గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2684 సమస్య :: *నరు డయి జన్మ నెత్తె కరుణారహితుండగు ఫాలనేత్రుడే.* ఫాలనేత్రుడైన శివుడు కరుణ లేనివాడై నరుడుగా జన్మించాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: దుష్టశిక్షణ కోసం భూలోకంలో దాశరథిగా అవతరించనున్న మహావిష్ణువునకు సహాయపడాలనే బ్రహ్మదేవుని నిర్ణయమును దేవతలందరూ ఆమోదించారు. వాయుదేవుడు తన ఉదరంలో ధరించియున్న రుద్రాంశను అంజనాదేవి ఉదరంలో నిక్షిప్తం చేయగా అవతరించిన హనుమంతుడు శ్రీరామునికి సహాయంగా రావణ సైన్యంలోని ఎంతోమంది రాక్షసులను కరుణ లేకుండా రుద్రమూర్తియై సంహరించాడు. కాబట్టి లయకారకుడైన ఫాలనేత్రుడే వానరుడుగా జన్మించాడు అని విశదీకరించి చెప్పే సందర్భం.
నరు డయి జన్మ నెత్తు కరుణాసహితుండగు విష్ణుమూర్తి, శ్రీ హరికిని తోడు గావలయు నా ఖలు రావణు కామశీలునిన్ వర బల గర్వితున్ గెలువ, వైరి బలమ్మును గూల్తు నంచు వా *నరు డయి జన్మ నెత్తె *కరుణారహితుండగు ఫాలనేత్రుడే.* *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (21-5-2018)
మదీయ శ్రీకృష్ణ సూక్తి సుధాకర మను శ్రీమదాంధ్ర భగవద్గీత మూలమునకు ననువాదమే కాని వివరణ కాదు. మూల శ్లోకావగాహనకు నే వివరణ మవసరమో యట్టి వివరణ దీనికిని నవసర మగును. నేటి పద్యములలోరెండు తిలకించండి.
వచ్చు మరణము పుట్టిన వారి కెల్ల జన్మ కలుగుటయు ధ్రువము సచ్చినంతఁ దప్ప నట్టి యిట్టి పనులు దలఁచి తలఁచి వంతఁ జెందంగ నీకు భావ్యమ్ము గాదు 2.27.
మూలము: జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ | తస్మాదపరి హార్యే౽ర్థే న త్వం శోచితు మర్హసి || 2.27.
సాంఖ్య మందలి యీ బుద్ధి సవివరణము చెప్పఁబడినది నీకిది యొప్పఁ బార్థ యోగ మందు దీని వినుము వేగ బుద్ధి గూడఁ గర్మ బంధమ్ము తగులదు నీకు 2. 39.
గురువర్యులు శంకరయ్యగారికి వందన శతములు! మీ సహృదయతకు, సహనశీలతకు జోహార్లు! ఈ వయోజన పద్య పాఠశాల మావంటి వయోవృద్ధులకు పద్యవిద్యతో పాటు చిన్ననాటి సరదాలనూ, సంతోషాలను యిచ్చి ఆయుష్షును పెంచుతున్నదనడంలో యిసుమంతైనా అతిశయోక్తి లేదు! ఇందుకు మీకు యెన్ని విధాలుగా కృతజ్ఞతలు తెలుపుకున్నా చాలదు! మీ ఋణం తీర్చలేనిది! 🙏🙏🙏🙏🙏
తరుముచు కాంగ్రెసు పార్టిని
రిప్లయితొలగించండికరచుచు పగవారినెల్ల గరువము తోడన్
మురియుచు తెలగాణ ప్రజల
నరుఁడయి జన్మించె ఫాలనయనుం డలుకన్ :)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివరముల నీయగ విసిగిన
రిప్లయితొలగించండిపరమేశుని సుర లంత పరుషము లాడన్
కొరకొర లాడిన రోషము
నరుడయి జన్మించె ఫాలనయనుం డలుకన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. "పరమేశ్వరుని సురలంత" అనండి.
కాని ఫాలనయనుడు నరుడై ఎప్పుడు జన్మించాడు?
రిప్లయితొలగించండిపరువున్ బోవ నిహతి సతి !
మరియెక్కడ బోయెదనని మరలమరల ఢ
క్కిరవణుడు వెక్కి యేడ్చుచు,
నరుఁడయి జన్మించె ఫాలనయనుం డలుకన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిలంకాదహనసమయమున మారుతిని గని రాక్షసులరాక్షసులభావన..
