అక్కయ్యా, 'మల మును గనినంత' అన్న విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ, మూడవ పాదాలలో గణదోషం. "..వలలో జిక్కుకొనగ పలు బాధలు మరువన్। కల గన భగవద్రూపము..." అనండి.
ఉన్నదున్నట్లుగ గాక నిరంతరం మారునదదె జగతియని జడమైనను జీవమైనను శోషితమై తను అంతమొందునని లోపల నన్నుంచుకుని బయటి తళుకులకు మురిసిపోవనేటికిన్ మలము గనంగ ముక్తి కదె మార్గము జూపును భక్తకోటికిన్
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2679 సమస్య :: *మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్.* మలమును చూచినట్లయితే అదే ముక్తిని పొందేందుకు మార్గాన్ని చూపిస్తుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: గజేంద్రుడు, ద్రౌపది, కుచేలుడు, పరీక్షిన్మహారాజు మొదలైనటువంటి వారందఱూ మొదట చాలా కష్టాలను అనుభవించారు. ఆ తరువాత (*నీవే తప్ప నితః పరం బెఱుగ* అని)భగవంతుని శరణువేడి ఉత్తమ గతులను పొంది, *మోక్ష సాధన సామగ్ర్యాం భక్తి రేవ గరీయసీ* అని అంటూ భక్తిమార్గము యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియజేశారు. కాబట్టి వారివలె (ఉమ్మలమును) కష్టమును పొందినట్లైతే భక్తులకు ఆ కష్టమే ముక్తికి మార్గాన్ని చూపిస్తుంది అని విశదీకరించే సందర్భం.
పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు. డా. సీతా దేవి గారు నమస్సులు. ధన్యవాదములు. ఇక్కడ మల్లె మొగ్గగా కాక విరియుటకు సిద్ధముగా నున్నసౌగంధిక కుట్మలముగా నూహింప దగును. ధ్యాన ముద్రలో కనులు మూసుకొని యున్న యమ్మ వారి ముఖము పువ్వులా గాక మొగ్గగా భావించుట సమంజసమే కదా!
రిప్లయితొలగించండికలలో, జీవన యానము
న, లబ్జుగ మనుజుని మనసున, వెతుకగ జిలే
బి,లయన, నాట్యము లోన, వి
మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్!
పాకమె జిలేబి కాయువు :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివిమలమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లబ్జు' వంటి వ్యావహారిక పదాల ప్రయోగాన్ని నియంత్రించండి. 'లయను' అనండి.
ఇలలో సుందర మైనక
రిప్లయితొలగించండిమలములు వికసించు నెపుడు ,మదిదోచుగదా
విలువలు గలిగిన బ్రహ్మ క
మలమును గనినంత ముక్తి మార్గము దోచున్
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిబ్రహ్మకమలముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కులములు మతముల నెన్నక
రిప్లయితొలగించండినిలకడతో నాత్మశుద్ధి నెన్నిన నాడే
ఫలముంగ మానసిక ని
ర్మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమానసిక నిర్మలమంటూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
'ఫలముంగ'..?
🙏🙏🙏
తొలగించండి* ఫలముగను
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిసలిలమునందు బుట్టు జలజాతమపంకిలమైన భంగి , ని...
ర్మలమగు చిత్తవృత్తిఁ బెను మాయనెరింగి , యలౌకికమ్ము ని...
శ్చలమతినెంచి బ్రహ్మమను సారమెరుంగ , తొలంగజేయుచున్
మలముఁ ., గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశ్యామలము... రావి చెట్టు
తొలగించండిఊర్ధ్వమూలమధశ్శాఖమశ్వత్థం ప్రాహురవ్యయం
ఛందాంసి యస్య పర్ణాని యస్సంవేద స వేదవిత్ !!
పలు నిగమమ్ములున్ హరితపర్ణములై తరుమూలమూర్ధ్వమై
విలసిలునీ జగమ్మనెడి వృక్షమనన్ తలక్రిందులైన కొ...
మ్మల గననొప్పు , నిద్ది మహిమాన్వితమవ్యయమౌ నటంచు , శ్యా ...
