కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
చెడుగుడు నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్.
శ్రీ అబ్బూరి రామకృష్ణారావు గారి చాటువు నుండి ఈ పద్యపాదాన్ని సమస్యగా ఇవ్వమని సూచించిన రాజేశ్వరి నేదునూరి గారికి ధన్యవాదాలు.
కవి మిత్రులకు మనవి .....
సమస్యలను పంపండి. మీరు స్వయంగా తయారు చేసినవీ, విన్నవీ, చదివినవీ, అవధానాలు , పత్రికలూ, ఆకాశవాణి తదితర మాధ్యమాల ద్వారా మీకు తెలిసిన సమస్యలను నాకు మెయిల్ చెయ్యండి. ధన్యవాదాలతో ప్రకటిస్తాను. నేను ఒక్కణ్ణి ఎన్నని సృష్టించను? ఇది మీ బ్లాగు. మీ భాగస్వామ్యం ఉండాలి. పంపిస్తారు కదా?
మడువులివి గురుడసలు మె
రిప్లయితొలగించండిచ్చడను సుతుని బుజ్జగించి జనని పలికె; నె
వ్వడడుగు దిగంబరుడు మె
చ్చెడుదగు నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్?
గోలి.హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిగుడిలో స్తుతి గీతమునకు
చెడుదగు నాట్యమ్ము కొరకు జీన్సులు చూడన్
బడిలో డిస్కో పాటకు
చెడుదగు నాట్యమ్ము కొరకు చీనాంబరముల్.
గుడికిన్ వచ్చిన గుమ్మల
రిప్లయితొలగించండినడిగెను పూజారి భరత నాట్యము చేయన్!
పడతులు దెచ్చిరి శోభిo
చెడు, గు(డి)నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్!
కవి మిత్రులు మన్నించాలి. ఉదయం ఇంట్లో నెట్ సరిగా రాక, ప్రక్కన నెట్ సెంటర్ వెళ్ళి ఈరోజు సమస్యను పోస్ట్ చేసాను. అక్కడ గోలగోలగా ఉండడంతో చీకాకు పడుతూ సమస్యను టైపు చేసాను. "చెడుగుడు" అనేది "చెడుగు" గా టైపయింది. ఇప్పుడు సవరించాను.
రిప్లయితొలగించండిఆ సమస్య ఇది ...
"చెడుగుడు నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్"
ఇప్పటికే ముగ్గురు కవి మిత్రులు తమ తమ ఊహలతో లుప్తమైన అక్షరాన్ని వేసికొని పూరణలను పంపించారు. వారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఎఱ్ఱాప్రగడ రామ్మూర్తి గారు "చెడుదగు" అని ఊహించి దిగంబరుడు మెచ్చెడుదగు నాట్యాన్ని చూపిస్తూ పూరించారు. బాగుంది. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారు కూడ "చెడుదగు" అనే ఊహించి గుడిలో భక్తి పాటలకు జీన్సులతో, బడిలో డిస్కో పాటలకు చీనాంబరాలతో నాట్యం చేయించి చక్కని పూరణ పంపారు. వారికి అభినందనలు.
మంద పీతాంబర్ గారు చెడు గుడి నాట్యాన్ని చూపుతూ మంచి పద్యం చెప్పారు. వారికి అభినందనలు.
పై కవి మిత్రులు సవరించిన సమస్యను కూడ పూరించి మనల్ని ఆనందింప జేస్తారని ఆశిద్దాం.
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిబడిలో జరుగును పోటీ
చెడుగుడు, నాట్యమ్ముకొరకు,ఛీనాంబరముల్
ఉడుపులు వాటికి మరిసరి
పడునవి కుట్టించి తెండు వడివడి రేపే.
గడబిడయ ప్రజాస్వామ్యమ
రిప్లయితొలగించండిఅడుగడుగున జరుప నేల నా యెన్నికలన్
గడుసరులు దోచ దేశము
చెడుగుడు నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్ !
క్షమించాలి నిన్నటి పూరణలొ " కోడలు ,వేడుక " అని మర్చి పోయి పూరించాను.వాటికి పర్యాయ పదాలు తోచ లేదు.సవరించి నందులకు సనత్ శ్రీపతి గారికి ధన్య వాదములు + కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండినడుమునకు గోచి ఆడగ
రిప్లయితొలగించండిచెడుగుడు, నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్,
కుడవగ కంచము, గొడుగే
తడవకనుండగ జనులకు తప్పక వలయున్!!
అబ్బూరి వారి చాటువు నేనెరుగనండీ. మీరు ఇచ్చిన పాదాన్ని బట్టి చూస్తే భరత నాట్యానికి చీనాంబరాలు గానీ బజారు నాట్యానికి చీనాంబరాలు ఎందుకు - అన్న అర్ధం ఊహకుదోచింది..