అరె ! ఇటు చూచినంతనటు, నక్కడ చూచినయంతనిక్కడే
తిరుగుచు , నన్ని తానయిన తీరుగఁ గన్పడి , లంకఁ గాల్చుచున్
వరదనుజాంతకుండనగ వచ్చిన
వీడన గోతి కాదు , వా....
నరుఁడయి జన్మనెత్తె కరుణారహితుండగు ఫాలనేత్రుఁడే !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధరణిని బ్రోవగ హరియే
రిప్లయితొలగించండినరుడయి జన్మించె, ఫాల నయనుం డలుకన్
విరిబాణములను విసిరిన
సిరిపట్టిని గాల్చె తనదు చిచ్చర కంటన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక: దురితములఁ జేయుచు నెపుడు
రిప్లయితొలగించండితిరుగు నరభుజుల స్వయముగ తెగజూచుటకై
స్థిరచిత్తముతో భువి వా
నరుఁడయి జన్మించె ఫాలనయనుం డలుకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమరుగున బోవ నార్షము శమాశ్రయ బౌద్ధపు తీరు లన్నికన్
సరుగక బోవ నానెఱి, సుసాధ్యము చేయ నభేదమున్ భళా
నరుఁడయి జన్మనెత్తె కరుణారహితుండగు ఫాలనేత్రుఁడే,
పరుగున వచ్చి శంకరుని ప్రన్నదనంబుగ నిల్చె నండగా !
జిలేబి
👌🏻👏🏻💐🙏🏻
తొలగించండి
తొలగించండిమీరూ రాయాలను కున్నారా విట్టుబాబు గారు ? రాసేయండి మరి
జిలేబి
ఆరున్నరకే రాసేశానండి...ఆయ్ఁ
తొలగించండి😃
మీ యీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏🙏🙏
రిప్లయితొలగించండికంది శంకరుని గురించి మరో చంపకం ప్లీజ్!
తొలగించండిఅడిగితే వద్దంటామా :) సావేజిత :)
మరుగున బోవ ఛందము ఢమాలు కవిత్వపు తీరు లన్నటన్
సరుగక బోవ పద్యము, సుసాధ్యము చేయన కైపదమ్ములన్,
నరుఁడయి జన్మనెత్తె కరుణారహితుండగు ఫాలనేత్రుఁడే,
పరుగున కంది శంకరుని ప్రన్నదనంబుగ నిల్చె నండగన్!
జాల్రా జిలేబి :)
😭
తొలగించండినాకన్నా ముందే రాసేశారా....
👏👏👏
తొలగించండి
తొలగించండినమో నమః
__/\__
తొలగించండిబురకని మహిమ ఘనము, వా
రిప్లయితొలగించండినరుడయి జన్మించె ఫాలనయనుం,డలుకన్
పరివర్జించు ,యుసురు నిడి
వరము లొసగెదమని బల్కె వనజజు డపుడున్
హనుమంతుడు చిన్న తనములో ఇంద్రుని చేత దెబ్బ దిని పడిపోయిన సందర్భములో, బ్రహ్మ వేల్పులందరికి తెలుపుచు తండ్రి అయిన వాయు దేవుని అలుక మానుమని చెప్పు సదర్భము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వర్జించు ముసురు...' అనండి.
రిప్లయితొలగించండిమరుగున బోవన్వేదము,
పురడింపక బోవగాను బుద్ధుని మార్గం
బరయుచు శంకరు డై భళి
నరుఁడయి, జన్మించె ఫాలనయనుం డలుకన్!
