గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2674 సమస్య :: *శవమున్ గాల్చెద రాలయమ్మునఁ బ్రజా సంక్షేమమున్ గోరుచున్.* ప్రజల సంక్షేమాన్ని కోరి ఆలయంలో శవాన్ని కాలుస్తారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: దేహో దేవాలయః ప్రోక్తః, జీవో దేవ స్సనాతనః । త్యజే దజ్ఞాన నిర్మాల్యం, సోఽహంభావేన పూజయేత్ ।। ఉపనిషత్తులలో చెప్పబడిన ఈ శ్లోకాన్ని అనుసరించి రాజర్షులైన ఇక్ష్వాకువు జనకుడు అంబరీషుడు మొదలైనవారు ఈ దేహమే దేవాలయము, ఈ జీవుడే దేవుడు అని భావించి, సోఽహంభావాన్ని కలిగియుండి, అజ్ఞానమనే నిర్మాల్యమును వదలివేసి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనే అరిషడ్వర్గాన్ని ఈ దేహమనే దేవాలయంలో కాల్చివేస్తూ ప్రజల సంక్షేమాన్ని కోరుకొంటూ రాజ్యమును పరిపాలిస్తారు అని విశదీకరించే సందర్భం.
[తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రియగు చంద్రశేఖరుఁడు చండీయాగముం జేయ సమకట్టి, భారతీ తీర్థ స్వామిని రప్పించి, తన ముఖ్యానుయాయుఁడగు కేశవరావుతో దీనినిం గూర్చి ముచ్చటించిన సందర్భము]
కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు నారాణాద్రి ఎక్స్‌ప్రెస్‍లో తిరుపతి బయలుదేరుతున్నాను. 11, 12, 13 తేదీలలో తిరుపతిలో ఆముదాల మురళి గారి శతావధానంలో పాల్గొని 13 రాత్రి శబరి ఎక్స్‌ప్రెస్‍లో తిరుగు ప్రయాణం. దారిలో కాని, తిరుపతిలో కాని ఎవరైనా మిత్రులు కలుస్తారా?
సందర్భము: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన నల్లమల అటవీ ప్రాంతంలో *మద్ది మడుగు* అనే పుణ్య క్షేత్రంలో ఆంజనేయ స్వామి వెలసినాడు. గిరిజనులకు ఆటవికులకు ఆరాధ్య దైవమై నిలిచినాడు. స్వామిని *పబ్బతి ఆంజనేయ స్వామి* అని ఇక్కడ పిలుస్తారు. 'పబ్బతి' అంటే 'ప్రపత్తి' అని అర్థం. హనుమత్ క్షేత్రాలలో ఎక్కడా లేని విశేషం ఒకటి అక్కడ కనిపిస్తుంది. అ దేమంటే ఆలయ ప్రాంగణంలో అహోరాత్రాలు ఏండ్ల తరబడి ప్రజ్వరిల్లుతున్న అగ్ని కుండం. దానిని *రావణ కాష్ఠం* అంటారు. రావణాసురుడు కాల్చివేయ బడుతున్నట్లుగా భావిస్తారు. రజ స్తమో గుణాలు ప్రతిక్షణం దహింపబడుతూనే వుండా లన్న సంకేతం అందులో వుంది. స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళిన భక్తులకు అంగళ్ళలో కొంచెం నూనె, కొన్ని సమిథలు, కొబ్బరి కుడుకలు స్వల్పధరకు లభిస్తాయి. వాటిని వారు అగ్ని కుండంలో నిక్షిప్తం చేస్తారు. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~ పవమా నాత్మభవుండు మద్దిమడు గన్ భద్రస్థలిన్ నిల్వగా నవిరామంబుగఁ బ్రజ్వలించును గదా య య్యగ్ని కుండమ్ము! "లం క విభుం గాష్ఠ" మి దంచుఁ బల్కుదు, రదే కన్పట్టు నీ కైవడిన్... "శవముం గాల్చెద రాలయమ్మునఁ బ్రజా సంక్షేమముం గోరుచున్"
కామ మోహము క్రోధము కల్ల యనుచు
రిప్లయితొలగించండిరామ నామమె హృదికిక రమ్యమనుచు
పరువు గౌరవ మనబడు ప్రల్లదనపు
శవముఁ గాల్చెదరు గుడిలో శివముఁ గోరి
ప్రల్లదనము = అహంకారము
"అహమినాశ భాజ్యహ మహంతయా
తొలగించండిస్ఫురతి హృత్స్వయం పరమ పూర్ణ సత్"
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిప్రల్లదనపు శవాన్ని కాల్చడమన్న భావంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మసన మందున శివుడుండు మలుగు జగతి
రిప్లయితొలగించండిశుభ మటంచును కర్మల కభయ మిడగ
తిలల తర్పణ మొదులుచు తృప్తి జెంది
శవముఁ గాల్చెదరు గుడిలో శివముఁ గోరి
అక్కయ్యా,
తొలగించండిపై మూడు పాదాలకు సమస్య పాదానికి సంబంధం? సమస్య సమర్థంగా పరిష్కారమైనట్లు లేదు.
