గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2675 సమస్య :: *చల్లదనంబు నిచ్చెను కృశానుడు వేసవి మండుటెండలన్.* వేసవి కాలంలో మండుటెండల్లో కృశానుడు (అగ్నిదేవుడు) చల్లదనాన్ని కలిగించాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అంశం. సందర్భం :: అగ్నిదేవుడు చందనం లాగా చల్లబడ్డాడు అనే భావంతో ఒక సమస్యను భోజరాజు సభలో ఇవ్వగా కాళిదాస మహాకవి ఇలా పూరించాడు.
సుతం పతంతం ప్రసమీక్ష్య పావకే న బోధయామాస పతిం పతివ్రతా । తదాభవత్ తత్పతిభక్తిగౌరవాత్ హుతాశన శ్చందన పంక శీతలః ।। ఈ పూరణకు అనువాదంగా నేటి నా పద్యం. ఒక సాధ్వి మజ్జిగ చిలుకుతూ ఉండగా ఆమె బిడ్డ మెల్లగా పాకుతూ వంట ఇంటిలోకి వెళ్లి పొయ్యిలో పడిపోయాడు. అప్పుడు ఆ పతివ్రత తన భర్తకు నిద్రాభంగమౌతుందని ఆయనను మేల్కొలుపకుండా బిడ్డను కాపాడమని అగ్నిదేవుని ప్రార్థించింది. ఆమె పతిభక్తికి మెచ్చిన కృశానుడు (అగ్నిదేవుడు) ఆ బిడ్డకు చల్లదనాన్ని కలిగించాడు అని విశదీకరించే సందర్భం.
ఆహా! మూలములోని భావమును ఉన్నదున్నట్లుగా దించుతూ మీరు వ్రాసిన పద్యములు అనుపమానము. మీకు నా నమోవాకములు. ఇదే భావాన్ని ఒక సీసపద్యం లో నాచే ఇలా వ్రాయించాడు పవనసూతి. చిత్తగించండి:
పతిసేవలో నేను పరవశించెద నేని .....తపమాచరించిన తరుణి నేని లేశమైనను నేను ధీశాలి రాముని .....దయ నోచుకొన్నట్టి దాన నేని పుణ్యశేషము నాకు పొసగుచుండిన దేని .....పతి మెచ్చు శీల సంపన్న నేని స్వామి సమాగమ సల్లాలసగ నన్ను .....ధర్మాత్ము డెద లోన దలచు నేని
పెద్దలు కామేశ్వరరావు గారికి నమస్కారములు.నిజానికి నేను నాకు చేతనైన రీతిలో సుందరకాండ తెలుగు భావాన్ని పద్యరూపంలో వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను. వలసిన భక్తిశ్రద్ధలు, భాషమీద తగిన పట్టు లేని కారణాన ఏడాదికి పైగా నత్తనడక లా సాగుతోంది. పై ఘట్టాన్ని మీకు వలె వ్రాద్దామని (ఒకే మకుటంతో ఏ శ్లోకానికి ఆశ్లోకాన్ని పద్యరూపంలో) విఫలుడనై సీసాన్ని ఆశ్రయించాను. మీ పద్యానువాదం మహత్వ పూరితం. నా ప్రయత్నం పరిపూర్ణ మయేలా దీవించండి.
మిస్సన్న గారు చాలా సంతోషము. మనస్సంకల్పమునకు మహత్కార్యమునకు దైవానుగ్రహము తప్పక చేకూరుతుంది. ఉత్సాహము తో మీ ప్రయత్నమును చేయండి. తప్పక ఫలిస్తుంది. నే నిప్పుడు శ్రీమదాంధ్ర సుందరకాండ ప్రథమ పరిశీలన పూర్తి చేసి శ్రీ రామచంద్రునకు రోజు కొక సర్గము చొప్పున వినిపిస్తూ మఱల పరిశీలించుచున్నాను. పరిశీలనానంతరము గురువు గారి యనుగ్రహమున్న శంకరాభరణములో చూడ గలరు. డా. సీతా దేవి గారు నమస్సులు, ధన్యవాదములు.