మలముఁ గనంగ ముక్తికదె మార్గముఁ జూపును భక్తకోటికిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నవి! అభినందనలు! 💐💐💐🙏🙏🙏🙏
తొలగించండిఇలలో భవబం ధములను
రిప్లయితొలగించండివలలో జిక్కుకొ నంగ బాధలు మరువన్
కలగాంచిన భగవ ద్రూపము
మలమును గనినంత ముక్తి మార్గము దోఁచున్
ఇక్కడ" మల = కొండ
అక్కయ్యా,
తొలగించండి'మల మును గనినంత' అన్న విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ, మూడవ పాదాలలో గణదోషం. "..వలలో జిక్కుకొనగ పలు బాధలు మరువన్। కల గన భగవద్రూపము..." అనండి.
ఇలలో భవబం ధములను
తొలగించండివలలో జిక్కుకొనగ పలుబాధలు మరువన్
కలగన భగవ ద్రూపము
మల మును గనినంత ముక్తి మార్గము దోఁచున్ .
రిప్లయితొలగించండిఇలన జనాళికిన్ సఖియ! యీప్సిత మైనది మోక్ష మే సుమా
కలగన నేల దాని కొర కై యతనమ్మును చేయ మేలగున్
పలుకున, నెమ్మి నెక్కొనగ, బంధము లన్విడి, చింత చేసి, ని
ర్మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్
మరో పాకం :)
జిలేబి
పాక శాస్త్రములో అందె వేసిన చేయి మరి ఏమైనా వండగలరు
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'ఇలను' అనండి.
(స్వామి పుష్కరిణి )
రిప్లయితొలగించండిఅమలము ; సుహృదయ పరిష
ద్విమలము ; తిరువేంకటవిభు విలసిత కరుణా
కమలము ; పరిపూరిత కో
మలమును గనినంత ముక్తిమార్గము దోచున్ .
బాపూజీ గారూ,
తొలగించండిశబ్దాలంకారం మనోహరంగా ఉన్నది. కాని ప్రాస తప్పింది. సవరించండి.
అలాగేనండీ !సరిచేస్తాను .
తొలగించండిలలితము; సుహృదయ పరిష
తొలగించండిత్కలితము; తిరువేంకట విభు కరుణా నేత్రాం
చలితము; పరిపూరిత కో
మలమును గనినంత ముక్తి మార్గము దోచున్
బాపూజీ గారూ,
తొలగించండిమీ తాజా పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండి
రిప్లయితొలగించండిపిలిచిన పలుకునతడు! కొం
డల రాయుని దేవళమ్ము! డాంకృతి యదిగో!
అలసిన మేనికి సఖి, తిరు
మల, మును గనినంత, ముక్తిమార్గము దోఁచున్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండితిరుమల మును గనినంత అంటూ చక్కని పూరణ నందించారు. అభినందనలు.
నిలువగ లేదీ కాయము
రిప్లయితొలగించండికలకాలము భూమియందు గదరా నరుడా!
కలవర పడువేళన కా
మలమును గనినంత ముక్తి మార్గము దోచున్
విరించి గారూ,
తొలగించండికామలము (వసంతం) తో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వేళను' అనండి.
ఉన్నదున్నట్లుగ గాక నిరంతరం మారునదదె
రిప్లయితొలగించండిజగతియని
జడమైనను జీవమైనను శోషితమై తను
అంతమొందునని
లోపల నన్నుంచుకుని బయటి తళుకులకు
మురిసిపోవనేటికిన్
మలము గనంగ ముక్తి కదె మార్గము జూపును
భక్తకోటికిన్
మిత్రమా ఏ పద్యమిది ఒక్కసారి సరిచూడుము
తొలగించండికృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిఅది పద్యం కాదు. వారి భావాన్ని అలా వ్యక్తం చేశారు. అప్పుడప్పుడు జిలేబీ గారు వారి భావానికి పద్యరూపాన్ని ఇస్తూ ఉంటారు.
నిముసము జారగ నీయక
రిప్లయితొలగించండిసమధిక భక్త్యానురక్తి సరగున లక్ష్మీ
రమణుని,వరదుని,ప్రేమగను పదక
మలమునుఁగనినంత ముక్తి మార్గముఁదోచున్
మిత్రమా ప్రాస నొక్కసారి సరిచూడుము
తొలగించండిప్రసాద రావు గారూ,
తొలగించండిప్రాస, మూడవ పాదంలో గణాలు తప్పాయి. సవరించండి.
