గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2692 సమస్య :: అయ్యయ్యో కడుపయ్యె నేమి కవినాథా నీకు చిత్రంబుగన్. ఓ కవివర్యా! నీకు కడుపు వచ్చిందేమిటి చిత్రంగా అని అడగడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: శుక్రాచార్యుని వద్ద ఉన్న మృత సంజీవనీ విద్యను నేర్చుకొని రమ్మని దేవతలు కచుడు అనేవాడిని పంపించారు. రాక్షసులు కోపంతో కచుని చంపి కాల్చి బూడిదచేసి ఆ బూడిదను సురలో కలిపి శుక్రునిచే త్రాగించారు. శుక్రుడు కచుని బ్రతికించి సంజీవనీ విద్య నేర్పుతాడు. శుక్రుని కడుపును చీల్చుకొని కచుడు బయటకు వచ్చి శుక్రుని బ్రతికిస్తాడు. సుర త్రాగితే పాపం కలుగుతుంది అని శుక్రాచారి ఆ సమయంలో శాపం కూడా ఇస్తాడు. ఈ ఘట్టంలో ఓ కవీ అంటే ఓ శుక్రాచారీ! నీ కడుపులో కచుడు ఉన్నాడా? నీకు కడుపు వచ్చిందా అని రాక్షసులు అడిగే సందర్భం.
అయ్యారే! సురమాయ! యీ కచుడు తా నందంగ సంజీవనిన్ నెయ్య మ్మొప్పగ వచ్చి భస్మ మగుచున్ నిల్వంగ మత్కుక్షి న క్షయ్యుం డయ్యె ననంగ శుక్రు గని రక్షస్సంఘమే బల్కె నే *డయ్యయ్యో కడుపయ్యె నేమి కవినాథా! నీకు చిత్రంబుగన్ ?* *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (30-5-2018)
[కీ.శే. కోలాచలం శ్రీనివాస రావు గారి "శిలాదిత్య" నాటకంలో వాచస్పతి శర్మ కుమార్తె సుభగ వితంతువు. ఆమె సూర్యోపాసనఁ జేసి, తత్ఫలితముగఁ గన్యాత్వము చెడని సద్యోగర్భముం బొందఁగా, నామె తండ్రి "వినాథవైన నీకు గర్భ మెట్లైనది? వివరింపు" మన, నంతయు వివరించిన సందర్భము]
రిప్లయితొలగించండిఅయ్యొ సుకవీశ్వరా గడు పయ్యె నెట్లు
నీ జిలేబికి! యాత్రల నీవు బోవ
నేది దారి యనుకొనుచు నెట్టు లోన
మెయిలు నంపె పడతియు సుమేధసునికి !
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"అయ్యొ సుకవీశ్వరా!!! గడు పయ్యె నెట్లు
రిప్లయితొలగించండితీయ గలనుర కడుపును తీర్చి చెప్పు?
కందములు నన్ను నేడిట కలవ రించె!
వైద్యు డొసగ గలడె సీస పద్య ములను?"
సీస = సీసా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివయ్యారంపు జిలేబి, కంజముఖి,యా వాల్గంటి, శంపాంగి, యే
భయ్యోయేట పడన్ మగండమెరికా భాగ్యంబు గా బోవగా
నయ్యయ్యో కడు పయ్యెనేమి! కవినాథా నీకుఁ జిత్రంబుగన్
సయ్యాటల్లధరమ్ములున్, పదములున్, సంభావ్యమౌకైపులున్ !
జిలేబి
పరార్ :)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదూర దేశము కేగిన దొంగ వీవు
రిప్లయితొలగించండిఒక్క కలయిక మనకెంత మక్కు వనగ
నయ్యొ సుకవీశ్వరా గడు పయ్యె నెట్లు
కవన మల్లుము నెట్టులో కలత పడక
తొలగించండిఅదురహో రాజేశ్వరి గారు !