'వదలుచు'ను 'ఒదులుచు' అన్నారు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిరాజమరణము అరిష్టము...
నవపుష్పమ్ముల జల్లుచున్ నృపునకున్ నారాయణాఖ్యాతముల్
రవముల్ పల్కుచు , పాడె మోయుచును , జేరంగా శ్మశానస్థలిన్
శవముం గాల్చెద .., రాలయమ్మునఁ బ్రజా సంక్షేమముం గోరుచున్
వివిధార్చావళి నిర్వహింతురు మహోద్విగ్నాంతరంగమ్ములన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ విరుపుతో అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిదహన సంస్కార మొనరింపఁదలచి,పాచి
రిప్లయితొలగించండిశవముఁగాల్చెదరు;గుడిలో శివముఁగోరి
వత్తి వెలిగించి,పూజింత్రు,భక్తితోడ
పుణ్య లోకములనుఁజేరి ముక్తినొంద
ప్రసాద రావు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండికవివర! శివపాడున యిరు గాలు గట్టి
శవముఁ గాల్చెదరు! గుడిలో శివముఁ గోరి
రెండు కాళ్ళు సాచి శివుని రేక రేక
గాను గొల్తురు బేలరి గజరిపువని !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండు కాళ్ళు సాచి కొలవడం?
'శివపాడు'... ఎక్కడ దొరుకుతాయండీ మీకీ విశిష్ట పదాలు?
తొలగించండిసాష్టాంగ దండప్రమాణాలు :)
జిలేబి
పడుగుపాడు లాగ!😀😀😀
తొలగించండి
తొలగించండి:)
కర్టసీ - ఆంధ్రభారతి
:)
జిలేబి
రిప్లయితొలగించండిశివపాడున్గద చేతనమ్ము కలయన్ శీఘ్రంబు శీఘ్రంబు గా
శవముం గాల్చెద రాలయమ్మునఁ బ్రజా సంక్షేమముం గోరుచున్
కవనమ్ముల్ మది నెంచి గీతముల సాకల్యంబు గావింతుర
య్య!విశాలాక్ష! యఘోర ! అంగజహరా యంచున్నినాదమ్ములన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
బంధు మిత్రులు వెంట రా పాడి గొని యు
రిప్లయితొలగించండిరుద్ర భూమి కి గొంపో యి రోదన ము న
శవ ము గాల్ చె ద రు ;గుడిలో శివ ము గోరి
పూజ లొ న రింత్రు భక్తి తో మ్రొక్కు లి డు చు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2674
సమస్య :: *శవమున్ గాల్చెద రాలయమ్మునఁ బ్రజా సంక్షేమమున్ గోరుచున్.*
ప్రజల సంక్షేమాన్ని కోరి ఆలయంలో శవాన్ని కాలుస్తారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: దేహో దేవాలయః ప్రోక్తః, జీవో దేవ స్సనాతనః ।
త్యజే దజ్ఞాన నిర్మాల్యం, సోఽహంభావేన పూజయేత్ ।। ఉపనిషత్తులలో చెప్పబడిన ఈ శ్లోకాన్ని అనుసరించి రాజర్షులైన ఇక్ష్వాకువు జనకుడు అంబరీషుడు మొదలైనవారు ఈ దేహమే దేవాలయము, ఈ జీవుడే దేవుడు అని భావించి, సోఽహంభావాన్ని కలిగియుండి, అజ్ఞానమనే నిర్మాల్యమును వదలివేసి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనే అరిషడ్వర్గాన్ని ఈ దేహమనే దేవాలయంలో కాల్చివేస్తూ ప్రజల సంక్షేమాన్ని కోరుకొంటూ రాజ్యమును పరిపాలిస్తారు అని విశదీకరించే సందర్భం.
