10, మే 2018, గురువారం

జడ శతకము

       2014 సెప్టెంబరులో ముఖపుస్తకంలో జ్యోతి వలబోజు, బ్నిం గారు 'జడ శతకం' ప్రచురిస్తున్నామని కవిమిత్రుల నుండి పద్యాలను ఆహ్వానించారు. మన బ్లాగు మిత్రులు కొందరు ఉత్సాహంగా పద్యాలు వ్రాసి పంపారు. శతకం కనుక 'జడా!' అన్న మకుటంతో పద్యాలు వ్రాసారు. ఆ తర్వాత నిర్వాహకులు మకుటం ఉండరాదన్న నియమాన్ని పెట్టారు. దానితో మకుటంతో వ్రాసిన పద్యాలు అప్పటి ముద్రణకు నోచుకోలేదు. మిత్రులు నిరుత్సాహానికి లోనయ్యారు.
           ఈరోజు ఒక బ్లాగు వీక్షకుడు నాటి జడ పద్యాలు బాగున్నాయని ప్రశంసిస్తూ వ్యాఖ్య పెట్టారు. ఆనాటి పద్యాలు గుర్తుకు వచ్చాయి. ఒకసారి ఆ పద్యాలను వీక్షించాను. నాటి శ్రమ వ్యర్థం కారాదనిపించింది. మిగిలిన కవిమిత్రులతో పద్యాలు వ్రాయించి శతకాన్ని పూర్తి చేయాలని, ప్రచురించాలని నిర్ణయానికి వచ్చాను. 
          ఇప్పుడు బ్లాగులోను, వాట్సప్ సమూహంలోను దాదాపు 150 మంది కవులున్నారు. ఒక్కొక్కరు 'జడ' మకుటంతో రెండేసి పద్యాలు వ్రాయండి. 'జడ శతకము' అన్న పేరుతో తాత్కాలికంగా ఒక సమూహాన్ని ఏర్పాటు చేసాను. మిత్రులందరినీ అందులో చేర్చుతున్నాను. మీ పద్యాలను అక్కడ పోస్ట్ చేయండి. వాట్సప్ నెంబరు లేనివారు బ్లాగులో ప్రకటించండి.
పరిష్కరించి, ఎన్నుకొని 116 పద్యాలతో 'జడశతకము' రూపుదిద్దుతాను. 
                    మీ పద్యాలు పంపడానికి గడువు 20-5-2018.

35 వ్యాఖ్యలు:

 1. ఉవిదల కందము గూర్తువు
  కవులకు ఘనమైన స్ఫూర్తి కలిగింతువుగా !
  యెవరైనను తగువారలు
  భువి గలరే నిన్ను బొగడ పొలుపైన జడా!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కురులను నొక క్రమరీతిగ
  పరగంగా నందముగను బంధించెదవే!
  మరులు గొలుపి మదిలో చూ
  పరులకెపుడు కడు పసందు పంచుచును జడా!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వాట్సప్ గ్రూప్‍లో పద్యాలు ప్రకటించలేనివారే, ఇందులో తమ పద్యాలను ప్రకటించగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు

  1. ఈ గ్రూపు పేరు నెంబరు ఏమిటండి మధుసూదన్ గారు ?

   తొలగించు
  2. గ్రూపు పేరు "జడ శతకము". వాట్సప్ నెం. 7569822984.
   మీరు మీ పద్యాలను ఇక్కడ ప్రకటిస్తే చాలు.

   తొలగించు
 4. అతివల కందము బెంచును
  సతతమునాద్రాచువోలె సాగెడు జడయు
  న్మితిమీరిన పొడవునయది
  గతితప్పక నుండునెడల గారవముజడా!

  కొప్పున ముడివేతురునిను
  గొప్పున ముడివేసిపూలు కోమలు లరయ
  న్నిప్పుడ యప్పుడ యనకను
  నెప్పుడు నిను జూచుచుండ్రు నిష్టముగజడా!

  రచన-పోచిరాజు సుబ్బారావు

  ప్రత్యుత్తరంతొలగించు
 5. కులు కుల న డ లకు నంద ము
  పలు వంపు ల సొంపులైన వాల్జడ వ గు చు న్
  మెలిక లు తిరుగు చు వింతౌ
  పులకలు రేపె ద వు జూడ పొల్పు గ ను జడా !