ధన్యవాదములు అలాగే సవరిస్తాను
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రమా ప్రాస నొక్కసారి చూడుము
తొలగించండిపలువిధములైన సేవల
రిప్లయితొలగించండిసలుపుచు ప్రజలకు, నశించు సమయము నందున్
వలిమలపై ప్రీతిని శ్యా
మల, మును గనినంత ముక్తిమార్గము దోఁచున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అలమేలుమంగ పతి తిరు
రిప్లయితొలగించండిమల రాయుడు కొండపైన మనుజుల కొరకున్
వెలసెను,దీవించు కరక
మలమును గనినంత ముక్తి మార్గము దోచున్
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండికర కమలంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికలియుగ దైవముగా నిల
వెలసిన యా వేంకటపతి వేడుకొనుచునా
నలినాక్షుని సాధుపద క
"మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్"
జనార్దన రావు గారూ,
తొలగించండిపద కమలంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పిలిచిన బలికే దైవము
రిప్లయితొలగించండివెలసెను కొండల నడుమన, వేడుచు భక్తిన్
గొలుచుచు వెంకన్న కర క
మలమును గనినంత ముక్తి మార్గము దోచున్!!!
శైలజ గారూ,
తొలగించండికర కమలంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పలికే' అన్నది వ్యావహారికం. "పలికెడి" అనండి.
[15/05, 06:16] +91 75698 22984: 15, మే 2018, మంగళవారం
రిప్లయితొలగించండిసమస్య - *2679*
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
*"మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్"*
(లేదా...)
*"మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్"*
http://kandishankaraiah.blogspot.in
[15/05, 07:03] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి
కలహించక వినుముసఖా
వలపులతేనెలివి నిన్ను వంచన జేయున్
తెలివిగ పరమాత్ముని "తిరు
మల" "మును" గనినంత ముక్తి మార్గము దోచున్
చారి గారూ,
తొలగించండితిరుమలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మలములచే నిండిన తమ
రిప్లయితొలగించండిబలహీన తనువుల యందు పావనమౌచున్
తలపై నుండెడి బ్రహ్మక
మలమును గనినంత ముక్తి మార్గము దోచున్!
సీతాదేవి గారూ,
తొలగించండిబ్రహ్మకమలంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండిస లలిత మురళీ గానము
రిప్లయితొలగించండివిలసిత సమ్మోహనoబు విమల ప్ర ద మౌ
చె ల గెడు హరి గాత్ర శ్యా
మల ము ను గని నంత ముక్తి మార్గ ము దోచున్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలలను బోలును బ్రతుకును
తొలగించండితలచక కలలే గనకను తపమును జేయన్
వల మాయల వీడి మది క
మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్
tku sankariah garu...
తొలగించండివలపులు విరిసెడి వయసున
రిప్లయితొలగించండిచెలియను గలియగ దలచెడు చెలికానికటన్
కలువల రాయని జత కా
మలమును గనినంత ముక్తిమార్గము దోచున్!
విరించి గారికి ధన్యవాదాలతో!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! కామిగాని వాడు మోక్షగామి కాడుగదా! 🙏🙏🙏
తొలగించండివెలలేనిది జ్ఞానమనెడి
రిప్లయితొలగించండిహలమును గొని దుక్కి చేయ నంతర్ముఖుడై
సలలిత నిర్మల హృదయ క
"మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్"
👏👏👌👌💐💐
తొలగించండివిట్టుబాబు గారూ,
తొలగించండినిర్మల హృదయ కమలముతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2679
సమస్య :: *మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్.*
మలమును చూచినట్లయితే అదే ముక్తిని పొందేందుకు మార్గాన్ని చూపిస్తుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: గజేంద్రుడు, ద్రౌపది, కుచేలుడు, పరీక్షిన్మహారాజు మొదలైనటువంటి వారందఱూ మొదట చాలా కష్టాలను అనుభవించారు. ఆ తరువాత (*నీవే తప్ప నితః పరం బెఱుగ* అని)భగవంతుని శరణువేడి ఉత్తమ గతులను పొంది, *మోక్ష సాధన సామగ్ర్యాం భక్తి రేవ గరీయసీ* అని అంటూ భక్తిమార్గము యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియజేశారు. కాబట్టి వారివలె (ఉమ్మలమును) కష్టమును పొందినట్లైతే భక్తులకు ఆ కష్టమే ముక్తికి మార్గాన్ని చూపిస్తుంది అని విశదీకరించే సందర్భం.
