25, జనవరి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 207 (తల లైదు కరంబు లారు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
తల లైదు కరంబు లారు తను వది యొకటే!

35 కామెంట్‌లు:

 1. కలలో చూచిన బొమ్మను
  పలుకుల వర్ణిమ్ చ లేక పటమున గీసెన్
  నలిబుడతడొకడు కంటే !
  తల లైదు కరంబు లారు తను వది యొకటే!

  రిప్లయితొలగించండి
 2. ఎర్రాప్రగడ రామమూర్తి గారూ,
  'శంకరాభరణం' కు స్వాగతం.
  మీ కల (పూరణ) బాగుంది.
  మీ ఈనాడు జర్నలిజం స్కూల్ (మీ పేరు లింక్ నొక్కితే ఆ వెబ్ సైటు ఓపెన్ అయ్యింది) లో ఆన్ లైన్ కోర్సులు ఉంటాయా?
  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  రిప్లయితొలగించండి
 3. కలి కాలము పలు వింతలు
  కలిగెనుమన కళ్ళ ముందె,కనెమృత శిశువున్
  తొలి కాన్పున తరుణీ మణి
  తల లైదు కరంబులారు తనువది యొకటే!

  రిప్లయితొలగించండి
 4. శిలలోన విశ్వ రూపము
  మలచెద నేనంచు బూని మాసము గడిచెన్
  ఉలిసాగదించుక మిగిలె
  తల లైదు కరంబు లారు తను వది యొకటే!

  రిప్లయితొలగించండి
 5. తెలతెల వాఱున లేచును
  యలపెఱుఁగకఁ వేయి పనులనన్నిఁటిఁ జేయున్
  కులసతి తీరును కనగా
  తలలైదు కరంబులారు తనువది యొకటే

  రిప్లయితొలగించండి
 6. గురువు గారూ 'సమస్యా పూరణ-206(మత్తెక్కిన)' బొక్కసం లో కనపడ్డం లేదు.

  రిప్లయితొలగించండి
 7. శ్రీ శంకరయ్య గారికి నమస్కారం .నేను ఈ బ్లాగులో 21 -09 -2010 న ప్రవేశించి నా తొలి పూరణను చేసాను నేటి నుండి నేటి వరకు క్రమం దప్పకుండా ,ఉరిలో లేనప్పుడు ,సిస్టం పనిచేయనప్పుడు మినహాయించి ప్రతి దినము పూరణలు చేసాను యిది నా నూఱవ పూరణ.ఎన్నో వైవిధ్య భరిత మైన సమస్యలను నా పరిమితుల మేరకు పూరించప్రయత్నం చేసాను ఈ నా ప్రయత్నం లొ పూరణలలో దొర్లిన తప్పులను ఓపికతో సవరించి ,బావున్నా, లేకపోయినా బాగున్నవనే చెప్పి ప్రోత్సహించిన మీకు కృతఙ్ఞతలు చెప్పుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నాను నేను ఈ బ్లాగు లోకి రాకపోయి ఉంటే ఒక్క సమస్యను గూడా పురించాననే తృప్తి ఉండక పోయేది .ఎంతోమంది కవులు ,పండితులు సహృదయులు మిత్రులుగా లభించడం నా పూర్వ జన్మ సుకృతం ఇంత వరకు నన్ను భరించిన మిత్రులకు ,వీక్షకులకు కృతజ్ఞతా పూర్వక ధన్య వాదములు తెలుపు కొంటున్నాను.

  రిప్లయితొలగించండి
 8. ఎఱ్ఱాప్రగడ రామ్మూర్తి గారూ,
  స్వాగతం. మొదటి పూరణతోనే నా అభిమాను లయ్యారు. మీ పూరణ బాగుంది. అభినందనలు.

  ఎఱ్ఱాప్రగడ వారికి పంత్రిప్రగడ వారు స్వాగతం పలికారు. సంతోషం!

  మంద పీతాంబర్ గారూ,
  అప్పుడప్పుడు వింత శిశువుల జననం గురించి వింటూ ఉంటాము. దానిని విషయంగా చేసికొని పూరించిన విధానం బాగుంది. అభినందనలు.

  ఫణిప్రసన్న కుమార్ గారూ,
  "వన్స్ ఇన్ ఎ బ్లూమూన్" అన్నట్టు ఎప్పుడో ఒకసారి కనిపించి చక్కని పూరణలతో అలరిస్తున్నారు. ధన్యవాదాలు.

  రవి గారూ,
  నిజమే! గృహ నిర్వహణలో ఐదు తలలతో ఆలోచిస్తూ, ఆరు చేతులతో పనిచేసే గృహిణిని గురించి మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  మిస్సన్న గారూ,
  అది ఎక్కడికీ పోలేదు. ఉంది కదా! అసలు "బొక్కసం" శబ్దాన్ని ఏ అర్థంలో రాసారు?

