17, జనవరి 2011, సోమవారం

ప్రహేళిక - 41 సమాధానం

ఈ కూరగాయ ఏది?
తే.గీ.
వాయసము, స్వప్నము, తిమిరవైరి, వార
ణాసి, సన్యాసి యనెడి రెండక్షరముల
పదముల ప్రథమాక్షరములఁ బట్టి చూడఁ
దెలియు కూరగాయను దెల్పఁ గలరె మీరు?

వివరణ -
వాయసము - కాకి
స్వప్నము - కల
తిమిరవైరి - రవి
వారణాసి - కాశి
సన్యాసి - యతి
పై పదాల మొదటి అక్షరాలను చదివితే
సమాధానం - కాకరకాయ.
సమాధానాలు పంపినవారు -
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు,
జి. మైథిలీ రాం గారు,
అందవోలు విధ్యాసాగర్ గారు,
మిస్సన్న గారు,
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు,
గన్నవరపు నరసింహ మూర్తి గారు,
మంద పీతాంబర్ గారు.
అందరికీ అభినందనలు.

2 కామెంట్‌లు:

  1. మంద పీతాంబర్ గారూ,
    మీ సమాధానం 100% కరెక్టే. ఎందుకో కాని అది నా మెయిల్లో రాలేదు. ఎక్కడైనా తప్పిపోయానా అని నా మెయిల్ బాక్స్ మరీ మరీ చూసాను. ఉహుఁ .. ఎక్కడా లేదు. ఎలా మిస్ అయిందో?

    రిప్లయితొలగించండి