సందర్భము: సీతను దర్శించి అశోకవన విధ్వంసం సృష్టించిన హనుమంతుడు రావణుని వద్దకు కొనితేబడ్డాడు. రావణుడు చంపబోతే విభీషణుడు దూతను చంపరా దన్నాడు. రావణుడు ఏదో శిక్ష వేయకుండా విడిచిపెట్టరా దని వానరులకు తోకయే భూషణ మని దానిని కాల్చివేసి లంక అంతటా తిప్పం డన్నాడు. ఆంజనేయుని తోకకు పాత నూలు బట్టలు చుట్టి నూనె పోసి నిప్పంటించినారు రాక్షసులు. హనుమ కోపంతో వారిని కిందకు తోసివేసినాడు. రాక్షసులు మళ్ళీ బంధించినారు. "వీళ్ళు న న్నేమీ చేయలేరు. కాని నేను సహిస్తాను. పట్టణ మంతా తిప్పేటప్పుడు పగటి పూట దుర్గ నిర్మాణాదులు చూడవచ్చు గదా!" అనుకున్నాడు మారుతి. శంఖ భేరీలు మ్రోగిస్తూ రక్కసులు హనుమ చేసిన దుండగాలు చాటింపు వేయిస్తూ తిప్పినారు. రాక్షస కాంతలవల్ల యీ విషయం విని సీత దుఃఖంతో అగ్నిదేవుని.. *"శీతో భవ హనూమతః"* అని ప్రార్థించినది. అగ్ని కరుణించినాడు. వాయుదేవుడుకూడ చలిగాలివలె వీచినాడు. హనుమంతుడు తన తోక చల్లనిదైపోగా ఆశ్చర్య పడిపోయినాడు. దృశ్యతే చ మహాజ్వాలః కరోతి న చ మే రుజమ్ శిశిర స్యేవ సంఘాతో లాఙ్గూలాగ్రే ప్రతిష్ఠితః (సుందరకాండము సర్గ 53 శ్లో 35) "ఈ అగ్ని పెద్ద జ్వాలలతో కనపడుతున్నది. కాని నాకు మాత్రం యే బాధా కలిగించడం లేదు. నా తోక చివర మంచుముద్ద పెట్టిన ట్టున్నది." అనుకున్నాడు హనుమంతుడు. తరువాత పై కెగిరి గర్జించి నగరద్వారం పైకి వెళ్లి బంధనాలను విదల్చివేసుకొని ఒక ఇనుప పరిఘతో అక్కడి రక్కసులను చంపివేసినాడు. లంకను అగ్నికి సంతర్పణం చేయా లనుకొని ఉద్యమించినాడు. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~ ఒక మేడపైనుండి యొక మేడమీదికి నురవడిగా దూకు నొక్కమారు నొక చెట్టుపైనుండి యొక చెట్టు మీదికిఁ జక్కగా లంఘించు నొక్కమారు బిక్కుబిక్కునఁ జూచు రక్కసి మూకల ప్రక్క "ధ" మ్మని పడు నొక్కమారు నగ్ని కీలలు రేగి యాకాశ మంటగా "నోహొహో!" యని మెచ్చు నొక్కమారు నది మహాజ్వాల కలదియైనప్పటికిని దోచె నొక మంచు ముద్దయే తోక చివర నున్నదో యన హనుమ, కోహో! యిదేమి! చల్లదన మిచ్చె నగ్ని వేసఁగి వెలుగుల
రిప్లయితొలగించండికంది వారి తిరుపతి పయనం :)
అల్లదియె తిరుపతి! ఆముదాల మురళి
వారి అవధానమును చూడ వచ్చి నాడ !
వేంక టేశుని డాపున వేంకటగిరి
చల్లదన మిచ్చె నగ్ని వేసఁగి వెలుఁగుల
తిరుపతి వేడెక్కి అగ్ని మండలం గా ఉన్నా అబ్బే కవర్యుల ఊహలకు అంతే లేదు :)
జిలేబి
బహు చక్కని పూరణ!💐👍👌💐
తొలగించండిప్రాసగీతి :)
రిప్లయితొలగించండిపల్లెటూరి గుండమ్మొక పట్నమరిగి
యిల్లరికపుటల్లుండికి "ఏసి"వేసి
చల్లదన మిచ్చె; నగ్ని వేసఁగి వెలుఁగుల
చల్లు చుండగ భానుడు సమరమొసగి
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిరావణశాసనమ్...