జిలేబి
dhanya vaadamulu jilEbi gaaru
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(మామ గారు అల్లుడు గారితో )
రిప్లయితొలగించండిమంచి పద్యాలబిడ్డల బంచితివని
నాదు ముద్దుపుత్రిక నిచ్చినాను నీకు ;
లేతవయసున మాతృత్వ మేలనయ్య ?
అయ్యొ ! సుకవీశ్వరా ! గడుపయ్యె నెట్లు ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ!
తొలగించండిసతతము కవనమునకై చింతగ కూర్చగ
రిప్లయితొలగించండిభావము పొంతగ
శ్రమకోర్చితివి కద ఎంతగ మాకు చూపవేమి
వింతగ
కావ్యమునదె కడుపున దాచగ అయ్యయ్యో
కడుపయ్యెనేమి
కవినాథా నీకు జిత్రంబుగన్ డెలివరి
వెలువరించవేమి
తొలగించండిభయ్యా! భావ జిలేబి! ఓ!చనవరీ! వాహ్వాహ్ సెబాసో సెబా
సయ్యా! మీ కవితల్ ! పదమ్ములు భళా ! స్వామీ ! జిలేబీల మీ
వయ్యారంపు కబంధ మందు నిడిరో! వార్నీ ! రమేశా ! గన
న్నయ్యయ్యో కడు పయ్యెనేమి కవినాథా నీకుఁ జిత్రంబుగన్ !
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిపొరుగింటావిడ ఆక్రోశం...
అయ్యారే ! కవి గొల్వనీశ్వరుని పద్యాఖ్యప్రసూనమ్ములన్
కుయ్యాలించెనొ శంకరుండపుడె నీకున్ గర్భమయ్యెన్ గదా !
న్యాయ్యంబే ? పలుపూజలన్ సలుపగా నాకేమొ రాకుండగా
నయ్యయ్యో కడు పయ్యెనేమి కవినాథా! నీకుఁ జిత్రంబుగన్ !
కవిః నాథః యస్యాః సా... కవినాథా.... (కవిని భర్తగా గలిగిన స్త్రీ ) .. అనాథ... సనాథ.. వలె
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
వయ్యారమ్ముగ భామినుల్ తమరికిన్ వడ్డించగా విస్తరిన్
రిప్లయితొలగించండినెయ్యిన్ పప్పున వేసియన్నమున దానిన్ గల్పి లాగింతువే!
నయ్యారే! కనువారి దృష్టికినసభ్యమ్మౌ, తటాకమ్ముగా
నయ్యయ్యో కడు పయ్యెనేమి కవినాథా నీకుఁ జిత్రంబుగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసందర్భము - పెనిమిటిని జిలేబి జీవన చక్రము (పయ్య) పెద్దదెట్లగును అని అడిగితే ఆ మగడు సుకవి చెప్పిన సమాధానము అవధరించుడు - గడు - పెద్ద పయ్య - చక్రము ; బండిగాలు - చక్రము :)
జిలేబి యు గుండు చక్రము గుండు వృత్తము గుండు గుండులోనే గలడు గుఢాకేశుడు కావున
"అయ్యొ సుకవీశ్వరా! గడు పయ్యె నెట్లు?"
ఆటవెలది నీ వైనావు భావ మైతి
నేను! తేటగీతి వవంగ నేర్పు గా సు
గంధమైనాను గద! బండిగాలు నటులె!
జిలేబి
తొలగించండిదీనికి ఐడియా సాయం ( మీడియా పార్ట్నర్ :)) జీపీయెస్ వారి పూరణ
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2692
సమస్య :: అయ్యయ్యో కడుపయ్యె నేమి కవినాథా నీకు చిత్రంబుగన్.
ఓ కవివర్యా! నీకు కడుపు వచ్చిందేమిటి చిత్రంగా అని అడగడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: శుక్రాచార్యుని వద్ద ఉన్న మృత సంజీవనీ విద్యను నేర్చుకొని రమ్మని దేవతలు కచుడు అనేవాడిని పంపించారు. రాక్షసులు కోపంతో కచుని చంపి కాల్చి బూడిదచేసి ఆ బూడిదను సురలో కలిపి శుక్రునిచే త్రాగించారు. శుక్రుడు కచుని బ్రతికించి సంజీవనీ విద్య నేర్పుతాడు. శుక్రుని కడుపును చీల్చుకొని కచుడు బయటకు వచ్చి శుక్రుని బ్రతికిస్తాడు. సుర త్రాగితే పాపం కలుగుతుంది అని శుక్రాచారి ఆ సమయంలో శాపం కూడా ఇస్తాడు.
