దరికి చేర చులక
రిప్లయితొలగించండినౌను. దాచిన యందమే యనవరతము
మోజు కలిగించు ప్రియునకు, పుడమిపైన
నంది యందని యందమే విందొసంగు
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(తీర్థయాత్రాపరుడైన అర్జునుడు ద్వారకానగరంలో మిత్రుడు మైత్రేయునితో)
రిప్లయితొలగించండిచందురకావిపావడ పసందుగ దాల్చిన సుందరాంగి;సత్
చందమునందు సందడిలు సాహితిబోలిన కోమలాంగి;గో
విందుని ముద్దుచెల్లెలగు విశ్వమనోజ్ఞ సుభద్రకన్యదౌ
అందియు నందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా!
రెండవపాదంలో "ఛందము"అని చదువమనవి.
తొలగించండిబాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
నమస్సులండీ!
తొలగించండిఅంది వచ్చిన సులువుగ నలుసె గాని
రిప్లయితొలగించండిసుంత యానంద మీయదు సుఖము లేదు
యవధి మీరిన స్వేచ్ఛయు అందగించ
దంది యందని యందమే విందొసంగు.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లేదు + అవధి' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. 'సుఖము దొరుక। దవధి మీరిన..' అందామా?
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
"అంది యందని యందమే విం దొసంగు"
సందర్భము: అంద మే నందము.. అనగా మేను అందము.. అందగా.. అని.
మేను అందము.. అంటే శారీరకమైన సౌందర్యం అని. అది అందుకోగలిగిన వాడు ఎప్పుడో ఒకసారి "ఇంతేనా!" అనుకొని తీరుతాడు. అనగా నిర్లక్ష్యం చేస్తాడు. ఎందుకంటే ఇంద్రియాలకు తృప్తి చెందే లక్షణం ఎప్పుడూ లేదు కదా!
శరీర సౌందర్యం ఒకసారి అందినట్టే వుండి అందకుండా పోతూ వుంటే దీని తీ రింతే అని తెలుసుకోగలిగి ఆత్మ సౌందర్యం వైపు క్రమంగా ఆకర్షింపబడుతాడు. అదే క్రమ పరిణామంలో మానవు డెదుగవలసిన విధానం. అందుకే గోపికలకు కృష్ణుడు వియోగాన్ని కల్పిస్తాడు.
అందుతున్న ఆత్మ సౌందర్యమే జీవునికి నిజమైన విందు చేస్తుంది. అదే ఆత్మానందం.
ఒకసారి ఆ విందులో రుచి మరిగితే తక్కిన రుచు లన్నీ ఇక ఆనవు. క్రిందకు వెళిపోతాయి. భౌతిక సౌందర్యాలు బంధించలేకపోతాయి.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
అంద మే నంద "మింతెనా!" యందు; రంది
యందనపు డాత్మ సౌందర్య మందుకొందు;
రదియె యిచ్చు నాత్మానంద మన్న విందు..
"నంది యందని యందమే విం దొసంగు"
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి["ప్రేయసీ! నీవు నాకు అందినను, నీదు తండ్రిమాత్రము నిన్ను నాకు అందనీయుట లేదు! నేను నిన్నెట్టుల నందుకొనఁగలను సఖీ?" యనిన ప్రియునితోఁ బ్రియురాలు "ప్రియా! యందినట్టి యీ నా చేయి నందుకొని, పెండ్లాడినచో, నీ యందియు నందరానిదగు నందమె యందఱకుఁ గనువిందొనర్చును గదా సఖా! కావున, నా పెద్దలఁగూర్చి యాలోచింపక, రుక్మిణినిం గృష్ణుఁడు చేపట్టినట్టుల నన్నుఁ జేపట్టుము! హాయిగ నానందముగ జీవించునట్టి మననుం జూచి, యందఱును నానందమందఁగలరు!" అని ప్రేయసి, ప్రియునకు సలహా నొసఁగిన సందర్భము]
"అందితి వీవు! కాని, నిను నందఁగనీయఁడు నీదు తండ్రియే!