ఎల్లరు లంకలో నతనికే వశమై జన దిక్పతుల్ , గనన్
మెల్లగ వీచి వానికి సమీరము సేవల జేయ , వానలున్
పెల్లుగ ధారలై కురియ ,
భీతి దశానను శాసనమ్మునన్
చల్లదనంబు నిచ్చెను కృశానుఁడు వేసవి మండుటెండలన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిఅల్లది గోజనార్ధనుడి యాలయమౌ! యవధాన చత్వరం
బల్లదిగో! యదే దివియు ! భాగ్యమిదేగద ! వేంకటేశ్వరుం
డల్లన గాచు చుండ భళి డంగురి వేసెద నిచ్చె నిచ్చెనే
చల్లదనంబు నిచ్చెను కృశానుఁడు వేసవి మండుటెండలన్!
జిలేబి
ఎల్ల జనులను కరుణించి యేణ భృత్తు
రిప్లయితొలగించండిచల్లదనమిచ్చె,నగ్ని వేసగి వెలుగుల
తోడ వసుధపై భానుడు దువ్వె కాలు
సమరమును చేయ దలచి గ్రీష్మమ్ము లోన
ఏసీ కొచ్చిన పాట్లు..☺️
రిప్లయితొలగించండిమానవుడు మేధను మదించి మార్గమెంచి
శీరు వేడిమి తాళక శీతలీక..
రణము గోరి కనుగొన యంత్రము ముదమున
"చల్లదన మిచ్చె నగ్ని వేసఁగి వెలుఁగుల"
విద్యుత్తనగ నగ్నియే కదా!
తొలగించండి{అన్నమాట తప్పని హరిశ్చంద్రుని అరణ్యంలో దావాగ్ని చుట్టుముట్టినప్పుడు )
రిప్లయితొలగించండికల్లల నాడనట్టి ఘనకార్ముకహస్తుడు కోసలేశుడే
యెల్లలు లేనికూర్మి తనయింతియు బుత్రుడు వెంటవచ్చుచున్
మెల్లగ సాగగా నటవి, మెండగు జ్వాలలు చుట్టుముట్టగా,
జల్లదనంబు నిచ్చెను కృశానుడు వేసవిమండుటెండలన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండిమెల్లగ తడబడు నడక మెఱుపు వోలె
యుల్లము గనగ శరముల యూహ గాదె
అల్లన వనిత చేరగా అదరగ మది
చల్లదన మిచ్చె నగ్ని వేసఁగి వెలుఁగుల
పైరు పంట గలిగిన పల్లె లందు
రిప్లయితొలగించండితరువు లొస గెడు నీడలు మరులు జూపి
చల్ల ద న మిచ్చే ;నగ్నివేసగి వెలుగుల
మాడి మసి యౌను జీవులు మహి ని జూడ
మొదటి పాదం లో పంటలు అని చదువ ప్రార్థన
తొలగించండిడా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండికల్ల కపటాలు తెలియని కఠిన బ్రతుకు
బండలను గొట్టు వడ్డెరి బాధ జూసి,
చెరువు చెమటల శ్రమజీవి క్షేమము గన
చల్లదనమిచ్చె నగ్ని వేసగి వెలుగుల
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[శ్రీరాముఁడు వనవాసముఁ జేయుచున్న సందర్భము]
నల్లని మేనితోడఁ జిఱునవ్వుల నెప్పుడుఁ జిందుచున్; విరా
జిల్లెడి మోమునం గనుచు, క్షేమముఁ గూర్చుచు, వన్యవాసు ల
ల్లల్లనఁ గొల్చుచుండు రఘురామున కా రవివంశ మంథికిన్
జల్లఁదనంబు నిచ్చెను కృశానుఁడు వేసవి మండుటెండలన్!
తే.గీ.