ఇల ఘన కష్ట మందుచు గజేంద్రుడు ద్రౌపదియున్ కుచేలుడున్
అలఘు పరీక్షిదాదులు మహర్దశ నందిరి దైవభక్తులై,
సులభము భక్తిమార్గమని సూచన జేసిరి, వారివోలె ను
*మ్మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్.*
{ఉమ్మలము = కష్టము}
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు* (15-5-2018)
కష్టాలే ముక్తికి మార్గమని అద్భుతంగా పూరించారు అవధానిగారూ! నమోనమః! 🙏🙏🙏🙏🙏
తొలగించండిశ్రీమతి సీతాదేవి గారూ! ప్రణామాలమ్మా.
తొలగించండిరాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అత్యద్భుతంగా ఉన్నది. అభినందనలు.
గురువరేణ్యులు
తొలగించండిశ్రీ కంది శంకరయ్య గారికి హృదయపూర్వక ప్రణామాలు.
ఇలలో పూజలు చేతురు
రిప్లయితొలగించండినిలింపను జనత, శుభముల నిచ్చు ను గోమా
తలెపుడు , మూత్రస హిత గో
మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్"
కృష్ణసూర్యకుమార్ గారూ,
తొలగించండిగమయాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలి కల్మష నాశుండగు
రిప్లయితొలగించండివిలసత్ శ్రీ వేంకటేశు విఖ్యాతంబౌ
చెలువుకు నెలవగు పాద క
మలమునుఁగనినంత ముక్తి మార్గముఁదోచున్
ప్రసాద రావు గారూ,
తొలగించండివేంకటేశ్వర పాద కమలమును ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండిమలమని వెరచెద వేలా!
ఫలాదులను తాకినావు పంకిల మాయె
న్నిలను జిలేబి మలమెవరు ?
మలమును గనినంత ముక్తిమార్గము దోచున్!
జిలేబి
తొలగించండిమలమని వెరచెద వేలా!
ఫలాదులను తాకినావు వర్చస్కమయె
న్నిలను జిలేబి మలమెవరు ?
మలమును గనినంత ముక్తిమార్గము దోచున్!
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కం:-
రిప్లయితొలగించండివిలసిత బలమెరుగుటకు వి
మలపు మనమ్మును ధరించి మననముజేయన్
తలమెరిగిన గురుపాద క
మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్!!
@ మీ పాండురంగడు*
౧౫/౦౫/౨౦౧౮
గురుపాద కమలములు! నమోనమః! 🙏🙏🙏👏👏👏
తొలగించండిపాండురంగా రెడ్డి గారూ,
తొలగించండిగురుపాద కమలంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారికి మరియు SeethaDevi Gurram వారికి భక్తిపూర్వక ప్రణామములు ������.
తొలగించండిగురూజీ...గురుపాదకమలమును అని ఏక వచన ప్రబోధముకన్నా ..గురుపాదకమలములు అని పూరించడంలో వెసలుబాటుగలదా ������
కాని సమస్యాపాదంలో 'మలమును' అని ఏకవచనమే ఉన్నది కదా! దానిని మార్చకూడదు.
తొలగించండి🙏🙏🙏🙏🙏
తొలగించండిమలహరుడు!శివుడు!మినుసిక
రిప్లయితొలగించండిగలాడు!జడధారి!గరళకంఠుడు కోరున్
జలయభి షేకము వర కో
మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్"
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జల + అభిషేకము = జలాభిషేకము' అవుతుంది. యడాగమం రాదు.
ఇలవేంకటరమణుందరి
రిప్లయితొలగించండిగలుషితమగుమనసుతోడ గాంచగనేగ
న్నలిపిరి నాధునిగిరి,దిరు
మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తిరుమల మును'...అని పదవిభాగం చేస్తే బాగుంటుంది.