  మంద పీతాంబర్ గారూ,
  అభినందనలు. ఇవన్నీ మీ "సరదాకి చిరు కవిత" బ్లాగులో పెడుతున్నారు కదా! సంతోషం. "శతాయుష్మాన్ భవ!"

  రిప్లయితొలగించండి
 9. గురువుగారూ బ్లాగులో కుడి వైపున విషయ సూచిక లాంటిది, దానిలో మొదట నాగురించి, తర్వాత అతిథులు, తర్వాత లేబుళ్ళూ, ఆ లేబుళ్ళలో సమస్యాపూరణం (221) ఉన్నాయి కదా. ఆ సమస్యాపూరణం (221) ను తెరిస్తే ఇప్పటి వఱకూ అయిన సమస్యలు వరసగా ఉంటాయి గదా. ఆ వరుసలో మొదట సమస్యా పూరణం - 207 (తల లైదు కరంబు లారు) , తర్వాత ఉత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో, ఆ తర్వాత సమస్యా పూరణం - 205 (సాఫ్టువేరు మగని) లు కనిపిస్తున్నాయి. మరి సమస్యా పూరణం - 206 (మత్తెక్కిన భద్రగజము) యేమైనట్లు? అదీ నా బాధ

  రిప్లయితొలగించండి
 10. అల చందమామ కథలో
  కులసతియగు రాకుమారి గొనిపోయె గదా !
  బలికయి , మాంత్రికుడతనికి
  తల లైదు కరంబు లారు తను వది యొకటే !

  రిప్లయితొలగించండి
 11. మిస్సన్న గారూ,
  ఆ రోజు పోస్ట్ చేసే సమయంలో ఆ సమస్యకు సంబంధించిన "లేబుల్"ను ఎంటర్ చేయలేదు. అందువల్ల అది కనిపించలేదు. ఇప్పుడు చేర్చాను. కనిపిస్తుంది చూడండి.

  రిప్లయితొలగించండి
 12. తలలే పంచేంద్రియములు
  అల మనసే తనువు, కరములరిషడ్వర్గాల్
  కలగలిసిన తత్త్వమ్మిది
  తలలైదు కరంబు లారు తనువది యొకటే!

  రిప్లయితొలగించండి
 13. డా. విష్ణు నందన్ గారూ,
  ధన్యవాదాలు. మంచి పూరణ నందించారు. మీరు నా బ్లాగు మీద శీతకన్నేసినట్టున్నారు. మీ పూరణలు ఔత్సాహిక కవిమిత్రులకు మార్గదర్శకాలు కదా!

  రిప్లయితొలగించండి
 14. సనత్ శ్రీపతి గారూ,
  వాహ్! అద్భుతమైన పూరణ. ధన్యోస్మి. ఇంత చక్కని పూరణ పంపిన మిమ్మల్ని అభినందించడానికి నాకు మాటలు కరువయ్యాయి.

  రిప్లయితొలగించండి
 15. తలలైదు వేద మాతకు
  అల షడ్భుజికిని కరంబు లారు ధరిత్రిన్
  వలపుల తడిసిన జంటకు
  తలపులలో నెంచి చూడ తనువది యొకటే!

  రిప్లయితొలగించండి
 16. కలగంటిని నిశరాతిరి
  పలలము తింటున్న మనుజు బెబ్బులి రీతిన్ !
  కలనిజము గాక పోవునె ?
  తలలైదు కరంబు లారు తనువది యొకటే !

  రిప్లయితొలగించండి
 17. మిస్సన్న గారూ,
  ఉదాత్తమైన పూరణ. చాలా బాగుంది. అభినందనలు.

  రాజేశ్వరి నేదునూరి గారూ,
  మంచి కలే కన్నారు. అయితే రెండవ పాదంలో యతి తప్పింది. బెబ్బులిని చూసిన తొట్రుపాటా? "పలలము తినుచున్న మనుజు వ్యాఘ్రము రీతిన్" అంటే సరి! మీ ప్రయత్నానికి అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. నమస్కారములు గురువు గారు !" ప " కి " బ,బె, " యతి సరిపోతుందనుకున్నాను [ అదన్న మాట సంగతి ] ఐతె ఇంతకి పూరణ ఫర్వాలేదన్న మాట." ధన్య వాదములు "

  రిప్లయితొలగించండి
 19. ఖలుడతడు రావణుడు పది
  తలలను యిరువది కరములు దాల్చె రణమునన్
  కలహము నడుమ మిగిలెనిక
  తల లైదు కరంబు లారు తను వది యొకటే!