జిలేబి
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధర త్రేతాయుగమున కే
రిప్లయితొలగించండిసరి సుతునిగ పావనిగను, శబరీ నుత దా
శరధీ ప్రియ హనుమగ వా
"నరుఁడయి జన్మించె ఫాలనయనుం డలుకన్"
ధర పద్యపు ప్రభ నిలుపగ
రిప్లయితొలగించండిసరగున భువిపైన కంది శంకర గురువై
బిరమున విద్యను నేర్పగ
"నరుఁడయి జన్మించె ఫాలనయనుం డలుకన్"
తొలగించండిధర పద్యపు ప్రభ నిలుపగ
నరుఁడయి జన్మించి, ఫాలనయనుం డలుకం
గ రసమయ పద్యముల, భళి
పరుగుల శంకరుని కొల్వు పాటిగ చేరెన్ :)
జిలేబి
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
******
జిలేబీ గారూ,
__/\__
నరపాలుని శ్రీరాముని
రిప్లయితొలగించండిచరణంబులఁగొల్వ,రాక్షసాధము దునుమన్
వరమున హనుమానుగ వా
నరుడయి జన్మించె ఫాల నయనుండలుకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివరములిచ్చిన ప్రేమ లాలిత్యమే దునుమాడగ
రిప్లయితొలగించండిశూలమెత్తు
మంగళ కారక మూర్తియే పీచమణచగ తన
పాదమెత్తు
రాక్షస ప్రవృత్తియె పూని తానుగ నరుడయి
జన్మమెత్తె
కరుణా రహితుండగు ఫాలనేత్రుడే లయమున
చేతులెత్తె
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండినిరతము నింద్రుని నిల్పన్
కరమున నాయుధము బట్ట, కంటికి కునుకు
న్నరయని జీవిక చాలని
నరుడయి జన్మించె ఫాల నయనుండలుకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2684
సమస్య :: *నరు డయి జన్మ నెత్తె కరుణారహితుండగు ఫాలనేత్రుడే.*
ఫాలనేత్రుడైన శివుడు కరుణ లేనివాడై నరుడుగా జన్మించాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: దుష్టశిక్షణ కోసం భూలోకంలో దాశరథిగా అవతరించనున్న మహావిష్ణువునకు సహాయపడాలనే బ్రహ్మదేవుని నిర్ణయమును దేవతలందరూ ఆమోదించారు. వాయుదేవుడు తన ఉదరంలో ధరించియున్న రుద్రాంశను అంజనాదేవి ఉదరంలో నిక్షిప్తం చేయగా అవతరించిన హనుమంతుడు శ్రీరామునికి సహాయంగా రావణ సైన్యంలోని ఎంతోమంది రాక్షసులను కరుణ లేకుండా రుద్రమూర్తియై సంహరించాడు. కాబట్టి లయకారకుడైన ఫాలనేత్రుడే వానరుడుగా జన్మించాడు అని విశదీకరించి చెప్పే సందర్భం.
నరు డయి జన్మ నెత్తు కరుణాసహితుండగు విష్ణుమూర్తి, శ్రీ
హరికిని తోడు గావలయు నా ఖలు రావణు కామశీలునిన్
వర బల గర్వితున్ గెలువ, వైరి బలమ్మును గూల్తు నంచు వా
*నరు డయి జన్మ నెత్తె *కరుణారహితుండగు ఫాలనేత్రుడే.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (21-5-2018)
తొలగించండివావ్ ! మైలవరపు వారు కోట వారు ఇవ్వాళ ఒకే వేవ్ లెంత్ !
చాలా బాగుందండీ యిద్దరిదిన్నూ !
జిలేబి
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిమరచి వరంబులీయగనుమాపతి "భోళ"గుణుండటందురే
విరిసిన శుద్ధమౌ తపము వీడగ మన్మథు జంప బంపరే
సురపతి కొమ్ముగాయగ నసూయల రాక్షస హర్త యంచనన్
నరుడయి జన్మ నెత్తె కరుణా రహితుండగు ఫాలనేత్రుడే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిడా.పిట్టానుండి
రిప్లయితొలగించండిసరలు అనిమిష నేత్రులని మొదటి పూరణలో.
వరమున పేక్షించెడి ముని
రిప్లయితొలగించండికిరీటి జేయగ పరీక్ష కిటిరూపమునన్
తరలి కిరాతుండై వర
నరుడయి జన్మించె ఫాల నయనుండలుకన్!
ధర క్రమశిక్షణ వరలగ
గరువము గలిగిన తపస్వి ఘనత వహించన్
వర దుర్వాసుని పేరున
నరుడయి జన్మించె ఫాల నయనుం డలుకన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురువర్యా! నమస్సులు! 🙏🙏🙏🙏
తొలగించండికం
రిప్లయితొలగించండిధరఁ గన్నప్పగ విజయుఁడు
నరుఁడయి జన్మించె! ఫాలనయనుం డలుకన్
దొరలించగ కన్నీటిన్
దరియించెన్ నేత్రమొసఁగి దైన్యత నిండన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి"హరహర! విశ్వనాథ! విషమాక్ష! మహానట! చంద్రశేఖరా!
కరుణనుఁ జూపి, మాకుఁ దగఁ గాంక్షలఁ దీర్చు ముమామహేశ్వరా!