దివిజుల్ మెచ్చగ జీవి దేవు డనుచున్, దేహమ్మె దేవాలయ
మ్మవు నంచున్, త్యజియించుచుందు రిల తా మజ్ఞాన నిర్మాల్యమున్
కవులై సోఽహమటంచు రాచతపసుల్ ; కామాదులన్ వారు కే
*శవ ! మున్ గాల్చెద రాలయమ్మునఁ బ్రజా సంక్షేమమున్ గోరుచున్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (10-5-2018)
కోట వారికి నమస్సులు!
తొలగించండినాకును కేశవ అని పూరించవలెనని తోచినది. నేననుకొన్న భావముతోడనే మీరును బూరించినారు. అందుననే నేను కేసీఆర్ కేశవరావుల నాధారముగ జేసికొని పూరించాను.
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు!
సహృదయులు
తొలగించండిశ్రీ మధుసూదన్ గారికి హృదయపూర్వక ప్రణామాలు.
కోట రాజశేఖర్ గారూ,
తొలగించండివిలక్షణమైన విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
గురువర్యులకు హృదయపూర్వక ప్రణామాలు.
తొలగించండిఅద్భుతమైన పూరణ అవధానిగారూ! అభినందనలు! 🙏🙏🙏🙏
తొలగించండిశ్రీమతి సీతాదేవి గారూ!
తొలగించండిహృదయపూర్వక ప్రణామాలండీ.
గాలి పోయిన వెంటనే కట్టు గట్టి
రిప్లయితొలగించండిశవము గాల్చెదరు,గుడిలో శివము గోరి
పిదప శివదర్శనముచేసి పెద్ద లెల్ల
యిళ్ళ కేగి త్రాగునుగద చల్ల నపుడు
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పెద్దలెల్ల। నిళ్ళ కేగి త్రాగెదరట చల్లనపుడు" అనండి. (పెద్దలు బహువచనం, త్రాగును ఏకవచనం).
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రియగు చంద్రశేఖరుఁడు చండీయాగముం జేయ సమకట్టి, భారతీ తీర్థ స్వామిని రప్పించి, తన ముఖ్యానుయాయుఁడగు కేశవరావుతో దీనినిం గూర్చి ముచ్చటించిన సందర్భము]
దవుదౌలన్ గని, చంద్రశేఖరుఁ డిఁకన్, దద్భారతీతీర్థు కం
టె వచశ్శక్తిని మిన్న లేక, కొని, చండీయాగముంజేయఁ, గే
శవరావున్ దరిఁ బిల్చి, తా ననియె "రక్షాప్తిన్ విభేదాలఁ, గే
శవ! మున్ గాల్చెద రాలయమ్మునఁ, బ్రజా సంక్షేమముం గోరుచున్;
భువి నేనిప్పుడు నట్లె సేతునయ; తన్మూర్తిం బ్రతిష్ఠించి, దం
డి వతంసమ్ములఁ బూన్చి, పూజలను చండీయాగమందుం దగన్!"
మధుసూదన్ గారూ,
తొలగించండిసమకాలికాంశంతో విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండిగుంత దీసి పూడ్చెదరుగ కొందఱు భువి,
రిప్లయితొలగించండిమఱియు కొందఱు చితిపేర్చి మంట బెట్టి
శవము గాల్చెదరు ; గుడిలో శివము గోరి
పూజ జేయుదురు జనులు పూనుకొనియు.