  రిప్లయితొలగించండి
 20. అందరికీ నమస్కారములు.
  అందరి పూరణలు భలే ఉన్నాయి - 'సమస్యాపూరణలు - మేటి 10' ఎంపిక చేస్తే ఈ 207వది తప్పక ఉంటుంది-

  రిప్లయితొలగించండి
 21. ఇలనష్టా వకృండట
  తలలైదు కరంబులారు తనువది యొకటే!
  తెలుపగ వైద్యులు వివరము
  తలచితి నది జన్యులోప దైహికమనుచున్

  రిప్లయితొలగించండి
 22. స్విస్సు కోశాగారములలో 1.7 ట్రిలియను డాలర్ల దొంగ ధనమట !

  మలినమని మదికిఁ దోచదొ
  కిలకిల యని జనులు నవ్వ కేళియ గ్రోలన్
  సులభతర చోర వృత్తికి
  తల లైదు కరంబు లారు తను వది యొకటే !

  రిప్లయితొలగించండి
 23. జిగురు సత్యనారాయణ గారికి,
  రావణుడిని విషయంగా తీసుకొని చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  నిజానికి నేను మొదట అనుకున్న సమస్య అదే.
  "తల లైదు కరంబు లారు దశకంఠునికిన్" కాని తీరా పోస్ట్ చేసే సమయంలో "తనువది యొకటే" అని మార్చారు. నా మనసులోని భావాన్ని పసిగట్టారు. సంతోషం!

  ఊకదంపుడు గారూ,
  ధన్యవాదాలు. మీరు నా బ్లాగును తరచుగా చూస్తున్నారని తెలిసింది మీ వ్యాఖ్య వల్ల. సంతోషం!

  హరి గారూ,
  పూరణ కడు చక్కగా ఉంది. అభినందనలు.

  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  నిజమే కదా! చోరవృత్తికి ఐదు తలలతో ఆలోచించి, ఆరు చేతుల నుపయోగించాలి. రవి గారు గృహిణిని ఆశ్రయిసే మీరు చోరులను ఆశ్రయించారు. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. శంకరయ్యగారూ, మూర్తిగారూ !! పూరణ నచ్చినందుకు, అభినందించినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 25. అందరికీ వందనములు.
  అందరి పూరణలూ
  అద్భుతముగా
  అలరించు చున్నవి.

  ________________________________________

  నాలుగు రోజుల నుండి ఫోన్ పనిచెయ్యడం లేదు.
  నెట్ రావడం లేదు .అందుకే ఆలస్యం.
  మధ్యలో ఒకరోజు నెట్ సెంటర్ కి
  వెళ్ళా గాని అక్కడ చికాగ్గా అనిపించి
  మళ్ళీ వెళ్ళ లేక పోయాను.
  _________________________________________

  01)
  _________________________________________

  తలలు పది చేతు లిరవై
  గలిగిన దశకంఠు బొమ్మ! - కాలికి తగిలెన్ !
  నలిగినవి పోగ , మిగిలెను
  తల లైదు కరంబు లారు - తనువది యొకటే !_________________________________________

  రిప్లయితొలగించండి
 26. విద్యాసాగర్ అందవోలుశనివారం, జనవరి 29, 2011 6:24:00 AM

  ఈ నెల 25 వ తారీఖున ఇచ్చిన సమస్య కి పూరణ ఈ రోజు పంపుతున్నాను,
  వసంత కిషోర్ గారు పంపిన తేదీ చూసి, ఫరవాలేదని పంపుతున్నాను,
  మాకైతే ఇవాళ ఇంకా 28 వ తారీకే గానీ, చాలా మందికి 29 వచ్చేసింది,
  అంటే నాలుగు రోజుల జాప్యం అనమాట. క్షంతవ్యుడను.

  కలయందు చూచె నొక్కడు
  తలలైదు కరంబులారు తనువది యొకటే
  ఇల యందటులుండిన మరి
  కలుగదె ఎవ్వారికైన కంపరమకటా!

  రిప్లయితొలగించండి
 27. విద్యాసాగర్ గారూ,
  ఆలస్యమైనా మంచి పూరణ పంపారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. పలుమార్లు జూసితి జడిసి
  కలలో కనిపించు రీతి కలవరముగ నా
  కలకత్త కాళి! మెడలో
  తల లైదు; కరంబు లారు; తనువది యొకటే!

  రిప్లయితొలగించండి
 29. Hydra-headed Monster:

  కలహమ్ములు పంచి చనుచు
  పలువురకున్ పాట్లు దెచ్చు పాపాత్మునకున్
  పలు రీతుల నెంచగలము:
  తల లైదు కరంబు లారు తను వది యొకటే!

  రిప్లయితొలగించండి