యందియు నందరాని నిను నందుకొనంగను నెట్టులే సఖీ!"
"యందిన నాదు చెట్టఁ గొని, యందఱకుం గనువిందు సేయ, నీ
యందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా!"
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండిరేపును తలచు నేడది గడుచు రేపు నేడై
రిప్లయితొలగించండిమనసది కలచు
దూరమునదె ఆర్తిగ పిలుచు సంగతిని
నీవొల్లక నడుచు
కలలవి కనుము వేయి తలలుగ నిజమవి
కావుగ భిన్న ముఖా
అందియు నందరానిదగు నందమె విందొసగున్
గదా సఖా
తొలగించండిఎట్టెబ్బోడా
ఈ వాక్యానికి అర్థ మే మి ?
దూరమునదె ఆర్తిగ పిలుచు సంగతిని
నీవొల్లక నడుచు
అనగా నేమి ?
జిలేబి
తొలగించండికొంతవరకు కిట్టింపు :)
తొందర దేల రేపటికి తొంగలి దాని జిలుంగు దానిదే!
కొందలమేల నో మదిని కోరిక తీరక బోవ మిత్రమా!
డెందము బోవ స్వప్నమున డీనపు కైపుల నిక్కమయ్యెనో
నందియు నందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా!
జిలేబి
__/\__
తొలగించండితే.గీ.
రిప్లయితొలగించండిసినిమ తెరమీద నాయిక చిత్రమెంత
యందముగనుండి మనసుకు హాయి గొల్పు
చేత స్పృశించ బోవగ చిక్కదంట
యంది యందని యందమె విందొసంంగు
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్పృశించ... అన్నచోట గణదోషం. 'స్పృశియింప బోవగ' అనండి.
రిప్లయితొలగించండిమా అయ్యరు గారి పల్కు :)
ముద్దు లొల్కు జిలేబిని మొగదలగని
యంది యందని యందమే విందొసంగు
నో యని మధనపడి తాళినొకపరి ముడి
వెట్టి దరిజేర్చి జూడ గుభిల్లె మదియు :)
జిలేబి
అయ్యరో పాపం
తొలగించండి👏👏👏
తొలగించండిపాపం పసివాడు :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిఆఖరుకు అయ్యరు గారిని పూరణలోకి లాక్కొచ్చారు. బాగుంది. మీకు, అయ్యరు గారికి అభినందనలు.
அய்யர் சாமீ வணக்கஂ!
ఆకసంబు న జాబిలి యం ద మగును
రిప్లయితొలగించండిదరి కి జేరి యు పరికింప వర లు చుండు
రాళ్ళు ర ప్పలుగా న ద్ది ర హి తొ లం గి
అంది యందని యందమే విందొ సంగు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2686
సమస్య :: అందియు నందరాని దగు నందమె విందొసగున్ గదా సఖా!
సందర్భము :: ధ్వన్యాలోకము అనే గ్రంధంలో కవిత్వం ఎలా ఉండాలి? అనే విషయం గుఱించి చెబుతూ
‘’ నో ఘూర్జరీ స్తన ఇవాతితరాం నిగూఢః
నాంధ్రీ పయోధర ఇవాతితరాం ప్రకాశః।
అర్థం గిరా మపిహితః పిహితశ్చ కశ్చిత్
సౌభాగ్యమేతి మరహట్ట వధూ కుచాభః।।
అని వర్ణించియున్నారు. పై శ్లోకానికి అనువాద పద్య మన్నట్లు
ఘనతర ఘూర్జరీ కుచయుగక్రియ గూఢము గాక, ద్రావిడీ
స్తన గతిఁ దేట గాక, యరచాటగు నాంధ్రవధూటి చొక్కపుం
జనుగవ బోలి గూఢమును చాటుదనంబును గాక యుండఁ జె
ప్పిన యదిపో కవిత్వ మనిపించు, నగిం చటుగాక యుండినన్.
