ఈ దేవు డెవరు?
కం.కీరము, శిఖి, తురక నమ
స్కారము, నాలుక, రవి, చడకము - త్ర్యక్షరముల్
జేరి ద్వితీయాక్షరముల
నారసి గనఁ దెలియు దైవ మతఁ డెవఁ డయ్యా?
(చడకము = అశనికి పర్యాయ పదం)
ఆ దేవుఁడు ఎవరో చెప్పండి.
ముఖ్య గమనిక -
దయచేసి మీ సమాధానాలను నాకు మెయిల్ చెయ్యండి. వ్యాఖ్యగా పెడితే మిగిలిన వారికి ఉత్సాహం లేకుండా పోతున్నది. మాడరేషన్ పెడితే సమస్యాపూరణలో పరస్పర చర్చలకు అవకాశం లేకుండా పోతున్నది. కనుక మీ సమాధానాన్ని, వ్యాఖ్యను, సందేహాన్ని క్రింది అడ్రసుకు మెయిల్ చెయ్యండి.
shankarkandi@gmail.com
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండికోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
మీ సమాధానం 100% సరిపోయింది. అభినందనలు.
వ్యాఖ్యను పోస్ట్ చేయకుండా నా మెయిల్ కు పంపినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమీకు.. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు , శ్రేయోభిలాషులకు.. సంక్రాతి పండుగ శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిశివ చెరువు గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. మీకు కూడ సంక్రాంతి శుభాకాంక్షలు.
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. మీరు 100% కరెక్ట్.
మంద పీతాంబర్ గారూ,
మీరు 80% కరెక్ట్. మిగతా 20% కోసం ప్రయత్నించండి.
గురువు గారికీ, శంకరాభరణం సాహితీ మిత్రులందరికీ 'సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు'
రిప్లయితొలగించండి- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
సమాధానం -
రిప్లయితొలగించండికీరము - శుకము
శిఖి- నెమలి
తురక నమస్కారము- సలాము
నాలుక- రసజ్ఞ/రసన
రవి- ఇనుడు/భానుడు
చడకము- పిడుగు
రెండవ అక్షరాలను చదివితే ....
ఆ దేవుని పేరు - కమలాసనుడు.
సమాధానం పంపిన వారు -
రిప్లయితొలగించండిగన్నవరపు నరసింహ మూర్తి గారు
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు
వసంత్ కిశోర్ గారు
మంద పీతాంబర్ గారు
అందరికీ అభినందనలు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు.