9, జనవరి 2011, ఆదివారం

సమస్యా పూరణం - 193 ( వినాయకా! నిన్ను )

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
వినాయకా! నిన్నుఁ గొలువ విఘ్నము లెసఁగెన్.

38 కామెంట్‌లు:

 1. గాణాధిపావిఘ్నాధిప
  వినాయకా నిన్ను గొలువ విఘ్నము లెసగెన్
  సునాయాసముగా కందము
  గణాల బేసిన జగణము కలిసెను వింతన్

  రిప్లయితొలగించండి
 2. నిరంజన్ కుమారు గారు,
  ఇక్కడ సమస్యలో బేసి గణము "జగణము" కాదండి. సరి బేసి గణాలను లెక్క వేసేటప్పుడు పొట్టి పాదాన్ని, పోడుగు పాదాన్ని కలిపి లెక్క వెయ్యాలి. అలా లెక్క వేస్తే సమస్య నాల్గవ గణమైన సరి గణముతో మొదలవుతుంది. కావున సమస్య "జగణము" తో మొదలవటము ఛందోబద్దమే.

  రిప్లయితొలగించండి
 3. అనవరతము నీ మాటలు
  విని నీ పథమనుసరించి విధ్యను వీడన్
  జనమున చులకనలగు భా-
  వి నాయకా! నిన్నుఁ గొలువ విఘ్నము లెసఁగెన్

  రిప్లయితొలగించండి
 4. గణాధిపా విఘ్నాధిప
  వినాయకా నిన్ను గొలువ విఘ్నము లెసగెన్
  సునాయసముగా కందము
  గణాల బేసిన జగణము కలిసెను వింతన్

  మొదటి పద్యములో పద దోషము వచ్చిందని తిరిగి ఇస్తున్నాను

  సత్యనారాయణ గారు, మీరు చెప్పిన దాని ప్రకారము మరి మొదటి గణము జగణము అవుతోంది కదా!
  పరవాలేదంటారా?

  రిప్లయితొలగించండి
 5. అను నిత్యము, ప్రతి నిముషము
  వినాయకా నిన్ను గొలువ విఘ్నము లెసెగెన్!
  వినవెందుకు దీనులమొర,
  గనవెందుకు వారివెతల కరిముఖ వదనా!!

  రిప్లయితొలగించండి
 6. నిరంజన్ కుమారు గారు,
  పొట్టి పాదము 3గణాలు + పొడుగు పాదము 5గణాలు కలిపి మొత్తము 8 గణాలు.
  వీటిలో బేసి గణాలైన 1, 3, 5, 7 గణాలుగా "జగణము" రాకూడదు.
  మీ సవరించిన పూరణలో పూర్వార్థములోని 1వ గణము, ఉత్తరార్థములోని 1వ గణమూ "జగణము" అయినది.

  రిప్లయితొలగించండి
 7. నిరంజన్ గారూ వినాయ అన్నది నాలుగవ గణ మవుతుంది. అందుచేత అది బేసి కాదు.
  సత్యనారాయణ గారు చెప్పిందదే.

  రిప్లయితొలగించండి
 8. పీతంబార్ గారూ భేష్!
  సత్యనారాయణ గారూ మీ పద్యం లోని విరుపు భేష్!

  రిప్లయితొలగించండి
 9. అనిమిషు లుదధి మధింపుకు
  వినాయకా! నిన్నుఁ గొలువ, విఘ్నము లెసఁగెన్
  నిను తలపని యసురుల, కా
  పని యైనను తుదకు భంగ పాటే మిగిలెన్!

  రిప్లయితొలగించండి
 10. కనకముతో,కాసులతో,
  వినాయకా నిన్ను గొలువ విఘ్నము లెసెగెన్!
  వినయుడనై భక్తి గొలుతు
  వినాయకానిన్ను! దీర్చువిఘ్నము లన్నిన్ !

  రిప్లయితొలగించండి
 11. మనమున భక్తిని వ్రేల్చి
  వినాయకా! నిన్నుఁ గొలువ, విఘ్నము లెసఁగెన్.
  కనుగొంటిని కారణముఁ, ర
  జనీకరునిఁ గంటి విఘ్న చవితి దినమునన్.

