18, మే 2018, శుక్రవారం

సమస్య - 2681 (గజమునకు ఖరమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్"
(లేదా...)
"గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసె నెల్లెడన్"

105 కామెంట్‌లు:



  1. భజన పరుల దేశమ్మున
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్,
    సుజనుల పైనెగి రెనయా
    యజమాని తొడుగుల నక్క యగుచున్ తితిదే!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. నిజమిది వినుటకు వింతట
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
    భజనలు జేయగ దివిజులు
    సుజనుల సృష్టింతు రంట సుభములు కలుగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శుభములు'

      తొలగించండి
    2. నిజమిది వినుటకు వింతట
      గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
      భజనలు జేయగ దివిజులు
      సుజనుల సృష్టింతు రంట శుభములు కలుగన్

      తొలగించండి
  3. నిజమును నీతియు నెరుగని
    ప్రజలెన్నిన నేత మొద్దు బాలుని కనియెన్..
    నిజముగ నదియెట్లన్నన్
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
  4. కం.
    అజుని జగతిలో బహుజీ
    వజాతులీసృష్టిలో నివాసము గలవే!
    యజుడు పొరబడిన చిత్రమె!
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
  5. హిరణ్యకశిపులు సుతుడైన ప్రహ్లాదునితో...

    కందం
    అజునిఁ గొలువ మానవె? ది
    గ్గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసె
    న్నిజమందురు ప్రహ్లాదా! 
    స్వజనమ్ములు మెచ్చ నాదు జపమున మనవోయ్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా!చివరి పాదంలో మీరు సూచించిన సవరణతో :

      కందం
      అజునిఅ గొలువ మానవె ది
      గ్గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసె
      న్నిజమందురు ప్రహ్లాదా!
      స్వజనమ్ములు మెచ్చ నాదు జపమున మనుమా!

      తొలగించండి
  6. (రాజసభ - ఇంద్రజాలప్రదర్శన)
    నిజవిద్యానిష్ణాతుడు
    సజనమ్మగు రాజసభను జాలమొనర్పన్
    విజయధ్వానము లెసగగ
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్.

    రిప్లయితొలగించండి

  7. గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసె నెల్లెడన్
    సుజనుల పైన జంగ గొను చుండెనదే తితిదే సుమా జిలే
    బి! జవము బోవ నేడు మన వేదపు నీమము లెల్ల త్రోసిబు
    చ్చి జివము తోడు జంబుకము చిందులు వేసెను భారతమ్మునన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసె నెల్లెడన్
      సుజనుల పైన జంగ గొను చుండెనదే తితిదే సుమా జిలే
      బి! జవము బోవ నేడు మన వేదపు నీమము లెల్ల త్రోసిబు
      చ్చి జరఠ గుంట నక్క మజ చిందులు వేసెను భారతమ్మునన్ !

      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. కుజనుండొక్కడు పుట్టెను
    సుజనులె కొనియాడు నట్టి సుమతికి పుడమిన్
    ప్రజలెగ తాళిన బలికిరి
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఎగతాళిగ' అనండి.

      తొలగించండి
  9. సృజనాత్మక పాలనతో
    ప్రజలమనసు దోచినట్టి ప్రజ్ఞా నిధికిన్
    స్వజనులు మెచ్చిన నట ది
    గ్గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
  10. డా పిట్టా సత్యనారాయణ
    (3వతరగతిలో భాగహార గణనము.ఒక విద్యార్థి ప్రశ్న కు తికమక పడిన మాస్టారు వేదన)
    నిజమది సున్నా యంకెయె
    రజమంతయు తప్పులేక రావలె బంచన్
    సృజనకు నందని గురువను
    "గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్"

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    వ్రజకులరత్నమైన హరి భావన చేయుచు , నిష్ఠ గల్గియున్ ,
    ప్రజలకు మంచిసెబ్బరలఁ బల్కెడి పండితునింట , బుట్టగా
    నిజగుణదూషితుండొకడు నీచుడు , గాంచి జనాళి యిట్లనున్
    గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసెనెల్లెడన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వ్రజకులరాజు మా పదము బట్టెను , మేమిలనోండ్రఁ బెట్టుచో
      గజగజలాడి భీతిలు జగమ్ములటంచును తోకనూపుచున్
      రజక కులైక సేవన పరాయణ రాసభ జాతికీర్తిది...
      గ్గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసెనెల్లెడన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. అద్దెకు లభించు గర్భములనగ అమ్మకమునకదె
    వీర్యము
    గాజు నాళికలో పిండవృద్ది క్లోనింగుగా
    కార్యము
    సంతుకై ఎన్నెన్నో వింతలు ఈ రీతిగ
    జరుగనేరెడిన్
    గజమునకున్ జనించి యొక గాడిద
    గంతులు వేసె నెల్లెడన్

