28, మే 2018, సోమవారం

సమస్య - 2690 (దీపమ్మును ముద్దిడ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్"
(లేదా...)
"దీపము ముద్దుగొమ్ము సుదతీ సుఖ మబ్బు వియోగవేళలన్"

86 కామెంట్‌లు:

  1. దీపా! త్వరగా నార్పుము
    దీపమ్మును! ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్,
    నాపై చల్లగ వ్రాలుచు;
    కోపమ్మును వీడుమమ్మ కూరిమి మీరన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుందండీ.. దీప ఎవరో? 🙏🙏

      ...మైలవరపు మురళీకృష్ణ


      ప్రభాకర శాస్త్రి:

      శరత్చంద్ర వ్రాసిన బెంగాలీ "పరిణీత" నవలను 2005 లో హిందీ సినిమాగా తీసిరి. అందులో విద్యా బాలన్ హీరోయిన్. ఈ సినిమాను చూసి అప్పటి బెంగాల్ ముఖ్య మంత్రి (ముసీలి వాడు) బుద్ధదేబ్ భట్టాచార్య విద్యా బాలన్ పై ఎనలేని కూరిమితో కలకత్తాలో ఒక ఫంక్షనుకు పిలిచి దీపం వెలిగించే గౌరవాన్ని ఆమెకిచ్చి ఆమెకు "దీపా బాలన్" అనే బిరుదునిచ్చిరి. నేటి నా పూరణ బుద్ధదేబ్ గారిది...

      తొలగించండి

    2. జీపీయెస్ దీపా :)


      దీపా! హా! కారబ్బూం
      దీ, పమ్మును, ముద్దిడ సుదతీ, సుఖ మబ్బున్?
      నా పై దయచూపు సఖీ
      కోపమదేలకొ ! జిలేబి ! కోమల వళ్ళీ!

      జిలేబి


      జిలేబి

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  2. చాపంబదియె జిలేబీ
    నీ పెంపునకు భువిలోన నీరజనేత్రా!
    సోపాల జేరి విద్యా
    దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. సోపాల అంటే ఏమిటి అని అడగరని ఆశిస్తో :)

      తొలగించండి
    2. రామాచార్యులు గారు ఉవాచ:

      సోప అనగా పాఠశాల
      ఉర్దూ భాషాప్రభావంతో వచ్చి,
      కనుమరుగు అవుతున్న తెలంగాణ మాండలికం.

      తొలగించండి
    3. చాపంబదియె జిలేబీ
      నీ పెంపునకు భువిలోన నీరజనేత్రా!
      సోపాల జేరి పద్యా
      దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్

      సోపాల = శంకరాభరణం

      తొలగించండి

    4. అదురహో పద్యాదీప శంకరాభరణ "నెట్టు బడి"

      జిలేబి

      తొలగించండి
    5. పెద్దింటి లక్ష్మణాచార్యులు (జిలేబి గారికి):

      దీపప్రభలతోఈరోజంతానీరజనేత్రితో అంతా సోపాల జేరాలన్నమాట. బావుందండి.🌹🌹.

      తొలగించండి

    6. పెద్దింటి వారికి నమో నమః !

      పెంకుటిల్లు పెద్దిల్లవ్వాలంటే ఆపసోపాల సోపాల తప్పదుస్మీ :) జెకె :)

      నెనరుల్స్
      జిలేబి

      తొలగించండి
    7. జిలేబీ గారూ....నెట్టుబడిలో కొత్తపదం తెలిసినది
      👌🏻👏🏻💐🙏🏻

      తొలగించండి
    8. నట్టింటను నెట్టింటను వహ్వా జిలేబుల తో చెట్టా పట్టాల్!👋👋👍👍💐💐

      తొలగించండి
    9. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ********
      ప్రభాకర శాస్త్రి గారూ,
      విద్యాదీపం సరియైనదే... కాని పద్యాదీపం సాధువు కాదు.