రిప్లయితొలగించండిఆ విధంగనే పూరించటానికి ప్రయత్నించి మీ ముందు ఉంచుతున్నాను
వడియములకుకోడేలయ? ( కోడి - ఏలయ?)
బడిపిల్లలకేలమోతబరువు?మరేలా
విడువంజూచెడు తారల
చెడుగుడు నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్?
తెలియక ఈ మాట అడుగుతున్నాను...
ఆశువు కాబట్టి చెడుగుడునాట్యం అన్నారేమో. ఇతర సందర్భాలలో చెల్లుతుందాండీ
భవదీయుడు
ఊకదంపుడు
ముడుపులు చెల్లించగ పడు
రిప్లయితొలగించండియిడుములు యింతింత కాదు బడిచదువులకున్ !
కడు భీకరమయ్యె బ్రతుకు
చెడుగుడు నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్ !
చెడు వినకు కనకు చెడులను
రిప్లయితొలగించండిచెడెదవు చెరపకెవరిని చేజేతులతోన్ !
చెడులను పెడ చెవినిడి
చెడుగుడు నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్ !
[ అసలు ఎలాఉంటుందో అని సరదాకి వ్రాసాను.తప్పులైతె ఏముంది ? మన్నించడమె మరి ]
బుడతలు గావలె నాడగ
రిప్లయితొలగించండిచెడుగుడు! నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్,
పిడికెడు నడుముల్ గలిగిన
పడతుల్ గావలెనుగాని పావడ లేలా!
గడుసరి గోపిక లాడిరి
చెడుగుడు, నాట్యమ్ము కొఱకు! చీనాంబరముల్
వడివడిగలాగ ,కృష్ణుని
మెడనుండి మరిమొలనుండి, మెఱుపులు రాలెన్!
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
నరసింహ మూర్తి గారూ,
మాటిమాటికి వచ్చే ఎన్నికలను చెడుగుడుతో పోల్చుతూ చక్కని పూరణ చేసారు. అభినందనలు.
సత్యనారాయణ గారూ,
దేని కేది కావాలో వివరిస్తూ చక్కగా పూరించారు. అభినందనలు.
ఊకదంపుడు గారూ,
తారల చెడుగుడు నాట్యం, ఆ నాట్యంలో విడువబోయే చీనాంబరాలు ... మంచి ఊహతో పూరణ చేసారు. అభినందనలు.
అసలు ఈ పద్యాన్ని అబ్బూరివారు ఏ సందర్భంలో చెప్పారో, దాని పూర్తి పాఠం ఏమిటో రాజేశ్వరి గారిని కాని, డా. ఆచార్య ఫణీంద్ర గారిని కాని అడుగుతాను.
రాజేశ్వరి గారూ,
మొదటి పూరణ చాలా బాగుంది. అభినందనలు.
రెండవ పద్యం మూడవ పాదంలో గణదోషం ఉంది. "పెడచెవి నిడినన్", "పెడచెవి నిడఁగా", "పెడచెవి నిడి యా" ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. కాని విషయానికి, సమస్యకు పొంతన కుదరడం లేదు.
ఇంతకీ ఈ పద్య పాదాన్ని ఎక్కడ సంపాదించారు? పూర్తి పద్యం మీ వద్ద ఉంటే వ్యాఖ్యగా పెట్టండి.
పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిఇప్పుడు పంపిన రెండు పూరణలూ చాలా బాగున్నాయి. చెడుగుడుకు బుడతలు, చీనాంబరాలు ధరించి నాట్యం చేయడానికి పిడికెడు నడుముల పడతులు కావాలనడం బాగుంది. కృష్ణుని మొల నుండి మెరుపులు రాల్చారు :-) అభినందనలు.
సినిమా పాట షూటింగు:
రిప్లయితొలగించండిపిడికెడు దుస్తుల పడతిని
చెడుగుడు నాట్యమ్ము కొఱకు; చీనాంబరముల్
తొడుగగ నాయక వరునకు
అడుగిడ మందయు, వెడవెడ నాడిరి నటపై.
రవి గారూ,
రిప్లయితొలగించండిఆలస్యమైనా మంచి పూరణ పంపారు. అభినందనలు.
సడి సరకు గొనక బిడియము
రిప్లయితొలగించండివిడిచిన నీకేలనె బలుపిరుదుల పడతీ !
యొడిసి యొడలూపెడు సినీ
చెడుగుడు నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్ !
భడవలు భారత పౌరులు
రిప్లయితొలగించండివిడువక సెల్ ఫోనులిచట వెర్రిగ కొనగా
కడకిక దిక్కును లేకయె
చెడుగుడు నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్