17, జనవరి 2011, సోమవారం

సమస్యా పూరణం - 200 (కొంగ కైదు కాళ్ళు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కొంగ కైదు కాళ్ళు కోడికి వలె.

17 కామెంట్‌లు:

  1. గురువు గారికి 200 లు పూరణలు చేసి నందుకు ముందుగా అభినందనలు ఇంకా ఇంకా ఇలాగే వందల వందల వేల వేల పూరణలు మా అందరితొ వ్రాయించాలని ఆశీర్వ దిస్తూ ఆశిస్తూ మీ అందరి అభిమాని రజేశ్వరి [ అక్క ]

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు.

    01)
    __________________________________________

    అన్న , చేయు మన్న - కన్నను మిన్నగా
    జేసె , దురిత దుష్ట - శాసనుండు
    కొలువు నందు, కృష్ణ - వలువ లూడ్చెడు వేళ
    కొంగ కైదు కాళ్ళు - కోడికి వలె !
    __________________________________________

    రిప్లయితొలగించండి
  3. "కొంగ కైదు కాళ్ళు కోడికి వలె"నుండు
    ననెడు దొంగలెపుడునవని చేటు !
    చార్మినారు నమ్మె కూర్మి మాటల జెప్పి
    భరణి గారు హాస్య బ్రహ్మ మునకు !

    (ఒక సినిమాలో పల్లె నుండి వచ్చిన అమాయక బ్రహ్మానందం ను మాటల్లో పెట్టి ,నమ్మించి మోసగించిన తనికెళ్ళ భరణి గారి
    హాస్య సన్నివేశం దృష్టిలో పెట్టుకొని పూరించాను .సినిమా పేరు గుర్తుకు రావడము లేదు)

    రిప్లయితొలగించండి
  4. కొంటె జపము బూన నొంటి పాద మగును
    కొంగ కైదు కాళ్ళు ;కోడికి వలె
    మింట నెగుర లేమి వంట యింటికి పోదు
    కంట నీరు బెట్ట, పంట గలుగు !!

    రిప్లయితొలగించండి
  5. గురువుగారికి రెండు వందల సమస్యా పూరణల సందర్భమున హృదయ పూర్వక అభినందనలు, కృతజ్ఞతలు.

    వసంత కిశోర్ గారూ దుశ్సాసనుడిని కొక్కెర చేసారు. మీ పూరణ చాలా అందంగా ఉంది. నా ముందుపూరణలో కోమలముని ( నీరు )మీరు బాగానే పట్టారు. కట్టినది మాత్రము ( వైద్యుడిని అయినా ) నేనే కదా ! మన భ్రమ గాని గంగమ్మ విజృంభిస్తే ఎవరు పట్ట గలరు ?

    రిప్లయితొలగించండి
  6. కాలు ముడిచి పట్టి కాసారమున నిల్చు
    కొంగ కానుపించె కుంటివోలె
    కుక్క వెంటపడగ కొంగ పరుగులెత్తె
    కొంగ కైదు కాళ్ళు కోడికి వలె.

    రిప్లయితొలగించండి
  7. పీతాంబర్ గారూ మీ పూరణ భేషుగ్గా ఉంది. సినిమాల సంగతి నాకు తెలియదు. వసంత కిశోర్ గారైతే చెప్పేస్తారు. అన్నగారి సినిమాల మీద శతకము వ్రాసేసారు. హరి గారూ మా కొంగని పరుగులు పెట్టించారు. చాలా బాగుంది మీ పూరణ.

    రిప్లయితొలగించండి
  8. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంసోమవారం, జనవరి 17, 2011 3:52:00 PM

    గురువు గారూ,
    సమస్యాపూరణం 'డబుల్ సెంచురీ' కి శుభాభినందనలు.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  9. అందరి పూరణలూ బాగున్నవి.

    మూర్తిగారూ మీరే సరి.
    మన భ్రమ గాని గంగమ్మ విజృంభిస్తే ఎవరు పట్ట గలరు !

    02)
    ________________________________________

    మతము ,కులము ,లంచ - మధికార ,గర్వముల్
    కలుగు వాడె మంత్రి - కాగలండు !
    అతని బాట నడచు - నధికార్లు యనుచర్లు !
    కొంగ కైదు కాళ్ళు కోడికి వలె.
    ________________________________________

    రిప్లయితొలగించండి
  10. దొంగ నక్క విందు తలియెడు పాయసము
    కొంగ ముక్కు కేమొ కొరత పడగ.
    భంగ బడిన కొంగ పగబట్టె వఱదుపై
    కొంగ కైదు కాళ్ళు కోడికి వలె !

    వఱదు = నక్క .తలియ = పళ్ళెము

    రిప్లయితొలగించండి
  11. రెక్కలుండు రెండు, ముక్కొక్కటి కలదు
    అరయ దొంగ బుద్ది, ఆయువులవి
    కొంగ కైదు, కాళ్ళు కోడికి వలె రెండు,
    తాపసి వలెనుండు, చేప బువ్వ!!

    రిప్లయితొలగించండి
  12. జిగురు సత్యనారాయణగారూ! మీ పూరణ బాగుంది. కాని లెక్క తప్పినట్టున్నారు. రెక్కలు రెండు + ముక్కు ఒక్కటి + దొంగ బుద్ది మొత్తం నాలుగే అవుతాయి కదండి :)

    రిప్లయితొలగించండి
  13. రాజేశ్వరి గారూ,
    ధన్యవాదాలు.
    మీ పూరణతో చిన్ననాటి కథను గుర్తుకు తెచ్చారు. బాగుంది.
    "పాయసము" అంటే గణదోషం వస్తుంది. "పాసెము" అంటే చాలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

    పీతాంబర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    "హాస్యబ్రహ్మ" అన్నప్పుడు "స్య" గురువవుతుంది కదా!
    "భరణి నవ్వు లొలుకు బ్రహ్మమునకు" అంటే ఎలా ఉంటుంది?

    నరసింహ మూర్తి గారూ,
    ధన్యవాదాలు.
    పద్యం బాగుంది. పూరణ అర్థం కాలేదు.

    హరి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
    ధన్యవాదాలు.

    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ అత్యుత్తమం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. వసంత్ కిశోర్ గారూ,
    లెక్క తప్పలేదు. అవి పంచప్రాణాలు.

    రిప్లయితొలగించండి
  15. శంకరార్యా !
    మీ సమాధానం
    కోడిహళ్ళి మురళీ మోహన్
    గారికి చెందుతుంది.

    రిప్లయితొలగించండి
  16. జి యస్ జీ ! మీ పూరణ అద్భుతం


    సమస్యను చిన్నాభిన్నం చేసేసారు.

    లేవు గాని, ఉంటే మీకు రెండు వీరతాళ్ళు.
    (మొత్తం మీకు మూడు బాకీ)
    (ఈ మధ్య గురువుగారి దగ్గర వీరతాళ్ళు
    సంపాదించ లేక పోతున్నాను.ఇంకా ఘట్టిగా ప్రయత్నిస్తాను)

    రిప్లయితొలగించండి
  17. పొడుగు వాడు కొంగ, పొట్టివాడే కోడి;
    ఐదు గ్రుడ్లు, కోడి నారగించ,
    పంచు కొనిరి యిట్లు - వలెనుగ గ్రుడ్లవి
    కొంగ కైదు; కాళ్ళు కోడికి వలె !

    రిప్లయితొలగించండి