  ప్రత్యుత్తరంతొలగించు
 6. జడ ముగ నుండక చురుకు గ
  గడగడ లాడింతు వు గద కన్నులు చె ద ర న్
  పుడమి ని న సూయ చెందుచు
  జడ లేని రమణులు కుడు గు సంత సము జడా !

  ప్రత్యుత్తరంతొలగించు
 7. జడశతకమునకుపంపించుపద్యాలు
  ౧)కురులకు నైఖ్యతబెంచుచు
  సరసంబును సాకునట్టి సంపద!వనితా
  పరువము నిలుపుచు!తలకున్
  సరియగు నుష్ణతను బంచు జాగ్రత్త జడా!
  ౨)నడచిన తాళము వేయును
  వడివడి నడుగులకు తబల వాయిధ్యంబౌ!
  ముడిచిన మల్లెసుగంధము
  విడువక ప్రియుడందుకొనగ?విచ్చిల్లుజడా!
  కె,ఈశ్వరప్ప, ఆలూరు కర్నూలు జిల్లా

  ప్రత్యుత్తరంతొలగించు
 8. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,


  [ శివు డను ప్రజాబంధువు గతించగా ఆ ఊరి జనులు అమితభక్తితో

  శివాలయములోనే ఆతని గాల్చిరి ]


  " శివు " డా పట్టణ మందు సజ్జనుడు , సఛ్ఛీలుండు , దానవ్రతుం

  డు , వదాన్యుండు , మహానుభావుడు , దయాలోలుండు , సేవ్యుండు ని

  హ్నవహీనుండు , ప్రజార్తబంధు వకటా నాకస్థు డయ్యెన్ ! హరా !

  భవ ! నీ చేరువ దత్కళేబరము భస్మీకరించన్ దగున్

  శివ ! మమ్మున్ క్షమియించు తండ్రి యనుచున్ సీమప్రజల్ వేడుచున్

  శవమున్ గాల్చెద రాలయమ్మున || బ్రజాసంక్షేమముం గోరుచున్

  " శివునిన్ " బోలు మనీషి నివ్వు మనుచున్ సేవించి రా శంకరున్ !


  { వదాన్యుడు = మనోఙ్ఞముగా మాటాడు వాడు ; నిహ్నవహీనుడు

  = కపటము లేని వాడు }

  ప్రత్యుత్తరంతొలగించు
 9. కొబ్బరి నూనె నలమెనొక
  గుబ్బెత తన పొడుగు కురుల కొసకంటన్! మున్
  జబ్బను వైచుచు మురియుచు
  నబ్బురముగఁ బేనెనొక్క నయగారి జడా!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. లోలాక్షులు నడయాడన్
   శ్రీలుగ నటునిటు నితంబసీమన్, ఊగే
   లోలకమాడుటఁ గాంచెన్,
   బేలగ నొకధీరుడు కడుబెంగపడి జడా!

   తొలగించు
  2. వనితయొకతె తనమునిపం
   డ్లనడుమ దువ్వెనబిగించి,లబ్జుగకురులన్
   వెనుకగ కైఁగొని జిగిక్రొ
   న్ననవిలుతుని శింజినివలెనల్లె సిరిజడా!

   తొలగించు
  3. జడకు మూడు పాయలుండును కదండీ. అందువలన మూడు కందాలు.

   తొలగించు
  4. జడ పాశమై పట్టెను. మరొక్కటి!..


   తలలో మెదలెడు తలపులు
   సులువుగ నవగతమగునొకొ? సుదతులసాధ్యుల్!
   తలతో బంధముయుండుట
   వలనన్,కనుగొని తెలుపుము వైఖరులు జడా!

   పరా, పశ్యంతీ, వైఖరులలో వైఖరిగా భావించ వలె!

   -శ్రీకాంత్ గడ్డిపాటి

   తొలగించు
  5. ఇంకొకటి....