జనార్దన రావు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కట కట వృక్ష ఛాయలు తరిగి కాలుష్యమింతింతై
రిప్లయితొలగించండితాను పెరిగె
నాశపు అంచుకు స్వార్థం జరిగి పరమార్ధం మిథ్యగ
జగతిని తరిగె
వాన చినుకు యజ్ఞమన కరువు రక్కసి కడతేర్చి
పిదప తంతుగన్
శవముంగాల్చెద రాలయమ్మున బ్రజా సంక్షేమం
గోరుచున్
గురువు గారికి ఆరోగ్యం ఎలావుందో ?కార్డు పంచి చేయలేదు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు. నా ఆరోగ్యం బాగానే ఉంది.
తొలగించండిమా దగ్గర ఆంజనేయస్వామి దేవాలయానికి భూమి పూజ జరిగింది. ఇంతసేపు అక్కడే ఉన్నాను. అందువల్ల ఆలస్యమయింది.
మత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండి"శవముం గాల్చెద రాలయమ్మునఁ బ్రజాసంక్షేమముం గోరుచున్"
గవివర్యుల్ వచియించు వాక్యమిదియే?కాదందు ముమ్మాటికిన్
వివరమ్మేమన నచ్చు తప్పు దొరలెన్ విఘ్నేశ్వరున్ భక్తిఁ గే
శవ! మున్ గొల్చెద రాలయమ్మునఁ బ్రజాసంక్షేమముం గోరుచున్.
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణను ఏమని ప్రశంసింపను? అత్యద్భుతంగా ఉన్నది. ఇప్పటివరకు మీరు వ్రాసిన వేలకొలది పద్యాలలో ఇది సర్వోత్తమం! సంతోషం! అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండికార్యసిద్ధికై ముందుగా విఘ్నేశ్వరుని అర్చిస్తారని అద్భుతంగా పూరించారు! అభినందనలు! 💐💐💐
తొలగించండిశ్రీమతి సీతాదేవి గారికి ధన్యవాదములు.
తొలగించండికవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఈరోజు నారాణాద్రి ఎక్స్‌ప్రెస్‍లో తిరుపతి బయలుదేరుతున్నాను. 11, 12, 13 తేదీలలో తిరుపతిలో ఆముదాల మురళి గారి శతావధానంలో పాల్గొని 13 రాత్రి శబరి ఎక్స్‌ప్రెస్‍లో తిరుగు ప్రయాణం.
దారిలో కాని, తిరుపతిలో కాని ఎవరైనా మిత్రులు కలుస్తారా?
శుభాభినందనలండీ శంకరయ్య గారూ! ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోగలరు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిఅచ్చు తప్పు లసంపూర్ణ మౌ విధమునఁ
గేశవ! మును గొల్తురు గుడిలో శివమును
గోరి విఘ్నేశు ననిజెప్ప మారె నిట్లు
"శవముఁ గాల్చెదరు గుడిలో శివముఁ గోరి"
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిక్రొత్త బట్టలు పండ్లును గురిని జూసి
దహనమును జేయు ధనికుల దరువు హవన
మనగ నన్ళార్తులౌ వారి మనసు యనెడు
శవము గాల్చెదరు గుడిలొ శివము గోరి
కార్తికంపుఁ బున్నమి నాఁడు కన్ను లదర
రిప్లయితొలగించండిభక్తు లెల్లరు గుమి గూడి పంక్తి కంఠు
నప్పు డింపుగ నాకృతి నొప్పు ప్రతిమ
శవముఁ గాల్చెదరు గుడిలో శివముఁ గోరి
బవర మ్మేఁగు తరిన్ జయంబుఁ ద్రుటి సంపాదింప యాత్రాదు లీ
భువి సాగించు తరిన్ సుఖమ్మరయ సమ్మోదమ్ముగం గాల్తురే
ధ్రువ మీ ధాత్రిని చంద నాగరులు సంతుష్టిన్ సుగంధమ్ము లా
శవముం గాల్చెద రాలయమ్మునఁ బ్రజా సంక్షేమముం గోరుచున్
[ఆశవము = వడి]
మసన మందున మాత్రమే మందిరాగ
రిప్లయితొలగించండిశవముఁ గాల్చెదరు, గుడిలో శివముఁ గోరి
భక్తి యుతముగ గావింతు భవుని గూర్చి
గోత్ర నామాల తోడను నాత్రముగను
శివుని జడలందు దూకుచు జిక్కె నదియె
రిప్లయితొలగించండిశవము; గాల్చెదరు గుడిలో శివము గోరి
గుండ కర్పూరమును గొని దండిగాను
భక్త జనులెల్ల నార్తితో భజన జేసి!