సమస్య :-
రిప్లయితొలగించండి"మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్"
కందము*
కలియుగ ప్రత్యక్ష ప్రభువు,
నిలవేల్పు,దయా పయోధి,నిష్టపు దైవమ్
కొలువైన ప్రదేశము తిరు
మల మును గనినంత ముక్తిమార్గము దోఁచున్
....................చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దైవమ్' అని హలంతంగా వ్రాయరాదు. "ఇష్టేశ్వరుడే। కొలువైన..." అనండి.
అలాగే సర్
తొలగించండిధన్యవాదములు సర్
కోటవారి బాటలో
రిప్లయితొలగించండితొలగ నహంకృతి ,మీదుగ
బలపడ భక్తియె మనమున బహు విధములుగా
తలచగ జనులకు ధరను
మ్మలమును గనినంత ముక్తికి మార్గముగోచున్!
🙏🙏🙏🙏
సీతాదేవి గారూ,
తొలగించండిమీ తాజా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా!🙏🙏🙏
తొలగించండికందం
రిప్లయితొలగించండిఇలలో యున్నత మైనవె
యలంకరణములుగ నొప్పు హరి హృదయమునన్
గల కౌస్తుభమ్మమరిన క
మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ఇలలో నున్నత..." అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
తొలగించండికందం
ఇలలో నున్నత మైనవె
యలంకరణములుగ నొప్పు హరి హృదయమునన్
గల కౌస్తుభమ్మమరిన క
మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్
చంపకమాల
రిప్లయితొలగించండిఇల శివుడే నగమ్మనఁగ నేర్పడె నా నరుణాచలమ్ము! కే
వల స్మరణంపు మాత్రమున భక్తుల కోర్కెల దీర్చు శంకరుం
దలపుల నింపుచున్ రమణు ధ్యాన సమాధిని యాశ్రమంపు ని
ర్మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్
సహదేవుడు గారూ,
తొలగించండినిర్మల రమణాశ్రమాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"సమాధిని నాశ్రమంపు..." ఆనండి.
గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణము:
తొలగించండిచంపకమాల
ఇల శివుడే నగమ్మనఁగ నేర్పడె నా నరుణాచలమ్ము! కే
వల స్మరణంపు మాత్రమున భక్తుల కోర్కెల దీర్చు శంకరుం
దలపుల నింపుచున్ రమణు ధ్యాన సమాధిని నాశ్రమంపు ని
ర్మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్
తలచగవేంకటేశ్వరునిదర్శనభాగ్యములేనిదైనయా
రిప్లయితొలగించండి"మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్
వలదురసందియంబికనుబావనమూర్తిని గన్నులారగా
దలపునలోనజూడుమికదన్మయమొందగస్వామిరూపమున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలవర మేల మనః క
రిప్లయితొలగించండిశ్మల పరిహార సువిభూతి మానవుల కిలన్
లలితా దేవీ ముఖ కు
ట్మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్
చలిమల చూలి మర్త్యులకు సంతస మీయఁగ నన్నపూర్ణ యై
వెలయఁగఁ జంద్రశేఖరుఁడు ప్రీతిని నుంచ శిరమ్ము నందునన్
లలిత వరాణసీ పురి ఫలప్రదమై చను జాహ్నవీయ కో
మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్త కోటికిన్
[కోమలము = నీళ్ళు]
అద్భుతమైన పూరణలార్యా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండిముఖ కమలముల , కుట్మల దంతముల పోలిక రివాజు! మీ ముఖ కుట్మల ప్రయోగము వినూత్నంగా , సుందరముగా నున్నది! 🙏🙏🙏
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.
తొలగించండిడా. సీతా దేవి గారు నమస్సులు. ధన్యవాదములు.
ఇక్కడ మల్లె మొగ్గగా కాక విరియుటకు సిద్ధముగా నున్నసౌగంధిక కుట్మలముగా నూహింప దగును. ధ్యాన ముద్రలో కనులు మూసుకొని యున్న యమ్మ వారి ముఖము పువ్వులా గాక మొగ్గగా భావించుట సమంజసమే కదా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండినూటిటి నూరుశాతము సమంజసమే! 🙏🙏🙏🙏🙏
తొలగించండిధ్యానధ్యాతృధ్యేయరూపా!