అని అంటూ కవిత్వం ఎలా ఉండాలి అనే విషయాన్ని పూర్వ కవి ఒకరు విశదీకరించి యున్నారు. కాబట్టి అందీ అందని అందమే (కావ్యార్థమే)విందును చేకూరుస్తుంది అని వివరించే సందర్భం.
అందము ఘూర్జరీ స్తనము లట్లు నిగూఢము గాక, పూర్తిగా
నందము నారబోయు ద్రవిడాంగన సుస్తన రీతి గాక, మా
కంద లతాంతరస్థమగు కాయ వలెన్, కనిపించనట్లుగా
ముందుగ కొంత కన్పడెడి ముగ్ధతరాంధ్ర వధూటి సుస్తనం
బంద; మిటుల్ గనన్ మెఱుపు నౌచు తళుక్కున దోచు కైత దా
*నందియు నందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా!*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (24-5-2018)
అవధాని గారి పూరణ అద్భుతంగా ఉన్నది! సమస్యా పాదము చూడగానే నాకు ఘనతర ఘూర్జరీ కుచ పద్యం గుర్తువచ్చింది! 🙏🙏🙏🙏
తొలగించండి💐👍👌💐
తొలగించండిబైచరాజు వేంకటనాథుడిదీ పద్యము.(ఘనతర ఘూర్జరీ....)
తొలగించండిఇవ్వాళ కోట వారు డబల్ సిక్సరే ! వాహ్ వాహ్ ! దీనికి గళమూ వుందాండీ ?
జిలేబి
నిజమేనండీ. నమో నమః. గూగుల్ లో అల్లసాని వారి పద్యమని కూడా తెలిపియున్నారండీ.
తొలగించండిసహృదయులు జిలేబి గారూ! హృదయపూర్వక ప్రణామాలండీ. నాపై మీకు గల అభిమానమునకు ధన్యవాదాలండీ. ప్రతిరోజూ వాట్స్ యాప్ లో నా పద్యానికి గళమును అందజేస్తున్నానండీ. బ్లాగులో ఆడియో పెట్టడం నాకు తెలియదండీ. కోట రాజశేఖర్
తొలగించండిరాజశేఖర్ గారూ,
తొలగించండిమనోహరమైన పూరణ. అభినందనలు.
**************
జిలేబీ గారూ,
బ్లాగులో ఆడియో ఫైల్ పెట్టే టెక్నిక్ ఉంటే తెలియజేయండి.
వింది కన్నియ రమ్మన విందు జేయ
రిప్లయితొలగించండిఅంది నమ్మగ నాధుడే నంద గాడె
బంది నవ్వగ కోరిన బంధ మేగ
అంది యందని యందమే విందొసంగు
వరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వింది' అన్నది వ్యావహారికం.
చట్టసభన బలిమిలేక సడలు పదవి
రిప్లయితొలగించండిఅంది యందని యందమే విందొసంగు
ప్రత్యర్థి సభికులకెపుడు, వారు జరుపు
వేడుకలరీతి కనులకు విందొసంగు
అందమే=విధమే
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రత్యర్థి' అన్నచోట గణదోషం. సవరించండి.
🙏🏽
తొలగించండి
రిప్లయితొలగించండికనుల ముందర గన్పట్టు కన్యకన్న
కలల సుందరి యెంతయో కమ్మగుండు
నంది యందని యందమే విందొసంగు
చేతికందిన దంతయు చేదుగుండు!
నిజం!💐💐👍👌💐💐
తొలగించండిదూరపుకొంండలు నునుపు...