శవము = జలము ( ఆంధ్ర భారతి)
కాటి కాపరుల్ నిత్యము కాష్ట మందు
రిప్లయితొలగించండిశవముఁ గాల్చెదరు, గుడిలో శివముఁ గోరి
వినయ పూర్వకముగ చని మనుజులంత
శంభునిన్ భజియింతురు సంతసముగ
డా.పిట్టా నుండి
రిప్లయితొలగించండిసవరణ:
నన్నార్తు.(టైపాటును మన్నిచేది)
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండినవధాన్యంబుల వస్త్రపుం జతల నానా బూవులన్ బండ్లనున్
స్తవనం బాచరణంబు పావకునకే దాటింతు రిప్పాటునన్
యవ ధాన్యాదులు జీర్ణ చేలమునిలన్ యాచించు వే దీనులన్
రవయంతైనను గానకుండుట మహా రౌద్రంపు బాపంబు కే
శవముం గాల్చెద రాలయమ్మున బ్రజా సంక్షేమమున్ గోరుచున్(పాపం కోసమే/కేశవమును(నరుని సేవ, నారాయణుని సేవ అనే తత్త్వమునే )కాల్చెదరు.
భవబంధమ్ముల వీడనెంచుచు క్రతుధ్వంసిన్ సదా గొల్చుచున్
రిప్లయితొలగించండిభువిపై చక్కని కార్యముల్ సలుపుచున్ పుణ్యాత్ములన్ బ్రోచుచున్
దివిజుల్ మెచ్చగ స్వార్థమున్ విడిచి విద్వేషంపు, మూఢత్వపున్
శవముం గాల్చెద రాలయమ్మునఁ బ్రజా సంక్షేమముం గోరుచున్
ముక్తి నొందెడి దేవళమునిల; లయ మొ
రిప్లయితొలగించండినర్చు మలహరుడు కొలువైన మరుభూమి;
సకల జనముల నిట జూచి సమము గాను
శవము గాల్చెదరు గుడిలో శివము గోరి!
బంధువర్గము మిత్రులు బాధలందు
రిప్లయితొలగించండివల్లకాడున జనులెల్ల వగచుచుండ
శవము గాల్చెదరు!"గుడిలోశివముగోరి
తదుపరందరు మ్రొక్కిరి దైవమనుచు!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమసనమందున లోక విమలము కోరి
రిప్లయితొలగించండిశవము గాల్చెదరు; గుడిలో శివము గోరి
కాంక్షలనుకాల్చి ధ్యానించి కృతిలగుదురు
కసటుగాల్చ నెచటనైన కలుగు శుచిత
మసనము=శ్మశానము
కాల్చు=దహించు (నశింప జేయు)
కృతి=ధన్యుడు
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండిహిందూత్వ బ్రిగేడ్:
భువనమ్మందున నీకు సాటెవరురా మోడీ యటంచాడుచున్
రవలేశమ్ముయు భక్తిలేని యిటలీ రాహుల్లు గాంధీదియౌ...
కవితల్ పాడుచు గుడ్డపేలికలదౌ కాష్ఠంబు ముట్టించుచున్
శవముం గాల్చెద రాలయమ్మునఁ బ్రజా సంక్షేమముం గోరుచున్
ఆలయము = స్థానము
(ఆంధ్రభారతి నిఘంటు శోధన)
అవలోకింపగ బాల్యమన్నది ప్రవాహమ్మె మహామంత్రమై
రిప్లయితొలగించండిభువిలో నెల్లరి జీవితమ్ముల విరుల్ పూయించి రంజిల్లదే
లవలేశమ్మును మెంచబోక ధనమే లక్ష్యమ్ముగా నెంచి శై
శవముం గాల్చెద రాలయమ్మునఁ బ్రజా సంక్షేమముం గోరుచున్
వారణాశికి జనినట్టి వారు కొంద
రిప్లయితొలగించండిరచట లయమొంద వారికి సంధ్యాకర్మ
జరుపనెంచిన ధన్యులు కరుణతోడ
శవము గాల్చెదరు; గుడిలో శివము గోరి
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
శవముం గాల్చెద రాలయమ్మునఁ బ్రజా
సంక్షేమముం గోరుచున్
సందర్భము: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన నల్లమల అటవీ ప్రాంతంలో *మద్ది మడుగు* అనే పుణ్య క్షేత్రంలో ఆంజనేయ స్వామి వెలసినాడు. గిరిజనులకు ఆటవికులకు ఆరాధ్య దైవమై నిలిచినాడు.