ఈ ఘట్టంలో ఓ కవీ అంటే ఓ శుక్రాచారీ! నీ కడుపులో కచుడు ఉన్నాడా? నీకు కడుపు వచ్చిందా అని రాక్షసులు అడిగే సందర్భం.
అయ్యారే! సురమాయ! యీ కచుడు తా నందంగ సంజీవనిన్
నెయ్య మ్మొప్పగ వచ్చి భస్మ మగుచున్ నిల్వంగ మత్కుక్షి న
క్షయ్యుం డయ్యె ననంగ శుక్రు గని రక్షస్సంఘమే బల్కె నే
*డయ్యయ్యో కడుపయ్యె నేమి కవినాథా! నీకు చిత్రంబుగన్ ?*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (30-5-2018)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిడా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిఅయ్యా, శంకర స్వీకరించు మనుచున్ హాయిన్ సమస్యావళిన్
కుయ్యాలించగ నా మొబైలు నరుడే కూర్చుండి మేసే వరుం
డెయ్యే వేళల నచ్చువేయ గడగన్ యెన్నన్నమూల్యంబులౌ
అయ్యయ్యో!కడుపయ్యె నేమి కవి నాథా నీకు జిత్రంబుగన్
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిఅయ్యా, శంకర స్వీకరించు మనుచున్ హాయిన్ సమస్యావళిన్
కుయ్యాలించగ నా మొబైలు నరుడే కూర్చుండి మేసే వరుం
డెయ్యే వేళల నచ్చువేయ గడగన్ యెన్నన్నమూల్యంబులౌ
అయ్యయ్యో!కడుపయ్యె నేమి కవి నాథా నీకు జిత్రంబుగన్
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిఅయ్యా, శంకర స్వీకరించు మనుచున్ హాయిన్ సమస్యావళిన్
కుయ్యాలించగ నా మొబైలు నరుడే కూర్చుండి మేసే వరుం
డెయ్యే వేళల నచ్చువేయ గడగన్ యెన్నన్నమూల్యంబులౌ
అయ్యయ్యో!కడుపయ్యె నేమి కవి నాథా నీకు జిత్రంబుగన్
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిఅయ్యా, శంకర స్వీకరించు మనుచున్ హాయిన్ సమస్యావళిన్
కుయ్యాలించగ నా మొబైలు నరుడే కూర్చుండి మేసే వరుం
డెయ్యే వేళల నచ్చువేయ గడగన్ యెన్నన్నమూల్యంబులౌ
అయ్యయ్యో!కడుపయ్యె నేమి కవి నాథా నీకు జిత్రంబుగన్
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిముద్దు స్త్రీవాదమన నెంత మోజు నీకు
ఇంత తాదాత్మ్య మున్న నవెన్ని కృతులొ
అయ్యొ సుకవీశ్వరా గడుపయ్యెనెట్లు
సాకుదువొ కావ్య కన్యల సరకుగొనరు
అడుగబోకుము స్వీకృతి కన్యు నెవని
కూలి నాలియొ జేసియు గూర్చుమొకట!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
డా.పిట్టానుండి,ఆర్యా, టాబ్ మొరాయింపువల్ల జరిగిన పునః కథనమది.Sorry!
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఅయ్యారేయని నీ జిలేబులకు సయ్యాటల్ గనన్ ఓసఖా!