తొలగించండిధన్యవాదములు జనార్ధనరావు గారు, మల్లేశ్వర్ గారూ!🙏🙏🙏
తొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాలబుగ్గల పసివాడి పసిడి పలుకు
రిప్లయితొలగించండిపల్లవించిన నవ పల్లవంపు సొగసు
చేతి కందక నూరించు చిగురు బోడి
యంది యందని యందమె విందు సేయు
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య :-
రిప్లయితొలగించండి"అంది యందని యందమే విందొసంగు"
*తే.గీ**
తళుకులీనెడి నాకాశ తారలన్ని
రాత్రి వేళన మురిపించు,రమ్యపరచు
దరికి జేరగ భస్మమౌ తనువు, జూడ
అంది యందని యందమే విందొసంగు
... ...............✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తళుకు లీనెడి యాకాశ...' అనండి.
తెలిసి దెలియని బాల్యమే తీపియొసగు
రిప్లయితొలగించండివిరిసి విరియని పూవులె హరుసమిడును
అంది యందని యందమె విందొసంగు
ననుచు దెల్పెను జగతికి మనసుకవియె!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అందిన నన్ని యందముల నందుల పొందిన దెల్ల మృగ్యమే,
రిప్లయితొలగించండిఅందని వైన నందముల నందుకొనన్ వలె నన్న దుగ్ధయే,
యందము లక్ష్యమై నపుడె యయ్యెడ నిట్లగు, లేక శూన్యమే,
యందియు నందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా!.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అందియందనియందమేవిందొసంగు
రిప్లయితొలగించండినక్షరాలనిజముగదయదియమనకు
నందనటువంటిద్రాక్షకైయాశపడుట
నైజమేగదధరణినినరులకార్య!
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,
ప్రేయసీ ప్రియుల శృంగార సంభాషణ :--
........... ............ ........... .............
సుందర మైన నీ మొగము జూచిన యంతనె సిగ్గుచెందుచున్ ,
జందురు డేగె తా మొగులు చాటున కంచు , ముసుంగు దాల్చితే
సుందరి | తీసివేయు మిక | జుంబన మెట్టు లొనర్తునే సఖీ ?
................................................................................................
అందియు నందరాని దగు నందమె విందొసగున్ సఖా !
తొందర యేల నా సొగసు దోచగ నో దొర ? తాలు మించుకన్ |
ముందుగ బెండ్లి కావలయు | నా సొబ గంతయు నారబోయుచున్
విం దొనగూర్చెద | న్నిటుల వేగిర పాటును పొంద నేటికన్ ?
గురుమూర్తి గారూ,
తొలగించండిమనోహరమైన పూరణ. అభినందనలు.
ఈ రోజు శంకరాభరణం సమస్యకు
రిప్లయితొలగించండినా రెండవ పూరణ. సమస్య చివరి పాదం లో
అందము లందు నెన్న దగు నందము మోక్షమె లక్ష్యమై, సదా
నందముఁ గల్గుఁ గాక, ధర నందము లన్నియు తత్క్షణమ్మె, గో
విందుని పొందు గోరుటయె విందులు భోగ్యము లౌను గాని, "యే
యందియు నందరాని దగు నందమె విందొసగున్," గదా సఖా!
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తేటగీతి
రిప్లయితొలగించండికుందనపు బొమ్మగఁ గనుల విందొనరఁగ
వెంటబడుచుఁ బెళ్లాడెను వెర్రివాడు
మోముఁ దొలఁగఁ బూత కలికి భూతమయ్యె
నంది యందని యందమే విందొసంగు!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కన్ను మీటుచు కవ్వించు కలికి జేర
రిప్లయితొలగించండిసిగ్గు లొలికించి దరితాను జేరనీక
దూరముంచుచు మురిపించు నీరజాక్షి
యంది యందని యందమే విందొసంగు
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముందర పెండ్లిచేసికొనుమోయి ప్రియా తదనంతరమ్మునన్
రిప్లయితొలగించండిసుందరమైననీదు చెలి సొంపులనన్నియు చూడవచ్చురా
తొందరవద్దు నిగ్రహముతోడ మెలంగుము కోపమేలరా
యందియు నందరానిదగు నందమె విందొసఁగున్ సఖా
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చందురు వంటి మోముగల చక్కని చిన్నది యేక వేళయన్
రిప్లయితొలగించండిసుందరి గాంచి మొహమున సోలిన సేతు పతిన్ మరల్పనే
చందము బల్కె మిత్రుడిటు చాలును తాపము లోకముందున
న్నందియు నందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా
అకట భూపుత్రి మనసీయ దనుచు వగచు
రిప్లయితొలగించండిరావణుని గాంచి పలికెను రాక్షసుండు
నైన మిత్రుండు, వసుధలో నబ్బురముగ
నంది యందని యందమే విందొసంగు
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మొదటి పాదం చివర 'ఏకవీర యన్' అని ఉండాలనుకుంటాను.