      తొలగించండి
  3. నీ పతి యాత్రకు నేగగ
    తాపమ్మున కుందనేల తగ నీ యింటన్
    దీపించు సుతుని నీ కుల
    దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖమబ్బున్

    రిప్లయితొలగించండి
  4. పాపము శలభము చచ్చును
    దీపమ్మును ముద్దిడ , సుదతీ సుఖ మబ్బున్
    తాపము నసియించు ననగ
    ఆపానుపు పైన జగతి యాదర మొప్పన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆకాశవాణి సమస్య : పానీ ప్రేమ జలమ్ము గాదె యిహమున్ భవ్యంబుగా దాటగన్-దొరవీటి గారు క్లారిఫై చేశారు.
      asnreddy

      తొలగించండి

    2. జిలేబి కిట్టింపు ఒక్క పదమూ స్వంతము కాదు :)


      పానీయమ్ములు ద్రావుచున్ కుడుచుచున్ పర్జన్య! దామోదరా!
      శ్రీనారాయణ! కంబమయ్య!జినుడా!శ్రీనాథ!పర్జన్య!ల
      క్ష్మీనాథా!చిరజీవి!మాధవ! ధరా! శ్రీగర్భ! మా నంద గో
      పా! నీ ప్రేమ జలమ్ము గాదె యిహమున్ భవ్యంబుగా దాటగన్!

      జిలేబి

      తొలగించండి


  5. పాపము వీడనాడుచు ప్రవాసము బోయెనకో మగండు?నీ
    వీ పనిముట్టు చేగొను సువీ! కరవాణిని గాంచు! త్రాసమే
    లా? పరితాపమున్విడుము! లాలన "వాట్సపు కాలు" జేసి, చే
    దీపము ముద్దుగొమ్ము సుదతీ సుఖ మబ్బు వియోగవేళలన్ :)

    లవ్ లైట్స్ ఓవర్ వాట్సప్ వీడియో కాల్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అదురహో! చే దీపమే అన్లాక్ చేస్తే స్క్రీన్ వెలుగులీనుతుంది కదా!
      😃

      తొలగించండి
    2. జిలేబి గారూ:

      ఇది మిస్సయ్యారు మీరు:

      శంకరాభరణం సమస్య 1614:

      "స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్"

      తొలగించండి

    3. కందపు సమస్య మిస్సవడమా ! ఓహ్ ! నో నెవర్ :)



      బాలా చెప్పెద నీకై
      స్త్రీలోలుఁడె సజ్జనుఁడని; చెప్పెదరు బుధుల్
      మాలోకపు జనులు, జిలే
      బీ, లావుగ దుర్జనులని, వినకే బాలా !

      తొలగించండి
    4. 👌

      మేలగు చాకలి దొరకక
      నూలువి షర్టులను ప్యాంట్ల నొత్తుచు తానే
      కాలరు నెత్తుకొనిన "యి
      స్త్రీ" లోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్

      తొలగించండి
    5. ఆకాశవాణి సమస్య : పానీ ప్రేమ జలమ్ము గాదె యిహమున్ భవ్యంబుగా దాటగన్-దొరవీటి గారు క్లారిఫై చేశారు.
      asnreddy

      తొలగించండి
    6. లీలా మానుష విగ్రహు
      డేలెను గోపీ మనముల నెల్లలు మీరన్
      హేలగ గీతను నుడివిన
      స్త్రీ లోలుడె సజ్జనుడని చెప్పెదరు బుధుల్!

      తొలగించండి
  6. కోపము మానుము తీయుము
    దీపమ్మును,ముద్దిడ సుదతీ సుఖమబ్బున్,
    నీ పట్టును విడుము మదన
    తాపము పెరిగెనని బలికె తనసతి తోడన్

    రిప్లయితొలగించండి
  7. కవిమిత్రులారా, నమస్కృతులు.
    ఈరోజు వరంగల్లులో గరికిపాటి నరసింహ రావు గారికి ఇందారపు కిషన్ రావు స్మారక పురస్కారం ప్రదానం చేసే సభకు వెళ్తున్నాను. నేడు, రేపు బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఆల్ ది బెస్టండీ కందివారు .

      గరికిపాటి వారి ప్రసంగమప్పుడు, వారి చేతి‌కందేటట్లుగా వీలుగా వాటర్ బాటిల్ పెట్టాలని నా తరపున కార్యక్రమ నిర్వాహకులకు విన్నపాలు తెలియ చేయగలరు.


      ఇట్లు
      జిలేబి
      http://varudhini.blogspot.com/2016/05/blog-post_17.html

      తొలగించండి
    2. ముఖ్యమైన సంగతిని సరైన సమయంలో చెప్పారు “జిలేబి” గారూ 👌.