నయ్యయ్యో కడు పయ్యెనేమి! కవినాథా నీకుఁ జిత్రంబుగన్
వయ్యారంపుకొమార్తె గల్గు ప్రియుడా! వర్ధిల్ల నీకీర్తి మే
లయ్యాతాళిని గట్టగన్! సుకవి!లోలాక్షిన్ దిగద్రోచకోయ్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,
వచ్చి రానట్టి యిట్టి కవనము తోడ
నెట్టులో యవధానాబ్ది నీదు || పాప
మయ్యొ ! సుకవీశ్వరా కడుపు | + అయ్యె నెట్లు
" కడప " పట్టణ మందు సత్కార మప్పు ?
డౌనులే ! పృఛ్ఛకు లిక నీ కయిన వారె !
{ ఈదు = ఈదుము ; కడుపు = కాలము గడుపు కొనుము ;
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"అయ్యొ సుకవీశ్వరా గడు పయ్యె నెట్లు
రిప్లయితొలగించండిలింగమార్పిడి యయ్యెనా?లేమవోలె
నట్లు జరుగుచో తప్పద య్యదియమీకు
సంగ మఫలితమేగద సత్కవివర!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికవిని ప్రేమించి యొక కన్య కామి తము గ
రిప్లయితొలగించండికాలు జారి న దె ట్టు లో కర్మ కాలి
వైద్య పరి శీల నంబు తో ప ల్కేని ట్లు
అయ్యొ సు కవీ శ్వరా కడు ప య్యే నె ట్లు ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండితే.గీ
మానవత్వము లేనిచొ మాన్యుడగునె?
అయ్యొ! కవీశ్వరా గడుపయ్యె ,నెట్లు
వెతల నిడెదవు నిరతము సతికి నీవు?
నిండు ప్రేమతో కను మామె నిండు మనిషి
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘ వనపర్తి ☘
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపండును తినినమాత్రమే పడతికి కడు
రిప్లయితొలగించండిపయ్యెనంచు మీకవితల వ్రాసిరిగద
నయ్యొ సుకవీశ్వరా ! గడుపయ్యె నెట్లు
పొలతికపుడు తనమగని పొందులేక ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదయ్యమును జూడు గియ్యము నయ్యెడ నని
రిప్లయితొలగించండియింక వియ్యంకు నాట పట్టించిన మఱి
చయ్యన వెడల నవ్వులు వ్రయ్యలుగను ,
నయ్యొ సుకవీశ్వరా, గడు పయ్యె నెట్లు
కయ్యంబందున వియ్యమందునను సంకాశంబ యొప్పందురే
యెయ్యే రీతులఁ జూచి నప్పటికి నే నీడవ్వ నీకెన్నఁడున్
వయ్యారంబుగఁ జెప్పఁ బద్యములు శబ్దద్యోత భావాకరం
బయ్యయ్యో కడు పయ్యె నేమి కవినాథా నీకుఁ జిత్రంబుగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.
తొలగించండివాణి వరపుత్రుడ నటంచు పలికి మోస
రిప్లయితొలగించండిగించి వనితలతో నిమ్ముఁ గాంచు చుండ
పడతి యొక్కతి చనుదెంచి యడిగె నిట్టు
లయ్యొ సుకవీశ్వరా గడు పయ్యె నెట్లు?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసీతామాతను గురించి వాల్మీకితో ఆశ్రమ వనితలు
రిప్లయితొలగించండిఎవరొ మహరాణి కానన మేగుదెంచె
లలిత లావణ్యవతి దాను లక్ష్మియనగ
నయ్యొ సుకవీశ్వరా! కడుపాయ నయ్యొ
కంటికిన్ రెప్పవోలెను కాచవలెను
సుఖమగు ప్రసవమ్మౌ నట్లు జూడవలెను!
మూడవ పాదంలో
తొలగించండికడుపయ్యె నెట్లు గా చదువ ప్రార్ధన!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండిసినిమ లందున సందర్భ సీనులందు
రిప్లయితొలగించండిఅయ్యొ సుకవీశ్వరాగడుపయ్యె నెట్లు?
