2, జనవరి 2011, ఆదివారం

సమస్యా పూరణం - 188 (దాని మానుప భువి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
దాని మానుప భువి నౌషధమ్ము గలదె?
దీనిని పంపించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

30 కామెంట్‌లు:

 1. ఓర్మి యుండదు; కుదురుగా నుండనీదు
  పరులు పచ్చగా నుండ మచ్చరము గూర్చు;
  హేయమైన గుణంబు - అసూయ కాదె ?
  దాని మానుప భువి నౌషధమ్ము గలదె ?

  రిప్లయితొలగించండి
 2. మత్తు కలవాటు పడినట్టి మనిషి యెటుల
  మానును మధు సేవనమును ? మాన లేడు,
  నష్ట మైనను తనువుకు! మనమున కిష్టమైన
  దాని మానుప భువి నౌషదమ్ము గలదె?

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు.
  _______________________________
  01)
  బెమ్మ కైనను పుట్టును - రిమ్మ తెగులు !
  జప , దపాదుల మునిగెడు - ఙ్ఞాను లైన
  వెలది పై గొన్న , మోహమున్ - వీడ గలరె!
  దాని మానుప భువి నౌషధమ్ము గలదె?
  _________________________________

  రిప్లయితొలగించండి
 4. __________________________________
  విష్ణు నందన!సుందరా! - విబుధ వరులు
  మెచ్చు నట్లుండు! నీపద్య - మేది యైన !
  హంస లందున రమ్యమౌ- హంస వీవు !
  మనము నందెక్కు డిడుగడ ! - మాన్ప గలవె?
  ___________________________________

  పీతాంబర ధరా !
  మందుకు మందే లేదంటారు ! ఔనా?
  బాగు ! బాగు !
  ____________________________________
  మూర్తి గారూ!
  ఈరసాని కి విరుగుడు లేదనియా మీ భావము?
  బహు బాగున్నది!
  ____________________________________

  రిప్లయితొలగించండి
 5. గురువు గారూ మీకు కలిగిన ఇబ్బంది మనస్తాపాన్ని కలిగిస్తోంది.
  వీలైనంత త్వరలో పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 6. విష్ణు నందనుల వారి పద్యము ఎప్పటి వలె రమ్యముగా ఉంది. మందా వారి మందు విష్ణు నందనుల వారు దూషించిన అసూయకి నా ఈరసానికి ఔషధమేమో గాని పుచ్చుకొనే ఉద్దేశ్యము లేదు.వసంత కిశోర్ జీ నా పద్యము భావము సరిగ్గా లేదా? చాలా సంవత్సరాలు నేను ప్రవాసంగా ఉండడం కారణము కావచ్చు. మీరు విష్ణు నందనుల పై వ్రాసిన పద్యము బ్రహ్మాండంగా ఉంది. మీ భాష సుందరంగా ఉంది.మీరు చాలా మంచి పద్యాలు వ్రాస్తున్నారు గాని దేశ జనాభాను నూరు రెట్లు చేసేస్తే ఎలా ?

  రిప్లయితొలగించండి
 7. మిత్రులందరి పూరణలు అద్భుతం గా వున్నాయి.
  నేను ఈ మాత్రం పద్యాలు రాయగలగటానికి శంకరయ్య గారి ప్రోత్సాహం, మా అన్న గారైన అందవోలు రామ్మోహన్ గారి శుభాశీస్సులు ఎంతగానో దోహద పడ్డాయి. నా యీ పూరణ కి వారే ప్రేరణ.

  శంకరార్యుల పలుకు నా శంక దీర్చె
  అగ్రజు డొసంగినాశీస్సులభయ మిచ్చె
  పద్య రచన యనెడి నూత్న విద్య యబ్బె
  దాని మానుప భువి నౌషధమ్ము గలదె

  రిప్లయితొలగించండి
 8. అయ్యయ్యో ! !!!!!!!!!!!!
  మూర్తి గారూ ! మీరు కూడానా!!!???
  అది కుటుంబ నియంత్రణ ను
  ప్రోత్స హించే పద్యం స్వామీ!

  మొత్తం మీద విష్ణు నందనుల వారి
  చమత్కారం బాగా బ్లాస్టయి నట్టుంది.
  ---------------------------------------

  భువిని ఔషధం లేని వస్తువంటే....
  ఎక్కడ దొరుకుతుంది???

  ఒకరు " అసూయ " , మరొకరు " మందు "
  మీరు "ఈరసము" నాసరా చేసుకున్నారు!
  మీ భావం బహు చక్కగా ఉంది.

  జిహ్వకు రుచులు తెలియపోవడమూ,
  నిద్రరాక కనులెర్రబడడమూ
  కోపము వలననే గదా!
  సందర్భానికి తగిన సమయోచిత పూరణ.

  విదేశంలో యుండి కూడా కడు చక్కని , చిక్కని
  తియ్యటి , తెలుగు నొలక పోస్తున్న మీకు
  తెలుగు జాతి మొత్తం ఋణపడి యుంటుంది.
  శత సహస్త్ర వందనాలు.