తొలగించండి🙏🙏🙏
తొలగించండి👌👏🛐🛐🛐
తొలగించండికవి వరద్వయము మిస్సన్న గారు సహదేవుడు గారికి నమస్సులు.
తొలగించండిసలలిత మలపున తలపులు
రిప్లయితొలగించండివలువలవలె విలువ!భక్తిభావన మనసే
నలుగక "నాధ్యాత్మికత న
మలమును గొనినంతముక్తిమార్గముదోచున్":
ఈశ్వరప్ప గారూ,
తొలగించండివృత్త్యనుప్రాసతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండిస్థలమిది సార్వభౌములు నిజాముల కూకటపల్లిలోనివౌ
మలినపు కాల్వ నీరము రమారమణీయ తెరాస శుద్ధిచే
సలలిత భాగ్యనాగరిక సాగరు తోయము నందుజేరు కో
మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్ :)
కోమలము = నీళ్ళు
(శబ్దరత్నాకరము)
https://www.google.co.in/amp/s/www.deccanchronicle.com/amp/nation/current-affairs/260418/hussainsagar-lake-stench-raises-a-stink.html
పథ్యధార చాలా బాగుందండీ
తొలగించండిపద్యం లాగానే 👏🙏
...మైలవరపు మురళీకృష్ణ
😊😊😊
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవిడుపు పూరణలన్
నేటి విషయముల పయిన కనికని యగువులో
జాటరు డమాలు పదముల
తాట వొలుతురు మన శాస్త్రి తరుణి జిలేబీ
జిలేబి
భక్తికి రక్తికి ముక్తికి
తొలగించండిశక్తియు సహనమ్ము లేని శాస్త్రిని తరువాయ్
భుక్తికి జీవించుచు మీ
యుక్తుల భజియింతునమ్మ యువతి జిలేబీ!
😊
తలపున జూడుమోయి మన తల్లి ముఖాబ్జము నెర్రనైన త
రిప్లయితొలగించండిమ్ములమున నోష్ఠమున్, మెరయు ముక్కెర, దృక్కులకాంతి, కుందకు
ట్మలరదనంపు వెల్గు, ప్రకటమ్మగు వామ మరాళ నేత్ర ప
క్ష్మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్త కోటికిన్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండిఅలవైకుంఠపురమ్మున
రిప్లయితొలగించండికొలువై సతినెదనునిల్పి కూరిమి తోడన్
వెలసిన శ్రీహరి పాదక
మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్.
2.కులమతభేదము లెంచక
కలియుగదైవంబనంగ కామిత మొసగ
న్నిల వెలసిన హరి చరణక
మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్.
3.అలిమేల్మంగాపతినిట
కొలువంగ తొలగునఘములు కువలయమందున్
తలచుచు శ్రీవాసుని పద
మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్.
4చం:జలమది వారణాశిపురిఁజక్కగ పారుచు నుండు నెప్పుడున్
గలగలసవ్వడిన్ సతము గానము వోలెను చేయుచుండగా
కొలిచెడు భక్తకోటికిని కోర్కెలు దీర్చెడి శంభుపత్ని కో
మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఒకటి రెండు సవరణలు వాట్సప్‍లో సూచించినట్టున్నాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇలపై నరుడై పుట్టిన
తొలగించండియల వైకుంఠ పురవాసి హరినే మదిలో
దలచుచు రాముని చరణ క
మలమును గనినంత ముక్తి మార్గము దోచున్
కులమత భేదముల్ గనుచు గుట్రలు పన్నుచు స్వార్థబుద్ధితో
రిప్లయితొలగించండిలలనలు శ్రీలకున్ బెనుగు లాటలు పాపపు కార్యముల్ సదా
యిల నరులే గదా పరమ హీనులు, శాశ్వత మంచు నెంచిరో
నిలువని కాయమున్ గనుచు నిక్కమిదే యను బ్రాంతి యందు, కా
మలము గనంగ ముక్తికదె మార్గము జూపును భక్త కోటికిన్
(కామలము = మరుభూమి, శ్మశానం )
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తలపోయుచుండ దేవుని
రిప్లయితొలగించండికెలవుదొరకెడు విధము వెతికినపుడు మన దే
వళమున నిత్యము మను ఆ
మలమును గనినంత ముక్తిమార్గము దోచున్
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లలిత లతాంతస్పర్శకు
రిప్లయితొలగించండిసలలిత సిందూర వర్ణ చందపు కాంచీ
తల కామాక్షీ పాద క
మలమును గనినంత ముక్తి మార్గము దోచెన్
రవికిరణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వర్ణ చందపు'...?