వరమిడు" మంచుఁ గేసరియు భర్తృవ్రతాంజని వేడఁగానె, వా
నరుఁడయి జన్మనెత్తెఁ, గరుణార, హితుండగు ఫాలనేత్రుఁడే!
[కరుణ + ఆర = కరుణ అతిశయించఁగా]
అద్భుతమైన విరుపు మధురకవి వారూ! అభినందనలు! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండి🙏ధన్యవాదాలండీ సీతాదేవి గారూ!🙏
తొలగించండి👌👌👌👏👏🙏🙏🙏
తొలగించండి
తొలగించండికరుణార హిత ! అద్భుత!
జిలేబి
సుకవులు గుండావారు, జిలేబీ గార్లకు ధన్యవాదములు!
తొలగించండిమధుసూదన మిత్రమా! అద్భుతమైన విరుపు! అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు సుకవి మిత్రులు మిస్సన్నగారూ! మీ అభినందన నాలో నూతనోత్సాహాన్ని నింపినది! కృతజ్ఞుఁడను!
తొలగించండివిలక్షణమైన విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏🙏🙏ధన్యవాదాలు🙏🙏🙏
తొలగించండిహరి యే రాముoడైధర
రిప్లయితొలగించండినరుడయి జన్మించె ;ఫాల నయ నుండలు క న్
వి రి తూ పులు విసిరి న నా
మరు ని ద హించె గద కంటి మంట ల తోడ న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహరుడును విసిగెను వరముల
రిప్లయితొలగించండినరుఁడయి జన్మించె ఫాలనయనుం డలుకన్"
మరుడును సంధించ శరము
దెరువరి గాల్చగ త్రినేత్రు దెలిసెను సతియే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధరలో ధర్మము నిలుపుచు
రిప్లయితొలగించండిహరియే త్రేతా యుగమున నలరింప భువిన్;
మరునిన్ భస్మము జేసెను
నరుఁడయి జన్మించె; ఫాలనయనుం డలుకన్
ధరలో ధర్మము నిలుపుచు
రిప్లయితొలగించండిహరియే త్రేతా యుగమున హంతల దునుమన్;
మరునిన్ భస్మము జేసెను
నరుఁడయి జన్మించె; ఫాలనయనుం డలుకన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిడా.పిట్టానుండి
రిప్లయితొలగించండిసరలు అనిమిష నేత్రులని మొదటి పూరణలో.
ధరరా వణుదును మాడగ
రిప్లయితొలగించండినరుడయి జన్మించెఫాలనయనుండలుక
న్నిరవుగ రాముని పేరున
సురలందరు జయముబలుకసుమములతోడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధరనుగనుంగొనంగనట దానవుసంహరణంబుకోసమై
రిప్లయితొలగించండినరుడయిజన్మనెత్తెకరుణారహితుండగు ఫాలనేత్రుడే
సురలును యక్షకిన్నెరలుసోయగమొప్పగ బల్కిరేగదా
హరహర!కావుమామమిట యారనిజోతుల నీకునిత్తుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిగురుడతడు! గౌడ పాదుని
సరసన్నద్వైతమున్ వెస గరచి వెలుగై
పరమాత్వతత్వము తెలుప
నరుడయి జన్మించె ఫాలనయనుండలుకన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పరమాత్మ తత్త్వము' టైపాటు!
మళ్ళీ ఇవాళ గురువు గారి దర్శనము కాలేదు. ఆరోగ్యం ఎలా ఉందో ఏమో???
రిప్లయితొలగించండిచింతించకండి. Eye check up (post-cataract surgery) లోనున్నారట...
తొలగించండినరు నుద్ధరింపఁ గాయము
రిప్లయితొలగించండిసురభి రుచి వెలుఁగ సభార్య చోద్యము మీఱన్
వరదుండు వడి నెఱుకు కుల
నరుఁడయి జన్మించె ఫాలనయనుం డలుకన్
[అలుకన్ = నటించెడు నలుకతో]
పరఁగును జన్మ జన్మములు వారక లోకుల కెల్ల ధాత్రినిన్
గరువము చెంది చేయ మఱి కాని పనుల్ ఫల మెల్లఁ బొందగన్
వర ముని శాప తప్తుఁ డయి భ్రష్టుఁడు యక్షుఁడు దుష్టుఁ డొక్కఁ డీ
నరుఁడయి జన్మనెత్తె కరుణా రహితుండగు ఫాలనేత్రుఁడే
[ ఫాలనేత్రుఁడు = నెత్తి మీద కళ్ళున్న వాఁడు, గర్విష్ఠి]
మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.