  ఇక నాకు మిగిలింది " స్త్రీ వ్యామోహ " మొక్కటే.

  ఇతరత్రా ఏమీ ఉన్నట్లు దోచుట లేదు.

  అందరికీ వందనములు ,అభినందనలూ
  మరియు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 9. విద్యా సాగరా!
  అభినందనలు.

  ఇతరత్రా ఏమీ లేవని అనుకొంటుంటే

  మీరు ఇంకో వస్తువును పరిచయం చేసారు.

  మేమందరం చెడు అలవాట్లనే తీసుకుంటే
  మీరు మంచి అలవాటు మాన్పడానికి కూడా మందు లేదని

  బహు గొప్ప పూరణ చేసారు.

  మీకివే నా కేకిసలు.

  రిప్లయితొలగించండి
 10. నా కిప్పుడర్థమౌతోంది

  పద్య రచన కూడా వ్యసనంలా
  పరిణమిస్తోందని.

  దీన్ని కూడా సప్త మహా వ్యసనములలో
  జేర్చుటకు మనమందరం నడుం బిగించవలసిన
  అవసరం ఎంతైనా వుంది.
  దీనికోసం సుప్రీం కోర్టు వరకైనా సరే వెళ్ళి పోరాడ వలసిన
  ఆవశ్యకత చాలా ఉంది .

  సోదరులారా !!!!!!!!
  రారండోయ్! రారండోయ్! రారండోయ్!

  రిప్లయితొలగించండి
 11. అందరూ చూడండహో!!!!!!!!!!!!!!!!!!!

  http://www.eenadu.net/sahithyam/display.asp?url=prasthanam1.htm

  రిప్లయితొలగించండి
 12. సారీ(sorry),విద్యా సాగరా!
  ఆ గొప్పదనం మీది కాదు!
  అది ఇంతకు ముందే చెప్పబడింది.
  చూడండి.

  "ప్రపంచ మొక పద్మ వ్యూహం - కవిత్వ మొక తీరని దాహం
  (శ్రీశ్రీ - మహా ప్రస్థానం - ఋక్కులు నుండి)

  రిప్లయితొలగించండి
 13. 02)
  _____________________________________

  సుతుని వలదని జెప్పినన్ - సూర్యు డకట!
  ప్రాణములు బోవ నుంకించ - బాధ లేదు!
  ధరను , చిరకీర్తి నార్జించె ! - దాన గుణము!
  దాని మానుప భువి నౌషధమ్ము గలదె?
  ______________________________________

  రిప్లయితొలగించండి
 14. జిహ్వ రసముల నెఱుగదు చిఱ్ఱులాడు
  కనులు నిద్దుర కరవయి గలత చెందు
  ఈరసమ్మున మది గ్రాల నేమి సుఖము
  దాని మానుప భువి నౌషధమ్ము గలదె

  రిప్లయితొలగించండి
 15. 03)
  ______________________________________

  శరణు , శరణన్న పోతము - జావ కుండ

  ఇలను తొడగోసి డేగకు - నిచ్చె గరుణ!

  అమరుడై వరలిన శిబి - యార్త రక్ష!

  దాని మానుప భువి నౌషధమ్ము గలదె?
  _______________________________________

  రిప్లయితొలగించండి
 16. మితము లేనట్టి యాశయు మిన్ను నంట
  దొంగ దారుల గడ్డైన దొరలు కొనెడి
  నీతి బాహ్యులు జాతికి నేత లైన
  దాని మానుప భువి నౌషధమ్ము గలదె ?

  నిజమే ! ఇది వ్యసనము వలె గోచరిస్తున్నది. కాకపోతే తెల్లవారు ఝామునే కవికోకిల కూయడము మొదలు పెట్టునే ! వసంతా ధన్యవాదములు. మనందఱికీ తెలుగంటే మక్కువే !

  రిప్లయితొలగించండి
 17. 04)
  _______________________________________

  నేటి భారతమున గల - నేతలు కడు
  చెడు నడతల నెలకొలుపు - శిల్పులిలను
  కూళల కొలువుగొను లంచ - గొండితనము
  దాని మానుప భువి నౌషధమ్ము గలదె?
  _______________________________________

  రిప్లయితొలగించండి
 18. కిషోర్ గారూ,
  పద్య రచన ఒక వ్యాసంగమనే కానీ, వ్యసనము కాదు అనే ఉద్దేశ్యం తో రాసేను.
  చెడు వ్యసనాన్ని మాన్పించడం ఎంత కష్టమో, మంచి వ్యాసంగాన్ని మానడం కూడా అంతే కష్టమని నా భావం.
  అంతే గాని, ఈ పద్యం రాయటంలో, మీరన్నట్టుగా నా గొప్ప తనమేమీ లేదు.
  నా పద్యం నచ్చినందుకు సంతోషం గా వున్నది. మీ అభినందనలకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 19. మిత్రు లందరి పద్యాలూ ఒక దాన్ని మించి ఒకటి అలరారు తున్నాయి.
  రోజుకు నాలుగైదు సార్లు చూడ కుండా ఉండ లేక పోతున్నాము.