స్వామిని *పబ్బతి ఆంజనేయ స్వామి* అని ఇక్కడ పిలుస్తారు. 'పబ్బతి' అంటే 'ప్రపత్తి' అని అర్థం.
హనుమత్ క్షేత్రాలలో ఎక్కడా లేని విశేషం ఒకటి అక్కడ కనిపిస్తుంది. అ దేమంటే ఆలయ ప్రాంగణంలో అహోరాత్రాలు ఏండ్ల తరబడి ప్రజ్వరిల్లుతున్న అగ్ని కుండం. దానిని *రావణ కాష్ఠం* అంటారు. రావణాసురుడు కాల్చివేయ బడుతున్నట్లుగా భావిస్తారు. రజ స్తమో గుణాలు ప్రతిక్షణం దహింపబడుతూనే వుండా లన్న సంకేతం అందులో వుంది.
స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళిన భక్తులకు అంగళ్ళలో కొంచెం నూనె, కొన్ని సమిథలు, కొబ్బరి కుడుకలు స్వల్పధరకు లభిస్తాయి. వాటిని వారు అగ్ని కుండంలో నిక్షిప్తం చేస్తారు.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
పవమా నాత్మభవుండు మద్దిమడు గన్
భద్రస్థలిన్ నిల్వగా
నవిరామంబుగఁ బ్రజ్వలించును గదా
య య్యగ్ని కుండమ్ము! "లం
క విభుం గాష్ఠ" మి దంచుఁ బల్కుదు, రదే
కన్పట్టు నీ కైవడిన్...
"శవముం గాల్చెద రాలయమ్మునఁ బ్రజా
సంక్షేమముం గోరుచున్"
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,
[ శివు డను ప్రజాబంధువు గతించగా ఆ ఊరి జనులు అమితభక్తితో
శివాలయములోనే ఆతని గాల్చిరి ]
" శివు " డా పట్టణ మందు సజ్జనుడు , సఛ్ఛీలుండు , దానవ్రతుం
డు , వదాన్యుండు , మహానుభావుడు , దయాలోలుండు , సేవ్యుండు ని
హ్నవహీనుండు , ప్రజార్తబంధు వకటా నాకస్థు డయ్యెన్ ! హరా !
భవ ! నీ చేరువ దత్కళేబర మికన్ భస్మీకరించన్ దగున్
శివ ! మమ్మున్ క్షమియించు తండ్రి యనుచున్ సీమప్రజల్ వేడుచున్
శవమున్ గాల్చెద రాలయమ్మున || బ్రజాసంక్షేమముం గోరుచున్
" శివునిన్ " బోలు మనీషి నివ్వు మని సంసేవించి రా శంకరున్ !
{ వదాన్యుడు = మనోఙ్ఞముగా మాటాడు వాడు ; నిహ్నవహీనుడు
= కపటము లేని వాడు }
తిరుపతి ప్రయాణంలో ఉన్నాను. మూడు రోజులు మీ పూరణలను సమీక్షించలేను. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికవులున్ కాకులు కూయగా ముదముతో కల్కత్త మైదానులో
రిప్లయితొలగించండిభవరోగమ్ములు దీర్చుటన్ మమతవౌ, బంగాలు గూండాలతో
జవరాండ్రొల్లుచు కూర్చగా కలపపై చాంతాడుతో మోడిదౌ
శవముం గాల్చెద రాలయమ్మునఁ బ్రజా సంక్షేమముం గోరుచున్