తొలగించండిచంపకమాల
రిప్లయితొలగించండిమరిమరి బోయలన్ దలఁచి మాన్యుడు నర్జునుఁడంత్యమందునన్
ధరణిని బోయడై శివుని దల్చెడు కన్నప నామధేయుడై
నరుఁడయి జన్మనెత్తె! కరుణారహితుండగు ఫాలనేత్రుఁడే
తెరచిన కండ్ల బాష్పమను తీరుగఁ గార్చఁగ నొచ్చి కన్నడున్
బెరుకుచు సొంత నేత్రముల భీషణు కర్పణ జేసె భక్తుడై!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమరుడు శిఖివిడువ వైశ్వా
రిప్లయితొలగించండినరుడయి జన్మించె ఫాలనయనుం డలుకన్
తెరచిన మూడో కన్నున,
తరువాతనతడు నివురయి తనువును వీడెన్
వైశ్వానరుడు=అగ్ని
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మూడో' అనడం వ్యావహారికం. "మూడవ" అనండి.
గురువగు ద్రోణు వ్యూహమును గూల్చగ తా బ్రళయాగ్నిరుద్రుడై
రిప్లయితొలగించండిశరముల రాల్చెనగ్నికణ జాలము లట్లు నరాత్మజుండనిన్
వెరువక ముందుకేగి యరి వీరుల గూల్చభి మన్యుఁ గాంచినన్
నరుడయి జన్మనెత్తె కరుణారహితుండగు ఫాలనేత్రుడే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉమాకాంత ప్రసాదు గారి పూరణ:
రిప్లయితొలగించండిసరిగమ రంజితంబయిన చక్కని గానముజేయ నిత్యమున్
హరిపద సన్నిధిన్నిలచి హాయినొసంగగ తుంబురుండు కి
న్నరుఁడయి జన్మనెత్తె; కరుణారహితుండగు ఫాలనేత్రుఁడే
విరివిలుగాని గూల్చె తనవీక్షణతోడ తపంబుభగ్నమై.
తొలగించండిఆటవిడుపు రాలేదేమిటి చెప్మా యింకా :)
జిలేబి
వచ్చు వచ్చు వడిగా...
తొలగించండితెల్లవారు జామున సీరియస్ పూరణ పదిహేను నిమిషాలు. తరువాత సరదా పూరణ ఆరు గంటలూ...
తొలగించండిఉమాకాంత ప్రసాద్ గారి పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅరయగు విష్ణుమూర్తి ముదమారగ దారుణియందు రాముడై
రిప్లయితొలగించండిసిరిజనకాత్మ జైతనర,శ్రీకరమై చని శంఖు చక్రముల్
భరతుడు వాని తమ్మునిగ భాసిల,శేషుడు లక్ష్మణుండు వా
నరుఁడయి జన్మనెత్తె కరుణారహితుండగు ఫాలనేత్రుఁడే
అరయగ నతినే కుండగు
రిప్లయితొలగించండిపరమేశమ్మనెడు వాడు పలికెను జడుడై
గురుదేవా!ధరణితోవా
నరుడయి జన్మించె ఫాలనయనుం డలుకన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండివరమీ నరజన్మ యనుచు
రిప్లయితొలగించండికరమీ కులమనెడి ఋజను ఖండించగ శం
కరునకు జ్ఞానము నొసగఁగ
నరుఁడయి జన్మించె ఫాలనయనుం డలుకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినరులకు జ్ఞాన మార్గము సనాతన ధర్మము నేర్ప గోరుచున్
నరుఁడయి జన్మనెత్తె, కరుణారహితుండగు ఫాలనేత్రుఁడే,
గురువుగ కీకశుండయి నిగూఢము గానహ మున్తొలంగజే
య రతనమయ్యె శంకరుడయా వెలు గొందుచు భారతమ్మునన్!