రిప్లయితొలగించండిఎండలెక్కువయ్యెను భూమి మండుచుండె
మెరుపు నగ్నితో వడగండ్లు కురిసె పుడమి
మంచుముక్కల వానతో మనసు నిండె
చల్లదనమిచ్చెనగ్ని వేసగి వెలగుల
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండికల్ల జగత్తునే కలల గారడినిన్ మన చంద్ర శేఖరుం
డల్లదె, నింపె కుంటలను హారములిచ్చెను వృక్షవృద్ధినిన్
పల్లెలనాది పట్నముల బాటల బెంచెను పూలమొక్కలన్
"వెళ్ళుడి యేరువాక "కని వేలను "కార్తి"కి ముందె నిచ్చెబో
చెల్లె గరెంటు(electricity)టూ.బి.హెచు శీతల యంత్రములివ్వ భారమే?(2BH)
చల్లదనంబునిచ్చెను కృశానుడు వేసవి మండుటెండలన్
అగ్నివేశ్ కృషి వలననె యవతరించె
రిప్లయితొలగించండిచల్ల బరచెడి యంత్రము చౌక లోన
నతని నభినంద నలముంచి రందరపుడు
చల్లదనమిచ్చెనగ్ని వేసగి వెలగుల
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితొలి పాదానికి భంగ్యంతర పాదము:
రిప్లయితొలగించండి"అగ్నివేశ్ కని పెట్టగ నవతరించె"
ఉత్పలమాల
రిప్లయితొలగించండితల్లడపాటు వీడ నొగి దైవముఁ గొల్వఁగ రైతుమిత్రులున్
పిల్లలు పెద్దలున్ గదిలి వేడుకలౌ తిరునాళ్లు జాతరల్
గొల్లగ నుండఁ బాల్గొనుచు గుండముపై నడువంగ భక్తితో
చల్లదనంబు నిచ్చెను కృశానుఁడు వేసవి మండుటెండలన్
ఊరు నూరంత హాయిగా నూరడిల్లె
రిప్లయితొలగించండినిత్యము జనుల మనసుల నిలిచి యుండు
రామ చంద్రుని కల్యాణ మేమనందు
చల్లదనమిచ్చెనగ్ని వేసగి వెలగుల
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆ శుభవేళ అగ్ని దేవుడు కూడా చల్ల బడినాడని
భావన!
తేటగీతి
రిప్లయితొలగించండితీరుబడి గాగ రైతన్న తెములు ననుచు
గుడుల తిరునాళ్లు జాతర్లు గూర్చి రంట
భక్తి భావాన గుండాల పైన నడువ
చల్లదన మిచ్చె నగ్ని వేసఁగి వెలుఁగుల!
సర్వము హరించువాడు తృటిని సర్వ భక్షక
రిప్లయితొలగించండివైశ్వానరుడు
శిలాజ ఇంధనములు మండించగ తానుగ
బయల్పడెను చూడు
విధ్యుత్తుగ పరివర్తితమై శీతల యంత్ర
మాడించగన్
చల్లదనంబునిచ్చె కృశానుడు వేసవి
మండుటెండలన్
వాయు గుండప్రభావము వలన ప్రకృతి
రిప్లయితొలగించండిచల్లదన మిచ్చె నగ్ని వేసఁగి వెలుఁగుల
లోన మార్పులు కలుగగ రూఢిగాను
పయనమైరి జనమ్ములు పనులు సలప
గుడిసె వేసుకొనగనది కొంచెమంత
రిప్లయితొలగించండిచల్లదనమిచ్చె , నగ్ని వేసగివెలుగుల
బాలమునుచూప నదియును భసితమయ్యె
ఏమి చిత్రమోయది విధినేమనందు
శీతలమునిచ్చు యంత్రమ్ము చిన్నదైన
రిప్లయితొలగించండిచల్లదనమిచ్చెనగ్నివేసగివెలుగుల
నుష్ణ తాపమ్ము భరియించ ఋషులకైన
వశము కాదునెంతగవనవాసులైన
పెల్లున శబ్దముల్ సలిపి వృష్టి ఘటిల్లగ జేసి పాశి తా
రిప్లయితొలగించండిచల్లదనంబు నిచ్చెను, కృశానుఁడు వేసవి మండుటెండలన్
జల్లుల చాటున న్నొదిగి శాంతము చూపెను తత్క్షణమ్ముగా
నుల్లము సంతసిల్లె ప్రజ కుష్మము తగ్గగ నెండ కాలమున్
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2675
సమస్య :: *చల్లదనంబు నిచ్చెను కృశానుడు వేసవి మండుటెండలన్.*
వేసవి కాలంలో మండుటెండల్లో కృశానుడు (అగ్నిదేవుడు) చల్లదనాన్ని కలిగించాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అంశం.
సందర్భం :: అగ్నిదేవుడు చందనం లాగా చల్లబడ్డాడు అనే భావంతో ఒక సమస్యను భోజరాజు సభలో ఇవ్వగా కాళిదాస మహాకవి ఇలా పూరించాడు.
సుతం పతంతం ప్రసమీక్ష్య పావకే
న బోధయామాస పతిం పతివ్రతా ।
తదాభవత్ తత్పతిభక్తిగౌరవాత్
హుతాశన శ్చందన పంక శీతలః ।।
ఈ పూరణకు అనువాదంగా నేటి నా పద్యం.