సుందరంపు రజత భర్మ కందుకమ్ము
రిప్లయితొలగించండిమంద వాయు చలిత మేఘ మందలమ్ము
నిందు నందున్న నందఁడు చందురుండు
నంది యందని యందమే విందొసంగు
సందె జపంబు మాని కను స్వప్నము నిచ్చలు నంద మందగన్
మందుఁడు తూఁగు నూహల విమానము నందున మందహాసుఁడై
చిందులు వేయు హర్షమునఁ జెప్పఁగ జోస్యుఁడు జాతకమ్మునే
యందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.
తొలగించండిఅందల మందుజేరి యట అద్భుత వెన్నెల కాంతులీనెడిన్
రిప్లయితొలగించండిజందురు డందగాడనుచు సత్కవు లెల్లరు జెప్పినంత నే
నందిన గ్రంథముల్ జదువ నచ్చట కొండలు బండరాలనన్
నందియు నందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పైట చెదరిన వేళన పరువము మది
తొలగించండిలాగు సూదంటు రాయిలా లలితముగను
కొంగు తొలగించి చూపినన్ గోమలాంగి
వెగటు బుట్టు నిజముగాదె విమల మతికి
యంది యందని యందమె విందొసంగు
విరించి గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
అందియునందరానిదగునందమె విందొసగున్గదాసఖా
రిప్లయితొలగించండియందము జూడగామనము హర్షమునొందుచుజూరగొందుమా
యందమునందరానిదయి యారడివెట్టినవిందులేవియు
న్బొందకజీవితంబికనుమోడునువారినయట్లయుండుసూ
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సుందరి! నీదు రూపుఁగని చొక్కుచు నుంటి. తపమ్ము మాన్పుమా!
రిప్లయితొలగించండియందగఁజేసి నీసొగసు హర్షముతో దరిఁజేరి యిచ్చతో
తొందర కూడదయ్య విను. దూరము తప్పదు కొంతకాల మీ
యందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా!
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పొందిక యైనదౌ సతిని, పొందియు
రిప్లయితొలగించండిచక్కని పుత్రపుత్రికల్
బంధువు లెల్ల మెచ్చగను బంగళ, కారును, సెల్లుఫోనుల
న్నందియు, నందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా!
సందియ మెందుకోయి పర సంపద
మిన్నగు నెల్లవారికిన్!
పొరుగింటి పుల్లకూర రుచి!
• బందుగు లెల్ల!
తొలగించండిసుందర మైన కావ్యమన జూడగ మెండగు వర్ణనల్లటన్
తొలగించండిసందడి జేసినన్నదియె సత్కృతి కాదనెఱంగుమో ప్రియా!
యందును మర్మగర్భమున హాస్యము నీతిపరోక్షమై సదా
యందియు యందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*************
విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వర్ణనల్ + అటన్' అన్నపుడు ద్విత్వలకారం రాదు.
విజయుడి తిరస్కారముతో భంగ పడిన ఊర్వసి మనోగతము :
రిప్లయితొలగించండి****))((****
అంది వచ్చిన వారల పొందు చేదు
యంద రాని దాని పయిన నాదరమ్ము
పెరటి చెట్టు మందది యేమొ ప్రియము కాదె
యంది యందని యందమె విందొసంగు
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చేదు + అందరాని' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.
సిగ్గుల సింగారి సిరిమల్లె జడయందు
రిప్లయితొలగించండిగంధబంధాలట చిందులేయ!