जिलेबी
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(భోలా శంకర పన్నగ భూషణ పాఠశాలలో)
పరుగిడి దుష్టసంధులను వైరి సమాసము ప్రాసదోషమున్
తరుముచు వైపరీత్యముల తప్పిన ఛందపు పద్యరీతులన్
కరచుచు గంద్రగోళముల కంది వరేణ్యుని రూపురేఖలన్
నరుఁడయి జన్మనెత్తె కరుణారహితుండగు ఫాలనేత్రుఁడే :)
"ప్రభాకర శాస్త్రి గారూ:
అరసున్నల విషయంలో అంత పట్టింపు లేకున్నా క్త్వార్థకమైన ఇత్తునకు సంధి చేస్తే మాత్రం కఠినంగా ఉంటాను."
http://kandishankaraiah.blogspot.in/2018/05/2673.html?m=1
పాఠశాల పేరు అదుర్స్! 👌👌👌💐💐💐🙏🙏🙏
తొలగించండి🙏🙏🙏
తొలగించండిసార్ వస్తున్నారు...చుప్!
తొలగించండిజీపీయెస్ వారు
మీరు ప్రిన్సిపాల్ గా పనిచేసారా లేక ఫాకల్టీ గా మాత్రమేనా :)
జిలేబి
విద్యార్థులకు స్వీపరుగా..
తొలగించండి__/\__
తొలగించండికంది శంకరయ్య:
తొలగించండిమీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
నిజమే... వ్యాకరణ విరుద్ధ ప్రయోగాల పట్ల ఫాలనేత్రుడనే!
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండిఈమధ్య శస్త్రచికిత్స జరిగిన కంటి పరీక్ష కోసం ఆసుపత్రికి వచ్చాను. అందువల్ల మీ పద్యాలను సమీక్షించ లేకున్నాను. మన్నించండి.
🙏🙏🙏🙏
తొలగించండిధరనిక రాక్షసాధముల దారుణ చర్యలు సాగవంచు దా
రిప్లయితొలగించండివరదుడు రామచంద్రునికి వామభుజమ్ముగ వాతజాతుడై
వరబల గర్వితుండయిన పంక్తిముఖమ్ములవాని ద్రుంచ వా
నరుడయి జన్మమెత్తె కరుణార హితుండగు ఫాలనేత్రుడే!
మధురకవి గారికి ధన్యవాదాలతో!🙏🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏🙏🙏🙏
తొలగించండిహరిహర బేధము లేకను
రిప్లయితొలగించండిహరి!రఘురాముడవగ?సరియగువిధమున్
సురులకు రక్షగతా వా
నరుడయిజన్మించె పాలనయనుండలుకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండినరభుజులను జంపగ హరి
నరుడయి జన్మించె; ఫాలనయినుండలుకన్
సిరిపట్టిని మసిచేసెను
విరలిని తనలో నెగగొలిపిన తరుణమునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
నరుఁడయి జన్మనెత్తె కరుణా రహితుండగు
ఫాలనేత్రుఁడే
సందర్భము: శివుడు ఏకాదశ రుద్ర రూపుడు. పూర్వం రావణుడు తన పది తలలతో శివునియొక్క పది మూర్తులనే పూజించినాడట! పదకొండవ మూర్తిని నిరాదరించిన ట్లయినది.
ఆ మూర్తియే ఏకపాదు డనే రుద్రుడు. రావణుడు వర గర్వితుడై లోక కంటకు డైనందున ఆతడే ఆంజనేయుడై యవతరించినాడు. రామునికి దాసుడై రావణ వధకు సహకరించినాడు.
ఆంజనేయునిగా అవతరించబోతున్న శివుని యభ్యర్థన మేరకు శక్తి స్వరూపిణియైన పార్వతి అతనికి తోడుగా రాక్షస సంహారానికి సహాయంగా వుండడానికై అతని తోకగా అమరింది.
హనుమంతుని తోకకు పూలు అలంకరించబడి వుంటాయి.
వనమాలాగ్రవాలాయ
పవమానాత్మనే నమః 33 శ్లో.
ఓం వనమాలాగ్రవాలాయ నమః.. అని 22 వ నామం. (తోక చివర పూలమాల కలవానికి నమస్కారం)
అగస్త్య మహర్షి చెప్పిన హనుమ దష్టోత్తరంలో ఈ విశేష ముంది.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
హరునకు నాహుతుల్ పది ద
శానను డిచ్చెడి, నేకపాదు డన్..
మరియొక రుద్ర మూర్తియె కొ
నండు సపర్యఁ ; దిరస్కృతుండునై...
గిరి సుత పూల తోక యయి
కీర్తి వహింప సమీర పుత్ర వా
నరుఁ డయి జన్మ నెత్తె కరు
ణా రహితుం డగు ఫాల నేత్రుఁడే..