ఒక సాధ్వి మజ్జిగ చిలుకుతూ ఉండగా ఆమె బిడ్డ మెల్లగా పాకుతూ వంట ఇంటిలోకి వెళ్లి పొయ్యిలో పడిపోయాడు. అప్పుడు ఆ పతివ్రత తన భర్తకు నిద్రాభంగమౌతుందని ఆయనను మేల్కొలుపకుండా బిడ్డను కాపాడమని అగ్నిదేవుని ప్రార్థించింది. ఆమె పతిభక్తికి మెచ్చిన కృశానుడు (అగ్నిదేవుడు) ఆ బిడ్డకు చల్లదనాన్ని కలిగించాడు అని విశదీకరించే సందర్భం.
చల్లనుఁ జిల్కుచుండి యొక సాధ్వి, సుతుం డదె వంటయింటిలో
నల్లన ప్రాకి యగ్ని బడ, నగ్నినె వేడెను గాని, వెంటనే
వల్లభు లేపలేదు, పతిభక్తికి మెచ్చుచు చిన్ని బిడ్డకున్
*చల్లదనంబు నిచ్చెను కృశానుడు వేసవి మండుటెండలన్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (11-5-2018)
చల్లనిఱేడు చంద్రుడటు చక్కగ పున్నమి వేళ వెన్నెలల్
రిప్లయితొలగించండిచల్లుచు,మాధురీకిరణ జాలరులన్ సృజించి ధాత్రికిన్
తల్లడిలంగ పేదలటు దగ్ధ మొనర్చెను పూరి పాకలన్
చల్లదనంబునిచ్చెను, కృశానుడు వేసవి మండుటెండలన్
అల్ల భూ పుత్రి లంకలో నలమటించి
రిప్లయితొలగించండిరాగ,చేకొన భర్త నిరాకరింప
జొచ్చె జానకి వహ్నిలో చోద్యముగను
చల్లదన మిచ్చె నగ్ని వేసఁగి వెలుఁగుల
కల్ల యైన మాటయ సుమ్ము కరము వింత
రిప్లయితొలగించండియంచు నంద నేలయ విస్మయమ్ము దైవ
ముండ నండగ సాధ్యమ్ము మండితముగఁ
జల్లఁ దన మిచ్చె నగ్ని వేసఁగి వెలుఁగుల
తల్లడ మంది చిత్తమున ధాత్రిజ జానకి భవ్య పాణి సృ
క్పల్లవముల్ మొగిడ్చి యట పావను వేఁడఁ గపీంద్రు తోకకుం
జల్లఁదనంబు నిచ్చెను గృశానుఁడు వేసవి మండుటెండలం
జల్లిన భద్రమే కలుగుఁ జల్లని దీవన లుండ నండగన్
తే.గీ.
తొలగించండిపతిని నిత్యము సేవించు పడతి నేని
తపము నందు మనము నుంచు తరుణి నేని
యేకపత్నినై యిల చరి యింతు నేని
వాత వర నందనున కిమ్ము శీతలమ్ము 24.
ఆ.వె.
అల్పమైన నతని కనురాగ మున్న నా
యందు ధీవరునకు నరయ మదిని
భాగ్య శేష మదియుఁ బరఁగిన నాకిల
వాత సుతున కిమ్ము శీతలమ్ము 25.
ఆ.వె.
సద్గుణ వర విత్త సంపన్నఁ బతి సమా
గమన లాలస నని కరుణ హృదిని
నమ్మె నేని నన్ను నా మనో నాథుఁడు
వాత సుతున కిమ్ము శీతలమ్ము 26.
ఆ.వె.
సత్య సంగరుండు సద్గుణ సుగ్రీవుఁ
డు నను ఘోర దుఃఖ వనధి నుండి
సంతరించు నేని సత్వరమ్ముగ నింక
వాత సుతున కిమ్ము శీతలమ్ము 27.
మూలము:
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః.
యది చాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః৷৷5.53.28৷৷
యది కిఞ్చిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః৷৷5.53.29৷৷
యది వా భాగ్యశేషో మే శీతో భవ హనూమతః.
యది మాం వృత్తసమ్పన్నాం తత్సమాగమలాలసామ్৷৷5.53.30৷৷
స విజానాతి ధర్మాత్మా శీతో భవ హనూమతః.