చూడవచ్చినవారి చూపులకందిరి
అందాలహరివిల్లు చందమట్లు!
పాటమాటలువిన పాడిగాదనియెంచి
ఊహలనుయ్యాలలూగియాగి
నవ్వులురానీక కవ్వింతలణగించ?
పళ్లెమందునపళ్లు బలుకకున్న
అందియందని యందమేవిందొసంగు
కందిపోనట్టి కన్యపసందురూపు
వరునివయ్యారమందున వలపురేప?
పెళ్లిచూపులునిలచె నాకళ్లముందు!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(Tom speaking about Jerry)
పొందుగ కల్గు వెల్పలగ పోరును కాచుచు వేచియుండగా
సందడి లేకయే వెనుక చట్టున తోకను పీకుచుండి పల్
సుందర రూపుడై మెలగి చుప్పుగ గుమ్మని పారిపోయి నా
కందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిటామ్ అండ్ జెర్రీల ప్రస్తావనతో మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
స్వగతం:
రిప్లయితొలగించండి(డా. విష్ణు నందన్ డిసెంబర్ 16, 2010 10:10 AM
"శరణం పండిత మానసాపహరణం శశ్వద్యశః కారణం
నటదంగీకృత వాగ్విలాస చరణం నానార్థ సంపూరణం
చరదత్యద్భుత సత్కవీశ్వర గణం సాలంబనం ' శంకరా
భరణం ' నిత్యమహం స్మరామి కలవాణీ దివ్య సింహాసనం!!!")
ఇందొక ప్రాసదోషమన యిందొక దుష్ట సమాసమోయనన్
క్రిందను మీదనున్ పడుచు క్రీడగ నేర్చుచు పద్యవిద్యనున్
కందము వ్రాయలేకనిట కందివరేణ్యుని జాలినొందు నా
కందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా!
http://kandishankaraiah.blogspot.in/2010/12/170.html?m=1
సార్:
తొలగించండిమీరు నన్ను అపార్థం చేసుకున్నారు. శంకరాభరణం గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని విష్ణునందన్ గారి శ్లోకాన్ని quote చేశాను. అంతకు మించి మరేమీ దురుద్దేశం లేదు.
🙏
__/\__
తొలగించండికర్మ లొనరించ నీ కధికార ముండు
రిప్లయితొలగించండినెన్న డైన ఫలము లందు సున్న సుమ్ము
కాకు వాటి ఫలములకు కారణమ్ము
నుంచకు మకర్మ లందాస కొంచ మైన.......శ్రీకృష్ణ. సూ.సుధా. 2.47.
మూలము:
కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగో౽ స్త్వకర్మణి ||......శ్రీమద్భగ. 2.47.
NAMASKARAMU KAMESWARA RAO GARU GEETANUVADAMU AMOGHAMU
తొలగించండిసూర్య కుమార్ గారు నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండి__/\__
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇందును నందునుం గలుగు నెందుకు సందియ మిందు నుండు వా
రిప్లయితొలగించండిడందు గలండొ లేడొ యని యందరి డెందము లందు నుండు నా
యిందిర యందగాడు గమనించుము పొందియు పొందలేని వా
డందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా.
వృత్యనుప్రాసతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది! అభినందనలు మిస్సన్నగారూ!🙏🙏🙏🙏
తొలగించండిధన్యవాదాలు సీతా దేవి గారూ.
తొలగించండిమిస్సన్న గారూ,
తొలగించండిఆలంకారిక రచనలో మిస్ కాని మిస్సన్నలు మీరు. మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
గురువు గారికి నమస్కారములు.
తొలగించండిసందియ మొక్కటిన్ గలదు సాంబుని దేహపు టర్థభాగమున్
రిప్లయితొలగించండిబొందితి వెట్లొ జెప్పగదె పుష్కరనాభ సదా శివార్చనల్
విందగు మానసంబునకు వీడెను మన్మధు చేష్టితంబుచే
నందియు నందరానిదగు నందమె విందొసగున్ కదా సఖా
రవికిరణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సందియ మొక్కటే గలదు...' అనండి.