   దువ్వుచు,చిక్కులుదీయుచు,
   నవ్వుచు,నొండొరుకురులను నైపుణ్యముగాన్
   నెవ్వలుదీర్చిరి ముదితలు
   మువ్వురు! పువ్వులుతురిమిరి ముచ్చటగ జడా!

   తొలగించు
  6. స్థానమువారిది జడ!యా
   వేనలి కులుకును,పలుకును,వెన్నుని పిలచున్!
   తానే సాత్రాజితియై
   యానతినిచ్చును!నియంతయా? లేకజడా?

   తొలగించు

  7. స్థానం నరసింహారావుగారి అనంతర కాలంలోని వాడను. ఆ పరంపరలో నా చిన్నతనాన, కేవలము జడ తెరపై వైచి కళలొలికించిన యొక ప్రదర్శన చూచి తరించితిని. అప్పుడు స్థానము వారి జడ గురించి పెద్దలు చెప్పుకొనగా విని రాసినట్టి పద్యము.
   ఎవరైనా ఆయన ప్రదర్శన చూచిన వారు ఒకటి రెండు మహత్తర పద్యములు రాసి శతకమందు కూర్చిన, సముచితముగా యుండునని నాయభిప్రాయము.

   ఇక ఇట్టి జడపద్దియములనెన్నుకుని, చిక్కుదీసి, శతకబంధమొనరింపవలెనని గురువర్యులను కైమోడ్చి ప్రార్ధించుచున్నాను.

   తొలగించు

 10. ఆహా! ఇంతగా పొగిడేస్తున్నారే కవివరులు నిన్ను జడా ! నిజమే నంటావా ?


  హా!కొత్తిమీర కట్టగ
  మా కంజముఖుల తలపయి మారితివిగదా
  నీ కుచ్చుల మెచ్చుచు భళి
  యీ కవి వరులొనరిచిరి కయితల సయి‌ జడా!

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు

 11. మరీ సర్రియలిమయిపోతోంది‌:)

  హా! రెండు జడలు ముద్దన
  మా రాధ తలపయినొక జమానా లోనన్
  తీరుగ చక్కగ నుంటివి
  మారన్ కాలమ్ము మాయ మయినావె జడా!

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు


 12. మారితివే బాబ్డ్ భగినిగ
  మారితివే తేనెగూడు మదిరనయనగా
  మారితి వే బన్ను చెలిగ
  మారితివే కర్లి కర్లి మాధురిగ జడా !

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు

 13. 1 . రాజేశ్వరి . నేదునూరి .
  కందము .
  ఉల్లము రంజిల్లు నటుల
  నల్లని జడకటి పైన నడయా డంగా
  తెల్లని మల్లెలు తురమిన
  యల్లిక గజిబిజి నిగాంచ యందమె జడ
  -----------------------------
  2 . రాజేశ్వరి నేదునూరి
  తేట గీతి .
  కన్ను లకువిందు జేయగ వెన్ను పైన
  నల్ల త్రాచును మించిగ వెల్లి విరియు
  నాట్య మాడుచు కదలాడ నయన ములకు
  కవుల గుండెలు జల్లన కవన మెజడ
  ప్రత్యుత్తరంతొలగించు
 14. అందము చిందులు వేయగ
  బంధించగ మగని మెడను బహు ప్త్రీతి యనన్
  సందేళకు మల్లె సౌరులు
  విందొన రించంగ మదికి వేడుక జడతోన్
  రాజేశ్వరి . నేదునూరి

  ప్రత్యుత్తరంతొలగించు
 15. బారెడు పొడువున్న కురుల
  నే రమణీయముగ దువ్వ నిక్కమె యదియున్
  జేరును వక్షోజమ్ముల
  నారినితంబముల పయిన నడయాడు జడా.


  ముదముగ కురులను దువ్వుచు
  వదులుగ నల్లినను చాలు పాటవ మొప్పన్
  నెదగిలి గింతల బెట్టెడు
  మదవతి యందము నకు కొలమానికయె జడా.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. చెదరు కురులవలె తలపులు
  మదినందున నాట్యమాడ మతముతెలియదే
  కుదురుగ నోరిమినల్లగ
  విదితమగుట నిజము నీదువిధముగనె జడా
  ----------
  బాలిక వీపున రెండుగ
  చీలిన నీవు కదలాడు చెన్నును చూడన్
  మేలున బాముల జంటయె
  కేళిక చేయు తలపుమది( గెలుకు గదజడా

  ప్రత్యుత్తరంతొలగించు
 17. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


  జడ శ త కం


  విరులను ధరించి , నా పై
  మరులను కురిపించి , నవ్య మన్మథ వాంఛన్
  విరివిగ నెలకొల్పెడు - నిను
  పరిరంభము సేయకుండ వదల నిక జడా !