యది మాం తారయేదార్యస్సుగ్రీవః సత్యసఙ్గరః৷৷5.53.31৷৷
అస్మాద్ధుఃఖామ్బుసంరోధాచ్ఛీతో భవ హనూమతః.
ఆహా! మూలములోని భావమును ఉన్నదున్నట్లుగా దించుతూ మీరు వ్రాసిన పద్యములు అనుపమానము. మీకు నా నమోవాకములు. ఇదే భావాన్ని ఒక సీసపద్యం లో నాచే ఇలా వ్రాయించాడు పవనసూతి. చిత్తగించండి:
తొలగించండిపతిసేవలో నేను పరవశించెద నేని
.....తపమాచరించిన తరుణి నేని
లేశమైనను నేను ధీశాలి రాముని
.....దయ నోచుకొన్నట్టి దాన నేని
పుణ్యశేషము నాకు పొసగుచుండిన దేని
.....పతి మెచ్చు శీల సంపన్న నేని
స్వామి సమాగమ సల్లాలసగ నన్ను
.....ధర్మాత్ము డెద లోన దలచు నేని
తే.గీ.
సత్యసంధుడు పూజ్యుడు సవితృసూతి
కలచు దుఃఖాబ్ది దాటింప గలుగునేని
పావకా చల్లగా జూడు పవనసుతుని
ననుచు ప్రార్థింప జానకి యనిలసఖుని.
మిస్సన్న గారు మీ సీస మాణి ముత్యమే. సప్రణామాభినందనలు. ఇదివరలోనే వ్రాసారా లేక యిప్పుడు వ్రాసారా?
తొలగించండిభగవానుఁడు వాల్మీకి మహర్షి “శీతో భవ హనూమతః” యని శ్లోక చతుష్టయమున వివరించి నందున నాయన బాట లో “ వాత సుతున కిమ్ము శీతలమ్ము” మకుటముగా నీ ఘట్టమును చిత్రీకరించితిని.
పెద్దలు కామేశ్వరరావు గారికి నమస్కారములు.నిజానికి నేను నాకు చేతనైన రీతిలో సుందరకాండ తెలుగు భావాన్ని పద్యరూపంలో వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను. వలసిన భక్తిశ్రద్ధలు, భాషమీద తగిన పట్టు లేని కారణాన ఏడాదికి పైగా నత్తనడక లా సాగుతోంది. పై ఘట్టాన్ని మీకు వలె వ్రాద్దామని (ఒకే మకుటంతో ఏ శ్లోకానికి ఆశ్లోకాన్ని పద్యరూపంలో) విఫలుడనై సీసాన్ని ఆశ్రయించాను. మీ పద్యానువాదం మహత్వ పూరితం. నా ప్రయత్నం పరిపూర్ణ మయేలా దీవించండి.
తొలగించండిపూజ్యులు కామేశ్వర రావుగారికీ మిస్సన్న గారికీ అభినందన పూర్వక ప్రణామాలు! 🙏🙏🙏🙏🙏🙏
తొలగించండిమిస్సన్న గారు చాలా సంతోషము. మనస్సంకల్పమునకు మహత్కార్యమునకు దైవానుగ్రహము తప్పక చేకూరుతుంది. ఉత్సాహము తో మీ ప్రయత్నమును చేయండి. తప్పక ఫలిస్తుంది.
తొలగించండినే నిప్పుడు శ్రీమదాంధ్ర సుందరకాండ ప్రథమ పరిశీలన పూర్తి చేసి శ్రీ రామచంద్రునకు రోజు కొక సర్గము చొప్పున వినిపిస్తూ మఱల పరిశీలించుచున్నాను. పరిశీలనానంతరము గురువు గారి యనుగ్రహమున్న శంకరాభరణములో చూడ గలరు.
డా. సీతా దేవి గారు నమస్సులు, ధన్యవాదములు.
చాలా సంతోషం కామేశ్వరరావు గారూ. మీ ప్రోత్సాహానికి, సౌహార్ద్రతకు ధన్యవాదములు. మీ శ్రీ మదాంధ్ర సుందరకాండ కై ఎదురు చూస్తున్నాను.నమస్సులు.
తొలగించండిసీతాదేవి గారూ ధన్యవాదాలండీ. మీరు వ్రాసే పద్యాలు కూడ సలక్షణంగా ఆసక్తికరంగా ఉంటున్నాయి.
తొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండిపల్లె ప్రమోదమందె రఘువంశ సుధాంబుధి చంద్రు గాథనే
యుల్లము రంజిలన్ బలుక నుత్తమ భాగవతారు భక్తితో
నల్లన నగ్నిగుండమున నా కుజఁ దేల్చెడు ఘట్టమందునన్
చల్లదనంబు నిచ్చెను కృశానుఁడు వేసవి మండుటెండలన్
పల్లవి పెళ్ళి వేళ యిది భార్గవ తోడుత నాయె మూర్తమున్
రిప్లయితొలగించండిజల్లిరి సేస లందరును జంట హవమ్మును జేరె పొంగగా
నుల్లము హోమముల్ సలుప నోహొ కనుండదె వారి మోదమున్
చల్లదనంబు నిచ్చెను కృశానుఁడు వేసవి మండుటెండలన్.
నేఁ డీ శంకరాభరణ వేదికలో నెంతమంది కవు లప్రమత్తులై యిట్లు పూరించిరో గమనించుట సందర్భోచితము.
రిప్లయితొలగించండిచల్లఁదన మిచ్చె నగ్ని వేసఁగి వెలుఁగుల
చల్లఁదనంబు నిచ్చెను గృశానుఁడు వేసవి మండుటెండలన్
అవును కామేశ్వరరావు గారూ మీ రన్నది నిజం.
తొలగించండినీటి యావిర్ల మేఘాలు నంగినిలువ?
రిప్లయితొలగించండిచెట్లచిరుగాలిసోకంగ?చినుకుబడగ!
చల్లదనమిచ్చె! నగ్నివేసగివెలుగుల
తరుగజేయగ వర్షమేధరణి యందు!
అల్లదె శీతలీకరణ యంత్రముబెట్టుట కారణంబుగా
రిప్లయితొలగించండిజల్లదనంబునిచ్చెనుకృశానుడు,వేసవిమండుటెండల
న్నుల్లముహాయినొందునిక నూర్పులు దగ్గును మంచిగానగు
న్నెల్లరు పొందుడీ సుఖము నింటిని జేయుచు శీతలంబుగాన్
ఎన్నియో యొడుదుడుకుల నెదురు కొనియు
రిప్లయితొలగించండికడకు దైవమే వారిపై కరుణ జూప
నగ్ని సాక్షిగ నొకటైరి యపుడు వారు
చల్లదనమిచ్చెనగ్ని వేసగి వెలుగుల
ఉగ్ర నరసింహ మూర్తి పై నుర్వి జనులు
రిప్లయితొలగించండిచందనము తొలగగజేయ జ్వలన మయ్యె
గుండిగల గందమును పూయ కూర్మిమీర
చల్లదన మిచ్చె నగ్ని వేసఁగి వెలుఁగుల
నిన్నటి సమస్యకు నా పూరణ
శైశవము నందు చక్కని ఛాయగలుగు
స్నిగ్ధ సౌందర్య రాశి యే చివర కగును
శవముఁ, గాల్చెదరు,గుడిలో శివముఁ గోరి
పూజ సేతురు సాధకుల్ పుణ్య మొంద
ఆటవిడుపు సరదా పూరణ
రిప్లయితొలగించండిభాగ్యనగరం April 2018
ఎల్లరు విస్తుపోవగను నేప్రిలు మాసమునంతనున్ భళా
జల్లులు వెల్లువౌ విరిసి సానువులన్నియు సాగరమ్ములై
కల్లువకుంట్ల తారకుడు కల్వరమొందుచు చింతజేయగా
చల్లదనంబు నిచ్చెను కృశానుఁడు వేసవి మండుటెండలన్
సానువులు = త్రోవలు (పంజగుట్టలో)
రిప్లయితొలగించండితే.గీ:సతత మేమొసగు చునుండు చందమామ?
వంట వండవలయు నన్న వలయు నేది ?
మల్లెలఘమఘమ లెపుడు మహిని యుండు?
చల్లదన మిచ్చె నగ్ని వేసఁగి వెలుఁగుల.