      తొలగించండి


    3. గరికిపాట సభావిశేషములేమిటి?

      జిలేబి

      తొలగించండి
  8. ఆ పడతి ముఖము జూడగ
    నే పెండ్లాడంగ నామె నిచ్ఛ జనించెన్
    కోపమ్ము లేని యా ముఖ
    "దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్"

    రిప్లయితొలగించండి
  9. కోపము చాలులెమ్ము సుమకోమలి!తప్పుల నొప్పుకుందునే;
    ఆపగరాని నాదు ప్రణయాంజలి నిత్తును పల్లవాధరీ!
    నీపయి ప్రేమతోడ నిడు నిర్మలకాంత్యుపహార మీచల
    ద్డీపము ముద్దుగొమ్ము సుదతీ!సుఖమబ్బు వియోగవేళలన్.
    లన్

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టాసత్యనారాయణ
    దీపము తపించె ప్రేమన్
    ప్రాపుగ శలభంబు జేరె బహు విరహమున
    న్నేపుగ త్యాగమె నికషగ
    దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖమబ్బున్
    (ప్రేమ్ దో ఓర్ ఫల్తాహై
    దీపక్ జల్తాహై ఔర్ పతంగ్
    భీ జల్తా హై.......)

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా సత్యనారాయణ
    తాపము నోపలేవు సఖి!తన్మయతన్ శలభంబు వౌటచే
    దీపములోనికేగుటకు దివ్వెగదా యను నెర్క దప్ప ను
    ద్దీపన లోని తీపి గొన దివ్య సుఖంబును గ్రోల ప్రేమకౌ
    దీపము...............................

    రిప్లయితొలగించండి
  12. లేపనము కరిగి పోవగ
    పాపము దారిని మరచెను ప్రవరుం డనగా
    నేపగిది నిల్లు జేరెద
    దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్

    రిప్లయితొలగించండి
  13. కోపము వీడుచు నార్పుము
    దీపమ్మును, ముద్దిడ సుదతీ సుఖమబ్బున్
    నీపతి చెంతకు జేరిన
    తాపమ్మును దీర్చునతడు త్వరపడ వేమే.

    రిప్లయితొలగించండి
  14. ఏపాప మ్మెరుగకయే
    చేపట్టిన కార్యమెల్ల చేయుచు నెపుడున్
    లోపాతీతుండగు కుల
    "దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్

    రిప్లయితొలగించండి
  15. దీపమె యిల్లాలింటికి,
    పాపమె పరకాంత గూడ, పాడియె కాదా
    పాపము నీకై తపించు
    "దీపమ్మును ముద్దిడ, సుదతీ-సుఖ మబ్బున్"

    గమనిక: మూడోపాదంలో పాపము...అయ్యో పాపం!

    రిప్లయితొలగించండి
  16. మాపాలిట దేవుండగు
    మాపాపడు చిన్నికృష్ణ మహిమాన్వతుడౌ
    రేపల్లెను వెలిసి వెలుగు
    "దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్

    రిప్లయితొలగించండి
  17. గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2690
    సమస్య :: *దీపము ముద్దుగొమ్ము సుదతీ ! సుఖమబ్బు వియోగవేళలన్.*
    ప్రియుడు దగ్గఱ లేని వియోగ వేళలలో దీపాన్ని ముద్దు పెట్టుకో. సుఖం దక్కుతుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన విషయం.
    సందర్భం :: కృష్ణుడు దగ్గఱ లేనప్పుడు విరహవేదనతో బాధపడుతూ ఉండిన రాధను ఒక చెలికత్తె సమీపించి ఓదారుస్తూ ఆమెకు శ్రీ కృష్ణుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని తెచ్చి ఇచ్చి ఓ రాధా! ఈ కృష్ణుని విగ్రహము నీ విరహతాపాన్ని తొలగిస్తుంది. ఇది శోకమనే చీకటిని దూరం చేసే దీపము. నీ కృష్ణుడే అని అనుకొంటూ ఈ విగ్రహాన్ని ముద్దాడు. సుఖం లభిస్తుంది అని విశదీకరించే సందర్భం.