  శంకరార్యుని బ్లాగుకు వంక లేదు
  పద్య రచనను చేయించు పట్టి చేయి
  వ్యసనమై పోయె నిది, కాదు వట్టి మాట
  దాని మానుప భువి నౌషధమ్ము గలదె?

  రిప్లయితొలగించండి
 20. మిత్రులందరికీ విజ్ఞప్తి.
  హరిగారి సూచనకు దయచేసి వీలైనంతలో సానుకూలంగా స్పందించండి.

  రిప్లయితొలగించండి
 21. గురువు గార్కి,
  నాదొక మనవి.
  ఈ సంక్రాతి కి ఒక సమస్యా పూరణం ఇచ్చే బదులు, శంకరాభరణం మేటి కవీంద్రులందరినీ అష్ట (లేక అష్టాదశ) దిగ్గజాలు గా విభజించి ఒక్కక్కరి కీ ఒక్కొక్క సమస్య విడి గా ఇచ్చి (నవరసాల తో, దత్తపదులతో అష్ట దిగ్గజాలనీ,కవిత్రయానీ, విశ్వనాథులనీ, పోతన, శ్రీ నాధుడు మొదలగు వారిని తలపిస్తూ) మీ ఆధ్వర్యం లో వినూత్న ప్రయత్నం జరగాలని ఆశిస్తున్నాను.

  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం (బెంగళూరు)

  రిప్లయితొలగించండి
 22. తొలినాళ్లలో శిశువైన వసంత్ కిశోర్ గారు.... శంకరాభరణంలోని సారస్వతామృతాన్ని గ్రోలి అచిరకాలం లోనే శిశుత్వాన్ని వదలి ప్రౌఢత్వాన్ని సంతరించుకున్నట్లు వారి రచనల ద్వారా వెల్లడవుతూంది ...... అభినందనలు
  ఇకమీదట మీరెంత మాత్రమూ శిశువు కాదని మీకో ' ఏజ్ సర్టిఫికెట్ ' ఇష్యూ చేసేస్తూన్నాను వైద్యుడిగా.....!!!! :))

  గన్నవరపు మూర్తిగారికి కూడా బహుధా కృతజ్ఞతలు !!!!

  రిప్లయితొలగించండి
 23. కాయమునకైన నే మొండి గాయమైన
  మందు మాకులు వాడుచో మాన్పవచ్చు
  మనసు క్రుంగును పరుషంపు మాట వలన
  దాని మానుప భువి నౌషధమ్ము గలదె ? !!!

  రిప్లయితొలగించండి
 24. అయ్యా! డాట్టరు గోరు ! దండాలు!
  అల్లరి చెయ్యడానికి వీలు లేకుండా
  చేసేసారు గదా!

  మిస్సన్న మహాశయా!
  మీరు కూడా వ్యసన
  పరులై పోయారని(నా లాగే)

  కడు చక్కని
  మీ పూరణతో
  చెప్పారు.

  రిప్లయితొలగించండి
 25. క్రుంగిన మనసుకు
  డాట్టరు గారి దగ్గర
  కూడా మందు నేదన్న మాట.

  కుళ్ళ బొడిజేశారు సార్!
  మీ చక్కని పూరణతో!

  రిప్లయితొలగించండి
 26. మనసు వ్యాధికి మందేసి మాన్పవచ్చు
  వ్యసన పరుడైన మారును భయము వలన
  అకట అవినీతి ఝాఢ్యమ్ము అంటినంత
  దాని మానుప భువి నౌషధమ్ము గలదె?

  రిప్లయితొలగించండి
 27. కవి మిత్రులకు వందనం.
  ఉదయం బ్లాగు తెరిచి మీ అందరి పూరణలు చదివి విశ్లేషంచాలనుకున్నాను. కాని పవర్ కట్ వల్ల వీలు పడలేదు. అత్యవసరంగా హైదరాబాద్ వచ్చి నెట్ సెంటర్ లో కూర్చుని మీ పూరణలను చూసాను. సమయాభావం వల్ల విడివిడిగా వ్యాఖ్యానించలేక పోతున్నాను. పూరణలు పంపిన డా. విష్ణు నందన్ గారికి, మంద పీతాంబర్ గారికి, వసంత్ కిశోర్ గారికి, విద్యాసాగర్ గారికి, గన్నవరపు నరసింహ మూర్తి గారికి, మిస్సన్న గారికి, హరి గారికి అభినందనలు. సమస్యలను పరస్పరం విశ్లేషించుకొని, అభినందించి నాకు శ్రమ తగ్గించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. పునర్దర్శనం రేపు.

  రిప్లయితొలగించండి
 28. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
  మీ సూచన బాగుంది. అది కార్య రూపం దాల్చడానికి కొంత వ్యవధి కావాలి.

  రిప్లయితొలగించండి