గందర గోళమౌ నుడుల గాఢపుటూహల మేళవింపుగా
రిప్లయితొలగించండిచిందర వందరై చపల చిత్తపు వ్రాతల చీదరింపుగా
తొందర మీరగా మదిని తోచిన రీతిని వ్రాయుపద్యముల్
సందడి జేయగా తుదకు సత్కవితామయ కావ్యమందునన్
నందియు నందరానిదగు నందమె విందొసగున్ సఖా!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏🙏
తొలగించండినాల్గవ పాదం చివరలో
తొలగించండిసత్కవితామయ కావ్యకన్యదౌ
యని చదువ ప్రార్ధన!
చిందులాడెను బాలిక చిలిపిగాను
రిప్లయితొలగించండిఅందమైన నాట్యమలరె నభినయమ్ము
కన్ను పలుకు కావ్యములెన్నొ కాలి నొదుగు
అందియం దని యందమే విందొసంగు ౹౹
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సింహము వనిలో కట్టెనా చీర నెపుడు,
రిప్లయితొలగించండిఒంటె దాల్చదెడారిలో ఓణి నెపుడు,
కుక్క తీయదు జుట్టులో చిక్కు నెపుడు,
మేక పూయునా గంధంబు మెడకు చుట్టు,
కోతి కప్పునా చనులపై కూసమెపుడు,
బాతు ముఖముపై పులుమునా భస్మ మెపుడు,
నెమలి కాటుక దాల్చదే నేత్రములకు,
కల్పనమ్మది,కలుగదు కామ వాంఛ
దిసమొ లను కాంచి నా ప్రతి దినము, నరులు
చూడ గోరుదు రెప్పుడు సుద్యు పాస్య
నగ్న దేహంబు నంతయు , సెగ్గు గలుగు,
రోజు జూచినంత తొలగు మోజు కొన్ని
నాళ్ళ లోన. సత్యమిది యే నమ్మ వలయు
గుప్పెటను మూసియుంచిన గుట్టు గలుగు
మూసి యుంచిన దేదియు పాసి పోదు
అంది యందని యందమే విందొసంగు
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిఅబ్బో... పెద్ద పట్టికనే ఇచ్చారే! బాగుంది మీ పూరణ. అభినందనలు.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
అందియు నందరాని దగు నందమె
విందొసఁగున్ గదా సఖా!
సందర్భము: శ్రీ రంగం సమీపంలో ధనుర్దాసు ఒక మల్ల యుద్ధ విశారదు డుండే వాడు. ఆతని ప్రేయసి హేమాంగి. ఆమె కన్ను లెంతో అందమైనవి.
కావేరీ తీరాన శ్రీ రంగనాథునికి వైభవంగా తిరుమంజన మహోత్సవం జరుగుతున్నది. సౌంద ర్యారాధకుడైన ధనుర్దాసు హేమాంగి కన్నులు వాడిపోతా యేమో నని ఎవ రే మనుకున్నా లెక్కచేయక ఆమె పక్కనే నడుస్తూ ఆమెకు గొడుగు పట్ట సాగాడు.
శిష్యులతో కలిసి వెళుతున్న శ్రీమద్రామానుజుల వారు శిష్యుల నడిగి యతని విషయం తెలుసుకొని తన వద్దకు పిలిపించుకున్నాడు. అడిగినాడు. "ఎవ రే మనుకుంటే నా కేం?" అన్నా డతడు. "ఇంతకన్న అందమైన కండ్లు చూపిస్తాను సాయంత్రం వస్తావా!" అన్నారు స్వామి వారు.
"ఇంతకన్న అందమైన కండ్లీ లోకంలోనే వుండవు. ఉంటే నేను వాటికి జీవితాంతం దాసు ణ్ణవుతా" అన్నాడు ధనుర్దాసు.