  రిప్లయితొలగించండి
 12. కనిపించవు వినిపింపవు
  వినాయకా నిన్నుఁ గొలువ విఘ్నము లెసఁగెన్
  కనిపించును రాత్రిచరుఁడు
  అనవరతము నింద మోప నదియే చెల్లున్!

  రిప్లయితొలగించండి
 13. పనిగొని నిను నిందింతుమ
  వినాయకా నిన్నుఁ గొలువ విఘ్నము లెసఁగెన్ !
  నిను గొలుచుచు విధులందున
  వినయముగా శ్రధ్ధ నిడుట విజ్ఞత యేమో!

  రిప్లయితొలగించండి
 14. శ్రీ సత్యనారాయణ గారి పూరణ చాలా బాగుంది. శ్రీ పీతాంబర్ గారి రెండు పూరణలు బాగున్నాయి. మొదటి పూరణ నాకు బాగా నచ్చింది. పేరు చూడకుండానే మిస్సన్న గారి పూరణ అని తెలిసిపోతుంది. రవిగారూ ప్రకృతిని ఆరాధించే వారు. రజనీ వల్లభుణ్ణి చూడకుండా ఒక్క దినము కూడా ఉండలేరు కదా!
  నా పూరణలు నాకు అంతగా నచ్చలేదు. వినాయకుడిని నిందించడము,చంద్రుడిని 'రాత్రిచరుడు ' అనడము రెండూ దోషాలే. మరోసారి గణపతిని స్మరించాలి!. నిరంజన్ గారూ మీరు మరో పద్యము వ్రాయాలి!

  రిప్లయితొలగించండి
 15. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

  అనయములు గూడు నప్పుడు
  వినాయకా నిన్నుఁ గొలువ విఘ్నము లెసఁగెన్
  వినుతింతురు విమలమతులు
  అనవరతము నిన్నుఁ గొలుతు రాపద లేమిన్ !

  రిప్లయితొలగించండి
 16. గన్నవరపు వారూ మా దగ్గర అంత సీనేమీ లేదు గానీ, పద గుమ్ఫనాన్ని బట్టి మాత్రం మీ పద్యం పేరు చూడకుండానే మీదని తెలిసి పోతుంది. మీరు వాడే తెలుగు పదాల్లో అనేక పదాలకు నాకు అర్థం తెలియదు. నా భాషా పరిజ్ఞానం అలాంటిది.

  రిప్లయితొలగించండి
 17. అనుదినము నిన్ను గొలిచెద
  గణముల కధిపతి విగాన గజముఖ వదనా ?
  కనగలమా ? నీదు మహిమ
  వినాయకా ! నిన్నుఁ గొలువ విఘ్నము లెసఁ గెన్ !

  రిప్లయితొలగించండి
 18. నరసింహ మూర్తి గారూ ' రజనీకరు డనవరతము 'అంటే సరిపోతుందేమో.

  రిప్లయితొలగించండి
 19. సరస్వతీ పుత్రులు ,సాహితీ స్రష్టలు , పండితులు + గురువులు ఐన సోదరులకు " + అందరికి గురువు గారైన శంకరయ్య గారికి నూతన సంవత్సర సంక్రాంతి శుభా కాంక్షలు.

  రిప్లయితొలగించండి
 20. మిస్సన్నగారూ ధన్యవాదములు. ఇది యెలా ఉందంటారు ?

  కనిపించవు వినిపింపవు
  వినాయకా నిన్నుఁ గొలువ విఘ్నము లెసఁగెన్
  కనిపించెడి రజనీ పతి
  ననవరతము నింద మోప నతనికి చెల్లున్!

  రిప్లయితొలగించండి
 21. ' అనయములు ' పద్యములో విఘ్నములు అనయములకు ( ఆపదలకు )అనే భావముతో వ్రాసాను. అంటే ఆపదలు తొలగిపోతాయని.