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టా సత్యనారాయణ
    రజకుని కెంత శ్రద్ధ యవురా!తన గాడిద కేమి మేపెనో
    రుజయును లేక కాన్పులను రూఢిగ నిచ్చును, మంచి సంగులే!
    నిజమిది యెంత నౌ పొడవు, నివ్వెర బోవగ దాని కాన్పునన్
    గజమునకున్(దాదాపు గజం పొడవు మేరకు) జనించి యొక గాడిద(పిల్ల)గంతులు వేసె నెల్లెడన్!

    రిప్లయితొలగించండి
  14. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2681
    సమస్య :: *గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసె నెల్లెడన్.*
    ఏనుగుకు గాడిద పుట్టి గంతులు వేసింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: షట్చక్రవర్తులు అని ప్రసిద్ధి చెందిన వారిలో సగర చక్రవర్తి ఒకడు.
    హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్సో పురూరవః ।
    సగరః కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తినః ।। అనే శ్లోకాన్ని మనం వినియున్నాము కదండీ.
    మహాత్ముడైన ఆ సగర చక్రవర్తిని ఒక ఏనుగు లాంటి వాడు అని అనుకొంటే చ్యవన మహర్షి (ఔర్వుడు) దీవెనతో అతని పెద్ద భార్యయైన కేశినికి పుట్టిన అంశుమంతుడు దురాత్ముడుగా పసిబిడ్డలను వృద్ధులను నదిలో పడవేసి చంపివేస్తూ దేశ బహిష్కరణకు గుఱియైనాడు. మహాత్ముడైన సగరునికి దురాత్ముడైన అసమంజసుడు పుట్టడాన్ని గమనిస్తే ఏనుగుకు గాడిద పుట్టి గంతులు వేసింది అని చెప్పవచ్చు అని విశదీకరించే సందర్భం.

    భుజ బల మందు నా సగర భూపతి యెన్న గజేంద్రుడై యయో
    ధ్య జనుల నేలె, కేశినిని తాను వరింపగ నౌర్వు వాక్కులన్
    కుజను డొకండు బుట్టి పసికూనల జంపెను నీట ముంచుచున్,
    *గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసె నెల్లెడన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (18-5-2018)

    రిప్లయితొలగించండి
  15. భుజబలశాలికి, మందుడు,
    గజగజమని వణకు సుతుడు గలుగగ భువిలో
    ప్రజలందరు దలచెనిటుల
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులువేసెన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...దలచి రిటుల...' అనండి.

      తొలగించండి
  16. అ జు సృష్టి మాయ యం చు ను
    ప్రజ లందరు వరుస కట్టి పరుగులు వెట్టన్
    నిజ మగు వింత ను గని ర ట
    గజ మునకుఖర మ్ముపుట్టి గంతు లు వేసె న్

    రిప్లయితొలగించండి
  17. విజయములు బొందు బుధునకు
    కుజనుండగు కొడుకు గలుగ కువలయమందున్
    స్వజనమ్ము లిట్లు దలచిరి
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్!!!

    రిప్లయితొలగించండి
  18. పండిత పుత్రః శుంఠః

    ప్రజలందరు కొనియాడెడు
    గజమన దగు పండితునకు గర్వము దొలగన్
    కుజనుడు గల్గిన వినమే
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్!

    రిప్లయితొలగించండి
  19. అజమునకు పుట్టె శునకము,
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్,
    నిజముగ జరుగెడి వింతలు
    ప్రజలీ కలియుగ ములోన పరికించుగదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పరికింత్రు గదా' అనండి.

      తొలగించండి
  20. సమస్య :-
    "గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్"

    *కందము**
    సుజనాశ్చర్యము బొందగ
    విజయము బొందె భువి శాస్త్రవిజ్ఞానంబే
    నిజముగ క్లోనింగువలన
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
    ................✍చక్రి

    రిప్లయితొలగించండి
  21. guruvu gaaru ninnati Puranamu tappulunna telupamdi

    దేవ కినుక నా పై యేల దివ్య మైన
    బ్రహ్మ నా(రాధ)నము జేసి ఫలము నొందె,
    వర (యశోద)కలశము ను దరములోన
    పారెను , కలుగ దంహ(సు, భద్ర) పరచ
    బడిన భాండము శరముతో పగుల గొట్టు,
    (దేవ, కి)నుక నా పై యేల, చావ బోడ
    తడు కలశమున్న పొట్టలో, తప్పు కాదు
    నని విభీషణుడు పలికె నయము తోడ