సాయంత్రం రంగనాథుని స్మరించి పవిత్ర కమండ లూదకంతో స్వామివా రాతని కన్నులను తుడిచారు.అతనికి శ్రీ హరి నేత్ర కమలాలు దర్శన మయ్యాయి. ఆనంద బాష్పా లాగలేదు. అతని మోహ మంతా నశించిపోయింది. స్వామివారికి పాదాక్రాంతుడై దాసుడై పరమ భాగవతోత్తము డైనాడు.
"నీ కన్నులకంటె కోటి రె ట్లందమైనవి నారాయణుని నయన పద్మము" లన్నాడు దాసు. ఆతని ప్రేయసి "అందీ అందని అందమే విందు గూర్చును సుమా!" అన్నది.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
"అందముఁ జిందు నీ కనులె
యన్నిటి కన్నను మిన్న యంచు నే
నెందుకొ భ్రాంతిఁ జెందితిఁ గదే!
హరి నేత్ర సరోజ శోభ యే
మందును? కోటి రె ట్లధిక
మౌ" ననె దాసు; మృగాక్షి పల్కె ని
"ట్లందియు నందరాని దగు
నందమె విం దొసఁగున్ గదా సఖా!"
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
👌👏🙏🙏🙏
తొలగించండికంజకంజదళాక్షులగనక కాగల భక్తులు భూమినుందురే
డా. వెలుదండ వారూ,
తొలగించండిధనుర్దాసు ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి1.నిండు జాబిల్లి యగుపించు నింగియందు
తాకి ముద్దాడు నంతటి తపన కలుగు
అందు కొనగలేమనిదెల్సి నప్పటికిని
అంది యందని యందమే విందొసంగు
2.వస్తువైనను వెలచల వలువలైన
మనము తెచ్చుకొన్నవెపుడు మదికి తృప్తి
నీయక పరుల చెంతవి యున్న నిష్టమగును
అంది యందని యందమే విందొసంగు.
3.హద్దులందున్న నేదైన ముద్దగునిల
హద్దు దాటిచరింపగ హాని కలుగు
ననెడు పెద్దల మాటల నాలకించు
మంది యందని యందమే విందొసంగు
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఉత్పలమాల
రిప్లయితొలగించండిఅందము చందమున్ గలిసి యౌవన శోభల వెల్గు సుందరీ!
సందిట జేర్చినిన్ను మెడ సందున ముద్దిడ బోవ జారుచున్
యందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా!
ముందర పెళ్లి వేదిపయి ముచ్చట దీరఁగ జూడమందువే!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
.డెందెము చిక్కె నీపయిన ఢీకొని ముద్దుల నాడగా తమిన్
రిప్లయితొలగించండిగొందలమున్నిటన్ కలిగెకూరిమి హెచ్చుచు నుండ వచ్చితిన్
సుందరియైన నేనిపుడు సోయగ మెల్లను కాన్కగా నిడన్
అందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా
5.మందముగాను వీచెనిట మారుత మాతని జూడగా మనం
బందున కల్గె కూరిమియు నత్యధికంబుగ చూడగా నిదు
ల్లంబునకింకతాపమువిలాపము హెచ్చెను ముద్దిడంగనా
కందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా"
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.
మీ పద్యాలపై నా సమీక్షను వాట్సప్‍లో చూడండి.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివిరిసి విరియని పుష్పమ్మె పరవశమిడు
తెలిసి తెలియని డెందమె నలిని పెంచు
పిఱుదులను దాటి దాటని వేణి మెఱయు
అంది యందని యందమే విందొసంగు
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వందల కుక్కలన్ కులుకు పావుర జంటల వీధివీధినిన్
రిప్లయితొలగించండిచందపు బర్రెలన్ కనుచు చందర శేఖర భాగ్యనగ్రినిన్...
పందుల కాకులన్ గనక బారులు తీరెడి గార్దభమమ్ములన్...
అందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా!