16, జనవరి 2011, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - (టీవీ లుండెను)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
టీవీ లుండెను చూచి మెచ్చ మునివాటిన్ బూర్వకాలమ్మునన్.
(ఆకాశవాణి వారి సౌజన్యంతో ... దీనిని సూచించిన మిస్సన్న గారికి ధన్యవాదాలు)

13 కామెంట్‌లు:

 1. దేవీ సత్కరుణా కటాక్షములతో - ద్వేష ప్రకోపమ్ము మి
  థ్యా వాదమ్మయి , జాతి వైరము పరాస్తమ్మై , పులుల్ సింహముల్
  గోవుల్ లేళ్లు నెమళ్ల గుంపులొకటై కోలాహలమ్మూన చే
  టీ ! వీలుండెను చూచి మెచ్చ మునివాటిన్ బూర్వకాలమ్మునన్ !!!

  రిప్లయితొలగించండి
 2. విష్ణునందను గారూ మీ మనోజ్ఞమైన పూరణకు మా నమోవాకములు.

  రిప్లయితొలగించండి
 3. నీవేదిక్కని నమ్మినారటగదా! నీ లీల కేదౌను? సా
  టీ ! వీలుండెను చూచి మెచ్చ మునివాటిన్ బూర్వకాలమ్మునన్ !!!
  రావే నేడును మమ్ము బ్రోవ జననీ రాజేశ్వరీ,గౌరి,శ్రీ
  దేవీ,పూజలనందుకొమ్ము భువిలో దేదీప్యమానంబుగా !!!

  రిప్లయితొలగించండి
 4. లేవే స్పర్థలు లేవు మచ్చరములున్ లేవే వికారంబులున్
  లేవే చింతలు చీకులున్ యెవరికిన్ లేవే ప్రకోపంబులున్
  తావుల్ శాంతికి, ధర్మ కర్మములకున్ తావుల్ సదా వీని బో-
  టీ!వీలుండెను చూచి మెచ్చ మునివాటిన్ బూర్వకాలమ్మునన్.

  రిప్లయితొలగించండి
 5. విష్ణు నందన్ గారూ,
  బహుకాలానికి మమ్మల్ని కరుణించారు. ధన్యులం.
  ఎప్పటిలాలే మీ పూరణ సర్వాంగ సుందరమై సుమనోరంజకంగా ఉంది. ధన్యవాదాలు.

  మంద పీతాంబర్ గారూ,
  వృత్త రచనలోను ప్రావీణ్యత చూపించారు. బాగుంది. అభినందనలు.

  మిస్సన్న గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. అందరికీ వందనములు.
  అందరి పూరణలూ ముద్దు లొలుకు చున్నవి.
  ___________________________________________
  (ఇంటి ముందున్న కొలనులో పూచిన నల్ల కలువలను కోసి
  మాల గూర్చు చున్న యువతిని తన ఇంటికి
  ఆహ్వానిస్తూ ఒక యువకుడు)
  ___________________________________________
  ప్రావీణ్యంబున బెంచినట్టి ఫల , పు - ష్పా , వృక్ష సందోహము
  ల్లావణ్యం బొలికించు లేళ్ళు, రమణీ - లాస్యంపు పుంజంబులు
  న్నీవీటి న్ముదమార గాంచి , జనుమో - నీలాబ్జ సంధాన బో
  టీ !వీలుండెను చూచి మెచ్చ మునివా - టిన్ పూర్వ కాలమ్మునన్!
  ____________________________________________

  రిప్లయితొలగించండి
 7. శంకరార్యా!
  వారాంతపు సమస్యా పూరణం - 181
  ఒకపరి తిలకింప గలరు!

  రిప్లయితొలగించండి
 8. ఆ వేదాది సమస్త వాఙ్గ్మయము నందత్యంత శ్రద్ధాళులున్
  భావంబందు పరాత్పరున్ సతము సంభావించు పుణ్యాత్ములున్
  కైవల్యంబును జేరు త్రోవ జను కాంక్షల్ గల్గు మౌనుల్ వధూ-
  టీ!వీలుండెను చూచి మెచ్చ మునివాటిన్ బూర్వకాలమ్మునన్.

  రిప్లయితొలగించండి
 9. వసంత్ కిశోర్ గారూ,
  వృత్త రచనలోను సిద్ధహస్తు లయ్యారు. సంతోషం!
  పూరణ బాగుంది. అభినందనలు.
  "ఫల పుష్పా వృక్ష" అనేకంటే "ఫల పుష్ప క్ష్మాజ" అంటే బాగుంటుంది.
  వారాంతపు సమస్యాపూరణం 181 చూసాను. మీ పూరణ బాగుంది. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించాలి. మొదటి ప్రయత్నంలోనే అదరగొట్టారు. గుణాధిక్యత వల్ల అల్పదోషాలు లెక్కకు రావు. "ధారాళ దీవ్రాహతిన్" అన్నదే దోషం. "ధారాళ బాణాహతిన్" అంటే సరిపోతుందేమో?!

  మిస్సన్న గారూ,
  మీ రెండవ పూరణ కూడా అద్భుతంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. శంకరార్యా!
  ధన్యవాదములు.
  మీ మెరుగులతో నా వృత్తాలకు
  నూత్న శోభ సమకూరింది.

  రిప్లయితొలగించండి
 11. మాయాబజార్:

  బావామర్దలు ప్రేమ పాటలనుభల్ పాడంగ డ్యూయెట్టులన్
  చేవన్ జూపుచు పాచికన్ శకునితా చిందించ హస్తమ్మునన్
  సేవల్ జేయగ స్కైపు తోడ పలుకుల్ శ్రేయంబుగా కల్పెడిన్
  టీవీ లుండెను చూచి మెచ్చ మునివాటిన్ బూర్వకాలమ్మునన్

  రిప్లయితొలగించండి