    రావణాసురునకు పొట్టలో అమృత భాండము గలదు, దానిపై శరము గురి బెట్టుము అని విభీషణుడు రామ చంద్రునకు తెలుపుట




    దేవ !కికురు మనపు సవిత్రి వన మునకు
    బంపె , నారాధనము చేసి భక్తి తోడ
    జనత సేవ జేయును మీకు, జాగు వలదు
    రాఘవ, యశోద తుల్యమై రంజనమిడు
    నీదు పాలన, రాకున్న నిమ్ము నీప
    విత్ర నడపాసు , భద్రత వెట్టి చేతు
    పాలనము యనుచు పలికె భరతు డపుడు

    రిప్లయితొలగించండి
  22. గజమునకు కలిగెనట నం
    గజము, భిషజుడు రయమున నెగడులన్ పెట్టన్
    నజిరము దరి దాపుల లోన్,
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్,


    ఏనుగు అనారోగ్యము పాలై శరీరము చల్ల బడగ వైద్యుడు దాని చుట్టూ నెగడులు బెట్ట ఆ వేడికి ఒళ్ళు వెచ్చ బడి తిరిగి గంతులు వేసేన్ అను భావన మానవుల శరీరము చల్ల బడిన ఆ సమయమున పాదములకు పసుపు రాసి మర్ధనముతో వేడి బుట్టిమ్చెదరు. అటులనే గజమునకు చల్ల బడిన శరీరమునకు ఖరము (వేడి) కలుగ చేసెను భావన


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ అన్ని పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  23. ప్రజలు విన పోతులూరే
    సుజనులు దెలియఁగ భవితను సుద్దులనెన్నో
    సృజయించగ కల్కి నిలను
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్" .

    రిప్లయితొలగించండి
  24. నిజముగ మూడడుగులు గద;
    యజమానికి సేవ జేయు;నరయ పడవయే;
    విజయము బొందిన వాడే;
    గజమునకు;ఖరమ్ము;పుట్టి;గంతులు వేసెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  25. నిజమిది నమ్ముడు మీరలు
    గజవరదుని బురము నందు గనబడె నిటుల
    న్బజరంగ బలుని గృహమున
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
  26. ప్రజలను పాలించుటలో
    విజయము సాధించి నట్టి వీరునకకటా!
    నిజ సుతుడాయెను మూర్ఖుడె
    "గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్"

    రిప్లయితొలగించండి
  27. వేసవి సెలవులకు తన మిత్రురాలి ఊరయిన గుంటూరు వెళ్ళి
    విందులో వారు వడ్డించిన మిరపకాయ బజ్జీ తినంగ, జమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్.
    ఇక్కడ ఖరము అన్న పదాన్ని వేడిమి లేదా మంట అన్న అర్ధంలో వాడవచ్చనుకుంటాను.
    దయచేసి ఈ భావం వచ్చేలా ఎవరయినా పూరించ ప్రార్ధన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భవానీ ప్రసాద్ గారూ,
      సాయంత్రం వరకు ఎవరైనా మీ భావానికి పద్యరూపాన్నిస్తారేమో చూద్దాం!

      తొలగించండి
    2. సజల గ్రామము గుంటూ
      రు జమున చని మిర్చిబజ్జి రోషమునఁ దినం
      గఁ జెలిం గని వనితా ది
      గ్గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

      తొలగించండి
    3. సజల గ్రామము గుంటూ
      రు జమున చని మిర్చిబజ్జి రోష మది జనిం
      చఁ జెలియ పందె మిడఁగ దినఁ
      గ జమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

      తొలగించండి
    4. సుజన పిలువ గుంటూరుకు
      మజా మిరపకాయబజ్జి మక్కువ మీరన్
      స్వజనమ్ము నుగలసి తినం
      గ జమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్!

      తొలగించండి
    5. పోచిరాజు కామేశ్వరరావు గారికీ, గుఱ్ఱం సీతాదేవి గారికీ ధన్యవాదములు.

      తొలగించండి
  28. సుజనుడు యుగ్రసేనుడు యశోధనుడాతని కీర్తి చంద్రికల్
    గజగజలాడ బుట్టెగద కంసుడు దుర్మతి పాప చిత్తుడై
    ప్రజలను బాధ పెట్టుచును పాలన సేయగ బల్కిలెల్లరున్
    గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసె నెల్లడన్

    రిప్లయితొలగించండి
  29. విజయులగు శాస్ర్తవేత్తలు
    సృజనకటుల పెద్దపీట సొంపుగ వేయ
    న్నజుడే నివ్వెర పోవగ
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'సుజనుడు నుగ్రసేనుడు...' అనండి.