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువుగారికినాపద్యములోరెండవపాదంచివరసరియగువిధమనుచున్అనిచదవగోరినాను
రిప్లయితొలగించండిశ్రీ గురుభ్యో నమః! 🙏🙏🙏🙏
రిప్లయితొలగించండివరమయి పద్య కవులకును
వరలగ వారలు వధాన వరులై భవితన్
నిరతము శిక్షణ నీయగ
నరుడయి జన్మించె ఫాలనయనుం డలుకన్!
(అలుకన్ శిక్షణ నీయగ)
పూరణ కోసమే! ఆయనకు అలగడమే రాదు! అమిత శిష్యవాత్సల్యం! 🙏🙏
తొలగించండి__/\__
తొలగించండిహరియే రక్కసుల దునుమ
రిప్లయితొలగించండినరుడయి జన్మించె! ఫాల నయనుండలుకన్
శిరమున గల జడను గొనుచు
పరిమార్చగ దక్షు, వీరభద్రు సృజించెన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,
కరుణము లేక ఘోరపు టఘంబు లొనర్చుచు నుండు వా డెటుల్
నరు డయి జన్మ మెత్తె ? కరుణా రహితుండగు ఫాలనేత్రు డే
కరణిని వీడె నాతని ? నొసంగ డొకించుక యేని భాగ్యమున్ ,
దొరకగ నీడు కూడు , కడు దుఃఖము పాలొన రించు > సజ్జనున్ !
{ ఫాలనేత్రు డే కరణిని వీడె నాతని = ఈశ్వరుడు వానిని శిక్షింపక ఎట్లు వదలెను }
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిధర పద్యపు ప్రభ నిలుపగ
నరుఁడయి జన్మించి, ఫాలనయనుం డలుకం
గ రసమయ పద్యముల, భళి
పరుగుల శంకరుని కొల్వు పాటిగ చేరెన్ :)
జిలేబి
గురువుగారికి అలగడం రాదే యెలాగ అనుకుంటున్నాను! మీరు దాన్ని అద్భుతంగా అలుకంగ గా మార్చేశారు!
తొలగించండిఅభినందన సుమాలు! 🌹🌹🌹
__/\__
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండిమురిపించెడు సృష్టిన్ గని
పరిపూర్ణత లేదటంచు పరమాత్మగఁ దా
పరిపరి విధములఁ దనరఁగ
నరుఁడయి జన్మించె ఫాలనయనుం డలుకన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమదీయ శ్రీకృష్ణ సూక్తి సుధాకర మను శ్రీమదాంధ్ర భగవద్గీత మూలమునకు ననువాదమే కాని వివరణ కాదు. మూల శ్లోకావగాహనకు నే వివరణ మవసరమో యట్టి వివరణ దీనికిని నవసర మగును. నేటి పద్యములలోరెండు తిలకించండి.
తొలగించండివచ్చు మరణము పుట్టిన వారి కెల్ల
జన్మ కలుగుటయు ధ్రువము సచ్చినంతఁ
దప్ప నట్టి యిట్టి పనులు దలఁచి తలఁచి
వంతఁ జెందంగ నీకు భావ్యమ్ము గాదు 2.27.
మూలము:
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరి హార్యే౽ర్థే న త్వం శోచితు మర్హసి || 2.27.
సాంఖ్య మందలి యీ బుద్ధి సవివరణము
చెప్పఁబడినది నీకిది యొప్పఁ బార్థ
యోగ మందు దీని వినుము వేగ బుద్ధి
గూడఁ గర్మ బంధమ్ము తగులదు నీకు 2. 39.
మూలము:
ఏషా తే౽ భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు |
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మ బంధం ప్రహాస్యసి | | 2. 39.
🙏
తొలగించండి🙏🙏🙏🙏
తొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*******
కామేశ్వర రావు గారూ,
__/\__
అందఱికి వందనములు. పొరపాటున సహదేవుడి గారి సామ్రాజ్యమును నాక్రమించితిని. వారికి నా క్షమాపణలు.
తొలగించండిఅయ్యో! అంతమాటెందులకు మీరు మాయింట అడుగిడి మా ఆతిథ్యం స్వీకరించినంత ఆనందంగా యుంది. ధన్యోస్మి.