    శ్రీపతి దివ్యవిగ్రహము శ్రీకర రూపము సుందరమ్ము సం
    తాప మడంచు సాధనము ధాత్రి విరాజిలు కల్పవృక్షమున్
    శ్రీపద మిద్ది శోకమను చీకటిఁ దూరము సేయునట్టిదౌ
    *దీపము ముద్దుగొమ్ము సుదతీ! సుఖ మబ్బు వియోగవేళలన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (28-5-2018)

    రిప్లయితొలగించండి
  18. కోపము వీడియు పతి యె డ
    తాపము తో వలపు పొంగ తరుణీమణి తా
    నో పగ లేక యు నా రి పె
    దీప మ్మును ;ముద్దిడ సుదతీ సుఖ మబ్బు న్

    రిప్లయితొలగించండి
  19. ఓపగ లేని తాపము పయోధరముల్ బరువెక్కెనంచు నీ
    చూపులు వక్రమార్గమున జొచ్చుకు పోయిన దోషమే గదా
    తాపసివౌచు నిన్నిలను తల్లిగ ప్రేమను పంచినట్టి త
    ద్దీపము ముద్దుగొమ్ము సుదతీ సుఖమబ్బు వియోగ వేళలన్.

    రిప్లయితొలగించండి
  20. పాపమ్మది పరదారను
    చూపుల బడవేయ జూడ చోరునివలెనే
    నీపాలి దేవి యింటికి
    దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖమబ్బున్!

    రిప్లయితొలగించండి
  21. కం.
    గోపిక! నీమనసునగల
    గోపాలుడు వచ్చె తలుపు గొళ్ళెము తీసెయ్
    మాపటి కేళికి తీయుము
    దీపమ్మును, ముద్దిడ సుదతీ సుఖమబ్బున్

    రిప్లయితొలగించండి
  22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  23. మైలవరపు వారి పూరణ

    ఆకాశదేశాన... ఆషాఢమాసాన..

    శాపము పొందితిన్ విధివశమ్మున , యక్షుడ నేను , మేఘమా !
    నా పలుకుల్ యథాతథమనంగ వచింపుమిటుల్ "మనోహరీ !
    శాపము దీర వచ్చెద , ప్రశాంతత నోరిమి దాల్చి , ధైర్యమన్
    దీపము ముద్దుగొమ్ము సుదతీ సుఖ మబ్బు వియోగవేళలన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోపాలుని , శ్రితజనచి...
      త్తాపహరుని పాపహరుని తలచుచు , తచ్చి...
      త్రోపరి లాలాట తిలక...
      దీపమ్మును ముద్దిడ సుదతీ ! సుఖ మబ్బున్" !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  24. గడసరి తనమును వీడుచు
    దిడుపుగ మారుచును జ్ఞాన దీపమ్మును ము
    ద్దిడ సుదతీ సుఖ మబ్బున్
    విడువకు సద్గురు పథమును బెదరకు మెపుడున్

    రిప్లయితొలగించండి
  25. అద్భుతమైన పూరణ! మల్లీశ్వరి సినిమా గుర్తొచ్చింది! మురళీకృష్ణగారికి అభినందన సుమమాల! 💐💐💐💐🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇది కాళిదాసు వ్రాసిన "మేఘ సందేశం"

      తొలగించండి
    2. శ్రీమతి సీతాదేవి గారికి నమస్సులు.. ధన్యవాదాలు 🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    3. కథ యేదైనా సందేశం ఒకటే గదా! 😊😊

      తొలగించండి
  26. తాపము దీర్చగ సతియే
    కోపము జూపుచు సుఖంబె గోరడు బొందన్
    రూపసతి గనక వేరొక
    దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్ ?!?!?

    రిప్లయితొలగించండి
  27. కదిలే దీప శిఖ కాంతులు మదిలో ఊగిసలాడు
    తలపులు
    ఎరుపు పసుపది నీలములు తన్నుకొచ్చెడి
    భావోద్వేగములు
    దరి చేరిన ఊర్పుకు కాంతి ప్రియుడై తోచి
    రమ్మనగన్
    దీపము ముద్దుగొమ్ము సుదతీ సుఖమబ్బు
    వియోగవేళలన్

    రిప్లయితొలగించండి
  28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  29. నీ పతి దూరదేశమున నిత్యము వేశ్యల పొందుగోరెడిన్
    పాపి యతండు, నిన్ వలచి వచ్చిన వాడను నేను గాదుటే
    కోపము మానిరమ్మనుచు గోరితి నోసఖి నార్పివేసెదన్
    దీపము, ముద్దుగొమ్ము సుదతీ సుఖమబ్బు వియోగ వేళలో.

    రిప్లయితొలగించండి
  30. పాపా! కాలునుమూతియ
    దీపమ్మునుముద్దిడ,సుదతీసుఖమబ్బున్
    మాపటివేళల గలిసిన
    నేపుగదాయింటిసతినినిచ్చనుదోడన్

    రిప్లయితొలగించండి
  31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  32. మాపున తనతలితండ్రుల
    దాపుకు సతియేగు విరహతరుణము నందున్
    తాపము పోవగ వాఙ్మయ
    దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖమబ్బున్

    రిప్లయితొలగించండి
  33. దీపిక! మారుమూలగది దెర్వుమ,యార్పుమువెంటనేనికన్ దీపము,ముద్దుగొమ్ముసుదతీసుఖమబ్బువియోగవేళలన్
    కోపముతోడనుండకనుగూరిమియొప్పగ మెల్గుచుండుచు
    న్నాపెనుజేరదీయదరికామెయె సంతస మిచ్చుగా భువిన్

    రిప్లయితొలగించండి
  34. పాపము కాలును ముఖమే
    యే పాప మెఱుఁగదు పాప యిత్తరి నిజమే
    యీ పలుకులు విని చేసిన
    దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్


    వేపిత దైత్య సంచయము వేణు హితమ్మును వాసుదేవ స
    ద్గోప ముఖారవిందము సఘోషము దర్శన మాత్ర ముక్త సం
    తాపము చిత్తమందు లలితాప్రకరప్రణయప్రభా సము
    ద్దీపము ముద్దుగొమ్ము సుదతీ సుఖ మబ్బు వియోగవేళలన్

    రిప్లయితొలగించండి
  35. ఆటవిడుపు సరదా పూరణ:
    (మిస్టర్ పైర్ల కీటకరావు ఉవాచ)

    నాపయి దోసమెంచకుము నారుల సీజను పోనెపోయగా
    కోపము వీడి రావలెను కొద్దిగ చీకటి కూడ లేదిటన్
    దీపము ముద్దుగొమ్ము సుదతీ సుఖ మబ్బు వియోగవేళలన్
    తాపము తీరులే మనకు తప్పును శోకము స్వర్గసీమలో

    రిప్లయితొలగించండి

  36. శాపము స్తీల కెన్న నిది సంద్రము శోకము లేవయస్సులో
    పాపము నిన్ను బాసె పతి బాధ యనంతము దైవ లీల యీ
    తాపము బిడ్డనిం గనుము బేలగ చూచెడి నీదు కంటికిం
    దీపము ముద్దుగొమ్ము సుదతీ సుఖ మబ్బు వియోగవేళలన్.

    రిప్లయితొలగించండి
  37. ఏపగిది యడగు శలభము?;
    నీపతి దేవునకు సేవ నేర్పున తమితో
    చేపట్టగ నీబ్రదుకున;
    దీపమ్మును ముద్దిడ ; సుదతీ సుఖ మబ్బున్

    రిప్లయితొలగించండి
  38. చాపము నెక్కుపెట్టి విరజాజుల బాణము లెన్నొ వేయుచున్
    తాపము హెచ్చవేయగను తామరతూపరి యాటలాడుచున్
    నోపగ లేని మోహమున నూహల నే ప్రియ కామ రూపమౌ
    "దీపము ముద్దుగొమ్ము సుదతీ! సుఖ మబ్బు వియోగవేళలన్"

    తామరతూపరి = మన్మథుఁడు

    రిప్లయితొలగించండి
  39. మిత్రులందఱకు నమస్సులు!