ఇలుజేరినంత తిని మెతు
రిప్లయితొలగించండికులు నాలుగు విశ్రమింపఁ గోమలి వ్రేళ్ళన్
జిలుకలుగా నలరారు త
మలమును గనినంత ముక్తి మార్గము దోచెన్
ఊకదంపుడు గారూ,
తొలగించండిబహుకాల దర్శనం.. సంతోషం!
మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
*15.5.18*
రిప్లయితొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
మలమును గనినంత ముక్తి మార్గము దోఁచున్
సందర్భము: బ్రహ్మ గడిగిన పాదము.. అంటూ.. బలి తల మోపిన పాదము.. అంటూ.. అన్నమాచార్యులు భక్తి పారవశ్యంతో శ్రీ వేంకటేశ్వరుని ప్రార్థిస్తున్నారు..
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
నలువయుఁ గొలిచిన యట్టిది...
బలియొక్క తలపయి మోప
బడి నట్టిదియున్...
గలనైనను నీ పాద క
మలమును గనినంత ముక్తి మార్గము దోఁచున్
మరొక పూరణము..
మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ
జూపును భక్తకోటికిన్
సందర్భము: ఒక తిండిపోతు యెలా తెగ తిన్నాడో చూడండి. ఆ విందు భోజనంలో యెన్ని వున్నాయో అన్నీ ఆరగించినట్టుంది. అదీ రాత్రిపూట. అలయక... అలసిపోకుండా..
మీరూ అలా ఓపికగా మెక్కగలిగిన ట్టైతే పొద్దున్నే అద్వైతమే సిద్ధిస్తుంది. (రాత్రి ద్వైత మంతా తెల్లవారేటప్పటికి అద్వైతమై తీరుతుంది.) అనుమానం లేదు. ఆచరణలోనే తేలాలి.
రాత్రి వేర్వేరుగా వున్నవి పొద్దున్నే ఒక్కటైపో తున్నాయి కదా!
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
అలయక లడ్లు భక్ష్యములు
నన్నము పూరి జిలేబి యాలుబాత్
వెల గల పప్పు పచ్చడులు
వేపుడులున్ వడలున్ రసంబు కూ
రలు నెయి సాంబరున్ పెరుగు
లన్ దెగ మెక్కుడు రాత్రి, వేకువన్..
మలముఁ గనంగ ముక్తి కదె
మార్గముఁ జూపును భక్త కోటికిన్
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా.పిట్టాసత్యనారాయణ}
రిప్లయితొలగించండికలితమె
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండికలితమె కర్మచోదితము గాసిలి జెందకు బ్రహ్మ రాతకౌ
మెలికల గాంచు శోధనల మీటిన 'గౌతము' బాట వేదమౌ
తలగల జీవి కెప్పటికి తప్పదు పాపము దుష్ట యోచనా1
మలము గనంగ ముక్తికదె మార్గము జూపును భక్త కోటికిన్
(సమ్యక్ విచారమునకు శత్రువు.కలితము, పొందినది,శ.ర
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండికలలోనైనను మరువక
సలలితముగ లోపములను సరిదిద్దంగన్
ఇల బ్రాహ్మీ ఘడియల హృది
మలమును గనినంత(ధ్యాన సమయములో) ముక్తి మార్గము దోచున్
కలియగ సాధు పుంగవుని కారణ జన్ముని కాకతాళిగన్
రిప్లయితొలగించండివలవల నేడ్చి పూర్వమున వందల జేసిన పాపకృత్యముల్
కలవరమౌచు మాపుకొన కష్టము నెంచక మానసమ్మునన్
మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్