  రిప్లయితొలగించండి
 22. ఆంధ్రభూమి ప్రియదర్శిని లో మీ బ్లాగ్ గురించి వ్రాసిన తర్వాత చూసాను.
  చాలా సంతోషం. మీ సాహితీ పిపాశానికి నా వందనములు...
  పాదాభి వందనములు.
  బ్లాగ్ కాకుండా స్వంతంగా వెబ్సైటు ప్రారంభించండి.సైటుకు ఎంతో ఖర్చు కాదు.
  ఆ దిశగా పయనించవలసినదిగా కోరుకొంటున్నాను.
  అందుకు నా సహకారాలు వుంటాయి.sevanet@yahoo.com
  -seva@in.com

  రిప్లయితొలగించండి
 23. బ్లాగు.. బ్లాగు..!!


  అనగనగా ఒక విశ్రాంత తెలుగు పండితుడు శంకరయ్య. రిటైరయ్యాక ఇంట్లో ఉండి గోళ్లు గిల్లుకుంటూ కూర్చోలేక కొడుకు సహాయంతో కంప్యూటర్ వాడకం నేర్చుకుని శంకరాభరణం అనే బ్లాగు మొదలుపెట్టారు. పద్యాలు, ప్రహేళికలు, ఛందస్సు, గళ్ల నుడికట్టు మొదలైన పాఠాలు చెప్పేవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సాహితీ పిపాసకులు అవి పూరిస్తూ ఆ బ్లాగుకు, పద్యానికి అభిమానులై పోయారు. అనుకోకుండా శంకరయ్యగారి అబ్బాయి తన చదువు నిమిత్తమై కంప్యూటర్ తీసుకుని వేరే ఊరు వెళ్లిపోయాడు. ఆర్థిక కారణాలవల్ల తొందరగా కంప్యూటర్ కొనలేను, అప్పుడప్పుడు నెట్ సెంటర్ నుండి చూస్తూంటాను. ఈ ఆలస్యానికి మన్నించమని బ్లాగులో రాశారు శంకరయ్య. దానికి ఆ బ్లాగు అభిమానులు అతి వేగంగా స్పందించారు.
  ‘ఇది మా బ్లాగు. మా బ్లాగు నిర్వహణకు మా గురువుగారికి మేమే కంప్యూటర్ కొనిస్తాం’ అంటూ మన రాష్ట్రం నుండేకాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్లు ముందుకొచ్చారు. అందరూ ఇంటర్‌నెట్ ద్వారా కలిసినవాళ్లే. వాళ్లు ఎలా ఉంటారో తెలీదు. ఎక్కడ ఉంటారో తెలీదు. ఒకరిద్దరు తప్ప ప్రత్యక్ష పరిచయం, స్నేహం లేదు. ఐనా శంకరయ్యగారి బ్యాంకు వివరాలు తెలుసుకుని మూడంటే మూడు రోజుల్లో ముప్పై వేలకు పైగా సొమ్ము పంపించారు. ఇక చాలు బాబోయ్ అనేంతవరకు ఆగలేదు ఈ వితరణ. ఇలా పంపిన వారికి ఈ సొమ్ము దుర్వినియోగం అవుతుందన్న అపనమ్మకం, అనుమానం లేదు. ఎందుకంటే అది ఒక వ్యక్తికి ఇచ్చిన సొమ్ముగా ఎవ్వరూ భావించలేదు.
  ఇదంతా తెలుగు పద్యానికి పట్టిన హారతి కాక మరేముంది. తెలుగు భాషకు ఆదరణ తగ్గిపోతోంది అని బాధపడుతున్న ఈ రోజుల్లో, అన్నదమ్ములు, స్నేహితులనే నమ్మని ఈ కాలంలో ఒక బ్లాగు నిర్వహణకు అవసరమైన కంప్యూటర్ కొనడానికి ఎటువంటి నోటు, ఫోనూ లేకుండానే మేమున్నామంటూ ముందుకొచ్చి ముప్పై వేలకు పైగా ధన సహాయం అందించడం నమ్మలేని అద్భుతంగా ఉంది.
  ఇది ఆ బ్లాగు.

  - seva@in.com

  రిప్లయితొలగించండి
 24. అయ్యా !
  శంకరాభరణం శంకరయ్య గారు
  వందనములు.
  ఆంధ్రభూమి ప్రియదర్శిని లో మీ బ్లాగ్ గురించి వ్రాసిన తర్వాత చూసాను.
  చాలా సంతోషం. మీ సాహితీ పిపాశానికి నా వందనములు...
  పాదాభి వందనములు.
  బ్లాగ్ కాకుండా స్వంతంగా వెబ్సైటు ప్రారంభించండి.
  subbanaidu@hotmail.com

  రిప్లయితొలగించండి
 25. రాజేశ్వరమ్మ గారు: మీరు సాహితీ స్రష్టలు, పండితులు, కవులు, గురువులు, వీరలకే శుభాకాంక్షలు చెప్పారు. మరి మా బోంట్ల సంగతి ఏమిటి? :)

  గన్నవరపు వారి అల్లిక జిగిబిగి. మిస్సన్న గారన్నట్టు మీరు ఉపయోగించే ముఖ్యమైన పదాలకు అర్థం తెలిపితే ఓ రెండు ముక్కలు నేర్చుకుంటాము కదా?

  రిప్లయితొలగించండి
 26. రవి గారు ! మీకెందు కొచ్చింది ఆ సందేహం .? మీరూ ఇందులోని [ అంటే ఈ బ్లాగులొని ] వారెకదా ? ఆ బిరుదులన్ని మీవి కూడా ! సరేనా ? పైగా అప్పుడప్పుడు నా పద్యాల దోషాలను సవరణ చేసిన గుర్తు.అంటే మరి మీరు పండితులనేగా ? అందుకె అందరికి హృదయ పూర్వక శుభా కాంక్షలు + ధన్య వాదములు.నిజానికి నాకేమి రాదు.ఇక్కడ అడుగు పెట్టాకే గురువు గారి ధర్మ మా అని నాలుగులొ ఒకటి సరిగా రాయ గలుగుతున్నాను.అంత కంటే ఎక్కువగా మీ అందరి ఆదరాభి మానాలతొ మరింత ఆశక్తి ,ప్రోత్సాహము కలిగాయి అందుకె మీ అందరికి మరొక సారి హృదయ పూర్వక ధన్య వాదములు.

  రిప్లయితొలగించండి
 27. చాలా సంవత్సరాల క్రితము వదిలి వేసిన తెలుగుని మళ్ళీ నేర్చుకొంటున్న విద్యార్ధిని నేను. సమయము తక్కువ. చిన్నప్పుడు లాగ చదివినవి గుర్తుండవు.అయినా కుస్తీ పడుతున్నాను. యువతరములో తెలుగు అభిమానము పెరగడము చూస్తే చాలా సరదాగా ఉంటుంది. అంతర్జాలములో ఆంధ్ర భారతి వారి సైటులో(http://www.andhrabharati.com /)నిఘంటువే కాక చాలా సాహిత్యము అందుబాటులో ఉంది. ఈ విషయము మీకు తెలిసే ఉండ వచ్చు. నేను నేర్చుకొంటున్న పదాలకు అర్ధాలు వ్రాయడంలో అభ్యంతరము లేదు. ఇక్కడ మీ అందఱి వద్ద కూడా నేను నేర్చుకొంటున్నాను.

  రిప్లయితొలగించండి
 28. నిరంజన్ గారూ,
  జిగురు సత్యనారాయణ గారు, మిస్సన్న గారు మీ సందేహాన్ని తీర్చారు కదా!
  కంద పద్య లక్షణాన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు.
  కందాన్ని గా, భ, జ, స, నల అనే చతుర్మాత్రా గణాలతో వ్రాయాలి.
  1) మొదటి రెండు పాదాలను పూర్వార్ధంగా, తరువాతి రండు పాదాలను ఉత్తరార్ధంగా గ్రహించాలి. ప్రతి భాగంలో 3 + 5 = 8 గణాలుంటాయి. ఈ ఎనిమిది గణాల్లో బేసి గణంగా జరణం ఉండరాదు. ఆరవ గణం తప్పని సరిగా జగణం కాని నలం కాని అయి ఉండాలి. ప్రతి భాగం చివర గురువు తప్పక ఉండాలి. 4వ, 7వ గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి కూర్చాలి. 1వ, 4వ గణాల రెండవ అక్షరాలకు ప్రాసమైత్రి పాటించాలి. 1వ గణం మొదటి అక్షరం లఘు గురువులలో ఏది ఉంటే 4వ గణం మొదతి అక్షరం అదే ఉండాలి.
  2) 1వ, 3వ పాదాల్లో మూడు గణాలుంటాయి. ఇక్కడ బేసి గణంగా జగణం ఉండకూడదు. ఈ పాదాల్లో యతిమైత్రి లేదు.
  2వ, 4వ పాదాల్లో ఐదు గణాలుంటాయి. ఇక్కడ సరి గణంగా జగణం ఉండకూడదు. మూడవ గణంగా జగణం కాని, నలం కాని ఉండాలి. పాదాంతంలో గురువు తప్పక ఉండాలి. నాల్గవ గణం మొదటి అక్షరం యతి స్థానం. పద్యంలోని మొదటి పాదాన్ని లఘు గురువులలో దేనితో ప్రారంభిస్తామో, మిగిలిన పాదాలనూ దానితోనే ప్రారంభించాలి.
  ప్రాస నియమం ఉంది. ప్రాస యతి వాడరాదు.

  రిప్లయితొలగించండి
 29. జిగురు సత్యనారాయణ గారూ,
  "భావి నాయకా" అనే విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  "చులకనలగు" కంటే "చులకనఁ గను" అంటే బాగుంటుంది.
  నిరంజన్ గారి సందేహం తీర్చినందుకు ధన్యవాదాలు.

  మంద పీతాంబర్ గారూ,
  పద్యం బాగుంది. అభినందనలు.
  "కరి ముఖ వదరా" అన్నప్పుడు ముఖం, వదనం ఒకటే కదా! పునరుక్తి దోషం.
  "కరి ముఖ దేవా" అని కాని "కరి ముఖ వరదా" అని కాని అంటే సరి.
  మీ రెండవ పూరణ చక్కగా ఉంది.

  మిస్సన్న గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  "ఉదధి మధింపుకు" అని కాక "ఉదధి మథనమున" అంటే ఎలా ఉంటుంది?

  రవి గారూ,
  చక్కని పూరణ నందించారు. అభినందనలు.
  మొదటి పాదంలో "వ్రేల్చి" అన్నచోట గణదోషం ఉంది. "వ్రేల్చియు" అంటే సరి. బహుశా టైపాటేమో?

  రిప్లయితొలగించండి
 30. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ మూడు పద్యాలూ బాగున్నాయి. ఆత్మన్యూనతా భావం అక్కరలేదు. అభినందనలు.

  రాజేశ్వరి నేదునూరి గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  మంద పీతాంబర్ గారు చేసిన పొరపాటే మీరూ చేసారు. ముఖం, వదనం ఒకటే కదా!
  మునుముందుగా కవి మిత్రులకు, నాకు సంక్రాంతి శుభాకామ్కలు తెలిపినందుకు ధన్యవాదాలు. మీకు కూడ సంక్రాంతి శుభాకామ్కలు.
  అజ్ఞాత గారూ,
  ధన్యవాదాలు. నా పరిధికి "బ్లాగు" చాలు. వెబ్ సైట్ అవసరం నాకంతగా కనిపించడం లేదు. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 31. మూడు రోజులుగా "వసంత" సమీరం వీచడం లేదు. కారణ మేమై ఉంటుంది?
  వసంత్ కిశోర్ గారూ, ఎక్కడున్నారు?

  రిప్లయితొలగించండి
 32. గురువుగారూ మీ సూచన చాల బాగుంది. నాకలా ఎందుకు తట్టలేదో. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 33. కనుగొనుట పెద్ద నిచ్చెన
  కొనుటయు టేపులును స్కేళ్ళు కోలాహలమై
  ఎనుబది యడుగుల పొడవగు
  వినాయకా! నిన్నుఁ గొలువ విఘ్నము లెసఁగెన్

  కొలుచు = కొలతవేయు

  రిప్లయితొలగించండి
 34. ప్రభాకర శాస్త్రి గారూ,
  పోటీ పడి పెద్ద విగ్రహాలు పెట్టినపుడు వాటిని కొలవడంలో విఘ్నాలు తప్పవు మరి! మంచి పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 35. చనుచును ప్రతిమను ముంచగ
  జనముల సమ్మర్దనమున జారితి నకటా!
  కనుమా! నా కాలు విరిగె!
  వినాయకా! నిన్నుఁ గొలువ విఘ్నము లెసఁగెన్!

  రిప్లయితొలగించండి