తొలగించండినరునిగ యర్జునుడుండగ
రిప్లయితొలగించండిస్థిరునిగ నారాయణుండు శివమును గూర్చన్,
సురచిర సుందరతన్ వా
నరుడయి జన్మించె ఫాలనయనుండలుకన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిరతము నాదు జిహ్వ పయి నే మహనీయుని నామ మాడు నా
రిప్లయితొలగించండిధరణిజ ప్రాణనాథునకు తప్పక తోడ్పడు దంచు ప్రీతితో
సరగున నంజనా సుతుని చాయను దైత్యుల పాలి మిత్తి వా
నరుఁడయి జన్మనెత్తె కరుణారహితుండగు ఫాలనేత్రుఁడే.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులు శంకరయ్యగారికి వందన శతములు! మీ సహృదయతకు, సహనశీలతకు జోహార్లు!
రిప్లయితొలగించండిఈ వయోజన పద్య పాఠశాల మావంటి వయోవృద్ధులకు పద్యవిద్యతో పాటు చిన్ననాటి సరదాలనూ, సంతోషాలను యిచ్చి ఆయుష్షును పెంచుతున్నదనడంలో యిసుమంతైనా అతిశయోక్తి లేదు! ఇందుకు మీకు యెన్ని విధాలుగా కృతజ్ఞతలు తెలుపుకున్నా చాలదు! మీ ఋణం తీర్చలేనిది! 🙏🙏🙏🙏🙏
మీ మాటలు అక్షర సత్యాలు🙏🙏🙏
తొలగించండిఅయ్యా! శ్రీధర్ బావ గారూ:
తొలగించండిఇటీవల మీ (వరుసకు) అన్నగారైన గుఱ్ఱం మాధవకృష్ణ శర్మ గారిని కలవడమైనది. వారు మీ శంకరాభరణ పద్య ప్రతిభను చాలా మెచ్చుకుంటుండే వారు.
👌
వయోజన పద్య పాఠశాల....సర్వజన పద్య పాఠశాల. మంచి పేరు పెట్టారు.
తొలగించండి🙏🙏🙏
తొలగించండి(2)
రిప్లయితొలగించండి["ఉమా చండీ గౌరీ శంకరుల కథ" లోఁ బార్వతి యలుకఁ గొనిన కతమున, భృగు శాపమునకు గుఱియయి, మూఁడు జన్మముల నెత్తవలసి వచ్చెను. శివుఁ డా పార్వతి నోదార్చి, యేక సమయమునఁ బార్వతి యుమ, చండి, గౌరి యను ముగ్గురు బాలికలుగ జన్మించునట్లుగను, శివుఁడు జయశంకరుఁడను నామమున నరుఁడై జన్మించి, యా మువ్వురనుఁ దానే వరించి, భార్యలుగఁ జేసికొనునట్లును శాపావధి నొసఁగెను. పార్వతి శాపముచే భృగువు రాక్షసుఁ డాయెను. ఆ రాక్షసుని జయశంకరుఁడు వధించగనే శాపము తొలఁగి పూర్వరూపుఁడయి, శివునకుఁ గృతజ్ఞతలు తెలుపుకొని, వెడలుట; యటులే యీ మువ్వురును శాపావధి నొంది, పార్వతిగ మాఱి శివునితో పాటుగఁ గైలాసమునకుం బోవుట యిందలి కథాంశము]
వర భృగు శప్త సతి పతిగ,
నరుఁడయి జన్మించె ఫాలనయనుం; డలుకన్
గిరిజయె కొనిన కతమునఁ గొ
సరి గౌరియుఁ జండి యుమయు జన్మించి రిలన్!
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ తాజా పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
: డా.బల్లూరి ఉమాదేవి.
రిప్లయితొలగించండిధరలో కుంతికి పార్థుడు
నరుడయి జన్మించె,ఫాలనయనుండలుకన్
మరుని దహియించి చనె హిమ
గిరివీడుచుతా జవమున కెంజడ ధారియై.
కన్నియ యందచందముల గన్నుల కట్టిన రీతి కైతలన్
రిప్లయితొలగించండిమిన్నగ వ్రాసినన్ జనులు మెచ్చని వేళన శోకమూర్తినై
కన్నులు మూసి నిద్రఁ జని గాంచితి కమ్మని స్వప్నమొక్కటిన్
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నాకవిత్వమున్.
తరుణిని లంకనున్ కనుచు తన్మయమొందగ గాలిచూలి వా
రిప్లయితొలగించండినరుఁడయి జన్మనెత్తె;...కరుణారహితుండగు ఫాలనేత్రుఁడే
మరిమరి కోపమెచ్చగను మారుని కాల్చెను మందబుద్ధితో...
పరుగిడె విష్ణు చెంతకట భస్మము నొందగ భీతిజెందుచున్