ఉ.మా:ఉల్లము ఝల్లనన్ పడతి యుర్విజ మోదము తోడ తానటన్
మెల్లగ రాగ రాముడట మేలుగ వహ్నిని దూకమంచనన్
తల్లిని దైవమున్ మదిని దల్చుచు నింతియు నిప్పులో చొరన్
చల్లదనంబు నిచ్చెను కృశానుఁడు వేసవి మండుటెండలన్.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
చల్లదన మిచ్చె నగ్ని వేసఁగి వెలుగుల
సందర్భము: సీతను దర్శించి అశోకవన విధ్వంసం సృష్టించిన హనుమంతుడు రావణుని వద్దకు కొనితేబడ్డాడు. రావణుడు చంపబోతే విభీషణుడు దూతను చంపరా దన్నాడు. రావణుడు ఏదో శిక్ష వేయకుండా విడిచిపెట్టరా దని వానరులకు తోకయే భూషణ మని దానిని కాల్చివేసి లంక అంతటా తిప్పం డన్నాడు.
ఆంజనేయుని తోకకు పాత నూలు బట్టలు చుట్టి నూనె పోసి నిప్పంటించినారు రాక్షసులు. హనుమ కోపంతో వారిని కిందకు తోసివేసినాడు. రాక్షసులు మళ్ళీ బంధించినారు.
"వీళ్ళు న న్నేమీ చేయలేరు. కాని నేను సహిస్తాను. పట్టణ మంతా తిప్పేటప్పుడు పగటి పూట దుర్గ నిర్మాణాదులు చూడవచ్చు గదా!" అనుకున్నాడు మారుతి.
శంఖ భేరీలు మ్రోగిస్తూ రక్కసులు హనుమ చేసిన దుండగాలు చాటింపు వేయిస్తూ తిప్పినారు. రాక్షస కాంతలవల్ల యీ విషయం విని సీత దుఃఖంతో అగ్నిదేవుని..
*"శీతో భవ హనూమతః"* అని ప్రార్థించినది. అగ్ని కరుణించినాడు. వాయుదేవుడుకూడ చలిగాలివలె వీచినాడు. హనుమంతుడు తన తోక చల్లనిదైపోగా ఆశ్చర్య పడిపోయినాడు.
దృశ్యతే చ మహాజ్వాలః
కరోతి న చ మే రుజమ్
శిశిర స్యేవ సంఘాతో
లాఙ్గూలాగ్రే ప్రతిష్ఠితః
(సుందరకాండము సర్గ 53 శ్లో 35)
"ఈ అగ్ని పెద్ద జ్వాలలతో కనపడుతున్నది. కాని నాకు మాత్రం యే బాధా కలిగించడం లేదు. నా తోక చివర మంచుముద్ద పెట్టిన ట్టున్నది."
అనుకున్నాడు హనుమంతుడు. తరువాత పై కెగిరి గర్జించి నగరద్వారం పైకి వెళ్లి బంధనాలను విదల్చివేసుకొని ఒక ఇనుప పరిఘతో అక్కడి రక్కసులను చంపివేసినాడు. లంకను అగ్నికి సంతర్పణం చేయా లనుకొని ఉద్యమించినాడు.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
ఒక మేడపైనుండి యొక మేడమీదికి
నురవడిగా దూకు నొక్కమారు
నొక చెట్టుపైనుండి యొక చెట్టు మీదికిఁ
జక్కగా లంఘించు నొక్కమారు
బిక్కుబిక్కునఁ జూచు రక్కసి మూకల
ప్రక్క "ధ" మ్మని పడు నొక్కమారు
నగ్ని కీలలు రేగి యాకాశ మంటగా
"నోహొహో!" యని మెచ్చు నొక్కమారు
నది మహాజ్వాల కలదియైనప్పటికిని
దోచె నొక మంచు ముద్దయే తోక చివర
నున్నదో యన హనుమ, కోహో! యిదేమి!
చల్లదన మిచ్చె నగ్ని వేసఁగి వెలుగుల
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండికల్ల కపటాలు తెలియని కఠిన బ్రతుకు
బండలను గొట్టు వడ్డెరి బాధ జూసి,
చెరువు చెమటల శ్రమజీవి క్షేమము గన
చల్లదనమిచ్చె నగ్ని వేసగి వెలుగుల
ఇల్లును వాకిలిన్ గదుల కెంతయొ సెంట్రలు కండిషన్ను భల్
రిప్లయితొలగించండిచల్లదనంబు నిచ్చెను;...కృశానుఁడు వేసవి మండుటెండలన్
చల్లదనమ్ము నంతయును చంపగ బూనగ జాలిలేకయే
బిల్లు కరెంటుదిన్ కనగ బెల్లులు కొట్టెను నాదు గుండియల్