అమ్మభారతి కృప నంద?హాయిగాను
పాటపల్లవిరాగంబు రాటుదేలె|
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి("బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు")
నెయ్యమ్మొందుచు కొండవీటి ప్రభువుల్ నీలాలు వర్షించిరే
తియ్యమ్మొందుచు రావుసింగ ప్రభువుల్ తిట్టంగ మన్నించిరే
కయ్యమ్మొందుచు బొడ్డుపల్లె ప్రభువుల్ కారాలు నూరంగ నే
డయ్యయ్యో కడు పయ్యెనేమి కవినాథా నీకుఁ జిత్రంబుగన్!
కడుపు = కష్టం నష్టం (వ్యావహారికము)
కవినాథా = కవిసార్వభౌమ శ్రీనాథా
తియ్యము = ప్రియము (ఆంధ్రభారతి నిఘంటు శోధన)
👏👏👏👏🙏🙏🙏
తొలగించండి🙏🙏🙏
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిసమస్య : -
రిప్లయితొలగించండి"అయ్యొ సుకవీశ్వరా గడు పయ్యె నెట్లు"
*తే.గీ**
మన భవనమంత చక్కగా మలచినాము
పిల్లి దెచ్చినీవు చెలిమి బెంచినావు
అయ్యొ సుకవీశ్వరా! గడు పయ్యె నెట్లు?
పాడు జేయునింటిని గదా! పలక వేమి?
....................✍చక్రి
(భార్య భర్త తో.......)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహాస్యమునకును మీరిట హారమొసగి
రిప్లయితొలగించండివ్రాసి నారుగ ధీటుగ వసుధ లోన
మీదు కవితను జదివియు మిగుల నవ్వ
"నయ్యొ సుకవీశ్వరా గడు పయ్యె నెట్లు"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే.గీ.
రిప్లయితొలగించండిఅయ్యొ సుకవీశ్వరా కడుపయ్యె నెట్లు?
వయసు పెరగగానె కడుపు వచ్చు చుండు.
చింత వలదుగా నగరాన జిమ్ము గలదు
తగిన వ్యాయామమును జేయ తగ్గి పోవు
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అయ్యారే! ఘన రామదాసుగను నీకా కీర్తి లాభించగా
రిప్లయితొలగించండికయ్యంబున్ గొని గోలకొండకును వేగంబున్ విచారింపకన్
గుయ్యారంబున నిన్ను ద్రోయ నకటా! గూలన్, తటాకంబుగా
"నయ్యయ్యో కడు పయ్యెనేమి కవినాథా నీకుఁ జిత్రంబుగన్"
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు గురువుగారు
తొలగించండి🙏🏻
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[కీ.శే. కోలాచలం శ్రీనివాస రావు గారి "శిలాదిత్య" నాటకంలో వాచస్పతి శర్మ కుమార్తె సుభగ వితంతువు. ఆమె సూర్యోపాసనఁ జేసి, తత్ఫలితముగఁ గన్యాత్వము చెడని సద్యోగర్భముం బొందఁగా, నామె తండ్రి "వినాథవైన నీకు గర్భ మెట్లైనది? వివరింపు" మన, నంతయు వివరించిన సందర్భము]
"ఇయ్యాదిత్యుఁడు నన్నుఁ బ్రోచి, వెస నా కే న్యాయ్య మందించునో?
యయ్యా! మంత్ర బలమ్మునుం గనెదఁ బో!" యంచున్ బఠింపన్, భళా!
"యొయ్యారీ నినుఁ గాచెదన్, సుభగ! సద్యోగర్భముం బొంది, నీ
వయ్యోగమ్మున, దేహజున్ దుహితఁ గన్యాత్వమ్ము వోకుండఁగా
నెయ్యానన్ గని, కీర్తినందఁగలవే నీ" వంచు, దీవించి, పో,
నయ్యో, యప్పుడె యేఁగుఁదెంచి, పితరుం డా గర్భముం జూచి, తా
"నయ్యయ్యో! కడు పయ్యెనేమిక, వినాథా! నీకుఁ జిత్రంబుగన్?
గుయ్యో! మొఱ్ఱొ!" యనంగఁ, దా దినమయూఖుం గూర్చి తెల్పెన్వెసన్!