  కాంత లిటీవల కొందరు ,
  కుంతలముల విరియబోసుకొందురు ; ఛీ ! యా
  వింతైన రోత ఫ్యాషను
  లింతులకు దగ దనుచు , వివరింపు మిక జడా !

  ప్రత్యుత్తరంతొలగించు
 19. బొగ్గరం VVHB ప్రసాద రావు గారి పద్యాలు....
  1)
  జడబిళ్ళలు, జడకుప్పెలు
  జడివానల వలపు నింపు చక్కని జంటల్
  నడయాడ ప్రణయసీమల
  కడు రమ్యము నీ విలాస గతు లగును జడా!
  2)
  తలనిండ పూలచెండును
  కలికి జడన్ మొగలిరేకు కాంతులు మెరయన్
  కులుకుచు తిరిగెడు భామకు
  వెలయింతువు వన్నెలన్ని ప్రీతిగను జడా!

  ప్రత్యుత్తరంతొలగించు
 20. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. శ్రీగురుభ్యోనమః

  గురువుగారి చరణారవిందములకు నమస్కారములు.
  ఆర్యా, మీ ఆనతి మేరకు జడశతకమునకు రెండు పద్యములను వ్రాయుచున్నాను. పరిశీలించి తప్పులున్న సవరించ ప్రార్థన.

  క. చెంగున దూకుచు వచ్చిన
  గంగను నిలుపంగ గరళకంఠుడు తలుపన్
  బొంగరముల వలె దిరుగుచు
  శృంగముగా నిలచినావు స్థిరముగను జడా.

  కం. చందనగంధపు పరిమళ
  సుందరమగు కురుల నడుమ సుడులే తిరుగన్
  క్రిందకు దూకెడు గంగకు
  నందముగా హారమటుల నమరితివి జడా.

  (శక్తిమంతుడైన సాంబశివుని జడలే జగత్తుకు రక్ష.)

  ప్రత్యుత్తరంతొలగించు
 22. అరవిరిసిన పువ్వులు నీ
  కురులందునె శోభ చెందు కువలయమందున్
  తరుణుల సొబగుల పెంచగ
  చిరుమువ్వల జడ గంటలె సిరులొల్కు జడా!

  ప్రత్యుత్తరంతొలగించు
 23. నవ వధువు పూల జడవై
  కవులకు ప్రేరణమునిచ్చు కవితా ఝ‌రి పై
  నవలాలిత్యమ్మగు నీ
  భవితకు పెను ముప్పు వచ్చె భద్రమ్ము జడా!

  ప్రత్యుత్తరంతొలగించు
 24. జడయే నొకపరి భామల
  యిడుముల బడద్రోయు చుండు నిలలో జూడన్
  నడివేసవిలోనైనను
  ముడి వేయగ లొంగవసలు ఫొడుగాటి జడా!!!


  జడపై కవితల నల్లుచు
  జడపై గేయములు వ్రాసి చాటుచు ఖ్యాతిన్
  జడపై శతకము వ్రాయుచు
  జడనే కొనియాడె జగతి జయ వాలుజడా!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 25. వంతులు వేయుచు నల్లిరి!
  కంతుని సంతతి తెలుగున కవులెల్లరు! క
  వ్వింతగ శతకము సల్పిరి!
  ఎంతటి రసికులొ తెలిసెను! జేజేలు జడా!

  ప్రత్యుత్తరంతొలగించు
 26. జడశతకమునందున యొక
  విడి పద్యమునున్చదివిన వినిననునాయీ
  శుడు కరుణించును ఇదియే
  కడజన్మమగును శరణము కబరివిరిజడా!

  ప్రత్యుత్తరంతొలగించు