    [తాను కొత్తగాఁ బెండ్లాడిన భార్య పుట్టినింటికిఁ జనఁగాఁ, దాపముతో బాధపడుచున్న "సందీపుఁ" డను పేరుగల యొక యువకు నోదార్చుచు, మాట తడఁబాటు గల యొక "నత్తివాఁడు" పలికిన సందర్భము]

    "కోప మదేల నీకు? నినుఁ గోరి, పె పెండిలియాడినట్టి యి
    ల్లాపెయె పుట్టినింటికి న నర్గిన నింత వియోగబాధయున్
    దీపి వగం గొనం దగునె? తిన్నగ గేహిని బొమ్మ పైన, సం

    దీప! ము ముద్దుగొమ్ము, సుదతీ సుఖ మబ్బు, వియోగవేళలన్!"

    రిప్లయితొలగించండి
  40. చూపుల వెలుగునదీపను
    దాపున దరిజేర్చి చిలిపిదరహాసమునన్
    రూపసి వలపుల మలుపున
    దీపమ్మును ముద్దిడ?సుదతీసుఖమబ్బున్

    రిప్లయితొలగించండి
  41. ముని కణ్వాశ్రమములో దుష్యంతుని రాకకై పుత్రునితో ఎదురు చూచే శకుంతలతో చెలికత్తెలు :
    1.
    కందం
    ఓపవె శకుంతల! చెలీ! 
    తాపము విడనాడు ప్రభువు దరిఁ జేరుఁగదే!
    నీ పుత్ర రత్నమున్ గుల
    దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్.

    2.
    ఉత్పలమాల
    ఆపు శకుంతలా! వగపు నా దొర పుత్రుని చక్రవర్తిగా
    చూపెద నంచు మాటనిడె చూడుమొకింత క్షమా గుణమ్ముతో
    తాపము వీడవమ్మ సుతు ధైర్యము రాజసమే గనంగ పె
    న్దీపము! ముద్దుగొమ్ము సుదతీ సుఖ మబ్బు వియోగవేళలన్!

    ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

    రిప్లయితొలగించండి
  42. చక్కని పూరణలు జివియస్ గారూ! అభినందనలు! 💐💐💐

    రిప్లయితొలగించండి
  43. సమస్య :-
    "దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్"

    *కందము*"

    పాపకు కనబడు నార్పుము
    దీపమ్మును; ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్
    తాపము దీరును సఖియా
    ఈ పది నాళ్ళునిను వీడ నేండ్లాయె సుమీ
    .........‌..........✍చక్రి

    రిప్లయితొలగించండి
  44. ఆ పంచశరుఁ బ్రతాపము
    నోపగ లేకుంటి రావె యో వనజాక్షీ
    తాపము దీర్చగ నార్పెద
    దీపమ్మును, ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్.

    రిప్లయితొలగించండి
  45. మనస్సును మథించే తాపానికి ఓర్వలేని ఓ పతి పాపం!!

    నా పాలిటి రస దేవత
    తాపమ్ము ను దీర్చ రావె దాగకె తరుణీ
    నీపతి పాపమె! జూడకు
    "దీపమ్మును, ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్"

    రిప్లయితొలగించండి
  46. శాపము వోలె నూతనపు జంట కయోగము కాపురమ్మునన్
    మాపటి వేళలన్ పతికి మానగ లేనిది కార్యభారమై
    నోపగ, బేలయై సతి మనోజుని తూపుల తల్లడిల్లగా
    తోపగ కాలమున్ తరుగ దూరము
    భారము ఫేసుటైమనున్
    దీపము ముద్దుగొమ్ము సుదతీ! సుఖమబ్బు వియోగ వేళలన్!

    రిప్లయితొలగించండి
  47. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    "దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్"

    సందర్భము: కృష్ణుడు గోపాంగనతో
    అంటున్న మాటలు.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    పాపమ్ము పారఁ ద్రోలెద..
    కోపమ్మునఁ జూడబోకు కోమలి! హరి నే
    నే! పరమ యదు యశః శ్రీ
    దీపమ్మును; ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  48. పాపల నిద్దరిన్ గనుచు బాపడు పోయెన కాన్టినెన్టుకున్?
    శాపపు భాగ్యనగ్రినిట సంకట మాయెన పవ్రుకట్లతో?
    కోపము వీడి పృష్ఠమును కొట్టుచు ముచ్చటి టార్చిలైటుదౌ
    దీపము ముద్దుగొమ్ము సుదతీ సుఖ మబ్బు వియోగవేళలన్!

    రిప్లయితొలగించండి