[వినాథ = విధవ]
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండిడా.పిట్టానుండి,ఆర్యా, టాబ్ మొరాయింపువల్ల జరిగిన పునః కథనమది.Sorry!
రిప్లయితొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
"అయ్యొ! సుకవీశ్వరా గడు పయ్యె నెట్లు"
సందర్భము: బావ.. బావ మరుదుల పరిహాస సంభాషణం. బావ ఒక కవి.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
"అయ్యొ! సుకవీశ్వరా గడు పయ్యె నెట్లు?"
"అవి సమస్య పూరణల పద్యాలు నిండి
బాగఁ గనిపించు నా పొట్ట బావ మరిది!
నీదు బుద్ధికి నటువలెనే కనపడు.."
2 వ పూరణము...
సందర్భము: సుకవియైన యొక బావ తన బావ మరిదితో యిలా అంటున్నాడు.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
బొజ్జలో దాచె పదునాల్గు భువనములను
దేవు డన దాచుకొనలేనె జీవుడ నిక
మంచి పద్యాల నిటు; బావ మరిది! యనకు..
"మయ్యొ! సుకవీశ్వరా! గడు పయ్యె నెట్లు?"
3 వ పూరణము..
సందర్భము: ఇంటికి వచ్చిన యాత డొకడు అడిగితే నా భార్య యిదుగో ఇలా చెప్పింది మరి! ఏం చేస్తాం?
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
"అయ్యొ! సుకవీశ్వరా గడు పయ్యె నెట్లు
లావుగా నింత?" యన నాదు
రమణి పలికె..
"తినును, కూర్చొను, మరి యదే
పనిగ వ్రాసి
కొనును కైతలు; పని పాట యనగ నేది?"
🖋~డా.వెలుదండ సత్య నారాయణ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి1.
రిప్లయితొలగించండితేటగీతి
"నేను పరుల పంచన నుండి నింద పడితి
నయ్యొ సుకవీశ్వరా! " "గడు పయ్యె! నెట్లు
లోకపావనీ! వనముల శోకము విడు?
నమ్మవమ్మ! వాల్మీకిని నాదరమున" .
2.
కొత్తగా పెళ్లైన కవీశ్వరుడు అత్తగారింటిలో అల్లెము తినిరాగా పరిహాసముతో మిత్రులు...
శార్దూలవిక్రీడితము
నెయ్యమ్మెంతయొ బూంది లడ్డు లరిసెల్ నిత్యమ్ము ముప్పూటలన్!
యుయ్యాలూపుచు సేవ చేయ సతియే నొయ్యారి సయ్యాటలిం
కెయ్యే సౌఖ్యము లల్లెమందు గొనితో నిల్లాలి పుట్టింట చూ
డయ్యయ్యో కడు పయ్యెనేమి కవినాథా!నీకుఁ జిత్రంబుగన్?
రిప్లయితొలగించండిఅయ్యొ సుకవీశ్వరా గడు పయ్యె నెట్లు"
ననుచు వ్యంగ్యము గానొక్క డడుగ పల్కె
‘కవిని గద మరి కలవయ్య కడుపు నిండ
పద్యరాజముల ఫలము వచ్చె నిదియు.’
రెండవ పూరణ
తే.గీ:భారతకథను వినుచున్న బాలయోర్తు
కుంతికథనాలకించుచు కూర్మి తోడ
అయ్యొ సుకవీశ్వరా గడు పయ్యె నెట్లు
తరణి తానెటు లరుదంచె తరుణి చెంత
వివరముగ దెల్పు డాచార్య విందు నేను.
అయ్యా! కూరలు తర్గుచుండివిట భల్ హైరాన, నీభార్యకు
రిప్లయితొలగించండిన్నయ్యయ్యో కడు పయ్యెనేమి కవినాథా!:..నీకుఁ జిత్రంబుగన్
వయ్యారమ్మగు దాసిలేద వడిగా వంకాయ తాలింపిడన్?
సయ్యాటమ్ములు నీవుజేయ పనినిన్ చాలించి పార్పోయెనా :)