      తొలగించండి
  30. క్రొవ్విడి వెంకట రాజారావు:
    కవిమిత్రులందరకూ నమస్కారములు. తిరిగి ఈ రోజునుండి మనబ్లాగులోనికి పున: ప్రవేశం చేస్తున్నాను.

    రజకుండా రవి గృహమున
    గజిబిజి లేక పనిగొనుచు కశిపువులెత్తే
    సుజనత గల రాసభమం
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
    (గజిబిజి= యిబ్బంది; కశిపువులు= బట్టలు; రాసభము= గాడిద; అంగజము= అందమైనది)
    (చాకలి రవి యింటిలో యిబ్బంది బడకుండా బట్టలను మోసే మంచితనముగల అందమైన గార్ధభమునకు గాడిద పుట్టి గంతులు వేసిందట. )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందమైన గాడిద! ఆహా! యెంతందంగా పూరించారు!! అభినందనలు!💐💐💐🙏🙏🙏

      తొలగించండి
    2. వెంకట రాజారావు గారూ,
      స్వాగతం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ లో 'ఎత్తే' అన్నచోట ఏదో సవరణ సూచించాను. చూడండి.

      తొలగించండి
  31. రిప్లయిలు
    1. 8/7/2016 నాటి పూరణలు:

      సృజియించిరట త్వచములం
      దు జిగురు కరగింప దానిఁ దోరముగ ఘనో
      ష్ణజ సుద్రవమ్ము వారి య
      గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

      [అగజము= జిగురు; ఖరము=వేడి]


      భజన పరులు తనుఁ బొగడఁగ
      సుజనులు పాండు తనయులఁ గసుగు నిత్యంబుం
      గుజనుండట కౌరవది
      గ్గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
      ఇది గతంలో ఇచ్చిన సమస్యయేనా? మరచిపోయాను. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు!

      తొలగించండి
    3. అజ సృజనా నైపుణ మెం
      చ జగద్విదితము ఘనమ్ము జ్ఞాన విహీనం
      పుఁ జరమ్మది గార్దభ ది
      గ్గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్


      కుజ నగ పూర్ణ మిప్పుడమిఁ గూర్మినిఁ బుట్టగ జంతు కోటి భే
      షజము నెఱింగి ద్రోహమును జల్పఁగ నేరును మర్త్యుఁ డొక్కఁ డ
      య్య జగతినిం బ్రవర్తిలఁగ నంతట మాసము లెల్ల నిండఁ బ్రా
      గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసె నెల్లెడన్

      [ప్రాక్ +అజము =ప్రాగజము; ముందు పుట్టనిది యంటే చెల్లెలు]

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.

      తొలగించండి
  32. వ్యజనమ్ము కర్ణమ్మేగా
    గజమునకు; ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
    స్వజనమ్ము తోడ ముదమున
    గుజరాతు వెడలి గతమది గుర్తుకు రాగా!

    రిప్లయితొలగించండి
  33. విజయము లెన్నియో బడసి విశ్వపు మేటి నటుండుగా సదా
    ప్రజలిల మెచ్చినట్టి నటరాజుకు బుట్టిన పుత్రుడొక్కడున్
    స్వజనులు మెచ్చకున్న నటవారసు డైన, జనుల్ వచింపరే
    గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసె నెల్లెడన్

    రిప్లయితొలగించండి
  34. భుజబల దృతరాష్ట్రుండను
    గజమునకు ఖరమ్ముబుట్టి!గంతులువేసెన్
    నిజమిది ద్రోపదిచీరలు
    గజముచ్చుగలాగినపుడు?గార్దభమేగా!

    రిప్లయితొలగించండి
  35. భారత దేశము 2019:
    (భవిష్య వాణి)

    సుజనులు రాజకీయమున సుందర రీతిని నేతలైరిరో!
    ప్రజలను మోసగించకయె వర్తకు లెల్లరు దాతలైరిరే!
    నిజముగ రాజవీధియును నింపిన గోతుల స్వర్గమాయెగా!
    గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసె నెల్లెడన్...

    రిప్లయితొలగించండి
  36. గురువు గారికి
    భవాని ప్రసాద్ గారి ఊహకు నా పూరణము గుంటూరు బదులు విజయవాడ మార్చాను ఎలా ఉందో బజ్జీ

    బెజవాడకు వేసవిలో
    నిజ,జమున గివముకు వెళ్ళి నే బజ్జీల్ వా
    జజమున బెట్టితి,నవి తిన
    గ జమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      భవానీ ప్రసాద్ గారి భావానికి మీ పద్యరూపం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  37. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  38. గజమునకున్జనించియొకగాడిదగంతులువేసెనెల్లెడ
    న్నిజముగసంభవించెనట నీరజనాభునిగ్రామమందున
    న్బ్రజలది చెప్పగావినిసభాసదులందరు మెప్పునొందుట
    న్నజుడును నేర్చునే యిటులుగార్దభమున్జననంబురీతీనిన్

    రిప్లయితొలగించండి


  39. రమేశు గారి భావనకు :)



    రజనల వేట లో కడుపు రావడ మన్నద దేల !అమ్మగా,
    వజనును మోసి బిడ్డ మన వారసు జేయ క్రయాని కై జిలే
    బి జలజ నేత్ర యుండగ! సుభిక్షము ట్యూబున బెట్టి మార్చగా
    గజమునకున్ జనించి యొక గాడిదగంతులు వేసె నెల్లెడన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రమేశ్ గారి భావానికి మీ పద్యం రూపం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  40. చంపకమాల
    భుజము పునీతగా దెలుప భూజన మంతయు నమ్మ రాముడున్
    స్వజనము జేర ధర్మమునఁ, జాకలి యైదవ శత్రువైన యం
    గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసె నెల్లెడన్
    కుజనదె వెంబడించె నల కుందిలమంపగ రామచంద్రుడున్

    రిప్లయితొలగించండి
  41. ప్రజ కొందరందు రిట్టుల
    "గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసె"
    న్నిజముగ నది నమ్మతరమె?!
    సృజియించిరి నానుడిగను జీవన మర యన్!

    రిప్లయితొలగించండి
  42. చ: నిజముగ నెంచి చూడగను నేరుగ నెన్నిక లందు గెల్చి తాన్
    ప్రజలకు నేతగా నెదిగె రాముడు, మెచ్చగ దేశ వాసులున్
    స్వజనులు గెల్పు గాంచి కడు సంతస మొందిరి, యిప్పుడట్టి ది
    గ్గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసె నెల్లెడన్

    రిప్లయితొలగించండి
  43. విజయము మాదే నంచును
    గజ మాలధరించి సభను గడబిడ సేయన్
    గజిబిజి పద్యము విని ది
    గ్గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్!

    వికటకవి “ మేకతోక పద్యము”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మాదే యంచును' అనండి.

      తొలగించండి
  44. స్వజనుల జూడ డా నిగమశర్మ శ్రుతుల్ బఠియింప డెన్నడున్
    నిజమును బల్క బోడు కడు నీచుల మైత్రిని గోరు మిండడై
    నిజసతి నెన్న డెన్నడును నిష్ఠకు నాలయమైన విప్ర ది
    గ్గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసె నెల్లెడన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      నిగమశర్మను ప్రస్తావించిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  45. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

    సందర్భము: అమ్మ లక్కల పిచ్చాపాటీ ఎలా వుంటుం దంటారా!

    "గజలక్ష్మి"ని "గజం" "గజం" అని పిలుస్తా రట! ఆమె కొడుకే గద "ఖరం.." ఆమాత్రం తెలియ దేమిటే!"
    అన్నది (రజని అనే) ఒక యిరుగిం టావిడ.

    "ఓహో! రజనీ! "శేఖరుడే"నా
    ను వ్వంటున్నది! గజానికి ఖరం పుట్టి గంతులు వేసిన ట్టుందిలే!" అన్నది పొరుగిం టావిడ.
    (శేఖర్ నే "ఖరం" అని ముద్దు ముద్దుగా పిలుచుకుంటా రని ఆమె కప్పు డర్థ మయింది)
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    " "గజలక్ష్మి"ని బిలిచెద రట
    "గజ" మని, యామె కొడుకె గద "ఖర"
    మెఱుగవటే!"

    "రజనీ! శేఖరుడేనా!
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్"

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  46. బుజబుజ నెల్లురందునను బూడిద స్వామిని పృచ్ఛగించగా
    గిజగిజలాడి చెప్పెనట గీరుచు గిల్లుచు నుత్తరమ్మిటుల్:👇
    "కుజుడిని దోషమొప్పకయె కూడగ జంటలు రోమునగ్రినిన్
    గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసె నెల్లెడన్"

    రిప్లయితొలగించండి